“డిఎంఅండ్ హెచఓ” ల దారుణాలు? ఎపిసోడ్ 2

`మంత్రి గారు ఈ దుర్మార్గాలు చూడండి!

`ఆపరేషన్ ఆపేసి.. ఆసుపత్రి సీజ్ చేసి!?

`ఉమా గౌరీ కర్కషత్వం.. వైద్య వృత్తికే కళంకం?

`చావు బతుకుల్లో వున్న మహిళకు వైద్యం చేయకుండా అడ్డుకున్న “డిఏం అండ్ హెచఓ”?

`నేరేడు మేట్ లో వున్న స్రవంతి ఆసుపత్రిని సీజ్ చేశారు?

`కేవలం అగ్రిమెంట్ సమయం ముగిసిందనే చిన్న కారణం?

`ఎలాంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఆసుపత్రి సీజ్?

`ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్న ఉమా గౌరీ దారుణాలు?

`”నేటిధాత్రి” తో మొరపెట్టుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు

`ఉమా గౌరీ లాంటి డిఏం అండ్ హెచఓ లను చూడలేదంటున్నారు?

`ఒక మహిళా వైద్యురాలు గా వుండి ఆపరేషన్ మధ్యలో ఆసుపత్రి సీజ్ చేయడం దుర్మార్గం?

`ఆపరేషన్ పూర్తయ్యే వరకైనా ఆగమని అడిగినా ససేమేమిరా అని చెప్పిన ఉమాగౌరి?

`పెషేంట్ ను గాంధీ కి తరలిస్తా అని మొండికేసిన ఉమాగౌరి?

`నేరేడు మేట్ నుండి గాంధీ ఆసుపత్రి కి పెషేంట్ ను తరలిస్తమనడం అహంకారం కాదా?

`ఆ పెషేంట్ ప్రాణాలు పొతే బాధ్యత ఎవరు వహించే వారు?

`ఆపరేషన్ కు అయ్యే సమయం కూడా ఇవ్వకపోవడం పాపం కాదా?

`ఇంతలో ఏం కొంపలు మునిగిపోయేవి?

`వైద్యం గురించి నాకే చెబుతారా అంటూ ఉమా గౌరీ?

`మహిళ ప్రాణం కన్నా తన పంతమే నెగ్గించుకున్న ఉమా గౌరీ?

`పెషేంట్ భర్త కాళ్ళ మీద పడ్డా కనికరించని ఉమా గౌరీ?

`ఆపరేషన్ టేబుల్ మీద వున్న పెషేంట్ ను ఆసుపత్రి బైటకు తీసుకొచ్చిన ఉమా గౌరీ?

`మహిళా దినోత్సవం కార్యక్రమం వదిలేసి ఆసుపత్రి సీజ్ చేసిన ఉమా గౌరీ?

`మహిళా దినోత్సవం మరునాడే మానవత్వం మర్చిపోయిన ఉమా గౌరీ?

`ఉమా గౌరీ మీద అనేక పిర్యాదులు?

`”నేటిధాత్రి” కి క్యూ కడుతున్న బాధిత డాక్టర్లు!

`”నేటిధాత్రి” లో వచ్చిన కధనం తో దైర్యంగా ముందుకొస్తున్నారు

`వారు ఉమా గౌరీ మూలంగా నరకం అనుభవిస్తున్నామని చెబుతున్నారు?

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

 ఇది కథ కాదు. సమాజం తలదించుకునే సంఘటన. ఒక మహిళలకు అత్యవసర వైద్యం అందుతున్న వేళ కొంత మంది వచ్చి ఆసుపత్రి మీద దాడి చేస్తే ఎలా వుంటుంది? అదికారిగా వున్న ఓ మహిళ వైద్య పరంగా ఎంత భరోసా నిండేలా వుండాలి. కాని అలాంటి వైద్యాధికారే అత్యవసరం వైద్యం జరుగుతున్న వేళ వైద్యం ఆపేయమని చెప్పి ఆసుపత్రి సీజ్‌చేస్తే ఎలా వుంటుంది? సరిగ్గా ఆపరేషన్ జరుగుతున్న క్షణంలోనే ఆ వైద్యాదికారి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. వేరే ఆసుపత్రికి పంపించి ఆపరరేషన్ చేయించండి? మేమైతే ఆసుపత్రి మూసేసి వెళ్లిపోతామంటే ఎలా వుంటుంది. ఆ సమయంలో వైద్యం కోసం వచ్చిన మహిళ పరిస్దితి ఎలా వుంటుంది? ఒక్క సారి ఊహించుకోండి. గుండె జల్లుమంటోందా? గుండె జలదరిస్తోందా? గుండె కోతకు గురైనట్లు అనిపిస్తుందా? అలా ఆపరేషన్ అడ్డుకున్న వారి మీద కోపం వస్తోందా? సరిగ్గా ఇలాంటి ఘటనే సినిమాలో జరిగితే అందరూ కంట పెట్టుకుంటారు. కాని నిజంగా ఇలాంటి ఘటన జరుగుతుంటే జనం చోద్యం చూశారు. నేరెడ్ మెట్‌లో సరిగ్గా మహిళా దినోత్సవాలు దేశమంతా జరుగుపుకుంటున్న రోజు జరిగింది. నేరెడ్ మెట్‌లో స్రవంతి అనే ఆసుపత్రి వుంది. ఆ ఆసుపత్రికి ఓ మహిళ రక్త స్రావంతో వచ్చింది. పైగా గర్భిణీ. ఆమెకు వెంటనే వైద్యం చేయాలి. లేకుంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం. వెంటనే ఆ ఆసుపత్రి వైద్యురాలు స్రవంతి గాదిరాజు ఆపరేషన్‌కు అవసరమైన అన్ని ముఖ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. వైద్యం చేయాల్సిన మహిళను కూడా ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. ఇక ఆపరేషన్ చేసే సమయం ఆసన్నమైంది. వైద్యురాలు స్రవంతి గాదిరాజు కూడా ఆ ఆపరేషన్ ధియేటర్‌లోకి వెళ్లింది. ఇంతలో ఆసుపత్రిలోకి కొంత మంది వచ్చారు. ఆపరేషన్ ధియేటర్ వరకు వచ్చారు. వైద్యురాలు స్రవంతిని బైటకు రమ్మని పిలుస్తున్నారు. ఆ వైద్యురాలు స్రవంతికి ఏమీ అర్దం కాలేదు. ఆపరేషన్ చేయాల్సిన సమయంలో బైట ఏం జరుగుతుందో అర్దం కాక వెంటనే వైద్యురాలు స్రవంతి బైటకు వచ్చారు. అంతే ఆసుపత్రిని సీజ్ చేస్తున్నామంటూ ఓ మాట వినపడింది. ఆ మాట చెప్పింది ఎవరో కాదు..ఆ జిల్లా డిఎమఅండ్‌హెచఓ ఉమా గౌరీ. మేడమ్ అర్జంట్‌గా పేషెంట్‌కు వైద్యం అందించాలి. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం. ఆపరేషన్ కోసం అన్ని సిద్దం చేసుకున్నాం. ఆ మహిళలకు బ్లీడింగ్ అవుతోంది. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణాల మీదకు వస్తుందని ఆ వైద్యురాలు స్రవంతి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా డిఎంఅండ్‌హెచఓ ఆ మాటలు వినేందుకు సిద్దంగా లేరు. అసలు వైద్యురాలు స్రవంతి మాటలు పట్టించుకోలేదు. వెంటనే ఆసుపత్రిని ఖాళీ చేయండి. ఆసుపత్రిలో వున్నవారిని వెంటనే బైటకు పంపేయండి అంటూ ఉమాగౌరీ అనుచరులకు ఆదేశాలు జారీ చేస్తోంది. మేడం ఒక్క అరగంట సమయం ఇవ్వండి. ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత మీరు ఎలా చెబితే అలా వింటాం అని వైద్యురాలు స్రవంతి వేడుకున్నారు. అయినా డిఎంఅండ్‌హెచఓ ఉమాగౌరీ ససేమిరా అన్నారు. ఉన్న ఫలంగా ఆసుపత్రిని సీజ్ చేయాల్సిందే అని ఆర్డర్ వేస్తున్నారు. పాపం మహిళ ప్రాణం మేడం అంటూ వైద్యురాలు స్రవంతి ప్రాదేయ పడింది. కాని ఫలితం లేకపోయింది. నేను మహిళను కాదా? నాకు వైద్యం తెలియదా? అంటూ డిఎంఅండ్ హెచఓ ఉమాగౌరీ హూంకరించారు. నేను చెప్పింది చేయండి? లేకుంటే తీవ్ర పరిణామాలు వుంటాయని ఉమాగౌరీ ఆ ఆసుపత్రి వైద్యురాలు స్రవంతిని బెదిరించారు. ఇంతలో వైద్యం అందాల్సిన మహిళ భర్త ఉమాగౌరీని వేడుకున్నారు. ఆమె కాళ్ల మీద పడ్డాడు. అయినా ఉమాగౌరీ కనికరం చూపలేదు. కనీసం మానవత్వంతో కూడా ఆలోచించలేదు. ఎట్టిపరిస్దితుల్లో ఇప్ప్పుడు ఇక్కడ వైద్యం చేయడానికి వీలు లేదు. వెంటనే ఆసుపత్రిని సీజ్ చేయాల్సిందే అని పట్టుబట్టారు. ఆపరేషన్ ధియేటర్‌లో సీరియన్ కండీషన్‌తో వున్న మహిళ పరిస్దితి ఏమిటి? మేడం అని ఆ వైద్యురాలు ప్రశ్నించింది. వెంటనే గాందీ ఆసుప్రతికి తరలించండి. అక్కడికి నేను ఫోన్ చేసి చెబుతాను. అక్కడ ఆపరేషన్ చేస్తారు. క్విక్ అంటూ ఉమాగౌరీ హడావుడి చేశారు. గాంధీ ఆసుపత్రికి తరలించే లోపు ఏదైనా జరగరానిది జరిగిదే బాద్యత ఎవరిది? మేడం అని వైద్యురాలు అంటే అదంతా నాకు అనవసరం అంటూ తన అనుచరులకు ఉమాగౌరీ ఉసిగొల్పింది. చివరికి చేసేదేమీ లేక వైద్యురాలు ఆ చికిత్స అందించాల్సిన మహిళను ఆ సమీపంలో వున్న మరో ఆసుపత్రికి హుటాహుటిన తరలించి వైద్యం అందించారు. ఆసుపత్రిని నమ్ముకొని వచ్చిన ఆ మహిళను కాపాడారు. నిజం చెప్పాలంటే అదే ఆసుపత్రిలో ఉమాగౌరీ చేసిన హడావుడి చేసిన సమయంలోనే ఆపరేషన్ పూర్తయ్యేది. కాని కనికరం లేకుండా మహిళ ప్రాణంకూడా లెక్క చేయకుండా ఉమాగౌరీ చేసిన నిర్వాకం వల్ల నిండు ప్రాణం పోయేది. అయినా ఆమెలో కనీసం పశ్చాత్తాపం లేదు. తాను అనుకున్నట్లే చేశారు. ఆసుపత్రిని సీజ్ చేసి వెళ్లిపోయారు. అసలు డిఎంఅండ్‌హెచఓ విధులేమిటి? ఏ ప్రభుత్వ ఆసుపత్రి అయినా, ప్రైవేటు ఆసుపత్రి అయినా అనధికారికంగా నడుస్తుందా? చూసుకోవాలి. అలాంటి ఆసుపత్రుల్లో నిజమైన డాÅ£్టర్లు పనిచేస్తున్నారా? లేక నకిలీలున్నారా? ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయలు వున్నాయా? అనేది చూడాలి. ఆ ఆసుపత్రికి ఫైర్ సేఫ్టీ వుందా చూసుకోవాలి. ఆ ఆసుపత్రుల్లో నకిలీ మందులు అమ్ముతున్నారా? చూడాలి. వైద్యం కోసం వచ్చిన వారికి ఎలాంటి మందులు ఇస్తున్నారో చూడాలి. నిర్ణీత గడువు పూర్తయిన మందులు అమ్ముతున్నారో చెక్ చేయాలి. ఆసుపత్రి యజమాన్యాలు వైద్యం కోసం వచ్చిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారో చూడాలి. వారికి ఇష్టాను సారం బిల్లులు వేసి వేధిస్తున్నారో చూసుకోవాలి. లేదా ఆసుపత్రుల్లో ఏదైనా అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నాయా? చెక్ చేయాలి. ఇదీ ఉమాగౌరీ చేయాల్సిన డ్యూటీ. కాని ఆ పని వదిలేసి స్రవంతి ఆసుపత్రికి, ఆ బిల్డింగ్ లీజుకు ఇచ్చిన వ్యక్తికి మధ్య ఏదో చిన్న వివాదం నడుస్తోంది. ఈశా అసుపత్రికి అనబంధంగా నడుస్తున్న స్రవంతి ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తోంది. ఈశా ఆసుపత్రికి సంబంధించిన గడువు ముగిసింది అనే నెపంతో స్రవంతి ఆసుపత్రిని ఉన్న ఫలంగా మూసేందుకు ఉమా గౌరీ వచ్చారు. అసలు ఈశా ఆసుపత్రికి యూనిట్‌గా సాగుతున్న స్రవంతి ఆసుపత్రికి ఉమా గౌరీ కార్యాలయం నుంచి ఎలాంటి నోటీస్ రాలేదు. కనీసం ముందస్తు హెచ్చరిక కూడా లేదు. ముందే చెప్పి ఆసుపత్రి ఖాళీ చేయాలంటే స్రవంతి ఆసుపత్రి నిర్వాహకులు ఖాళీచేసేవారు. కాని ఇలా దౌర్జన్యంగా ఆసుపత్రిని మూసి వేయించాల్సిన అవసరం లేదు. ఉమా గౌరీ తన కార్యాలయంలో కూర్చొని ఆర్డర్ వేస్తే చాలు. ముందస్తు నోటీసు ఎలాంటిది లేకుండా వచ్చి, ఉన్న ఫలంగా ఆసుపత్రిని సీజ్‌చేశారు. నిజానికి వైద్యం పేరుతో ఏదైనా ఆసుపత్రిలో రోగులకు అన్యాయం జరిగితే ఉన్న ఫలంగా ఆసుపత్రిని మూసేయడాన్ని ఎవరూ తప్ప్పు పట్టరు. కాని ఎలాంటి వివాదాలు లేని ఆసుపత్రిని ఉన్న ఫలంగా ఏదో కొంపలు మునిగిపోయినట్లు వచ్చి ఆసుపత్రిని సీజ్ చేయాల్సిన అవరం లేదు. అందులోనూ మహిళా దినోత్సవ వేడుÅ£లు డిఎంఅండ్‌హెచఓ ఆధ్వర్యంలో సాగాల్సిన రోజున, ఆ కార్యక్రమాలు పక్కన పెట్టి మరీ ఆసుపత్రికి వచ్చిన సీజ్ చేయాల్సిన అవసరం అసలే లేదు. ఒక మహిళా ఉన్నతాధికారిగా వుండి మహిళలకు అత్యవసర వైద్యం అందాల్సిన సమయంలో క్షణాల మీద ఆసుపత్రిని సీజ్ చేయడం దుర్మార్గం కాదా? ఇలా ఆసుపత్రులను ఇబ్బంది పెట్టడం ఉమాగౌరీకి కొత్తకాదని చాల మంది ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్నాయి. నేటిధాత్రిలో ఓ కథనం వచ్చింది. దాన్ని చూసిన అనేక ప్రైవేటు ఆసుపత్రులు నేటిధాత్రికి ఫోన్ చేస్తున్నారు. వారికి జరిగిన అన్యాయాలను వివరిస్తున్నారు. ఉమా గౌరీ మూలంగా పడుతున్న ఇబ్బందులను చెబుతున్నారు. ఆసుపత్రుల నిర్వాహకులు నరకం చూస్తున్నామని అంటున్నారు. ఎలాంటి తప్ప్పులు లేకున్నా లంచాల కోసం ఆమె పీడిస్తోందని తెలియజేస్తున్నారు. తమను వేదిస్తోందని అంటున్నారు. అడిగినంత ఇవ్వకపోతే ఏకంగా ఆసుపత్రులు సీజ్ చేస్తున్నారని అంటున్నారు. ఇలా తెలంగాణలో చాలా మంది డిఎంఅండ్‌హెచఓ వ్యవహరిస్తున్నట్లు తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రి యాజమాన్యాలు నేటిధాత్రి దష్టికి తీసుకొస్తున్నారు. అలాంటి వారి ఆడగాలు ఇక నేటిధాత్రిలో వరస కథనాలు.!

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version