తంగళ్ళపల్లి మండలం చింతల గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేబిల్లు వలన. గ్రామస్తులకు ఇబ్బందికరంగా ఉందని అలాగే. రోడ్డు మార్గాన రోజు 100 నుండి 200 వాహనాలు వెళ్తాయని. చిన్నపిల్లలకు ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున. అలాగే గ్రామంలో. కోడి పిల్లలకు. ఎడ్లకు లేగా దూడలకు. మూగజీవాలకు అధికంగా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున గ్రామంలో చిన్నచిన్న మార్గాలు ఉన్నందున ఇట్టి మార్గాన్ని. వేరే మార్గం గుండా ఆవు నూరి.బ్రిడ్జి నుండి. నక్క వాగులోకి ప్రవేశం కల్పించే విధంగా సహకరించి ప్రజల బాగోబాగులు చూడవలసిన బాధ్యత మీపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు. చింతలపల్లి కట్కూరు. గ్రామాల ప్రజలు స్థానిక తంగళ్ళపల్లి ఎమ్మార్వో గారికి ఇకనైనావే బ్రిడ్జి సమస్యలేకుండా. చూడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై స్పందించిన ఎమ్మార్వో. సాధ్యమైన మట్టుకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కార దిశగా చూసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు
గృహ ప్రవేశానికి హాజరై న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటిధాత్రి:
పెద్దమందడి మండలంలో మోజార్ల గ్రామానికి చెందిన బీ అర్ యస్ పార్టీ నేత వెంకటేష్ నూతన గృహ ప్రవేశ ని ప్రవేశంలో మాజీ మంత్రిసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని వారి కుటుంబ సభ్యులకుకృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి వెంటసునీత తిరుపతయ్య జగదీశ్వర్ రెడ్డి కుమార్ యాదవ్ నాగేంద్ర యాదవ్, శ్రీనివాసులు,జగన్ గౌడ్ తదితరులుఉన్నారు
విద్యార్థులకు సరస్వతి ఉత్తమ విద్యార్థి అభినందన సభ.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజు ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ ఇన్చార్జి వేల్పుల రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా లోని ప్రభుత్వ ,గురుకుల కేజీబీవీ మోడల్ స్కూల్ మరియు కళాశాల 10 వ మరియు ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన 2024/2025 వారికి ఎబివిపి ఆద్వర్యం లో అభినందన సభ నిర్వహించడం జరుగుతుంది అని కావున జిల్లా లోని విద్యార్థులు పేరు నమోదు చేసుకోవాలని,నమోదు కొరకు 7287920310…సంప్రదించాలి అని ఒక ప్రకటనలో తెలిపారు
తిరుపతిలో అత్తలూరి ఆర్యవైశ్య సత్రంలో లాకర్ కు 400 ?
ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఏపీ అధికారులు వనపర్తి నేటిధాత్రి:
తిరుపతి లో రైల్వే స్టేషన్ ఎదురుగా అత్తలూరి ఆర్యవైశ్య సత్రం లాకర్ ఇవ్వడానికి అత్తలూరు 400 రూపాయలు చెల్లిస్తేనే లాకర్ ఇస్తామని పీడిస్తున్నారు . ఈ మేరకు భక్తులు కొందరు సోమవారం రాత్రి లాకర్ ఇవ్వాలని సత్రం దగ్గరికి వెళ్లి నిర్వాహకులను అడిగారు సత్రం నిర్వాహకులు ఒక లాకర్ ఇవ్వడానికి 400 రూపాయలు చెల్లిస్తేనే లాకర్ ఇస్తామని ఆగ్రహంగా ఆవేశంగా ప్రవర్తించారని భక్తులు తెలిపారు . ఈ మేరకు భక్తులు నేటి దాత్రి దినపత్రిక విలేకరులతో ఆవేదన వ్యక్తం చేస్తూ భక్తులను పీడించి వసూలు చేస్తున్న లాకర్లు రూముల కేటాయింపు ప్రభుత్వ నియమ నిబంధనలు జీఎస్టీ చెల్లించ కుండ రూల్స్ ను ఉల్లంఘించి అధికంగా డబ్బులు వసూలు చేస్తూ భక్తులను పీడిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి లో అధికారులు ప్రేక్షక పాత్ర వహించిదముపై ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్రటరీ తిరుపతి కలెక్టర్ తిరుపతి ఎంపీ ఎమ్మెల్యేకు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేస్తామని తెలిపారు సత్రం వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు పేర్కొన్నారు
సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ.నాగయ్య అన్నారు. సిపిఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు రెండో రోజు పట్టణంలోని గ్రీన్ రిసార్ట్ లో సిపిఎం జిల్లా కార్యదర్శి సీ హెచ్ రంగయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పోరాటాలే మార్గం అని అన్నారు. కేంద్రం లోని మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య కులాలు మతాల మధ్య చీలిక తీసుకువచ్చి విద్వేషాలు రెచ్చగొట్టి పాలన సాగిస్తున్నదని, దేశంలో ప్రజల ప్రజాస్వామిక హక్కులు కాలరాసి నియంతృత్వ పాలన తీసుక రావడానికి బిజెపి నాయకత్వం లోని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను సాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం లో అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడంలో కాలయాపన చేస్తుందని , ప్రధానంగా రైతు రుణమాఫీ, రాజీవ్ యువ వికాసం, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అమలు చేయడం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.బిజెపి దేశంలో మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి ఏం తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో బిజెపి నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వారు అన్నారు. హిందువులు పేరుతో మత రాజకీయాలు చేస్తూ హిందువులపై అదనపు ఆర్థిక భారాలు మోపడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల సమయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే పనిలో బిజెపి నేతలు వున్నారని విమర్శించారు. నూతన ఆర్థిక విధానాలతో దేశంలో సంక్షోభం ఏర్పడింది అని, మరోవైపు ప్రజలు ఉద్యమాల్లోకీ రాకుండా మతాన్ని ముందుకు తెచ్చి దేశ ప్రజలతో బిజెపి నేతలు ఆటలు ఆడుతున్నారని వారు ధ్వజమెత్తారు. హామీల అమలుకు ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో పార్టి జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెళ్లి బాబు, నలిగంటి రత్నమాల సింగారపు బాబు,భూక్య సమ్మయ్య, కోరబోయిన కుమారస్వామి, నమిండ్ల స్వామి ముంజాల సాయిలు ఆరూరి కుమార్, హన్మకొండ శ్రీధర్, బోళ్ల సాంబయ్య, ఎండి బషీర్, వి దుర్గయ్య, యారా ప్రశాంత్, పట్టణ కమిటీ సభ్యులు మండల, ఏరియా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కారేపల్లి లో నూతన వదువరులను ఆశీర్వదించిన ఎన్ ఎచ్చ్ ఆర్సీ ఆండ్ ఉమెన్ ఎంపవర్ మెంట్ ఆర్గనైజేషన్.
జాతీయ చైర్మన్ మహ్మద్ మొహినుద్దీన్.
కారేపల్లి నేటి ధాత్రి
నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ జాతీయ ఫౌండర్ మరియు చైర్మన్ మహమ్మద్ మొయినుద్దీన్ ఎన్ ఎచ్చ్ ఆర్సీ ఆండ్ డబ్ల్యూ ఈఓ ఖమ్మం జిల్లా జాయింట్ కార్యదర్శి మదగాని నాగేశ్వరరావు కుమారుడు శరత్ యాదవ్ జాహ్నవి ల వివహ కార్యక్రమం కారేపల్లి లోని పంక్షన్ హల్ లో నిర్వహించగ ఈ రిసెప్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా పాల్గొని వదువరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో జాతీయ చైర్మన్ తోపాటు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఆదేర్ల రాధా గోవిందు ఉపాధ్యక్షులు బెల్లం కొండ శ్రీనివాస్.హన్మకొండ జీల్లా అద్యక్షులు విన్న కోట గోవర్ధన్ భద్రాద్రి కొత్తగూడెం జీల్లా అద్యక్షుడు సంపత్ కుమార్ అడ్వయిజర్ కె.భూపాల్ మహబూబాబాద్ మాజీ అధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని నూతన వదువరులను ఆశీర్వాధించారు.
-రైతులను మోసం చేసిన జగన్‌కు వత్తాసు పలుకుతున్నారు.
-జగన్ బేరం ఒప్పుకుంటే ఖమ్మం జేసిదే తప్పని నిరూపిస్తాం?
-ఆదర్శంగా వుండాల్సిన అధికారులు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు.
-రైతులను మోసం చేసిన జగన్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
-మిల్లర్లు, అధికారులు కుమ్మక్కైతే ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు.
-మిల్లర్ జగన్ దోపిడీని ఎవరూ ఆపలేరు?
హైదరాబాద్,నేటిధాత్రి: హన్మకొండలోని సివిల్ సప్లయ్ అధికారులు అవినీతిలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. శాఖ సాక్షిగా తప్పులుచేస్తారు. మిల్లర్లచేత తప్పులు చేయిస్తారు. తమ తప్పు లేని నిరూపించే ప్రయత్నం చేస్తారు. తప్పు చేసిన మిల్లర్లను తప్పిస్తారు. ప్రతిసారి మాకేమిస్తారని మోసం చేసిన మిల్లర్లకు అండదండలందిస్తారు. అందిన కాడికి దోచుకుంటారు. ఇదీ ప్రస్తుతం హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్ సప్లయ్ శాఖకు చెందిన అదికారుల ఘనకార్యమని అందరూ చెప్పుకుంటున్నారు. తాజాగా ఓ పెద్ద సంఘటన జరిగింది. తెలంగాణలో ఈ సీజన్‌లో సన్న వరి రకాలను రైతులు రికార్డు స్ధాయిలో పండిరచారు. అందులో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏకంగా 92శాతం సన్న వడ్లు పండిరచారు. దాంతో ఐకేపి సెంటర్లకు పెద్దఎత్తున వడ్లు వస్తున్నాయి. వాటిని మిల్లులకు పంపించడానికి ఆ జిల్లా అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో పొరుగున వున్న హన్మకొండ జిల్లా రైస్ మిల్లులకు ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ ఓ యాభై లారీల వడ్లను పంపించారు. వాటిని జాయింట్ కలెక్టర్ సూచించిన మిల్లులకు ఆ లారీలు చేరాలి. కాని ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ పంపిన మిల్లులకు ఆ వడ్లు చేరలేదు. హన్మకొండ జిల్లా సివిల్ సప్లై అదికారులకు అనుంగుడైన, అత్యంత సన్నిహితుడైన జగన్ అనే మిల్లులకు చేరాయి. ఇంత వరకు బాగానే వుంది. కాని ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ పంపిన వడ్ల బస్తాలకు, రైతులకు అందిన సొమ్ముకు మధ్య ఏదో తేడా కనిపించింది. దాంతో ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. ఖమ్మం నుంచి వచ్చిన 50 లారీల బస్తాలలో సుమారు 2000వేల బస్తాలను హన్మకొండ జిల్లాకు చెందిన మిల్లర్ జగన్ మాయం చేశాడు. ఈ విషయం పసిగట్టిన జాయింట్ కలెక్టర్ బస్తాల మాయంపై సంబందిత జగన్‌కు చెందిన మిల్లులకు తఖీదులు జారీ చేశారు. దాంతో జగన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. జగన్ మాయం చేసిన వడ్ల బస్తాల గురించి ఖమ్మం జాయింట్ కలెక్టర్‌కు ఎలా తెలిసిందని ఆరా తీశాడు. అసలు విషయం తెలుసుకున్నాడు. ఇరుక్కున్నానని అర్ధం చేసుకున్నాడు. ఇక్కడ జరిగిందేమిటంటే ఖమ్మం జాయింట్ కలెక్టర్ ప్రతి బస్తామీద దాని బరుకు చెందిన తూకం రాయించారు. ఈ విషయాన్ని మోసం చేసిన మిల్లర్ జగన్ పసగట్టలేదు. హన్మకొండ జిల్లాకుచెందిన సివిల్ సప్లయ్ అదికారులు గుర్తించలేదు. వచ్చిన లారీల నుంచి వడ్లు దించుకున్నామా? అందులో నుంచి 2వేల బస్తాలు మాయం చేశామా? అన్నట్లు జగన్ ఆత్రపడ్డారు. అడ్డంగా ఇరుక్కున్నాడు. ఇప్పుడు లబోదిబో మంటున్నాడు. తన బాధను హన్మకొండ సివిల్ సప్లయ్ అదికారుల ముందు పెట్టాడు. వెతకబోయిన తీర కాళ్లకు తగిలినట్లు హన్మకొండ సివిల్ సప్లై అదికారులు జగన్‌ను నేటిదాత్రి దినపత్రిక వుంచారు. ఈ విషయాన్ని నేటి దాత్రి దినపత్రిక ఎప్పుడో ప్రచురించింది. ఓ తరాజులో నేటి దాత్రి దినపత్రిక పెట్టినట్లు, మరో తూకంలో ఎంత ఇస్తావ్ అన్న ప్రశ్నలు పెట్టేశారు. తప్పు జరిగింది. జగన్ తప్పుచేశాడు. కాని మాకేం తెలియదు. జగన్‌కు వడ్లు ఇవ్వడం వరకే చూసుకున్నాం. కాని జగన్ వడ్లు మాయం చేసిన సంగతి మా దృష్టికి రాలేదని అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కేసు తమ మీదకు రాకుండా పూర్తిగా జగన్ మీదకు తోసేసే స్కెచ్ వేశారు. దాంతో జగన్ అదికారుల కాళ్లా వేళ్లా పడే పరిస్దితి వచ్చింది. ఇదే సరైన అవకాశం అనుకున్నారు. తప్పిస్తే ఎంతిస్తావ్ అనే బేరానికి వచ్చారు. తూకమెంత తూగుతామని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మేం అడిగినంత ఇస్తే తప్ప నిన్ను రక్షించలేమంటూ జగన్‌కే తెగేసి చెప్పేశారు. మేం అడిగింది తూకంలో వేస్తే అన్నీ మేం చూసుకుంటామని జగన్‌కు అదికారులు భరోసా ఇచ్చారు? హన్మకొండకు చెందిన అదే సివిల్ సప్లయ్ అధికారులు ఖమ్మం జేసి ఇచ్చిన రిపోర్టు తప్పని తాము నోట్ చేస్తామని, సమాదానం పంపిస్తామని జగన్‌కు చెప్పారు. ఈ విషయంలో జగన్ తప్పేం లేదని తేల్చేస్తాం. ఎలాంటి కేసు జగన్ మీదకు రాకుండా చూస్తామని హమీ ఇచ్చారు. ముఖ్యంగా నేటిధాత్రి దినపత్రికలో వచ్చిన కథనంతో జగన్ ఇక నీపని ఔట్ అంటూ బెదించారు. కేసులు ఎదొర్కొక తప్పదని భయపెట్టారు. నిన్ను లోపలికి పంపించేందుకు నేటి దాత్రి ఒక్క వార్త చాలంటూ జగన్‌కు చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. ఈ సంగతి తెలిసి అటు పొల్యూషన్ డిపార్టుమెంటు అధికారులు కదిలారు. ఇరిగేషన్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఏక కాలంలో మూడు శాఖల అధికారులు జగన్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలు ఊరుకుంటాయా? వాటి పని అవి మొదలు పెట్టాయి. దాంతో ఇంత మంది అధికారులకు ఏక కాలంలో సమర్పణలు అంటే నా ఒక్కడి వల్లకాదని జగన్ అధికారులకు తేల్చి చెప్పాడు. నాతో పాటు వున్న అన్ని మిల్లులపై కూడ చర్యలుంటాయని అదికారులు సహకరిస్తే, వసూలు చేసి ఇస్తానని జగన్ హమీ ఇచ్చాడు. ఇది సివిల్ సప్లై శాఖతోపాటు, పొల్యూషన్, ఇరిగేషన్‌శాఖల దిగజారుడు తనానికి ఇది పరాకాష్ట అని ప్రజా సంఘాలు అంటున్నాయి. జగన్ బేరం ఒప్పుకుంటే ఏకంగా ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ దే తప్పని నిరూపిస్తామని అధికారులు అంటున్నారంటే ఎంతగా దిగజారి పోయారో అర్ధం చేసుకోవచ్చు. ఆదర్శంగా వుండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అడ్డమైన దారులు తొక్కుతున్నారు. అడ్డంగా సంపాదనకు ఎగబడ్డారు. తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారిని కాపాడి సంపాదన పెంచుకుంటున్నారు. రైతులను నిండా మోసం చేసిన జగన్‌ను కాపాడే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. మిగతా మిల్లర్లతో మాట్లాడి అదికారులు చెప్పిన మూట సమర్పించడానికి జగన్ ఒప్పుకున్నట్లు సమాచారం. దాంతో హన్మకొండ అదికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మిల్లర్లు, అధికారులు కలిసి కుమ్మక్కైతే ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా కాపాడలేడన్న సామెతను నిజం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా మిల్లర్ జగన్‌ను ఎవరూ ఆపలేరు. ఈ విషయం ఖమ్మం అధికారులు తెలుసుకొని, వెంటనే రంగంలోకి దిగితే అసలు మోసగాళ్లంతా బైటకు వస్తారు. ఖమ్మం జేసి పంపిన రిపోర్టు తప్పని నిరూపించే ప్రయత్నం చేయకముందే అసలు నిజాలు బైట పెట్టి, చర్యలు చేపడితే అందరి బండారం బైటకొస్తుంది. హన్మకొండ సివిల్ సప్లై అదికారుల చేతి వాటమే కాదు, పొల్యూషన్, ఇరిగేషన్ అధికారుల అవినీతి బాగోతం అంతా బైటపడుతుంది.
శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ పునర్ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న
◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్
◆ డా౹౹ఎ.చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాలకల్ మండలంలోని మెటల్ కుంట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి మందిరంలో స్వామి వారి విగ్రహ మరియు ధ్వజ స్తంభ శిఖర ప్రతిష్టాపన లో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.
MP Suresh Kumar Shetkar
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హనుమంత రావు పాటిల్, శ్రీనివాసరెడ్డి , రామలింగారెడ్డి ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, PACS చైర్మెన్ సిద్దిలింగయ్య గారు, ఎయంసి.డైరెక్టర్ వంశీ, కాంగ్రెస్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి,యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు జీవన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ రాథోడ్,మరియు గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ,ప్రజలు పాల్గొనడం జరిగింది.
ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం సాయల్ టెస్ట్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం లో మరో ముందడుగు
కొత్తగూడ,నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి కొత్తగూడ మండల ప్రజల చిరకాల కోరిక.. త్వరలో తీరానున్న పెద్ద ఆసుపత్రి కల..!!తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులుడాక్టర్ అనసూయ సీతక్క ప్రత్యేక దృష్టితో ఉమ్మడి కొత్తగూడ ప్రజల కోసం 30 పడకల ఆసుపత్రి మంజూరు చేసిన సంగతి విధితమే శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో..ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం లో భాగంగా సాయల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమం లో.. డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్య, ఉపాధ్యక్షులు వెలుదండి వేణు, మండల నాయకులు వజ్జ బాలరాజు,హలవత్ సురేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, నాయకులు కందుల సందీప్, రవి, తదితరులు పాల్గొన్నారు,.,
నర్సంపేట డివిజన్ పరిధిలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.నర్సంపేట పట్టణ, మండల ముస్లిం సోదరులు శనివారం ఉదయం మాదన్నపేట రోడ్డు ఈద్గాయందు పవిత్ర బక్రీద్ పండుగ నమాజును భక్తిశ్రద్ధలతో జామా మజీద్ ముష్టి మహబూబ్ చదివించారు. అనంతరం పండుగ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రముఖ నాయకులు తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ ప్రార్ధనలో పాల్గొని మాట్లాడుతూ బక్రీద్ నెలలో హచ్ యాత్ర జరుగుతుందని, ఈ యాత్రకు ప్రపంచ నలీమూలల నుంచి ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తారని పేర్కొన్నారు. త్యాగాలకు ప్రతిరూపం బక్రీద్ అని ప్రతి ముస్లిం తనలో ఉన్న చెడు అలవాట్లను చెడు నిర్ణయాలను చెడు ప్రవర్తనను మానుకోవడమే కాకుండా కుర్బానీ సమాజ సేవ మంచితనం మానవత్వం త్యాగగుణం కలిగి ఉండడమే పండుగ ప్రాముఖ్యత జావిద్ అన్నారు. అనంతరం కులమతాలకతీతంగా సోదర భావం తెలుపుకుంటూ ప్రేమతో అలింగణం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.పట్టణంలో ఉన్న అబ్రస్తాన్ ముస్లిం స్మశానవాటికలకు వెళ్లి చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి సమాధులపై పూలు పెట్టి ప్రార్థలను చేశారు.ఈ కార్యక్రమంలో జమా మజీద్ కమిటీ అధ్యక్షులు నబీ కార్యదర్శి హబీబ్ అయుబ్ మసూద్ అలీ హుస్సేన్, ఎస్ డి జావేద్,ఎండి రబ్బాని,ఎండి యూసుఫ్,ఎస్కే షరీఫ్,ఎస్ కే జాఫర్, ఎండి రజాక్,ఎండి మురుషోర్, ఎండి ఖలీల్, జలీల్ తదితరులు పాల్గొన్నారు.
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ముదిరాజ్ ల ఆశాజ్యోతి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజ్ కి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవివ్వాలని మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ కులగణన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ముదిరాజ్ వారే ఉన్నారని తెలిందని మంచి గుణ,ప్రజా బాంధవుడు,ప్రజల ఆపద్బాంధవుడు వాకటి శ్రీహరి ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవివ్వాలని ముదిరాజులను బిసిఏ కి చేర్చాలని మా ఓటుతో గెలిచి మమ్మల్ని మర్చిపోతూ,అన్యాయం చేస్తున్నారని మేమెంతో మాకంతా కావాలని కోరుతున్నామని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజ్ కావున వారికి మంత్రి పదవివ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
న్యాల్కల్ మండల మెటల్ కుంట గ్రామం లో ఆంజనేయ స్వామి విగ్రహాల పునర్ ప్రతిష్టాపన ధ్వజస్తంభం శిఖర ప్రతిష్టాపన మహోత్సవలో బిఆర్ఎస్ పార్టీ న్యాల్కల్ మండల సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి కార్యక్రమంలో మెటల్ కుంట గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాండురంగ రెడ్డి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గొల్ల అశోక్ లోకేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన గ్రామ మాజీ సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పరిధిలోని తుమ్మనపల్లి గ్రామంలో శనివారము బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లీంలు మసీదులు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు అలయ్ బలయ్ చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో తుమ్మనపల్లి తాజా మాజీ సర్పంచ్ నవాజ్ రెడ్డి కాంగ్రెస్ ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ పండుగ భక్తిభావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతం అన్నారు.
పట్టణానికి చెందిన గొడుగు నాగరాజ్ భార్గవిల కూతురు లాస్య కు నూతన వస్త్ర పుష్పాలంకరణ మహోత్సవ కార్యక్రమం పట్టణంలోని ఎఫ్ జే ఫంక్షన్ హాల్లో నిర్వహించగా పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సోదా రామకృష్ణ ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు బండి సదానందం గౌడ్,మార్క రఘుపతి గౌడ్,ఏకు రాజు,బండి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
భవ నానిర్మాణ కార్మికుల సంఘం వనపర్తి జిల్లా నాలుగో మహాసభలు జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి కురుమయ్య భవన నిర్మాణ కార్మికుల ను ఒక ప్రకటన లో కోరారు శనివారం నాడు వనపర్తి లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఐటియు జిల్లా కార్యాలయంలో మహాసభలు జరుగుతాయని ఈ కార్యక్రమంలోముఖ్య అతిథులుగా తెలంగాణభవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు హాజరవుతారని వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల భవన నిర్మాణ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంధం మదన్ జిల్లా కార్యదర్శి బొబ్బిలినిక్సన్ వనపర్తి పట్టణ కార్యదర్శి రాబర్ట్ నాయకులు బాలరాజు బాలస్వామి రవి వెంకటయ్య మన్యం తదితరులు పాల్గొన్నారు
దుందుభి వాగులో పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దయ్య పల్లి శివారులో శనివారం జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. గుండేడ్ గ్రామానికి చెందిన శంకరమ్మ (47) గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతున్నది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వెతికిన ఆచూకీ లభించలేదు. శనివారం బాలానగర్ మండలంలోని పెద్దాయ పల్లి గ్రామ శివారులో ఉన్న దుందుభి వాగులో శంకరమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకరమ్మ మృతిపై ఎవరిపై అనుమానం లేదని.. కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఫర్టిలైజర్ పెస్టిసైడ్ మరియు డీలర్ ఫెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందే వెంకటేశ్వర్లు
పరకాల నేటిధాత్రి
ఎరువుల రిటైల్ డీలర్లు వ్యాపారం,కష్టాల కడలిపై, నష్టాల నావలా తయారైందని గత రెండేళ్లుగా కొన్ని ఎరువుల కంపెనీలు,రిటైల్ డీలర్లకు ఇచ్చే మార్జిన్లు గణనీయంగా తగ్గించడంతో హోల్ సేల్ డీలర్లు ఎమ్మార్పీ ధరలకు అమ్మి రిటైల్ డీలర్లకు భారీగా నష్టాలు వాటిల్లుతున్నవని పరకాల మండల ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్ మరియు డీలక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందే వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రముఖ ఎరువుల కంపెనీలలో కొన్ని కంపెనీలు లాభా పెక్షే ధ్యేయంగా ఎరువుల కంపెనీ డీలర్ల పై కపట ప్రేమను చూపిస్తూ సీజను అన్సీజన్ పక్కనపెట్టి డిమాండేతర సరుకులకు ఎరువుల ఆర్డర్ తోపాటు లింకు రూపేనా కొన్ని రకాల సరుకులను తీసుకున్న హోల్ సేల్ డీలర్లుతో మాత్రమే వ్యాపారం చేస్తున్నాయన్నారు.లింకులో తెచ్చుకున్న సరుకులు అమ్ముడుపోక వ్యాపారంలో లాభాలురాక డీలర్లు చితికి పోతున్నారని ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా బస్తాలు రిటైల్ డీలర్లు అమ్మే పరిస్థితిలో లేరని కొన్ని కంపెనీ లు ఇచ్చే మార్జిన్లు హమాలీ, డి డి ఖర్చులకే పోతున్నాయని ఇవన్నీ పోగా డీలర్లకు మిగిలేది శూన్యమే అని అన్నారు.ఎరువులపై గవర్నమేంట్ సబ్సిడీ ఇస్తున్నారు కానీ కంపెనీ వారు వారి లాభాపేక్షణకు ఆశపడి పక్కదారి పట్టిస్తున్నారని అధికారులు,కంపెనీ ప్రతినిధులు దీనిపై దృష్టి సారించి ఇచ్చే లింకులు రైతులకు ఇచ్చే విధంగా రూల్ పాస్ చెసి రిటైల్ డీలర్లకు న్యాయ సమ్మతమైన విధంగా యూరియాను అందించాలని కోరారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శనివారం బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలు వైఫల్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై అధికారులను నిలదీస్తూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ప్రజలపై సత్సంబంధాలు మెరుగుపరిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీని పలువురు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
రైతులు శాస్త్ర సాంకేతికతను అవలంభించడం ద్వారా తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడి సాధించవచ్చు…
నేటి ధాత్రి – మహబూబాబాద్ -గార్ల :-
వెదజల్లే పద్ధతిలో వరి సాగు సత్ఫలితాలిస్తుంది. అదును సమయంలో కూలీలు దొరక్క ఇబ్బందిపడే సందర్బాల్లో ప్రత్యామ్నాయం వైపు చూస్తూ వెదజల్లే పద్దతిపై రైతులు దృష్టి సారిస్తున్నారు. నాట్లు వేయడం ప్రస్తుతం పాత తరానికే పరిమితమైంది. నేటి మహిళలు నాట్లు వేసే పద్ధతిపై ఆసక్తి చూపడంలేదు. దింతో రైతులకు కూలీల కొరత ఇబ్బందికరంగా మారిందని రైతులు చెబుతున్నారు. వరి సాగు కత్తి మీద సామయింది. అయితే అనావృష్టి, లేకుంటే అతివృష్టి వంటి వాతావరణ పరిస్థితుల వల్ల రైతులకు కష్టాలు, నష్టాలు మిగులుతున్నాయి.రైతులు వరి సాగులో మేలుకువలు,శాస్త్ర సాంకేతికతను అవలంభించడం ద్వారా తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడులు సాధించవచ్చు.వరి వెదజల్లే పద్దతి ద్వారా రైతుకు నాటు పద్దతిలో కన్నా ఒక ఎకరాకు ఆరు నుండి ఎనిమిది వేల రూపాయల వరకు పెట్టుబడి ఆదా అవుతుంది.వరి వెదజల్లే పద్దతి ద్వారా నారు మడి పెంచే అవసరం ఉండదు.నాటు కూలిలు ఆదా అవుతాయి,10 రోజుల ముందుగానే వరి కోతకు వస్తుంది.వరి వెదజల్లే పద్దతి వలన ఒక ఎకరాకు 10కేజీల విత్తనం సరిపోతుంది.సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టాలని, విత్తనం వెదజల్లిన 20 నుండి 25రోజుల వ్యవధిలో కలుపు మందు స్ప్రే చేసి కలుపు సమస్య ను అదిగమించుకోవచ్చు.రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే మండల వ్యవసాయధికారిని సంప్రదించుకోవచ్చు కూడా. పొలం బాగా దున్ని నీటి పారుదల సౌకర్యం కల్పించి పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. వరి విత్తనాలను తగినంతగా నానబెట్టి, పొలంలో విత్తనాలను సమానంగా వెదజల్లాలి. పురుగు మందులను అవసరమైనప్పుడు ఉపయోగించి పంటను కాపాడుకోవచ్చు అని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఈద్ ఉల్-అధా (బక్రీద్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి బాంబులగడ్డ, ఈద్గాల్లో జరిగిన బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు బక్రీద్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. శాంతి, కరుణ, సహనం, సామరస్యం, ఐకమత్యం, సోదరభావం స్ఫూర్తితో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా భాగస్వామ్యం, దానధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం బక్రీద్ పండుగ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని సందేశాన్ని బక్రీద్ తెలుపుతుందన్నారు. బాంబులగడ్డ ఈద్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తానని ఎమ్మెల్యే ఆమె ఇచ్చారు ఈ కార్యక్రమాలల్లో మహమ్మద్ ఇర్ఫాన్ హైమత్ పాషా ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.