విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత.

విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కరేటేలో ఝరాసంగం సిద్దు మాస్టర్ విద్యార్థుల ప్రతిభ జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం సదాశివపేట పట్టణంలో బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ ను తెలంగాణ చీఫ్ రాపోలు సుదర్శన్ మాస్టర్ జిల్లా ఎగ్జామినర్ శంకర్ గౌడ్ మాస్టర్ జిల్లా చీఫ్ చందర్ మాస్టర్ ఎగ్జామినేటర్గా విద్యార్థులను పరీక్షించారు. ప్రతిభ కనబరిచిన సైఫ్ సంగమేశ్వర్ విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ లో గోవాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు సిద్ధంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సిద్దు మాస్టర్ సతీష్ గౌడ్. శ్వేత వారిని అభినందించడం జరిగింది

హార్దిక్-అయ్యర్ జీతాలు కట్.. బీసీసీఐ గట్టి షాక్!

హార్దిక్-అయ్యర్ జీతాలు కట్.. బీసీసీఐ గట్టి షాక్!

నేటి ధాత్రి

 

 

 

 

 

గెలిచిన సంతోషంలో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఓడిన బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలింది.

ఇద్దరి జీతాలు కట్ చేసింది బీసీసీఐ.

ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..

 

స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు.

తాను సారథ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్‌‌ను ఐపీఎల్-2025 ఫైనల్‌కు చేర్చాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో పంజాబ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు అయ్యర్.

41 బంతుల్లో 87 పరుగుల కెప్టెన్సీ నాక్‌తో మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు.

అటు ముంబైని ఫైనల్ చేర్చలేకపోయాడు సారథి హార్దిక్ పాండ్యా.

ఎంతగా పోరాడినా అతడి జట్టుకు విజయం దక్కలేదు.

ఈ తరుణంలో సంతోషంగా ఉన్న అయ్యర్‌తో పాటు ఓటమి బాధలో ఉన్న పాండ్యాకు గట్టి షాక్ తగిలింది.

వారిద్దరి జీతాలను కట్ చేసింది భారత క్రికెట్ బోర్డు. మరి..

బీసీసీఐ ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..

 

శ్రేయస్ అయ్యర్-హార్దిక్ పాండ్యాకు జరిమానా విధించింది బీసీసీఐ.

ముంబై ఇన్నింగ్స్ సమయంలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత టైమ్‌లో ఓవర్లు పూర్తి చేయలేదు.

దీంతో అయ్యర్‌కు రూ.24 లక్షల ఫైన్ విధించింది బోర్డు.

అతడితో పాటు పంజాబ్ ఆటగాళ్లందరి జీతాల్లోనూ కోత విధించింది.

ఆ టీమ్ ప్లేయర్లు చెరో రూ.6 లక్షలు కట్టాలి లేకపోతే మ్యాచ్ ఫీజులో నుంచి 25 శాతాన్ని జరిమానా కింద చెల్లించాలని బోర్డు ఆదేశించింది.

అటు ముంబై ఇండియన్స్ సారథి పాండ్యాకు రూ.30 లక్షల ఫైన్ వేసింది బీసీసీఐ.

స్లో ఓవర్ రేట్ కింద ఇతర ఎంఐ ప్లేయర్లు తలో రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో నుంచి 50 శాతం మొత్తాన్ని కట్టాలని స్పష్టం చేసింది.

రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో ఏది తక్కువగా ఉంటే అది చెల్లించాలని బోర్డు తెలిపింది.

పునరాలోచన చేస్తారా..

జరిమానా ద్వారా పంజాబ్ గెలిచిన సంతోషాన్ని బీసీసీఐ ఆవిరి చేసినట్లయింది.

అటు ఓడిన ముంబైకి కూడా ఫైన్ విధించడం ద్వారా వాళ్ల బాధను రెట్టింపు చేసినట్లయింది.

అయితే కోట్లకు కోట్లు పారితోషికాలు అందుకుంటున్న ప్లేయర్లకు ఈ జరిమానా చిన్న మొత్తంగానే చెప్పాలి.

కాగా, ఈ ఐపీఎల్‌లో స్లో ఓవర్‌ రేట్‌లు భారీగా నమోదయ్యాయి.

గతంలో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే జట్టు సారథికి జరిమానా విధించడమే గాక మ్యాచ్ బ్యాన్ కూడా వేసేది బీసీసీఐ.

కానీ ఈసారి నిషేధం ఎత్తేయడంతో కెప్టెన్లు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే బ్యాన్ చేయరనే ధీమాతో చాలా మ్యాచుల్లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేదు.

బౌలింగ్ మార్పులు-ఫీల్డింగ్ పొజిషన్స్ సెట్ చేసేందుకు ఎక్కువ టైమ్ తీసుకున్నారు.

దీంతో మ్యాచులు ముగియడానికి అధిక సమయం పడుతోంది. మరి..

ఈ రూల్ విషయంలో తదుపరి సీజన్‌లో బీసీసీఐ పునరాలోచన చేస్తుందేమో చూడాలి.

 

బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే.

ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో శనివారం రోజున ఉమ్మడి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ,

ఈ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడా అయినా బాల్ బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చిన అసోసియేషన్ ను అభినందించడం జరిగింది.

ఒకప్పుడు నేను కూడా బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుని అని ఈ క్రీడను చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు, అలాగే అంతరించిపోతున్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడను విద్యార్థి దశలోనే అవగాహన కోసం అండర్ 14 బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించడం కూడా గొప్ప విషయమై కొనియాడారు,

ఈ క్రీడల్లో పాల్గొనడానికి దాదాపు 24 టీములు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగిందని, అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ గ్రామీణ క్రీడ అయినా బాల్ బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించే ఉద్దేశంతో

 

Sports

 

 

ఈ క్రీడలను నిర్వహించడం జరిగిందని అన్నారు గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అసోసియేషన్ తరపున ఇవ్వడం జరుగుతుందని అలాగే అంతరించిపోతున్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రోత్సహించేందుకు విద్యార్థి దశ అండర్ 14 నిర్వహిస్తున్నామని దీనికి సహకరిస్తున్న క్రీడాభిమానులకు

ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు, ఆర్ఎన్ఆర్ మాట్లాడుతూ బాల్ బాడ్మిట్ ఉమ్మడిజిల్లా స్థాయిలో నిర్వహించడం గొప్ప విషయమని క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి స్నేహ భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు,

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు గుట్ల తిరుపతి ప్రధాన కార్యదర్శి గుత్తికొండ సాంబయ్య ఉపాధ్యక్షులు వెంకట్రాంరెడ్డి బుచ్చిరెడ్డి స్వామి అంజద్ భాష కోశాధికారి రవీందర్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా నాయకులు చిలకల రాయకుమురు టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ మండల్ నాయకులు బుర్ర శ్రీనివాస్ చిలుమల రాజమౌళి ఉమ్మడి జిల్లా క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అకాడమీ & స్పోర్ట్స్ హాస్టల్ లో ప్రవేశమునకు ఎంపికల నిర్వహణ.

రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అకాడమీ & స్పోర్ట్స్ హాస్టల్ లో ప్రవేశమునకు ఎంపికల నిర్వహణ

సిరిసిల్ల జిల్లా యువజన మరియు క్రీడల శాఖ

సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )

 

 

 

 

 

రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అకాడమీ & స్పోర్ట్స్ హాస్టల్ లో ప్రవేశమునకు ఎంపికల నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను 1 జూన్,2025 నుండి వాలీబాల్ అకాడెమి రాజన్న సిరిసిల్ల, సరూర్నగర్ ఇన్డోర్ స్టేడియం, సిద్ధిపేట,మరియు మహబూబ్ నగర్ అకాడమి, ప్రాంతీయ క్రీడా హాస్టల్ – హన్మకొండ, అథ్లెటిక్స్ అకాడెమి – ఖమ్మం, సైక్లింగ్ మరియు రెజ్లింగ్ అకాడెమి – సైక్లింగ్ వేలోడ్రోమ్,O.U., హాకీ అకాడెమి – వనపర్తిలో మంజూరు చేయబడిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా, ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం కొరకు ఎంపికలు/ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనుంది.

 

ఈ క్రింద తెలుపబడిన తేదీలలో, ఆయా సెంటర్లలో రాష్ట్రం లోని ప్రతి అకాడెమీకి/హాస్టల్ కు సంబంధించిన ఎంపికలు / సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించబడును.

ఎంపిక స్థలం / వేదిక క్రొత్తగా ప్రతిపాదించ బడిన తేదీలు నిర్ధారించబడిన వయసు

1 వాలీబాల్ అకాడెమి – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల, వాలీబాల్ అకాడెమి , రాజీవ్ నగర్ మినీ స్టేడియం, సిరిసిల్ల 10 జూన్ 2025 Under 14 to 16 Years
at Saroornagar & Rajanna Sircilla
(30th June 2009 to 1st July -2011)
(Under 16 to 18 years-
only at Saroor nagar)
( 1st July-2009 to 30th June 2007)

వాలీబాల్ అకాడెమి, సరూర్ నగర్
3 వాలీబాల్ అకాడెమి, (సిద్దిపేట) సిద్దిపేట, వాలీబాల్ అకాడెమి 1 జూన్ 2025 (Under 14 to 16 years) Between (30th June 2009 to 1st July -2011)
4 వాలీబాల్ అకాడెమి –మహబూబ్ నగర్ మెయిన్ స్టేడియం గ్రౌండ్ మహబూబ్ నగర్ 12, 13 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011)
5 సైక్లింగ్ మరియు రెజ్లింగ్ అకాడెమి, సైక్లింగ్ వేలోడ్రోమ్,O.U., సైక్లింగ్ వేలోడ్రోమ్, O.U.,క్యాంపస్ 10 & 11 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011)
6 Regional క్రీడా వసతి గృహం, హనుమకొండ
DSA, జవహర్లాల్ నెహ్రు స్టేడియం, హనుమకొండ
10 & 11 జూన్ 2025 Under10-12 Years ( for Gymnastics & Swimming ) ( 30th June 2013 to 1st July 2015) Under 14 to 16 Years ( Athletics, Handball, Wrestling) ( 30th June 2009 to 1st July 2011)
7 హాకీ అకాడెమి, వనపర్తి DSA, హాకీ అకాడెమి, వనపర్తి 12 జూన్ 2025 (Under 14 to 16years)(30th June 2009 to 1st July -2011)
8 అథ్లెటిక్స్ అకాడెమి, ఖమ్మం DSA,సర్దార్ పటేల్ స్టేడియం, ఖమ్మం 12 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011)కావున,రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆసక్తిగల బాల బాలికలు పైన తెలిపిన స్పోర్ట్స్ అకాడెమీలలో మరియు స్పోర్ట్స్ హాస్టల్ లో అడ్మిషన్ పొందాలనుకొనే వారు పైన తెలిపిన తేదీలలో ఆయా సెంటర్లలో నిర్వహించే ఎంపికలకు/ సెలక్షన్ ట్రయల్స్ కు హాజరు కాగలరని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఎ.రాందాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉచిత క్రికెట్ వేసవి శిబిరం.

6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉచిత క్రికెట్ వేసవి శిబిరం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈనెల 6 నుంచి నెల రోజులపాటు ఉచిత క్రికెట్ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, గజ్వేల్ లలో అండర్- 14, 16, 19, 23 వయసు వారు పాల్గొనవచ్చని చెప్పారు. శిక్షణలో పాల్గొనేవారు
https://hycricket. org వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.

మినిస్టేడియంలో కొనసాగుతున్నకబడ్డీ రెజ్లింగ్ క్రీడలశిక్షణ.

మిని స్టేడియంలో కొనసాగుతున్న కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా యువజన,క్రీడల అధికారిని టీవీఎల్ సత్యవాణి ఆధ్వర్యంలో నర్సంపేట మిని స్టేడియంలో కబడ్డీ ఇంచార్జ్ కోచ్ యాట రవికుమార్ ముదిరాజ్, రెజ్లింగ్ ఇంచార్జ్ కోచ్ సిరపురపు మహేశ్ శిక్షణలో ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు సాయంత్రం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు బాల బాలికలకు కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి.

Kabaddi

ఈ శిక్షణలో పాల్గొనే విద్యార్థులు ప్రతిరోజు ఉదయం,సాయంత్రం మిని స్టేడియం నర్సంపేటలో జరిగే కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణకు హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు కబడ్డీ శిక్షణ కొరకు 9666623438, రెజ్లింగ్ శిక్షణ కొరకు 6305271260 నెంబర్లను సంప్రదించాలని డివైస్ ఓ టీవీఎల్ సత్యవాణి ఒక ప్రకటనలో తెలిపారు.

ఐపీఎల్ చరిత్రలో “చెత్త రికార్డు KKR vs CSK

ఐపీఎల్ చరిత్రలో ఒక చెత్త రికార్డు నమోదైంది.

“నేటిధాత్రి”..”స్పోర్ట్స్”..AP&TG

టోర్నీ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ CSK జట్టు ఒక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లను స్పిన్ బౌలింగ్‌లో కోల్పోయింది.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో  KKR జరిగిన మ్యాచ్‌లో ఈ అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది.

చెన్నై బ్యాటింగ్ లైనప్ కోల్‌కతా స్పిన్నర్ల ధాటికి పూర్తిగా కుప్పకూలింది.

వరుసగా వికెట్లు కోల్పోతూ, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తమ బలహీనతను స్పష్టంగా బయటపెట్టింది.

ఐపీఎల్ IPL చరిత్రలో ఏ జట్టు కూడా ఇంతకు ముందు స్పిన్ బౌలింగ్‌లో ఆరు వికెట్లు కోల్పోలేదు.

దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ విషయంలో ఒక అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన.!

కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన చిలువేరు సమ్మయ్య గౌడ్. 

యువత పట్ల సమ్మి గౌడ్ సహాయ సహకారాలు ఆదర్శనీయం – డివైఎఫ్ఐ యువజన సంఘం

కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామంలో సోమవారం డి వై ఎఫ్ ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ ను నిర్వహించిన సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సమ్మి గౌడ్ మాట్లాడుతూ క్రీడలు మానవ జీవితంలో అంతర్భాగమని క్రీడలు విద్యార్థుల మానసిక ఎదుగుదలకు సోపానాలని ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని ప్రతి ఒక్క విద్యార్థి క్రీడలలో పాల్గొనాలని పలికారు. అంతేకాదు క్రీడలతోనే ఉజ్వలమైన భవిష్యత్ ను పొందుతారని అన్నారు. క్రీడల వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండడమే కాకుండా మానసిక శారీరక దృఢత్వాన్ని పెంచుకోవచ్చని, అదేవిధంగా డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘం వారు మాట్లాడుతూ క్రీడలు నిర్వహించాలని ఆలోచనతో సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ సమ్మయ్య గౌడ్ వద్దకు వెళ్లి విషయం తెలిపిన వెంటనే వారు సానుకూలంగా స్పందించి యువత చెడు దారి పట్టుతున్న ఈ రోజుల్లో మీలో ఇలాంటి ఆలోచనలు రావడం గర్వించదగ్గ విషయమని మీరు ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా చేస్తున్న మీ కార్యక్రమాలకు నేను ఎల్లవేళలా అండగా ఉంటానని మాకు భరోసా కల్పించి మమ్మల్ని ముందుకు నడిచేలా ప్రోత్సహించి ప్రధమ బహుమతిగా రూ.10,116 లు అందజేస్తూ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అండగా ఉంటానని భరోసా కల్పించి మా ఆహ్వానం మేరకు విచ్చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా ద్వితీయ బహుమతిగా డి.ఈ విజయ్ రూ. 5,015 రూపాయలను అందిస్తున్నారని తెలిపారు..

ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్, కొండేటి కళాధర్, గొడిషాల వెంకన్న, రాచర్ల రాములు, గొర్రె వెంకన్న గౌడ్, కాలేరు వెంకన్న, కందుకూరి దాస్, తీగల సునీత, మేన్పు పద్మ, వల్లాల రాజేందర్, వల్లాల శ్రవణ్, అనిల్, శాల్వా సుమన్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్టిపిపి లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతం.

ఎస్టిపిపి లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతం.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ ఎస్టిపిపి టౌన్‌షిప్‌లో కరాటే శిక్షణా కేంద్రం 2021లో దారవత్ పంతుల విజన్‌తో, డైరెక్టర్ మరియు జీఎం (ఎస్టిపిపి)ఆమోదంతో స్థాపించబడింది.ఈ శిక్షణా కేంద్రం ద్వారా ఎస్ సి సి ఎల్, పవర్ మెక్ మరియు సి ఆర్ పి ఎఫ్ ఉద్యోగుల పిల్లలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కరాటే శిక్షణ పొందుతున్నారు. శారీరక దృఢతతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది.
ఈ శిక్షణా కేంద్రం అభివృద్ధికి ప్రతిఫలంగా,2025 ఏప్రిల్ 6వ తేదీ,ఆదివారం జైపూర్ ఎస్టిపిపి ఓపెన్ ఆడిటోరియంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్టిపిపి పవర్ ప్లాంట్ సింగరేణి జనరల్ మేనేజర్ కొండారెడ్డి శ్రీనివాసులు హాజరై టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బెల్ట్‌లు మరియు సర్టిఫికెట్లు అందజేశారు.

Karate beltt.

ఈ సందర్భంగా జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌కి ఎంపికైన విద్యార్థిని జనని ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ ఘనత ఎస్టిపిపి కరాటే శిక్షణా కేంద్రానికి గర్వకారణంగా నిలిచింది.కరాటే కోచ్ శివ మహేష్ మాట్లాడుతూ… దారవత్ పంతుల ప్రోత్సాహం వల్లే ఈ కార్యక్రమం ఇవాళ ఈ స్థాయికి ఎదిగింది అని అన్నారు.జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీజీఎంలు దారవత్ పంతుల, రాజేష్, జెంట్స్టోరియో స్టైల్ చీఫ్ కోచ్ రాజనర్స్,జూల శ్రీనివాస్ మరియు కోచ్ శివ మహేష్ పాల్గొన్నారు. 

బెట్టింగులకు ఆకర్షితులై యువత మోసపోవద్దు.

బెట్టింగులకు ఆకర్షితులై యువత మోసపోవద్దు

 

****మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్

*****మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బెట్టింగ్స్ కు ఆకర్షతులై డబ్బులు నష్టపోయి జీవితాలను సర్వం నాశనం చేసుకోవద్దని మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు. ఐపిఎల్ క్రికెట్ సీజన్ ప్రారంబమైన నేపథ్యంలో. మండలంలోని యువతకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ. తల్లిదండ్రులు, తమ కష్టార్జితాన్ని కన్న బిడ్డలు, బెట్టింగుల రూపంలో. డబ్బులను దోపిడీ దొంగలపాలు చేసి చివరకు తమ ప్రాణాలను తీసుకుంటున్నారని. పిల్లల్లో ఏదైనా మార్పులు గమనించినట్లయితే తల్లిదండ్రులు, పెద్దలు, వెంటనే తగిన చర్యలు తీసుకొని బెట్టింగులకు పాల్పడకుండా వారి ప్రవర్తనలో మార్పు తేవడానికి ప్రయత్నం చేసి వారిని సరియైన దారిలోకి తేవాలని అన్నారు. బెట్టింగులకు పాల్పడే వారిపైనా ప్రత్యేక నిఘా ఉంచామని బెట్టింగులకు పాల్పడి కోలుకొని విదంగా ఆస్థి నష్టం జరిగి చివరికి ఆత్మహత్య చేసుకుని మీ కుటుంబాలను రోడ్డున పడేయద్దని ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే మాకు సమాచారం ఇవ్వాలని మొగుళ్లపల్లి ఎస్సై బి అశోక్ మండల ప్రజలను కోరారు.

23 రాష్ట్రాల్లోని 50 నగరాల్లో టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దేశంలోని 23 రాష్ట్రాల్లోని 50 నగరాల్లో tata ipl fan park లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది మరియు మార్చి 22 నుండి ఛాంపియన్‌షిప్ అంతటా ఇవి పనిచేస్తాయి.

ప్రత్యక్ష మ్యాచ్ స్క్రీనింగ్‌లు, సంగీతం, వినోదం, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆట స్థలం మరియు వర్చువల్ బ్యాటింగ్ జోన్, నెట్స్ ద్వారా బౌలింగ్, ఫేస్-పెయింటింగ్ జోన్‌లు, రెప్లికా డగ్-అవుట్‌లు, చీర్-ఓ-మీటర్ మరియు 360 డిగ్రీల ఫోటో బూత్‌లతో సహా ఉత్తేజకరమైన యాక్టివేషన్‌లతో పూర్తి చేసిన ఫ్యాన్ పార్కులు అభిమానులను నిమగ్నం చేయడం మరియు దేశంలోని ప్రతి మూలకు ఐపీఎల్ థ్రిల్‌ను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాయని గురువారం మీడియా విడుదల తెలిపింది.

ఈ సీజన్‌లో మొదటి ఫ్యాన్ పార్కులు రోహ్‌తక్ (Haryana), బికనీర్ (Rajasthan), గ్యాంగ్‌టక్ (Sikkim), కొచ్చి (Kerala) మరియు కోయంబత్తూర్ (Tamil Nadu)లలో ప్రారంభమవుతాయి. ప్రతి వారాంతంలో వివిధ రాష్ట్రాలలో ఒకేసారి బహుళ ఫ్యాన్ పార్కులు నిర్వహించబడతాయి, గరిష్ట అభిమానుల నిశ్చితార్థాన్ని నిర్ధారిస్తాయి. కాకినాడ (ఆంధ్రప్రదేశ్), దిమాపూర్ (Nagaland), కరైకల్ (Puducherry), మన్భుమ్, పురులియా (West Bengal), రోహ్తక్ మరియు టిన్సుకియాలలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్‌లు జరగడం ఇదే మొదటిసారి.
“భారతదేశం అంతటా అభిమానులకు టోర్నమెంట్‌ను దగ్గరగా తీసుకురావాలనే మా దార్శనికతలో ipl fan park ‌లు కీలకమైన భాగం. బహుళ నగరాలు మరియు పట్టణాల్లో ఈ ఈవెంట్‌లను నిర్వహించడం ద్వారా, విద్యుదీకరించే స్టేడియం వాతావరణాన్ని తిరిగి సృష్టించడం మరియు అభిమానులు కలిసి ఐపీఎల్‌ను జరుపుకునేలా చేయడం మా లక్ష్యం. ఈ చొరవ దేశవ్యాప్తంగా క్రికెట్ ఔత్సాహికులతో మా బంధాన్ని బలపరుస్తుంది, వారు క్రీడ యొక్క ఉత్సాహం మరియు అభిరుచిని ఉత్సాహభరితమైన మరియు ఉత్సాహభరితమైన వాతావరణంలో అనుభవించేలా చేస్తుంది, ”అని ipl chairman anurag singh ధుమల్ అన్నారు.

ప్రశాంతతతోనే మెరుగైన ఫలితాలు.!

ప్రశాంతతతోనే మెరుగైన ఫలితాలు ఫోటో కాన్ కరాటే మాస్టర్ సిద్దు స్వామి.

జహీరాబాద్.నేటి ధాత్రి:

ఝరాసంగం,ఎలాంటి ఒత్తిడి, భయాందోళనలు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు వ్రాస్తేనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫోటో కాం కరాటే మాస్టర్ సిద్దు స్వామి మార్గదర్శనం చేశారు. బుధవారం ఝరాసంఘం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2024 – 25 విద్యా సంవత్సరానికి చెందిన 10 తరగతి విద్యార్థునులకు ఆత్మీయ వీడుకోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరాటే మాస్టర్ సిద్దు స్వామి10వ తరగతి విద్యార్థునులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ మేరకు పదవ తరగతి విద్యార్థునులకు పరీక్ష ప్యాడులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు.!

మై భారత్ నెహ్రు యువక కేంద్ర మెదక్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు,,,,,

కేంద్ర క్రీడల శాఖ యువజన సర్వీసులు ఉపాధి ఆఫర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో,,,,,

రామాయంపేట యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ నిర్వహణ,,,,

వాలీబాల్ ఫుట్బాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ సెటిల్ క్రీడల్లో పోటీలు,,,,

యువతలకు, యువకులకు 13 నుండి 29 సంవత్సరా లు,,,,,

కాలేజీ గ్రౌండ్లో 19 మార్చి నుండి 20 వరకు,,,

రామాయంపేట మార్చి18 నేటి ధాత్రి (మెదక్)

Sports

మైభారత్ యువభారత్ యువ ఉత్సవ్ యువతనుచైతన్య పంచడానికి క్రీడలు యువజన సర్వీసుల శాఖ స్వయం ఉపాధి అవేర్నెస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని యువతకు ఆటల ద్వారా స్ఫూర్తి కలిగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సిద్దిపేట నెహ్రూ యువ కేంద్ర అధికారి కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలుపుతూ రామాయంపేట పట్టణంలో గత 40 సంవత్సరాలుగా క్రీడలకు ప్రోత్సహిస్తూ అనేక శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్న యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ క్లబ్ కు మెదక్ జిల్లాస్థాయి స్పోర్ట్స్. మీట్ కార్యక్రమాన్ని నెహ్రూ యొక్క కేంద్ర ఆధ్వర్యంలో స్థానిక యువజ్యోతి నిర్వహిస్తుందని తెలిపారు మెదక్ జిల్లా స్థాయి ఈ పోటీలలో వాలీబాల్ కబడ్డీ ఫుట్బాల్ బ్యాట్మెంటన్ సెటిల్ పోటీలను 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు యువకులకు బాలురకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉచిత గాని క్రీడాకారులకు క్రీడలు నిర్వహిస్తామన్నారు భోజన సదుపాయము కల్పించడంతోపాటు క్రీడల్లో పాల్గొన్న వారికి కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ క్రీడల వారి సర్టిఫికెట్ అందజేస్తామన్నారు క్రీడల్లో పాల్గొన్న వారికి అలాగే విజేతలకు మెరిట్ సర్టిఫికెట్ మెమోటోస్ అందజేయడం జరుగుతుందన్నారు ఈ క్రీడల్లో పాల్గొనడానికి స్థానిక రామాయంపేట యువజ్యోతి కోఆర్డినేటర్ సత్యనారాయణకు పేర్లు అందజేయాలని కోరారు 9 0 00752850 ఫోన్ నెంబర్ కు తెలియజేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు 18 మార్చి చివరి తేదీ కాగా 19 20 తేదీల్లో క్రీడలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

68 వ అండర్ 14 రాష్ట్ర పుట్ బాల్ సెలక్షన్ పోటీలు..

68 వ అండర్ 14 రాష్ట్ర పుట్ బాల్ సెలక్షన్ పోటీలు ప్రారంభించిన

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జల్లెల చిన్నారెడ్డి

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి లో
68వ అండర్ 14 రాష్ట్ర స్థాయి బాల బాలికల ఫుట్ బాల్ సెలక్షన్ పోటీల ను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు .ఈసందర్భంగా డాక్టర్
చిన్నా రెడ్డి మాట్లాడుతూ
ప్రపంచంలో ఎక్కువగా ఇష్టపడే వారు గేమ్ ఫుట్ బాల్ అని అన్నారు.వనపర్తి లో హాకీ,ఫుట్ బాల్ క్రీడా పోటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది అనిఅన్నారు. వనపర్తి లో హాకీ క్రీడలో జాతీయస్థాయిలో ఆడిన క్రీడాకారులు చాలా ఎక్కువ మంది ఉన్నారని చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే మైదానంలో ఫుట్ బాల్ క్రీడను ఆడేవారని చిన్నారెడ్డి గుర్తు చేశారు.రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ క్రీడల పై ఇష్ట పడే వారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసుకుంటున్నా క్వార్టర్స్ లో ఫుట్ బాల్ ఆడటానికి ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసుకుంటూరని అన్నారు.వనపర్తి పట్టణం లో ఫుట్ బాల్ ,హాకీ స్టేడియాలను నిర్మించుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని చిన్నారెడ్డి తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున క్రీడాకారులు ఎక్కువ నీళ్లు త్రాగాలని సూచించారు. పోటీపడే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి, స్నేహభావంతో ఆడి అండర్ 14 క్రీడలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయికి ఆడి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు. ఈ
కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, కృష్ణ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బాల్ రాజ్ ,వెంకట్,మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగి వేణు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

క్రీడలు మానషిక ఉల్లాసానికి దోహదపడతాయి.

క్రీడలు మానషిక ఉల్లాసానికి దోహదపడతాయి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

sports

జహీరాబాద్ నియోజకవర్గ ము ,స్థానిక వశిష్ఠ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. పాఠశాల ల్లో, కళాశాల ల్లో విద్యార్థులు శారీరికంగా దృఢంగా, మానషికంగా ఎదగడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి అని వశిష్ఠ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిద్ధారెడ్డి అన్నారు. కళాశాల యాజమాన్యం ప్రతి సంవత్సరం ఔట్ డోర్ గేమ్ లు అనై కబడి, కోకో ,క్రికెట్ వీటితో పాటు ఇండోర్ గేమ్స్ అయిన క్యారమ్స్, చెస్ లు, క్విజ్ పోటీలు నిర్వయించి ప్రతి విజేత టీమ్ కి విన్నర్ ప్రైజ్ లు మరియు రన్నర్ టీమ్ లకు కూడా కప్ లు పథకాలు ఇచ్చి విద్యార్థులకు ప్రోత్సాహిస్తారు. చదువు తో పాటు చక్కని క్రమ శిక్షణ నతో విద్యార్థులు ఎదగాలని అధ్యాపక బృందం కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మారుతి రావు పాటిల్, డైరెక్టర్ లు అమర్నాథ్, సంజీవ్ రావ్,శశికాంత్ ,శంకర్ రావు,సంగన్న,శ్రీనివాస్,తదితరులున్నారు పాల్గొన్నారు.

కరాటే ప్రాధాన్యత ఇస్తున్న విద్యార్థులు.

కరాటే ప్రాధాన్యత ఇస్తున్న విద్యార్థులు

జహీరాబాద్. నేటి ధాత్రి:

Karate

 

ఝరాసంగం మండల కేంద్రమైన ప్రభుత్వ మాడల్ స్కూల్ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కరాటే క్లాసులు నిర్వహిస్తున్న సిద్దు,మాస్టర్ బ్లాక్ బెల్ట్ తార్దన్. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ.కరాటే క్లాసులు ప్రభుత్వ వేతనంతోనే మూడు నెలల పాటు విద్యార్థులకు కరాటే శిక్షణ ఇవ్వనున్నట్లు కొనియాడారు. విద్యార్థులకు విద్య, క్రీడలతో పాటు కరాటే తప్పనిసరి అన్నారు. కరాటే తో ప్రయోజనాలు తనను తాను రక్షించుకోవడమే కాకుండా ఇతరుల మధ్య ఘర్షణ చోటు చేసుకునే సమయంలో, ఎదుటి వ్యక్తులు ఆపదలో ఉన్నప్పుడు మనం కరాటే విద్య నేర్చుకుని ఉంటే ఎదుటి వ్యక్తులను సైతం కాపాడవచ్చు అని అన్నారు. రక్షణ లేని సమయంలో పోలీసులకు సందేశం వెళ్లిన పోలీసులు రావడానికి సమయం పట్టిన తనను తాను కాపాడుకోవడానికి ఇతరులను కాపాడానికైనా నేటి సమాజంలో రేపటి భవిష్యత్తుకు ప్రతి ఒక్క విద్యార్థికి కరాటే చాలా ముఖ్యమని అన్నారు.

ముగిసిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ,రెజ్లింగ్ పోటీలు పరిశీలించిన సీఎం ఓఎస్డీ 

రెజ్లింగ్ లో హనుమకొండకు ఏడు పతకాలు

“నేటిధాత్రి”, హనుమకొండ

రాష్ట్రస్థాయి సీఎంకప్ అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలు గురువారం ముగిసాయి. స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గత మూడు రోజులుగా జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపు 2వేల మంది ఈ పోటీలో పాల్గొన్నారు. గురువారం ఈ పోటీలను ముఖ్యమంత్రి ఓఎస్డీ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలను వీక్షించారు. గత కొన్ని రోజులుగా హనుమకొండలు జరుగుతున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ గురించి జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి గుగులోతు అశోక్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారులను సీఎం కప్ పోటీల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు సమకూర్చిన భోజనాన్ని ఆయన ప్రత్యేకంగా పరిశీలించడం కాకుండా భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడాకారులకు అందించిన వసతి సౌకర్యాలపై కోచ్ లు మేనేజర్లను అడిగారు. వీరితో పాటు డీసీపీ దేవేందర్ రెడ్డి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్, డివైఎస్ఓ గుగులోతు అశోక్ కుమార్, తెలంగాణ అథ్లెటిక్స్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు కె.సారంగపాణి, మహ్మద్ కరీం, ఎన్ఐటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డా.రవికుమార్ లు పాల్గొన్నారు.

హనుమకొండ రెజ్లర్ల హవా…

రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ లో హనుమకొండ జిల్లా రెజ్లర్ల హవా కొనసాగింది. రెజ్లర్లు అద్వితీయ ప్రతిభ కనబరిచి 4 స్వర్ణ , ఒక రజతం, రెండు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. సబ్ జూనియర్ 60 కేజీలో వి. గణేష్ స్వర్ణం, 53కేజీలో బి.అంజలి, 48 కేజీల విభాగంలో ఎస్.అర్జున్ సాగర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. జూనియర్ బాలికల 50 కేజీల విభాగంలో బి. ప్రణవి, 59 కేజీలో జె.చిన్ని , 61కేజీలో కొర్ర అఖిల్ స్వర్ణ పతకం

సాధించగా, 57కేజీలో ఎ.రాహుల్ రజత పతకం కైవసం చేసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను హనుమకొండ జిల్లా క్రీడల యువజన అధికారి గుగులోతు అశోక్ కుమార్, తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం, వరంగల్, హనుమకొండ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు వై.సుధాకర్, షేక్ రియాజ్, కోచ్ లు కందికొండ రాజు, ఎం.జైపాల్ లు అభినందించారు.

తగ్గేదే లే అంటున్న క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి

పుష్ప-2 క్రేజ్ మరియు అక్రమార్జన క్రికెట్ పిచ్‌లో కూడా దాని స్థానాన్ని పొందింది, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాపై నాల్గవ టెస్ట్ మూడో రోజున సినిమా యొక్క ఐకానిక్ పోజ్‌తో అజేయంగా 50 పరుగులను జరుపుకున్నాడు.

మెల్‌బోర్న్‌లోని మైదానంలో ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్ పోజు కొట్టిన క్లిప్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేసింది. వాస్తవానికి, BCCI కూడా రెడ్డికి ప్రశంసల పోస్ట్‌ను పోస్ట్ చేసింది, “ఫ్లవర్ నహీ, ఫైర్ హై. రెడ్‌డి యొక్క 119 బంతుల్లో నాక్ మరియు వాషింగ్టన్ సుందర్ అజేయంగా 40 పరుగులకు ధన్యవాదాలు, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వద్ద నిర్ణీత సమయానికి ముందే టీ తాగడానికి అంపైర్‌లు చెడు కాంతి మరియు చినుకులు పడటంతో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.

ఎన్నో ఏళ్ల కల సాకారం

2036 ఒలింపిక్స్ ఇండియాలోనే

VOICE
భారత్‌ను స్పోర్ట్స్ పవర్‌హౌస్‌గా మార్చాలనే ప్రధాని మోదీ సంకల్పానికి అనుగుణంగా ఓ కీలకమైన అడుగు పడింది. విశ్వక్రీడలైన ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ రెడీ అవుతోంది. 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. స్వదేశంలో తొలిసారి విశ్వక్రీడా పండుగను జరిపేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. 2036లో జరగబోయే విశ్వక్రీడల హక్కుల సాధన కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అక్టోబర్ 1వ తేదీన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పంపించినట్టు క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. భారత్‌లో ఒలింపిక్స్ వంటి మెగా క్రీడలను నిర్వహిస్తే ఐఓసి లాభం చేకూరే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అందుకే ఐఓసి కూడా భారత్‌కే ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం కల్పించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత క్రీడా రంగానికి కొత్త జోష్ లభించడం ఖాయం

టీ20ల్లో 500 సిక్సర్లు బాదిన తొలి భారతీయుడిగా రోహిత్ శర్మ నిలిచాడు

వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్’ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

టీ20 క్రికెట్‌లో 500 సిక్సర్లు బాదిన తొలి భారతీయుడిగా భారత్ మరియు ముంబై ఇండియన్స్ (MI) స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నిలిచాడు.

వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్’ ఈ మైలురాయిని సాధించాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version