68 వ అండర్ 14 రాష్ట్ర పుట్ బాల్ సెలక్షన్ పోటీలు ప్రారంభించిన
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జల్లెల చిన్నారెడ్డి
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి లో
68వ అండర్ 14 రాష్ట్ర స్థాయి బాల బాలికల ఫుట్ బాల్ సెలక్షన్ పోటీల ను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు .ఈసందర్భంగా డాక్టర్
చిన్నా రెడ్డి మాట్లాడుతూ
ప్రపంచంలో ఎక్కువగా ఇష్టపడే వారు గేమ్ ఫుట్ బాల్ అని అన్నారు.వనపర్తి లో హాకీ,ఫుట్ బాల్ క్రీడా పోటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది అనిఅన్నారు. వనపర్తి లో హాకీ క్రీడలో జాతీయస్థాయిలో ఆడిన క్రీడాకారులు చాలా ఎక్కువ మంది ఉన్నారని చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే మైదానంలో ఫుట్ బాల్ క్రీడను ఆడేవారని చిన్నారెడ్డి గుర్తు చేశారు.రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ క్రీడల పై ఇష్ట పడే వారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసుకుంటున్నా క్వార్టర్స్ లో ఫుట్ బాల్ ఆడటానికి ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసుకుంటూరని అన్నారు.వనపర్తి పట్టణం లో ఫుట్ బాల్ ,హాకీ స్టేడియాలను నిర్మించుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని చిన్నారెడ్డి తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున క్రీడాకారులు ఎక్కువ నీళ్లు త్రాగాలని సూచించారు. పోటీపడే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి, స్నేహభావంతో ఆడి అండర్ 14 క్రీడలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయికి ఆడి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు. ఈ
కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, కృష్ణ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బాల్ రాజ్ ,వెంకట్,మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగి వేణు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.