రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ ,ఎమ్మెల్యే గారి తనయుడు,యువ నాయకులు మిథున్ రాజ్,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు రాకేష్ ,నాయకులు నరేష్ రెడ్డి ,అశోక్ రెడ్డి ,విజయ్ రాథోడ్ నిఖిల్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు.
BRS leaders
ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించే ఈద్గా అనంతరం మాజి మున్సిపల్ చైర్మన్ తంజీమ్ ,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్ ,మొహిద్దిన్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా, సీనియర్ నాయకులు కలిమ్, జుబేర్ ,నాయకులు కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి కలిసి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఉండాలని ప్రార్థించడం జరిగింది.
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
రామాయంపేట మార్చ్ 31 నేటి ధాత్రి (మెదక్)
మెదక్ జిల్లా కేంద్రం గాంధీనగర్ లోని ఈద్గా వద్ద మైనారిటీ సోదరులు రంజాన్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి. సుభాష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి జగపతి,అకిరెడ్డి కృష్ణారెడ్డి,మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ లు పాల్గొని ముస్లిం మతం పెద్దలకు, సోదరులకు రంజాన్ (ఈద్ ముబారక్) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు సర్దార్ మమ్మ హుస్సేన్, శంషుద్దీన్, మహ్మద్ అలీ, కురనోద్దిన్ యూసుఫ్ లు ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి, శేరి. సుభాష్ రెడ్డి లు మాట్లాడుతూ రంజాన్ పవిత్రత త్యాగం, శాంతి, సమానత్వానికి ప్రతీక అని అన్నారు. మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయన్నారు. అన్ని మతాల ప్రజలలు స్నేహభావంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదర సోదరీమణులంతా పండగ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కొ కన్వీర్ కృష్ణ గౌడ్, జుబేర్ అహ్మద్, నాయకులు మహమ్మద్, ఫజిల్, మధు, మోహన్, నాగేందర్, సంతోష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని పేద ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లోని సింగరకొండ రమేష్ గుప్తకు చెందిన రేషన్ షాపు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ఆహార భద్రతకార్డు ఉన్న లబ్దిదారులకు భూపాల పల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారం భించి పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ రాష్ట్రంలో ఈ సంవ త్సరం ఉగాది పండుగ చరిత్ర పుటల్లో లిఖించదగ్గ రోజుగా నిల్వనున్నదని ,దేశంలోనే తొలిసారిగా పేద ప్రజల ఆహార భద్రతకు మన ముఖ్య మంత్రి ఎనుములరేవంత్ రెడ్డి సారథ్యంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిందని దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఆహార భద్రత కల్పిం చాలన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని అన్నారు.
Congress
ఈ పథకం కింద రాష్ట్ర జనాభాలో సుమారు 80% ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం లబ్ది చేకూరుతుందని,రాష్ట్రంలోని పేద ప్రజల ఆహారభద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.
దొడ్డు బియ్యం తినేందుకు ప్రజలు అనాసక్తత కనపరచడంతో పాటు దళారులకు అమ్ముకోవ డం వలన పక్కదారి పడు తున్నాయని అన్నారు.
వీటన్నింటిని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకానికి నిర్ణయం తీసుకుం దని అన్నారు అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.
పేద ప్రజలకు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.
Congress
అనంతరం 32 మంది సిఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ. 10,63,500/- విలువ గల చెక్కులను అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది.
లక్షలు ఖర్చుచేసి ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశా లల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలుస్తుంద న్నారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ,శాయంపేట ఎమ్మార్వో మండలములోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని గ్రామాల కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహిరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా మాజీమంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పట్టణం లోని ఈద్గా లో రంజాన్ వేడుకల్లో పాల్గోన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఈద్ ముబారాక్ అంటు శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు ఉగ్గేల్లి రాములు పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు ,యుత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మనలో సోదర భావాన్ని పెంపొందించే ఇఫ్తార్ విందు దోహదం చేస్తుంది…
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముస్లింలకు పెద్దపీట వేస్తుంది…
యావత్ తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు తెలియజేశారు….
రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్ -గా-గుల్షన్ ఈద్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …
వరంగల్ (నేటిదాత్రి ):
ఈరోజు రంజాన్ పర్వదినం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్ పరిధిలోని మామునూర్ లక్ష్మిపురం గ్రామంలోని ఈద్ -గా – గుల్షన్ ఈద్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ముఖ్య అతిధిలుగా పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి *శ్రీ కేఆర్ నాగరాజుఅనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ అని తెలిపారు. రంజాన్ మాసంలో ఆచరించి ప్రార్థనలు, ఉపవాసం క్రమశిక్షణను ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు తమ పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అలాగే నేను ఈ ప్రాంతం నుంచి పెరిగి ఉన్నత విద్యలను అభ్యసించి నా చిన్నతనం నుంచి ఎన్నో క్రీడలో పాల్గొన్ని ఒక హకీ ప్లేయర్ గా అంతర్జాతీయ స్థాయిలో వెళ్లడం నాకు చాలా ఆనందకరమని మరియు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వడం నాకు చాలా సంతోషకరమని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన తెలియజేయడం జరిగింది..
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా, దేశంలోనే అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ పర్వదినం రోజున ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సోదరులకు కోరారు….
ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చెవ్వు శివరామకృష్ణ, ముస్లిం పెద్దలు బాబా భాయ్, జమీర్, సిధిక్,అఫ్జల్, ఎం.డి సర్వర్, ఎం.డి నయీముద్దీన్ ముస్లిం సోదరులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు….
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” యాత్ర మండల సన్నాహక సమావేశం
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ (మాజీ ఎంపీపీ) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణకై నిర్వహించే “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” యాత్ర మండల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా బిజెపి నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై నిరసనగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈకార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతీ గడపగడపకి ఇట్టి విషయాన్ని తీసుకెళ్లి దేశాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచన బిజెపి నాయకుల ఆలోచన విధానాన్ని, వారు దేశ భద్రతపై చేస్తున్న అంతర్గత దాడిని వివరించాలన్నారు. మండల కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు ఇట్టి పాదయాత్రలో పాల్గొని రాబోవు రోజుల్లో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ (మాజీ ఎంపీపీ), కరీంనగర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ కోల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుపురం పర్శరాంగౌడ్, శ్యాంసుందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు తోట రవి, కర్ణ శీను, లచ్చయ్య, కనకయ్య, స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు స్ప్రింక్లర్లు, పైపులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులను విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్నారు. అనంతరం కొత్తకోటలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కెటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్ అదేశాలమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేటీఆర్ సేన మండల అధ్యక్షులు గా మురహరి తిరుపతి (ట్రిమ్స్) ను నియమించినట్టు కెటిఆర్ సేన జిల్లా అధ్యక్షుడు వీసం భరత్ రెడ్డి మరియు నియోజకవర్గ అధ్యక్షులు పిన్నింటి మణిదీప్ రావు ప్రకటించారు.. వారికి నియమకపత్రాన్ని చిట్యాల టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ గారితో కలిసి చిట్యాల మండల కేంద్రంలో అందించారు..ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, మాజీ జడ్పీటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, ఏరుకొండ రాజేందర్, పెరుమాండ్ల రవీందర్, దూదిపాల తిరుపతి రెడ్డి, ఆరె పల్లి సమ్మయ్య, యూత్ నాయకులు గుండు నగేష్ తదితరులు. పాల్గొన్నారు…
తేది: 04-04-2025 రోజున ఉదయం 10.00 గంటల సమయం నుండి పరకాల లోని లలిత కన్వెన్షన్ హాల్ లో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. కావున శాయంపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువత మీ సర్టిఫికెట్లతో తప్పకుండా జాబ్ మేళాలో పాల్గొని మీకున్నటు వంటి స్కిల్స్, టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ద్వారా ఉద్యోగాలు పొందండి. జాబ్ మేళా ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. కావున నిరుద్యోగ యువత అందరూ పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
కొమ్మాల దేవాలయం మెట్లపై కాంగ్రెస్ నాయకుల వినూత్న ప్రయాణం.
నర్సంపేట,నేటిధాత్రి:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న నేపథ్యంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ దుగ్గొండి మండలం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్తకొండ రవివర్మ ఆధ్వర్యంలో గీసుకొండ కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గుట్టపైకి మెట్ల నుండి మోకాళ్ళ నడకతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
Congress
మండలం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్తకొండ రవివర్మ,నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీలు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తెచ్చిన ఘనత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి దక్కుతుందన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట సాంస్కృతిక అధ్యక్షులు గుండెకారి సునీల్,నాచినపల్లి గ్రామ యూత్ అధ్యక్షులు ఇజ్జగిరి నరేష్, మహ్మదాపురం గ్రామ యూత్ అధ్యక్షులు ఆడెపు అనిల్,మండల యూత్ నాయకులు బండారి ప్రకాష్ గారు,కూరతోట సురేష్ గారు,మునుకుంట్ల నాగరాజు,భూక్య గోపి,దండు రాజేందర్,మ్యాక అశోక్,గంగారపు శ్రీకాంత్,కొమాకుల రఘుపతి,బూర్గుల రాజబాబు,ఇజ్జగిరి యశ్వంత్ లు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి టౌన్ అధ్యక్షులు క్యాతరాజురమేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ మొగుళ్ళపల్లి మండల పరిసరప్రాంత ప్రజలకు విశ్వవసు నామ నూతన తెలుగుసంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉగాది అనేది కొత్త ప్రారంభానికి సంకేతమని ఇది హిందూ చాంద్రమాన పంచాంగ ప్రకారం సంవత్సరంలో తొలి రోజని ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఎంతో భక్తి,శ్రద్ధలతో జరుపుకుంటారని కొత్త ఆశయాలతో,కొత్త సంకల్పాలతో జీవన ప్రయాణాన్ని మొదలు పెట్టాలని ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని తయారు చేసి జీవితం లోని ఆరు రుచులను ఆస్వాదిస్తూ. బంధుమిత్రులతో పండుగ ఆనందాన్ని పంచుకోవాలని ఈ పండుగ సందర్బంగా నూతన ఉత్సాహాన్ని,శుభ ఫలితాలను అందిస్తుందన్నారు.ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను తెలుసుకోవడం ఆనవాయితీ. శుభ కార్యాలు ప్రారంభించేందుకు ఇది అత్యుత్తమమైన సమయమని ఉగాది సందేశం. కొత్త ఆరంభాలకు,పండుగ రోజు మనం చేసే ప్రతి పని మనకు సంతృప్తిని అందిస్తుందని ఈ ఉగాది మీ జీవితాన్ని ఆనందం,ఆరోగ్యం,శాంతితో నింపాలి కొత్త సంవత్సరం మీకు విజయాలు,సంతోషాన్ని తీసుకురావాలని కోరారు.
వనపర్తి లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం.
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమాన్ టెకిడిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు పార్టీ నేతలు పూలమాలలు వేశారు .
ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు .
1982లో మాజీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని 1983 లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 2 0 2 అసెంబ్లీ సీట్లు ఎన్టీ రామారావు గెలిపించారని గుర్తు చేశారు పటేళ్లు పట్వార్లు ఎన్టీ రామారావు రద్దు చేశారని ఆయన తెలిపారు .
అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు ఇల్లు కట్టించారని జూరాల ప్రాజెక్టు హయంలోనే నిర్మించాలని రెండు రూపాయల కిలో ప్రజలకు బియ్యం పథకం అమలు చేశారని మైనార్టీలకు బీసీలకు న్యాయం చేశారని ఆయన తెలిపారు .
తెలంగాణ రాష్ట్రంలో ఏ పి సీ ఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేయడానికి మండలాలు గ్రామాలు నియోజకవర్గాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు .
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీలు జెడ్పిటిసిలు ఎం పీ టీ సీ లు తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని బి రాములు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటుందా ఒంటరిగా పోటీ పోటీ చేస్తుందా అని విలేకరుల ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏ పి సీ ఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పార్టీ నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు .
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాలలో ఓటు బ్యాంకు ఉన్నదని ఆయన తెలిపారు రాష్ట్రంలో 20 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారని అలాంటి వారిని తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందని వారికి భవిష్యత్తు ఉంటుందని బి రాములు తెలిపారు .
ఈ విలేకరుల సమావేశంలో ఎండి దస్తగిరి కొత్త గొల్ల శంకర్ చిన్నయ్య ఆవుల శ్రీనివాసులు మాదయ్య న్యాయవాది షాకీర్ హుస్సేన్ హోటల్ బలరాం మేదరి బాలయ్య నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ దస్తగిరి అరుణ్ ర షీ ద్ బాబర్ ఫారూఖ్ కాగితాల లక్ష్మయ్య డి బాలరాజ్ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు
ఉమ్మడి కరీంనగర్ లో బిజెపి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ధర్నా
సిరిసిల్ల 🙁 నేటి ధాత్రి )
బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి నేడు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉమ్మడి కరీంనగర్ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగింది. ₹2 లక్షల రుణమాఫీ హామీ అమలు చేయాలని, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని, వ్యవసాయ కూలీలకు ₹12,000 అందించాలని, పంటల బీమా యోజన అమలు చేయాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ బిజెపి జిల్లా కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు
తెలుగుదేశంపార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణ కేంద్రంలో టౌన్ ప్రైసిడెంట్ చీదురాల రామన్న శంకర్, స్వామి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ కార్యదర్శి పరకాల నియోజకవర్గం బాధ్యులు కందుకూరి నరేష్ మాట్లాడుతూ భారత దేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం అని అన్నారు.కాంగ్రేస్ పార్టీ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మతకలహాల తో,నెలకో ముఖ్యమంత్రి ని మారుస్తు పాలన గాలికొదిలేసిన సందర్బం లో పార్టీ స్థాపించిన 9నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘణత తెలుగుదేశం పార్టీ కే దక్కిందన్నారు.తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనమని ప్రగతి ప్రజాసంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశమని,పేదవారి ఆకలి తీర్చేందుకు స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారన్నారు.సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని నినదించారు.వెనుకబడిన, బడుగు బలహీనవర్గాలను సామాజికంగా,ఆర్ధికంగా, రాజకీయంగా ఆదుకొని అక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం కొనియాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఆటు పోట్లు సహజమే అని మొక్కవోని దీక్షతో పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం మేనని అన్నారు.రాబోయో రోజుల్లో తెలంగాణ లో సైతం అధికారంలోకి రావడానికి కృషిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ దామెర మండలం నాయకులు, నల్ల రవి, నగేష్,జనార్దన్ రావు,నడికూడ మండలం నాయుకులు రేగురి వెంకటరెడ్డి,పరకాల పట్టణ మహిళా నాయకురాలు మెహరాజ్ బేగం,అశోక్ యువనాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు చట్కూరి నారగౌడ్ ఆధ్వర్యంలో 43 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు జరిపారు. తదనంతరం నందమూరి తారక రామారావు ఫోటోకు పూలమాల చేసి తెదేపా జెండా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు సూర్య నాయక్ హాజరై రాబోవు రోజుల్లో తెలుగుదేశం పార్టీని తెలంగాణ వ్యాప్తంగా పటిష్టం చేయడానికి నూతన కార్యక్రమాలు రూపొందిస్తున్నాము. స్థానిక సంస్థల్లో తెదేపా పార్టీ నుండి ఫోటిలో ఉండబోతున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్యాల ప్రహ్లాద, బందారపు మల్లారెడ్డి, లింగాల దాసు, కట్టెల బాలయ్య, లచ్చ గౌడ్, రంగారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆకస్మిక తనిఖీ
సమయానికి హాజరుకాని సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు
పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని పరిస్థితిని నేరుగా పరిశీలించిన వారు అక్కడి నిర్వహణ, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో కొంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో హాజరు కాని పరిస్థితిని గమనించారు. ప్రజలకు సేవ చేయాల్సిన వారే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించటం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్యాధికారికి డిఎం అండ్ హెచ్ ఓ కి ఫోన్ చేసి, డ్యూటీలో గైర్హాజరైన సిబ్బంది పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే విధంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది వ్యవహరించటం సరికాదు. సమయానికి విధులకు హాజరు కావడం ప్రతి ఉద్యోగి బాధ్యత. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఎమ్మెల్యే ఘాటుగా హెచ్చరించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి, అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అవసరమైన ఔషధాల సరఫరా, శానిటేషన్ మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే, మాతా-శిశు విభాగాన్ని కూడా పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీలో వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మండల అధికారులు కూడా పాల్గొన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు, పనితీరు పట్ల ప్రజల్లో దీర్ఘకాలంగా ఉన్న అసంతృప్తికి ఈ ఆకస్మిక తనిఖీ ఓ సందేశంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఇఫ్తార్ విందు పట్టణం లోని షాది ఖానా లోనీ నిర్వహించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతరావు పటేల్ సంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు ఎండి ముల్తాని మండల ఎమ్మార్వో తిరుమల రావు డిప్యూటీ ఎమ్ఆర్ఓ ఆసిన్ హనుమంతరావు పాటిల్ మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందు లో వారితో కలిసి పాల్గోని పండ్లు, ఫలహారాలు తినిపించారు. రంజాన్ అంటేనే నియమ నిష్ఠలతో కూడుకున్న పండుగా అని, నిబద్ధత తో ఎలా జీవనం సాగించాలో చాటి చేప్పే పవిత్ర మాసం రంజాన్ అని అన్నారు. కులమతాలకు అతీతంగా పండుగలు అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. తాజా మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్ ముస్లిం మత పెద్దలు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవేందర్ ముస్లిం నాయకులు ఆన్సర్ . లియాకత్ ఆఫీస్ షకీల్ షకీర్ శంకర్ పాటిల్ తాజా మాజీ ఎంపిటిసి శంకర్ పాటిల్ అశ్విని పాటిల్ ఇస్మాయిల్ సాబ్ అసఫ్ అలీ వేణుగోపాల్ రెడ్డి. ముస్లిం సోదరులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ అన్నారు.
శుక్రవారం గణపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బుధవారం నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి సమయం సరిపోతుందన్నారు.
రాష్ట్రంలో తాగు సాగు నీరందక రైతాంగం ఇబ్బంది పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీశారని ఆమె అన్నారు.
రాష్ట్రంలో విద్యారంగం నిర్వీర్యమైందని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కీర్తి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో విఫలమైందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం తిరిగి కాంగ్రెస్ బిఆర్ఎస్ పై ఆరోపణలు చేయడం జరిగిందే తప్ప ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని అన్నారు.
చట్టసభల సమయం వృధా అవ్వడం తప్ప ప్రజా సమస్యలపై చర్చించిన పాపాన పోలేదన్నారు.
అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంలో విఫలమయ్యారని మొక్కుబడిగా కొన్ని విషయాలు మాత్రమే అసెంబ్లీలో ప్రస్తావించారని కీర్తి రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
ముఖ్యంగా మండలంలోని గాంధీ నగర్ లో ఇండస్ట్రియల్ కార్యులర్ కోసం శిలాఫలకం వేసి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆమె విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నిశిదర్ రెడ్డి, పార్లమెంట్ కో కన్వినర్ ప్రసాద్ రావు, గణపురం మండల శాఖ అధ్యక్షులు ఊర నవీన్ రావు,రేగొండ మండల మాజీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి,సోషల్ మీడియా కన్వినర్ దుగ్యల రామ్ చందర్ రావు, నాయకులు మంద మహేష్, ప్రవీణ్, రాజు, విప్లవ రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సే కి ఒప్పందాన్ని స్టార్ మీటర్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి
సిపిఎం నాయకులు డిమాండ్
పలమనేరు (నేటి ధాత్రి) మార్చి 28:
పలమనేరు మండలంలో విద్యుత్ కార్యాల నందు కరెంట్ ఆఫీసు నందు శుక్రవారం 28వ తేదీన ఉదయం 11 గంటలకి ధర్నా నిర్వహించినాము ఈ ధర్నా లో పట్టణ కార్యదర్శి గిరిధర్ గుప్తా మాట్లాడుతూ 28 మార్చి 2025 రాష్ట్ర ప్రభుత్వము స కి ఒప్పందాన్ని స్మార్ట్ మీటర్లు సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని ప్రజలపై మోపుతున్న భారాలను వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్షంగా ఉన్న టిడిపి జనసేన కూటమి మ్యానుఫెస్టివల్లో విద్యుత్ చార్జీలను నీ య నియంత్రస్తామని విద్యుత్ బిల్లులను తగ్గిస్తామని హామీ ఇచ్చినారు వైసిపి ప్రభుత్వ పాలనలో ఐదేళ్లలో రకరకాల పేరుతో వేసిన 32 కోట్ల . 166 కోట్ల బారాలతో బాధపడుతున్న రాష్ట్ర ప్రజలను ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఐదు ఏళ్ళు కరెంటు చార్జీలు పెరగబోవుని భావించారు
ఆదా నీ– సే కి సోలార్ విద్యుత్ పై వైసీ ప్రభుత్వము తప్పు దోవ పట్టిస్తుందని ఉండగా ప్రతిపక్షం ప్రతిపక్షం ఉండగా నేటి ఆర్థిక శాఖ మంత్రులు పయ్యాల కేశవ్ గారు వివరించారు ఒక యూనిట్ కి విద్యుత్తు 1. 99 పైసలు వైసిపి ప్రభుత్వం 2 రూపాయల 49 పైసలకు ఒప్పందం చేసింది ఆనాటి యువతరం పాదయాత్ర సందర్భంగా 2023 జూలై రెండో తేదీన( 144వ రోజు సందర్భంగా) నెల్లూరు స్టార్ మీటర్లని పగలగొట్టాలని నారా లోకేష్ పిలుపునిచ్చార పుండు పై కారం చెల్లినట్టుగా వ్యవసాయం పంపు సెట్ స్టార్ మీటర్లని దానిని పగలగొట్టాలని వారే ఉపన్యాసాలు ఇచ్చారు, పలమనేరు కమిటీ ఈశ్వర మాట్లాడుతూ స్టార్ మీటర్లతో కొత్త భారం అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకి పి పెయిడ్ మీటర్లను బిగించి విద్యుత్తు పంపిణీ సంస్థను సిద్ధమయ్యాయి రాష్ట్రంలో 1 90 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులను ప్రస్తుతం ప్రభుత్వం పరిశ్రమలు వారి ప్రీపెయిడ్ మీటర్లు బిగిస్తున్నారు 200 యూనిట్లు దాటి గృహ వినియోగదారులు కూడా అమర్చి ఒక మీటర్ కి పదివేల 25 రూపాయలు చొప్పున అదనపుగా 56 లక్షల మీటర్లు అంగీకరించి ఆ దానికి అప్పగించినారు పాల్గొన్నవారు రాజా శ్రీరామయ్య లక్ష్మయ్య రత్తమ్మ కైరునిషా సరోజమ్మ బాబు బాలకృష్ణ మొదటి వారు పాల్గొన్నారు..
తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు రాజకీయ నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనమైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డికి మంత్రిపదవి కేటాయించాలని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రభుత్వాన్ని కోరారు.
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానంద్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నోవ్యాయ ప్రయాసాలు ఒడిదుడుకులను అనుభవిస్తూ నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని అన్నారు.
నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సొసైటీ చైర్మన్ గా డిసిసిబి చైర్మన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసి పిసిసి సభ్యులుగా ఏఐసీసీ సభ్యులుగా పదవులు చేపట్టి నిబంధత క్రమశిక్షణ కమిట్మెంట్ కు మారుపేరుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం జీవితాన్ని దారపోసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ వారు చేపట్టిన పాదయాత్రలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.
2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల పొత్తులో భాగంగా నర్సంపేట టికెట్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంభంపాటి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయిస్తే కలత చెందకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఏకతాటిపై నడిపించి లక్ష్మారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడని అన్నారు.
2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చారని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దొంతి మాధవరెడ్డికి టికెట్ కేటాయించకుండా మోసంచేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నియోజకవర్గ ప్రజల బలమైన కోరికతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రవ్యాప్తంగా దొంతి మాధవరెడ్డి ప్రభంజనం సృష్టించారని వివరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ పదవుల కోసం జంపుజిలానిలుగా మారి టిఆర్ఎస్ పార్టీలో కిరాయిప్పులకు పాల్పడుతుంటే అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని టిఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించినప్పటికీ అలాగే మంత్రి పదవి ఇస్తామని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆఫర్లు చేసిన ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీని వీడకుండా మాతృపార్టీపై ప్రేమతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో చేరి తన రాజకీయ నిబద్ధతను చాటుకోవడం జరిగిందని గుర్తుకు చేశారు.
2014 నుండి 2018 వరకు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ అప్పటి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన నిఖర్సగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన గొప్ప నాయకుడు దొంతి మాధవరెడ్డి అని అభివర్ణించారు.
2018 ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందుండి నిర్వహిస్తూ నడపారన్న విషయాన్ని గుర్తు చేశారు.
2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ కోసం నిలబడే వ్యక్తిగా గుర్తింపు పొందిన నాయకుడని దాదాపు నర్సంపేట నియోజకవర్గం ఏర్పడి 45 ఏళ్ల చరిత్రలో చేతి గుర్తుపై గెలిచిన దాఖలాలు లేకపోగా మొదటిసారి నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచి చరిత్ర తిరిగరాశాడన్నారు.
కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానం పార్టీలు ఫిరాయింపులు చేసిన వారికి కొత్తగా వివిధ పార్టీల నుండి పదవుల కోసం పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులను ఇవ్వడం వరంగల్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గుర్తించి మంత్రిపదవి ఇవ్వకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను నిరాశకు గురి చేయడం సరికాదని వాపోయారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేయనున్న మంత్రి పదవుల్లో రాజకీయ నిబద్ధతకు నిదర్శనంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి మంత్రి పదవిని కట్టబెట్టి నర్సంపేట ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు భూసాని సుదర్శన్, బీరం భరత్ రెడ్డి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి జన్ను మురళీ, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, పున్నం రాజు, భూక్య గణేష్, కొత్తగట్టు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.