*అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సహాయం…

*అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సహాయం

జన్మదిన సందర్భంగా రూ.5 వేల అందజేసిన యువ కాంగ్రెస్ నాయకుడు

దుగ్గొండి,నేటిధాత్రి:

దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన కూకట్ల కోమల (భర్త సాంబయ్య) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ తన జన్మదినోత్సవం సందర్భంగా రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచారు.ఈ కార్యక్రమంలో మహ్మదాపురం, మర్రిపల్లి కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇంచార్జి గోగుల ప్రకాష్ రెడ్డి, మర్రిపల్లి గ్రామ వార్డు సభ్యులు ఎరుకల పద్మ, గాజు శివాజీ, కుక్కమూడి రాజేందర్, మహ్మదాపురం గ్రామ వార్డు సభ్యుడు పాలడుగుల ప్రశాంత్, మర్రిపల్లి మాజీ సర్పంచ్ చాతరాశి నాగేందర్, నాయకులు భాషబోయిన సంజీవ, ఇట్టబోయిన ఐలయ్య, ఇనుముల రాము, ఆడెపు గోవర్ధన్, ఎలకంటి కుమారస్వామి, రాధారపు వనయ్య, చొప్పరి భాస్కర్, గాజు నాగరాజు, కుక్కమూడి రాజు, పొన్నాల మహిపాల్, అంబీరు శివాజీ, కన్నెబోయిన సురేష్, కుక్కమూడి చిరంజీవి, పాలడుగుల రాజుకుమార్, తలబోయిన సంపత్, కూకట్ల కట్టయ్య, గాజు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

మర్రిపల్లి మల్లంపల్లి బస్సు సర్వీస్ పునరుద్ధరించాలి…

మర్రిపల్లి మల్లంపల్లి బస్సు సర్వీస్ పునరుద్ధరించాలి

ఆర్టీసీ నర్సంపేట డిపో మేనేజర్ కు వినతిపత్రం

దుగ్గొండి,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలం మర్రిపల్లి, మహ్మదాపురం గ్రామాల ప్రజల రవాణా సౌకర్యార్థం బస్సు సర్వీస్‌ను మర్రిపల్లి/మల్లంపల్లి వరకు పునరుద్ధరించాలని కోరుతూ నర్సంపేట బస్సు డిపో మేనేజర్ ప్రసున్న లక్ష్మికి మర్రిపల్లి గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత,మహ్మదాపురం గ్రామ సర్పంచ్ గోగుల శ్రీనివాస్ రెడ్డి స్థానికులతో కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయా సర్పంచులు మాట్లాడుతూ బస్సు సర్వీస్ పునరుద్ధరణతో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు మరియు గ్రామస్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. అధికారులు త్వరితగతిన స్పందించి సేవలను ప్రారంభించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎరుకల పద్మ, కామ సోమలక్ష్మి, కేశవరావు, గాజు శివాజీ, కుక్కమూడి రాజేందర్ పాల్గొన్నారు. అలాగే గ్రామస్తులు పొన్నాల మహిపాల్, బొడిగె రాము తదితరులు హాజరయ్యారు.

చాపలబండలో పీడీఎస్ బియ్యం పట్టివేత..

చాపలబండలో పీడీఎస్ బియ్యం పట్టివేత

బియ్యం, వేయింగ్ మెషిన్, ట్రాలీ ఆటో స్వాధీనం

దుగ్గొండి,నేటిధాత్రి:

దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో బొగ్గుల ప్రశాంత్ అనే వ్యక్తి వద్ద పీడీఎస్ బియ్యం బస్తాలు, వేయింగ్ మెషిన్ మరియు ట్రాలీ ఆటో ఉన్నట్లు గుర్తించినట్లు ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు.అతని వద్ద సుమారు 50 కిలోల పీడీఎస్ బియ్యాన్ని, వేయింగ్ మెషిన్‌ను మరియు ట్రాలీ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

పరీక్ష కేంద్రాల వద్ద అతిక్రమిస్తే చర్యలు తప్పవు…

పరీక్ష కేంద్రాల వద్ద అతిక్రమిస్తే చర్యలు తప్పవు

దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి

దుగ్గొండి,నేటిధాత్రి:

ఈనెల 14 నుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్న పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకానునట్లు ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి హెచ్చరించారు.
పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు ఉంటుందని అలాగే ఎగ్జామ్ సెంటర్ లకు సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లను తెరువకూడదని తెలిపారు.
పరీక్ష రాసే సమయంలో విద్యార్థులను మాస్ కాపీయింగ్ చేసేందుకు గాని ఎవరికైనా బయట వ్యక్తులు సపోర్ట్ చేయడానికి వస్తే, వారి వల్ల ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సినవస్తుందని పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిపిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై రావుల రణధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version