భద్రకాళి ఆలయంలో ధర్మకర్తల పెత్తనం..? భక్తులకు ఇబ్బందులు…

భద్రకాళి ఆలయంలో ధర్మకర్తల పెత్తనం..? భక్తులకు ఇబ్బందులు

 

 

గుడిలో సేవలకా..? పెత్తనానికా..? భద్రకాళి ఆలయంలో విమర్శలు.

సామాన్య భక్తుల ఇబ్బందులు. భద్రకాళి ఆలయంలో ప్రత్యేక దర్శనాల రాజకీయాలు.

గుడి దేవుడిది.. దర్శనం మాత్రం పరిచయాలదా..?

సేవ చేయాల్సిన ధర్మకర్తలు.. పెత్తనం ఎందుకు..?

గంటల క్యూలో భక్తులు.. నిమిషాల్లో దర్శనం పరిచయస్తులకు..!

 

భక్తుల విశ్వాసానికి ఆలయం.. అధికార ప్రదర్శనకు కాదు.

ప్రత్యేక దర్శనాలు భక్తులకా..? లేక పరిచయాల రాజకీయాలకా..?

ధర్మకర్తలు సేవకులా..? లేక గుడి యజమానులా..?

వరంగల్, నేటిధాత్రి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రకాళి ఆలయంలో ధర్మకర్తల జోక్యం రోజురోజుకు మితిమీరుతున్నదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడిలో ఉద్యోగులు ఉన్నప్పటికీ, ధర్మకర్తల హడావుడి ఎక్కువై సాధారణ భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గుడిలో సేవలు చేయాల్సిన బాధ్యత ఉన్న ధర్మకర్తలు తమ విధులు పక్కన పెట్టి పెత్తనం చెలాయిస్తున్నారని, తమకు తెలిసిన వ్యక్తులను ప్రత్యేక దర్శనానికి పంపిస్తూ సామాన్య భక్తులను పక్కన పెట్టుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని వల్ల గంటల తరబడి క్యూలో నిలబడే భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చిన్న పిల్లలు, పసిపిల్లలతో వచ్చిన మహిళలకు కూడా నేరుగా దర్శనం కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారని మహిళా భక్తులు వాపోతున్నారు. మరోవైపు రూ.100 టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్లిన ఒక ఎన్‌ఆర్‌ఐ మహిళకు కేవలం ఒక్క క్షణం కూడా నిలబడనివ్వకుండా నెట్టివేయడంతో ఆమె గుడి సూపరింటెండెంట్‌తో వాగ్వాదానికి దిగిన ఘటన ఆలయంలో చర్చనీయాంశంగా మారింది. అనంతరం ఆమెను మళ్లీ దర్శనానికి పంపించినట్లు సమాచారం.

అలాగే ఆలయంలోని ఒక ధర్మకర్త గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు బోనగాని యాదగిరి గౌడ్‌తో అమర్యాదగా మాట్లాడిన ఘటన పెద్ద గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

“గుడిలో ఉద్యోగులు, అయ్యగారు, ధర్మకర్తలు అందరూ తమకు తెలిసిన వారినే ముందుగా తీసుకెళ్తున్నారు. సామాన్య భక్తుల పరిస్థితి ఎవరూ పట్టించుకోవడం లేదు” అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఉద్యోగులు జర్నలిస్టులకు కూడా దర్శనం అవకాశం కల్పించకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన భద్రకాళి ఆలయంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ధర్మకర్తల హడావుడికి చెక్ పెట్టి, సామాన్య భక్తులకు సౌకర్యంగా దర్శనం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

ధర్మకర్తలా..? లేక గుడి యజమానులా..?

భక్తుల సేవ కోసం నియమించిన ధర్మకర్తలు కొన్నిసార్లు గుడి యజమానుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ పరిపాలనను పర్యవేక్షించి భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, కొందరు ధర్మకర్తలు తమ పరిచయస్తులను ప్రత్యేక దర్శనాలకు పంపిస్తూ సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

గంటల తరబడి క్యూలో నిలబడే భక్తులు ఇబ్బంది పడుతుంటే, పరిచయాల ఆధారంగా కొందరికి వెంటనే దర్శనం కల్పించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ధర్మకర్తల పని సేవ చేయడం గానీ, పెత్తనం చెలాయించడం కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

ఆలయాలు భక్తుల విశ్వాసానికి ప్రతీకలు. అలాంటి పవిత్ర స్థలాల్లో అధికార ప్రదర్శనలు కాకుండా, భక్తులకు గౌరవంగా దర్శనం కల్పించే విధంగా వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు.

ధర్మకర్తలు అసలు ఏం చేయాలి..? ఏం చేయకూడదు..?

చేయాల్సినవి….

ఆలయ పరిపాలన సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలి.
భక్తులకు సౌకర్యంగా, గౌరవంగా దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆలయ ఆస్తులు, హుండీ ఆదాయం, విరాళాల నిర్వహణ పారదర్శకంగా ఉండేలా చూడాలి. పూజలు, సేవలు ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయా అని పర్యవేక్షించాలి. గుడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బందికి మార్గనిర్దేశం చేయాలి. ఆలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన సదుపాయాలపై దృష్టి పెట్టాలి.

చేయకూడనివి…..

గుడిలో పెత్తనం చెలాయించడం. తమకు తెలిసిన వ్యక్తులకు మాత్రమే ప్రత్యేక దర్శనాలు కల్పించడం. సామాన్య భక్తులను క్యూలైన్‌లో ఇబ్బంది పెట్టడం. ఆలయ సిబ్బంది పనుల్లో అనవసర జోక్యం చేసుకోవడం. గుడి ప్రాంగణంలో గొడవలు, వాగ్వాదాలకు కారణం కావడం. భక్తులను అవమానించేలా మాట్లాడడం లేదా ప్రవర్తించడం.

ముఖ్యంగా:….
ధర్మకర్తలు గుడిలో అధికారం చూపేందుకు కాదు, భక్తులకు సేవ చేయడానికి ఉంటారు. ధర్మకర్తల వ్యవహారం వల్ల భక్తులు ఇబ్బంది పడితే అది ఆలయ ప్రతిష్ఠకే మచ్చగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వివిధ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే…

వివిధ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

“జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్యను కలిసిన శాసనసభ్యుడు కొణింటి మాణిక్ రావు గురువారం ఒక వినతి లేఖను సమర్పించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను లబ్ధిదారులకు అప్పగించాలని ఆయన కోరారు. కొత్త సిసి రోడ్లు, డ్రెయిన్లు మరియు వాటి మరమ్మతులు. రాబోయే వేసవి కాలంలో తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులను అప్రమత్తం చేయాలని ఆయన కోరారు. మిషన్ భగీరథ పనుల మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఉపాధ్యాయుడు రవీందర్ కి ధర్మనిధి రాష్ట్ర స్థాయి పురస్కారం…

ఉపాధ్యాయుడు రవీందర్ కి ధర్మనిధి రాష్ట్ర స్థాయి పురస్కారం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మండలంలోని ఇందారం ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న గోపగాని రవీందర్ కు డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య ధర్మనిధి రాష్ట్రస్థాయి పురస్కారం ను ప్రధానం చేయనున్నట్లు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్థులకు పాఠాలను బోధిస్తూనే సమాజ చైతన్యం కోసం గత మూడు దశాబ్దాలుగా సాహితీ రంగంలో విశేషమైన కృషి చేస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మకంగా అందించే ఈ పురస్కారానికి గాను రవీందర్ ను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.కవిగా,రచయితగా, విమర్శకుడిగా,కథకుడిగా సాహితీ సంస్థల నిర్వాహకుడుగా రవీందర్ కృషి చేస్తూనే ఐదు కవితా సంపుటాలను,మూడు వ్యాస సంకలనాలను ప్రచురించారని ఆయన తెలిపారు.తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఇతర సాహితీవేత్తల చేతుల మీదుగా మార్చి 17న ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బి.శ్రీనివాస్ తో పాటుగా సహచర ఉపాధ్యాయులు,జిల్లాలోని పలువురు కవులు,రచయితలు గోపగాని రవీందర్ కు అభినందనలు తెలిపారు.

సమాజ మార్పు కోసం విద్య కీలకం..

సమాజ మార్పు కోసం విద్య కీలకం

◆-: జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సమాజంలో మార్పు రావాలంటే విద్య ఎంతో కీలకమని జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తన జన్మదినం సందర్భంగా గురువారం జహీరాబాద్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ హైస్కూల్లో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదవాలని సూచించారు. సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో విద్య ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు.
తన జన్మదినాన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతి, రమాదేవి, రేణుక, పూజా తదితరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

పరీక్ష కేంద్రాల వద్ద అతిక్రమిస్తే చర్యలు తప్పవు…

పరీక్ష కేంద్రాల వద్ద అతిక్రమిస్తే చర్యలు తప్పవు

దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి

దుగ్గొండి,నేటిధాత్రి:

ఈనెల 14 నుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్న పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకానునట్లు ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి హెచ్చరించారు.
పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు ఉంటుందని అలాగే ఎగ్జామ్ సెంటర్ లకు సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లను తెరువకూడదని తెలిపారు.
పరీక్ష రాసే సమయంలో విద్యార్థులను మాస్ కాపీయింగ్ చేసేందుకు గాని ఎవరికైనా బయట వ్యక్తులు సపోర్ట్ చేయడానికి వస్తే, వారి వల్ల ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సినవస్తుందని పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిపిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై రావుల రణధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు…

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

ఈనెల 14 నుండి జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లోకిరాన్ని రానున్నదని
వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హన్మకొండ జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలు ,వరంగల్ జిల్లా 47, జనగామ జిల్లాలో 39 మొత్తం 150 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 14 శనివారం నుండి నుండి ఏప్రిల్ 16 నుండి 2026 వరకు ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని డీసీపీ తెలిపారు.పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఈస్ట్ డీసీపీ తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణ లో భాగంగా సెక్షన్ 163, (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదు.సభలు, సమావేశాలు, ర్యాలీ లు, ధర్నాలు నిషేధం.పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు 14 తేది నుండి ఏప్రిల్ 16 వరకు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు మూసివేయాలని డీసీపీ ఆదేశించారు. ఈ పరీక్షల సమయంలో ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని డీసీపీ అంకిత్ కుమార్ హెచ్చరించారు.

కెమెరా కంటిలో నేరం.. నేరస్తుడికి తప్పించుకునే దారి లేదు…

కెమెరా కంటిలో నేరం.. నేరస్తుడికి తప్పించుకునే దారి లేదు!

సీసీ కెమెరాల కంటికి నేరస్తులు చిక్కు.. 65 కేసులు చేదించిన పోలీసులు..

గ్రామాలపై కెమెరా కవచం.. నేరాలకు చెక్కు పెట్టే పోలీస్ వ్యూహం..

కెమెరా ఉన్నచోట నేరానికి భయం.. రామయంపేట సర్కిల్లో 900 సీసీ కెమెరాలు..

చూస్తున్న కెమెరా.. తగ్గుతున్న నేరాలు! పోలీసుల చేతిలో బలమైన ఆయుధం..

ఒకప్పుడు నేరం చేసి ఎవరు చూడలేదని నేరస్తులు ధైర్యంగా తప్పించుకునే రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ప్రతి వీధిలో ప్రతి కూడలిలో నిశ్శబ్దంగా గమనిస్తున్న సీసీ కెమెరా కంటికి నేరం దాచుకోవడం అసాధ్యంగా మారుతుంది. రామాయంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ఏర్పాటైన వందలాది కెమెరాలు నేరాలపై గట్టిగా వేస్తూ నేరస్తుల గుండెల్లో భయం నింపుతున్నాయి. ఈ కెమెరాల ఆధారంగా ఇప్పటికే పలు కేసులు వేగంగా ఛేదించడంతో ప్రజల్లో భద్రత భావం పెరుగుతుండగా గ్రామాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు సూచిస్తున్నారు.

రామాయంపేట మార్చి 13 నేటి ధాత్రి (మెదక్)

ఒకప్పుడు గ్రామంలో నేరం జరిగితే… “ఎవరు చేశారు?” అనే ప్రశ్నకు సమాధానం దొరకడానికి రోజులు, నెలలు పట్టేది.
బాధిత కుటుంబాలు న్యాయం కోసం తలుపులు తట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. నిశ్శబ్దంగా చూస్తున్న ఒక చిన్న కెమెరా… నేరాన్ని కూడా, నేరస్తుడినీ పట్టుకునే సాక్ష్యంగా నిలుస్తోంది.
రామాయంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో సీసీ కెమెరాలు ప్రజల భద్రతకు అండగా నిలుస్తున్నాయి. సర్కిల్ పరిధిలో ప్రస్తుతం దాదాపు 900 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని సీఐ వెంకటరాజా గౌడ్ తెలిపారు. ఈ కెమెరాల ఆధారంగా ఇప్పటికే సుమారు 65 కేసులను వేగంగా ఛేదించడం సాధ్యమైందని ఆయన వెల్లడించారు.
గతంలో జరిగిన కొన్ని హత్యలు, దొంగతనాలు, యాక్సిడెంట్లకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా సీసీ కెమెరాల ద్వారానే బయటపడ్డాయని పోలీసులు చెబుతున్నారు. ఎవరూ చూడలేదనుకున్న చోట కూడా ఒక కెమెరా మాత్రం నిశ్శబ్దంగా అన్నీ రికార్డ్ చేస్తోంది.

సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో నేరాలు తగ్గుతాయని పోలీసులు స్పష్టంగా చెబుతున్నారు. ఎందుకంటే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారు కూడా కెమెరా కంటిని చూసి వెనక్కి తగ్గే పరిస్థితి వస్తోంది. యాక్సిడెంట్ చేసి పారిపోవాలని భావించే వారు కూడా ఇప్పుడు కెమెరాల కారణంగా తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది.
గ్రామాల్లో ముఖ్యమైన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, దేవాలయాల పరిసరాలు వంటి చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత భద్రత కలుగుతుందని పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీఐ వెంకటరాజా గౌడ్ తెలిపారు.

సమాజం సురక్షితంగా ఉండాలంటే పోలీసులు మాత్రమే కాదు… ప్రజల సహకారం కూడా అవసరం. ప్రతి గ్రామంలో కెమెరాలు ఏర్పాటు అయితే… ప్రతి వీధి ఒక నిశ్శబ్ద సాక్షిగా మారుతుంది. అప్పుడు నేరం చేయాలనుకునే వారి గుండెల్లోనే భయం మొదలవుతుంది.
సమాజ భద్రత కోసం… కెమెరా కన్ను ఎప్పుడూ మేల్కొని ఉంటుంది.

దేశం మెచ్చే స్థాయిలో ఎదగాలి…

దేశం మెచ్చే స్థాయిలో ఎదగాలి

వనవాసీ నిర్వహణలో దాతల సహకారం మరువలేనిది

వనవాసీ గౌరవ సలహాదారు బివిఎస్ఎల్

నేటిదాత్రి చర్ల

 

 

 

విద్యార్దులను సంస్కారవంతమైన వారిగా తీర్చిదిద్దుతూ చదువుతో పాటు సంస్కృతి సంప్రదాయాలను అలవరుస్తున్నామని వనవాసీ కల్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం గౌరవ సలహాదారులు బివిఎస్ఎల్ నర్సింహారావు అన్నారు గుమ్మడి మదుసూదన్ రావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి శ్రీదేవి విద్యార్ది నిలయంకు పరుపులు స్టీల్ డ్రమ్ లను అందచేసారు ఈ సందర్భంగా నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అద్యక్షతన జరిగిన సమావేశంలో నర్సింహారావు ప్రసంగించారు నిరుపేద ఆదివాసీ విద్యార్దులను ఇక్కడ చేర్పించి వారికి వసతితో పాటు విద్యను అందచేసి భవిష్యత్ కు బంగారుబాట వేస్తున్నామని వెల్లడించారు వనవాసీ సంస్ద దాతల సహకారంతో నడుస్తుందని దాతల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు ఇందుకు నిలయ కమిటీ సభ్యులు చేస్తున్న కృషి అబినందనీయమని పేర్కొన్నారు వనవాసీ ప్రాంత మహిళా సహప్రముఖ్ పెద్దాడ ఆశాలత మాట్లాడుతూ గిరిజన వికాసం కొరకు దేశ వ్యాపితంగా సంస్ద విద్యార్ది నిలయాలతో పాటు గ్రామాలలో విద్యా కేంద్రాలను నిర్వహిస్తోందని వెల్లడించారు శ్రీదేవి మాట్లాడుతూ వనవాసీ సంస్దకు తనవంతు సహకారం అందచేస్తానని, విద్యార్దుల చదువులకు సహకరించడం సంతోషకరమని అన్నారు వనవాసీ జిల్లా సంఘటనా కార్యదర్శి కోరం సూర్యనారాయణ నిలయ కమిటీ అద్యక్షుడు తాటి పాపారావు ఉపాద్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్, సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, సభ్యులు శివరాజు కిషోర్, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి, సుధీర్ పాల్గొన్నారు.

జోరుగా సాగుతున్న న్యాల్కల్ ఎన్హెచ్-50 విస్తరణ పనులు…

జోరుగా సాగుతున్న న్యాల్కల్ ఎన్హెచ్-50 విస్తరణ పనులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల పరిధిలోని డప్పూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి-50 విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిజాంపేట్ నుంచి నారాయణఖేడ్ మీదుగా కర్ణాటకలోని బీదర్ వరకు వెళ్లే ఈ మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం సుమారు ₹512 కోట్ల వ్యయంతో 46 కిలోమీటర్ల మేర రెండు లేన్లుగా అభివృద్ధి చేస్తోంది. ఈ పనులు పూర్తయితే తెలంగాణ-కర్ణాటక మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. అధికారులు వాహనదారులను జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.

వంట గ్యాస్ కరువు,సిరిసిల్ల ప్రజలకు బరువు…

వంట గ్యాస్ కరువు,సిరిసిల్ల ప్రజలకు బరువు

ప్రజలకు అందని గ్యాస్ సరఫరా

గ్యాస్ కరువుతో కొన్ని చోట్ల పలు వ్యాపార సంస్థలు, హోటల్లు నిలిపివేత

వెయ్యిల్లో బ్లాక్ దందాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు

ఏజెన్సీలకు సరఫరా గ్యాస్ కంపెనీలు ఆలస్యం

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో వంట గ్యాస్ కొరత తీవ్రంగా నెలకొంది. పట్టణ కేంద్రంలోని పలు గ్యాస్ ఏజెన్సీలు సరఫరాను సక్రమంగా అందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్యాస్ సిలిండర్లు గోదాముల్లో ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకు అందకుండా సరఫరా నిలిపివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు వంట గ్యాస్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెలలో సిలిండర్ 925 /-రూపాయలు ఉండేది నేడు సుమారు 985/- గా ఉంటూ 60 రూపాయలు అదనపు గా ఈ నెలలో పెరిగిందని ఆరోపిస్తున్నారు. సమయంలో కొందరు ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లను ఇతర వ్యాపార సంస్థలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్లు బ్లాక్‌లో వెయ్యి రూపాయలకు పైగా విక్రయించబడుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే బ్లాక్ మార్కెట్ దందాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పలు రకాల ఏజెన్సీ అడగగా.. పై నుండి వచ్చే గ్యాస్ సరఫరా నాలుగు రోజులకు ఒకసారి లోడింగ్ వస్తుందని అంతే కాకుండా, ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఒకేసారి వంట గ్యాస్ బుకింగ్ చేసుకుంటూ ఎక్కువగా నిలువ ఉంచుకోవడం ద్వారా నిజంగా వంట గ్యాస్ లేని అటువంటి వారికి ఇబ్బంది కొరత ఏర్పడుతుందని తెలిపారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి…

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల పిఆర్సి పెండింగ్ డీలను చెల్లించేలా అసెంబ్లీలో లేవనెత్తాలని సంఘం నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి తెలిపారు.

సబ్ స్టేషన్ లో రికార్డులు పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు…

సబ్ స్టేషన్ లో రికార్డులు పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వల్ సబ్ స్టేషన్ ను సందర్శించి రికార్డులను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్న ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింత ప్రభాకర్ ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు 24గంటల పాటు విద్యుత్ ఇస్తున్నట్లు అసెంబ్లీ లో పేర్కొన్నారు, రైతులకు కేవలం 12గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని స్పష్టం చేశారు. ఆ విద్యుత్ సరఫరా లో సైతం పలుమార్లు ట్రిప్ అవుతోందని, లైన్ బ్రేకింగ్, ఎల్ సి ల పేరిట అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక రైతుల పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ సబ్ స్టేషన్ లాగ్ బుక్ లో సాయంత్రం 4గంటలకు త్రి ఫేస్ కరెంటు తీసేస్తే తెల్లారి 3గంటలకు ఇస్తున్నారని అయినా అధికారులు, ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ల మొత్తాన్ని తమ హయాంలో ఉన్న 4,900రూపాయలు ఉన్న డీడీ మొత్తాన్ని 9700రూపాయలకు పెంచారని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం లో వేలాది కొత్త విద్యుత్ కనెక్షన్ లు పెండింగ్ లో ఉన్నాయని స్టోర్ లలో మెటీరియల్ లేదని, కాలిన ట్రాన్స్ఫార్మర్ విషయం లో రైతులపై భారం మోపుతున్నారని, లోడ్ ఎక్కువ ఉన్న చోట్ల అదనపు డి టీ ఆర్ లు లేవని తెలిపారు. బ్యాంకు లను, ఆర్థిక సంస్థలను మోసం చేయడానికి కొత్త డిస్కమ్ ను ఏర్పాటు చేస్తున్నారాని, ఉన్న రెండు డిస్కమ్ లను 56వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి,సష్టాలపాలు చేసి కొత్త డిస్కమ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సమ్మె చేస్తున్న 19647 మంది ఆర్టిజాన్ లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ ల సమ్మెకు మద్దత్తు పలుకుతున్నామని, మృతి చెందిన ఆర్టిజన్ ల పిల్లల విద్యార్హతలకు తగ్గట్టు గా ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.

చియా విత్తనాల సాగులో విజయం సాధించిన జహీరాబాద్ రైతు…

చియా విత్తనాల సాగులో విజయం సాధించిన జహీరాబాద్ రైతు

◆-: రమేష్, కొత్త పంటలతో ఆదర్శంగా నిలుస్తున్నారు…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ : పట్టణానికి చెందిన ప్రగతిశీల రైతు, బిజెపి నాయకుడు రమేష్ రెడ్డి బసంతపూర్ వ్యవసాయంలో కొత్త పంటలను ప్రవేశపెట్టడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల, అతను తన పొలంలో చియా విత్తనం (సబ్జా) సాగు చేయడంలో విజయం సాధించాడు. తక్కువ ఖర్చుతో పండించగల ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, దీనివల్ల రైతులు మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహించడంలో రెడ్డి ఇప్పటికే గుర్తింపు పొందారు, అక్కడ చాలా మంది రైతులు అతని పద్ధతులను చూసి డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రారంభించి మంచి లాభాలను పొందారు. ఇప్పుడు, అతను మరొక కొత్త ప్రయోగంగా చియా విత్తనాలను విజయవంతంగా పండిస్తున్నాడు. చియా గింజలు ప్రస్తుతం ఆరోగ్యకరమైన ఆహారాలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాయి. చియా విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్ మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండటం వల్ల, వాటిని ఆరోగ్య ఆహారాలు మరియు పానీయాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఫలితంగా, ఈ విత్తనాలకు మార్కెట్‌లో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ సందర్భంలో, రైతులు సాంప్రదాయ పంటలతో పాటు మార్కెట్ డిమాండ్ ఉన్న కొత్త పంటలను పండించాలని రమేష్ రెడ్డి సూచిస్తున్నారు. తక్కువ నీటి వినియోగం అవసరమయ్యే చియా సాగు రైతులకు లాభదాయకంగా మారే అవకాశం ఉందని ఆయన గుర్తించారు. రమేష్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయోగాత్మక వ్యవసాయం స్థానిక రైతులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చియా పంట సాగు పద్ధతుల గురించి తెలుసుకోవడానికి చాలా మంది రైతులు ఇప్పటికే అతని పొలాన్ని సందర్శిస్తున్నారు.

 

 

కొత్త స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు. ఎస్ఐ సందర్శించారు.

కొత్త స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు. ఎస్ఐ సందర్శించారు.

◆-: ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సమాజంలో రోడ్డు భద్రతను పెంచే ప్రయత్నంలో భాగంగా, ప్రమాదాలను నివారించడానికి కెవి స్కూల్ జంక్షన్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల కృష్ణపూర్ రోడ్ ప్రాంతాలలో కొత్త స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఈ కొలత వాహనాల వేగాన్ని నియంత్రిస్తుంది మరియు పాదచారులు మరియు విద్యార్థుల భద్రతను మెరుగుపరుస్తుంది. కొత్త స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు. కెవి స్కూల్ జంక్షన్, కృష్ణపూర్ రోడ్. రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు భద్రతను పెంచడం. స్థానిక నివాసితులు మరియు వాహనదారుల భద్రతను పెంచడానికి ఈ నవీకరణ ఒక ముఖ్యమైన ఝరాసంగం. పోలీస్ స్టేషన్ ఎఫ్ఐ క్రాంతికుమార్ పటేల్ అన్నారు

ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న..

ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న

◆-: రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆-: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ :పట్టణంలోని 12 వార్డు(గడి)కి చెందిన రవి ఆహ్వానం మేరకు శుక్రవారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొన్నారు.వారికి ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుడు రవి ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలతో పాటు పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరుతుందని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,12వార్డు ఇంచార్జి ఇనాయత్,కౌన్సిలర్ అరుణ్ కుమార్,14వార్డు ఇంచార్జి రాజ్ కుమార్,నరేష్ బబ్లూ,నర్సింహా యాదవ్,మోహీన్,పవన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు ఇచ్చిన మాటతో ఓడిన ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తాను…

ప్రజలకు ఇచ్చిన మాటతో ఓడిన ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తాను

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వార్డు ఇంచార్జ్ పి. అరవింద్
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 19 వ వార్డులో పారిశుద్ధ్య లోపంతోని మురికి కాలువలు నిండుకుండ లాగా మారి అందులో విపరీతమైన దోమలు దుర్వాసనలు వెదజల్లుతూ ప్రజా ఆరోగ్యాలకు ఇబ్బంది కలుగుతుంటే అ అవార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అరవింద్ దృష్టికి ప్రజలు తీసుకెళ్లినారు ఇందుకు స్పందించిన అరవింద్ పురపాలక సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాడు పరిస్థితి వివరించడంతో వెంటనే స్పందించిన జహీరాబాద్ పరిపాలన సంఘం మున్సిపల్ కమిషనర్ జైతురాం నాయక్ సిబ్బందితో చెప్పి వార్డులో ఉన్న మురికి కాలువలు చెత్తకుప్పలు తొలగించి పిచ్చి త్వరలో మురికి కాలువలలో దోమల మందులను పిచికారి చేస్తామని అదేవిధంగా వీధి కుక్కలు పందులు లేకుండా చూస్తామని వాడి ఇంచార్జ్ అరవింద్ గారికి హామీ ఇచ్చారు ఇందుకు సంతోషించిన 19వ వార్డు ప్రజలు అరవింద్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసినారు ప్రజలతో మాట్లాడుతూ అరవింద్ నేనెప్పుడూ ఓడిన గెలిచిన ప్రజల మధ్యనే ఉంటాను మన వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తేవాలని నాతో అయినంత వరకు సమస్యలను పరిష్కరిస్తారని నాతో కానీ యెడల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కచ్చితంగా ప్రజా సమస్యలు తీరేలా చూస్తానని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రజా ప్రభుత్వమని తెలిపినారు,

మాజీ మంత్రి హరీష్ రావు ను ఖురాన్ తెలుగు అనువాద ప్రతిని అందజేసిన నాజిముద్దీన్ ఘోరీ…

మాజీ మంత్రి హరీష్ రావు ను ఖురాన్ తెలుగు అనువాద ప్రతిని అందజేసిన నాజిముద్దీన్ ఘోరీ,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ప్రాంతానికి చెందిన జమాతే ఇస్లామీ జిల్లా నాజిమ్, ముహమ్మద్ నాజిముద్దీన్ ఘోరీ,జహీరాబాద్‌లోని ‘ఘోరీ ప్యాలెస్’లో బి. ఆర్. ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి హరీష్ రావుకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు ఖురాన్ తెలుగు అనువాద ప్రతిని అందజేశారు. ఖురాన్ ప్రతిని స్వీకరిస్తూ హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు; దేశంలో ఇటువంటి ఇఫ్తార్ విందులు ఎంతో అవసరమని పేర్కొంటూ, ప్రపంచంలో శాంతి భద్రతలు నెలకొనేలా ముస్లిం ఉమ్మత్ (ముస్లిం సమాజం) ప్రార్థించాలని ఆకాంక్షించారు.

మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం…

మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

◆-: కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండున్నరేళ్ల పాలనలో మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని హరీశ్ రావు విమర్శించారు.

◆-: వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే (బి.ఆర్.ఎస్) మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

◆-: జహీరాబాద్‌లోని ఒక స్థానిక గౌరీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పార్టీ ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

◆-: తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల కోసం చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, ప్రస్తుత పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండున్నరేళ్ల పాలనలో మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం స్థానిక గౌరీ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన పార్టీ ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అన్ని కార్యక్రమాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని, మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన మైనారిటీ గురుకులాలు నేడు మంచి ఫలితాలను ఇస్తున్నప్పటికీ, ఉపాధ్యాయుల కొరత, భవన అద్దె

చెల్లించకపోవడం, ప్రాథమిక సౌకర్యాల కొరత కారణంగా విద్యార్థులు టీసీలు తీసుకొని అనేక మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టళ్లను వదిలి వెళ్తున్నారని, ఇది కాంగ్రెస్ పార్టీ పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు. జహీరాబాద్ పట్టణంలో మైనారిటీల కోసం స్మశాన వాటిక, మినీ హజ్ హౌస్, షాదీ ఖానా పనులను తమ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి ప్రారంభించినప్పటికీ, ఈ ప్రభుత్వం ఆ పనులను అకస్మాత్తుగా నిలిపివేసి, నిధులను ఇతర పథకాలకు మళ్లించడం ద్వారా మైనారిటీలను విస్మరిస్తుందని మరోసారి నిరూపించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్యరావు, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ శివకుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వై.నరోత్తం, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, నామా రవికిరణ్‌, ఇంటి గౌరి, జియాగౌరి, గోరేమియా సికందర్‌, యాకూబ్‌, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

“డిఎంఅండ్ హెచఓ” ల దారుణాలు? ఎపిసోడ్ 2

`మంత్రి గారు ఈ దుర్మార్గాలు చూడండి!

`ఆపరేషన్ ఆపేసి.. ఆసుపత్రి సీజ్ చేసి!?

`ఉమా గౌరీ కర్కషత్వం.. వైద్య వృత్తికే కళంకం?

`చావు బతుకుల్లో వున్న మహిళకు వైద్యం చేయకుండా అడ్డుకున్న “డిఏం అండ్ హెచఓ”?

`నేరేడు మేట్ లో వున్న స్రవంతి ఆసుపత్రిని సీజ్ చేశారు?

`కేవలం అగ్రిమెంట్ సమయం ముగిసిందనే చిన్న కారణం?

`ఎలాంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఆసుపత్రి సీజ్?

`ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్న ఉమా గౌరీ దారుణాలు?

`”నేటిధాత్రి” తో మొరపెట్టుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు

`ఉమా గౌరీ లాంటి డిఏం అండ్ హెచఓ లను చూడలేదంటున్నారు?

`ఒక మహిళా వైద్యురాలు గా వుండి ఆపరేషన్ మధ్యలో ఆసుపత్రి సీజ్ చేయడం దుర్మార్గం?

`ఆపరేషన్ పూర్తయ్యే వరకైనా ఆగమని అడిగినా ససేమేమిరా అని చెప్పిన ఉమాగౌరి?

`పెషేంట్ ను గాంధీ కి తరలిస్తా అని మొండికేసిన ఉమాగౌరి?

`నేరేడు మేట్ నుండి గాంధీ ఆసుపత్రి కి పెషేంట్ ను తరలిస్తమనడం అహంకారం కాదా?

`ఆ పెషేంట్ ప్రాణాలు పొతే బాధ్యత ఎవరు వహించే వారు?

`ఆపరేషన్ కు అయ్యే సమయం కూడా ఇవ్వకపోవడం పాపం కాదా?

`ఇంతలో ఏం కొంపలు మునిగిపోయేవి?

`వైద్యం గురించి నాకే చెబుతారా అంటూ ఉమా గౌరీ?

`మహిళ ప్రాణం కన్నా తన పంతమే నెగ్గించుకున్న ఉమా గౌరీ?

`పెషేంట్ భర్త కాళ్ళ మీద పడ్డా కనికరించని ఉమా గౌరీ?

`ఆపరేషన్ టేబుల్ మీద వున్న పెషేంట్ ను ఆసుపత్రి బైటకు తీసుకొచ్చిన ఉమా గౌరీ?

`మహిళా దినోత్సవం కార్యక్రమం వదిలేసి ఆసుపత్రి సీజ్ చేసిన ఉమా గౌరీ?

`మహిళా దినోత్సవం మరునాడే మానవత్వం మర్చిపోయిన ఉమా గౌరీ?

`ఉమా గౌరీ మీద అనేక పిర్యాదులు?

`”నేటిధాత్రి” కి క్యూ కడుతున్న బాధిత డాక్టర్లు!

`”నేటిధాత్రి” లో వచ్చిన కధనం తో దైర్యంగా ముందుకొస్తున్నారు

`వారు ఉమా గౌరీ మూలంగా నరకం అనుభవిస్తున్నామని చెబుతున్నారు?

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

 ఇది కథ కాదు. సమాజం తలదించుకునే సంఘటన. ఒక మహిళలకు అత్యవసర వైద్యం అందుతున్న వేళ కొంత మంది వచ్చి ఆసుపత్రి మీద దాడి చేస్తే ఎలా వుంటుంది? అదికారిగా వున్న ఓ మహిళ వైద్య పరంగా ఎంత భరోసా నిండేలా వుండాలి. కాని అలాంటి వైద్యాధికారే అత్యవసరం వైద్యం జరుగుతున్న వేళ వైద్యం ఆపేయమని చెప్పి ఆసుపత్రి సీజ్‌చేస్తే ఎలా వుంటుంది? సరిగ్గా ఆపరేషన్ జరుగుతున్న క్షణంలోనే ఆ వైద్యాదికారి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. వేరే ఆసుపత్రికి పంపించి ఆపరరేషన్ చేయించండి? మేమైతే ఆసుపత్రి మూసేసి వెళ్లిపోతామంటే ఎలా వుంటుంది. ఆ సమయంలో వైద్యం కోసం వచ్చిన మహిళ పరిస్దితి ఎలా వుంటుంది? ఒక్క సారి ఊహించుకోండి. గుండె జల్లుమంటోందా? గుండె జలదరిస్తోందా? గుండె కోతకు గురైనట్లు అనిపిస్తుందా? అలా ఆపరేషన్ అడ్డుకున్న వారి మీద కోపం వస్తోందా? సరిగ్గా ఇలాంటి ఘటనే సినిమాలో జరిగితే అందరూ కంట పెట్టుకుంటారు. కాని నిజంగా ఇలాంటి ఘటన జరుగుతుంటే జనం చోద్యం చూశారు. నేరెడ్ మెట్‌లో సరిగ్గా మహిళా దినోత్సవాలు దేశమంతా జరుగుపుకుంటున్న రోజు జరిగింది. నేరెడ్ మెట్‌లో స్రవంతి అనే ఆసుపత్రి వుంది. ఆ ఆసుపత్రికి ఓ మహిళ రక్త స్రావంతో వచ్చింది. పైగా గర్భిణీ. ఆమెకు వెంటనే వైద్యం చేయాలి. లేకుంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం. వెంటనే ఆ ఆసుపత్రి వైద్యురాలు స్రవంతి గాదిరాజు ఆపరేషన్‌కు అవసరమైన అన్ని ముఖ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. వైద్యం చేయాల్సిన మహిళను కూడా ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. ఇక ఆపరేషన్ చేసే సమయం ఆసన్నమైంది. వైద్యురాలు స్రవంతి గాదిరాజు కూడా ఆ ఆపరేషన్ ధియేటర్‌లోకి వెళ్లింది. ఇంతలో ఆసుపత్రిలోకి కొంత మంది వచ్చారు. ఆపరేషన్ ధియేటర్ వరకు వచ్చారు. వైద్యురాలు స్రవంతిని బైటకు రమ్మని పిలుస్తున్నారు. ఆ వైద్యురాలు స్రవంతికి ఏమీ అర్దం కాలేదు. ఆపరేషన్ చేయాల్సిన సమయంలో బైట ఏం జరుగుతుందో అర్దం కాక వెంటనే వైద్యురాలు స్రవంతి బైటకు వచ్చారు. అంతే ఆసుపత్రిని సీజ్ చేస్తున్నామంటూ ఓ మాట వినపడింది. ఆ మాట చెప్పింది ఎవరో కాదు..ఆ జిల్లా డిఎమఅండ్‌హెచఓ ఉమా గౌరీ. మేడమ్ అర్జంట్‌గా పేషెంట్‌కు వైద్యం అందించాలి. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం. ఆపరేషన్ కోసం అన్ని సిద్దం చేసుకున్నాం. ఆ మహిళలకు బ్లీడింగ్ అవుతోంది. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణాల మీదకు వస్తుందని ఆ వైద్యురాలు స్రవంతి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా డిఎంఅండ్‌హెచఓ ఆ మాటలు వినేందుకు సిద్దంగా లేరు. అసలు వైద్యురాలు స్రవంతి మాటలు పట్టించుకోలేదు. వెంటనే ఆసుపత్రిని ఖాళీ చేయండి. ఆసుపత్రిలో వున్నవారిని వెంటనే బైటకు పంపేయండి అంటూ ఉమాగౌరీ అనుచరులకు ఆదేశాలు జారీ చేస్తోంది. మేడం ఒక్క అరగంట సమయం ఇవ్వండి. ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత మీరు ఎలా చెబితే అలా వింటాం అని వైద్యురాలు స్రవంతి వేడుకున్నారు. అయినా డిఎంఅండ్‌హెచఓ ఉమాగౌరీ ససేమిరా అన్నారు. ఉన్న ఫలంగా ఆసుపత్రిని సీజ్ చేయాల్సిందే అని ఆర్డర్ వేస్తున్నారు. పాపం మహిళ ప్రాణం మేడం అంటూ వైద్యురాలు స్రవంతి ప్రాదేయ పడింది. కాని ఫలితం లేకపోయింది. నేను మహిళను కాదా? నాకు వైద్యం తెలియదా? అంటూ డిఎంఅండ్ హెచఓ ఉమాగౌరీ హూంకరించారు. నేను చెప్పింది చేయండి? లేకుంటే తీవ్ర పరిణామాలు వుంటాయని ఉమాగౌరీ ఆ ఆసుపత్రి వైద్యురాలు స్రవంతిని బెదిరించారు. ఇంతలో వైద్యం అందాల్సిన మహిళ భర్త ఉమాగౌరీని వేడుకున్నారు. ఆమె కాళ్ల మీద పడ్డాడు. అయినా ఉమాగౌరీ కనికరం చూపలేదు. కనీసం మానవత్వంతో కూడా ఆలోచించలేదు. ఎట్టిపరిస్దితుల్లో ఇప్ప్పుడు ఇక్కడ వైద్యం చేయడానికి వీలు లేదు. వెంటనే ఆసుపత్రిని సీజ్ చేయాల్సిందే అని పట్టుబట్టారు. ఆపరేషన్ ధియేటర్‌లో సీరియన్ కండీషన్‌తో వున్న మహిళ పరిస్దితి ఏమిటి? మేడం అని ఆ వైద్యురాలు ప్రశ్నించింది. వెంటనే గాందీ ఆసుప్రతికి తరలించండి. అక్కడికి నేను ఫోన్ చేసి చెబుతాను. అక్కడ ఆపరేషన్ చేస్తారు. క్విక్ అంటూ ఉమాగౌరీ హడావుడి చేశారు. గాంధీ ఆసుపత్రికి తరలించే లోపు ఏదైనా జరగరానిది జరిగిదే బాద్యత ఎవరిది? మేడం అని వైద్యురాలు అంటే అదంతా నాకు అనవసరం అంటూ తన అనుచరులకు ఉమాగౌరీ ఉసిగొల్పింది. చివరికి చేసేదేమీ లేక వైద్యురాలు ఆ చికిత్స అందించాల్సిన మహిళను ఆ సమీపంలో వున్న మరో ఆసుపత్రికి హుటాహుటిన తరలించి వైద్యం అందించారు. ఆసుపత్రిని నమ్ముకొని వచ్చిన ఆ మహిళను కాపాడారు. నిజం చెప్పాలంటే అదే ఆసుపత్రిలో ఉమాగౌరీ చేసిన హడావుడి చేసిన సమయంలోనే ఆపరేషన్ పూర్తయ్యేది. కాని కనికరం లేకుండా మహిళ ప్రాణంకూడా లెక్క చేయకుండా ఉమాగౌరీ చేసిన నిర్వాకం వల్ల నిండు ప్రాణం పోయేది. అయినా ఆమెలో కనీసం పశ్చాత్తాపం లేదు. తాను అనుకున్నట్లే చేశారు. ఆసుపత్రిని సీజ్ చేసి వెళ్లిపోయారు. అసలు డిఎంఅండ్‌హెచఓ విధులేమిటి? ఏ ప్రభుత్వ ఆసుపత్రి అయినా, ప్రైవేటు ఆసుపత్రి అయినా అనధికారికంగా నడుస్తుందా? చూసుకోవాలి. అలాంటి ఆసుపత్రుల్లో నిజమైన డాÅ£్టర్లు పనిచేస్తున్నారా? లేక నకిలీలున్నారా? ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయలు వున్నాయా? అనేది చూడాలి. ఆ ఆసుపత్రికి ఫైర్ సేఫ్టీ వుందా చూసుకోవాలి. ఆ ఆసుపత్రుల్లో నకిలీ మందులు అమ్ముతున్నారా? చూడాలి. వైద్యం కోసం వచ్చిన వారికి ఎలాంటి మందులు ఇస్తున్నారో చూడాలి. నిర్ణీత గడువు పూర్తయిన మందులు అమ్ముతున్నారో చెక్ చేయాలి. ఆసుపత్రి యజమాన్యాలు వైద్యం కోసం వచ్చిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారో చూడాలి. వారికి ఇష్టాను సారం బిల్లులు వేసి వేధిస్తున్నారో చూసుకోవాలి. లేదా ఆసుపత్రుల్లో ఏదైనా అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నాయా? చెక్ చేయాలి. ఇదీ ఉమాగౌరీ చేయాల్సిన డ్యూటీ. కాని ఆ పని వదిలేసి స్రవంతి ఆసుపత్రికి, ఆ బిల్డింగ్ లీజుకు ఇచ్చిన వ్యక్తికి మధ్య ఏదో చిన్న వివాదం నడుస్తోంది. ఈశా అసుపత్రికి అనబంధంగా నడుస్తున్న స్రవంతి ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తోంది. ఈశా ఆసుపత్రికి సంబంధించిన గడువు ముగిసింది అనే నెపంతో స్రవంతి ఆసుపత్రిని ఉన్న ఫలంగా మూసేందుకు ఉమా గౌరీ వచ్చారు. అసలు ఈశా ఆసుపత్రికి యూనిట్‌గా సాగుతున్న స్రవంతి ఆసుపత్రికి ఉమా గౌరీ కార్యాలయం నుంచి ఎలాంటి నోటీస్ రాలేదు. కనీసం ముందస్తు హెచ్చరిక కూడా లేదు. ముందే చెప్పి ఆసుపత్రి ఖాళీ చేయాలంటే స్రవంతి ఆసుపత్రి నిర్వాహకులు ఖాళీచేసేవారు. కాని ఇలా దౌర్జన్యంగా ఆసుపత్రిని మూసి వేయించాల్సిన అవసరం లేదు. ఉమా గౌరీ తన కార్యాలయంలో కూర్చొని ఆర్డర్ వేస్తే చాలు. ముందస్తు నోటీసు ఎలాంటిది లేకుండా వచ్చి, ఉన్న ఫలంగా ఆసుపత్రిని సీజ్‌చేశారు. నిజానికి వైద్యం పేరుతో ఏదైనా ఆసుపత్రిలో రోగులకు అన్యాయం జరిగితే ఉన్న ఫలంగా ఆసుపత్రిని మూసేయడాన్ని ఎవరూ తప్ప్పు పట్టరు. కాని ఎలాంటి వివాదాలు లేని ఆసుపత్రిని ఉన్న ఫలంగా ఏదో కొంపలు మునిగిపోయినట్లు వచ్చి ఆసుపత్రిని సీజ్ చేయాల్సిన అవరం లేదు. అందులోనూ మహిళా దినోత్సవ వేడుÅ£లు డిఎంఅండ్‌హెచఓ ఆధ్వర్యంలో సాగాల్సిన రోజున, ఆ కార్యక్రమాలు పక్కన పెట్టి మరీ ఆసుపత్రికి వచ్చిన సీజ్ చేయాల్సిన అవసరం అసలే లేదు. ఒక మహిళా ఉన్నతాధికారిగా వుండి మహిళలకు అత్యవసర వైద్యం అందాల్సిన సమయంలో క్షణాల మీద ఆసుపత్రిని సీజ్ చేయడం దుర్మార్గం కాదా? ఇలా ఆసుపత్రులను ఇబ్బంది పెట్టడం ఉమాగౌరీకి కొత్తకాదని చాల మంది ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్నాయి. నేటిధాత్రిలో ఓ కథనం వచ్చింది. దాన్ని చూసిన అనేక ప్రైవేటు ఆసుపత్రులు నేటిధాత్రికి ఫోన్ చేస్తున్నారు. వారికి జరిగిన అన్యాయాలను వివరిస్తున్నారు. ఉమా గౌరీ మూలంగా పడుతున్న ఇబ్బందులను చెబుతున్నారు. ఆసుపత్రుల నిర్వాహకులు నరకం చూస్తున్నామని అంటున్నారు. ఎలాంటి తప్ప్పులు లేకున్నా లంచాల కోసం ఆమె పీడిస్తోందని తెలియజేస్తున్నారు. తమను వేదిస్తోందని అంటున్నారు. అడిగినంత ఇవ్వకపోతే ఏకంగా ఆసుపత్రులు సీజ్ చేస్తున్నారని అంటున్నారు. ఇలా తెలంగాణలో చాలా మంది డిఎంఅండ్‌హెచఓ వ్యవహరిస్తున్నట్లు తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రి యాజమాన్యాలు నేటిధాత్రి దష్టికి తీసుకొస్తున్నారు. అలాంటి వారి ఆడగాలు ఇక నేటిధాత్రిలో వరస కథనాలు.!

సిలిండర్ బుకింగ్ ఆన్‌లైన్‌లోనే చేయాలి: అదనపు కలెక్టర్

వినియోగదారులు ఆన్ లైన్ లో మాత్రమే సిలిండర్ బుక్ చేసుకోవాలి

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు

మంచిర్యాల,నేటి ధాత్రి:

గ్యాస్ వినియోగదారులు ఆన్ లైన్ లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు తెలిపారు.గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఎల్ పి జి డీలర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి గ్యాస్ కంపెనీల సేల్స్ అధికారులతో ఫోన్ ద్వారా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలు,గోదాముల వద్దకు వెళ్లకుండా ఆన్ లైన్ లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని తెలిపారు.గ్యాస్ బుకింగ్ సమయం సింగిల్ సిలిండర్ వారికి 25 రోజులు,డబుల్ సిలిండర్ వారికి 30 రోజుల వ్యవధి ఉంటుందని తెలిపారు.గ్యాస్ డెలివరీ చేసే సమయంలో వినియోగదారులు డెలివరీ బాయ్ కు ఓ టి పి చెప్పి సహకరించాలని, హోటల్,రెస్టారెంట్లలో వాణిజ్య సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని,నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎవరైనా కృత్రిమ కొరతను సృష్టించి,బ్లాక్ మార్కెట్ లో సిలిండర్లను విక్రయించాలని చూస్తే నిత్యవసరల సరుకుల చట్టం 1955 క్రింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఎల్ పి జి వినియోగదారులు కె వై సి తప్పనిసరిగా చేసుకోవాలని, గ్యాస్ ఏజెన్సీ ల వద్ద,ఆన్ లైన్, గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైట్, యాప్ లో,గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వద్ద పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version