డా,,దూడపాక రమేష్ ను సన్మానించిన మంద కృష్ణ మాదిగ…

డా,,దూడపాక రమేష్ ను సన్మానించిన మంద కృష్ణ మాదిగ

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి సన్నాహక సదస్సు లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేతులమీదుగా మొగుళ్ళపల్లి మండలం ఆకినపల్లి గ్రామానికి చెందిన దూడపాక రమేష్ ఇటీవల గోవా రాష్టంలో నిర్వహించిన సాహిత్య రంగంలో. డ్రీం అచీవ్ మెంట్ అవార్డ్స్ 2025 రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ అఫ్ రికార్డు తో పాటు 21వ సెంచరీ బుక్ అఫ్ రికార్డు వారు గోవా రాష్ట్రంలో నిర్వహించిన సదస్సులో డాక్టరేట్ ను పొందిన సందర్భంగా డాక్టర్. దూడపాక రమేష్ ను శాలువాతో గౌరవంగా సత్కరించటం జరిగింది. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ గౌరవమైన డాక్టరేట్ విడివిధానాలను గూర్చి తెలుసుకొని మాట్లాడుతూ. పేద కుటుంబంలో నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి డాక్టరేట్ పొందడం చాల సంతోషంగా ఉందని మంద కృష్ణ మాదిగ దూడపాక రమేష్ ను ఆప్యాయంగా అభినందనలు తెలియజేసారు. దూడపాక రమేష్ సాహిత్య రంగంలో తన సాహిత్యంతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందాలని మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని మంద కృష్ణ మాదిగ ఘనంగా సన్మానించారు. అనంతరం డా,,దూడపాక రమేష్
(యువకవి మద్దాలి అవార్డు గ్రహీత) మాట్లాడుతూ. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి పద్మశ్రీ అవార్డు గ్రహీత. మంద కృష్ణమాదిగ అన్న చేత సన్మానం పొందడం గొప్ప అనుభూతి గా ఉందని ఆనందం వ్యక్తం చేస్తూ. మంద కృష్ణ దీవెనలతో నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్న, ఆశీర్వాదంతో అలాగే నా స్నేహితుల ప్రోత్సాహంతో నేను ఎంచుకున్న రంగంలో మరింత ఉన్నత స్థాయికి రావడానికి తప్పకుండా కృషి చేస్తానని దూడపాక రమేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు జీడి సంపత్, దూడపాక శ్రీనివాస్, అడ్వికెట్ భిక్షపతి, ఎం ఆర్ పి ఎస్. గ్రామ అధ్యక్షుడు గడ్డం రమేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పండిత్ దిన్ డయల్ ఉపాధ్యాయ ఆశయాలను కొనసాగించాలి….

పండిత్ దిన్ డయల్ ఉపాధ్యాయ ఆశయాలను కొనసాగించాలి.

బిజెపి మండలధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్.

చిట్యాల,నేటిధాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో పండిత్ దీందాయల్ ఉపాధ్యాయ 109వ జయంతిని బిజెపి చిట్యాల మండల బుర్ర వెంకటేష్ గౌడ్ అధ్యక్షులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర లోని జీవితం నాగ్ల చంద్రబాన్ గ్రామంలో1916 సెప్టెంబర్ 25న జన్మించారని ఆయన చిన్ననాటి నుండే దేశభక్తిని అలవర్చుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ (సంఘ్ ఆర్ఎస్ఎస్) లో సహా ప్రచారక్ పనిచేశారని దేశం కోసం ధర్మం కోసం కీలకంగా పనిచేశారని మంత్రం శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి ప్రో బలంతో జనసంఘలో స్థాపనలో కీలకంగా వ్యవహరించాలని ఉపాధ్యక్షులుగా కార్యదర్శులుగా వ్యవహరించి జన సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేశారని లక్నో దినపత్రిక స్వదేష్ లకు సంపాదకీలుగా ఏకాత్మత మానవ వాదం శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు హిందీలో చంద్రగుప్త మౌర్య నాటకం మరాటి వంటి ఆధ్యాత్మిక దృష్టిలో పెట్టుకొని మానవ సేవ చేయడమే సరైన జీవిత విధానమని ఆయన నమ్మారని ,దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన దీన్ దాయల్ ఉపాధ్యాయ గారిని ఆదర్శంగా తీసుకొని ఆశయాలను కొనసాగించాలని వెంకటేష్ గౌడ్ అన్నారు ,ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు మైదం శ్రీకాంత్ చెక్క నరసయ్య నీలి సుధాకర్ రెడ్డి గుర్రపు రవి ఏ లేటి శ్రీనివాస్ రెడ్డి బండారి భద్రయ్య అనుప మహేష్ కేంసారాపూ ప్రభాకర్ మదరపు రాజు గొపగాని రాజు బురి తిరుపతి బోయిని అజయ్ కధం రాజు తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి అటవీ గ్రామాలల్లో తీజ్ వేడుకల్లో ఎమ్మెల్యే జి ఎస్ పాల్గొన్నారు…

భూపాలపల్లి అటవీ గ్రామాలల్లో తీజ్ వేడుకల్లో ఎమ్మెల్యే జి ఎస్ పాల్గొన్నారు

భూపాలపల్లి నేటిధాత్రి

జోరు వర్షంలో సైతం భూపాలపల్లి మండలం కమలాపూర్, గొల్లబుద్దారం, దూదేకులపల్లి అడవి గ్రామాలలో జరిగిన తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
కమలాపూర్ గ్రామంలో లక్ష్మీ దేవర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే..
లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
డప్పు చప్పుళ్ళతో పెళ్లికాని యువతులు, గ్రామస్తులు సాంప్రదాయ నృత్యాలతో ఎమ్మెల్యేకు స్వాగతం..
అనంతరం డీజే పాటలకు యువతులతో కలిసి స్టెప్పులేసిన ఎమ్మెల్యే..

ఈ తీజ్ పండుగలో పెళ్లికాని యువతులు ఆట పాటలతో ఆనందంగా పాల్గొనడం మన ఆచారాలు, విలువలను భావితరాలకు తీసుకువెళ్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లంబాడీ కులస్తుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్న ఎమ్మెల్యే అన్నారు
లంబాడీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది
తీజ్ వంటి పండుగలు సామాజిక ఐక్యతకు, సాంస్కృతిక పరిరక్షణకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో లంబాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది…

మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది

వర్ధన్నపేట.(నేటిధాత్రి):

ప్రజలను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం:బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆబిడి రాజ్ రెడ్డి &మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దు సత్యం & వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య.
మోడీ ప్రభుత్వం జిఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణల పేరుతో తీసుకు వచ్చిన మార్పులు పేద మధ్యతరగతి వర్గానికి ఉపయోగ పడదని ఇది మోడీ ప్రభుత్వ మోసకారితనము బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆబిడి రాజ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య నేడు గురువారం వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలో ఉన్న క్యాంప్ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల విధానంలో తీసుకొచ్చిన మార్పు గురించి మోడీ ప్రభుత్వం సంకలు కొట్టుకుంటున్న ధి. గత 7 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన ఈ విధానం వల్ల దేశంలోని పెట్టుబడి దారులు , సామ్రాజవాదులే లాభ పడ్డారు ,వారికి దేశా ప్రజల లక్షల కోట్ల రూపాయలు సొమ్మును,పన్నుల రూపేణా దారా దత్తం చేసింది. ఇప్పటి వరకు సామాన్య ప్రజలు కొనుగోలు చేసే నిత్యావసర సరుకుల ధరలు తగ్గలేదు .మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ పన్నుల విధానం తన ఆధీనంలో ఉంచుకొని రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా మార్చింది.
రాష్ట్రా ప్రభుత్వాలు పన్నుల వసూళ్లలో తమకు ఉండే అధికారాలు కోల్పోయాయి .మోడీ ప్రభుత్వం ఏక కేంద్ర విధానాలను అమలు చేస్తూ రాజ్యాంగం కల్పించిన సమాఖ్య స్పూర్తి నీ దెబ్బ తీస్తుంది.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పోషాల వెంకన్నగౌడ్, కొత్తపెల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్ళపెల్లి యాదగిరి గౌడ్, మండల సీనియర్ నాయకులు మరుపట్ల సాయికుమార్,ల్యాబర్తి గ్రామ పార్టీ అధ్యక్షుడు,ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా కార్యదర్శి చిధుముళ్ళ భాస్కర్ లు పాల్గొన్నారు.

శ్రీ కాత్యాయని దేవి అవతారంలో దుర్గామాత…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T152441.774.wav?_=1

 

శ్రీ కాత్యాయని దేవి అవతారంలో దుర్గామాత

దుర్గామాత ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి, మంజూరు నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో బాగంగా దుర్గామాత అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,ఆలయ ధర్మకర్త గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అని అన్నారు

మానవత్వానికి హితుడు (స) పుట్టినప్పటి నుండి ప్రపంచంలో విప్లవాలు జరిగాయి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T151622.701.wav?_=2

 

మానవత్వానికి హితుడు (స) పుట్టినప్పటి నుండి ప్రపంచంలో విప్లవాలు జరిగాయి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మౌలానా ఇజాజ్ మొహియుద్దీన్ వసీం తదితరులు జహీరాబాద్‌లో జమాతే ఇస్లామీ సభలో ప్రసంగించారు మానవత్వం అంతరించిపోయిన, అణచివేత మరియు అమానవీయ చర్యలు మాత్రమే ఉన్న యుగంలో మానవత్వం యొక్క గొప్ప బోధకుడు హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంతోషంగా జన్మించారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క మొదటి విప్లవం ఏమిటంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు మరియు ప్రయోజనం మరియు హాని తప్ప ప్రతిదానికీ ఆయన ఏకైక మరియు ఏకైక యజమాని.

భూమిపై భయం లేదా ప్రమాదం లేని చోట మనిషి స్వేచ్ఛగా ఉన్నాడనే సీరత్ తయ్యబా యొక్క మొదటి సైద్ధాంతిక విప్లవం ఇది. ఇది మొదట మానవాళికి ఇవ్వబడింది. రెండవ విప్లవం ఏమిటంటే, ప్రపంచంలో మనిషి ఒక పురుషుడు మరియు స్త్రీ నుండి సృష్టించబడ్డాడు మరియు గౌరవం మరియు ఔన్నత్యం ఆదాముకు ప్రసాదించబడ్డాయి, దీనిలో దేవదూతలు అతనికి జ్ఞానాన్ని నేర్పించారు మరియు అతను అన్ని సృష్టిలలో ఉత్తముడిగా చేయబడ్డాడు. జహీరాబాద్‌లోని ఇస్లామిక్ సెంటర్ శాంతి నగర్‌లో జమాతే ఇస్లామీ హింద్ సౌత్ ఆధ్వర్యంలో “సీరత్-ఇ-నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) విప్లవం సందేశం” అనే అంశంపై జరిగిన బహిరంగ సభలో మౌలానా ఇజాజ్ మొహియుద్దీన్ వసీం హైదరాబాద్ ప్రసంగిస్తూ ఇలా అన్నారు: నేడు మానవులు ఒకరి రక్తానికి ఒకరు దాహం వేస్తున్నారని, అమాయక పిల్లలు మరియు మానవులు అధికారం మరియు బలం యొక్క అహంకారం కారణంగా ఊచకోత కోయబడుతున్నారని, మానవత్వాన్ని తొక్కిపెడుతున్నారని, పాలస్తీనా ప్రజల సంఘటనలు మరియు దృశ్యాలు ప్రతి కన్ను తడిపేస్తున్నాయని మరియు హృదయాలను కలచివేస్తున్నాయని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు, మానవ హక్కులను బిగ్గరగా ప్రకటించే మరియు మానవ హక్కులను ప్రకటించే మానవ హక్కుల సంస్థలు వాటిని ప్రకటించే వారి కళ్ళకు గంతలు కట్టాయి, అయితే విప్లవం కోసం ప్రవక్త జీవిత చరిత్ర సందేశం ఏమిటంటే, ఒక మానవుడిని చంపడం మొత్తం మానవాళిని చంపడమే, మరియు నల్లజాతీయుల కంటే తెల్లవారికి, అరబ్ లేదా విదేశీయుడు కానివారికి, లేదా రంగు, జాతి లేదా ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందినవారికి ఉన్న ఆధిపత్యం లేదు. దీని పవిత్రత ఏమిటంటే మానవులందరూ ఒక్కటే. హజ్రత్ ఉమర్ (రజి) జీవిత చరిత్రను ప్రస్తావిస్తూ, ఆ కాలపు ఖలీఫాను బెడౌయిన్ ప్రశ్నించిన సంఘటనను ఆయన చెప్పారు మరియు పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు, వారు కోరుకున్నది చేయగలరని కాదు అనే జవాబుదారీతనం భావనను ప్రస్తుతించారు. ఇది విప్లవ భావన. ప్రపంచంలో శాంతి మరియు శాంతిభద్రతలు నెలకొల్పబడటానికి ఈ గొప్ప విప్లవాత్మక సందేశాన్ని దేవుని సేవకులకు తెలియజేయాలని ఆయన నొక్కి చెప్పారు. మౌలానా ముఫ్తీ ముహమ్మద్ నజీర్ అహ్మద్ హసామి ఫిర్దౌస్ మసీదు శాంతి నగర్ ఖతీబ్ మరియు ఇమామ్ తన ప్రసంగంలో సీరత్ తయ్యబా యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత యొక్క అంశాలను హైలైట్ చేసి వాటిని అనుసరించాలని సూచించారు. జమాతే ఇస్లామీ హింద్ , నజీమ్ పాశ్చాత్య జిల్లా సంగారెడ్డి, ముహమ్మద్ నజీముద్దీన్ ఘోరీ కూడా మాట్లాడారు. సోదరుడు రెహాన్ఖురాన్ పవిత్ర ఖురాన్ పారాయణం మరియు వివరణ ద్వారా మరియు అమీర్ స్థానిక సయ్యద్ అబ్దుల్ రౌఫ్ సౌత్ పారాయణం మరియు వివరణతో కార్యక్రమం ప్రారంభమైంది మరియు అతిథులను స్వాగతించారు, ప్రోగ్రామ్ చర్య ముహమ్మద్ ఖ్వాజా నిజాముద్దీన్ నిర్వహించారు. సోదరుడు ముహమ్మద్ యాకూబ్ ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ముహమ్మద్ మొయినుద్దీన్ అసిస్టెంట్ నజీమ్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి, ముహమ్మద్ ఖైసర్ ఘోరి, అమీర్ లోకల్ నార్త్, సభ్యులు, కార్మికులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

పాట్నాలో జరిగిన CWC సమావేశానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T150112.860.wav?_=3

 

పాట్నాలో జరిగిన CWC సమావేశానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి

◆:- రాష్ట్ర ఆరోగ్య మంత్రితో కలిసి డాక్టర్ ఉజ్వల్ రెడ్డి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య మంత్రి శ్రీ దామోదర్ రాజ నరసింహ, జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డితో కలిసి ఈరోజు బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరైన తర్వాత హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నట్లు చూడవచ్చు.

మానసిక క్షోభతో పంచాయతీ కార్యదర్శులు.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T145225.445.wav?_=4

మానసిక క్షోభతో పంచాయతీ కార్యదర్శులు.

కలతప్పిన గ్రామాలు.. నిధుల్లేక లోపించిన పారిశుధ్యం.

కాంగ్రెస్ ప్రభుత్వంలో కలతప్పుతున్న బతుకమ్మ వేడుకలు..

గత కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మకు ప్రత్యేక శ్రద్ధ

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,రాష్ట్ర మాజీ సివిల్ సప్లైస్ చైర్మన్,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి గ్రామ పంచాయితీల కార్యదర్శులు,అధికారులు మానసిక క్షోభకు గురైతున్నారని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,రాష్ట్ర మాజీ సివిల్ సప్లైస్ చైర్మన్,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.అసమర్థత రేవంత్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవడం వలన నిధులు లేని గ్రామాలు కలతప్పాయన్నారు.పారిశుధ్యం లోపించిన పల్లెలు అధోగతి పాలవుతునాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.సద్దుల బతుకమ్మ,సదరా పండుగల నేపథ్యంలో అన్ని గ్రామాల్లో వేడుకల నిర్వహణ సజావుగా జరిగేందుకు తమ వంతు సహాయంగా సహకరించాలని బిఆర్ఎస్ శ్రేణులకు,మాజీ ప్రజా ప్రతినిధులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సరిపడ నిధులు గ్రామపంచాయతీలకు కేటాయించలేదని ఆరోపించారు.గ్రామాలలో బతుకమ్మ దసరా ఉత్సవాల ఏర్పాట్లకు నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు,అధికారులు మానసిక క్షోభకు గురైతున్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలో పంచాయితీ అధికారులు గ్రామాల్లోని ప్రజలతో చందాలు తీసుకొని పండగా ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలన వలన గ్రామపంచాయతీల అధికారులు అప్పులు తెచ్చి గ్రామాలలో పారిశుధ్య పనులు చేస్తున్నారని మరికొన్ని గ్రామాల్లో డీజిల్ కు డబ్బులు లేక పారిశుధ్య ట్రాక్టర్లను నడపడంలేదు.బ్లీచింగ్ పౌడర్,ఫాగింగ్ వీధిలైట్ల మరమ్మత్తులు పట్ల పట్టించుకునే వారేలేరని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.గ్రామ పంచాయితీలలో నిధులు లేక పారిశుధ్యం లోపించి కళతప్పడం ఒకవైపు ఐతే మరోవైపు బతుకమ్మ దసరా ఉత్సవాలకు చిల్లిగవ్వ లేకపోవడం సందండిత అధికారులు ఆందోళనకు గురవుతున్నారని పెద్ది పేర్కొన్నారు.గత బిఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపి బతుకమ్మ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా నిర్వహించినారని మాజీ ఎమ్మెల్యే పెద్ది
తెలియజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో కళతప్పుతున్న పల్లెల్లో,గ్రామాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,మాజీ ప్రజా ప్రతినిధులు,జెడ్పిటిసిలు, సర్పంచ్లు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పార్టీ నాయకత్వం.. బతుకమ్మ ఉత్సవాలలో తమవంతు సహాయంగా చురుగ్గా పాల్గొని ఏర్పాట్లు చేసి ఆడపడుచుల ఆశీర్వాదం పొందాలని ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

ఏండ్లు గడిచిన ఎస్సీ రిజర్వేషన్ కు నోచుకొని రాఘవరెడ్డిపేట గ్రామం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T144528.869.wav?_=5

 

ఏండ్లు గడిచిన ఎస్సీ రిజర్వేషన్ కు నోచుకొని రాఘవరెడ్డిపేట గ్రామం

గ్రామ పంచాయతీ పుట్టినప్పటి నుంచి ఎస్సీ రిజర్వేషన్ రాకుండా రాజకీయంగా దగా చేస్తుండ్రు.

దూడపాక శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్ నాయకుడు డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

రాజకీయ పదవులు అనుభవించడానికి మేము అర్హులం కాదా..? పంచాయతీ రిజర్వేషన్లు కేటాయించే అధికారులు ఈసారైనా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట గ్రామ సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ కు గ్రామాన్ని ఎన్నిక చెయ్యాలని
దూడపాక శ్రీనివాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకుడు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు రాఘవరెడ్డిపేట గ్రామపంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ కు నోచుకోలేదని, ఏండ్లు గడిచిన ఎందుకు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడం లేదని..? సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పదవులు అనుభవించడానికి మేము అర్హులం కాదా..? రాజకీయంగా దగాకు గురవ్వడమేనా…? ఎన్నికల్లో పంచాయతీ రిజర్వేషన్లు కేటాయించే అధికారులు తేల్చాలనీ వారు అన్నారు

ఓట్లు వేసే యంత్రాలుగానే కాదు పరిపాలన వ్యవస్థలో భాగమై రాజకీయ పదవుల్లో సైతం అవకాశాలు రావాలని పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కేటాయిస్తే, మేము పుట్టక ముందు నుంచి ఇప్పటివరకు తరతరాలుగా ఎస్సీ రిజర్వేషన్ రావడం లేదంటే ఎంత అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జనరల్ స్థానాలు వచ్చిన పోటీకి వచ్చే వారి కుల, ధన బలాలతో పోటీ పడే స్థాయిలో ఎస్సీ కులాల ప్రజలు లేరని, అందుకు ఈసారైనా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను తేల్చే అధికారులు తక్షణమే స్పందించి ఎండ్ల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి రాఘవరెడ్డిపేట గ్రామపంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

రాజకీయంగా అణిచివేతలే ఎదురైతే అభివృద్ధిలో కూడా అన్యాయమే జరుగుతుందని, వచ్చే నిధుల కానీ, సంక్షేమ అవకాశాలు మా వర్గాల ప్రజలకు అందకుండా పోతున్నాయని, మనల్ని గుర్తించే పరిస్థితే కనబడటం లేదని అన్నారు. అందుకు జిల్లా కలెక్టర్ ఆర్డీవో పంచాయతీ అధికారులు స్పందించి ఎస్సీ రిజర్వేషన్ వచ్చేలా మా గ్రామానికి సామాజిక న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ ఏర్పాటు చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T143941.329.wav?_=6

 

మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ ఏర్పాటు చేయాలి

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు మరోసారి వినతిపత్రం

జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

నర్సంపేట,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.అందుకు గాను బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు,నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్,కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఓబిసి చైర్మన్ ఓర్సు తిరుపతిల ఆధ్వర్యంలో సంఘం నాయకులతో కలిసి నర్సంపేట మున్సిపల్ కమిషనర్ భాస్కర్ కు మరోసారి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని నెహ్రూ పార్కు దగ్గర సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా జ్యోతిరావు పూలే జంక్షన్ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే దంపతుల జయంతి, వర్ధంతులతో పాటు పలు సామాజిక ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాని ఆ ప్రాంగణాన్ని జ్యోతిరావు పూలే జంక్షన్ గా నామకరణం చేయడం జరిగిందన్నారు. పూలే దంపతుల విగ్రహా ఏర్పాటు కోసం గత 2024 అక్టోబర్ 26 న మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చాన్నారు.కాగా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే మహానీయులైన జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ స్ధాపన ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి కురిమిల్ల రమేష్,జిల్లా యువజన సంఘం అధ్యక్షులు కడారి సురేష్ యాదవ్, చెన్నారావుపేట మండల అధ్యక్షులు బర్ల యాకయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ యూత్ అధ్యక్షుడు గోపగాని నాగరాజు గౌడ్, మంగిశెట్టి సారంగం, శీరంశెట్టి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు సహకరించిన బాధితులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T143001.704.wav?_=7

కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు సహకరించిన బాధితులు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు బాధితులు సహకరిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సెల్ 9849905923 నెంబర్ తెలిపారు ఈ మేరకు నష్టపోయే బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ సహకరించిన బాధితుడు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో రోడ్డు విస్తరణకు సహకరిస్తున్నామని బాధితుడు దన్నోజిరావ్ తెలిపారు

ఒకే కుటుంబానికి మూడు కార్పొరేషన్ లోన్లు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T133401.870.wav?_=8

 

ఒకే కుటుంబానికి మూడు కార్పొరేషన్ లోన్లు

★చూసి చూడనట్లు ఉంటున్న అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్:తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభివృద్ధి సంస్థ స్కీములకు ఒకే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే ఆర్థిక సహాయం అందుతుంది, అయితే జహీరాబాద్ నియోజకవర్గం లో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కార్పొరేషన్ లోన్లు అధికారులు మంజూరు చేశారు. ఈ పథకాలు సాధారణంగా ఒక కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం.ఒకేసారి ఆర్థిక సహాయం అందిన తర్వాత మళ్లీ తిరిగి ఐదు సంవత్సరాల వరకు ఆ కుటుంబానికి వర్తించదు కానీ అధికారులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు లోను మంజూరు చేయడంపై సార్వత్రిక ఉత్కంఠ నెలకొంది దీనిపై అధికారులు పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.ఒకే కుటుంబానికి చెందినవారు మూడు వేర్వేరు కార్పొరేషన్ల నుండి రుణాలు పొందడం అనేది సాధారణంగా నిబంధనలకు విరుద్ధం, దీనికి సంబంధించిన నిబంధనలు మరియు మార్గదర్శకాలను తెలుసుకోవడానికి మీరు సంబంధిత కార్పొరేషన్ కార్యాలయాలను సంప్రదించడం ఉత్తమం, ఎందుకంటే ఈ నియమాలు ఎప్పటికప్పుడు మారవచ్చు.

శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి అభిషేకo…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T132830.504.wav?_=9

 

శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి అభిషేకo
వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి పట్టణంలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు అమ్మవారికి అభిషేకం ధైర్యలక్ష్మీగా భక్తులకు దర్శనం ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ చైర్మన్ వ్యవస్థాపక ధర్మకర్త అయ్యలూ రిరఘునాథచార్యులు ఇ ఓ ఎస్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు .ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు నవరాత్రులలో అమ్మవారి కి అభిషేకము ఉంటుందని అమ్మవారికి ఒక్కరోజు అర్చన చేయించుకునే భక్తులు 100 రూపాయలు ఆలయంలో చెల్లించాలని వారు పేర్కొన్నారు మహిళలచే ప్రతి రోజు సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఉంటాయని వారు తెలిపారు 33 వార్డు మాజి కౌన్సిలర్ తిరుమల్ బీచుపల్లి యాదవ్ కట్టసుబ్బయ్య భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు

పి సి బి అధికారుల నిర్లక్ష్యం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T131410.024.wav?_=10

 

పి సి బి అధికారుల నిర్లక్ష్యం

◆:- దిగ్వాల్ గ్రామం లో కాలుష్య సంక్షోభానికి ఆజ్యం పోస్తోంది

పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ నుంచి విషపూరిత పొగ రావడం తో పిల్లలు మరియు పెద్దలు బాధపడుతున్నారు

◆:- ప్రజలు ప్రభుత్వ చర్యను కోరుతున్నారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

(టి ఎస్ ఐ టి) కాలుష్య నియంత్రణ మండలి (పిసిబీ) అధికారుల విస్తృత నిర్లక్ష్యం వల్ల పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ నుంచి వల్ల కలిగే తీవ్రమైన వాయు మరియు నీటి కాలుష్యం దిగ్వాల్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.పదేపదే తనిఖీలు చేసినప్పటికీ, పరిశ్రమ విషపూరిత వాయువులు మరియు ప్రమాదకర వ్యర్థాలను విడుదల చేస్తూనే ఉన్నాయి, దీనివల్ల స్థానికులు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు మరియు ఉబ్బసం బారిన పడుతున్నారు. దిగ్వాల్ తోపాటు వివిధ గ్రామాలు అనేక గ్రామాల్లో ,పిల్లలు దగ్గుతుంటారు, వ్యవసాయ భూములు ఎండిపోతాయి మరియు పశువులు చనిపోతాయి. పిసిబీ అధికారులు

 

ప్రజారోగ్యం కంటే కార్పొరేట్ లాభాలకు ప్రాధాన్యతనిస్తూ, పరిశ్రమ యజమానుల కీలుబొమ్మలు”గా మారారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రసాయన 54 మంది కార్మికులు మరణించిన తర్వాత కూడా, అధికారులు భద్రతా నిబంధనలను అమలు చేయడంలో విఫలమయ్యారు, కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు పిసిబీ నిర్లక్ష్యంపై విచారణ జరపాలని డిమాండ్లు పెరుగుతున్నాయి, ప్రజల ఆగ్రహం పెరుగుతోంది.. ప్రభుత్వం ఇప్పుడు చర్య తీసుకోవడంలో విఫలమైతే, ప్రజల జీవితాలు మాత్రమే కాకుండా ప్రభుత్వంపై ప్రజల నమ్మకం కూడా కూలిపోతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.పొగలు కక్కుతున్న దిగ్వాల్ పిరమల్ ఫార్మా కంపెనీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలు కాలుష్య నివా రణపై అధికారులు చర్యలు తీసుకున్నపటికీ మళ్ళీ కంపెనీ రాత్రి పగలు తేడా లేకుండా మళ్ళీ పొగ వద్ద లడం జరుగుతుంది దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దిగ్వాల్లో 100 ఎకరాల విస్తీర్ణంలో ఉ న్న ఈ ఫార్మా యూనిట్, గత 2018-19లో నీటి కాలుష్యం కారణంగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎ న్టీ) 2019లో రూ.8.31 కోట్ల జరిమానా విధిం చింది. ఈ జరిమానా రోజుకు రూ.60,000గా 1,3 86 రోజులకు వర్తించేలా నిర్ణయించారు.

 

PCB negligence, Digwal pollution, Piramal Pharma, toxic smoke, water pollution, villagers health issues, lung disease, skin disease, asthma, agriculture damage, cattle deaths, groundwater contamination, NGT fine, Telangana pharma hub, environmental crisis, villagers protest, corporate profits vs public health, government inaction

 

యూనిట్ చుట్టూ 1.5 కి.మీ. వరకు దక్షిణ దిశలో, తూర్పు, పడమర దిశల్లో 500 మీటర్ల వరకు భూమి, భూ గర్భ జలాలు మురికిపోయాయి. ఈ కాలుష్యం వల్ల రైతుల పొలాలు, పంటలు దెబ్బతిన్నాయి. గ్రామస్తు లు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలోని భూగ ర్భ జలాలు మురికిగా మారాయి. ఆ నీటతో పంట లు పెంచుకుంటే, పంటలు అన్నీ చెడిపోతున్నాయి. ఆ నీటను తాగడం, వల్ల చర్మ రోగాలు, గుండె సం బంధిత వ్యాధులు వచ్చాయి. రోజూ బాటిల్లో లో నీరు కొనుగోలు చేస్తున్నాం. ఇలా ఎంతకాలం?’ అని గ్రా మస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సగం మందికి పైగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా రు. 2005 నుంచే ఈ కాలుష్యం గురించి ఫిర్యాదు లు వచ్చాయి, కానీ పూర్తి నివారణ లేదు. 2025లో కూడా పరిస్థితి మారలేదు. యూనిట్ నుంచి ఉధృత పొగలు, రాత్రి పగలు తేడా లేకుండా పొగ విడుదల లు కొనసాగుతున్నాయి. ఇటీవల బయోమాస్ బ్రికె ట్లకు మారడం ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గించు కుంటున్నట్టు కంపెనీ ప్రకటించింది, కానీ స్థానికు లు దీన్ని కాగితం మీద మాటలు’గా చూస్తున్నారు. గ్రామంలోనే పిరమల్ ఆరోగ్య సేవా కేంద్రం ఉం ది, కానీ కొందరు దీన్ని కాలుష్యం చేసి, నీటి ఏటీలు (వాటర్ ఏటీలు) ద్వారా లాభపడటం’గా ఆరోపిస్తు న్నారు. రివర్స్ ఓస్మోసిస్ (ఆర్ఎ) టెక్నాలజీతో నీరు సరఫరా చేస్తున్నారని, ఇది కూడా పర్యావరణానికి హాని కలిగిస్తోందని పలువురు అంటున్నారు. గ్రామ ప్రజలు 2018లో యూనిట్ విస్తరణకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్లో ఆందోళన వ్యక్తం చేశారు. ‘మా గాలి, నీరు, నేల మీద హక్కు మాకే’ అనే నినాదా లతో ఆందోళన చేశారు.

 

తెలంగాణలో ఫార్మా హబ్ గా మారుతు న్నప్పటికీ, ఈ కాలుష్య సమస్యలు రాష్ట్ర విధానాల్లో లోపాల వల్లే పెరుగుతున్నాయని ఆక్టివిస్టులు ఆరోపి స్తున్నారు. ఈ సంఘటన పై స్పందించి అధికారులుమాకు న్యాయం చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిగ్వాల్ పిరమల్ పార్మా కంపెనీ విషపూరిత వ్యర్థాలను విడుదల చేయడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలు

కాలుష్య నివారణ చర్యలు ఎక్కడ?

కాలుష్య నియంత్రణ మండలి పిసిబి అధికారుల విస్తృత నిర్లక్ష్యం వల్ల దిగ్వాల్ పిరమల్ ఫార్మా కంపెనీ వల్ల కలిగే తీవ్రమైన వాయు మరియు నీటి కాలుష్యం నివాసితులు ఇబ్బంది. పడుతున్నారు. పదేపదే తనిఖీలు చేసినప్పటికీ, పరిశ్రమలు విషపూరిత వాయువులు మరియు ప్రమాదకర వ్యర్థాలను విడుదల చేస్తూనే ఉన్నాయి,
దీనివల్ల స్థానికులు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు మరియు ఉబ్బసం బారిన పడుతున్నారు, వ్యవసాయ భూములు ఎండిపోతాయి మరియు పశువులు చనిపోతాయి. పిసిబి అధికారులు ప్రజారోగ్యం కంటే కార్పొరేట్ లాభాలకు ప్రాధాన్యతనిస్తూ, పరిశ్రమ యజమానుల “కీలుబొమ్మలు”గా మారారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్య
కారక పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు పిసిలి నిర్లక్ష్యంపై విచారణ జరపాలని డిమాండ్లు పెరుగుతున్నాయి, ప్రజల ఆగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వం ఇప్పుడు చర్య తీసుకోవడంలో విఫలమైతే, ప్రజల జీవితాలు మాత్రమే కాకుండా ప్రభుత్వంపై ప్రజల నమ్మకం కూడా కూలిపోతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

‘‘హవాలా మార్గంలో’’..’’రిజిస్ట్రార్ల లంచాలు’’!?

`‘‘నేటిధాత్రి’’ చేతిలో వివిధ వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టిన ‘‘లంచావతారుల చిట్టా’’

`ఏసీబీ అధికారులకే చుక్కలు చూపిస్తున్న లంచావతారులు

`తెలివి మీరిపోయిన రిజిస్ట్రార్లు!?

`ఏసిబికి చిక్కకుండా కొత్త కొత్త పన్నాగాలు!

`చేతికి మట్టి అంటకుండా లంచాలు!

`మార్వాడీలతో రిజిస్ట్రార్ల స్నేహాలు.

 

 

`షాపింగ్‌ మాల్స్‌లతో ఆర్థిక లావాదేవీలు!

`అధికారుల లంచాలతో నడుస్తున్న షాపింగ్‌ మాల్స్‌?

`రిజిస్టార్ల కొత్త పోకడకు పరాకాష్ట.

`ఎంత మందిని పట్టుకుంటారో చూద్దాం!

`దొరికితే వరుసగా అందరం దొరికి పోదాం?

`ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత?

`మనమంతా లేకుండా శాఖ ఎలా నడుస్తుందో మనమూ చూద్దాం!

`కోర్టుకు వెళితే కొలువు అదే వస్తుంది?

`లీవ్‌ లో ఉన్న రిజిస్టార్లు వారి అనుచరులతో జరుపుతున్న చర్చలు?

`అందరం దొరికి పోతే పని చేసేటోడు ఎవడుంటాడో చూద్దాం?

`ప్రభుత్వానికే సవాలు విసురుతున్న రిజిస్ట్రార్లు?

`రిజిస్ట్రేషన్లు ఎలా చేసుకుంటారో!

`ఎవడొచ్చి చేస్తాడో చూద్దాం!?

`కొంతమందికి అగర్వాల్లు వీరికి అనుచరులు?

`చెప్పిన చోట ఇస్తారు? అందుకోవాల్సిన చోట అందుకుంటారు !

హైదరాబాద్‌, నేటిధాత్రి:
శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని పెద్దలు ఊరికే అనలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పరుల ఆటలు సాగడం లేదు. లంచాలు తీసుకోకుండా అధికారులు ఊరుకోలేరు. గతంలో బాజాప్తాగా లంచాలు తీసుకోవడం అలవాటైన ప్రాణాలు. ఒక్కసారిగా లంచాలు తీసుకోకుండా పనిచేయాలంటే వారికి చేతులు రావడం లేదు. ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చినా వారికి భయం లేదు. ఉద్యోగాలు పోతాయన్న భయం అసలే లేదు. ప్రభుత్వాదేశాలు లెక్క చేసేదేమిటన్నట్లు అవినీతి సాగిస్తూనే వున్నారు. లంచాలు తీసుకుంటూనే వున్నారు. ఓ వైపు నిత్యం పట్టుబడుతున్నా, అధికారుల్లో పెద్దగా చలనం లేదు. భయం అంతకన్నా లేదు. మహా అయితే ఏం జరుగుతుంది? నాలుగు రోజులు జైలుకెళ్తాం..అంతకు మించి జరిగేదేమీ వుండదు. ఉద్యోగమైతే పోయేది కాదు. ఎంత ఖర్చైనా సరే మళ్లీ ఉద్యోగం తెచ్చుకోవడం ఖాయం. అంతకు నాలుగు రెట్లు సంపాదించుకోవడం తధ్యమన్నట్లు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. అయితే నిత్య సంతర్పణలు సాగే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో మాత్రం గతానికి భిన్నంగా లంచాల దారి మళ్లింది. లంచాలు నేరుగా తీసుకోకుండా కొత్త మార్గం అన్వేషించారు. లంచాలు మానుకునే ప్రసక్తే లేదన్నట్లు రిజిస్ట్రార్లు తయారయ్యారు. ఇప్పుడు హవాలా మార్గం ఎంచుకున్నారు. ఏసిబి అదికారులు రావడం. రెడ్‌ హాండెడ్‌గా పట్టుకోవడం. జైలుకెళ్లడం..ఈ తిప్పలంతా లేకుండా లంచాలు తీసుకొని పని చేసే కొత్త దారి వెతుక్కున్నారు. తలనొప్పి తగ్గించుకున్నారు. భయపడుతూ సంతకాలు చేయాల్సిన పని లేకుండా చేసుకున్నారు. ఎందుకంటే పరిస్ధితులకు అనుగుణంగా మారాలి. లంచాలు తీసుకునే కొత్త దారిని వెతుక్కొవాలనుకున్నారు. మొత్తానికి సబ్‌ రిజిస్ట్రార్లు తెలివిమీరిపోయారు. ఏసిబికి చిక్కకుండా పన్నాగాలు పన్నుతున్నారు. చేతికి మట్టి అంటకుండా లంచాలు తీసుకుంటున్నారు. కనీసం అనుచరులకు కూడా తెలియకుండా చూసుకుంటున్నారు. సమాచారం ఎక్కడా లీక్‌ కాకుండా చూసుకుంటున్నారు. డబ్బులు ఎలా వస్తున్నాయి? ఎలా పోతున్నాయో కూడా తెలియకుండానే చేతులు మారేలా చేసుకుంటున్నారు. ఇచ్చేవాడికి, పుచ్చుకునే వాడికి తప్ప మూడో వ్యక్తికి తెలియనంత గుట్టు చప్పుడు కాకుండా లంచాలు తీసుకుంటున్నారు. కడుపు నిండా తింటున్నారు. కంటి నిండా నిద్రపోతున్నారు. తెల్లారి అక్రమైనా, సక్రమైన సరే రిజిస్ట్రేషన్లకు లంచాలు లేకుండా సంతకాలు చేయడం లేదు. గతం కాన్నా దర్జాగా లంచాలు తీసుకుంటున్నారు. గతాన్ని మించి వసూలు చేస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలను పీడిరచుకు తింటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రిజిస్ట్రార్లు పీక్కు తింటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలను లంచాల పేరుతో కాల్చుకుతింటున్నారు. ఇందుకు ఎంచుకున్న కొత్త దారి మార్వాడి. వాళ్లు ప్రజలకు కొత్త. తెలంగాణ ప్రాంతానికి కొత్త. విస్తరించిన అన్ని ప్రాంతాలలో తెలంగాణ ప్రజలతో సఖ్యత కొత్త. వారితో హైదరాబాద్‌లో బడాబాడా మార్వాడీలతో హవాల లావాదేవీలు మొదలు పెట్టారు. తెలంగాణలో మార్వాడీల చేతుల్లో వున్న షాపింగ్‌ మాల్స్‌ యజమానులకు నేరుగా లంచాల డబ్బు చేరేలా మార్గం వేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ శాఖలో వుండే ఉద్యోగుల్లో వుండే ఐక్యత మరే ఉద్యోగుల్లోనూ కనిపించదు. ఆ ఐక్యత మళ్లీ మార్వాడీల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇదే రిజిస్ట్రార్లను, మర్వాడీలను కలిపింది. ఒక మార్వాడీకి ఇబ్బంది వస్తే, మరో మార్వాడీ సాయం చేస్తాడు. ఒక రిజిస్ట్రార్‌కు సమస్య వస్తే రిజిస్ట్రార్‌లంతా ఏకమౌతారు. ఈ మధ్య ఓ రిజిస్ట్రార్‌ కూతురు పెళ్లి చేస్తే తెలంగాణలో వున్న రిజిస్ట్రార్‌లంతా కలిసి కట్నాల కింద లక్షల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. అంటే వారిలో వుండే ఐక్యతను అర్దం చేసుకోవచ్చు. తెలంగాణలో ఇటీవల పెద్దఎత్తున వెలుస్తున్న షాపింగ్‌ మాల్స్‌ కూడా ఉన్నత స్దాయి అదికారులు, రిజిస్ట్రార్ల లంచాల సొమ్ములతోనే వెలుస్తున్నాయి. నడుస్తున్నాయన్న విషయం తెలుస్తోంది. షాపింగ్‌ మాల్స్‌లకు అవసరమైన సరుకు కోసం లంచాల డబ్బును సమకూర్చుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇది తెలంగాణలో వున్న రిజిస్ట్రార్ల కొత్త పోడకు పరాకాష్ట అని చెప్పకతప్పదు. అంతే కాకుండా ఇలా ఏసిబీ అధికారులు పదే పదే తమపై నిఘా వల పెట్టడాన్ని సహించలేకపోతున్నారట. ఎలాగైనా పట్టుకోవాలన్న కసితో వున్న ఏసిబి అదికారులకు దొరకుండా ఎంత జాగ్రత్త పడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇలాగే నిత్యం నిఘా పెట్టి వేదిస్తే ఉద్యోగాలను వదులుకోవడానికి కూడా సిద్దమనే సంకేతాలు పంపాలన్న ఆలోచనలు చేస్తున్నారట. ఎంత మందిని పట్టుకుంటారో పట్టుకోండి? అనేలా ఏక కాలంలో కావాలనే అందరం దొరికిపోయే ప్లాన్‌ చేద్దామని కూడా అనుకుంటున్నారు. ఎంత తెలివి తక్కువ వాళ్లైనా ఇలా చేస్తారా? అనే అనుమానం చాలా మందికి వస్తుంది. కాని రిజిస్ట్రార్లలో స్టాటజీ మరో రకంగా వుంది. అందుకే దొరికితే వరసగా దొరికిపోదాం? ఉద్యోగమైతే ఎక్కడికిపోదు. తెలంగాణలో వున్న 140 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగులే అతి తక్కువ. అందులోనూ సబ్‌ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రార్లు అంత పట్టుబడితే పని చేసే వారుండరు. ఏకంగా శాఖనే స్ధంబించిపోతుంది. మనమంతా లేకుండా శాఖ ఎలా నడుస్తుందో చూద్దామనే దాక రిజిస్ట్రార్లు వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలో రిటైర్‌ అయ్యే అవకాశమున్న రిజిస్ట్రార్లను కావాలనే ఇరికించే కుట్రలు జరుగుతున్నాయని అనుమానపడుతూ కొంత మంది లాంగ్‌ లీవ్‌ పెట్టారు. వారి అనుచరులకు ఇన్‌చార్జిల బాధ్యతలు అప్పగించి వారి చేత పనులు పూర్తి చేయిస్తున్నారు. వచ్చే సంపాదనలో వాటలు తీసుకుంటున్నారు. అటు జీతాలు తీసుకుంటున్నారు. ఇటు లంచాలు తీసుకుంటున్నారు. అలా కూడా లంచాలు నేరుగా తీసుకోకుండా ఎక్కడిక్కడ కొందరు అగర్వాల్‌లను ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వారు వెళ్లి, కార్యాలయాల సమీపంలో వున్న మార్వాడీలకు ఇస్తారు. తర్వాత ఆ సొమ్మును మర్వాడీలు రిజిస్ట్రార్లకు ముట్ట జెప్పుతారు. అందుకు ప్రతి ఫలంగా తెలంగాణలోని అన్ని జిల్లాలు, పట్టణాలలో మార్వాడీలకు పెద్దఎత్తున భూములు కూడా రిజిస్ట్రేషన్ల కూడా చేసిపెడుతున్నట్లు తెలుస్తోంది. దసరా, దీపావళి పండుగ వేళల్లో తెలంగాణలో కొన్ని వేల కోట్ల బట్టల వ్యాపారం సాగుతుంది. అందులో షాపింగ్‌ మాల్స్‌లోనే ఎక్కువగా జరుగుతుంది. ఇక నుంచి ఏసిబి అధికారులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కాకుండా నేరుగా అన్ని షాపింగ్‌ మాల్స్‌ లావాదేవీలను పరిశీలిస్తే గుట్టంతా బైటకు వస్తుంది. మాల్స్‌ పెట్టుబడుల్లో వున్న పెద్ద పెద్ద అధికారులు, రిజిస్ట్రార్ల బాగోతమంతా వెలుగులోకి వస్తుంది. రిజిస్ట్రార్ల ఆట కట్టినట్లౌవుంది. ఇక నుంచి రిజిస్ట్రేషన్‌ కార్యాయాల మీద ఏసిబి రైడ్స్‌ చేసే సమయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనుకునే వారు కార్యాలయానికి వచ్చే ముందు ఎక్కడికి వెళ్లి వస్తున్నారో నిఘా పెడితే మొత్తం అవినీతిని జల్లడపట్టినట్లౌవుంది.

నూతన తహసీల్దార్ గా భాద్యతలు స్వీకరణ…

నూతన తహసీల్దార్ గా భాద్యతలు స్వీకరణ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

గుండాల మండల నూతన తహసీల్దార్ గా ఖాసీం బుధవారం బాధ్యతలను స్వీకరించారు . నూతన తహసీల్దార్ ఖాసీం ను తహసీల్దార్ ఆఫీస్ స్థాఫ్ సన్మానించి, స్వాగతం పలికారు.

బాలానగర్ పోలీస్ స్టేషన్ తనిఖీ…

బాలానగర్ పోలీస్ స్టేషన్ తనిఖీ

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

బాలానగర్ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను జోగులాంబ గద్వాల జిల్లా జోన్ +7 రేంజ్ డీఐజీ ఎల్.ఎస్ చౌహన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు క్రమశిక్షణతో సమయపాలనతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలు తెలుసుకొని పక్షమే స్పందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో రికార్డుల నిర్వహణ పరిశుభ్రత కేసుల దర్యాప్తు నాణ్యత పై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున గౌడ్, ఎస్సైలు లెనిన్, శివానందగౌడ్, శివ నాగేశ్వర్ నాయుడు, ఏఎస్ఐలు సుజ్ఞానం, గోపాల్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు వెంకటేష్….

ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు వెంకటేష్

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండల ఆర్య వైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలలో భాగంగా యాంసాని వెంకటేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
దీనిలో భాగంగా ప్రధాన కార్యదర్శి కొంరవెల్లి రమేష్, కోశాధికారి కేశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వెల్లంకి వేణుగోపాల్,దోమకుంట్ల శ్రీకాంత్ లను జిల్లా అధ్యక్షులు తోట సురేష్ ప్రధానకార్యదర్శి దొడ్డ మోహన్ రావు,కోశాధికారి శ్రీరామ్ రవీందర్ వర్కింగ్ ప్రసిడెంట్ వేణిశెట్టి రఘు ఎన్నికల అధికారులు కొనిశెట్టి మునిందర్ పబ్బతి నాగభూషణం వారి ఆధ్వర్యంలో నడికూడ మారుతీ గార్డెన్స్ లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మీటర్లు మంజూరు చేయాలి…

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మీటర్లు మంజూరు చేయాలి
…మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్, సెప్టెంబర్ 24, నేటి ధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరి లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.బుధవారం రాయికల్ పట్టణం పర్యటనలో భాగంగా ఇందిరమ్మ లబ్ధిదారులు తాము ఇంటి నిర్మాణం చేపడుతున్నామని విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేసుకోగా విద్యుత్ శాఖ అధికారులు ఆంక్షలు పెడుతున్నారని విద్యుత్ మీటర్ల మంజూరు చేయించాలని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మాజీమంత్రి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సత్వరం స్పందించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంబంధిత జగిత్యాల జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారి సుదర్శనం,రాయికల్ విద్యుత్ శాఖ ఏఈ నవీన్ తో చరవాణిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విద్యుత్ మీటర్ల సమస్యను అడిగి తెలుసుకున్నారు.నిరుపేదలైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు విద్యుత్ మీటర్ల మంజూరుకై నిబంధనలలో సడలింపుతో అర్హులైన వాళ్లకు విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, నాయకులు కొయ్యేడి మహిపాల్,బాపురపు నర్సయ్య,షాకీర్,బత్తిని భూమయ్య, దాసరి గంగాధర్,రాకేష్,సింగని రమేష్,రాజారెడ్డి,కొమ్ముల ఆదిరెడ్డి,ఏలేటి జలంధర్ రెడ్డి,కొత్తపెళ్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక వసతుల కోసం మున్సిపల్ కమిషనర్ కు వినతి…

ప్రాథమిక వసతుల కోసం మున్సిపల్ కమిషనర్ కు వినతి

రాయికల్, సెప్టెంబర్ 24, నేటి ధాత్రి:

 

మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో గల 3వ వార్డ్ శివాజీ నగర్ కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్ కి వినతి పత్రం సమర్పించారు.వార్డులో ఇప్పటికీ సి.సి. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు లేకపోవడంతో వర్షాకాలంలో బురద, మురుగు సమస్యలు అధికమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు లేకపోవడం వలన రాత్రివేళ బయటకు వెళ్ళడం కష్టమవుతోందని నివాసులు తెలిపారు.చిన్నపాటి వర్షానికి బురదమయమై పాఠశాలకు వెళ్లే విద్యార్థుల వ్యాన్లు, టాక్సీలు మట్టిలో దిగబడుతున్నాయని,కనీస సౌకర్యాలు కల్పించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సి.సి. రోడ్లు, డ్రైనేజీ పనులు త్వరితగతిన చేపట్టాలని వారు కమిషనర్‌ను కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వారితో మాట్లాడుతూ.. రాయికల్ పట్టణంలో ఎక్కడెక్కడ సిసి రోడ్డు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల అవసరాలు ఉన్నాయో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.వినతి పత్రం సమర్పించిన వారిలో గంగవ్వ,మానస,రమ,జ్యోతి, లక్ష్మి,లత,జయసుధ,పద్మ, రజిత,శ్వేత తదితరులు ఉన్నారు.

error: Content is protected !!
Exit mobile version