ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడుగా ఒలిగె నర్సింగారావు.

ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడుగా ఒలిగె నర్సింగారావు.

దుగ్గొండి,నేటిధాత్రి:

ఆరె కులస్తుల సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామానికి చెందిన ఒలిగే నర్సింగా రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం దుగ్గొండి మండలంలోని గిన్నిబావి లో గల వందన గార్డెన్లో ఆరె కులస్తుల వరంగల్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇంగ్లీ శివాజీ అధ్యక్షతన నూతన జిల్లా కమిటీ ఎన్నిక నిర్వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపెళ్లి శివాజీ హాజరై నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీని ప్రకటించారు. ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఒలిగే నర్సింగారావు, గౌరవ అధ్యక్షుడు గుండెకారి రవీందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు ఒలిగే నర్సింగారావు మాట్లాడుతూ ఆరె కులస్తుల ఐక్యత, అభివృద్ధి కోసం పాటుపడతానని తెలిపారు. రాజకీయాల కతీతంగా ఆరె కుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా పరిధిలోని అన్ని మండలాలలోని ఆరె కులస్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానన్నారు. తన ఎన్నికకు కృషిచేసిన రాష్ట్ర అధిష్టానానికి, సహకరించిన వివిధ మండలాల కుల పెద్దలకు నర్సింగారావు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ జండా రాజేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోర్తాల చందర్ రావు, ఉద్యమ కమిటీ చైర్మన్ సోమిడి అంజన్ రావు, కౌడగాని నరసింహరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండెకారి రంగారావు, హింగే భుజంగర్ రావు, జిల్లా గౌరవ ఆధ్యక్షుడు సుకినే రాజేశ్వర్ రావు, మండల అధ్యక్షుడు లాండే రమేష్, కుసుంబా బాబురావు, ధూమాల సుధాకర్ రావు, డోలే చిన్ని,పకిడే బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version