వెలుగుమట్ల బాధితుల సమస్యపై కవిత ఆగ్రహం.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
వెలుగుమట్ల బాధితుల పట్ల ప్రభుత్వం పగబట్టినట్టుగా వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.
వెలుగుమట్ల బాధితుల పట్ల ప్రభుత్వం పగబట్టినట్టుగా వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్ యుద్ధం, చమురు సరఫరాలో అంతరాయం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మొదలైన విషయాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్ యుద్ధం, చమురు సరఫరాలో అంతరాయం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మొదలైన విషయాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగినట్టు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. ఇద్దరి మధ్య దాదాపు గంట పాటు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యా, అమెరికా త్రిముఖ చర్చల గురించి కూడా ఈ సంభాషణలో ప్రస్తావన వచ్చినట్టు సమాచారం (Trump Putin call).
ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి కూడా ట్రంప్, పుతిన్ మాట్లాడుకున్నట్టు యూరి ఉషాకోవ్ తెలిపారు (Ukraine war updates). ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుపై అమెరికా ప్రతినిధులతో జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల గురించి కూడా ట్రంప్, పుతిన్ మాట్లాడుకున్నారని పేర్కొన్నారు. కాగా, ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌తో పుతిన్ మాట్లాడారని, టెహ్రాన్‌కు రష్యా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారని ఉషాకోవ్ వెల్లడించారు.
ఇఫ్తార్ విందు: మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు…
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ పట్టణంలోని బీదర్ బేస్ ప్రధాన కూడలిలో ప్రముఖ వ్యాపారవేత్త ముక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. విందు అనంతరం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తాయని ముస్లిం మత పెద్దలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాచూరి కనకరత్నం, రాచురి చంద్రశేఖర్, బడంపేట శ్రీనివాస్, రాజేశ్వర్, చాంద్ ఖురేషి, మునవర్ పటేల్, శన్ను, వెంకటేశం, రాధాకృష్ణ, అశోక్ తివారీ, సంగయ్య, వీరారెడ్డి, హాజి సేట్, సర్దార్ సెట్, ముక్రం, అజర్ సెట్, మాన్యయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగింది.
న్యాల్కల్ మండలం రుకుమాపూర్ లోని పురాతన ముస్లిం శ్మశానవాటికను ఆక్రమించే ప్రయత్నం…
◆-: స్థానిక ముస్లింలలో ఆందోళన, భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే బలమైన డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని రుకుమాపూర్ గ్రామంలో ఉన్న పురాతన ముస్లిం శ్మశానవాటికను కొంతమంది భూ కబ్జా మాఫియా కూల్చివేసినట్లు సంచలనాత్మక సంఘటన జరిగింది, దీని తర్వాత స్థానిక ముస్లింలలో తీవ్ర ఆందోళన కోపం ఉంది. మూలాల ప్రకారం, ఈ శ్మశానవాటిక పురాతన కాలం నుండి అక్కడ ఉంది దాని ప్రవేశ ద్వారం ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు గెజిట్‌లో కూడా ప్రస్తావించబడింది. ఈ శ్మశానవాటిక న్యాల్కల్ మండలానికి వెళ్లే ప్రధాన రహదారికి ఎదురుగా ఉంది, ఇక్కడ స్థానిక ముస్లింలు చాలా కాలంగా తమ మృతులను ఖననం చేస్తున్నారు. కొంతమంది భూ వ్యాపారులు తమ భూమికి మార్గం సుగమం చేయడానికి భూమిని కూల్చివేసి స్మశానవాటికను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో, న్యాల్కల్ మండల తహసీల్దార్ హద్నూర్ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌కు ఇప్పటికే సమాచారం అందించినప్పటికీ, స్థానికుల ప్రకారం, సకాలంలో ఎటువంటి ప్రభావవంతమైన చర్య తీసుకోలేదు. తరువాత, భూ కబ్జాదారులు స్మశానవాటికలో కొంత భాగాన్ని కూల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే న్యాల్కల్ తహసీల్దార్ హద్నూర్ పోలీసులకు మళ్ళీ సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన న్యాల్కల్ మండల తహసీల్దార్ ప్రభు, భూ కబ్జాదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్య సందర్భంగా ఒక ట్రాక్టర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా నిరోధించడానికి శ్మశాన వాటిక భూమిని రక్షించాలని ఈ సంఘటనలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ముస్లిం ప్రతినిధులు డిమాండ్ చేశారు.
చట్టాలకు తూట్లు.. తహసీల్దార్ల సంపాదన కోట్లు!?
`ఫామ్ ల్యాండ్ల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్లు?
`విచ్చలవిడిగా నిబంధనలు పాతర పెడుతున్నారు?
`రెవిన్యూ వ్యవస్థను కొందరు తహసీల్దార్లు బ్రష్టు పట్టిస్తున్నారు?
`ప్రభుత్వ ఆదేశాలు, రెవిన్యూ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు?
`ఓ వైపు ప్రభుత్వం ప్రజలను చైతన్యం చేస్తుంటే, తహసీల్దార్లు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తూనే వున్నారు?
`పంచాయతీ రాజ్ 2018 చట్టానికి విరుద్ధంగా వ్యవహారిస్తున్నారు?
`హైడ్రా కమిషనర్ ఆదేశాలను అసలే లెక్క చేయడం లేదు?
`20 గుంటలు ఉంటే తప్ప ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయొద్దు?
`గుంట,రెండు గుంటలకు కూడా కొందరు తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు?
`రియల్ వ్యాపారుల కొమ్ము కాసున్నారు?
`ప్రభుత్వ ఆదాయనికి గండి కొడుతున్నారు.
`చట్టాలను యదేచ్చగా ఉల్లంగిస్తున్నారు?
`ప్రజలను మోసం చేస్తున్న రియల్ వ్యాపారుల కొమ్ము కాస్తున్నారు?
`తహసీల్దార్ల అండ చూసుకొని రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు?
`భూములకు రక్షణగా నిలవాల్సిన తహసీల్దార్లే రియల్ వ్యాపారులతో చేతులు కలుపుతున్నారు?
`గుంట,రెండు గుంటలకు కూడా రైతు భరోసా, రైతు భీమా వస్తుందని రియల్ వ్యాపారాలు ప్రచారం చేస్తున్నారు?
`అమాయక ప్రజలకు ఫామ్ ల్యాండ్ పేరుతో భూములు అంట గడుతున్నారు?
`ఈ అక్రమ ప్రచారాలు తెలిసినా తహసీల్దార్లు నిమ్మకు నీరేతినట్లు వుంటున్నారు?
`ఇలాంటి రియల్ వ్యాపారాల మీద చర్యలు తీసుకోవాల్సిన తహసీల్దార్లే చోద్యం చూస్తున్నారు?
`తహసీల్దార్ల కనుసన్నాల్లోనే రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు?
`ఇలాంటి ఫామ్ ల్యాండ్స్ కొనుగోలు చేయొద్దని హైడ్రా కమిషనర్ రంగనాధ్ చెబుతూనే వున్నారు?
`తహసీల్దార్లు చేయాల్సింది చేస్తూనే వున్నారు?
`ఫామ్ ల్యాండ్ పై రంగనాధ్ ఎంత చెబుతున్నా ప్రజలు మోసపోతూనే వున్నారు?
`ఇలాంటి రిజిస్ట్రేషన్ల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పిసరంతా?
`తహసీల్దార్ల జేబుల్లోకి వెళ్ళేది గుమ్మడికాయంత?
`అక్రమ రిజిస్ట్రేషన్లతో తహసీల్దార్లు కొందరు కోట్లు సంపాదించుకుంటున్నారు?
`ఏసీబీ అధికారులకు దొరకకుండా కొత్త కొత్త ఉపాయలతో లంచాలు తీసుకుంటున్నారు?
`శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు రచిస్తున్నారు?
`ఏసీబీ అధికారులు దాడి ముందే కనిపెడుతున్నారు?
`డబ్బులున్న సూట్ కేసులే రోడ్ల మీదకు విసిరేస్తున్నారు?
`ఎంత తరగని అక్రమ సంపాదన వుంటే అలా సొమ్ము విసిరేయగలరు?
హైదరాబాద్, నేటిధాత్రి:
కాణి లేనిదే కలం ముట్టని రెవిన్యూ యంత్రాంగం. లంచం లేనిదే సంతకం పెట్టడం లేదు. అక్రమార్కుల కోసం అవినీతి సంతకాలు చేస్తుంటారు? చట్టాలకు పెన్నుతో తూట్లు పొడుస్తున్నారు. ఇంకుతో ఇష్టారాజ్యం సాగిస్తున్నారు. చేతిలో పవన్ వుందని కదా! అని పనికి మాలిన పనులు చేస్తున్నారు. కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అటు జీతాలు, ఇటు లంచాలతో కొంత మంది తహిల్ధార్‌లు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఇష్టారాజ్యంగా అడ్డూ అదుపులేని అక్రమ సంపాదనలకు తెగబడుతున్నారు. అక్రమ సంపాదనే లక్ష్యంగా కొలువులు చేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ప్రజలనే మోసం చేస్తున్నారు. వ్యవస్ధను నిండా ముంచేస్తున్నారు. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. రియల్ వ్యాపారుల కోసం తమ ఉద్యోగాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బీద బిక్కిని బాధలు పెడుతున్నారు. రియల్ వ్యాపారుల కొమ్ము కాస్తున్నారు. భూములను రక్షించాల్సిన తహిల్ధార్‌లే దగ్గరుండి చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. సమాజమంతా చీ అంటున్నా తుడుచుకుపోతున్నారు. పేదల కన్నీళ్లు తాగుతున్నారు. ఓ వైపు లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పెరిగిన జీవితాలతో వచ్చిన వెలుగులు చాలవనుకున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో ఇక ఈ ధరణి అంతా మాదే అన్నట్లు అక్రమ రిజిస్ట్రేషన్లకు తెగబడ్డారు. దశాబ్ధ కాలంగా సంపాదించిన సొమ్ము చాలదన్నట్లు, నిత్య సంతర్పణలు లేకుండా బతకలేకపోతున్నారు. లక్షల్లో జీతాలు, నిత్యం లక్షల్లో లంచాలతో ఏటా కోట్లు సంపాదించుకుంటున్నారు. కోట్లాది రూపాయలు కూడబెట్టుకుంటున్నారు. రెవిన్యూ వ్యవస్థలో ఉద్యోగంతో కాసుల పంట పండించుకుంటున్నారు. తిండి గింజలు కూడా పండని భూములతో సతమతమౌతున్న రైతులనుంచి లంచాల రూపంలో లక్షలు తీసుకుంటున్నారు. పేద ప్రజలను వేదించుకు, పీడించుకుతింటున్నారు. మరో వైపు రియల్ వ్యాపారులకు సహకరిస్తూ, ప్రభుత్వ స్పూర్తి, చట్టాలను గంగలో కలుపుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం తెచ్చిన రెవిన్యూ చట్టాలున బుట్ట దాఖలు చేస్తున్నారు. పంచాయితీ రాజ్ 2018 చట్టాన్ని పక్కన పెట్టేస్తున్నారు. కొత్తగా రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన హైడ్రాకు తహిసిల్ధార్‌లు భయపడడం లేదు. గత రెండేళ్ల కాలంగా హైడ్రా కమీషనర్ రంగనాధ్ ప్రజలు చైతన్యం చేస్తూనే వున్నారు. ఫామ్ లాండ్ పేరిట రియల్ వ్యాపారులు సాగిస్తున్న అక్రమ భూ దందాలను నమ్మకండి అని పదే పదే రెండేళ్లుగా చెబుతూనే వున్నారు. కాని ఆ మాటలు ప్రజలు వినడం లేదా? వినిపించుకోవడం లేదా? రియల్ వ్యాపారులు చెబుతున్న మాటలే నమ్ముతున్నారా? ఇప్పటికే ఎంతో మంది ఇలా ఫామ్ లాండ్స్ కొనుగోలు చేసి ఆగమైన సంఘటనలు అనేకం వున్నాయి. ఎంతో మంది తమ గోడును నిత్యం మీడియాతో పంచుకుంటూనే వున్నారు. హైడ్రా కమీషనర్ దాదాపు నిత్యం పదే పదే ప్రజలను చైతన్యం చేస్తూనే వున్నారు. అదే దారిలో నడవాల్సిన రెవిన్యూ ఉద్యోగులు, ముఖ్యంగా తహసిల్ధార్లు, ఆర్డీవోల అక్రమాలకు తెగబడుతున్నారు. హైడ్రా కమీషనర్ మాటలు కూడా పెడ చెవిన పెడుతున్నారు. ఫామ్ లాండ్ వ్యాపారం అంటే సుమారు 20 గుంటల భూమి వుండాలి. అంటే అర ఎకరం వుంటే తప్ప పామ్ లాండ్‌గా రిజిస్ట్రేషన్ చేయకూడదు. అది చట్టం చెబుతున్న మాట. పదే పదే హైడ్రా కమీషనర్ కూడా మొత్తుకుంటున్న మాట. కాని ఆయన మాటలు కూడా ఎవరూ ఎందుకు వినడం లేదనేది ఇప్పటికీ అర్దం కాకుండాపోతోంది. పైగా భూములకు రక్షణగా వుండాల్సిన రెవిన్యూ వ్యవస్ధ అవినీతి కూపంలో కూరుకుపోయింది. అవినీతి సొమ్ము తినకుండా రోజు గడపలేకపోతోంది. అయితే అందరూ కాదు. కొని అధిక శాతం ఉద్యోగులు లంచాలు లేకుండా కొలువు చేయడం లేదు. దాంతో విచ్చలవిడిగా నిబంధనలను పాతర పెడుతున్నారు. ఎక్కువ శాతం తహిసిల్ధార్‌ల మూలంగానే ఈ వ్యవస్ధ భ్రష్టుపట్టిపోతోంది. 20 గుంటలు వుంటే తేప్ప రిజిస్ట్రేషన్‌కు అవకాశం చట్టాన్ని తహిసిల్ధార్‌లు ఉల్లంఘించడం నేరం కాదా? ఈ దుర్మార్గం పై స్దాయి అదికారులకు కనిపించడం లేదా? అనేక సమస్యలు నిత్యం పత్రికల్లో వస్తూనే వున్నాయి. అయినా పై స్ధాయి అధికారులు కల్లు మూసుకుంటున్నారా? రెండు గుంటలు, ఐదు గుంటలు ఎలా ఫామ్ లాండ్‌గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? చట్టం ఎలా ఒప్ప్పుకుంటుందనుకుంటున్నారు? పైగా ఇలా ఐడు గుంటల భూమికి కూడా రైతు భరోసా వస్తుందని, రైతు భీమాకు అర్హులౌతారని రియల్ వ్యాపారులు మోసం చేస్నున్న సంగతి తహసిల్ధార్‌లకు కనిపించడం లేదా? ఏ ధైర్యంతో రియల్ వ్యాపారులు అలా బ్రోచర్లు ముద్రిస్తున్నారు. వాటిని ఎలా ప్రజలకు పంచుతున్నారు. రెవిన్యూ చట్టాలు ఎంత కఠిన తరంగా వుంటాయో తెలియకుండానే రియల్ వ్యాపారాలు చేస్తున్నారా? తహసిల్ధార్‌లే తమకు అండగా వుండగా చట్టమేమి చేస్తుందని రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారా? ఐదు గుంటలకు రైతు భరోసా అమలు చేస్తారని ప్రచారం చేస్తుంటే తహసిల్ధార్‌లు అడ్డుకోవాల్సిన అసవరం లేదా? ప్రజలను చైతన్యం చేసే బాధ్యత రెవిన్యూ అధికారులది కాదా? ఇలా సాగిస్తున్న రియల్ వ్యాపారం మూలంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దీని వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆవ గింజంత వుంటోంది. అలా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న తహసిల్ధార్లకు గుమ్మడి కాయంత ముడుతోంది. అంటే పిసరంత ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంటే తహసిల్ధార్‌ల జేబుల్లోకి లక్షలకు లక్షలకు లక్షలు పోతున్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే అనంత సులువుగా లంచాలు తీసుకుంటున్నారు. కోట్లకు పడగలెత్తుతున్నారు. పైగా తమను ఏబిసి అధికారులు కూడా పట్టుకోకుండా రకరకాల రూపాల్లో లంచాలు తీసుకుంటున్నారు. శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలన్నట్లు, కొత్త కొత్త దారులు వెతుక్కొని మరీ లంచాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్ప్పుకుంటే వ్యవస్ధ ఎంత దిజజారిపోయిందో కూడా తెలుసుకోవచ్చు. ఒక తహసిల్ధార్‌పై కొంత కాలంగా అనేక పిర్యాధులు ఏసిబికి అందాయి? అలా అందుతున్న పిర్యాధులతో ఏసిబి అదికారులు ఆ తహసిల్ధార్‌ను పట్టుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చిక్కిన దాఖలాలు లేవు. ఏదో రకంగా ఆ తహసిల్ధార్ తన అతి తెలివితో తప్పించుకుంటూ వచ్చారు. ఆఖరుకు ఏసిబి అధికారులు ఆ తహసిల్ధార్ ఇంటి మీద దాడులు చేస్తారన్న సమచారాన్ని కూడా తెలుసుకొని, నాలుగు కోట్ల రూపాయల విలువైన డబ్బు, నగలతో కూడిన సూట్‌కేసును రోడ్డు మీద విసిరేశాడంటే? వారి అతి తెలివి తేటలు ఎలా వున్నాయో అర్దం చేసుకోవచ్చు. రోడ్డు మీద నాలుగు కోట్ల రూపాయలను క్షణం ఆలోచించకుండా విసిరిపడేసేందుకు సిద్దమయ్యాడంటే, అతని సంపాదన బైట ఎంత వుంటుందో అంచనా వేసుకోవచ్చు. అలా విచ్చలవిడిగా కొంత మంది తహసిల్ధార్‌లు సంపాదిస్తున్నారు. అయితే ఏసిబి అధికారుల్లో కూడా కొంత మంది అక్రమ తహసిల్ధార్‌లకు కూడా ముందస్తు సమాచారం అందిస్తున్నారన్న సంగతి కూడా తేలిపోతోంది. వ్యవస్ధలు ఇలా అక్రమంగా కుమ్మక్కైతే అవినీతి ఎలా అంతమౌతుంది? లంచాలు లేని వ్యవస్ధ నెలా నిర్మాణమౌతుంది? ఇలా అవినీతి సొమ్ముకు అలవాటు పడిన తహసిల్దార్‌లు తెలంగాణలో అనేక మంది వున్నారు. వారి బండారం నేటిధాత్రి వరుస కధనాలతో బైట పెట్టనుంది. ఎందుకంటే తరాలు తిన్నా తరగనంత సంపాదన కోసం ఓ వైపు పేదల రక్తం తాగుతున్నారు. మరో వైపు చట్టాలను అమలు చేయాల్సిన కర్తవ్యం గాలికి వదిలేస్తున్నారు. తమ బాధ్యతలను విస్మరించి అక్రమ రియల్ వ్యాపారులకు అండగా నిలుస్తున్నారు. వారి అక్రమ వ్యాపారాలకు కొమ్ము కాస్తున్నారు. వారి నుంచి లక్షల రూపాయలు దండుకొని ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. సహజంగా జరగాల్సిన రిజిస్ట్రేషన్ల కాకుండా అడ్డదారిలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వాదేశాలను కూడా బేకాతరు చేస్తున్నారు. గుంట కొనుగోలు చేయాలనుకునే వారితో మరో ఐదుగురిని కలిపి ఐదు గుంటలు రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు. పాస్ బుక్కులను కూడ జారీ చేస్తూ రియల్ వ్యాపారులకు సహకరిస్తున్నారు. రియల్ వ్యాపారులు చెప్పే అuద్దాలను నిజమని నమ్మేలా తహసిల్ధార్‌లు రిజిస్ట్రేషన్లు చేస్తూ చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు. తమకు సంపాదనే ధ్యేయమని నిరూపిస్తున్నారు. అమయక ప్రజలను నిండా ముంచుతున్నారు. అలాంటి వారిపై వరుస కథనాలు రేపటి నుంచి మీ నేటిధాత్రిలో….
`అలాంటి తహసీల్దార్ల అవినీతి బాగోతలపై మీ “నేటిధాత్రి”లో వరుస కథనాలు!
`ఫామ్ హౌస్ రిజిస్ట్రేషన్ లలో ఆ తహసిల్దార్ అవినీతి కిరణాలు? ఎపిసోడ్ 2
పదో తరగతి విద్యార్థులకు మాతృమూర్తుల ఆశీస్సులు.
-మర్రిగడ్డలో కన్నులపండువగా వేడుక.
చందుర్తి, నేటిధాత్రి:
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (మర్రిగడ్డ)లో పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం అత్యంత భావోద్వేగపూరిత వాతావరణంలో జరిగింది. ‘అమ్మ ఆశీర్వచనం’ పేరుతో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమంలో విద్యార్థులు తమ తల్లుల పాదాలకు నమస్కరించి, వారి దివ్య ఆశీస్సులు తీసుకోవడం అందరినీ కదిలించింది.
వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులలో మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ కన్నతల్లులకు పాదపూజ చేసి, వారి పాదాలకు నమస్కరించారు. అనంతరం మాతృమూర్తులు తమ పిల్లల నుదుట తిలకం దిద్ది, హాల్ టికెట్లను అందజేసి, పరీక్షల్లో ఘనవిజయం సాధించాలని నిండు మనసుతో దీవించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినయ్ కుమార్ మాట్లాడుతూ:
“పిల్లల ఎదుగుదలలో మరియు చదువులో తల్లి పాత్ర వెలకట్టలేనిది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా, కన్నతల్లి దీవెనలతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నదే మా సంకల్పం. ఈ సంప్రదాయబద్ధమైన కార్యక్రమం విద్యార్థులలో బాధ్యతను, పట్టుదలను పెంచుతుందని మేము విశ్వసిస్తున్నాము” అని పేర్కొన్నారు.
కార్యక్రమ ముఖ్యాంశాలు:
పాద నమస్కారం: విద్యార్థులు తమ తల్లుల పాదాలకు నమస్కరిస్తున్న సమయంలో పాఠశాల ప్రాంగణమంతా ఒక పవిత్రమైన, భావోద్వేగ పూరిత వాతావరణం నెలకొంది.
హాల్ టికెట్ల పంపిణీ: అధికారుల ద్వారా కాకుండా, నేరుగా తమ అమ్మ చేతుల మీదుగా హాల్ టికెట్లు అందుకోవడం తమకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల సంతృప్తి: పాఠశాల యాజమాన్యం పిల్లలలో సంస్కారంతో కూడిన విద్యను అందిస్తున్న తీరుపై తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వినయ్ కుమార్ తో పాటు ఉపాధ్యాయులు గంగ నర్సయ్య, వేణుగోపాల్, కనకయ్య, సావిత్రి, జ్యోతి రాణి, సరోజ, పద్మ, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్
బహుమతులు అందజేసిన ఎస్ఐ పవన్ కుమార్
పరకాల,నేటిధాత్రి
పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో ఎస్ఎఫ్ఐ నిర్వహించిన పదవ తరగతి టాలెంట్ టెస్ట్ విజేతలకు ఎస్ఐ పవన్ కుమార్ కళాశాల చైర్మన్ సిరికొండ శ్రీనివాస్ లు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతి సిరివెన్నెల,రెండవ బహుమతి ఎస్ఆర్ స్కూల్ ఉతమ్ శెట్టి,ప్రభుత్వ పాఠశాల నుండి మొదటి బహుమతి అక్షయలు బహుమతులు అందుకున్నారు.ఈ సందర్బంగా అతిధులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి వారి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని అలాగే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.మార్చి పద్నాలుగు నుండి జరగబోయే పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్ లో ఎలాంటి భయం లేకుండా మంచిగా రాసి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్,పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్,ప్రభుత్వ గర్ల్స్ స్కూల్ ఇన్చార్జి కల్పన,పద్మ, ధనలక్ష్మి,విద్యార్థులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి పారిశుద్ధ్యం ముఖ్యము ఎమ్మెల్యే జీఎస్సార్.
భూపాలపల్లి నేటిధాత్రి
సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 20వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఎమ్మెల్యే వార్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించి స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు బట్టు కరుణాకర్ మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి వార్డులో శుభ్రత పనులను చేపట్టి ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పట్టణాల అభివృద్ధికి పారిశుద్ధ్యం అత్యంత ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని సూచించారు.
పట్టణంలోని ప్రతి వార్డులో మున్సిపల్ అధికారులు సిబ్బంది సమన్వయంతో పారిశుద్ధ్య పనులను వేగవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా శుభ్రమైన వాతావరణం అవసరమని, మురుగు కాలువలు, చెత్త నిల్వలు లేకుండా పట్టణాన్ని శుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది క్రమం తప్పకుండా శుభ్రత పనులు చేపట్టాలని, ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ అందించే సదుపాయాలను వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు శ్రమతో పనిచేస్తూ వార్డులో చెత్తను తొలగించడం, కాలువలను శుభ్రపరచడం వంటి పనులు నిర్వహించారు. ఎమ్మెల్యే మరియు ఇతర ప్రజాప్రతినిధులు మున్సిపల్ కార్మికులను అభినందించి వారి సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగి, శుభ్రమైన భూపాలపల్లి నిర్మాణానికి దోహదపడుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పట్టణ అధ్యక్షుడు దేవాన్ మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసు వార్డు కౌన్సిలర్స్ రాజు నాయక్ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
బిఆర్ఎస్. పార్టీ నాయకుల ఆధ్వర్యంలోమోడల్ స్కూల్లోప్యాడ్లు పెన్నులు పంపిణీ…..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తగలపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలోని మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్స్ పెన్నులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా. ఇద్దరమ్మ.కాలనీ ఉపసర్పంచ్ అల్వాల.సాయిరాం మరియు బి ఆర్ ఎస్.పార్టీ నాయకులు ఆధ్వర్యంలో. తంగళ్ళపల్లి మండలం. టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలోని మోడల్ స్కూల్లో 10.వ తరగతి చదువుతున్న 91 మంది విద్యార్థులకు ప్యాడ్స్ పెన్నులు. అందజేయడం జరిగిందని తెలియజేస్తూ. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా. 10.వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గిఫ్ట్. ఏ .స్మైల్. లో. భాగంగా. బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు చిరు.కానుకగా తన వంతుగా. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ తన నియోజకవర్గంలో పరీక్ష ప్యాడ్లుపెన్నులు అందించడం జరుగుతుందని. గత పది రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుందని. అందులో భాగంగా ఈరోజు టెక్స్టైల్ పార్క్ మోడల్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ప్యాడ్స్ పెన్నులు అందించడం జరిగిందని. అలాగే కేటి రామారావు తన సిరిసిల్ల నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి.విద్యార్థులందరికీ. పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ఉత్తమ ఫలితాలు సాధించాలని. ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా చదువులో మంచి ఫలితాలు సాధించాలని మనో ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు అందరూ ఉపాధ్యాయులు కేటీ రామారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ మాజీ ఉపసర్పంచ్.అల్వాల. సాయిరాం. మాజీ సర్పంచ్ వేముల శ్రీమతి. కల్వకుంట్ల నాగేశ్వరరావు. వేముల కిషన్. మామిడాలశ్రీనివాస్. వేముల వెంకటేశం.మెరుగు శేఖర్. మెరుగు తిరుపతి. సదానందం.గడ్డం కిరణ్. కుచనసాయి. వేముల రవి తదితరులు పాల్గొన్నారు
ఎస్సీ ఎస్టీ కేసులను నిర్వీర్యం చేస్తున్న అధికారులు
ఎమ్మార్పీఎస్ ఎస్సీ ఎస్టీ జిల్లా కమిటీ సభ్యుడు అంబాల చంద్రమౌళి మాదిగ
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం ఎక్స్ రోడ్ రేగుల గూడెం గ్రామానికి చెందిన కలువల బాలాజీ కుటుంబంపై జరిగిన దాడి జరిగిన అనంతరం దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ కావడం జరిగింది కానీ సంవత్సరం కాలం నుండి నేటి వరకు నిందితులను అరెస్టు చేయలేకపోయారు దానికిగాను జిల్లా కేంద్రంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ ని అంబాల చంద్రమౌళి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో బాధితులతో కలిసి అడిషనల్ ఎస్పీ కి బాలాజీ కుటుంబం పై జరిగిన ఘటన గురించి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో
నోముల శ్రీనివాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు
గాజుల బిక్షపతి మాదిగ
ఎం ఎస్ పి
భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్
దోర్నాల రాజేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు
అంతడుపుల సురేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్
వేమునూరు జక్కన్న మాదిగ సీనియర్ నాయకులు
నమూళ్ళ సంపత్ మాదిగ
మంద తిరుపతి మాదిగ యువసేన జిల్లా అధ్యక్షులు
చిరుపంగ చంటి మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు
మంతెన చిరంజీవి మాదిగ ఎమ్మార్పీఎస తదితరులు పాల్గొన్నారు
పల్లె ప్రకృతి వనంలో శుభ్రత పరిశుభ్రత….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన. ప్రణాళికలో భాగంగా మండే పల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో. గ్రామపంచాయతీ మరియు ప్రభుత్వ అధికారుల తో ప్రజల అందరితో మమేకమై కలిసి ప్రకృతి వనంలో పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రజలు ఏమైనా అవసరాలు ఉన్నచో సమస్యలు వచ్చినచో ప్రజా పాలన. ప్రణాళికలో భాగంగా 99 రోజు ల. యాక్షన్ ప్లాన్ ఉంటుందని. ప్రజలు ఏమైనా అవసరాలు సమస్యలు ఉన్నచో తమ దృష్టికి గాని అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించ.వలసిందిగా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. తంగళ్ళపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణ. కార్యదర్శి ముందoప్రశాంత్. ఫీల్డ్ అసిస్టెంట్ దేవయ్య. గ్రామపంచాయతీ పాలకవర్గం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
ప్రమాదంలో మృతి కుటుంబాన్ని పరామర్శించిన కేటీ రామారావు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన.సాయిల.కిషన్ కొన్ని రోజుల క్రితం కుల వృత్తిలో భాగంగా తాటి .చెట్టు.పై.కళ్ళు గీస్తుండగా.ప్రమాదవశావాస్తు మరణించడం జరిగింది. ఈ రోజు జిల్లెల్ల గ్రామంలో బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు మృతి.నీ. కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం ఇచ్చి గీత కార్మికుడిగా వృత్తి నిర్వహిస్తూ వృత్తిలో భాగంగా తాటి చెట్టు పై ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని. వారి కుటుంబానికి సంపూర్ణ సానుభూతి తెలియజేశారు అలాగే కిషన్ చిత్రపటానికి నివాళులర్పించి వారి ఆత్మ శాంతి చేకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేశారు మరణించిన కిషన్ పిల్లలకు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు కిషన్ ఇద్దరి పిల్లలకు ఒక్క ఒక్కరికి.లక్ష రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్.చేయిస్తానని హామీ ఇచ్చి. బి ఆర్ ఎస్ ప్రభుత్వం రాగానే కుటుంబ వారికి ఉద్యోగం ఇప్పించే విధంగా కృషి చేస్తానని మృతుని.భార్యకు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు ఇట్టి కార్యక్రమంలో. బి. ఆర్. ఎస్ .పార్టీ. నాయకులు. మాజీ సర్పంచ్ .మాట్లమధు. దుబ్బాక .రమేష్.శ్యాగా. దేవేందర్.సిలివేరి.చిరంజీవి. నాయకులు కార్యకర్తలు మృతుని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి-డాక్టర్ లతవిశ్వజన్
చొప్పదండి, నేటిధాత్రి:
జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలోని అక్షయ పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ లతవిశ్వజన్ మాట్లాడుతూ మహిళలందరూ ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని, అదేవిధంగా మహిళలందరూ ఉన్నత విద్యను అభ్యసించి, అన్ని రంగాల్లో ముందుండాలన్నారు రానున్న రోజుల్లో మహిళలు అందరూ రాజకీయంగా ఎదగాలని ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి పాఠశాల సిబ్బందికి సన్మానం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో అక్షయ పాఠశాల కరస్పాండెంట్ తమ్మిడి కనుకరాజు, ప్రిన్సిపాల్ శ్రీమతి, హుజురాబాద్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అక్షయ్, సిద్ధెంకి, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడి ఆశ వర్కర్, వార్డ్ మెంబర్ సభ్యులను సన్మానించిన-సుంకే రవిశంకర్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో మహిళా దినోత్సవ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడి కార్యకర్తలు, ఆశ వర్కర్లు, మహిళా వార్డు మెంబర్లు, గ్రామపంచాయతీ మహిళా సిబ్బంది, తదితర మహిళ మునులను శాల్వతో సన్మానించిన చొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు లేనిదే మనగడ లేదన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోడీ రవీందర్, ఉప సర్పంచ్ కట్ల రాములు, వార్డు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతి పత్రం
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్ ఆధ్వర్యంలో కొత్తపల్లి నుండి వయా రుద్రారం, రంగసాయిపల్లె, దత్తోజిపేట, లక్ష్మీపూర్, గ్రామాల నుండి గుండి గ్రామం వరకు రోడ్ వేయాలని మరియు బస్ రెగ్యులర్ గా నడవాలని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా వెంటనే స్పందించి పంచాయతీరాజ్ డిఈకి మరియు ఆర్టిసి ఆర్ఎమ్ కీ ఫోన్ చేసి వెంటనే పనులు ప్రారంభించి, సమస్య పరిష్కరించాలని ఆదేశించిన మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీకృష్ణ రెడ్డి, సర్పంచులు ద్యావ అనంతరెడ్డి, గుడ్ల శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె రాంరెడ్డి, బీమా ఈశ్వర్, గంటల రవీందర్ రెడ్డి, కట్ల వెంకటేశ్, బండారి పర్సారాములు, పిట్టల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని రామచంద్రాపూర్ మరియు కైలాపూర్ గ్రామ శివారులో సోమవారం జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. అలాగే డ్రిప్ పరికరాల పనితీరుపై జైన్ డ్రిప్ కంపెనీ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగులో రైతులు అనుసరించాల్సిన మెలకువలు మరియు పంటల యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు.అదేవిధంగా ఉద్యాన శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించారు.
ఉద్యాన పంటల సాగు ద్వారా రైతులు తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ పామ్ వంటి ఉద్యాన పంటల సాగు ద్వారా మార్కెట్‌లో మంచి ధర లభించి రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే డ్రిప్ సాగు విధానాన్ని అనుసరించడం ద్వారా నీటి పొదుపు జరిగి పంటల ఉత్పత్తి పెరుగుతుందని వివరించారు.ఈ సందర్భంగా సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం తెలంగాణ సూక్ష్మ నీటి పారుదల పథకం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ వంటి పథకాల ప్రాముఖ్యత మరియు వాటి ద్వారా రైతులకు లభించే ప్రయోజనాలను రైతులకు వివరించారు. అదేవిధంగా రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని సూచించారు.కార్యక్రమం అనంతరం జైన్ డ్రిప్ కంపెనీ జోనల్ మేనేజర్ భవాని ప్రసాద్ రైతులకు డ్రిప్ వ్యవస్థ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వహణ పద్ధతులు మరియు నీటి పొదుపు ద్వారా పంటల ఉత్పత్తి పెంపు గురించి వివరించారు.
అలాగే కార్యక్రమం అనంతరం తెలంగాణ ఉద్యాన మిషన్ పథకం కింద రైతులకు కూరగాయల మినీ కిట్లను ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి రామాచారి, రామచంద్రాపూర్ సర్పంచ్, ఆయిల్ పామ్ ఇన్‌చార్జ్ వాసు, ఫినోలెక్స్ కంపెనీ ప్రతినిధి శ్యాం కుమార్, రైతులు వల్లకొండ లింగారెడ్డి, సమ్మిరెడ్డి, గంపల రమేష్, మధుకర్, సతీష్, ఆయిల్ పామ్ మండల ప్రతినిధులు సాయి, ప్రీతం తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక పాఠశాల ఝాన్సీ లింగాపూర్ బీసీకాలనీ లో స్వయం పరిపాలన దినోత్సవం…
రామాయంపేట మార్చి 9 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ బీసీ పాఠశాలలో సోమవారం నాడు స్వయంపాలన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఐదవ తరగతి విద్యార్థులు సహార్శ్ డి ఈ ఓ గా నందీశ్వర్ ఎంఈఓ గా మనీష్ గౌడ్ హెడమాస్టర్ గా యశ్వంత్ పి ఈ టి గా రామకృష్ణ శివప్రసాద్ శివతేజలు ఉపాధ్యాయులుగా మహిళా ఉపాధ్యాయులుగా నందిత తేజస్విని అవంతిక రిషిక మరియు శ్రీనిధి విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి నరసింహారావు ఉపాధ్యాయులు రవికుమార్ పాల్గొని ఉపాధ్యాయులైన విద్యార్థులను అభినందించి బహుమతులు ఇవ్వడం జరిగింది.
కుషాయిగూడ కాటమయ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే
నేటిధాత్రి
కుషాయిగూడలోని కాటమయ్య దేవాలయాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యే కి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ,స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యనికి గురైన అంబేద్కర్ జంక్షన్
కొద్దినెలలుగా నిలిచిపోయిన వాటర్ ఫౌంటెన్
ఫౌంటెన్ చుట్టూ పేరుకుపోయిన చెత్త
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు
పరకాల,నేటిధాత్రి
పట్టణ సుందరీకరణలో భాగంగా పరకాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై నిలిచిపోయింది.పట్టణానికి మరింత అందాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఫౌంటెన్ కొన్ని నెలలుగా పనిచేయకపోవడంతో స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఫౌంటెన్ పనిచేయకపోవడంతో అందులో టీ గ్లాసులు,ప్లాస్టిక్ కప్పులు,ఇతర చెత్త చెదారం పేరుకుపోయి దయనీయ స్థితికి చేరిందని ప్రజలు వాపోతున్నారు.పట్టణం మధ్యలో ఉన్న ముఖ్యమైన ప్రదేశంలో ఈ విధంగా ఫౌంటెన్ నిరుపయోగంగా ఉండటం సరికాదని స్థానికులు అంటున్నారు.అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రతిరోజూ అనేక మంది ప్రజలు,ప్రయాణికులు, యువత రాకపోకలు సాగిస్తుంటారు.అలాంటి ప్రాధాన్యత కలిగిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ ఈ విధంగా నిలిచిపోవడం వల్ల పట్టణ సుందరీకరణకు మచ్చలా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు వృథా కాకుండా ఉండాలంటే అధికారులు వెంటనే స్పందించి ఫౌంటెన్‌ను మరమ్మతులు చేయించి తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.అలాగే ఫౌంటెన్ చుట్టూ పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రతను పాటించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.సంబంధిత అధికారులు దృష్టి సారించి ఫౌంటెన్‌ను పునరుద్ధరించి పట్టణ సుందరీకరణకు మళ్లీ ప్రతీకగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.
ఈ ప్రదేశాన్ని నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరం
డిఎస్పీ పట్టణ అధ్యక్షులు బొచ్చు నాగరాజు
పట్టణ సుందరికరణ నిమిత్తం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ పై అధికారులు పాలకులు చూపుతున్న నిర్లక్ష్య వైఖరి సరికాదు.గతంలో సాయంకాలం అవ్వగానే కనుసొంపుగా ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా కల్లు చెమ్మగిల్లే లైట్లతో సుందరంగా ఉండేది కానీ ఇప్పుడు పనిచేయని పరిస్థితిలో కనపడటం పాలకులు అధికారులు కన్నెత్తి ఇటు చూడకపోవడం బాధాకరం.ఫౌంటెన్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రతను నిర్వహించాలి వాటర్ ఫౌంటెన్ మళ్లీ పనిచేసేలా వెంటనే చర్యలు తీసుకొని అంబేద్కర్ సర్కిల్‌కు పూర్వ వైభవాన్ని తీసుకురావాలి.
రాజీవ్ గాంధీ విగ్రహానికి చెప్పు తొడిగిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పాషా
మెట్ పల్లి మార్చి 9 నేటి ధాత్రి
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి చెప్పులు తొడిగిన నిందితులకు కఠిన చర్యలు తీసుకోవాలని మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా కోరారు ఈ సందర్బంగ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహనికి చెప్పులు తొడగడం క్షమించరాని చర్య అని, నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణా ఉద్యమ సమయంలో రాజీవ్ గాంధి విగ్రహాన్ని ఉద్యమకారులు ధ్వంసం చేసారని, స్థానిక కాంగ్రెస్ నాయకుల సహకారంతో ఇటీవల బాగుచేయించామని, ఈ క్రమంలో ఇలాంటి చర్యలు చేపట్టడం అనైతిక చర్య అన్నారు. భారత దేశానికి వన్నె తెచ్చిన ప్రధాని రాజీవ్ గాంధీ అని, రాష్ట్రాన్ని ప్రగతిపతంలో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నిందితులను ఉపేక్షించమని ఆయన హెచ్చరించారు.