కేఎల్ రాహుల్ కష్టం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

సెంచరీలు ఊరికే రావు.. కేఎల్ రాహుల్ కష్టం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

 

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు.

పరుగుల వరద పారిస్తున్న రాహుల్..

ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు.

 

 

 

 

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ ఫార్మాట్లకు అతీతంగా రాణిస్తున్నాడు. టీ20, వన్డే, టెస్టులు.. ఇలా ఫార్మాట్ ఏదైనా సరే బరిలోకి దిగితే పరుగుల వర్షం కురిపించాల్సిందే అనేలా అతడి బ్యాటింగ్ సాగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన రాహుల్.. ఆ తర్వాత ఐపీఎల్‌లో అదే ఫామ్‌ను కొనసాగించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. లీడ్స్ టెస్ట్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో 137 పరుగులతో భారత బ్యాటింగ్‌ను ముందుండి నడిపించాడు. అతడి సెంచరీకి అంతా ఇంప్రెస్ అవుతున్నారు. వాటే బ్యాటింగ్ అంటూ మెచ్చుకుంటున్నారు.

సెంచరీ బాదిన రాహుల్.. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (118)తో కలసి నాలుగో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వీళ్లిద్దరూ రాణించడం వల్లే 364 పరుగులు చేయగలిగింది భారత్. దీంతో రాహుల్‌ను అంతా పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు కనపడకుండా చేస్తున్నాడని, అతడి బ్యాటింగ్ అద్భుతమని ప్రశంసిస్తున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో కేఎల్ ప్రాక్టీస్ వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మ్యాచ్‌కు వెళ్లే ముందు సన్నాహకాల్లో రాహుల్ పడిన కష్టాన్ని ఇందులో చూడొచ్చు.

ప్రభుత్వ క్రీడా పాఠశాలల ఎంపికలను ప్రారంభించిన.

ప్రభుత్వ క్రీడా పాఠశాలల ఎంపికలను..ప్రారంభించిన. ఎంఈఓ కాలేరు యాదగిరి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాఠశాలల ఎంపికలను(హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్) గురువారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేసముద్రం స్టేషన్ నందు మండల ఎంఈఓ కాలేరు యాదగిరి గారు క్రీడ ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇప్పుడు నిర్వహించే ఫిజికల్ పరీక్షలు తొమ్మిది విభాగంలో నిర్వహిస్తారని. ప్రతి విద్యార్థిని, విద్యార్థులు, ఇందులో పాల్గొని ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఇక్కడ ఎంపికైన వారు ఈనెల 24వ తేదీన జిల్లాలో జరిగే ఎంపిక పోటీలకు హాజరు కావాల్సిందిగా సూచించారు. కాగా మండలం నుండి సుమారుగా 26 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు, ఫిజికల్ డైరెక్టర్స్ డాక్టర్.కొమ్మురాజేందర్, కొప్పుల శంకర్, దామల్ల విజయ చందర్, పద్మ, మధు, తదితరులు పాల్గొన్నారు.

3 సూపర్‌ ఓవర్లతో రికార్డు .

3 సూపర్‌ ఓవర్లతో రికార్డు

 

క్రికెట్‌ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమం కావడం అరుదుగా చోటు చేసుకుంటుంది. అలాంటి వేళ విజేతను తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ను నిర్వహిస్తుంటారు. అలాగే సోమవారం రాత్రి…
గ్లాస్గో: క్రికెట్‌ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమం కావడం అరుదుగా చోటు చేసుకుంటుంది. అలాంటి వేళ విజేతను తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ను నిర్వహిస్తుంటారు. అలాగే సోమవారం రాత్రి నేపాల్‌-నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ కూడా టై అయ్యింది. అయితే ఇక్కడ ఫలితం తేలేందుకు ఒక్క సూపర్‌ ఓవర్‌ సరిపోలేదు. ఏకంగా మూడుసార్లు ఇరు జట్లు బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పటి వరకు టీ20 లేక లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌ల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. ముందుగా నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 152/7 స్కోరు చేసింది. ఛేదనలో నేపాల్‌ చివరి ఓవర్‌లో రెండు ఫోర్లతో సరిగ్గా 152/8 స్కోరే చేసింది. దీనికి తోడు రెండు జట్లు కూడా తొలి సూపర్‌ ఓవర్‌లో 19, రెండో సూపర్‌ ఓవర్‌లో 17 పరుగులు సాధించడంతో మూడోసారి అనివార్యమైంది. అందులో నేపాల్‌ పరుగులేమీ చేయకుండా 4 బంతుల్లో 2 వికెట్లు కోల్పోగా.. నెదర్లాండ్స్‌ ఓ సిక్సర్‌తో మ్యాచ్‌ను విజయంతో ముగించింది.

రోహిత్ శర్మ రికార్డ్ సమం..

రోహిత్ శర్మ రికార్డ్ సమం.. అద్భుత సెంచరీ సాధించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్

 

shine junior college

 

 

 

 

 

 

చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్‌తో రాణించాడు. తన సత్తా ఏంటో చూపించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్‌తో నిరాశపరిచాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితులు కూడా తలెత్తాయి.

 

 

 

 

 

 

 

చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) బ్యాట్‌తో రాణించాడు. తన సత్తా ఏంటో చూపించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్‌తో నిరాశపరిచాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితులు కూడా తలెత్తాయి. అయితే ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ఆడుతున్న మ్యాక్స్‌వెల్ అద్భుత సెంచరీతో అలరించాడు (Glenn Maxwell Century). ఈ క్రమంలో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు.

 

 

 

 

 

 

 

 

 

మేజర్ లీగ్ క్రికెట్ లీగ్‌-2025లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడమ్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు కెప్టెన్ అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కేవలం 48 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి, జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాక్సీ తన ఇన్నింగ్స్‌లో 13 భారీ సిక్సర్లతో పాటు 2 ఫోర్లు కూడా కొట్టాడు. మొత్తానికి 49 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఇది మ్యాక్స్‌వెల్ టీ20 కెరీర్‌లో ఎనిమిదో సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్.. రోహిత్ శర్మ, జోస్ బట్లర్ సరసన చేరాడు.

 

 

 

 

 

 

 

రోహిత్, బట్లర్, ఫించ్, వార్నర్ కూడా ఎనిమిదేసి టీ-20 సెంచరీలు సాధించారు. అలాగే టీ-20ల్లో 10, 500 పరుగులు, 170 కంటే ఎక్కువ వికెట్లు, 5 కంటే ఎక్కువ సెంచరీల చేసిన ఏకైక ఆటగాడిగా అరుదైన రికార్డును మ్యాక్స్‌వెల్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ-20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా క్రిస్ గేల్ (22) అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ తర్వాత పాకిస్తాన్ బాబర్ ఆజామ్ (11) రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన రౌలీ రూసో, విరాట్ కోహ్లీ తొమ్మిదేసి సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు.

మళ్లీ అగ్రపీఠంపై మంధాన

మళ్లీ అగ్రపీఠంపై మంధాన

shine junior college

 

ఐసీసీ మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ స్మృతి మంధాన ఆరేళ్ల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం…
దుబాయ్‌: ఐసీసీ మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ స్మృతి మంధాన ఆరేళ్ల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో స్మృతి 727 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీ్‌సలో 52 సగటుతో 264 పరుగులు సాధించడంతో ఆమె ర్యాంక్‌ మెరుగుపడింది. బ్రంట్‌ (ఇంగ్లండ్‌), లారా వోల్వార్ట్‌ (దక్షిణాఫ్రికా) 2, 3 ర్యాంకుల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో ఎకెల్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌), గార్డ్‌నర్‌ (ఆస్ట్రేలియా), మేగాన్‌ (ఆస్ట్రేలియా), దీప్తి శర్మ (భారత్‌) తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.

వైభవ్‌ ఫ్రెండ్‌ అయాన్‌ దుమ్మురేపాడు 

వైభవ్‌ ఫ్రెండ్‌ అయాన్‌ దుమ్మురేపాడు 

shine junior college

 

ఐపీఎల్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ స్ఫూర్తితో బిహార్‌కే చెందిన మరో చిచ్చరపిడుగు అయాన్‌ రాజ్‌ ట్రిపుల్‌ సెంచరీతో దుమ్మురేపాడు…
ముజ్‌ఫర్‌పూర్‌ (బిహార్‌): ఐపీఎల్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ స్ఫూర్తితో బిహార్‌కే చెందిన మరో చిచ్చరపిడుగు అయాన్‌ రాజ్‌ ట్రిపుల్‌ సెంచరీతో దుమ్మురేపాడు. డిస్ట్రిక్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో సంస్కృతి క్రికెట్‌ అకాడమీ తరఫున 13 ఏళ్ల అయాన్‌ కేవలం 134 బంతుల్లో 327 పరుగులు సాధించాడు. అందులో 22 సిక్సర్లు, 41 ఫోర్లు ఉన్నాయి. అయాన్‌, వైభవ్‌ మంచి స్నేహితులు. వీరిద్దరూ కలసి ప్రాక్టీస్‌ కూడా చేసేవారు. ‘వైభవ్‌ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అతడి బాటలోనే నేనూ నడుస్తున్నాన’ని అయాన్‌ చెప్పాడు. రాజ్‌ తండ్రి కూడా క్రికెటర్‌ కావడం విశేషం.

అండర్సన్‌ టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా.

అండర్సన్‌ టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా…

shine junior college

అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన నేపథ్యంలో అండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదాపడింది. గతంలో. లండన్‌: అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన నేపథ్యంలో అండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదాపడింది. గతంలో ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య సిరీ్‌సను పటౌడీ ట్రోఫీగా వ్యవహరించేవారు. అయితే, ఇంగ్లండ్‌ బోర్డు ఆ పేరు మార్చి ఆధునిక దిగ్గజాలు అండర్సన్‌-టెండూల్కర్‌ పేరున ట్రోఫీని తీసుకురావాలనే నిర్ణయం తీసుకొంది. సిరీస్‌ ఆరంభమయ్యే ముందే ట్రోఫీ ఆవిష్కరణ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.

కెనడియన్‌ గ్రాండ్‌ ప్రీ విజేత జార్జ్‌.

కెనడియన్‌ గ్రాండ్‌ ప్రీ విజేత జార్జ్‌

 

 

shine junior college

 

 

ఫార్ములావన్‌ స్టార్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు కెనడియన్‌ గ్రాండ్‌ ప్రీలో చుక్కెదురైంది. ఫైనల్‌ రేసులో వెర్‌స్టాపెన్‌కు షాకిస్తూ…

మాంట్రియల్‌: ఫార్ములావన్‌ స్టార్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు కెనడియన్‌ గ్రాండ్‌ ప్రీలో చుక్కెదురైంది. ఫైనల్‌ రేసులో వెర్‌స్టాపెన్‌కు షాకిస్తూ.. మెర్సిడెస్‌ డ్రైవర్‌ జార్జ్‌ రస్సెల్‌ చాంపియన్‌గా నిలిచాడు. మ్యాక్స్‌ రెండోస్థానానికి పరిమితమవగా.. మెర్సిడె్‌సకే చెందిన కిమి ఆంటోనెలి మూడోస్థానంతో పోడియం ఫినిష్‌ చేశాడు. బ్రిటన్‌కు చెందిన 27 ఏళ్ల జార్జ్‌కిది ఎఫ్‌-1 కెరీర్‌లో నాలుగో విజయం.

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో అశ్విన్‌

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో అశ్విన్‌

 

shine junior college

భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతవారం మహిళా అంపైర్‌తో గొడవకు దిగిన అతను తాజాగా…

 

కోయంబత్తూరు: భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతవారం మహిళా అంపైర్‌తో గొడవకు దిగిన అతను తాజాగా బంతి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించాడంటూ మధురై పాంథర్స్‌ జట్టు ఫిర్యాదు చేసింది. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)లో అశ్విన్‌ దుండిగల్‌ డ్రాగన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈనెల 14న ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ‘డ్రాగన్స్‌ జట్టు ఆటగాళ్లు రసాయనాల్లో ముంచిన టవళ్లతో బంతిని పదేపదే తుడిచారు. తద్వారా బంతి బరువును పెంచాలని చూశారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఇందుకు తగిన ఆధారాలను చూపడంలో మధుర జట్టు విఫలమైందని టీఎన్‌పీఎల్‌ ప్రకటించింది.

ఆర్చరీలో తెలుగమ్మాయి రెండు ప్రపంచ రికార్డులు.

ఆర్చరీలో తెలుగమ్మాయి రెండు ప్రపంచ రికార్డులు

 

shine junior college

 

సింగపూర్‌లో జరుగుతున్న ఆసియాకప్‌ స్టేజ్‌ 2 అండర్‌-21 ఆర్చరీ ర్యాంకింగ్‌ రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి బుద్ధె షణ్ముఖి నాగసాయి…

విజయవాడ స్పోర్ట్స్‌: సింగపూర్‌లో జరుగుతున్న ఆసియాకప్‌ స్టేజ్‌ 2 అండర్‌-21 ఆర్చరీ ర్యాంకింగ్‌ రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి బుద్ధె షణ్ముఖి నాగసాయి రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. 50 మీటర్ల కాంపౌండ్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌లో షణ్ముఖి, తేజల్‌ సాల్వే, తనిష్కలతో కూడిన భారత జట్టు 2101 పాయింట్లు స్కోరుచేసి వరల్డ్‌ రికార్డు సాధించింది. ఈ క్రమంలో 2076 పాయింట్ల రికార్డును అధిగమించింది. ఇక మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో షణ్ముఖి, కుషాల్‌ దలాల్‌ ద్వయం 1420 పాయింట్లు స్కోరు చేసి గత వరల్డ్‌ రికార్డు (1419)ను అధిగమించింది.

అవి చీకటి రోజులు.

అవి చీకటి రోజులు

 

shine junior college

 

 

లండన్‌: గత దేశవాళీ సీజన్‌లో పరుగుల వరద పారించిన కరుణ్‌ నాయర్‌కు ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత జాతీయ జట్టులో చోటు లభించింది. ఈ నేపథ్యంలో…

న్యూఢిల్లీ: లండన్‌: గత దేశవాళీ సీజన్‌లో పరుగుల వరద పారించిన కరుణ్‌ నాయర్‌కు ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత జాతీయ జట్టులో చోటు లభించింది. ఈ నేపథ్యంలో తన క్రికెట్‌ కెరీర్‌లో ఎత్తుపల్లాలను తలుచుకుంటూ 33 ఏళ్ల నాయర్‌ ఉద్వేగానికి గురయ్యాడు. ‘2022 ఏడాది చివరి రోజులు నా కెరీర్‌లో అత్యంత చీకటిమయం’ అని ఆర్‌.అశ్విన్‌ యూట్యూబ్‌ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నాయర్‌ తెలిపాడు. దేశవాళీ పోటీల్లో సత్తా చాటినా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైన కరుణ్‌.. ‘డియర్‌ క్రికెట్‌. నాకు మరో అవకాశం ఇవ్వు’ అంటూ 2022 డిసెంబరులో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం సంచలనం రేపింది. ‘గత రెండు మూడు సంవత్సరాలుగా నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. ఈ సమయంలో ప్రతి క్షణం ఎంత విలువైనదో తెలుసుకున్నా. దాంతో ప్రతి రోజును కొత్తగా భావించా’ అని కరుణ్‌ తెలిపాడు. సెహ్వాగ్‌ తర్వాత టెస్ట్‌ల్లో త్రిశతకం బాదిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కిన నాయర్‌ను 2018లో ఎలాంటి కారణం చూపకుండా టీమిండియానుంచి తప్పించడం గమనార్హం.

సఫారీలు సాధించారు.

సఫారీలు సాధించారు

 

రెండేళ్ల పాటు అద్భుత విజయాలతో సాగిన దక్షిణాఫ్రికా ప్రయాణం.. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పను కైవసం చేసుకోవడంతో ముగిసింది. శనివారం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన…

ఫైనల్లో ఆసీ్‌సపై ఘనవిజయం

27 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ టైటిల్‌ సొంతం

 

 

 

 

 

ప్రైజ్‌మనీ

దక్షిణాఫ్రికాకు – రూ. 31.05 కోట్లు

ఆస్ట్రేలియాకు – రూ. 18.63 కోట్లు

 

ఏళ్లు కాదు.. దశాబ్దాలపాటు ఎదురుచూసిన తరుణమిది. తమ శక్తి యుక్తులన్నీ ధారపోసి పోరాడినా ఐసీసీ టోర్నీల్లో నిరాశగా వెనుదిరగడమే చూసిన దక్షిణాఫ్రికా ఇప్పుడు సగర్వంగా ‘గద’ ఎత్తుకుంది. ఒత్తిడికి చిత్తయ్యే జట్టంటూ.. చోకర్స్‌గా ముద్ర వేసి క్రీడాలోకం పరిహసించినా.. క్రికెట్‌ పుట్టినిల్లుగా భావించే లార్డ్స్‌లోనే ‘ఇదిగో ఇదీ మా సత్తా’ అంటూ వరల్డ్‌ టెస్టు చాంపియన్స్‌ హోదాలో పోడియంపై నిలిచింది. బలమైన ప్రత్యర్థి ఆసీస్‌ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో విలవిల్లాడిన బ్యాటర్లు లక్ష్య ఛేదనలో మాత్రం తెగించి నిలబడ్డారు. శతక వీరుడు మార్‌క్రమ్‌తో పాటు చీలమండ గాయం ఇబ్బందిపెట్టినా గెలుపు కోసం కెప్టెన్‌ బవుమా క్రీజులో నిలిచిన తీరుకు వహ్వా.. అనాల్సిందే. దీంతో 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీల్లో సఫారీలు విజేతలయ్యారు

 

లండన్‌: రెండేళ్ల పాటు అద్భుత విజయాలతో సాగిన దక్షిణాఫ్రికా ప్రయాణం.. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పను కైవసం చేసుకోవడంతో ముగిసింది. శనివారం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన బవుమా సేన ఐసీసీ టెస్టు గదను సగర్వంగా అందుకుంది. అలాగే ఈ జట్టుకిది వరుసగా ఎనిమిదో టెస్టు విజయం కాగా.. 1998లో నాకౌట్‌ ట్రోఫీ తర్వాత రెండో ఐసీసీ టోర్నీ విజయం కావడం విశేషం. అటు ఇప్పటికే పది ఐసీసీ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న ఆసీస్‌ రెండోసారి డబ్ల్యూటీసీ టైటిల్‌పై ఆశలు పెట్టుకున్నా నిరాశే ఎదురైంది. 2010 (టీ20 వరల్డ్‌కప్‌) తర్వాత కంగారూలు ఓ ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఓడడం ఇదే తొలిసారి. నాలుగో రోజు కేవలం విజయానికి 69 పరుగుల దూరంలో నిలిచిన సఫారీలు తమ రెండో ఇన్నింగ్స్‌లో 282/5 స్కోరు సాధించారు. మార్‌క్రమ్‌ (136), బవుమా (66) గెలుపులో కీలక పాత్ర పోషించారు. స్టార్క్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 212, సౌతాఫ్రికా 138 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులు సాధించిన ఆసీస్‌ ప్రత్యర్థి ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మార్‌క్రమ్‌ నిలిచాడు.

 

 

తొలి సెషన్‌లోనే..: నాలుగో రోజు 213/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన సౌతాఫ్రికా గెలుపునకు మరో 69 పరుగులే చేయాల్సివుంది. ఆసీస్‌ బౌలర్లు సఫారీలపై ఒత్తిడి పెంచేందుకు స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బంతులు విసిరారు. వికెట్ల కోసం ఆసీస్‌ తమకున్న మూడు రివ్యూలను కూడా వాడేసుకుంది. కొత్త బంతిని సైతం తీసుకున్నా.. మొక్కవోని ఏకాగ్రతతో బ్యాటర్లు క్రీజులో నిలిచారు. తొలి సెషన్‌లో కేవలం మూడు బౌండరీలు మాత్రమే వచ్చాయి. అయితే మూడో ఓవర్‌లోనే కెప్టెన్‌ బవుమాను కమిన్స్‌ దెబ్బతీయడంతో మూడో వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ మార్‌క్రమ్‌ వారికి అడ్డుగా నిలిచాడు. స్టబ్స్‌ (8)తో కలిసి నాలుగో వికెట్‌కు 24.. బెడింగమ్‌ (21 నాటౌట్‌)తో కలిసి ఐదో వికెట్‌కు 35 పరుగులు జోడించాడు. గెలుపునకు మరో 6 పరుగుల దూరంలో అతడి 6 గంటల 23 నిమిషాల సుదీర్ఘ పోరాటానికి పేసర్‌ హాజెల్‌వుడ్‌ తెరదించాడు. మార్‌క్రమ్‌కు ఇరు జట్ల ఆటగాళ్లతో పాటులార్డ్స్‌ ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు. చివరకు 84వ ఓవర్‌లో స్టార్క్‌ వైడ్‌ ఫుల్‌టా్‌సను కవర్‌ పాయింట్‌ వైపు వెరెయిన్‌ (4 నాటౌట్‌) సింగిల్‌ తీయడంతో దక్షిణాఫ్రికా అంతులేని సంబరాల్లో మునిగింది.

 

 

టీమిండియా వల్ల నిద్రపట్టలేదు..

టీమిండియా వల్ల నిద్రపట్టలేదు.. మార్క్రమ్ ఎమోషనల్!

 

 

 

 

 

ఐసీసీ ట్రోఫీ దాహాన్ని ఎట్టకేలకు తీర్చుకుంది సౌతాఫ్రికా. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకుంది ప్రొటీస్.

సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు రావడం ఖాళీ చేతులతో ఇంటిదారి పట్టడం.. గత రెండు దశాబ్దాలుగా ఐసీసీ టోర్నమెంట్లలో సౌతాఫ్రికా పరిస్థితి ఇది. టీ20లు, వన్డేలు, టెస్టులు అనే తేడాల్లేకుండా ప్రతి ఫార్మాట్‌లోనూ అదరగొట్టడం, మేజర్ టోర్నమెంట్స్‌లో నాకౌట్స్ వరకు దూసుకురావడం.. కీలకపోరులో చతికిలపడటం వాళ్లకు ఓ సంప్రదాయంలా మారింది. దీంతో వాళ్లపై చోకర్స్ అనే ముద్ర పడింది. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ మొదలైనప్పుడు సఫారీలకు మరో ఓటమి తప్పదని చాలా మంది అనుకున్నారు. అయితే అంతా రివర్స్ అయింది. చెలరేగి ఆడిన బవుమా సేన.. కంగారూలను చిత్తు చేసి 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకున్నారు. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ హీరో ఎయిడెన్ మార్క్రమ్ కూడా ఎమోషనల్ అయ్యాడు.

ఆసీస్‌పె చిరస్మరణీయ విజయం సాధించడంతో మార్క్రమ్ భావోద్వేగానికి లోనయ్యాడు. సహచర ఆటగాళ్లతో కలసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్-2025 ఫైనల్‌ను తలచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్ చేతుల్లో ఓడటంతో తనకు నిద్రపట్టలేదన్నాడు. ఆ పోరులో ఔట్ ‌అయ్యాక ఒంటరిగా కూర్చొని ఉండిపోయానని, ఆ క్షణం చాలా నిస్సహాయంగా అనిపించిందన్నాడు. అప్పుడే నిర్ణయించుకున్నానని, ఇలాంటి సమయం వస్తే అలా కూర్చోకూడదని, అటో ఇటో తేల్చేయాలని డిసైడ్ అయ్యానని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.

‘నిన్న మొత్తం టీ20 ప్రపంచ కప్ గురించి ఆలోచించా. ఔట్ అయ్యాక నిస్సహాయంగా ఎలా కూర్చున్నానో గుర్తొచ్చింది. అందుకే మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకురావొద్దని నిర్ణయించుకున్నా. ఇది నాలో స్ఫూర్తిని నింపింది. అందుకే ఆసీస్‌తో పోరులో క్రీజులో పాతుకొనిపోయా. నా బాధ్యత నేను నిర్వర్తించాలి, జట్టు గెలుపు కోసం సాధ్యమైనంతగా పోరాడాలి అనేది దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్ చేశా’ అని మార్క్రమ్ వ్యాఖ్యానించాడు.

బన్నీ హాప్స్‌ క్యాచ్‌లు కుదరవు.

బన్నీ హాప్స్‌ క్యాచ్‌లు కుదరవు

 

 

 

 

బౌండరీల దగ్గర పట్టే ‘బన్నీ హాప్స్‌’ క్యాచ్‌ల విషయంలో మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్యాచ్‌ విషయంలో ఫీల్డర్‌ నియంత్రణ…

దుబాయ్‌: బౌండరీల దగ్గర పట్టే ‘బన్నీ హాప్స్‌’ క్యాచ్‌ల విషయంలో మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్యాచ్‌ విషయంలో ఫీల్డర్‌ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటే మైదానంలో ఉన్నప్పుడే బంతిని పైకి విసిరి.. లైన్‌ దాటి తిరిగి లోనికి వచ్చే అందుకోవాల్సి ఉంటుంది. అంటే బౌండరీ బయట బంతిని పలుమార్లు ఎగర వేయడం కుదరదు. ఈనెల నుంచే కొత్త రూల్‌ ఐసీసీ ప్లేయింగ్‌ కండిషన్‌లో భాగం కానుండగా.. వచ్చే ఏడాది అక్టోబరు నుంచి ఎంసీసీ రూల్‌ ఆఫ్‌ లాలో అధికారికంగా చేరుస్తారు. మరోవైపు వన్డేల్లో రెండు కొత్తబంతుల నిబంధనల్లో మార్పు, కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్రొటోకాల్‌ను ఐసీసీ ఆమోదించింది.

17 ఏళ్ల తర్వాత రాక్షసుడి రీఎంట్రీ..

17 ఏళ్ల తర్వాత రాక్షసుడి రీఎంట్రీ.. జాన్ సీనాకు ఇక దబిడిదిబిడే!

 

 

 

 

17 ఏళ్లుగా రాయల్ రంబుల్‌కు దూరంగా ఉన్న ఓ రాక్షసుడు రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అతడు గానీ వస్తే చాంపియన్ జాన్ సీనాకు కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబుల్ గెలవాలనేది ప్రతి రెజ్లర్ కల. ఈ ఒక్క ట్రోఫీ గెలిస్తే వాళ్ల కెరీరే మారిపోతుంది. రాయల్ రంబుల్‌లో గెలిచిన రెజ్లర్లకు రసల్ మేనియాలో వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కుతుంది. అక్కడ కూడా నెగ్గితే డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో వాళ్లు ఎప్పటికీ నిలిచిపోతారు. అందుకే ప్రతి రెజ్లర్ రాయల్ రంబుల్ మీదే దృష్టి పెడతాడు. అయితే ఈ పోరులో నెగ్గడం అంత ఈజీ కాదు. యంగ్ రెజ్లర్లు, స్టార్లతో పాటు ఒకప్పుడు అందర్నీ వణికించిన మాజీలు కూడా పోటీలో నిలుస్తారు. వచ్చే రాయల్ రంబుల్ కోసం అలాంటి ఓ రాక్షసుడే రాబోతున్నాడు. అతడే స్నిట్‌స్కీ.

39వ రాయల్ రాయల్ రంబుల్‌కు ఇంకా 6 నెలల సమయం ఉంది. కానీ ఇప్పటినుంచే దానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. వచ్చే రాయల్ రంబుల్‌లో మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ స్నిట్‌స్కీ పాల్గొనబోతున్నాడు. 2008 నుంచి డబ్ల్యూడబ్ల్యూఈకి దూరంగా ఉంటున్న ఈ వెటరన్ రెజ్లర్.. రాయల్ రంబుల్‌లో గెలవాలనే కసితో కనిపిస్తున్నాడు. తాను ఇంకా రిటైర్ కాలేదని అంటున్నాడీ 55 ఏళ్ల స్టార్. స్నిట్‌స్కీతో జాన్ సీనాకు దబిడిదిబిడేనని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో సీనాతో పాటు బటిస్టా, సీఎం పంక్ లాంటి చాంపియన్ రెజ్లర్లకు అతడు టఫ్ ఫైట్ ఇచ్చాడని.. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో ఆడితే అదిరిపోతుందని చెబుతున్నారు.

 

స్నిట్‌స్కీకి అంత సీన్ లేదని.. క్రేజ్ కోసమే అతడు రీఎంట్రీ ఇస్తున్నాడని మరికొందరు నెటిజన్స్ చెబుతున్నారు. ఈసారి పప్పులు ఉడకవని, అతడో సాధారణ రెజ్లర్ అని చెబుతున్నారు. కాగా, 2025 డిసెంబర్‌లో డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెబుతున్నట్లు ఇప్పటికే జాన్ సీనా ప్రకటించాడు. ఆ లెక్కన అతడు వచ్చే రాయల్ రంబుల్‌లో ఆడకపోవచ్చు. కానీ ఒకవేళ ఆడితే మాత్రం స్నిట్‌స్కీతో పాటు ఇతర రెజ్లర్లకు చుక్కలేనని సీనా అభిమానులు చెబుతున్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక ద్రుఢత్వం లభిస్తుంది.


క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక ద్రుఢత్వం లభిస్తుంది

ప్రతి మండలానికి ఒక క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

చందుర్తి నేటిధాత్రి:

క్రీడలతో మానసిక ఉల్లాసం,శారీరక ద్రుఢత్వం లభిస్తుందనీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..శుక్రవారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహించిన మూడపల్లి ప్రీమియం లీగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలేజ్ టూ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి విజేత తంగళ్ళపల్లి రెండో విజేత మూడ పల్లి గ్రామ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు…

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందనీ తెలిపారు…మన ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు..గతంలో విద్యార్థి దశలో ఉన్న
సమయంలో కోర్టు లైన్ పోసే వాడినని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు..

ఎల్లపుడూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహారాలు ఉంటాయని అన్నారు.. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డి పోటీలు జిల్లా పరిదిలో తన వంతు ప్రోత్సాహకం ఉంటుందన్నారు… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాలకు పెద్ద పీట వేస్తన్నరని అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు…

క్రీడాకారులు జీవితంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు.. సిరిసిల్ల ప్రాంతంలో మంత్రుల చేతుల మీదుగా అనేక అభివ్రుద్ది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిoదన్నారు..

మన ప్రాంతంలో కోరుట్ల, సిరిసిల్ల,వేములవాడ ప్రాంతాల్లో క్రీడాకారులకు నూతన స్టేడియం లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.. ఇప్పటికే సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ తెప్ప వద్ద క్రీడా ప్రాంగణాన్ని చూడటం జరిగిందనీ తెలిపారు..గ్రామీణ ప్రాంతాల్లోనీ క్రీడాకారులను వేలికి తీయడానికి సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపoటి రామస్వామి, మాజీ జెడ్పిటిసి నాగం కుమార్, సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కం మోహన్, నాయకులు. బద్దం తిరుమలరెడ్డి, ప్రసాద్, బాణాల రవీందర్ పుల్కల్ లచ్చయ్య, మేకల గణేష్ క్రీడాకారులు పాల్గొన్నారు.

బాల్ బ్యాడ్మింటన్ జూన్ 15 నుండి ప్రతి ఆదివారం

బాల్ బ్యాడ్మింటన్ జూన్ 15 నుండి ప్రతి ఆదివారం కోచింగ్

జిల్లా స్పోర్ట్స్ చిర్రా రఘు

గణపురం నేటి ధాత్రి :

 

గణపురం మండలంలో మే ఒకటో తారీకు నుండి మొదలుకొని జూన్ ఆరో తారీకు వరకు సమ్మర్ క్యాంప్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. తదుపరి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ చిర్రా రఘు అనుమతితో తేదీ 15 .6 .1925 నుండి ప్రతి ఆదివారం గణపురం ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో బాల్ బ్యాట్మెంటన్ కోచింగ్ ఇవ్వబడును కోచింగ్ మాస్టర్ మామిడి శెట్టి రవీందర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ తెలియజేయడం జరిగింది

సూర్యవంశీ సిక్సుల వర్షం..

సూర్యవంశీ సిక్సుల వర్షం.. ఈ రాక్షసుడ్ని ఆపడం అయ్యే పనికాదు!

 

 

నేటిధాత్రి:

 

 

 

 

 

యువ కెరటం వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఐపీఎల్-2025 ముగిసినా వైభవ్ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు.

యువ కెరటం వైభవ్ సూర్యవంశీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు. ఐపీఎల్-2025లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టిన వైభవ్.. అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా అండర్-19 ఎన్‌సీఏ క్యాంప్‌లో అతడు విశ్వరూపం చూపించాడు. భారీ షాట్లతో బౌలర్లను హడలెత్తించాడీ 14 ఏళ్ల బ్యాటర్. త్వరలో జరిగే ఇంగ్లండ్ టూర్ కోసం సన్నద్ధమవుతోంది భారత అండర్-19 టీమ్. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఈ జట్టు క్యాంప్ నడుస్తోంది. ఇందులో పాల్గొన్న వైభవ్.. అగ్రెసివ్ బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు.

రోహిత్-కోహ్లీకి అరుదైన గౌరవం.

రోహిత్-కోహ్లీకి అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియాను మెచ్చుకోవాల్సిందే!

 

నేటిధాత్రి

 

 

 

 

 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరి విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా మంచి నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆధునిక క్రికెట్‌పై చెరగని ముద్ర వేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆడిన ప్రతి దేశంలోనూ అదరగొట్టారీ స్టార్లు. టీ20, వన్డే, టెస్ట్ అనే తేడాల్లేకుండా బరిలోకి దిగితే చాలు.. పరుగుల వర్షం కురిపించడమే ధ్యేయంగా ఆడుతూ వచ్చారు. అయితే పొట్టి ప్రపంచ కప్-2024 తర్వాత టీ20లకు గుడ్‌బై చెప్పిన ఈ ద్వయం.. ఇటీవలే టెస్టులకూ రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతామని వెల్లడించారు. దీంతో అభిమానులు తెగ బాధపడుతున్నారు. కనీసం ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడకుండా రిటైర్ అవడం ఏంటని ఫీల్ అవుతున్నారు. సత్కరించే అవకాశం కూడా ఇవ్వరా అని వాపోతున్నారు. ఈ తరుణంలో రోహిత్-కోహ్లీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా చేస్తున్న పని తెలిసి ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అసలు సీఏ ఏం చేసిందంటే..

మొదలుపెట్టిన టీమిండియా..

మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్‌బంప్స్!

 

నేటిధాత్రి:

 

 

 

 

భారత జట్టు వేట మొదలుపెట్టేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా కుర్రాళ్లు.. బంతి, బ్యాట్ చేతపట్టి ప్రాక్టీస్ ప్రారంభించారు.

వేట మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్‌బంప్స్!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.. ఈ ముగ్గురూ లేని భారత టెస్ట్ జట్టును ఊహించడం కష్టమే. గత కొన్నేళ్లుగా టీమిండియాకు అన్నీ తామై నిలిచారీ త్రిమూర్తులు. మన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే తక్కువ వ్యవధిలోనే ముగ్గురూ రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీంతో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఎలా ఆడుతుందో అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టారు టీమిండియా ప్లేయర్లు. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని కుర్రాళ్ల బృందం ఉరిమే ఉత్సాహంతో ప్రాక్టీస్ సెషన్‌ను మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

 

బెండు తీయడం ఖాయం!

ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో గిల్ అండ్ కో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా తీసిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఇందులో జట్టు ఆటగాళ్లంతా పరుగులు తీస్తూ చెమటోడ్చుతూ కనిపించారు. రన్నింగ్‌‌తో పాటు ఫుట్‌బాల్ సాధన చేస్తూ దర్శనమిచ్చారు. కెప్టెన్ గిల్‌, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ డ్రిల్స్ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. హెడ్ కోచ్ గౌతం గంభీర్ అటు ఫీల్డింగ్ సెషన్స్‌తో పాటు ఇటు ఫిట్‌నెస్ డ్రిల్స్‌ను కూడా దగ్గరుండి గమనిస్తూ కనిపించాడు.ఇంగ్లండ్ గ్రౌండ్స్‌కు తగ్గట్లు ఫీల్డింగ్‌లో చేసుకోవాల్సిన మార్పులపై కోచ్ టి దిలీప్ కుర్రాళ్లతో చర్చిస్తూ కనిపించాడు. అటు పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో మాట్లాడుతూ దర్శనమిచ్చాడు. ఇంగ్లండ్ జట్టు బెండు తీసేందుకు లండన్‌లో ల్యాండ్ అయిన భారత బృందం.. ఇలా జోరుగా ప్రాక్టీస్ చేస్తూ తాము వేటాడేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పేశారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version