పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం:కాంగ్రెస్ పార్టీ నాయకులు యం సాల్మన్..

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం:కాంగ్రెస్ పార్టీ నాయకులు యం సాల్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలంలోని పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సాల్మన్ అన్నారు.. గృహ జ్యోతి, ఉచిత బస్సు,రైతు భరోసా వంటి పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు అండగా ఉంటారన్నారు.. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకె దక్కుతుందన్నారు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.

కౌన్సిలర్ గా గెలిపియండి సేవకురాలిగా పనిచేస్తా…

కౌన్సిలర్ గా గెలిపియండి సేవకురాలిగా పనిచేస్తా

భూపాలపల్లి 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఉడుత సరోజన రాజమల్లు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే సేవకురాలిగా పనిచేస్తానని 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఉడుత సరోజన రాజమల్లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని 6వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందన్నారు. ఉచిత బస్సు, మహిళలకు రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు, వంటగ్యాస్ పై సబ్సిడీ, ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలు చేపట్టి పేదింటి అభివృద్ధికి చేయూతగా ఉంటోందన్నారు. తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. వార్డు ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.

ఆయ్.. హ్య‘ఫ్రీ’ అండి.. కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్‌లు..

ఆయ్.. హ్య‘ఫ్రీ’ అండి.. కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్‌లు

 

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం పట్ల మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభించి నాలుగు నెలల్లో మొత్తం రూ. 4 కోట్ల వరకు మహిళలకు డబ్బు ఆదా అయినట్టు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి.

ఉచిత బస్‌ పథకం పథకాన్ని మహిళలు అంతలా ఉపయోగిస్తున్నారు. అందుకే ఎక్కడా బస్‌లు ఖాళీ ఉండ డంలేదు. మగవాళ్లు టిక్కెట్‌ తీసుకుని ఖాళీ లేక ఇక్కట్లు పడుతుంటే.. మహిళలు మాత్రం ఉచిత బస్‌ ప్రయాణం సాఫీగా చేసేస్తున్నారు.ఈ ఏడాది మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన బంపర్‌ బొనాంజా ‘స్త్రీ శక్తి’ అని రుజువవుతోంది. ఏ బస్సు చూసి నా మహిళలు ఫుల్‌గా ఉంటున్నారు. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభించగా ఇప్పటి వరకూ ఉమ్మడి తూర్పుగోదా వరిలో రూ.100 కోట్లకు పైగానే మహిళలకు ఆదా అయ్యింది. ఈ డబ్బు లు మహిళల తరపున ఆర్టీసీకి ప్రభుత్వం జమ చేస్తుంది. చేతిలో పైసా లేకపోయినా బస్సెక్కి రయ్‌మని వెళ్లొచ్చేస్తున్నారు ఎంచక్కా!.
పథకం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం 4.50 కోట్ల మంది ప్రయాణించగా అం దులో 3 కోట్లు స్త్రీ శక్తి వాటాగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు రూట్లు నడిచే బస్సులు మహిళా ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. ఓ రకంగా ఇతర ప్రయాణికులు ఎక్కే అవకాశమే ఉండడం లేదు. తూర్పు గోదావరిలో రాజమహేంద్రవరం నుంచి తుని, కాకినాడ వయా బిక్కవోలు,రాజానగరం, ఏలూ రు, రామచంద్రాపురం, సీతానగరం, కాకినాడ జిల్లాలో తుని, రావులపాలెం, రాజమహేంద్ర వరం, కోనసీమలో అమలాపురం నుంచి రాజమహేంద్రవరం, రాజోలు, రామచంద్రాపు రం, రాజోలు నుంచి రాజమహేంద్రవరం రూట్లు రద్దీగా ఉండడంతో ఎక్కువ బస్సులు నడపాల్సి వస్తోంది.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version