సబ్ స్టేషన్ లో రికార్డులు పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు…

సబ్ స్టేషన్ లో రికార్డులు పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వల్ సబ్ స్టేషన్ ను సందర్శించి రికార్డులను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్న ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింత ప్రభాకర్ ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు 24గంటల పాటు విద్యుత్ ఇస్తున్నట్లు అసెంబ్లీ లో పేర్కొన్నారు, రైతులకు కేవలం 12గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని స్పష్టం చేశారు. ఆ విద్యుత్ సరఫరా లో సైతం పలుమార్లు ట్రిప్ అవుతోందని, లైన్ బ్రేకింగ్, ఎల్ సి ల పేరిట అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక రైతుల పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ సబ్ స్టేషన్ లాగ్ బుక్ లో సాయంత్రం 4గంటలకు త్రి ఫేస్ కరెంటు తీసేస్తే తెల్లారి 3గంటలకు ఇస్తున్నారని అయినా అధికారులు, ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ల మొత్తాన్ని తమ హయాంలో ఉన్న 4,900రూపాయలు ఉన్న డీడీ మొత్తాన్ని 9700రూపాయలకు పెంచారని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం లో వేలాది కొత్త విద్యుత్ కనెక్షన్ లు పెండింగ్ లో ఉన్నాయని స్టోర్ లలో మెటీరియల్ లేదని, కాలిన ట్రాన్స్ఫార్మర్ విషయం లో రైతులపై భారం మోపుతున్నారని, లోడ్ ఎక్కువ ఉన్న చోట్ల అదనపు డి టీ ఆర్ లు లేవని తెలిపారు. బ్యాంకు లను, ఆర్థిక సంస్థలను మోసం చేయడానికి కొత్త డిస్కమ్ ను ఏర్పాటు చేస్తున్నారాని, ఉన్న రెండు డిస్కమ్ లను 56వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి,సష్టాలపాలు చేసి కొత్త డిస్కమ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సమ్మె చేస్తున్న 19647 మంది ఆర్టిజాన్ లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ ల సమ్మెకు మద్దత్తు పలుకుతున్నామని, మృతి చెందిన ఆర్టిజన్ ల పిల్లల విద్యార్హతలకు తగ్గట్టు గా ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version