హనుమాన్ ఏకశిల విగ్రహం స్వాములకు ఆశ్రయస్థానం

హనుమాన్ ఏకశిల విగ్రహం స్వాములకు ఆశ్రయస్థానం

6రోజులపాటు అల్పాహారం అందించనున్న హనుమాన్ వాకర్స్ అసోసియేషన్

పరకాల,నేటిధాత్రి

పట్టణంలో వెలసిన ప్రసిద్ధ హనుమాన్ ఏకశిలా విగ్రహం భక్తులకు ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది.అరుదైన శిల్పకళతో నిర్మించబడిన ఈ విగ్రహం తెలంగాణలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. భారీ పరిమాణంలో నిర్మితమైన ఈ విగ్రహం దర్శనార్థం ప్రతిరోజూ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.పట్టణ ప్రముఖులు మరియు హనుమాన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ మార్గంలో రామాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం, దూరం నుంచే ఆకట్టుకునే విధంగాదర్శనమిస్తోంది.స్వామివారి రూపం ప్రత్యక్ష దర్శన భావనను కలిగిస్తోందని భక్తులు పేర్కొంటున్నారు.మల్లక్కపేటలోని అంజన్న స్వామి ఆలయం,కొండగట్టు హనుమాన్ దేవస్థానం వంటి ప్రముఖ క్షేత్రాల సరసన ఈ విగ్రహం కూడా ప్రాధాన్యతను సంపాదిస్తోంది.హన్మకొండ,వరంగల్ జిల్లా మరియు పరిసర ప్రాంతాల భక్తులు జీవితంలో ఒక్కసారైనా ఈ స్వామి దర్శనం చేసుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు.భక్తుల విశ్వాసం మేరకు కోరికలు నెరవేర్చే దైవంగా భావించి స్వామివారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.దర్శనానికి వచ్చే భక్తులు ఆధ్యాత్మిక శాంతిని పొందుతున్నారని తెలిపారు.ఇదిలా ఉండగా హనుమాన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21,25,28 మరియు మే 2,5,9 తేదీల్లో సాయంత్రం 7గంటలకు ఆలయ ప్రాంగణంలో అల్పాహార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాల ద్వారా భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా భక్తులు మరియు స్థానికులు హనుమాన్ వాకర్స్ సభ్యుల సేవలను ప్రశంసించారు.స్వామివారి సేవలో వారు చూపుతున్న నిబద్ధత అభినందనీయమని అభిప్రాయపడ్డారు.

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య…

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య…

యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం అందజేయగా,ఆలయ అధికారులు లడ్డు ప్రసాదం అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి మరింత వృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.దర్శన కార్యక్రమంలో ఐలయ్య మిత్రులు గడ్డమీది మాధవులు, కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్ గౌడ్, గున్న సంజీవరెడ్డి, భూపతి రెడ్డి, రామకృష్ణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్న తమ దంపతులతో మజీ సర్పంచ్..

సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్న తమ దంపతులతో మజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సిద్ధి వినాయకుడిని ఝరాసంగం గ్రామ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ తమ దంపతులతో స్నేహితులతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మాజీ సర్పంచ్ జగదీశ్వర్ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజనీ, స్వయంభూ వినాయకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు నాయకత్వంలో జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం గ్రామం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు మాజీ సర్పంచ్ తెలిపారు. అతనితోపాటు సజ్జన్ నాగేశ్వర్ దంపతులు కూడా దర్శించుకున్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version