ఇదే నిజమైన ఇందిరమ్మ రాజ్యం…

ఇదే నిజమైన ఇందిరమ్మ రాజ్యం…

ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్

కేసముద్రం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై పనిచేస్తున్నదని మహబూబాబాద్ శాసనసభ్యులు డా.మురళీ నాయక్ స్పష్టం చేశారు.

శుక్రవారం కేసముద్రం మండల కేంద్రంలోని పలు గ్రామాలు మరియు రైతు వేదికలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు.

 

This is the real Indiramma Rajyam…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మాట్లాడుతూ, ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం. ఇక్కడ ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతోంది. ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఈ పట్టాలు వారి కలలను సాకారం చేస్తున్నాయి. తలదాచుకునే చోటు కలిగిన ప్రతి కుటుంబం సమాజంలో గౌరవంతో బతికే అవకాశం పొందుతుంది, అని పేర్కొన్నారు..

అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆశ్రయమైన ఇంటిని కల్పించడంలో ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం పట్టా కాదు, పేదల భవిష్యత్తుకి బలమైన బునియాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదేశాల మేరకు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తలదాచుకునే ఇంటి కోసం భూమిని, నిర్మాణానికి ఆర్థికసహాయాన్ని అందిస్తోంది, అని వివరించారు..

పట్టాలు అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ఇన్నేళ్లుగా అద్దె ఇంట్లో జీవితం గడిపాం. ఇప్పుడు మా కుటుంబానికి ఓ గౌరవం వచ్చినట్టు ఉంది,” అంటూ ఒక లబ్ధిదారుడు ఆనందంతో చెప్పారు.

కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, మాజీ జడ్పిటిసి బండారి వెంకన్న,రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నూతన పెట్రోల్ బంక్ ప్రారంభం.

నూతన పెట్రోల్ బంక్ ప్రారంభం.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

 

 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ప్రారంభించడం జరిగింది.
శుక్రవారం రోజు మండలంలోని సూరారం మూల మలుపు వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సబ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇంధన విక్రయ కేంద్రం, వినాయక ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పడిన వినాయక పెట్రోల్ పంతులు, బాజీ జడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ ప్రారంభించారు, మారుమూల ప్రాంతంలో ఇంధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, అన్నారు. పెట్రోల్, డీజిల్ కొరకు రైతులు మండల కేంద్రానికి, రావాల్సి వస్తుండేదని గ్రామంలో ఇండియన్ ఆయిల్ సబ్ డిస్ట్రిబ్యూటర్ ఇందాన కేంద్రం కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వినాయక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసిన యజమాని కిరణ్ కు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలుపుతూ, నాణ్యత పరిమాణాలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు పెట్రోల్ డీజిల్ అందించాలని కోరారు. వినాయక ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభంలో గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి..

ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి.

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యాఅధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే ఇంటర్మీడియట్ విద్యాసంవత్సరానికి గాను (ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి) అంటూ

 

quality education

ఇంటర్మీడియట్ అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేష ను) సిరిసిల్ల ..కళాశాల అధ్యాపకులు స్థానిక వెంకంపేట ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పిల్లలతో మాట్లాడి ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రభుత్వం కల్పించే వసతులను పొందాలని వారు తెలిపారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్లో చేరిన పిల్లలకు ఉచిత పుస్తకాలు, నాణ్యమైన విద్య, ఎంసెట్ తదితర విషయాలలో నైపుణ్యాలు అందించడమే కాకుండా ఇంటర్మీడియట్ అనంతరం ఇంజనీరింగ్ విద్యలో ఉచిత విద్యను పొందవచ్చు అని వారు తెలిపారు. ఈ అడ్మిషన్ డ్రైవ్ లో ప్రిన్సిపాల్ శ్రీ విజయ రఘునందన్,అధ్యాపకులు సామల వివేకానంద ,ఆంజనేయులు ,శ్రీనివాస్ ,
చంద్రశేఖర్ ,రాజశేఖర్ పాల్గొన్నారు.

మల్లక్కపేట గ్రామంలో బడిబాట కార్యక్రమం.

మల్లక్కపేట గ్రామంలో బడిబాట కార్యక్రమం

పరకాల నేటిధాత్రి

 

 

హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలోగల ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండగా ప్రైవేట్ పాఠశాలలకు పంపడం దండగ అని ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్, పంచాయతీ కార్యదర్శి సుమలత,పాఠశాల చైర్మన్ దుమాల లక్ష్మి, కారోబార్ ఆనందరావు,అంగన్వాడీ టీచర్ ఉప్పరి భద్రమ్మ ఆయాలు,తల్లిదండ్రులు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేట గ్రామం రాచన్న స్వామి ఆలయంలో ఓ వివాహ వేడుకలో శుక్రవారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు మాణిక్ రావు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, గ్రామ పార్టీ అధ్యక్షులు రఘుపతి రెడ్డి, యువ నాయకులు మిథున్ రాజ్, ముర్తుజా, దీపక్ గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

మద్రిలో ఇందిరమ్మ ఇళ్ళ పనులు ప్రారంభం.

మద్రిలో ఇందిరమ్మ ఇళ్ళ పనులు ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో కలిసి అధికారులు శుక్రవారము ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు వేసి పనులు ప్రారంభించారు.కొహీర్ మండల పరిధిలోని మద్రిలో గ్రామానికి చెందిన లబ్ధిదారురాలకు అధికారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పరచి నిర్మాణ విధానాన్ని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భారతి, ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు అజీమ్, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

24న హైదరాబాద్ లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభ.

24న హైదరాబాద్ లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభ

మహాసభను జయప్రదం చేయాలి

వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గొలనకొండ వేణు పిలుపు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

 

ఈనెల 24 న రోజున హైదరాబాద్ లో జరుగు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 8వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గొలనకొండ వేణు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనున్న అధిక సంఖ్యలో ఉన్న ఆర్టీసీ బీసీ ఉద్యోగులు దైనందిక ఉద్యోగ జీవితంలో, విధి నిర్వహణలో నిరంతరం ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. 78 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల స్థానం రోజు రోజుకు బలోపేతం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ఎజెండగా ముందుకు సాగాలన్నారు. మహిళా, పురుష ఉద్యోగుల ప్రమోషన్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించి దారి చూపాలన్నారు. ప్రతి నెల న్యాయబద్ధంగా ఆర్ఎం స్థాయి అధికారితో జరుగవలసిన జాయింట్ మీటింగ్ లో బీసీ ఉద్యోగుల వ్యక్తిగత, తదితర సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆయన కోరారు.

 

Congress

 

 

ప్రతి రెండు సంవత్సరాలకొక సారి జరిగే ఈ రాష్ట్ర స్థాయి మహాసభను ఈనెల జూన్ 24న, బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర అధ్యక్షులు తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ఈ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమశాఖ మాత్యులు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించెదరు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఇలాయ్యా, ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొంటారని ఆయన వివరించారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం, భవిష్యత్తు కార్యచరణ కొరకై వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 9 డిపోలు వరంగల్ -1, వరంగల్ -2, హనుమకొండ, జనగాం, పరకాల, భూపాలపల్లి, తొర్రూర్, నర్సంపేట, మహబూబాబాద్ డిపోలకు చెందిన బీసీ ఉద్యోగులు డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, మెకానిక్ లు, మహిళా ఉద్యోగులు,వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభను జయప్రదం చేయవలసిందిగా వేణు పిలుపునిచ్చారు

తహసీల్దార్ మత్స్యకారులు వినతి పత్రం అందజేత.

తహసీల్దార్ మత్స్యకారులు వినతి పత్రం అందజేత

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

 

 

వీణవంక మండల కేంద్రంలో అతి పెద్ద కల్వల చెరువు పై ఆధారపడి సుమారు 300 మంది మత్స్యకారులు జీవన ఉపాధి కొనసాగిస్తున్నాము గత రెండు సంవత్సరాలుగా చెరువు యొక్క తూము మరమ్మత్తులు చెడిపోయి నీరు వృధాగా పోవడం వలన చెరువులలో చేపలు చనిపోతున్నాయి దీనివలన మత్స్యకారుల జీవన ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతుంది కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తూము మరమ్మత్తులు చేయగలరని మా యొక్క మనవి వారు కోరినారు ఈ కార్యక్రమంలో వీణవంకమత్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు మోటం,వెంకటేష్ సెక్రెటరీ రాయిశెట్టి కుమారస్వామి డైరెక్టర్ చుక్కల రవీందర్, సభ్యులు రాయిశెట్టి వెంకటేష్, గట్టు రామయ్య, రాయిశెట్టి రమేష్, చొప్పరి సునీల్, నాయిని మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

ముంగి గ్రామంలో రెవెన్యూ సదస్సు.

ముంగి గ్రామంలో రెవెన్యూ సదస్సు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామంలో శుక్రవారము నాడు నూతన రెవిన్యూ చట్టం భూ భారతిని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ప్రబులు అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్ర పరిధిలోని ముంగి గ్రామంలో శుక్రవారము భూ వివాదాల సమస్యల పరిష్కారానికై రెవిన్యూ సదస్సు కార్యక్రమాన్ని పంచాయితీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ నెల 3 నుంచి 20 వరకు మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. భూమి సంబందించిన సమస్యలు ఉన్నట్లు అయితే రెవిన్యూ సదస్సు సమావేశంలో దరఖాస్తులు ఇచ్చినట్లు అయితే తక్షణమే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ రాజిరెడ్డి జూనియర్ అసిస్టెంట్ బి అశోక్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్ రికార్డ్ అసిస్టెంట్ రాములు కంప్యూటర్ ఆపరేటర్ మొహమ్మద్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

మామూళ్ల మత్తు వదలరా! 

లంచాలు తీసుకోకుండా బతకరా!!

`పట్టుబడిన వారిపై చర్యలేవి!

`కొలువులు పోకపోతే భయమెక్కడిది!

`శాఖ పరమైన చర్యలు అని చేతులు దులుపుకోవడమేమిటి!

`ఉద్యోగానికి ముందు పోలీసు కేసులుంటే పనికి రారు.

`ఉద్యోగంలో పట్టుబడి కేసులైనా కొలువు పోదు.

`ఇవేం చట్టాలు…చచ్చు బండలు.

`తప్పు చేశాడని కళ్ల ముందు కనిపించినా చర్యలు వుండవు.

`లంచం నేరమైనా శిక్షలుండవు.

`కేసు ఫైల్‌ చేసి అధికారులు చేతులు దులుపుకుంటారు.

`నాయకులు జోక్యం చేసుకొని కొలువులిప్పిస్తారు.

`దర్జాగా లంచావతారి మళ్ళీ కుర్చీలో కూర్చుంటాడు.

`అంతకు మించి లంచాలు లేకుండా కొలువే చేయడు.

`తప్పు చేసి దొరికిన రోజే శిక్ష ఖరారు చేయాలి.

`వెంటనే విచారణ జరిపించి చర్యలు చేపట్టాలి.

`వేల మంది ఉద్యోగులు పట్టుబతున్నా భయం లేదు.

`పట్టుబడినా నష్టమేమీ లేదన్న ధైర్యం ఉద్యోగులలో పెరిగిపోయింది.

`అత్తారింటికి వెళ్లొచ్చినట్లు నాలుగు రోజులు జైలు..తర్వాత బెయిలు.

`ఉద్యోగం కోసం మరునాటి నుంచి ప్రయత్నం.

`లంచాన్ని నమ్ముకొని మళ్ళీ కొలువులో చేరడం.

`లంచావతారులకు శిక్ష అంటే ఇంతేనా!

`ఏసిబికి మరిన్ని అధికారాలు కట్డబెట్టలేరా?

`పట్టుబడిన వెంటనే చర్యలు తీసుకునే అధికారం ఇవ్వలేరా!

`వందల మంది పట్డుబడుతున్నా లాభం ఏముంది?

`కోట్లు సంపాదించుకున్న ఉద్యోగులకు భయం ఎందుకుంటుంది.

`ఒకప్పుడు నాయకులైతే చాలు తరతరాల సంపాదన అనుకునే వారు.

`ఇప్పుడు చిన్న ప్రభుత్వ ఉద్యోగి అయితే చాలు.

`కోట్లు సంపాదించుకోచ్చనుకుంటున్నారు.

`ప్రజలను రూపాయి అడగడానికి నోరు రానంత భయం కలగాలి.

`లంచం తీసుకొని దొరికిన వారి ఆస్థులన్నీ జప్తు చేయాలి.

`కఠినమైన చట్టాలు తీసుకు రావాలి.

`ఉద్యోగులంటే ప్రజలకు సేవకులు అని తెలిసి రావాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 మామూళ్ల మత్తు వదలరా? లంచాలు తీసుకోకుండా బతకలేరా? అంటూ తెలంగాణ సమాజం లంచాలవతారులైన కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులను ప్రశ్నిస్తోంది. నిలదీస్తోంది. నిందిస్తోంది. తూతూ అంటూ ఉమ్మెస్తోంది. ఉందుకా బతుకులు పాడుగానని శపిస్తోంది. అయినా మారరు. మారితే ఉద్యోగులెందుకౌతారు? మారితే కోట్లు ఎలా కూడబెట్టుకుంటారు. ఎవరెన్ని తిట్టినా మారం..ఎవరెంత బాధపడినా వదిలిపెట్టం. ఇదే ప్రభుత్వ ఉద్యోగుల అనుసరిస్తున్న ధోరణి. అసలు ఇంతగా ప్రబుత్వ ఉద్యోగులు భరితెగించడానికి కారణం కూడా రాజకీయ పార్టీలు, పాలకులు. అది ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏం లేదు. అన్ని పార్టీల అలుసు..వారి అవసరాలే ఉద్యోగులను అవినీతి పరులుగా మారేందుకు కారణమయ్యాయని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నికల మందు అవినీతికి తావు లేని సమాజం నిర్మాణం చేస్తామని రాజకీయ నాయకులు , పార్టీలు ప్రతిసారి గొప్పగా చెబుతాయి. గెలిచిన తర్వాత అదే ఉద్యోగులచేత అవినీతి పనులు చేయిస్తుంటాయి. దొంగ చేతికి తాళమిచ్చి సొమ్ము పోవొద్దంటే ఊరుకుంటారా? ఇది కూడా అంతే..ప్రజలను పీడిరచకుండా, వేదించకుండా, సేవకులైన పని చేయాలని ఏ పాలకులు ఉద్యోగులను బెదించడం లేదు. అందులో చిత్త శుద్ది వుండడం లేదు. ఎందుకంటే మేం తిట్టినట్లు చేస్తాం..మీరు పడినట్లు నటించండి? అన్న దోరణితో సాగుతోంది. లేకుంటే అదికారులు ఇంత విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు? ఏ దైర్యంతో తీసుకుంటున్నారు. ప్రజల నుంచి చిన్న, చితకా పైనైనా సరే లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. అవి పైసాల..లేక పెంకాసులనుకుంటున్నారా? జీతాలు లక్షల్లోకి పెరిగిన తర్వాత ఉద్యోగులు లంచాల రేట్లు కూడా పెంచేశారు. వెలల్లో వున్నప్పుడు వేలల్లో వసూలుచేసేవారు. ఇప్పుడు సగటు ఏ ఉద్యోగికి లక్షకు తక్కువ జీతం లేదు. అందుకే లంచాలు కూడా లక్షలు వసూలు చేస్తున్నారు. జీతం నెలకొక్కొసారి తీసుకంటే, లంచం రోజూ తీసుకుంటున్నారు. నెలలోనే కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ముఖ్యంగా కొన్నిశాఖల్లోని ఉన్నతాధికారులు మాత్రం వాళ్ల సంపాదన వాళ్లెకే తెలియనంతగా పోయింది. వాళ్లేం వ్యాపారం చేసి సంపాదించడం లేదు. కష్టం చేసి చెమటోడ్చడం లేదు. ఏసిలో కూర్చోని సంతకం చేసేందుకు లక్షలు తీసుకుంటున్నారు. ఇంత అన్యాయమా? రైతులను వేదించుకుతింటున్నారు. వేపుకు తింటున్నారు. పీడిరచుకుతింటున్నారు. ఆఖరుకు చచ్చిన రైతు పిండాకుడు కూడా తినడానికి వెనుకాడడంలేదు. ఇంతగా ఉద్యోగులు దిగజారి పోవడం తెలంగాణ సమాజపు దౌర్భాగ్యం. అయినా ఈ రోజు భూముల ధరలు పెరిగాయంటే అది ఉద్యోగుల పుణ్యం కాదు. కష్టం వచ్చినా సరే అప్పులు చేసుకున్నారు. కష్టపడి రూపాయి,రూపాయి సంపాదించి తీర్చుకున్నారు. కాని భూములు అమ్ముకోలేదు. అలా దాచుకున్నదే భూమి. ఆ భూమి నుంచి బుక్కెడు బువ్వ రాని సమయంలో మట్టి తిని రైతులు బతికారు. మంచినీళ్లతో కడుపు నింపుకున్నారు. ఆకలి దహించివేయకుండా నడుము చుట్టూ కడుపును గుడ్డతో బిగించి కట్టుకున్నారు. కడుపు డొక్కలీడ్చుకుపోయినా సరే ఎవరి వద్ద చేయి చాచకుండా బతికారు. అడుక్కొని బతకడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి, అడ్డకూలీలుగా నైనా బతికారే గాని, ఎక్కడా చేయి చూపి బతకలేదు. పల్లెను వదిలి పొట్ట చేత పట్టుకొని, పట్నం వచ్చి ఎంతో మంది రైతులు హోటళ్లలో ఎంగిలి గ్లాసులు కడిగారు. ప్లేట్లు తోమారు. పల్లెలో తలబిరుసుతో బతికిన రైతు తల దించుకొని పని చేశాడు. తలెత్తి చూడకుండా కన్నీటిని మింగుతూ కాలం గడిపారు. భూమి తల్లిని నమ్ముకొని బతికారు. ఇల్లూ, వాకిలి వదిలేసి, ముసలి, ముకతకు ఇంటి కావాలి పెట్టి పొట్ట చేత పట్టుకొని వలసలు పోయారు. కంటికి నిద్రలేని రాత్రులు గడిపారు. బతికుండగా మళ్లీ పల్లెను చూస్తామా? అని దిగులుతో దిన దిన గండంగా బతికారు. కాలం కలిసి వచ్చింది. తెలంగాణ వచ్చింది. భూముల ధర వచ్చింది. సాగుకు నీరొచ్చింది. రైతులో మళ్లీ ఆశ చిగురించింది. వలస బతుకులకు ఓదార్పు దొరికింది. వలస జనమంతా పల్లెకు చేరింది. అయితే భూముల ధరలు పెరిగింది అదికారులకు లంచాలిచ్చేందుకు అన్నట్లుగా తయారైంది. తమ భూములను తమ పిల్లల పేరు మీద మార్చాలన్నా లక్షలు లంచాలివ్వాల్సిందే. అమ్ముకోవాలన్నా లంచమే.కొనుక్కొవాలన్నా లంచమే. అధికారులు తప్పులు చేసి, సరిదిద్దాలనుకున్నా లంచమే..పల్లె పట్నం అనే తేడా లేదు. ఎక్కడ విన్నా గోవింద నామం లెక్క లంచం..లంచం అనే మాట వినిపిస్తోంది. వినీ వినీ జనానికి విసుగొస్తోంది. అధికారులకు మాత్రం మరింత బలుపొస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగులకు కూడా విపరీతంగా జీతాలు పెరిగాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత జీతాలు తెలంగాణలో వున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీతాలున్నాయని తెలుస్తోంది. పైగా ప్రమోషన్లు కూడా వచ్చాయి. ఇంకే కావాలి. ఇంకా ఇంకా కావాలి. లంచాలు తీసుకునే బుద్ది మారడం లేదు. ఉద్యోగుల దుర్భుద్ది మారడం లేదు. లంచాలు తీసుకొని దొరుకుతామన్న భయం లేదు. దొరికిన వారిలో కూడా ఆ భయం కళ్లల్లో కనిపించడం లేదు. లంచం తీసుకున్న ఓ అధికారి ఇటీవల సోఫాలో కూర్చొని ముసిముసి నవ్వు నవ్వుతున్నాడు. ఏసిబికి పట్టుబడిన భయం ఒక్క శాతం కూడా లేదు. ఏం చేస్తారు? మహా అయితే కోర్టుకు తీసుకెళ్తారు. నాలుగు రోజులు జైలులో పెడతారు. ఎందుకంటే ఆ జైలులో కూడా క్రిమినల్స్‌ గా చూడరు. గౌరవంగా చూస్తారు. కాకపోతే నాలుగు రోజులు ఇంటికి దూరమౌతాము. తర్వాత బైటకొస్తాం…కొంత కాలం హాయగా కాలం గడుపుతాం..మళ్లీ కొలువు తెచ్చుకుంటామన్న ధీమా అవినీతి అదికారులలో పెరిగిపోయింది. సహజంగా ఎవరికైనా సరే ఉద్యోగానికి ముందు ఎలాంటి కేసులు లేవని సర్టిఫికెట్లు సమర్పించుకోవాలి. పోలీసు కేసులుంటే ఉద్యోగం రాదు. కాని ఉద్యోగం చేస్తూ ఎన్ని సార్లు పట్టిబడినా ఉద్యోగం పోదు. పోలీసులు కేసులైనా లెక్కలేదు. జైలు జీవితం అనుభవించినా కొలువు మళ్లీ రాకుండాపోదు. ఇదెక్కడి న్యాయమో అర్దం కాని పరిస్దితి. అవినీతి నిరోధక శాఖ అధికారులుకు రెడ్‌ హాండెడ్‌గా దొరికినా సరే , తమను అన్యాయంగా ఇరికించారని వాదించుకుంటున్నారు. మళ్లీ కొలువులు తెచ్చుకుంటున్నారు. అంటే ఇక్కడ మళ్లీ ఏసిబితో ప్రమేయం లేకుండా సంబందిత శాఖల పెద్దల చేత జరిగే విచారణలో అబద్దాలు రాసుకుంటున్నారు. న్యాయస్దానాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అదికారులను లంచాలతో కొడుతున్నారు. కొలువులు తెచ్చుకుంటున్నారు. అలా ఉద్యోగం పోతోంది. ఇలా వస్తోంది. ఇక అవినీతి ఉద్యోగులకు భయం ఎందుకంటుంది. తప్పు చేసిన దొరికినా చర్యలు లేనప్పుడు ఇక పట్టుకోవడం ఎందుకు? మళ్లీ వదిలేయడం ఎందుకు? అసలు ఎందుకు పట్టుకుంటున్నట్లు. ఎందుకు వదిలేస్తున్నట్లు? ఈ ఏడాది ఎంత లేదన్నా కనీసం ఓ వెయ్యి మందికి తక్కువ కాకుండా లంచాలు తీసుకొని దొరికి వుంటారు. వాళ్లలో కొలువులు పోయిన వారు ఎంత మంది వున్నారు. మళ్లీ కొలువుల్లో చేరిన వారు మాత్రం వున్నారు. అసలు ఈ మధ్య రోజుకు ముగ్గురు నుంచి నలుగురు, ఐదురుగు పట్టుబడుతున్నారు. ఇలాంటి అవినీతి అదికారుల మూలంగా సామాన్యుడు తన జీవితంలో సొంతిళ్లు కట్టుకోలేదు. వంద జగాల స్థలం కొనుగోలు చేసుకోలేడు. అప్పులు చేసి, చిన్న గుడిసె కట్టుకోవాలన్నా దాని పర్మిషన్‌కు లక్షలు ఇస్తే గాని పర్మిషన్‌ రానంత దౌర్భాగ్యపు రోజులు దాపురించాయి. పెళ్లిళ్లు పేరంటాలకు ఎవరైనా బ్యాండు మేళం మాట్లాడుకుంటారు. ఉద్యోగులు,పోలీసుల కుటుంబాలలో పెళ్లి, పేరంటాలైనా వారిని మాట్లాడుకుంటారు. అలాంటి బ్యాండు మేళం వారి వల్ల పర్యావరన నష్టం జరగుతుందని పోలీసులు వాయిద్యాలు తీసుకెళ్లిన ఘటనలో వాటిని వదిలేయాలంటే లంచం అడిగిన దౌర్భాగ్యులు కూడా వున్నారంటే ఈ సమాజం బాగుపడుతుందా? ఏడాదిలో ఇతర సమయాల్లో కూలీ పనులు చేసుకంటూ, పెళ్లిళ్ల సీజన్‌లో బ్యాండు వాయిస్తూ పొట్ట పోసుకునే వారి నుంచి కూడా వేలకు వేలు లంచాలు తీసుకున్నారంటే వాళ్లను ఉద్యోగులంటారా? రాక్షసులంటారా? ఇంతగా లంచం కోసం దిగజారి బతకాలా? ఒక్కసారి ఆలోచించండి.

ఇల్లు మంజూరు అయిన వారు 15 రోజులలోపు నిర్మాణం ప్రారంభం చేసుకోవాలి

ఇల్లు మంజూరు అయిన వారు 15 రోజులలోపు నిర్మాణం ప్రారంభం చేసుకోవాలి

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

 

 

 

మండల పరిధిలోని కామారెడ్డి పల్లి లో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారుల కొరకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి యంపీడీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు మరియు నిర్మాణంలో ఏలాంటి అవకతవకలు జరుగకుండా ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనల మేరకే నిర్మించాలని,ఇంటిని 400 నుండి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే నిర్మించాలని ఎక్కడ జియో కోఆర్డినేట్స్ తో ముగ్గు పోస్తే అక్కడే నిర్మాణం చేయాలని అన్నారు.ఇంటి నిర్మాణం ప్రారంభం కాగానే పంచాయతీ కార్యదర్శులు యంపీడీఓ కు ఇసుక మరియు మట్టి కొరకు లేఖ ఇస్తే తహసీల్దారు నుండి ఉచిత టోకెన్ తెప్పించి ఇవ్వ బడునని ట్రాన్స్పోర్టేషన్ మాత్రం లబ్ధిదారులే భరించాలని,మంజూరు విషయంలో కానీ చెల్లింపు విషయంలో కానీ మధ్యవర్థుల ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని ఎప్పటి కప్పుడు పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇస్తే సంబందిత అధికారుల వచ్చి రికార్డు చేసి వెంటనే బిల్లు చెల్లించడం జరుగుతుందని అన్నారు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా లబ్దిదారులకు సహకరించాలని సంవత్సరం లోపు అందరూ గృహ ప్రవేశం చేయాలని సూచించారు

 

Mandal Parishad Development Officer Peddi Anjaneyulu.

అనంతరం నాగారం గ్రామంలో 38 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా అందులో 11 ఇండ్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఏఈ శ్రీలత,మాజీ సర్పంచ్ కట్కూరి స్రవంతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు,పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్.

నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

నర్సంపేట పట్టణ గౌడ సంఘం సీనియర్ లీడర్ కీశే. వేముల బుచ్చమ్మ,- బొందయ్య గౌడ్ ల పుత్రుడు శుష్మ-రాజేష్ గౌడ్ ల వివాహ రెసెప్షన్ నర్సంపేట పట్టణం లోని సిటిజెన్ క్లబ్ ఆవరణలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్, రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాచర్ల రమేష్ గౌడ్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం నాయకులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, సుందరగిరి మల్లయ్య గౌడ్, కక్కేర్ల బాబు గౌడ్, ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ కొయ్యేడి సనత్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్,కోతి వెంకటేశ్వర్లు గౌడ్,రామకృష్ణ, నాగేల్లి శివరాం కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కేజిబివిలలో ఎంఎల్టీ నూతన కోర్స్ ప్రారంభం.

కేజిబివిలలో ఎంఎల్టీ నూతన కోర్స్ ప్రారంభం.

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

వరంగల్ జిల్లాలో గల దుగ్గొండి, పర్వతగిరి కేజిబివిలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను
రాష్ట్ర ప్రభుత్వము కళాశాల స్థాయిలో (ఇంటర్ మీడియట్) (ఎంఎల్టీ) మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ నూతన కోర్స్ లను ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు.ప్రతీ కళాశాలలో ప్రథమ సంవత్సరానికి గాను 40 సీట్లను మంజూరు చేయడం
జరిగిందన్నారు.ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ వైద్య విద్య పట్ల ఆసక్తి కలిగిన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోగలరని తెలిపారు. అంతే
కాక 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్ర మరియు జిల్లా ఉత్తీర్ణత శాతం కంటే మెరుగైన ఫలితాలు కేజిబివిలు
సాధించయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.జిల్లాలో గల 09 కేజిబివిలలో ఖానాపూర్, రాయపర్తి మరియు వర్ధన్నపేట
కేజిబివిలలో ఎంపీసీ,బైపిసి కోర్సులు ,చెన్నారావుపేట, గీసుగొండ, నల్లబెల్లి,సంగెం కేజిబివిలలో సిఈసి,ఎంపీహెచ్ డబ్ల్యు,(మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్) కోర్సులు ఉన్నాయని అలాగే దుగ్గొండి, పర్వతగిరి కేజిబివిలలో ఎంఎల్టి కోర్సులలో అధిక
మొత్తంలో గ్రామీణ ప్రాంతంలోని పేద బలహీనవర్గాల బాలికలు ప్రవేశాలను పొందగలరని జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కోరారు.

శంకర్ కు ఉత్తమ అవార్డు.

శంకర్ కు ఉత్తమ అవార్డు

బాలానగర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల ఎంఈఓ శంకర్ కు మల్టీ జోనల్-2లో ఉత్తమ పర్యవేక్షణ విద్య అధికారిగా ఎంపికయ్యారు. హైదరాబాదులో ఎస్సిఆర్టి డైరెక్టర్ రమేశ్, ఆర్జేడి విజయలక్ష్మి చేతుల మీదుగా గురువారం అవార్డు అందుకున్నారు. విధినిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న శంకర్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు రావడంతో ఉపాధ్యాయులు, పలువురు నేతలు అభినందనలు తెలిపారు.

శ్రేయన్స్ తండ్రిని పరామర్శించిన ఎమ్మెల్యే.

శ్రేయన్స్ తండ్రిని పరామర్శించిన ఎమ్మెల్యే

జడ్చర్ల /నేటి ధాత్రి

 

జడ్చర్ల పట్టణంలోని మూడవ వార్డులో రెండు రోజుల క్రితం ఇంటి ముందు సైకిల్ పై వెళ్తుండగా.. విద్యుత్ వైరు తగిలి కరెంట్ షాక్ తో శ్రేయన్స్ (10) బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి శ్రేయాన్స్ తండ్రి బొక్క రాఘవేందర్ ను పరామర్శించారు. ధైర్యం కోల్పోకూడదని ఓదార్చారు. కరెంట్ షాక్ తో శ్రేయాన్స్ చనిపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

వికసిత్ భారత లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది.

*వికసిత్ భారత లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది

బిజెపి మాజీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు జన్నేమొగిలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

 

శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల నూతన కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి హాజర య్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వికసిత్ భారత్ లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది భారతదేశం 2047 నాటికి ఒక పూర్తిగా వికసిత దేశంగామారా లన్న దృష్టితో ఏర్పడిన అభిప్రా యం భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికిదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన దేశంగా నిలిపే లక్ష్యంతో నరేంద్ర మోడీ పని చేస్తున్నారు

వికసిత్ భారత్ లక్ష్యం

 

 

Former BJP

 

 

ఆర్థిక అభివృద్ధి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా తీర్చిదిద్దడం,ఉత్పాదకతను పెంచడం, ఉద్యోగావకాశాలను సృష్టించడం, ఐటీ, మానుఫా క్చరింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అభివృద్ధిసమాజ పరంగా సమగ్రత సామాజిక సమానత్వం, లింగ సమాన త్వం, విద్యావృద్ధిఆరోగ్య సదుపాయాల వృద్ధిపట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం పరిశుభ్రమైన, పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి
గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తుల ప్రోత్సాహంకాలుష్య నియంత్రణ, నీటి వనరుల పరిరక్షణసాంకేతికత ఆధారిత అభివృద్ధిడిజిటల్ ఇండియా అభియాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజ భారత విలువలు మరియు సంస్కృతిని పరిరక్షించుకుంటూ అభివృద్ధి సంస్కృతి,భాషలు, సంప్రదా యాలను గౌరవిస్తూ ఆధుని కతను అంగీకరించడం భారత యువతకు ఒక ప్రేరణాత్మక దిశను చూపుతుంది.దీని ద్వారా ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులు,సంస్కరణలు ఒక దీర్ఘకాలిక దృష్టికోణంతో అమలవుతాయి.ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ స్థానం మరింత శక్తివంతంగా మారుతుంది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, యువ మోర్చా జిల్లా కార్యదర్శి లాడే శివ, మండల ఉపాధ్యక్షుడు కోమటి రాజశేఖర్, మండల ప్రధాన కార్యదర్శులు మామిడి విజయ్, భూతం తిరుపతి, మండల కార్యదర్శులు మేకల సుమన్, వంగరి శివ శంకర్, కొంగరి భారతి, సీనియర్ నాయకులు మోత్కూరు సత్యనారాయణ, బూత్ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, వంగల భాస్కర్ రెడ్డి, మును కుంట్ల చంద్రమౌళి,కన్నెబోయిన రమేష్, మూడేడ్ల పైడి, పరుష బోయిన శంకర్, బత్తుల రాజే ష్, కొంగర సుధాకర్, ఎర్ర తిరుపతిరెడ్డి, మూడేడ్ల రాంప్ర సాద్ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ పాఠశాలలను మనమే కాపాడుకుందాం.

ప్రభుత్వ పాఠశాలలను మనమే కాపాడుకుందాం.

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

మండలంలోని కోమటి కొండాపూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం లో భాగంగా గ్రామ కూడలిలో గ్రామ సభ గ్రామస్తులు, విద్యార్థుల చే నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామ సభను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు, రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థుల నమోదు సంఖ్య తగ్గిపోతున్నదని, ఇది ఇలాగే కొనసాగితే పాఠశాల లు మూత పడి పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారని, కావున ప్రభుత్వ బడుల పరిరక్షణ కొరకు ప్రతి గ్రామస్తుడు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, సాధించిన విజయాలపై “కరపత్రాలు “ముద్రించి గ్రామ సభ లో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రాధిక, పంచాయతీ కార్యదర్శి సరిత, గ్రామ పెద్దలు దూదిగాం గంగాధర్, లక్ష్మి నర్సయ్య, ప్రసాద్, ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, రాణి, నర్మదా, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన

కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

 

 

తంగళ్ళపల్లి నేటిధాత్రి:

 

 

 

 

మండల చెందిన.కాంగ్రెస్ పార్టీ.సీనియర్ నాయకులు గత కొన్ని రోజులు బాధపడుతున్న నర్రా బాల్రెడ్డిని.ఆయనను తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈరోజు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పరామర్శించి మనోధైర్యం ఇచ్చి అన్ని రకాలగా ఆదుకుంటామని పెద్దలదృష్టికి తీసుకెళ్లి సహాయ అందిస్తామని.ఆయనకు హామీ ఇవ్వడంతో పాటు మనోధైర్యాన్ని ఇచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్టి కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ళ నరసింగం.గౌడ్ డైరెక్టర్ బాలు శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఆచారి బాల్రాజ్ మనోజ్ ఉమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు…

పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. పేద ప్రజల ప్రభుత్వం అని పేదల సంక్షేమానికి కాంగ్రెస్ నైజం అని ఇందిరమ్మ జ్ఞాపకాలు పదిలంగా ఉండడానికి అనేక పథకాలు తీసుకొచ్చామని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గ్రామం జిల్లాల గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని. జిల్లాలలో పెద్దమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని ఇందిరమ్మ కాలనీ జిల్లాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసిభూమి పూజలో పాల్గొనడం జరిగిందని. అలాగే రాష్ట్ర పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని. రాష్ట్రాన్ని గత పాలకులు ఎంతో అప్పుల్లో కూర్చున కూడా దాన్ని అధిగమిస్తూ. రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారని. అలాంటిది లేనిపోని అబండాలు వేసి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని దయచేసి అభివృద్ధి పథంలో భాగ్యస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఎంత కష్టమైనా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతున్న ఏకైక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్. ఏం సి వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్గo గౌడ్. డైరెక్టర్ బాలు. శ్రీనివాస్ రెడ్డి. గడ్డం మధుకర్. జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఆసరి బాలరాజు. మనోజ్. ఉమేష్. తిరుపతి గౌడ్. నరసయ్య. సలీం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాలు గెలిపించాలి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాలు గెలిపించాలి.

పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల కేంద్రంలో మండల కార్యవర్గ సమావేశం బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు విచ్చేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారాధ్యంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ దేశం కోసం ధర్మం కోసం దేశ అభివృద్ధి కోసం ఎల్లవేళల శ్రమిస్తూ నరేంద్ర మోడీ ని ఆయన తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధిక స్థానాల్లో గెలుపొందే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ రావుల రాకేష్ బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య మండల ఉపాధ్యక్షులు సుధా గాని శ్రీనివాస్ నల్ల శ్రీనివాస్ రెడ్డి చింతల రాజేందర్ మండల కార్యదర్శి చెన్నవేని సంపత్ బిజెపి సీనియర్ నాయకులు మాచర్ల రఘు, కంచ కుమారస్వామి బూత్ అధ్యక్షులు వల్లల ప్రవీణ్ తీగల వంశీ బుర్రితిరుపతి జైపాల్ చందు వివేక్ తోట్ల మహేష్ గొప్పగాని రాజు మాదారపు రాజు శ్యామల వెంకటేశ్వర్లు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version