గ్రామంలో తాగునీటి పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలో తాగునీటి పైప్ లైన్ మరమ్మత్తు పనులను సర్పంచ్ రాజు ఆదివారం పర్యవేక్షించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు. ఈ మరమ్మత్తులు గ్రామంలోని ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరాను అందించే లక్ష్యంతో చేపట్టబడ్డాయి. ప్రజలను నీకే సౌకర్యంతో పాటు స్తంభాలకు విద్యుత్ దీపాలు మురికి కాలువ పరిశుభ్రం చేయుట కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి సమస్య పరిష్కరిస్తామన్నారు,
మాజీ స్పీకర్ కు నివాళి అర్పించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీ పాదరావు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించగా, కలెక్టర్ గరీమ అగర్వాల్ .. హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్ర పటానికి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రాందాస్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
`సీఎం రేవంత్ రెడ్డి మూలంగానే సాధ్యమౌతుందంటున్న విశ్లేషకులు.
`తెలంగాణ లో ప్రత్యర్థి పార్టీలకు చోటు లేకుండా చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి.
`ఎంతో బలంగా ఉందనుకున్న బీఆరఎస్ ను ముప్పు తిప్పలు పెడుతున్నాడు!
`దేశమంతా వెలుగుతున్న బీజేపీ ని ఎదగకుండా చేస్తున్నాడు!
`ప్రాంతీయ పార్టీ గా బీఆరఎస్ కు బలం ఉన్నా బీజేపీ కి చోటు లేకుండా చేస్తున్నాడు.
`మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ ప్రభావం ఉంటుందని అందరూ అనుకున్నారు!
`జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ రాకుండా చేశాడు.
`పంచాయతీ ఎన్నికలలో పల్లెల్లో కూడా బీజేపీ లేదని నిరూపించాడు.
`మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ ని ముందుకు రాకుండా కట్టడి చేశాడు.
`ప్రధాని మోడీ వచ్చి మోరీలు బాగుచేస్తాడా అని సంచలన వ్యాఖ్యలు సీఎం రేవంత్ చేశారు.
`ఒక్క మాటతో బీజేపీ పరువు మొత్తం తీశాడు.
`మున్సిపాలిటీలకు కేంద్రం చేసేదేమి లేదని చెప్పకనే చెప్పాడు.
`బీజేపీని కోలుకొని దెబ్బ తీశాడు.
`పల్లె, పట్టణాలకు కేంద్రం నిదులే అని బీజేపీ చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టాడు!
`తెలంగాణా సెక్యూలర్ రాష్ట్రమని నిరూపించి కాంగ్రెస్ ను గెలిపించుకున్నాడు.
`రేవంత్ రెడ్డి రాజకీయం అర్ధం కాకా బీఆరఎస్, బీజేపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాల్లో ఎదురులేని నాయకుడుగా సిఎం. రేవంత్ రెడ్డి ప్రఖ్యాతిగాంచారని చెప్పకతప్పదు. పార్టీని పదేళ్ల తర్వాత కష్టపడి అదికారంలోకి తీసుకురావడమే కాదు, ఆ పార్టీని కూడా తెలంగాణలో ఎదరులేని పార్టీగా, తిరుగులేని పార్టీగా సిఎం. రేవంత్ బలోపేతం చేస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచినప్పటికీ, ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తూ మరింత బలమైన పునాదులు వేస్తున్నారు. రేవంత్! నిజం చెప్పాలంటే ప్రతిపక్షాలకు ఇవి తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలుగా మారిపోయాయి. ఇదే సందర్భంలో ప్రతి ఎన్నికల్లో బిఆరఎస్ ఆశలన్నీ పదే పదే గý్లంతు! చేస్తూ దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. బిఆరఎస్‌లో ఎన్నికలంటే భయం పుట్టేలా చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ముందు ఎన్నికలంటే బిఆరఎస్ కాలు దువ్వుతూ వుండేది. ఎప్ప్పుడైతే జూబ్లీహిల్స్ బిఆరఎస్ కోల్పోయిందో అప్పటి నుంచి ఎన్నికలంటే ఆ పార్టీకి భయం పట్టుకునేలా చేశారు. దాంతో జూబ్లీహిల్స్ ఎన్నికల ముందున్న జోష్ బిఆరఎస్ లేకుండాపోయింది. దాని వెంటనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లోనూ సిఎం. రేవంత్ ఒంటి చేత్తో గెలిపించారు. ఆ ఎన్నికల్లో గులాబీ మరింత వాడిపోయింది. ఆ వెంటనే జరిగిన మున్సిపల్ ఎన్నికలతో ముందుకు వెళ్తుందనుకున్న కారు అక్కడే ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా పార్లమెంటు ఎన్నికలతో బిఆరఎస్ మరింత పతనానికి ముహూర్తం బలంగా పడిండి. ఇకపోతే తెలంగాణలో బిజేపికి జనం ఆదరణ బాగా కరువైందనే చెప్పాల. పార్లమెంటు ఎన్నికల్లో మోడీ మానియాతో ఎంపిల గెలుపు సాద్యమైంది. కాని సొంతంగా బలమున్న నాయకులు ఎవరూ లేరనేది పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలతో తేలిపోయింది. కేవలం పార్టీ పేరుతోమాత్రమే రాజకీయాలు చేస్తున్నారనే విషయం అర్దమైపోయింది. పైగా పార్టీ పెద్దల ఆశీస్సులతోనే ఆ పార్టీ నాయకులు పదవులు పొందుతున్నారు. బిజేపి నాయకులు ఈ రెండున్నరేళ్ల కాలంలో చేసిన ప్రజా ఉద్యమాలులేవు..ప్రజలకు చేరువయ్యింది లేదు. పైగా ఎనమిది మంది ఎంపిలలో ఐక్యత లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ గ్రాఫ్ రాకెట్‌లా దూసుకుపోతోంది. వరుస విజయాలతో కార్యకర్తలకు మంచి కిక్ వస్తోంది. పంచాయితీ ఎన్నికలకు ముందు కార్యకర్తలు భయపడ్డారు. సిఎం. రేవంత్‌రెడ్డి ఆత్మవిశ్వాసంతో ముందుకొచ్చారు. ఇప్ప్పుడు ఎన్నికలంటే సై అంటే సై అంటున్నారు. ఒక పార్టీ బలపడాలన్నా, నీరు గారిపోవాలన్నా ఆ పార్టీకి చెందిన నాయకుల ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమని సిఎం. రేవంత్‌రెడ్డి పదే పదే నిరూపిస్తున్నారు. నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కార్యకర్తలకు ధైర్యం నింపుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తనకు ఎదురులేదని నిరూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తన నాయకత్వంలో తెలంగాణలో తిరుగులేకుండా చేస్తున్నారు. అన్ని పార్టీలను ప్రజల దీవెనతో తొక్కేస్తున్నారు. ఒక రకంగా లేవకుండా చేస్తున్నారు. తన రాజకీయ విజయాల పరంపర కొనసాగిస్తున్నారు. తాను ఏం చేయదల్చుకున్నారో అదే చేస్తున్నారు. ప్రజలను తన వైపు తిప్ప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు చెప్పి కాంగ్రెస్‌ను గెలిపించారు. నాయకులందరినీ ఏక తాటి మీదకు తెచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారు. ఇక్కడ సిఎం. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఎదిగిన తీరు కూడా ఒకసారి మననం చేసుకోవాలి. ఆనాడు ఆయనను పార్టీలో నెగలనిస్తారా? అని అందరూ అనుకున్నారు. సీనియర్లతో సర్ధుకుపోగలరా? వారిని మెప్పించగలరా? అని కూడా అనుకున్నారు. అందరి ఆలోచనలు సిఎం.రేవంత్‌రెడ్డి పటాపంచెలు చేశారు. మంత్రి కోమటి రెడ్డి, ఆయన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఇటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యేజగ్గారెడ్డి, మరో మాజీ ఎంపి. మదుయాష్కీగౌడ్, సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు లాంటి వారు రేవంత్‌ను ముందుకు వెళ్లకుండా, వెనక్కి రాకుండా రాజకీయాలు చేశారు. అయినా రేవంత్ రెడ్డి అన్నీ దిగమింగుకున్నారు. జగ్గారెడ్డి లాంటి వారు ఎన్ని మాటలన్నా , సోదర సమానులు అంటే అందులో తప్ప్పులేదులే సుర్ధుకుపోయారు. మొత్తం మీద ఎన్ని అవాంతరాలు పార్టీలో ఎదురైనా సరే పార్టీని గట్టెక్కించారు. గెలిపించారు. సిఎం. అయ్యారు. అప్ప్పుడు కూడా ఎక్కడో రాజకీయ విభేదాలు కనిపిస్తూనే వున్నాయి. కాని రాను రాను సిఎం. రేవంత్‌రెడ్డి రాటుదేలిన విదానం సామాన్యమైంది కాదు. ఇప్ప్పుడు తెలంగాణలో అత్యంత బలమైన రాజకీయ నాయకుడుగా సిఎం. రేవంత్‌రెడ్డి ఎదిగారు. కాంగ్రెస్‌పార్టీని అన్ని ఎన్నికల్లోనూ గెలిపిస్తూ వస్తున్నారు. రాజకీయ చాణక్యం చూపిస్తున్నారు. ఇప్పటికీ అనేక రకాల విమర్శలు ఆయన ఒక్కడే ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షం నుంచి రేవంత్ మీద వస్తున్న ఆరోపణలకు ఏ ఒక్క మంత్రి సమాదానం చెప్పరు. ప్రతిపక్షాన్ని కౌంటర్ చేయరు. ప్రతిపక్షాలు కూడా ఏ ఒక్క మంత్రిపై విమర్శలు చేయరు. అటు బిజేపి అయినా, ఇటు బిఆరఎస్ అయినా సరే టార్గెట్ ఒక్కరే. సిఎం. రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా సాగే రాజకీయాలే. అయినా వాటిని ఒకే ఒక్కడుగా ఎదుర్కొంటున్నారు. ఎదురొడ్డి నిలుస్తున్నారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి ఆక్సీజన్ అందిస్తూ సిఎం. రేవంత్ ముందుకు సాగుతుంటే , ఆ కుర్చీ కోసం ఎదురుచూస్తున్న నాయకులు అరడజను వున్నారు. ఆ విషయం సిఎం.రేవంత్‌రెడ్డికి తెలుసు. అందుకే ఏ ఇతర నాయకుడు తన స్దాయికి రాకుండా చూడా సిఎం. రేవంత్ చూసుకుంటున్నాడు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం, నిర్ధేశం ఆయనే చూసుకున్నారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలను తన భుజనా మోశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవలేమని కాంగ్రెస్‌నాయకులే చేతులెత్తేసిన జూబ్లీహిల్స్‌ను గెలిపించుకున్నారు. వరుసగా వారం రోజుల పాటు ప్రచారం చేసి, జనం నాడినీ కాంగ్రెస్ వైపు తిప్ప్పుకున్నారు. ఒక వేళ గెలిస్తే అదే గొప్ప అనుకునే సందర్భం నుంచి 25వేల మెజార్టీని తెచ్చేలా చేశారు. రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగడానికి ముందు అసలు కాంగ్రెస్‌కు ఆశలే లేవు అనే దశ నుంచి ఊహించని మెజార్టీతో గెలిచే దాకా కషిచేశారు. పంచాయితీ ఎన్నికలా కష్టం. ఓ వైపు ఎరువులు అందక రైతులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇప్ప్పుడు ఓట్లు అడిగితే కొడతారు? అనే దశలోనే ఎన్నికలకు వెళ్లి, మెజార్టీ సర్పంచ్‌లు గెలిపించుకున్నారు. పాజిటివ్ టాక్ వున్నప్ప్పుడు గెలిపించుకోవడంలో ఏం మజా వుంటుంది? అనుకున్నారో ఏమో? గాని ముందుకెళ్లారు. అయితే సిఎం.రేవంత్‌రెడ్డికి తెలుసు. రైతులు తెలంగాణలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనందంగానే వున్నారన్న నమ్మకం వుంది. బిఆరఎస్ పార్టీ పనిగట్టుకొని చేసే ప్రచారమంతా వాట్సాప్, సోషల్ మీడియాలోనే వుందని ఆయన గ్రహించారు. ఎన్నికలకు వెళ్లారు. బిఆరఎస్‌ను జనమే ముంచేశారు. రైతులే బిఆరఎస్‌ను ఆదరించలేదు. అంతే ధైర్యంగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లారు. అందరూ అనుమానించారు. ఆరు గ్యారెంటీలు సమస్యలౌతాయనుకున్నారు. కాని ఏం జరిగింది. ఇప్ప్పుడు కూడా ఆ ఎన్నికలను సిఎం. రేవంత్ రెడ్డి ఒక్కరే భుజాల మీద మోశారు. 90శాతం మున్సిపాలిటీలు గెలిపించుకున్నారు. ఆఖరుకు హంగ్‌ను కాంగ్రెస్ అనుకూలం చేశారు. తెలంగాణలో ఎదరులేని నాయకుడుగా రేవంత్‌రెడ్డి ఎదిగారు. దటీజ్ రేవంత్ అని అనిపించుకుంటున్నారు. అదిష్టానం కూడా రేవంత్ రాజకీయాన్ని చూసి ఆశ్చర్యపోతోంది. అబ్బురపడుతోంది.
· దిగువ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన సీబీఐ
· వెంటాడుతున్న మనీలాండరింగ్ కేసు
· బీఆరఎస్ నాయకత్వంతో తీవ్ర విభేదాలు
· అన్నను, బంధువులను దూరం చేసుకుంటున్న కవిత
· ఒకపక్క న్యాయపోరాటం మరోపక్క కొత్త పార్టీ నిర్మాణం
· కేసీఆర్‌ను ధిక్కరించి వెళ్లిన నాయకులు ఎవరూ ఎదగలేదు
· కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఇంకా త్రిశంకు స్వర్గంలోనే
· కవిత నిర్ణయం ఎంతవరకు సమంజసమో కాలమే తేల్చాలి
హైదరాబాద్, నేటిధాత్రి:
దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి, సీబీఐ పేర్కొన్న 23 నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ స్పెషల్ రోజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేందర్‌సింగ్ ఫిబ్రవరి 27నతీర్పు చెప్పడం, ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేయడం వెంట వెంటనే జరిగిన పరిణామాలు. ఈ కేసులో “సౌత్ గ్రూప” అని సీబీఐ పేర్కొనడాన్ని న్యాయ మూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. అసలు సరైన ఆధారాలు లేకుండా కేసు పైల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, ఒక ప్రాంతానికి వర్తించేలా పేర్కొనడం సరైంది కాదని స్పష్టం చే స్తూ, ఈ కేసు విచారించిన సీబీఐ అధికారిపై శాఖాపరమైన విచారణ జరపాలని ఆదేశించడం తీర్పులోని కీలక పరిణామం. కాగా రోజ్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన వారిలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత కూడా వున్నారు. దిగువ కోర్టులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ దీనికి సంబంధించిన మనీలాండ రింగ్ కే సు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. ప్రస్తుతం ఈడీ విచారిస్తున్న మనీలాండరింగ్ కేసుకు ఆధారంగా పనిచేసే సీబీఐ దాఖలు చేసిన “ప్రిడికేట్ అఫెన్స” కేసును ప్రత్యేక రోజ్ అవెన్యూ కోర్టు కొట్టేయడంతో ఈడీ విచారణ బలహీన పడే అవకాశముంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం మనీలాండరింగ్ కేసు నిలబడా లంటే ముందు ఒక “షెడ్యూల్ నేరం” (ముందస్తు నేరం) జరిగివుండాలి. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసిందని భావించాలి. ఇదిలావుండగా తాజా తీర్పు కల్వకుంట్లకవితలో పూర్తి ఉత్సాహాన్ని నింపిందన్నది సుస్పష్టం. తాను ఏ తప్పు చేయలేదని, ఈ కేసులో కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్తానని గతంలో చెప్పినట్టే జరిగిందని ఆమె తన అభిమానులకు ఆనందంగా చెప్పడం సహజమే. 2025 సెప్టెంబర్‌లో ఆమె బీఆరఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన తర్వాత, తాను వచ్చే మే నెలలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తాను తిరిగి బీఆరఎస్‌లో చేరే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. తాను న్యాయపోరాటం చేస్తున్న సమయంలో తన సోదరుడు కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యు లు తనను ఒంటరిగా వదిలేశారని ఆరోపించారు. అంతేకాదు లిక్కర్ స్కామ్ వల్లనే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందని పేర్కొన్న కేటీఆర్ సోషల్ మీడియా పోస్ట్‌ను కవిత తీవ్రంగా వ్యతిరేకించారు. ఓటమికి పార్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈవిధమైన ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పార్టీ నిర్లక్ష్య విధానాలు, అహంకారం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులకు తిరిగి పార్టీ టిక్కెట్లు ఇవ్వడం ఇందుకు ప్రధాన కారణమని ఆమె ఎదురుదాడికి దిగారు. తాను జైల్లో వున్నప్పుడు కేసీఆర్ లేదా కేటీఆర్‌లు తనకు మద్దతుగా ఒక్క ప్రకటన కూడా చేయలేదని, బీఆరఎస్ సోషల్ మీడియా టీమ్ తనపై దుష్ప్రచారం చేసినప్పుడు వీరు కనీసం ఒక్కమాట కూడా మాట్లాడలేదని గుర్తుచేశారు. అందువల్లనే సొంత పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. అయితే ట్రైల్ కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చినా ఇప్పుడు సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేయడంతో, ఈ కేసుకు సంబంధించి న్యాయపోరాటం ముగిసినట్టు కాదన్నది స్పష్టమైంది. రేపు హైకోర్టు తీర్పు ఎట్లా వస్తుందనే దానిపై కల్వకుంట్ల కవిత రాజకీయ భవి తవ్యం ఆధారపడివుంటుంది. ప్రస్తుతానికైతే తాను స్వచ్ఛంగా బయటకు వచ్చానని ప్రచారం చే సుకోవడానికి కవితకు వీలుకలిగింది. ఇప్పుడు రాజకీయంగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి గతంలో తాను ఆరోపణలు చేసిన హరీష్‌రావు, సంతోష్‌రావులపై దాడులను కవిత మరింత ఉధతం చేయవచ్చు. కేసీఆర్‌కు తెలి యకుండా వీరు పెద్దఎత్తున అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నారని ఆమె గతంలో ఆరోపించారు. అంతేకాదు హరీష్‌రావు, సంతోష్‌రావులిద్దరూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చేతులు కలిపి, తనను, తండ్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసారని కూడా ఆరోపించారు. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ తెలిపిన శుభాకాంక్షలకు ఆమె పెద్దగా స్పందించకపోవడం గమనార్హం.అం తేకాదు, వచ్చే మేనెలలో “సామాజిక తెలంగాణ”, “యువత సాధికారత” ప్రాధాన్యతగా కొత్త పార్టీని పెట్టబోతున్నట్టు ప్రకటించడం ద్వారా ఆమె బీఆరఎస్‌పై రాజకీయ యుద్ధాన్ని ప్రకటించినట్లయింది. ఒకవేళ హైకోర్టులో కూడా తీర్పు అనుకూలంగా వస్తే ఆమెలో ఆత్మవిశ్వాసం మరింత ఇనుమడించి, “‘నైతిక విజయం” పేరుతో ఆమె ప్రజల్లోకి మరింతగా వెళ్లడానికే ప్రయత్నిస్తారు. అంతేకాదు బీఆరఎస్‌లోని అసంతప్తులు ఆమె పెట్టే కొత్తపార్టీవైపు మొగ్గుచూపే అవకాశముం టుంది. అంతేకాదు ఇక తన బంధువు హరీష్‌రావును నేరుగా ఢీకొనేందుకు సిద్దిపేట లేదా బోధన్ నుంచి వచ్చే ఎన్నికల బరిలో దిగే అవకాశాలున్నాయి. ఈ రెండు స్థానాలు హరీష్‌రావుకు పెట్టని కోట వంటివి! అంతేకాదు బీఆరఎస్ లీగల్ మెషినరీ సహాయం లేకుండా ఆమె హైకోర్టులో విజయం సాధిస్తే ఇక బీఆరఎస్‌కు, తన తండ్రి నాయకత్వానికి పూర్తిగా బ్రేకప్ చెప్పినట్టే అవు తుంది. కానీ ప్రస్తుతానికి ఈడీ కేసు కొనసాగుతుండటం, హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తాను పూర్తిగా కడిగిన ముత్యమని ప్రచారం చేసుకొనే వీలు కవితకు వుండదు. అంటే న్యాయపరమైన విచారణ నుంచి విముక్తి పొందినట్టు కాదు! ఒకవేళ హైకోర్టులో కవిత కు అనుకూలంగా తీర్పు వచ్చినా, సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలే ఎక్కువ! అందువల్ల కవిత రాజకీయ భవితవ్యం ఇంకా కొన్నేళ్లపాటు సందిగ్ధంలో కొనసాగక తప్పదు. ప్రస్తుతం కేసు హైకోర్టులో వున్నందువల్ల “ప్రిడికేట్ అఫెన్స” చట్టపరంగా మళ్లీ యాక్టివ్‌గా వున్నట్టే భావించాలి. ఇటువంటి పరిస్థితిలో కవిత కొత్త పార్టీని ప్రకటించినా, తటస్థ ఓటర్లను లేదా విశ్వసనీయ నాయకులను పార్టీకి అనుకూలంగా మలచుకోవడం కష్టం. తన ఆర్థిక వనరులను పూర్తిగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటాలకే వెచ్చించాల్సి రావచ్చు. ఇది క్షేత్రస్థాయిలో ఆమె పెట్టాలనుకుంటున్న “సామాజిక తెలంగాణపార్టీకి” అవరోధంగా మారగలదు. ఒకవేళ హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే ఆమెను పార్టీనుంచి సస్పెండ్ చేయడం న్యాయమైన చర్యగా బీఆరఎస్ (కేటీఆర్, హరీష్‌రావు) ప్రచారం చేయవచ్చు. ముఖ్యంగా ఈ అవినీతి కార ణంగానే ఆమెను పార్టీనుంచి సస్పెండ్ చేశామని వీరు సమర్థించుకోవడం మొదలుపెడతారు. ఇక కాంగ్రెస్, బీజేపీ నాయకులు వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేయడం వల్ల, కవిత కోరుకుంటున్న రాజకీయంగా “క్లీన్ ఇమేజ” దెబ్బతినే ప్రమాదముంది. ఇక ఈ న్యాయప్రక్రియ పూర్తయ్యే సరికి సంవత్సరాలు గడిచిపోవడంవల్ల అప్పటివరకు “నిందితురాలు” అనే పేరును భారంగా మోయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ నేరం రుజువై శిక్ష పడితే పొలిటికల్ కెరీర్ దెబ్బతినవచ్చు. ప్రస్తుతానికి ఆమె “తెలంగాణ గొంతుకను నొక్కేయడానికే” కేంద్రం కుట్ర పన్నుతోంద న్న అంశాన్నే ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. విచిత్రమేమంటే రెండు విభిన్న కేసుల్లో జైళ్లకు వెళ్లినప్పటికీ కవితకు, డీఎంకే నాయకురాలు కనిమెళి అనుభవాల్లో కొన్ని సారూప్యతలు కనిపించడం గమనార్హం. కవిత లిక్కర్ కేసుకు సంబం ధించి రూ.100 కోట్ల స్కామ్‌లో అభియోగాలు ఎదుర్కొనగా, కనిమొళి తమ కుటుంబానికి చెందిన కలైగ్నార్ టీవీకి సంబంధించి రూ.200 కోట్ల స్కాంలో అభియోగాలు ఎదుర్కొన్నారు. కవిత 5నెలల పాటు తిహార్ జైల్లో గడపగా, కనిమొలి ఆర్నెల్లు ఇదే జైల్లో వున్నారు. అంటే న్యాయపరం గా వీరు ఎదుర్కొన్న సమస్య ఒక్కటే అయినా, కనిమొళి డీఎంకేకు పూర్తి విధేయంగా వున్నారు. అదే కవిత బీఆరఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. తిహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత కనిమొళికి ఆమె సోదరుడు స్టాలిన్ ఘనంగా స్వాగతం పలికారు. తర్వాతి కాలంలో ఆమెను లోక్‌సభకు పంపడం ద్వారా ప్రమోషన్ లభించింది. ఆవిధంగా ఆమెకు రాజకీయ సానుకూలత ఏర్పడింది. 2017 లో కనిమొళిని సీబీఐ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. కానీ కవిత పరిస్థితి పూర్తి భి న్నం. సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పుడు పార్టీ సపోర్ట్ లేదు. పైగా తన అన్నపైనే తీవ్రవిమర్శలు చేశారు. హరీష్‌రావు, సంతోష్‌రావులపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. అందువల్ల ఆమె రాజకీ యంగా ఒంటరి పోరాటం చేయకతప్పదు. ఇదే సమయంలో లీగల్ పోరాటం ఇంకా ముగియలేదు. అందువల్ల తాను “కడిగిన ముత్యం” అని పూర్తిస్థాయిలో ప్రచారం చేసుకోవడం న్యాయపోరాటం పూర్తయ్యే వరకు కొంచెం ఇబ్బందికరమే! అయితే తన పార్టీ నిర్మాణం విషయంలో ఇప్పటికే కవిత ప్రశాంత్ కిషోర్‌ను చాలాసార్లు సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. పోయిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమె సంస్థ తెలంగాణ జాగతి దాదాపు 40 మున్సిపల్ వార్డు స్థానాల్లో మద్దతు పలుకగా, వారు విజయం సాధించడంతో, ప్రజల్లో తనకు అభిమానం పెరుగుతున్నదన్న ఉద్దేశంతో కవిత వున్నారు. కానీ గతంలో కేసీఆర్‌ను వ్యతిరేకించి బయటకు వెళ్లిన నా యకులు ఎవ్వరూ రాజకీయంగా నిýదొక్కుకున్న దాఖలాలు లేవు. పార్టీ మారిన ఈటెల రాజేందర్ పరిస్థితి బీజేపీలో ఎట్లా వున్నదో తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేల భవిత వ్యం ఇప్పుడు త్రిశంకుస్వర్గంలో వుంది. కవిత సొంతంగా పార్టీ పెట్టాలనుకుంటున్నారు కనుక, కొత్త పార్టీ నిర్మాణం, కేడర్‌ను విస్తరించుకోవడం, ఆర్థికపరమైన మద్దతు వంటి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొనాల్సి వుంటుంది. ఇవన్నీ సమకూర్చుకున్నా, రాష్ట్రస్థాయి నాయకురాలిగా ఆమెకు ఇప్పటివరకు ఇమేజ్ లేదు. ఎక్కడికక్కడ బలమైన స్థానిక నాయకులను ఎదుర్కొని పార్టీని నిర్మించడం అంత తేలికైన పనికాదు. పధ్నాలుగున్నరేళ్లు అలుపెరుగని పోరాటం చేసి, చివరకు చావు అంచువరకు వెళ్లిన కేసీఆరే రెండు టర్మ్‌లకు మించి అధికారంలో లేరు. తండ్రిచాటు బిడ్డగా వున్న కవిత ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టి దానికి నారు, నీరు పోసి జాగ్రత్తగా అభివద్ధి చేయడంచెప్పుకున్నంత తేలిక కాదు. గొప్ప ఛరిష్మా కలిగిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇప్పుడు తాజాగా తమిళ నాడుకు చెందిన స్టార్ విజయ్‌లే తల్లక్రిందులవుతున్నారు. పోగైన జనాభాలో ఎంతమందిఓట్లు వేస్తారో తెలియని పరిస్థితి! అక్కడిదాకా ఎందుకు కేటీఆర్, హరీష్‌రావులు బీఆరఎస్ కోసంఎంతగా కష్టపడుతున్నారో మనకు తెలిసిందే. ఈ విశ్లేషణ నేపథ్యంలో కవితది తొందరపాటు నిర్ణయమా లేక నిజమైన నాయకత్వ లక్షణాన్ని పుణికి తెచ్చుకున్న నిర్ణయమా అన్నది భవిష్యత్తే తే ల్చగలదు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని గుంజేటి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది.గ్రామంలోని 10వ, 4వ వార్డుల్లో నీటి కొరతపై మాజీ జడ్పిటీసీ చంద్రప్ప, జహీరాబాద్ ఎంపీ సురేష్కుమార్ షెట్కార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ రూ.3.50 లక్షల నిధులను మంజూరు చేయడంతో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులతో బోరు బావులు త్రవ్వించి, రెండు బోర్లకు మోటార్లు అమర్చి తాగునీటి సరఫరాను శనివారం ప్రారంభించారు. దీంతో కాలనీ వాసులకు నీటి ఇబ్బందులు తొలగిపోయాయి. భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు కొనసాగించాలని గ్రామస్థులు కోరారు.
జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం బడంపేట గ్రామంలో రేపు చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదీన రచ్చన్న స్వామి దేవాలయం తాత్కాలికంగా మూసివేయబడుతుంది. ఆలయ ఈఓ శివారుద్రప్ప సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7:30 వరకు భక్తులకు దర్శనం నిలిపివేయబడుతుంది. అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణం, రుద్రభిషేకం నిర్వహించిన తర్వాత భక్తులకు అనుమతిస్తామని, అందరూ సహకరించాలని ఆలయ సిబ్బంది కోరారు.
కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం మూసివేత
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం, మార్చి 3వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా భక్తుల దర్శనార్థం తాత్కాలికంగా మూసివేయబడుతుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ప్రధాన, ఉప ఆలయాల ద్వారాలు మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత రాత్రి 7:45 గంటలకు శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి, స్వామి అమ్మవార్లకు పునఃప్రతిష్ఠాపన అనంతరం మంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.
సెస్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్స్, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో చేస్తున్న జాప్యానికి నిరసనగా 72 గంటలు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కే ఈశ్వర్ రావు, నలువాల స్వామి లు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సెస్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సెస్ ఎండికి ఐదుసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని వారు పేర్కొన్నారు. ప్రతి నెల ఇచ్చే ఎఫ్ టి ఏ గత ఎనిమిది మాసాల నుంచి ఆపివేశారని 2025 సెప్టెంబర్ నెలలో ఇవ్వాల్సిన యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులను రెగ్యులరైజ్ చేయలేదని సెస్ లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగులకు లీవ్ ఎన్కాష్మెంట్ విధానం అమలు చేయడం లేదని వారు పేర్కొన్నారు ఏ హెచ్ లుగా పిలువబడే కార్మికులందరూ ఐటిఐ ఎలక్ట్రికల్ చేసిన వారేనని టెక్నికల్ గా చూస్తే వారందరూ టెక్నీషియన్సే నని సెస్ లో మాత్రం అసిస్టెంట్ హెల్పర్లు అని పిలవడం వలన కార్మికుల ఆత్మ గౌరవాన్ని అవమానించడమేనని వారు అన్నారు అసిస్టెంట్ హెల్పర్ అనే పేరు పెట్టి అతి తక్కువ వేతనాలు ఇవ్వడం వంటి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని వారు వివరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 11 నుంచి ఈ నెల 14 వరకు 72 గంటలు విధులు బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు ఈ 72 గంటల్లో వివిధ రూపాల్లో నిరసనలు కూడా తెలియజేస్తామని ఇప్పటికైనా సెస్ చైర్మన్, సెస్ ఎం డి లు కలిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ తో సంప్రదింపులు చేసి సమస్యలు పరిష్కరించాలని వారు పేర్కొన్నారు సమావేశంలో సెస్ కమిటీ అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ కార్యదర్శి ఎస్ శ్రీనివాసరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర మల్లేశం కోశాధికారి ఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో ఫిర్యాదు లు స్వీకరించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజావాణి సందర్భంగా వృద్ధులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలతో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఫిర్యాదులను దరఖాస్తులను నేరుగా స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను దరఖాస్తులను పరిశీలించి పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి పి ఆర్ ఓ సీతారాం జిల్లా అధికారులు పాల్గొన్నారు
ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడుగా ఒలిగె నర్సింగారావు.
దుగ్గొండి,నేటిధాత్రి:
ఆరె కులస్తుల సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామానికి చెందిన ఒలిగే నర్సింగా రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం దుగ్గొండి మండలంలోని గిన్నిబావి లో గల వందన గార్డెన్లో ఆరె కులస్తుల వరంగల్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇంగ్లీ శివాజీ అధ్యక్షతన నూతన జిల్లా కమిటీ ఎన్నిక నిర్వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపెళ్లి శివాజీ హాజరై నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీని ప్రకటించారు. ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఒలిగే నర్సింగారావు, గౌరవ అధ్యక్షుడు గుండెకారి రవీందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు ఒలిగే నర్సింగారావు మాట్లాడుతూ ఆరె కులస్తుల ఐక్యత, అభివృద్ధి కోసం పాటుపడతానని తెలిపారు. రాజకీయాల కతీతంగా ఆరె కుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా పరిధిలోని అన్ని మండలాలలోని ఆరె కులస్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానన్నారు. తన ఎన్నికకు కృషిచేసిన రాష్ట్ర అధిష్టానానికి, సహకరించిన వివిధ మండలాల కుల పెద్దలకు నర్సింగారావు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ జండా రాజేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోర్తాల చందర్ రావు, ఉద్యమ కమిటీ చైర్మన్ సోమిడి అంజన్ రావు, కౌడగాని నరసింహరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండెకారి రంగారావు, హింగే భుజంగర్ రావు, జిల్లా గౌరవ ఆధ్యక్షుడు సుకినే రాజేశ్వర్ రావు, మండల అధ్యక్షుడు లాండే రమేష్, కుసుంబా బాబురావు, ధూమాల సుధాకర్ రావు, డోలే చిన్ని,పకిడే బాబురావు, తదితరులు పాల్గొన్నారు.
ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపల్లి శివాజీ
*అరె కులస్తుల వరంగల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం,
దుగ్గొండి,నేటిధాత్రి:
ఆరె కులస్తులు వివిధ రాజకీయ రంగాలతోపాటు విద్యా, వైద్య, ఆర్థిక రంగాలలో రాణించాలని ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపల్లి శివాజీ పిలుపునిచ్చారు.ఆరెకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇంగ్లీ శివాజీ అధ్యక్షతన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నీబావిలో గల నందన గార్డెన్ లో వరంగల్ జిల్లా అరె కులస్తుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపెళ్లి శివాజీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా బలపడేను గాను 22 జిల్లాలలో గత సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి ప్రజా ప్రతినిధులుగా గెలుపొందామని తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక శాతం అరె కులస్తులు పోటీల్లో ఉండి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.చట్టసభల్లో లేకపోవడం వలన హక్కులు కోల్పోతున్నాము.హక్కుల పట్ల చట్టసభల్లో పోరాటం చేయడంతో పాటు ఆరె కులాన్ని ఓబీసీలో చేర్చడం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆరె కులస్తుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యం కావలసిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపెళ్లి శివాజీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ జండా రాజేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోర్తాల చందర్ రావు, ఉద్యమ కమిటీ చైర్మన్ సోమిడి అంజన్ రావు, కౌడగాని నరసింహరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండెకారి రంగారావు, హింగే భుజంగర్ రావు, జిల్లా గౌరవ ఆధ్యక్షుడు సుకినే రాజేశ్వర్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు గుండెకారి రవికుమార్, మండల అధ్యక్షుడు లాండే రమేష్, ఒలిగే నర్సింగారావు, కుసుంబా బాబురావు, ధూమాల సుధాకర్ రావు, డోలే చిన్ని,పకిడే బాబురావు, దుగ్గొండి మండల కోశాధికారి ఎడ్డే రఘుపతి రావు, సర్పంచ్ సుకినే నాగరాజు, ప్రభు, డ్యాగల సుజాత సుధాకర్ తోపాటు జిల్లా పరిధిలోని అన్ని మండలాల ఆరె కులస్తులు పాల్గొన్నారు.
అసెంబ్లీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలలో కలెక్టర్ చైర్మన్
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ దివంగత శ్రీపాదరావు జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపల్ చైర్మన్ మీడిదొడ్డి మాదవి జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాడిన వ్యక్తి అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావుఅని అన్నారు కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి న వారిలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ మున్సిపల్ చైర్మన్ మీడీదొడ్డి మాదవి రమేష్ జిల్లా అధికారులు ఉన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ యాదయ్య,, క్రీడలు యువజన శాఖ అధికారి సుధీర్ రెడ్డి ఏ ఓ భాను ప్రకాష్, డిపిఆర్ఓ సీతారాం, అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు
మున్సిపల్ చైర్మన్ మాదవి రమేష్ ను సన్మానం చేసిన ట్రాన్స్పోర్ట్ యజమాని అనంద్
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికైన శ్రీమతి మిడిదొడ్డి SLN మాధవి రమేష్ ను శ్రీ మహాదేవ ట్రాన్స్పోర్ట్ యజమాని వనపర్తి కి చెందిన ఆర్యవైశ్యడు నరహరి బీమయ్యా కుమారుడు ఆనంద్ పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు ఈసందర్భంగా వారిని అభినందించారు ఈకార్యక్రమంలో బి నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
మంకాల్.సుజాత గారి పార్థీవదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు
◆-: డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్ గారి సతీమణి మంకాల్ సుజాత గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.సోమవారం వారి స్వగృహంలో మంకాల్.సుజాత గారి పార్థీవదేహానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి నివాళులర్పించారు.అనంతరం మంకాల్ సుభాష్ గారికీ మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఉండాలని ఓదార్చారు.వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ళ.నాగిరెడ్డి,కౌన్సిలర్ అరుణ్ కుమార్,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్,బి.మల్లికార్జున్,జగదీశ్,కాశీనాథ్ మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
సామాజిక వేత్త డాక్టర్ పోచ రవీందర్ రెడ్డి ఆధ్వర్యములో వనపర్తి లో దాచా లక్ష్మయ్య కల్యాణ మండపంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు 10 వ తరగతి నుండి ఏ కోర్సులు చేయాలి ఇంటర్ తరువాత ఉద్యోగ అవకాశాలు మ్యాథ్స్ సైన్స్ కాకుండా కోర్సులు ఉంటాయ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే విద్యార్థులు చదువు పై అవగాహన కల్పించారు.21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఛైర్మెన్ క్రిష్ణ ప్రదీప్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ భవాని శంకర్ కాలేజ్ యాజమాన్యం వేణు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారని డాక్టర్ పోచ రవీందర్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు
జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా 10 వ వార్డ్ లో ఎక్కడికక్కడ మురికి నీరు నిలిచిపోయింది
జహీరాబాద్ నేటి ధాత్రి:
10 వ వార్డ్ లో నాలాల కబ్జా చేసి వెంచర్లు చేసి డబ్బులు పోగేసుకున్నారు శాశ్వతంగా మొరిల్ల నిర్మాణానికి వెంచర్ లో ప్లాట్లు ముందు మురికి కాలువ స్థలాలను ఏర్పాటు చేసిన వారికే పర్మిషన్ ఇయ్యాలి నాలా కబ్జా చేసిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ మురికి కాల్వల నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చిన జహీరాబాద్ ఆర్డిఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కబ్జాకు గురైన నాలాల కబ్జా నుంచి తొలగించి శాశ్వత నిర్మాణానికి తోడ్పడాలని,,, 10 నంబర్ వార్డ్ మహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ,, కావాలని సమస్యలకు పరిష్కారం చూపాలి అని నూతనంగా ఎన్నికైన చైర్మన్ గారికి మరియు మున్సిపాలిటీ అధికారులకు కోరడం జరుగుతుంది ఈ మురికి నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కాలనీలో నివసించే ప్రజలకు అనేక వ్యాధులు వస్తున్నాయి కాబట్టి తక్షణమే మురికి కాల్వలను నిర్మాణం పూర్తి చేయాలి అలాగే ఇరిగేషన్ అధికారులతో మున్సిపాలిటీ అధికారులు సాంప్రదించి గతంలో ఉన్న నాలా నక్షలో ఉన్నట్టుగా మురికి కాలువ నిర్మాణం చేస్తే గాంధీనగర్ కాలనీ గుల్షన్ నగర్ కాలనీ సలాం నగర్ కాలనీ జమాలి కాలనీ శాశ్వత పరిష్కారం చూపేలా మున్సిపాలిటీ అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలి మరియు సీసీ రోడ్ల నిర్మాణం విద్యుత్ దీపాలు తాగునీటి సమస్యకు పరిష్కారం చెప్పాలన్నారు,
◆-: తమ భూమిని అగ్రవర్ణాలు కబ్జా చేశారని బాధితుల ఆవేదన…
◆-: కబ్జాను అడ్డుకున్న గ్రామ సర్పంచ్ తనయుడు ప్రసాద్ రెడ్డి…
◆-: దళితుల భూమిని ఎలా కబ్జా చేస్తారని వాగ్వాదం…
◆-: బోరున విలపిస్తున్న దళిత బాధిత మహిళలు….
◆-: గత 40,సంవత్సరాలనుండి తాము కబ్జాలోనే ఉన్నామన్న బాధితులు…
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం సజ్జపూర్ గ్రామంలోని 27వ సర్వేనంబర్ లో 1ఎకరం అసైండ్ భూమిని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దళితులకు బ్రతకడానికి సజ్జపూర్ గ్రామానికి చెందిన దళిత మహిళ అయిన కొతిలి ఎల్లమ్మ పేరుపైన ప్రభుత్వం సంబంధిత పత్రాలు జారీ చేసింది.
ఎల్లమ్మ చనిపోయిన తర్వాత ఆమె మూడవ కూతురైన అమృతమ్మ పేరుపైన అప్పటి తహసీల్దార్ సిబ్బంది రికార్డుల్లో పేరు నమోదు చేసినట్లు ఆధారాలు ఉన్నకూడా సజ్జపూర్ గ్రామానికి చెందిన కొత్తకాపు రమేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, మధు సుధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి, దళితులమైన తమ భూమి పైన దౌర్జన్యం చేసి మా ఎకరం భూమి కబ్జా చేస్తుంటే గ్రామ సర్పంచ్ కు సమాచారం అందించడంతో సర్పంచ్ తనయుడు ప్రసాద్ రెడ్డి కబ్జా అవుతున్న దళిత మహిళలమైన మా భూమి వద్దకు వెళ్లి కబ్జాకు గురవుతున్న సమయంలో జేసీబీని ఆపేయడం జరిగిందని లబ్దిదారులు కొతిలి అమృతమ్మ, బాధితులు కోతిలి శివమ్మ, బుజ్జమ్మ, తెలిపారు.
ఇదిలా ఉంటే శనివారం దళిత బాధిత మహిళలు తమకు ప్రభుత్వం ఇచ్చిన అసైండ్ భూమిని చట్టపరంగా స్వాధీనం చేసుకున్నారు. దళితులమైన మాకు న్యాయం చేయాలని సజ్జపూర్ గ్రామ సర్పంచ్ ను సర్పంచ్ తనయున్ని, గ్రామస్తులను వేడుకున్నారు.
సానుకూలంగా స్పందించిన గ్రామ సర్పంచ్ కుమారుడు ప్రసాద్ రెడ్డి అండగా ఉన్నానని బాధితులకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. కబ్జా చేసిన వారు ఎంతటివరైన వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాధితులకు ఇబ్బంది కలిగించే అగ్రకులస్తులు ఎవరైన పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి కఠినంగా వ్యవహారిస్తామని అన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో బీద బడుగు బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి పరిచేందుకు ఏర్పడిన డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) భారీ ఎత్తున భూమేతకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంస్థ పెద్దలు ఇప్పటికే 74 ఎకరాలను అమ్మేసి సొమ్ముచేసుకు న్నట్లు సమాచారం. బాల్వాడీ పాఠశాలూ మూతపడ్డాయి. హిళా సంఘాల నోట్లో మట్టికొట్టి పేదపిల్లల నోటికాడి ముద్దనూ మెక్కారు. అంతేకాదు. అనేక సంస్థల ఇచ్చిన కోట్ల నిధులూ గోల్మాల్ జరిగినట్లు తెలు స్తుంది. 43 ఏళ్లుగా ప్రతి ఏటా ఈజెడ్ ఇస్తున్న రూ.3కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు అందజేస్తున్న నిధులు, మానవ అభివృద్ధి సంస్థ నుంచి కూడా పెద్ద మొత్తం తీసుకుం టున్న నిధుల్లో కూడా అవకతవకలకు పాల్పడినట్లు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదిం చిన డీడీఎస్లో రాజ్యమేలుతున్న అవినీతి, అక్రమాల బాగోతం పై ‘నేటి ధాత్రి’ ప్రత్యేక కథనం..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో బీద బడుగు బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి పరిచేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ వెలువడింది. ఆ సంస్థ పేరు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్), ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను సంఘా లుగా ఏర్పాటు చేసి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచేందుకు కృషి చేసింది. ఈ సంస్థ ప్రతి గ్రామంలో పనులకు. వెళ్లిన మహిళలు, చిన్న పిల్లలను తీసుకొని అడవి ప్రాంతాలకు మహిళలు వెళ్లడం వల్ల అక్కడ పిల్లలకు అపాయం జరగవచ్చనే ఉద్దేశంతో ఈ సంస్థ గ్రామాల్లో బాల్వాడీలను ఏర్పాటు చేసింది. ఈ బాల్వాడీల మనుగడకు భూములను స్వదేశీ, విదేశీ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కొనేసింది. ఈ బాల్వాడీల్లో పనికి వెళ్లే వారి పిల్లలకు ఆహారం కోసం ప్రతి ఇంటిలో రోజూ చేసుకునే ఆహార పదార్థాల్లో పిడికెడు ధాన్యాన్ని ఒక కుండలో వేస్తారు. వారం రోజుల తర్వాత ఆ ధాన్యాన్ని మహిళలందరూ తీసుకొచ్చి పోగే స్తారు. అందులో నుంచి రోజూ కొద్దిగా తీసి, బాల్వాడీలో ఉండే పిల్లలకు ఆహారంగా ఇస్తారు. ఇలా డీడీఎస్ గ్రామీణ ప్రాంతాల్లో తమ సంఘాలు ఏర్పాటు చేసి, వారందరికీ బాల్వాడీల నిర్వహ ణను అప్పగించింది. ఈ సంఘాలు నడుపుతున్న బాల్వాడీల
115 ఎకరాలు కొనుగోలు
విదేశీ సంస్థల ఆర్థిక సహాయంతో డీడీఎస్ సంస్థ జహీ రాబాద్ నియోజకవర్గంలోని 22 గ్రామాలలో 115 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అంతేగాకుండా ఈ భూముల కొనుగోలు కోసం గ్రామాల్లో ఉన్న సంఘాలు 20 శాతం నిధులు వెచ్చించారు. ఈ భూమిలో పండిం చిన పంటల ద్వారా గ్రామాలలోని సంఘాల్లో పనిచేసే పిల్లలే కాకుండా గ్రామీణంలోని బీద పిల్లల అందరికీ బాల్వాడీలలో తగిన పౌష్టికాహారాన్ని అందించేందుకు కృషి చేసింది. డీడీఎస్ సంస్థ బాల్వాడీల కోసం కొను గోలు చేసిన భూమిలో దున్నుటకు, పంట పండించుటకు, కలుపుతీయటకు ఎటువం టి నిధులు ఖర్చు చేయలేదు. అయితే సంఘంలో పనిచేస్తున్న మహిళలు ఉచితంగానే పంటను పండించి, నూర్పిడి చేసి బాల్వాడీలకు అందించే వారు. డీడీఎస్ సంస్థ రోజురోజుకూ అభివృద్ధి జరుగుతూ ప్రతి పల్లెలో తన సత్తాను చాటింది.
నిర్వహణ చూసి విదేశీసంస్థలు ఆర్థిక సహాయాన్ని అందించాయి.
74 ఎకరాల భూమిని అమ్ముకున్న పెద్దలు?
భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో బీద పిల్లల కోసం డీడీఎస్ సంస్థ కొనుగోలు చేసిన 115 ఎకరాల నుంచి 74 ఎకరాల భూమిని సొసైటీ పెద్దలు అమ్మి సొమ్ము చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆ భూమి కొనుగోలు కోసం సంఘం ద్వారా 20 శాతం నిధులిచ్చినప్పటికీ ఆ సంఘానికి ఈ భూమికి సంబంధం లేకుండా పోయింది. మిగతా 41 ఎకరాల భూమి ఉన్నప్పటికీ ఆ భూమిలో ఆయా గ్రామాలకు సంబంధిం చిన బాల్వాడీలు కొనసాగడం లేదు. అయితే ఇప్పటికీ బాల్వాడీల నిర్వాహణ కోసం బ్రిటన్ కు చెందిన ఈజెద్ద అనే సంస్థ ప్రతి సంవత్సరం రూ.3కోట్లను ఇస్తుంది. ఈ సంస్థ 1983 నుంచి ఇప్ప టివరకు ప్రతేటా రూ.3కోట్లు ఇస్తోంది. విదేశాల సంస్థల నుంచి డీడీఎస్ సంస్థకు పెద్ద మొత్తంలో దాతలు ఉన్నట్లు సంస్థలో పని చేసిన కొందరు తెలియజేస్తున్నారు. ఇటీవల జరిగిన డీడీఎస్ పాత పంటల జాతరను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సందర్శించారు. ఈ సమయంలో కొందరు డీడీఎస్ సంఘ మహిళలు ఆయనను కలిసి తమ బాల్వాడీ భూములను తమ పిల్లలకు చెందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఝరాసంగం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పట్లోళ్ల రవి కుమార్
●-: సర్పంచుల సమస్యల పరిష్కరం కోసం కృషి చేస్తా
జహీరాబాద్ నేటి ధాత్రి:
తనపై నమ్మకం ఉంచి ఝారసంగం మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మండలంలోని సర్పంచులకు దేవరం పల్లి గ్రామ సర్పంచ్ పట్లోళ్ల రవి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం నాడు ఝారసంగం మండలం సర్పంచుల.ఫోరం అధ్యక్షుడి ఎంపిక కోసం సర్పంచులు సమావేశమై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ ఆధ్వర్యంలో మండల నూతన సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా దేవరపల్లి సర్పంచ్ పట్లోల రవి కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదే విదంగా ఉపాధ్యక్షురాలు గినియార్పల్లీ సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి ని ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం సర్పంచులతో కలిసి ముందుకు వెళ్తామని, తమ మధ్య ఎలాంటి పట్టింపులు లేవని, సర్పంచుల సమస్యల పరిష్కరం కోసం మంత్రి దామోదర్ రాజనర్సింహ, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్, ఇంచార్జ్ డా చంద్రశేఖర్ ల సహకారంతో అభివృద్ధి పనులు చేసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో లో వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు యువ నాయకులు పాల్గొన్నారు.
సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్న తమ దంపతులతో మజీ సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సిద్ధి వినాయకుడిని ఝరాసంగం గ్రామ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ తమ దంపతులతో స్నేహితులతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మాజీ సర్పంచ్ జగదీశ్వర్ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజనీ, స్వయంభూ వినాయకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు నాయకత్వంలో జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం గ్రామం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు మాజీ సర్పంచ్ తెలిపారు. అతనితోపాటు సజ్జన్ నాగేశ్వర్ దంపతులు కూడా దర్శించుకున్నారు,
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం:కాంగ్రెస్ పార్టీ నాయకులు యం సాల్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలోని పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సాల్మన్ అన్నారు.. గృహ జ్యోతి, ఉచిత బస్సు,రైతు భరోసా వంటి పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు అండగా ఉంటారన్నారు.. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకె దక్కుతుందన్నారు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.