టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి…

టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

పరీక్షల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కాగా శనివారం వరంగల్ జిల్లాలోని నర్సంపేట జెడ్పిహెచెస్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కనీస మౌళిక సదుపాయాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు.వైద్య శిబిరాన్ని పరిశీలించి, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు.

సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్

వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ తో లోనికి ఎవ్వరిని అనుమతించవద్దని,డీఈఓ,చీఫ్ సూపరింటెండెంట్ ల నుండి పరీక్షా విధుల్లో ఉన్న అందరిని, వైద్య శిబిర వైద్య సిబ్బందితో సహా ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేసి అనుమతించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అన్నారు.కలెక్టర్ వెంట చీఫ్ సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు.

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు…

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

ఈనెల 14 నుండి జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లోకిరాన్ని రానున్నదని
వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హన్మకొండ జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలు ,వరంగల్ జిల్లా 47, జనగామ జిల్లాలో 39 మొత్తం 150 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 14 శనివారం నుండి నుండి ఏప్రిల్ 16 నుండి 2026 వరకు ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని డీసీపీ తెలిపారు.పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఈస్ట్ డీసీపీ తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణ లో భాగంగా సెక్షన్ 163, (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదు.సభలు, సమావేశాలు, ర్యాలీ లు, ధర్నాలు నిషేధం.పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు 14 తేది నుండి ఏప్రిల్ 16 వరకు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు మూసివేయాలని డీసీపీ ఆదేశించారు. ఈ పరీక్షల సమయంలో ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని డీసీపీ అంకిత్ కుమార్ హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version