తెలంగాణ లో తిరుగు లేని శక్తి గా కాంగ్రెస్!

`కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ లో గట్టి పునాదులు!

`సీఎం రేవంత్ రెడ్డి మూలంగానే సాధ్యమౌతుందంటున్న విశ్లేషకులు.

`తెలంగాణ లో ప్రత్యర్థి పార్టీలకు చోటు లేకుండా చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి.

`ఎంతో బలంగా ఉందనుకున్న బీఆరఎస్ ను ముప్పు తిప్పలు పెడుతున్నాడు!

`దేశమంతా వెలుగుతున్న బీజేపీ ని ఎదగకుండా చేస్తున్నాడు!

`ప్రాంతీయ పార్టీ గా బీఆరఎస్ కు బలం ఉన్నా బీజేపీ కి చోటు లేకుండా చేస్తున్నాడు.

`మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ ప్రభావం ఉంటుందని అందరూ అనుకున్నారు!

`జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ రాకుండా చేశాడు.

`పంచాయతీ ఎన్నికలలో పల్లెల్లో కూడా బీజేపీ లేదని నిరూపించాడు.

`మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ ని ముందుకు రాకుండా కట్టడి చేశాడు.

`ప్రధాని మోడీ వచ్చి మోరీలు బాగుచేస్తాడా అని సంచలన వ్యాఖ్యలు సీఎం రేవంత్ చేశారు.

`ఒక్క మాటతో బీజేపీ పరువు మొత్తం తీశాడు.

`మున్సిపాలిటీలకు కేంద్రం చేసేదేమి లేదని చెప్పకనే చెప్పాడు.

`బీజేపీని కోలుకొని దెబ్బ తీశాడు.

`పల్లె, పట్టణాలకు కేంద్రం నిదులే అని బీజేపీ చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టాడు!

`తెలంగాణా సెక్యూలర్ రాష్ట్రమని నిరూపించి కాంగ్రెస్ ను గెలిపించుకున్నాడు.

`రేవంత్ రెడ్డి రాజకీయం అర్ధం కాకా బీఆరఎస్, బీజేపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

  తెలంగాణ రాజకీయాల్లో ఎదురులేని నాయకుడుగా సిఎం. రేవంత్ రెడ్డి ప్రఖ్యాతిగాంచారని చెప్పకతప్పదు. పార్టీని పదేళ్ల తర్వాత కష్టపడి అదికారంలోకి తీసుకురావడమే కాదు, ఆ పార్టీని కూడా తెలంగాణలో ఎదరులేని పార్టీగా, తిరుగులేని పార్టీగా సిఎం. రేవంత్ బలోపేతం చేస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచినప్పటికీ, ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తూ మరింత బలమైన పునాదులు వేస్తున్నారు. రేవంత్! నిజం చెప్పాలంటే ప్రతిపక్షాలకు ఇవి తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలుగా మారిపోయాయి. ఇదే సందర్భంలో ప్రతి ఎన్నికల్లో బిఆరఎస్ ఆశలన్నీ పదే పదే గý్లంతు! చేస్తూ దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. బిఆరఎస్‌లో ఎన్నికలంటే భయం పుట్టేలా చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ముందు ఎన్నికలంటే బిఆరఎస్ కాలు దువ్వుతూ వుండేది. ఎప్ప్పుడైతే జూబ్లీహిల్స్ బిఆరఎస్ కోల్పోయిందో అప్పటి నుంచి ఎన్నికలంటే ఆ పార్టీకి భయం పట్టుకునేలా చేశారు. దాంతో జూబ్లీహిల్స్ ఎన్నికల ముందున్న జోష్ బిఆరఎస్ లేకుండాపోయింది. దాని వెంటనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లోనూ సిఎం. రేవంత్ ఒంటి చేత్తో గెలిపించారు. ఆ ఎన్నికల్లో గులాబీ మరింత వాడిపోయింది. ఆ వెంటనే జరిగిన మున్సిపల్ ఎన్నికలతో ముందుకు వెళ్తుందనుకున్న కారు అక్కడే ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా పార్లమెంటు ఎన్నికలతో బిఆరఎస్ మరింత పతనానికి ముహూర్తం బలంగా పడిండి. ఇకపోతే తెలంగాణలో బిజేపికి జనం ఆదరణ బాగా కరువైందనే చెప్పాల. పార్లమెంటు ఎన్నికల్లో మోడీ మానియాతో ఎంపిల గెలుపు సాద్యమైంది. కాని సొంతంగా బలమున్న నాయకులు ఎవరూ లేరనేది పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలతో తేలిపోయింది. కేవలం పార్టీ పేరుతోమాత్రమే రాజకీయాలు చేస్తున్నారనే విషయం అర్దమైపోయింది. పైగా పార్టీ పెద్దల ఆశీస్సులతోనే ఆ పార్టీ నాయకులు పదవులు పొందుతున్నారు. బిజేపి నాయకులు ఈ రెండున్నరేళ్ల కాలంలో చేసిన ప్రజా ఉద్యమాలులేవు..ప్రజలకు చేరువయ్యింది లేదు. పైగా ఎనమిది మంది ఎంపిలలో ఐక్యత లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ గ్రాఫ్ రాకెట్‌లా దూసుకుపోతోంది. వరుస విజయాలతో కార్యకర్తలకు మంచి కిక్ వస్తోంది. పంచాయితీ ఎన్నికలకు ముందు కార్యకర్తలు భయపడ్డారు. సిఎం. రేవంత్‌రెడ్డి ఆత్మవిశ్వాసంతో ముందుకొచ్చారు. ఇప్ప్పుడు ఎన్నికలంటే సై అంటే సై అంటున్నారు. ఒక పార్టీ బలపడాలన్నా, నీరు గారిపోవాలన్నా ఆ పార్టీకి చెందిన నాయకుల ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమని సిఎం. రేవంత్‌రెడ్డి పదే పదే నిరూపిస్తున్నారు. నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కార్యకర్తలకు ధైర్యం నింపుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తనకు ఎదురులేదని నిరూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తన నాయకత్వంలో తెలంగాణలో తిరుగులేకుండా చేస్తున్నారు. అన్ని పార్టీలను ప్రజల దీవెనతో తొక్కేస్తున్నారు. ఒక రకంగా లేవకుండా చేస్తున్నారు. తన రాజకీయ విజయాల పరంపర కొనసాగిస్తున్నారు. తాను ఏం చేయదల్చుకున్నారో అదే చేస్తున్నారు. ప్రజలను తన వైపు తిప్ప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు చెప్పి కాంగ్రెస్‌ను గెలిపించారు. నాయకులందరినీ ఏక తాటి మీదకు తెచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారు. ఇక్కడ సిఎం. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఎదిగిన తీరు కూడా ఒకసారి మననం చేసుకోవాలి. ఆనాడు ఆయనను పార్టీలో నెగలనిస్తారా? అని అందరూ అనుకున్నారు. సీనియర్లతో సర్ధుకుపోగలరా? వారిని మెప్పించగలరా? అని కూడా అనుకున్నారు. అందరి ఆలోచనలు సిఎం.రేవంత్‌రెడ్డి పటాపంచెలు చేశారు. మంత్రి కోమటి రెడ్డి, ఆయన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఇటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యేజగ్గారెడ్డి, మరో మాజీ ఎంపి. మదుయాష్కీగౌడ్, సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు లాంటి వారు రేవంత్‌ను ముందుకు వెళ్లకుండా, వెనక్కి రాకుండా రాజకీయాలు చేశారు. అయినా రేవంత్ రెడ్డి అన్నీ దిగమింగుకున్నారు. జగ్గారెడ్డి లాంటి వారు ఎన్ని మాటలన్నా , సోదర సమానులు అంటే అందులో తప్ప్పులేదులే సుర్ధుకుపోయారు. మొత్తం మీద ఎన్ని అవాంతరాలు పార్టీలో ఎదురైనా సరే పార్టీని గట్టెక్కించారు. గెలిపించారు. సిఎం. అయ్యారు. అప్ప్పుడు కూడా ఎక్కడో రాజకీయ విభేదాలు కనిపిస్తూనే వున్నాయి. కాని రాను రాను సిఎం. రేవంత్‌రెడ్డి రాటుదేలిన విదానం సామాన్యమైంది కాదు. ఇప్ప్పుడు తెలంగాణలో అత్యంత బలమైన రాజకీయ నాయకుడుగా సిఎం. రేవంత్‌రెడ్డి ఎదిగారు. కాంగ్రెస్‌పార్టీని అన్ని ఎన్నికల్లోనూ గెలిపిస్తూ వస్తున్నారు. రాజకీయ చాణక్యం చూపిస్తున్నారు. ఇప్పటికీ అనేక రకాల విమర్శలు ఆయన ఒక్కడే ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షం నుంచి రేవంత్ మీద వస్తున్న ఆరోపణలకు ఏ ఒక్క మంత్రి సమాదానం చెప్పరు. ప్రతిపక్షాన్ని కౌంటర్ చేయరు. ప్రతిపక్షాలు కూడా ఏ ఒక్క మంత్రిపై విమర్శలు చేయరు. అటు బిజేపి అయినా, ఇటు బిఆరఎస్ అయినా సరే టార్గెట్ ఒక్కరే. సిఎం. రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా సాగే రాజకీయాలే. అయినా వాటిని ఒకే ఒక్కడుగా ఎదుర్కొంటున్నారు. ఎదురొడ్డి నిలుస్తున్నారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి ఆక్సీజన్ అందిస్తూ సిఎం. రేవంత్ ముందుకు సాగుతుంటే , ఆ కుర్చీ కోసం ఎదురుచూస్తున్న నాయకులు అరడజను వున్నారు. ఆ విషయం సిఎం.రేవంత్‌రెడ్డికి తెలుసు. అందుకే ఏ ఇతర నాయకుడు తన స్దాయికి రాకుండా చూడా సిఎం. రేవంత్ చూసుకుంటున్నాడు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం, నిర్ధేశం ఆయనే చూసుకున్నారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలను తన భుజనా మోశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవలేమని కాంగ్రెస్‌నాయకులే చేతులెత్తేసిన జూబ్లీహిల్స్‌ను గెలిపించుకున్నారు. వరుసగా వారం రోజుల పాటు ప్రచారం చేసి, జనం నాడినీ కాంగ్రెస్ వైపు తిప్ప్పుకున్నారు. ఒక వేళ గెలిస్తే అదే గొప్ప అనుకునే సందర్భం నుంచి 25వేల మెజార్టీని తెచ్చేలా చేశారు. రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగడానికి ముందు అసలు కాంగ్రెస్‌కు ఆశలే లేవు అనే దశ నుంచి ఊహించని మెజార్టీతో గెలిచే దాకా కషిచేశారు. పంచాయితీ ఎన్నికలా కష్టం. ఓ వైపు ఎరువులు అందక రైతులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇప్ప్పుడు ఓట్లు అడిగితే కొడతారు? అనే దశలోనే ఎన్నికలకు వెళ్లి, మెజార్టీ సర్పంచ్‌లు గెలిపించుకున్నారు. పాజిటివ్ టాక్ వున్నప్ప్పుడు గెలిపించుకోవడంలో ఏం మజా వుంటుంది? అనుకున్నారో ఏమో? గాని ముందుకెళ్లారు. అయితే సిఎం.రేవంత్‌రెడ్డికి తెలుసు. రైతులు తెలంగాణలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనందంగానే వున్నారన్న నమ్మకం వుంది. బిఆరఎస్ పార్టీ పనిగట్టుకొని చేసే ప్రచారమంతా వాట్సాప్, సోషల్ మీడియాలోనే వుందని ఆయన గ్రహించారు. ఎన్నికలకు వెళ్లారు. బిఆరఎస్‌ను జనమే ముంచేశారు. రైతులే బిఆరఎస్‌ను ఆదరించలేదు. అంతే ధైర్యంగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లారు. అందరూ అనుమానించారు. ఆరు గ్యారెంటీలు సమస్యలౌతాయనుకున్నారు. కాని ఏం జరిగింది. ఇప్ప్పుడు కూడా ఆ ఎన్నికలను సిఎం. రేవంత్ రెడ్డి ఒక్కరే భుజాల మీద మోశారు. 90శాతం మున్సిపాలిటీలు గెలిపించుకున్నారు. ఆఖరుకు హంగ్‌ను కాంగ్రెస్ అనుకూలం చేశారు. తెలంగాణలో ఎదరులేని నాయకుడుగా రేవంత్‌రెడ్డి ఎదిగారు. దటీజ్ రేవంత్ అని అనిపించుకుంటున్నారు. అదిష్టానం కూడా రేవంత్ రాజకీయాన్ని చూసి ఆశ్చర్యపోతోంది. అబ్బురపడుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version