రాజు పేట ఎస్సీ కాలనీలో బతుకమ్మ కనుమరుగయ్యా.!

రాజు పేట ఎస్సీ కాలనీలో బతుకమ్మ కనుమరుగైయ్యే ప్రమాదం లో ఉంది..

_ఎస్సీ కాలనీ వాసి జై భీమ్ రామ్మోహన్

మంగపేట నేటిధాత్రి

మంగపేట మండలం రాజుపేట గ్రామంలో ఎస్సీ కాలనీలో కాలనీవాసులందరూ కలిసి గత30 సంవత్సరాల క్రితమే కొంత స్థలాన్ని దేవుడి పేరు మీద కేటాయించుకొని.. అక్కడే అన్ని పండగలు జరుపుకునేవారు.. ముఖ్యంగా బతుకమ్మ వేడుకని అద్భుతంగా అందరూ కలిసి అదే స్థలంలో గత 15 సంవత్సరాల నుండి జరుపుకునేవారు కానీ ఈరోజు ఆ బతుకమ్మ ఈ ఎస్సీ కాలనీలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.. దేవుడి పేరు మీద ఉన్న స్థలం కాబట్టి ఆ స్థలంలో గుడి నిర్మించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు, ఎస్సీ కాలనీ ప్రజల, ఎస్సీ కాలనీలో ఉన్న మహిళల అంగీకారాలు వాళ్ల స్పందన తెలుసుకోకుండా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం సరైనది కాదు..చేసేది మంచి పని అయ్యినా అందరి అభిప్రాయాలు తెలుసుకునే కనీస బాధ్యత ఉండాలి కదా..ఆ స్థలంలో గుడి వస్తుంది మంచిదే..కానీ బతుకమ్మ ఆడే స్థలం లేదని మహిళలు లోలోపలే బాధపడుతున్నారు .. ఎస్సీ కాలనీ వాసులకు ఇదే స్థానిక కాంగ్రెస్ నేతలు బతుకమ్మ ఆడడానికి ఒక అనుకూలమైన, విశాలమైన స్థలాలను కేటాయించాలి..లేనిచో కాలనీ బతుకమ్మ పండుగ కనుమరుగైయ్యే ప్రమాదం ఉంది.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ముందు తరాలు వారసత్వ సంపద ఇవ్వలేని పరిస్థితిలో కాలనీ వాసులు ఉంటారు.. కావున గుడి నిర్మాణానికి మేము ఏమాత్రం వ్యతిరేకంగా కాదు గుడి నిర్మాణానికి మేము మద్దతు ఇస్తున్నాం కానీ బతుకమ్మ ఆడడానికి స్థిరమైన స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు కేటాయించకపోతే .. అప్పుడు తీవ్ర పరిణామాలు స్థానికుల నుండి ఎదుర్కోవాల్సి వస్తుందని మార్చిపోవద్దు..అని ఎస్సీ కాలనీ వాసి జై భీమ్ రామ్మోహన్ అన్నారు

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో మహిళా సాధికారిత విభాగం,అలాగే కస్తూరిబాయి మహిళా మండలి సౌజన్యంతో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా నర్సంపేట ప్రముఖ గైనకాజిస్ట్ డాక్టర్ పి.భారతి,

Women’s Day

సీడీపీఓ-ఐసిడిఎస్-కె.మధురిమ,
కస్తూరిబాయి మహిళా మండలి అధ్యకురాలు జి. అరుణ,
ప్రతేక్యఅతిధి మల్లం పద్మ,అంగన్వాడీ
యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్. భారతి పాల్గొన్నారు. అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్
ప్రొఫెసర్ మల్లం నవీన్ మట్లాడుతూ సమాజంలో ఒక్క మహిళను బలపరిస్తే ఆమె తన కుటంబాన్ని బలపరుస్తూ సమాజాభివృధి,
తద్వారా దేశ అభివృధికి పాటుపడుతుందని పేర్కొన్నారు.
గైనకాజిస్ట్ డాక్టర్ పి.భారతి మాట్లాడుతూ స్త్రీలు ప్రధానంగా ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యలకు కొన్ని ఆచరణాత్మక సూచనలు చేస్తూ, క్యాన్సర్ నివారణకు హెచ్పివి వాక్సిన్ యొక్క ఆవశ్యకతను వివరించారు.నేడు మహిళలు వివిధ రంగాలలో ముందడుగు వేస్తున్నారంటే అందుకు కారణం వారి పోరాటాల వెనుక నిలబడిన ఎందరో మహిళామణులు చేసిన శ్రమ ఫలితం అని ఐసిడిఎస్ సీడీపీఓ కె.మధురిమ పేర్కొన్నారు.మహిళా సాధికారిత విభాగం అధ్యక్షురాలు ఎస్.రజిత మాట్లాడుతూ మహిళకు భద్రత,ఆరోగ్య సంరక్షణను పెంపొందిచడంతో పటు మహిళా సాధికారిత ద్వారా స్వతంత్ర నిర్ణయాలను తీసుకొనే వాతావరణం కల్పించాలని అన్నారు.

Women’s Day

కస్తూరిబాయి మహిళామండలి అధ్యకురాలు జి. అరుణ ఇల్లాలి చదువే ఇంటికి వెలుగు అని స్త్రీ విద్య ఆవశ్యకతను వివరించారు. నల్లా భారతి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ప్రకృతిలో లభించే పౌష్ఠిక ఆహారం వివరాలను తెలియజేశారు.అనంతరం వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థినిలకు బహుమతులను ప్రదానం చేసారు.ఈకార్యక్రమంలో మహిళా సాధికారిత విభాగం సభ్యులు ఆర్.రుద్రాణి, డాక్టర్.బి.గాయత్రి,ఏ.వో, జి.అనిత, గ్లోరీ, మాధవి,భార్గవి,లక్ష్మి, కస్తూరిబాయి మహిళామండలి బాద్యులు,అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు,అధ్యాపకులు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

చింతకుంట ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న.!

చింతకుంట ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న 15 మంది యువకులను ఏ నోటిస్ లు లేకుండా తొలగింపు అనేది అక్రమం,

వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో శ్రీనివాస్ కు వినతి పత్రం*

నేటి ధాత్రి భద్రాచలం

చర్ల మండలం మొగల్లపల్లి పంచాయతీ చింతకుంట గ్రామం ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న 15 మంది యువకులను రేషన్ కార్డులేవని అక్రమంగా ఎలాంటి కారణం లేకుండా నోటిస్ లు లేకుండా వారిని విధుల్లోనుంచి తొలగించడాన్ని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుంది* వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మార్వో శ్రీనివాస్ న్యూ డెమోక్రసీ వినతిపత్రం సమర్పించడం జరిగింది.
అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్* మాట్లాడుతూ ఏ ఆంక్షలు లేకుండా
ఎన్నో నెలలుగా వీరు మొగళ్లపల్లి ర్యాంపులలో పనిచేస్తున్నారు రెక్కాడితే డొక్కాడని కుటుంబం నుంచి ఆదివాసి గ్రామస్తులు పనిచేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు భారత రాజ్యాంగం 1/70, పిసా యాక్ట్ ను అమలులో ఉన్న అన్యం పుణ్యం తెలవని అమాయకులు వారి హక్కులను మరచిపోయి పొట్టకూటి కోసం పని చేస్తుంటే ఆదివాసి చట్టాలను కూడా అతిక్రమిస్తూ ఇసుక మాఫియా యాజమాన్యం పెత్తనం చలాయిస్తుందని వారన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా ఎలాంటి నోటీసులు లేకుండా వారు చేసిన తప్పేందో తెలియకుండా వారిని విధుల్లోంచి తొలగించడం సరైనది కాదని తక్షణమే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ యువకులను ఇసుక ర్యాంపు పనిలోకి తీసుకోవాలని లేనిచో దశల వారి ఆందోళన చేస్తామని పై అధికారులను కలుస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం పవన్ వి నాగరాజు మునేశ్వరరావు సంటి వాదం సుధాకర్ అశోక్ సత్యనారాయణ నరేష్ పవన్ రాము తదితరులు పాల్గొన్నారు

గిరిజన మహిళలల సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల.

గిరిజన మహిళలల సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల
ఉత్పత్తులు

రాష్ట్రపతి భవన్ లో స్టాల్స్ ఏర్పాటు

ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఐఏఎస్

నేటి దాత్రి భద్రాచలం

గిరిజన మహిళలు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ద్వారా తయారు చేసే వివిధ రకాల సబ్బులు షాంపూలు, మిల్లెట్ బిస్కెట్లు కరక్కాయ పౌడర్ తేనె, న్యూట్రి మిక్స్ ఉత్పత్తులు గిరిజనులకు సంబంధించిన ప్రొడక్ట్స్ ప్రాచుర్యంలోకి తేవడానికి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
బుధవారం నాడు రాష్ట్రపతి భవన్ లో గిరిజన మహిళల ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసిన సమాచారం అందిన వెంటనే ఆయన మాట్లాడుతూ ఇండియా సాంస్కృతిక వైవిధ్యం సౌత్ ఆఫ్ ఇండియా నేపథ్యంలో భాగంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ మోటా సహకారంతో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఆదివాసి గిరిజన మహిళల వివిధ రకాల ఉత్పత్తులు వాటి వలన కలుగు ప్రయోజనాలు,ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు మరియు ప్రజలకు తెలియజేసి ప్రాచుర్యంలోకి తేవడం కొరకు ఐటీడీఏ భద్రాచలం నుండి మూడు ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించిన సిబ్బందిని వారు తయారు చేస్తున్న ఉత్పత్తులతో పాటు పంపించడం జరిగిందని అన్నారు. ఈనెల ఆరవ తేదీ నుండి 9వ తేదీ వరకు గిరిజన మహిళలు తయారుచేసిన వివిధ రకాల ఉత్పత్తులు అమ్మకాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రోగ్రాంలో మన రాష్ట్రం నుండే కాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రం నుండి వచ్చిన వివిధ రకాల యూనిట్ మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని వారి యొక్క ఉత్పత్తులను అమ్మకాలు జరుపుకుంటున్నారని అన్నారు.
మన ఐటీడీఏ శ్రీ లక్ష్మి గణపతి జాయింట్ లయాబిలిటీ గ్రూప్, భద్రాద్రి శ్రీరామ జె ఎల్ జి గ్రూప్, దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూప్ ఎం ఎస్ ఎం ఈ యూనిట్ మహిళలను పంపడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, రమాదేవి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ విద్యార్థులకు పెన్నులు పంపిణీ.!

ఇంటర్ విద్యార్థులకు పెన్నులు పంపిణీ

మంచిర్యాల,నేటి ధాత్రి:

ఇంటర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు బుధవారం పెన్నులు పంపిణీ చేశారు.మనమంతా శ్రీనివాసులు గ్రూప్ సభ్యులు కలిసి మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ మోడల్ పాఠశాల, ప్రభుత్వ కళాశాల,కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సుమారుగా 150 కు పైగా పెన్నులను అందించారు.చిలుకూరి శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరామ్ బాపూజీ బాసర సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పెన్నులను పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు అందజేశారు.ఈ మేరకు వారు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విద్యార్థులందరూ పరీక్షలు రాసి విజయం సాధించాలని తెలిపారు.సురేష్ ఆత్మారాం బాపూజీ ప్రత్యేక పూజలు నిర్వహించి అందించిన పెన్నులను విద్యార్థులకు స్వయంగా తను అందజేయడం గొప్ప విషయమని అన్నారు.10 సంవత్సరాల నుండి సేవ చేయడం జరుగుతుందని విద్యార్థులకు సుమారుగా మూడు లక్షల పెన్నులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందని రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రాణాలికను సిద్ధం చేశామన్నారు.ఈ కార్యక్రమంలో మనమంతా మంచిర్యాల జిల్లా శ్రీనివాసులమ్ వ్యవస్థాపకుడు గండ్ర శ్రీనివాసరావు,మరియు బోయినపల్లి శ్రీనివాసరావు బొద్దుల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ హాస్పిటల్లో కి వలస పోతున్న.!

*ప్రైవేట్ హాస్పిటల్లో కి వలస పోతున్న, ప్రభుత్వ హాస్పిటల్ రోగులు,

నిద్రిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా అదికారులు*

ఇటువంటి చర్యలు వాళ్ళ జిల్లా ప్రభుత్వ అధికారులకు మరియు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.

నేటి ధాత్రి.భద్రాచలం;

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎముకల మరియు సాధారణ సర్జరీలు చెయ్యము అంటున డాక్టర్ల వైఖరి….
•ఏరియా ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రి బాట పడుతున్న రోగులు,వారికి దరిచూపుతున ప్రభుత్వ హాస్పిటల్ సిబంది…

•అసలు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో రోజురోజుకీ ఏం జరుగుతుంది….?

భద్రాచలం ఏరియా ఆసుపత్రి నందు రోజురోజుకి ప్రతిరోజు ఏదో ఒక సమస్య బయటకు వస్తూనే ఉంది అలాగే బుధవారం రోజున కాలు విరిగి మణుగూరు నుంచి వచ్చిన కుటుంబం ఏరియా ఆసుపత్రిలోని ఎముకల డాక్టర్ వద్ద చికిత్సకి వచ్చినారు. అయితే కాలు భాగం ఏరియా ఆసుపత్రిలో ఎక్స్-రే తీసి దానిని వైద్యుడు యొక్క చరవాణి లో చూశారు. ఈలోపు డాక్టర్ సర్జరీ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉన్నారు. ఇదిలా ఉంటే భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఎప్పటినుంచో పేషంట్ కేర్ వాళ్లు మరియు కాంట్రాక్టు సిబ్బంది బయట ఆసుపత్రుతో కమిషన్లు మాట్లాడుకొని ఆసుపత్రికి వచ్చిన పేషంట్లకు లేనిపోని మాటలు చెప్పి ఏరియా ఆసుపత్రిలో చికిత్స సరిగ్గా లేదని చెప్పి బయట ప్రైవేటు ఆసుపత్రిలో అయితే మెరుగైన చికిత్స చేస్తారని అలాగే సర్జరీ కూడా ఉచితంగా చేస్తారని, మందులకు కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని పేషెంట్ తాలూకు వారికి చెప్పడం వల్ల వారు భయభ్రాంతులకు లోనయ్యి ఏరియా ఆసుపత్రిలో చికిత్స సక్రమంగా లేదు అనే భయంతో ప్రైవేట్ ఆసుపత్రి బాట పడుతున్నారు. కానీ అక్కడ చికిత్స సర్జరీ చేసేది ఏరియా ఆసుపత్రిలో చికిత్స సర్జరీ చేసేది రెండు చోట్ల అదే డాక్టర్ ఉంటారు. అదేవిధంగా ఈరోజు కూడా ఓపి సేవల వద్ద ఉన్న పేషంట్ కేర్ సిబ్బంది ఇక్కడ ఎముకల డాక్టర్ సర్జరీ చేయరని చెప్పి ఆ కుటుంబంను భయభ్రాంతులకు గురిచేసి అదే డాక్టర్ కి ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి పేరు చెప్పి అక్కడకి పంపినారు. ఇక్కడ విషయం ఏమిటంటే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎందుకు ఎముకల సర్జరీ చేయడం లేదు ఎందుకు ఆ సర్జరీ లన్ని ప్రైవేటు ఆసుపత్రిలో బాట పడుతున్నాయి.. డాక్టర్లు వైద్య సిబ్బంది మరియు పేషంట్ కేర్ కాంట్రాక్టు ఉద్యోగులు అందరూ కుమ్మక్కయి కమిషన్ల కోసం డబ్బుల కోసం కక్కుర్తి పడి పేదవారిని ఇలా దోచుకుంటూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది అంతా ఆసుపత్రిలోని అందరికీ అన్ని స్థాయిల అధికారికి తెలిసే జరుగుతుంది మరి దీని మీద ఆసుపత్రి సూపరిండెంట్ గారి సమాధానం ఏమిటో తెలపాలని ఈ కుమ్మక్కులో వారికి ఏమైనా వాటా ఉందా తెలపాలని ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ మరియు ఐటిడిఏ పిఓ వెంటనే స్పందించి సంబంధిత డాక్టర్ని సంబంధిత వైద్య సిబ్బందిని తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం…
జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ ఆర్ సి ఓ ఐ)

జర్నలిస్టులకు ప్రమాద బీమా అందించడం.!

జర్నలిస్టులకు ప్రమాద బీమా అందించడం అభినందనీయం

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా అవసరం అని, టీ.ఎస్.జె.యూ జర్నలిస్టులకు ప్రమాద బీమా అందించడం అభినందనీయమని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జె.యు) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా పత్రాలను అందజేశారు.
రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్,ఎన్ యుజె(ఐ)జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్ ఆధ్వర్యంలో టీఎస్ జెయు జిల్లా కమిటీ సభ్యులు కలసి జర్నలిస్టుల దాడులకు సంబంధించిన కమిటీని పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జర్నలిస్టులకు టీ.ఎస్.జె.యు ఆధ్వర్యంలో రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా ఇవ్వడం సంతోషకరమని అన్నారు.
విధి నిర్వహణలో రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా వార్తా సేకరణలో భాగంగా ఎంతో మంది జర్నలిస్టులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు.అలాంటి సమయంలో వీరికి ప్రమాద బీమా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
టీఎస్ జె యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వ కల్పించే సంక్షేమ పథకాల్లో జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో పని చేసే విధంగా చొరవ తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్,జిల్లా ఉపాధ్యక్షులు,గట్టు రవీందర్,సంయుక్త కార్యదర్శులు పల్నాటి రాజు,కడపాక రవి,కోశాధికారి గా సంగెమ్ శేఖర్,ఆర్గనైజ్ సెక్రెటరీ మారేపల్లి చంద్రమౌళి,బొల్లపెల్లి.జగన్,ఈసి సభ్యుడు కె.దేవేందర్ మీడియా ఇంచార్జి కార్కూరి సతీష్.. తదితరులు పాల్గొన్నారు

లక్ష్మి నరసింహ స్వామి జాతరకు ఏర్పాట్లు.!

లక్ష్మి నరసింహ స్వామి జాతరకు ఏరుపాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగుతున్న జాతర ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాటు పనులతో పాటు భద్రతా ఏర్పాట్లు, మంచినీటి సదుపాయాలు, పార్కింగ్, పారిశుద్ధ్య మరియు ఇతర ఏర్పాటు పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ట్రాఫిక్ నియంత్రణ, మెడికల్ క్యాంప్‌ల ఏర్పాటు, తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు సౌకర్యాలు వంటి తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వాహనాలు పార్కింగ్ చేసేందుకు పార్కింగ్ స్థలాన్ని గుర్తించి వాహనాలు క్రమబద్దీకరణకు సైనేజి బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

అధికారులు, నిర్వాహకులు కలిసి సమన్వయంతో పనిచేసి భక్తులకు ఉత్తమ సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

అంతకు ముందు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం అధికారులు, అర్చకులు దేవాలయ సంప్రదాయం ప్రకారం జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనం అందచేశారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎఎస్పీ బోనాల కిషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా మధుసూదన్,
ఆర్ డబ్ల్యూ ఎస్ ఈ ఈ నిర్మల, విద్యుత్ డీఈ పాపిరెడ్డి, ఆలయ ఈవో మహేష్ ఆలయ కమిటీ చైర్మన్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రాన్ని ప్రారంభించిన పెండెం రామానంద్.

చలివేంద్రాన్ని ప్రారంభించిన పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్దగల ఫ్రెండ్స్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి, ఓర్సు వెంకన్న, బిట్ల మనోహర్, ఫ్రెండ్స్ ట్రావెల్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

సిరిసిల్ల(నేటి ధాత్రి):

జిల్లాలోని పలు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీ డియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా కలెక్టర్ పరిశీలించారు.

ఐటీడీఏ పరిధి లోని స్కూల్స్ వసతి.!

ఐటీడీఏ పరిధి లోని స్కూల్స్ వసతి గృహాల సామాగ్రి సరఫరాకు సీల్డ్ టెండర్లుకు ఆహ్వానం

ఐటీడీఏ పీవో బి . రాహుల్ ఐఏఎస్

నేటి ధాత్రి భద్రాచలం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలకు మరియు వసతి గృహాలకు కావలసిన డ్యూయల్ డెస్క్ బల్లలు, గ్రీన్ బోర్డ్స్ స్టీల్ వంట సామాగ్రి సరఫరా నిమిత్తం సీల్డ్ టెండర్లు కోరుతున్నట్లు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇట్టి టెండర్ నందు పాన్ కార్డు, టిన్ కార్డు నంబర్లు, బ్యాంక్ ఖాతా మరియు అన్ని అర్హతలు కలిగిన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన వారు పాల్గొనవచ్చునని ఆయన అన్నారు.
కావున ఆసక్తిగల టెండర్ దారులు ఉపసంచాలకులు (గి.సం.) శాఖ ఐటీడీఏ భద్రాచలం వారి కార్యాలయం నుండి తేదీ 06-03-25 నుండి 10-03-25, మధ్యాహ్నం ఒంటిగంట వరకు టెండర్ షెడ్యూల్స్ పొందవచ్చునని, టెండర్ షెడ్యూల్ ధర రూ.3000/-ఉప సంచాలకులు (గి. సం.) శాఖ ఐటీడీఏ భద్రాచలం గారి పేరున ఎస్బిఐ భద్రాచలం నందు చెల్లుబాటు అయ్యే విధంగా డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించి పొందవచ్చునని, ధరావత్ సొమ్ము రూ.3,00,000/-డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో టెండర్ షెడ్యూల్ తో పాటుగా టెండర్ బాక్స్ నందు సమర్పించాలని ఆయన అన్నారు.
పూర్తి చేసిన టెండర్ షెడ్యూల్ ఆఖరి తేదీ 10-03-25 సాయంత్రం నాలుగు గంటల లోపు ఉపసంచాలకులు, (గి. సం.) శాఖ, ఐటీడీఏ భద్రాచలం వారి కార్యాలయం టెండర్ బాక్స్ నందు సమర్పించాలని, తేదీ 10-03-25 సాయంత్రం నాలుగు గంటలకు ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ భద్రాచలం సమావేశ మందిరంలో హాజరైన టెండర్లదారుల సమక్షంలో తెరిచి తుది నిర్ణయం తీసుకోబడునని, టెండర్ దారులు శాంపిల్స్ తీసుకొని రావాలని, సెలవు దినములలో కూడా ఆఫీసు తెరిచి ఉంచబడునని, కావలసినవారు దరఖాస్తులను పొందవచ్చునని ఆయన అన్నారు.

డేంజర్ మూల మలుపులు.!

డేంజర్ మూల మలుపులు

• ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా ?

• కుప్పా నగర్ వద్ద పలు ప్రమాదాలు

• ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు, మూగజీవాల మృతి

• సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్ కోసం ప్రయాణికుల డిమాండ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం కుప్పా నగర్ సమీపంలో ఏడు ప్రమాదకర రోడ్డు మలుపులు ఉన్నాయి. ఈ రోడ్డు మార్గం మీదుగా ఝ రాసంగం, రాయికోడ్, మునిపల్లి, వట్టిపల్లి, రే గోడు, అల్లాదుర్గ్ మండలాల ప్రజలు ప్రయాణిస్తుం టారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపో కలు సాగుతుంటాయి. మాచ్నూర్ నుంచి ఝరాసంగం వరకు రోడ్డు భవనాల శాఖ రోడ్లపై ఎలాంటి సూచిక బోర్డు గాని, స్పీడ్ బ్రేకర్లు గాని ఏర్పాటు చేయకపోవ డంతో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటు న్నాయి. కుప్పానగర్ శివాజీ విగ్రహం సమీపాన ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ప్రమాదాల్లో మృతి చెందారు. పలు మూగ జీవాలు సైతం మృతి చెందాయి.

Danger

కుప్పా నగర్ శివారులోని జట్టప్ప బావి మూల, మల్లన్న గుట్ట క్రాస్ రోడ్, శివాజీ విగ్రహం, ప్రభుత్వ పాఠశాల, హైమద్ దర్గా, గొల్ల రవి పొలం వద్ద ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ప్రమాదకరమైన మలుపుల వద్ద పలుచోట్ల స్పీడ్ బ్రేకర్ల, సూచిక బోర్డుల కోసం రోడ్ల భవనాల శాఖ అధికారులకు విన్నవించిన పట్టించుకో వడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జహీ రాబాద్ నుంచి కుప్పా నగర్ మీదుగా రోడ్డు మార్గంలో ఎల్లమ్మ దేవాలయం నుంచి పోచమ్మ వాగు వరకు వాహనాలు అతివేగంగా రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కుప్పా నగర్ నుంచి మల్లన్న గట్టు, బర్దిపూర్, ఎల్గోయి వెళ్లే రహదారి మలుపులు ప్రమాదక రంగా ఉన్నాయి. అదేవిధంగా ఝరాసంగం గోలి గట్టు కింద రోడ్డు వంతెన వద్ద ఇరువైపులా రోడ్డు కుంగిపోయి ప్రమాదాలు చోటు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కుప్పా నగర్ గ్రామస్తులు రోడ్డుపై బైఠారించి రాస్తారోక చేస్తామన్నారు.

కంపు కొడుతున్న మురుగు కాలువలు.

కంపు కొడుతున్న మురుగు కాలువలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

దుర్గంధంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ అధికారులు ఝరాసంగం మండల కేంద్రంలోని 8వ వార్డులో మురుగు నీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతుంది. ఈ కాలువలో చెత్తాచెదారం నిండిపోవడంతో మురుగునీరు ప్రవహించే మార్గం లేక కాలువ నుంచి వెదజల్లే దుర్గంధం కారణంగా ఎప్పుడు ఎలాంటి రోగాలు బారిన పడవలసివస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కాలనీలో నివసించే ప్రజల ఇళ్ళ ముందు కాలువలో మురుగునీరు నిల్వఉంటున్నా అధికా రులు పట్టించుకోవడం లేదు. ఈ మురుగు కాలువ పక్కన ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉన్న విద్యార్థులు ఈ మురుగు నీరు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా దోమలు దాడి చేస్తుండడంతో మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల బారిన పడతామేమోనని ఆందోళన చెందుతున్నారు. అధికారు లు మాత్రం ఇలాంటి వాటిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారి నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మురుగునీరు నిల్వ ఉండకుండా వెళ్లే మార్గం దిశగా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు, విద్యార్థులు కోరుతున్నారు.

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి.!

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండల పరిధిలోని గంగ్వార్ గ్రామ శివారులో గల ముల్తాని బాబా దర్గా పక్కన ఉన్న చెరువులో ప్రమాదవశాత్తు ఇద్దరు వ్యక్తులు పడి మృతి చెందడం జరిగిందని జహీరాబాద్ రూరల్ వలయాధికారి జక్కుల హనుమంతు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదవశాత్తు ఓ యువకుడు చెరువులో పడి మునిగిపోతున్న క్రమంలో అయువకుడిని రక్షించబోయి మరో వ్యక్తి బలయ్యా డు. మంగళవారం మూడు గంటల ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఎస్ కే ఫహీమ్ వయస్సు 17 సంవత్సరాలు గల యువకుడు జహీరా బాద్ బీదర్ రోడ్డు పక్కనగల గంగ్వార్ శివారులోని ముల్తాని బాబా దర్గాను దర్శించుకునే క్రమంలో దర్గా సమీపంలో ఉన్న చెరువులో కాళ్లు చేతులు కడుక్కునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మునిగిపోతున్న క్రమంలో అదే మహారాష్ట్ర ప్రాం తానికి చెందిన ప్రాంతానికి చెందిన సంజయ్ కామడే 50 సంవత్సరాల వ్యక్తి ఆ యువకుడుని కాపాడే ప్రయత్నంలో నీటి లోతును అంచనా వేయడంలలో విఫలమై ఇద్దరు నీటిలో మునిగి చనిపోయినట్లు తెలిపారు. ఇద్దరు మృతి చెందగా ఒకరి మృతదేహం లభించింది. మరోమృతదేహం కోసం పోలీసులు గాలి స్తున్నారు. సంఘటన సంభవించడ తెలుసుకుని దర్గా దగ్గర ఉన్న స్థానికులు, మహారాష్ట్ర లాతూర్ పట్టణం, పంచపూర్ కాలనీకి చెందిన పలువురు అక్కడికి చేరుకొని రక్షించే ప్రయత్నంలో ప్రమాదంలో చిక్కి మృత్యువాత పడ్డాడని తెలుసుకొని కుటుంబ సభ్యులు సంబం ధికుల అరుపులతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదం తో నిండిపోయింది. సమాచారం అందుకు న్న జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు హద్నూర్ ఎస్సై రాజశేఖర్ తో కలిసి అక్కడికి చేరుకొని సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి స్థానికుల సహాయంతో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంజయ్ కామిడే మృతదేహాన్ని వెలికి తీశారు. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మృతుల కుటుంబ సభ్యులు
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు హద్నూర్ ఎస్ఐ. చెల్లా రాజశేఖర్
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నట్లు వివరాలు వెల్లడించారు.

ప్రత్యేక పూజలతో అగ్ని గుండం సిద్దం చేసిన పూజారులు.

ప్రత్యేక పూజలతో అగ్ని గుండం సిద్దం చేసిన పూజారులు

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహిరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేటరాచన్న స్వామి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున ఆలయం ఆవరణలో ఇఓ శివరుద్రప్ప నేతృత్వంలో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిప్పు అంటించి అగ్ని గుండం సిద్ధం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, ఆలయసిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

తమిళనాడులో భాషా రాజకీయాల రచ్చ

-జాతీయ విద్యావిధానం`2020ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు

-ద్విభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నది కేవలం ఈ రాష్ట్రం మాత్రమే

-ఎన్‌ఈపీా2020 వల్ల డ్రాపౌట్లు పెరుగుతాయి: స్టాలిన్‌

-హిందీని రుద్దే ఉద్దేశం లేదు: కేంద్రం

-త్రిభాషా సూత్రాన్ని సమర్థిస్తున్న భాజపా

-మిగిలిన అన్నిపార్టీలు ద్విభాషా విధానానికే మద్దతు

-విద్యను కూడా రాజకీయం చేసిన తమిళనాడు నేతలు

-కాలానికి అనుగుణంగా మారని నేతలు

-ముదిరిపోయిన ఓటుబ్యాంకు రాజకీయాలు

-మార్పు కోరుకోకపోతే ప్రజలకే నష్టం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న తరుణంలో తమిళనాడులో వరుస వివాదాలతో రాజకీయ పార్టీలు ప్రజల్లో ఏదోవిధంగా తమ పలుకుబడిని పెంచుకోవాలని ప్రయత్నిస్తుండటం తాజా పరిణామం. ఫిబ్రవరి మొదటివారంలో తిరుపురన్‌ కుండ్రం ఆలయ వివాదం రాష్ట్రాన్ని కుదిపేస్తే తాజాగా జాతీయ విద్యావిధానం`2020 కేంద్ర, రాష్ట్రాల మధ్య రగడను రాజేసింది. ప్రస్తుతం రెండు ప్రభుత్వాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ విధానం కింద త్రిభాషా సూత్రాన్ని అంగీకరించబోమని తమిళనాడు తెగేసి చెబుతోంది. హిందీని బలవంతంగా రుద్దడానికే కేంద్రం కుయుక్తులు పన్నుతోందని ఆరోపిస్తోంది. అయితే కేంద్రం అటువంటిదేమీ లేదని కొట్టిపారేస్తోంది. నిజానికి తమిళనాడు ప్రజల్లో భాషాదురభిమానాన్ని హిందీ వ్యతిరేకతను ప్రజల్లో బాగా రెచ్చగొట్టింది ప్రముఖ రచయిత మరైమలై అడిగళ్‌ మరియు ద్రవిడవాద సిద్ధాంత కర్త పెరియార్‌. తమిళుల్లో హిందీ వ్యతిరేకతకు ప్రధాన కారణం, హిందీలో సంస్కృత పదాలు ఎక్కువగా వుండటం. తమిళులు సంస్కృతాన్ని ప్రాచీన భాషగా అంగీకరించరు. తమిళం మాత్రమే అతి ప్రాచీన భాషగా వారు పేర్కొంటారు. ఆర్యభాష అయిన హిందీని ద్రావిడులైన తమిళులపై రుద్దడం ద్వా రా ఆర్యులు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని, ఇందుకు ఒప్పుకోబోమన్నది వారి వాదన. కానీ ఇక్కడ ఒక్క నిజాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైతే తమిళనాడులో ఇప్పుడు హిందీని వ్యతిరేకిస్తు న్నారో వారి పిల్లలు చదివేది త్రిభాషా సూత్రాన్ని పాటించే పాఠశాలల్లోనే! కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకోసం హిందీని వ్యతిరేకిస్తే, రాష్ట్రంలోని ఎస్సీలు/ఎస్టీలు తీవ్రంగా నష్టపోతారు. ఎం దుకంటే స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 80ఏళ్ల కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి.హిందీ నేర్చుకుంటేనే దేశంలోని ఏప్రాంతంలోనైనా మనుగడ సాగించడానికి వీలవుతుంది. ఉద్యోగావకాశాలు దేశవ్యాప్తంగా విస్తరించిన నేపథ్యంలో, ఇంగ్లీషుతో పాటు హిందీభాష వచ్చినవారు మాత్రమే మంచి ఉద్యోగాలు సాధించగలరు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. తమిళనాడులోని ద్రవిడ పార్టీ నాయకులకు ఇది తెలియంది కాదు. అందుకనే వారి పిల్లల్ని సీబీఎస్‌ఈ స్కూళ్లలో చదివిస్తూ పైకి మాత్రం ఓట్లకోసం తమిళభాషాభిమానాన్ని రెచ్చగొడుతున్నారు. నిజం చెప్పాలంటే తమిళనాడులో కూడా చాలామందికి హిందీ తెలుసు. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు, ద్రవిడ వాదం చట్రాల్లోనే ఈ పార్టీల మనుగడ వుండటం, తమిళనాడు ప్రజల పురోభివృద్ధికి ఆటంకంగా మారిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

తాజా వివాదానికి కారణం

ఫిబ్రవరి 15న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఒక ప్రకటన చేస్తూ, జాతీయ విద్యావిధానం`2020 (ఎన్‌ఈపీ`2020)ని అమలు చేయని తమిళనాడు వంటి రాష్ట్రాలకు సమగ్ర శి క్షా పథకం కింద నిధుల (రూ.2వేల కోట్లు) మంజూరు సాధ్యంకాదని స్పష్టం చేయడం తాజా వివాదానికి కారణం. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 2020 జాతీయ విద్యావిధానానికి తాను వ్యతిరేకమని తమిళనాడులోని డి.ఎం.కె. ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. 1968 నుంచి రాష్ట్రంలో అమలవుతున్న ద్విభాషా విధానాన్ని`ఇంగ్లీషు, తమిళం` మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తామని కుండబద్దలు కొట్టడంతో మరోసారి రాష్ట్రంలో భాషా రాజకీయాలు వేడెక్కాయి. దేశం మొత్తంమీద ద్విభాషా విధానాన్ని అనుసరించే రాష్ట్రం కేవలం తమిళనాడు మాత్రమే. మిగిలిన అన్ని రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నాయి. నిజానికి తమిళనాడు రాజకీయ పార్టీలు 1930 నుంచి త్రి భాషా సూత్రాన్ని తిరస్కరిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడులోని డి.ఎం.కె. ప్రభుత్వం భాషా విధానంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాన్నే మరోసారి నొక్కి చెప్పింది. దీంతో కేంద్రం, తమిళనాడు మధ్య విద్యావిధానం విషయంలో మరోసారి వివాదం చెలరేగింది. డిఎంకే ప్రభుత్వం కేంద్రంపై విరుచు కుపడటంలో రెండిరటి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ కేవలం నిధులకోసం త్రిభాషా సూత్రాన్ని అమలు చేయబోమని, కేంద్రం ఒత్తిళ్లకు తలగ్గేది లేదంటూ తెగేసి చెప్పారు. ఆయన ఇంకా ముందు కెళ్లి తమిళనాడు రాష్ట్రం కేంద్రానికి పన్నులు చెల్లించకపోతే ఏమవుతుందో ఒక్కసారి గుర్తుంచుకోండంటూ ఘాటుగా హెచ్చరించారు కూడా! కేంద్రం రూ.10వేల కోట్ల నిధులు తమిళనాడుకు ఇస్తామని చెప్పినా తాము త్రిభాషాసూత్రం అమలు చేయబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రం ఎన్‌ఈపీ`2020ను అమల్లోకి తేవడం ద్వారా విద్యార్థులను చదువులకు దూరం చేస్తుందని పేర్కొన్నారు. మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఇప్పుడు అమలు చేస్తున్న నీట్‌ విధానం వల్ల ఎంతోమంది విద్యార్థులకు సీట్లు దొరకక విద్యకు దూరమవుతున్నారని, ఎన్‌ఈపీని అమల్లోకి తెస్తే ఆర్ట్స్‌మరియు సైన్స్‌ కోర్లుకు కూడా ఎంట్రెన్స్‌ పరీక్షలు పెడతారని అప్పుడు మరింత మంది విద్యార్థులు తప్పనిసరిగా విద్యకు దూరంకావాల్సి వస్తుందని పేర్కొన్నారు. ‘మేం ఏ భాషకు వ్యతిరేకం కాదు. కాకపోతే హిందీని రుద్దాలనుకుంటే ఒప్పుకోం. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులను ఇది స్కూళ్లకు దూరం చేస్తుంది’ అని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఈ విధానం కిందమూడు, ఐదు, ఎనిమిది తరగతుల స్థాయిల్లో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల్లో ప్రవేశానికి ఎంట్రెన్స్‌లు ప్రవేశపెడతారు. దీనివల్ల ఎంతోమంది ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు చదువు అందుబాటులో లేకుండా పోతుందన్నారు.
ప్రస్తుతం తమిళనాడులో ఒక్క భారతీయ జనతాపార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు ద్విభాషా సూ త్రానికే మద్దతునిస్తున్నాయి. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులతో పోటీపడాలంటే తమిళనాడు ప్రభుత్వ పాఠశాల్లో కూడా హిందీ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర బీజేపీ వాదిస్తోంది. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించడం దారుణమైన తప్పిదమని కూడా పార్టీ భావిస్తోంది. ము ఖ్యంగా ఈవిధానంలో హిందీని తప్పనిసరిగా బోధించాలన్న అంశం ఎక్కడాలేదన్న సంగతిని గుర్తు చేస్తోంది.

మొట్టమొదటి హిందీ వ్యతిరేక ఉద్యమం

తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మొట్టమొదటిసారి 1937లో ప్రారంభమై 1940 వర కు కొనసాగింది. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి చక్రవర్తి రాజగోపాలాచారి, హిందీ మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేయడం ఈ ఉద్యమానికి ప్రధాన కారణం. అప్ప ట్లో ప్రముఖ రచయిత మరైమలై అడిగళ్‌, ద్రవిడవాద సిద్ధాంత కర్త పెరియార్‌లు ఈ హిందీ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ ఆందోళన సందర్భంగా 1271మంది నిరసన కారులను అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ ప్రభుత్వం అరెస్ట్‌ చేసి జైళ్లల్లో పెట్టింది. నాటి ప్రెసిడెన్సీ గవర్నర్‌ లార్డ్‌ ఎర్‌స్కైన్‌ ఈ ఆదేశాలను ఉపసంహరించుకున్న తర్వాత మాత్రమే ఆందోళన కారు లు తమ ఉద్యమాన్ని విరమించారు. స్వాతంత్య్రానంతరం 1948 కేబినెట్‌ మంత్రి ఒమండూర్‌ రామస్వామి రెడ్డి హిందీభాషను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేయడం రాష్ట్రంలో రెండోసారి హిందీ వ్యతిరేక ఉద్యమానికి దారితీసింది. ఆ తర్వాత 1963లో కేంద్రం తీసుకొచ్చిన అధికారిక భాషా చట్టం నేపథ్యంలో మళ్లీ రాష్ట్రంలో హిందీ వ్యతిరేక ఆందోళన చెలరేగి 1964`65 మధ్య కాలంలో ఉధృతంగా కొనసాగింది. ఈ ఉద్యమం ఎంతటి తీవ్రస్థాయికి చేరుకుందంటే దాదాపు అరడజను మంది ఆందోళనకారులు తమను తాము సజీవదహనం చేసుకోవడమే కాదు, నిరసన లు హింసాత్మకంగా మారడంతో ఇద్దరు పోలీసులతో సహా 60మంది మరణించారు. తర్వాత కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగొచ్చి, చట్టంలో మార్పులు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో పరిస్థితులు సాధారణస్థితికి చేరుకున్నాయి.

త్రిభాషా సూత్రం

1968లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన త్రిభాషా విధానం (హిందీ, ఇంగ్లీషు మరియు ఏదైనా ప్రాంతీయ భాష) దేశంలోని అన్ని రాష్ట్రాలు మూడుభాషలను అమలు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఒక్క తమిళనాడు మాత్రం కేవలం ద్విభాషా విధానానే అమలు చేయడానికి నిర్ణయించింది. అప్పటి మొట్టమొదటి కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రి అన్నాదురై మాట్లాడుతూ తమిళులు ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడానికి ఇంగ్లీషు భాష సరిపోతుంది. హిందీ అవసరం లేదని స్పష్టం చేయడం గమనార్హం. ఈమేరకు ఆయన 1968 జనవరి 23న రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దీనిపై మూడురోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. చివరకు త్రిభాషా సూత్రాన్ని అసెంబ్లీ తిరస్కరిస్తూ తీర్మానం చేసింది. అప్పటినుంచి రాష్ట్రంలో ద్విభాషా సూత్రాన్నే అమలు చేస్తున్నారు. అయితే తమిళనాడులోని సి.బి.ఎస్‌.సి. స్కూళ్లలో మాత్రం హిందీని కూడా బోధించడం కొనసాగుతూ వస్తోంది.

ఎన్‌ఈపీా2020

2020లో కేంద్రంలోని ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చింది. తమ పూర్వ ప్రభుత్వాల మార్గాన్నే అప్పటి ఏ.ఐ.డి.ఎం.కె. ప్రభుత్వం అనుసరిస్తూ, తమకు త్రిభాషా సూత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ విద్యావిధానంలో కేంద్రం మూ డు భాషల్లో ఒకటి ఏదైనా ప్రాంతీయ భాష కూడా వుండాలని స్పష్టం చేసినా, ఏ.ఐ.డి.ఎం.కె. ప్రభుత్వం మాత్రం ఏదోవిధంగా హిందీని రుద్దడానికి మాత్రమే కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకితెచ్చిందని విమర్శించింది. జాతీయ స్థాయిలో ఏకీకృత జాతీయ విద్యావిధానం ఉమ్మడి జాబితా లో ఉండటం కూడా తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకించడానికి మరో కారణం. ముఖ్యంగా ఈ విద్యావిధానంలో నాలుగు సంవత్సరాల అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లను కేంద్రం ప్రతిపాదించింది. ఒక విద్యార్థి మధ్యలో బయటకు రావడానికి ఇందులో బహుళ ఐచ్ఛిక మార్గాలున్నాయి. ఇవి డ్రాపౌట్లకు దారితీస్తాయని భావించడం కూడా తమిళనాడు ప్రభుత్వం ఈ నూతన జాతీయ విధానాన్ని వ్యతిరేకించడానికి మరో కారణం. ముఖ్యంగా ఈ విధానంఅట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు ఎంతమాత్రం అనుకూలం కాదని కూడా తమిళనాడు ప్రభుత్వం విస్పష్ట అభిప్రాయం. త్రిభాషా సూత్రంపై తాజా వివాదం నేపథ్యంలో ఫిబ్రవరి 23న తమిళభాష వీరాభిమానులు రైల్వే స్టేషన్లకు వెళ్లి అక్కడి బోర్డులపై ఉన్న హిందీ భాషపై నల్లటి రంగును పూయడం ‘వెర్రికి వేయి తలలన్న’ సత్యాన్ని మరోసారి నిజం చేసింది.

హిందీ ఉమ్మడి భాష

విశ్వహిందూ పరిషత్‌ ప్రస్తుత వివాదంపై అన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమిళం భారతీ య భాషల్లో ఒకటి. అయితే హిందీభాష దేశవ్యాప్తంగా ప్రజలమధ్య సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. దేశం ఉమ్మడిగా పురోగతిలో ముందుకు సాగుతున్నప్పుడు, ‘ప్రత్యేకత’ పేరుతో తమిళనాడును ప్రధాన స్రవంతినుంచి వేరుచేయవద్దని కోరింది. ప్రస్తుతం ఎన్‌ఈపీ`2020పై కేంద్రం, తమిళనాడుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఈవిధంగా స్పందించింది. డీఎంకే ప్రభుత్వం సంస్కృత భాషను గుడ్డిగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఓటుబ్యాంకు రాజకీయాలు మాత్రమేనని వీహెచ్‌పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్‌ విమర్శించారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ మాట్లాడుతూ ఎన్‌ఈపీ`2020 కేవలం త్రిభాషా సూత్రాన్ని మాత్రమే ప్రతిపాదించింది. ఇందులో హిందీని త ప్పనిసరి అని ఎక్కడా పేర్కొనలేదన్న సత్యాన్ని గుర్తించాలి. ఈ అంశాన్ని దాచిపెట్టి డీఎంకే రాజకీ య లబ్దికోసం తప్పుడు ప్రచారం మానుకోవాలని కూడా ఆయన కోరారు.

ముందు నుయ్యి..వెనుక గొయ్యి తవ్వుకున్నారు!

-పార్టీ మారి కాంగ్రెస్‌ లో ఇమడలేకపోతున్నారు

-సముద్రంలో కలిసి ప్రయాణం చేయలేకపోతున్నారు

 

-మేమొస్తాం…తలుపులు తీస్తారా? అని వేడుకుంటున్నారు

-క్షమించి మమ్మల్ని రమ్మంటారా?

-వెళ్ళి తప్పు చేశాం…క్షమించలేరా!

-రమ్మంటే పరుగెత్తుకొస్తాం

-మేమక్కడ నెగలలేకపోతున్నాం…

-కాంగ్రెస్‌ నేతలతో కలవలేకపోతున్నాం

-ఎంత చొచ్చుకొని వెళ్లినా ఆదరించడం లేదు

-ఎమ్మెల్యే అనే అభిమానం కనిపించడం లేదు

-మమ్మల్ని అక్కున చేర్చుకోవడం లేదు

-ప్రజల ముందు చులకనయ్యాం

-ఇప్పటి దాక వున్న అనుచరులకు లోకువౌతున్నాం

-కాంగ్రెస్‌ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేకపోతున్నాం

-పార్టీ మారిన ఎమ్మెల్యేలు పడరాని పాట్లు పడుతున్నారు

-ముందు నుయ్యి, వెనుక గొయ్యి తొవ్వుకున్నారు

-ఎమ్మెల్యేలను ఆదరించకపోవడంలో కాంగ్రెస్‌ నాయకుల తప్పేం లేదు

-పదేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులను వేధించింది వీళ్లే

-పదేళ్లు పడరాని పాట్లు పడి కాంగ్రెస్‌ కోసం పనిచేశారు

-అనేక కేసులు ఎదుర్కొన్నారు

-నిర్భంధాలు చూశారు…పోలీసు దెబ్బలు తిన్నారు

-పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెత్తనం లేక కాంగ్రెస్‌ నాయకులు సలసల కాగుతున్నారు

-పార్టీ మారిన ఎమ్మెల్యే లకు సలాం కొట్టలేకపోతున్నారు

-కాంగ్రెస్‌ నాయకులు పాత బకాయిలు తీర్చుకునే సమయంలో వచ్చి చేయందుకున్నారు

-ఇది కాంగ్రెస్‌ నేతలకు సుతారం ఇష్టం లేదు

-అప్పుడు అదే ఎమ్మెల్యే పెత్తనం.. ఇప్పుడు అదే ఆధిపత్యం

-కాంగ్రెస్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు

-ఎమ్మెల్యేలైనా సరే లెక్క చేయడం లేదు

-ఓడిపోయిన కాంగ్రెస్‌ నాయకుల వెంటనే కార్యకర్తలుంటున్నారు

-పార్టీ మారిన ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి పౌరులైపోయారు

-కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కుబిక్కుమంటున్నారు

-రాజకీయంగా భవిష్యత్తు అంధకారం చేసుకున్నని మధనపడుతున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తొందర పాటు గ్రహపాటైంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి చేజేతులా తవ్వుకున్నట్లైంది. అత్యాశ దురాశగా, పేరాశా మిగిలిపోయింది. సముద్రం లాంటి కాంగ్రెస్‌లో అందరూ కలవలేరు. ఒక్కసారి ఆ పార్టీలో కలిస్తే మాత్రం పార్టీని వదులుకోలేరు. అందువల్ల మొదటి నుంచి కాంగ్రెస్‌లోవున్న వారికి ఆ పార్టీ ఎంతో గొప్పది. కాంగ్రెస్‌ పార్టీలో వున్నంత అంతర్గత ప్రజాస్వామ్యమం మరే పార్టీలో వుండదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో అసలే వుండదు. కాని తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేకు అక్కడా దక్కలేదు. ఇక్కడా విలువలేకుండాపోయింది. కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పుకున్నా, కాంగ్రెస్‌ నాయకులమని చెప్పుకోలేకపోతున్నారు. అటు బిఆర్‌ఎస్‌ పార్టీని తిట్టలేకపోతున్నారు. అటు కాకుండా, ఇటు కాకుండా పోయి, రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకున్నారు. ఇప్పుడు మధనపడినా వచ్చేది లేదు. ఒరిగేది లేదు. అంతో ఇంత కాంగ్రెస్‌లోనే ఏదైనా ఆదరణ దొరకాలే గాని, తిరిగి ఘర్‌ వాపసీ అంటే మాత్రం అక్కడ ఇసుమంతైనా గౌరవం దక్కకపోవచ్చు. ప్రాదాన్యత పెద్దగా వుండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్దితుల్లో టికెట్‌ దక్కకపోవచ్చు. కాంగ్రెస్‌లో కొనసాగినా అదే జరగొచ్చు. రెంటికీ చెడిన రేవడిగా మారింది ఎమ్మెల్యేల పరిస్దితి. పార్టీ మారేముందు కొంచె ఆలోచిస్తే ఇంత దూరం వచ్చి వుండేది కాదు. కాంగ్రెస్‌పార్టీ పదేళ్ల కాలం పాటు అధికారం కోల్పోయింది. కాంగ్రెస్‌నుంచి బిఆర్‌ఎస్‌లో నాయకులు చేరుతూ వుండడంతో చతికిలపడిపోయింది. ఒక దశలో చితికిపోతుందనుకున్నారు. కాని ఆ పార్టీకి వున్న నాయకులు, కార్యకర్తల మూలంగా, కాంగ్రెస్‌ పార్టీ నిలబడిరది. ఆ పార్టీకి ఇప్పటికీ చెక్కు చెదరని కార్యకర్తలున్నారు. నాయకులు నాడు బిఆర్‌ఎస్‌కు వెళ్లినా అప్పటి ద్వితీయ శ్రేణి నాయకులు ముందు వరసలోకి వచ్చారు. పదేళ్లపాటు కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వచ్చారు. బిఆర్‌ఎస్‌ పాలనలో నానా ఇబ్బందులు పడ్డారు. కేసులు ఎదుర్కొన్నారు. నిర్భందాలను కూడా చూశారు. పోలీసుల దెబ్బలుతిన్నారు. అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. పార్టీ మారాలని పెట్టిన నిర్భంధాలను కూడా లెక్క చేయకుండా పార్టీ కోసం నిలబడ్డారు. అలాంటి నాయకులున్న కాంగ్రెస్‌పార్టీలోకి అవకాశవాద రాజకీయాలను చేయానుకున్నవారు వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ ఇమలేక, కాంగ్రెస్‌లో నెగలేకపోతున్నారు. ఏదో జరుగుతుందని ఆశపడితే ఏదో అయ్యిందన్నట్లు మారింది. కాంగ్రెస్‌లోవిలువ లేదు. గుర్తింపు అసలే లేదు. కార్యకర్తలు అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గౌరవమే ఇవ్వడం లేదు. అసలు ఎమ్మెల్యేలుగా వారిని పార్టీ శ్రేణులే గుర్తించడం లేదు. అటు కాంగ్రెస్‌ పట్టించుకోకపోవడమే కాదు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకోవాల్సిన సమయంలో కాంగ్రెస్‌ నాయకులే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రావొద్దంటున్నారు. దాంతో దిక్కు తోచని పరిస్ధితిలో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ మారితే బిఆర్‌ఎస్‌ నుంచి సమస్యలు ఎదురౌతాయి. బిఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకుంటాయి. అధికారం చేతిలో వుంటుంది. బిఆర్‌ఎస్‌ను అణచివేయొచ్చు. బిఆర్‌ఎస్‌ను తమ తమ నియోజకవర్గాలలో ఖాళీ చేయొచ్చు. కాంగ్రెస్‌ పార్టీ మెప్పు పొందొచ్చు. ఇతర పదవులు, నిధులు తెచ్చుకోవచ్చనుకున్నారు. కాని కాంగ్రెస్‌ పార్టీ నాయకులే రాజకీయం చేస్తారని అనుకోలేదు. కాని కాంగ్రెస్‌ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేక ఏర్పడుతుందని ఊహించలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ కార్యకర్తలను బెదిరించలేరు. వారితో కలిసి సఖ్యతను పొందలేకపోతున్నారు. మేమిక్కడ నెగలలేకపోతున్నామంటూ ఆంతరంగికుల వద్ద బోరు మంటున్నారు. వెళ్లి తప్పు చేశామంటూ మధనపడుతున్నారట. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆదరిస్తారనుకుంటే దూరం కొడుతున్నారు. కాంగ్రెస్‌లో కలిసినా, నాయకులతో కలవలేకపోతున్నామంటున్నారు. తాము ఎంత చొచ్చుకెళ్లినా, కాంగ్రెస్‌ నాయకులను ఎంత భుజ్జగించినా వినడం లేదంటున్నారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురౌతోంది. ఎమ్మెల్యేలమన్న గౌరవం కనీసం కాంగ్రెస్‌ కార్యకర్తలే ఇవ్వడం లేదు. దాంతో బిఆర్‌ఎస్‌ శ్రేణులు చూసి సంబరపడుతున్నారు. తమకు మొత్తం మీద గుర్తింపు లేకుండాపోతోందంటున్నారు. ప్రజల ముందు ఎలాగూ చులకనయ్యాం. కాని కాంగ్రెస్‌ శ్రేణులతోనైనా కలిసిపోదామనుకుంటే ఎమ్మెల్యే వస్తున్నాడని తెలిసినా ఎవరూ వెళ్లడం లేదట. అటు అనుచరులకు కూడా లోకువయ్యే పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేని పరిస్ధితుల్లో ఎలా కొనసాగాలో అర్ధం కాకుండా వుందంటున్నారు. పార్టీ మారి పడరాని పాట్లు పడుతున్నామంటూ బిఆర్‌ఎస్‌ నాయకులకు గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఎదుకంటే పదేళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులును వేదించింది ఈ ఏ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అప్పుడు అధికారం చెలాంయించి ఇబ్బందులకు గురి చేసింది వీళ్లే. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి పెత్తనం చేయాలని చూస్తున్నది వీల్లే. దాంతో కాంగ్రెస్‌ నాయకులకు సుతారం నచ్చడం లేదు. పై నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, ఆదేశాలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది కాంగ్రెస్‌లో ఎప్పుడూ వుండే సంస్కృతే. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను వేధించిన ఎమ్మెల్యేపై రివెంజ్‌ తీర్చుకుందామనుకున్నారు. కాని వాళ్లే ఇప్పుడుకాంగ్రెస్‌లో చేరడంతో వాళ్లంతా విస్తుపోతున్నారు. పాత బకాయిలు తీర్చుకోలేకపోతున్నామని కాంగ్రెస్‌ నాయకులు మధనపడుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నాయకులయ్యారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కు బిక్కు మంటున్నారు. రాజకీయం అందకారం చేసుకున్నామంటూ చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎలాగూ ఇమడలేకపోతున్నాం. కనీసం సొంత గూటికి చేరుకుందామా? అని కొంత మంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. బిఆర్‌ఎస్‌ ఛీప్‌తో కలవాలని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నారట. తప్పయ్యింది. మేమొస్తాం తలుపులు తీస్తారా? అని కేటిఆర్‌, హరీష్‌రావులను వేడుకుంటున్నారట. క్షమించి మమ్మల్ని రమ్మని చెప్పండంటూ సందేశాలు పంపుతున్నారా? కొంత మంది కాంగ్రెస్‌ నాయకులతో గొడవలు పడుతూ తమలో గులాబీ రక్తమే వుందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారట. క్షమించి రమ్మనండి? అని వెడుకుంటున్నారట. రమ్మంటే పరుగెత్తుకొస్తామంటూ నాయకులతో కబురు పంపిస్తున్నారట. ఈ ఎమ్మెల్యేలకు కారులో చోటు వుండదని తెలుసు. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్‌ టికెట్‌ ఇవ్వడని తెలుసు. అయినా కాంగ్రెస్‌లో వుండి చేసేదేమీ లేదు. రోజు తలనొప్పి తప్ప మరేం లేదనుకుంటున్నారట. నిదులొస్తాయని అనుకుంటే మిగతా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పోల్చితే వస్తున్న నిధులేమీ లేవు. అసలైన కాంగ్రెస్‌ నాయకులకు వున్న విలువ, గౌరవం ఎలాగూ దక్కడం లేదు. నిధులు మంజూరు తమ వల్ల కావడం లేదు. కాంగ్రెస్‌ నాయకులు కోరిన నిధులు ఇస్తున్నారు. పాత కాంగ్రెస్‌ నాయకుల చేతనే అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి చేతనే కొబ్బరి కాయలు కొట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలను కనీసం దగ్గరకుకూడా రానివ్వడం లేదు. ఇలాంటి పరిస్ధితి ఒక వైపు వుంటే మరో వైపు సుప్రింకోర్టులో కేసు తీర్పు ఎలా వుంటుందన్న భయం మరో వైపు వెంటాడుతోంది. తాజాగా మార్చి 4న సుప్రింకోర్టు మరిన్ని సీరియస్‌ వ్యాఖ్యలు చేసింది. గడువు కోరిన ప్రభుత్వ తరుపు న్యాయవాదుల పేరుతో ఎమ్మెల్యేల పదవీ గడువు పూర్తయ్యే వరకు కావాలా? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇలాగైతే ప్రజాస్వామ్యం విలువలు పడిపోతాయని సుప్రిం కోర్టు ఘాటుగా హెచ్చరించింది. అంతే కాదు మార్చి 23 వరకు ఏ విషయమైన కోర్టుకు తెలపాలని ప్రభుత్వ తరుపు లాయర్లకు సుప్రింకోర్టు సూచించింది. ఇక మార్చి 23 లోగా స్పీకర్‌ ఏదో ఒక నిర్ణయం ప్రకటించే పరిస్దితి ఎదురైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేయకపోతే సుప్రింకోర్టు వారిపై వేటు వేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అందుకే ఈలోపే బిఆర్‌ఎస్‌ గూటికి తిరిగి వెళ్లడం ఎంతో ఉత్తమమని కొంత మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఒక వేళ వెళ్లినా కనీసం తమను గడప కూడా తొక్కనీయరని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ వేటు పడినా మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తుందా? ఇచ్చినా గెలిచే పరిస్థితి వుందా? అనుకుంటున్నారట. తొందరపడ్డామా..చేజేతులా చెడగొట్టుకున్నామా? అన్నది అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారట.

మందమర్రి హైస్కూల్ లో పిల్లలు సైన్స్ కు సంబంధించ.!

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమర్రి కార్మల్ హైస్కూల్ లో పిల్లలు సైన్స్ కు సంబంధించి రంగులతో ముగ్గులు వేసి అలరించారు.

మందమర్రి నేటి ధాత్రి

Science

ఈ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా తేదీ 4 -3 -2025 రోజున మన కార్మెల్ పాఠశాలలో రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ రంగోలి కార్యక్రమంలో భౌతిక రసాయన శాస్త్రాలు మరియు జీవ శాస్త్రాలు యొక్క పటాలను విద్యార్థులు చాలా చక్కగా డ్రా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి డాక్టర్ ఫాదర్ జె.వి.ఆర్ రెక్స్ జె, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎమ్ కుమారస్వామి, జీవశాస్త్ర ఉపాధ్యాయిని ఐ సునీత మేడం ఇతర సైన్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పిఈటి కృష్ణ గారు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని ఈ రంగోలి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన.

ఝరాసంగం: ఆయిల్ పామ్తో అధిక ఆదాయం

ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన

జహీరాబాద్. నేటి ధాత్రి:

మహిళా రైతు చంద్రమ్మ 5 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటను సాగు చేశారు. కేవలం 15 నెలల్లోనే మొక్కలు పుష్పించాయి. మంచి వృద్ధిని చూపుతున్నాయి. తోటల అభివృద్ధి శాఖ రాయితీపై మొక్కలను అందించగా, ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఎకరానికి నాలుగు సంవత్సరాలపాటు రూ.4,200 మంజూరు చేస్తోంది. పంటకు గిట్టుబాటు ధర రూ. 20,871 ప్రకటించడంతో ఈ పంట రైతులకు లాభదాయకంగా మారుతోంది.

ప్రభుత్వాలు మారిన పంపిణీకి నోచుకోని కుట్టు మిషన్లు.

ప్రభుత్వాలు మారిన పంపిణీకి నోచుకోని కుట్టు మిషన్లు.

పంపిణీ చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.

ఏ వై ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటి ధాత్రి :

గత ప్రభుత్వం హయాంలో అర్హులైన మహిళలకు కుట్టు
మిషన్లు పంపిణీ చేయకుండా రైతు వేదికలో ఉంచిన 60 కుట్టు మిషన్లు తుప్పు పట్టి పాడవుతున్నాయని వేంటనే తహాశీల్దార్ హేమ మహిళా దినోత్సవం రోజున అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ* చేయాలి.
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య* అన్నారు.
మంగళవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు వేదికలో ఉంచిన కుట్టు మిషన్లు పరిశీలించి అర్హులైన మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని తహాశీల్దార్ కార్యాలయంలో ఎంపీఎస్వో కి వినతి పత్రం అందజేయడం జరిగింది.
అనంతరం మల్లయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన మహిళలకు మండలంలో ఉన్న గ్రామాలల నుండి కొంతమందికి శిక్షణ ఇచ్చి కుట్టు మిషను ఇచ్చి వారి కుటుంబం అభివృద్ధి చెందడం కోసం కుట్టు మిషన్లు తెప్పించి రైతు వేదికలో ఉంచిందని మహిళలకు పంపిణీ చేయకుండా అది రైతు వేదికకే పరిమితం అయ్యిందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అర్హులైన మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తహశీల్దార్ హేమ చొరవ తీసుకుని తక్షణమే అర్హులైన మహిళలకు మహిళా దినోత్సవం రోజున కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల రైతు వేదికలో ఉన్న 60 కుట్టు మిషన్లు తుప్పు పట్టి పోతాయని అన్నారు. మహిళలు వీటి ద్వారా సాధికారత సాధించి అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ కుట్టు మిషన్లు పంపిణీ చేయడం వలన 60 కుటుంబాలను ఆదుకున్న వారిమి అవుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి మ్యాదరి సునీల్ మండల సహాయ కార్యదర్శి కనకం తిరుపతి కార్యవర్గం సభ్యులు పుల్యాల సురేష్ నద్దునూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version