10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

జిల్లాలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని సింగరేణి గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణ ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించారు.
పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని సూచించారు.
పరీక్షా కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, సెల్‌ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించకూడదని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించే ముందు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాసులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రాల వద్ద అతిక్రమిస్తే చర్యలు తప్పవు…

పరీక్ష కేంద్రాల వద్ద అతిక్రమిస్తే చర్యలు తప్పవు

దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి

దుగ్గొండి,నేటిధాత్రి:

ఈనెల 14 నుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్న పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకానునట్లు ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి హెచ్చరించారు.
పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు ఉంటుందని అలాగే ఎగ్జామ్ సెంటర్ లకు సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లను తెరువకూడదని తెలిపారు.
పరీక్ష రాసే సమయంలో విద్యార్థులను మాస్ కాపీయింగ్ చేసేందుకు గాని ఎవరికైనా బయట వ్యక్తులు సపోర్ట్ చేయడానికి వస్తే, వారి వల్ల ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సినవస్తుందని పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిపిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై రావుల రణధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version