టీజీ ఎఫ్ డీసీ ప్లాంటేషన్.!

టీజీ ఎఫ్ డీసీ ప్లాంటేషన్ లో వన్య ప్రాణుల కోసం నీటి కుంట ఏర్పాటు

మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్

జైపూర్  నేటి ధాత్రి:

 ఎండలు తీవ్రంగా ఉండడం తో ప్లాంటేషన్ లలో,అటవీ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ పేర్కొన్నారు.జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామ సమీపంలో ఉన్న టీజీ ఎఫ్ డీసీ నీలగిరి ప్లాంటేషన్ లో శుక్రవారం నీటి కుంట తవ్వించారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఈ పనులను శుక్రవారం ఉదయం పరిశీలించారు.ఈ సందర్భంగా ప్లాంటేషన్ మేనేజర్ మాట్లాడుతూ ఎండలు తీవ్రమై నీటి కోసం వన్యప్రాణులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నీటి ఊటలు ఉన్న ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వ ఉండే విధంగా తవ్వించి నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.కాన్కూర్, ముదిగుంట అటవీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ వాచర్ టి.శంకర్,సిబ్బంది పాల్గొన్నారు.

పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టాలని నల్ల రిబ్బన్లతో.

పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టాలని నల్ల రిబ్బన్లతో నమాజ్.

మాజీ కోఆప్షన్ సభ్యులు
ఎండి రాజ్ మహమ్మద్.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

ఈనెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పైల పహిలగామ్ లో పాకిస్తాన్ టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు వారి మృతికి సంతాప సూచకంగా శుక్రవారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని మరియు మండలంలో ఉన్నటువంటి మసీదు లలో శుక్రవారం నమాజులో ముస్లిం సోదరులు అందరూ నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలను చేసేవారిని తరిమికొట్టాలని ముఖ్యంగా టెర్రరిస్టులు కాల్పులు జరిపిన సమయంలో కాశ్మీరు వస్త్ర వ్యాపారి నాజా కతలి మరియు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ వీరోచితంగా పోరాడి చాలామంది టూరిస్టుల ప్రాణాలు కాపాడారు కావున ముస్లింలు ఎప్పుడు కూడా భారతదేశానికి స్వాతంత్ర సమరంలో ప్రాణాలర్పించి ముందు వరుసలో ఉన్నారు కావున అందరం కలిసి టెర్రరిస్టుల చర్యను ఖండించాలని చిట్యాల మండలం

మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి రాజ్ మహమ్మద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

హిందూ ధర్మమే మనల్ని రక్షిస్తుంది.!

హిందూ ధర్మమే మనల్ని రక్షిస్తుంది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

వేద పాఠశాల విద్యార్థులు హిందూ ధర్మ రక్షణ కోసం కృషి చేయాలని, అదే మనల్ని రక్షిస్తుందని జహీరాబాద్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కవితా దేవి అన్నారు. ఝరాసంగం మండలం మరిదిపూర్ లోని దత్తగిరి ఆశ్రమంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దత్తగిరి పీఠాధిపతి అవధూత గిరి మహరాజ్ తో కలిసి ఈనెల 29న జరిగే శనీశ్వర జయంతి కరపత్రాలను ఆవిష్కరించారు.

జమ్మూ కాశ్మీర్ పహల్గం లో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ.

జమ్మూ కాశ్మీర్ పహల్గం లో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ

నేటి ధాత్రి కథలాపూర్

 

 

 

 

భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కథలాపూర్ మండల కేంద్రంలో ఉగ్రమూఖల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు అశ్రునివాళి అర్పించి, కొవ్వాత్తుల ర్యాలీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హిందువులరా మేల్కొండి, ఉగ్రవాదం నశించాలి, పాకిస్థాన్ కుక్కలారా ఖబర్దార్ ఖబర్దార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది ముక్యంగా హిదువులను గుర్తించి మరి దాడి చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్యాల మారుతి,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ కథలాపూర్ మహేష్, గడ్డం జీవన్ రెడ్డి,దండిక లింగం,బూమయ్య,సంతారం,రాజేష్,శ్రీకర్,ప్రసాద్,గణేష్,శివ, శ్రీహరి, మల్లేష్,గంగమల్లయ్య, చారి నాయకులు, బీజేపీ కార్యవర్గ సభ్యులు సురబీ నవీన్ పాల్గొన్నారు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

జెరూసలేం తీర్థయాత్రకీ వెళుతున్న మాజీ ఏ.జి.పి.!

జెరూసలేం తీర్థయాత్రకీ వెళుతున్న మాజీ ఏ.జి.పి నాథానేయల్ గారిని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

◆ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి స్వగృహంలో గురువారం రోజున పవిత్ర జెరూసలేం తీర్థయాత్రకీ వెళుతున్న శుభ సందర్భంగా మాజీ ఏ.జి.పి నాథానేయల్ గారిని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి,ఆశ్విన్ పాటిల్,అక్షయ్ జాడే,పెంటారెడ్డి,బి.మల్లీకార్జున్,నర్సింహా యాదవ్,రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న దేశం

మరచిపోలేని విధంగా పాకిస్తాన్‌ను శిక్షించాలి

ముక్త కంఠంతో కోరుతున్న దేశం

భారత్‌తో తక్కువ స్థాయి యుద్ధాన్ని కోరుకుంటున్న అసిం మునీర్‌

అంతర్గత సమస్యలనుంచి బయటపడేందుకే

సైన్యాన్ని చీదరించుకుంటున్న పాక్‌ ప్రజలు

హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రస్తావన భారత్‌ను రెచ్చగొట్టేందుకే

అసిమ్‌ మునీర్‌ ప్రకటన తర్వాతే ఉగ్రదాడి

హిందువులనే టార్గెట్‌ చేస్తూ హత్యలు

విషాదాన్ని మిగిల్చిన సంతోష క్షణాలు

కొత్త జంటల జీవితాలను ఛిద్రంచేసిన ఉగ్రవాదులు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఏప్రిల్‌ 22న దక్షిణ కశ్మీర్‌కు చెందిన పహల్గామ్‌లోని బైసరాన్‌ పచ్చిక మైదానంలో జరిగిన ఉగ్రఘాతుకంలో 27మంది హిందువులు ప్రాణాలు కోల్పోవడంతో దేశం ఆగ్రహావేశాలతో అట్టుడికి పోతున్నది. లష్కరే తోయ్‌బా సీనియర్‌ కమాండర్‌ సైఫుల్లా కసౌరీ ఈ దారుణానికి ప్రణాలిక ర చించినట్టు అనుమానిస్తున్నారు. ఈ సంస్థ అధినేత హఫీజ్‌ సయీద్‌కు ఇతడు అత్యంత సన్నిహి తుడు. ఉగ్ర ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు మరచిపోలేని విధంగా శిక్షించాలన్న అభిప్రాయాలు గట్టిగా వ్యక్తమవు తుండటం సహజమే. గతంలో బాలాకోట్‌ దాడులు, సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసినప్పటికీ పాకిస్తాన్‌ ఎంతమాత్రం తన బుద్ధిని మార్చుకోలేదన్న విషయాన్ని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది. లోతుగా విశ్లేషిస్తే, దివాలా అంచున వుండి, బచ్చపట్టుకొని ప్రపంచదేశాల వద్ద అప్పులకోసం అగచాట్లు పడుతున్న పాకిస్తాన్‌ నిజానికి ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశం లేదు. ఎందుకంటే భారత్‌ ప్రతీకార చర్యను ఎదుర్కొనే సామర్థ్యం దానికి లేదు. ఆవిషయం అక్కడి సైన్యానికి కూడా బాగా తెలుసు! అటువంటప్పుడు ఎందుకని ఇటువంటి దుస్సాహసానికి పాల్పడిరదనేది ఎవరికైనా సహజంగా వచ్చే సందేహం. ఇందుకు జాగ్రత్తగా విశ్లేషిస్తే సమాధానాలు దొరుకుతాయి. ఇటీవల పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ తన ప్రసంగంలో కశ్మీర్‌ తమకుజుగులర్‌ నాడి వంటిదని వెల్లడిరచారు. దీన్ని అరిగిపోయిన రికార్డుగా చాలామంది కొట్టిపారేశారు. నిజానికి ఇక్కడ మునీర్‌ అన్నమాటలను పరిశీలిస్తే, ‘హిందువులు’ మరియు ‘ముస్లిం’ సంప్రదాయాలు భిన్నమని పేర్కొ నడమే కాదు, ద్విజాతి సిద్ధాంతాన్ని మరోసారి సమర్థిస్తూ మాట్లాడా రు. అంటే ఇక్కడ కశ్మీర్‌తో పాటు హిందువులపై విద్వేషాన్ని వెళ్లగక్కిన కొద్దిరోజులకే పహల్గామ్‌లో పర్యాటక ఆనందాన్ని ఆ స్వాదిస్తున్న సామాన్య హిందువులపై ప్రధానంగా పురుషులను టా ర్గెట్‌ చేసి మరీ దారుణంగా ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడం ఇక్కడ కీలకం. పాకిస్తాన్‌ను ఏకతాటి మీదికి తీసుకురావాలంటే అక్కడి రాజకీయ నాయకులు లేదా సైన్యానికి భారత్‌ను తెరమీదికి తీసుకు రావడమే మార్గం. ఇది తప్ప వారికి మరోదారి లేదు. భారత్‌ పట్ల నరనరానా విషాన్ని నింపుకున్న అత్యధికశాతం పాకిస్తానీలకు హిందువులంటే విపరీతమైన ద్వేషం.ఈ బలహీనతను రెచ్చగొట్టడం ద్వారా పాక్‌ రాజకీయ నాయకులు, సైన్యం తమ పబ్బం గడుపుకుంటూ వస్తున్నాయి.

అసలు నిజం తెలుసుకున్న పాక్‌ ప్రజలు

ఇటీవలికాలంలో సోషల్‌ మీడియా పుణ్యమాని రాజకీయ నాయకులు, సైన్యం ఎప్పటికప్పుడు కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడం, భారత్‌పై విద్వేషాన్ని వెళ్లగక్కడం ద్వారా తమను మోసం చేస్తున్నార న్న సంగతి పాక్‌ ప్రజలకు బాగా అర్థమైంది. ముఖ్యంగా ఇటీవల పాక్‌లో బెలూచ్‌ వీరులు ఏకంగా రైలునే హైజాక్‌ చేసి, రెండువందలమంది సైనికులను హతం చేయడం, సైనిక స్థావరాలపై బెలూచ్‌ తిరుగుబాటు దారులు విజయవంతంగా చేస్తున్న దాడులు, బెలూచ్‌ ప్రాంతాలకు సైనికులు వెళ్లలేని పరిస్థితులు, వాయువ్య సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 40శాతం భూభాగం ఆఫ్గనిస్తాన్‌ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిందన్న వార్తలతో పాకిస్తాన్‌ ప్రజలకు అసలు వాస్తవాలు తెలిసిరావ డం మొదలైంది. ముఖ్యంగా అసిమ్‌ మునీర్‌ చేతగానితనాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా నిరసిస్తు న్నారు. ప్రస్తుతం బెలూచిస్తాన్‌, పీఓజేకేల్లో అల్లర్లు, ఏకంగా సైనికులపైనే దాడులు, పంజాబ్‌ ఆధిపత్యంపై సింధ్‌ ప్రజల్లో వ్యక్తమవతున్న ఆందోళన, నిరసన ప్రదర్శనలు ఒకవైపు, మరోవైపు పాకిస్తాన్‌ అంతర్జాతీయంగా ఏకాకి కావడం, ఒకప్పుడు ముస్లిం దేశాల్లో అణ్వస్త్రాలు కలిగిన దే శంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన పాక్‌ సైన్యం డొల్లతనం బయటపడటం వంటి అంశాలు అసీంమునీర్‌కు ఎంతమాత్రం కొరుకుడు పడని అంశాలు. 

ఇటువంటి పరిస్థితుల్లో ‘భారత్‌ బూచి’ మాత్రమే తమను ప్రస్తుత కష్టాలనుంచి గట్టెక్కించే మార్గ మని తలచి ‘హిందూ’, ‘ముస్లిం’ సంప్రదాయాలలోని భిన్నత్వమనే కొత్త అంశాన్ని లేవనెత్తారు. ఇక్కడ కశ్మీర్‌ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తడం వల్ల ప్రయోజనం వుండదన్న ఉద్దేశంతో బహుశా ఆయన దీంతోపాటు, రెండు మతాల సంప్రదాయాలను ముందుకు తెచ్చినట్టుగా భావించాలి. ఇందులో భాగంగానే తమకు అనుకూల ఉగ్రవాద గ్రూపుల ద్వారా కశ్మీర్‌లో ‘హిందువులను’ హతమార్చడం ద్వారా పాక్‌ ప్రజలనుంచి సానుకూలతను పొందే యత్నంగా కూడా దీన్ని పరిగణిం చవచ్చు. ప్రస్తుత భారత ప్రభుత్వం గతానికి భిన్నంగా కఠిన వైఖరి అవలంబిస్తుందన్న సంగతి తెలుసు కనుక అసీమ్‌ మునీర్‌ ఈవిధంగా రెచ్చగొట్టి భారత్‌ను ఏదోవిధంగా కయ్యానికి దిగేవి ధంగా చేయాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తిస్థాయి యుద్ధం కాకపోయినా, కొద్దిస్థా యి సంఘర్షణ జరిగేలా చేసి పాక్‌ ప్రజల్లో తానొక హీరోగా నిలవాలన్న కాంక్ష కూడా అసిమ్‌ మునీర్‌కు వుండవచ్చు. కానీ ఈ దుశ్చర్యవల్ల కలిగే దీర్ఘకాల దుష్ఫలితాలకంటే, తాత్కాలిక ఉప శమనానికే ఆర్మీ చీఫ్‌ ప్రాధాన్యత ఇచ్చారని భావించాలి.

నిజం చెప్పాలంటే 370 అధికరణం రద్దు తర్వాత క్రమంగా ఇస్లామిక్‌ దేశాలు, ఇతర అంతర్జాతీయ సంస్థలు కశ్మీర్‌ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం మానేశాయి. ఫలితంగా అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్‌ అంశాన్ని ఒక అరిగిపోయిన రికార్డు మాదిరిగా ఎన్నిసార్లు వినిపించినా ఆలకించేనాధుడే కరవయ్యాడు. ఆవిధంగా పాక్‌ ఈ విషయంలో ఏకాకిగా మిగిలింది. ఇదే సమయంలో జమ్ము`కశ్మీర్‌లో ఎన్నికలు జరగడం, పర్యాటకరంగం బాగా ఊపందుకోవడం, పాకిస్తాన్‌కు కొ రుకుడు పడటంలేదు. ఇదేసమయంలో అంతర్గతంగా దేశం అల్లకల్లోలంగా మారడం, సైన్యం తన పలుకుబడిని కోల్పోతున్న నేపథ్యంలో, అసిమ్‌ మునీర్‌ ఈసారి కొత్తగా ‘హిందూ’, ‘ముస్లిం’ సంప్రదాయాల పేరుతో కొత్త పల్లవి ఎత్తుకున్నారని భావించాల్సి వుంటుంది. 

భారత్‌ ప్రతీకారం

అమాయక హిందూ పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద చర్యకు ప్రతీకారంగా భారత్‌ పాకిస్తాన్‌పై తక్షణం తీసుకున్న ఐదు చర్యల్లో సింధూనదీ జలాల ఒప్పందం కీలకం. మిగిలిన వాటిల్లో వీసాల రద్దు, దౌత్యవేత్తల కుదింపు వంటివి మామూలుగా జరిగేవే. 1960లో రెండు దేశాల మధ్య జరిగిన ఈ సింధూనదీ జలాల ఒప్పందం ద్వారా అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నె హ్రూ పాకిస్తాన్‌ పట్ల ‘అపరిమిత’ ఉదారంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు కశ్మీర్‌లో ఎన్ని ఉగ్ర సంఘటనలు జరిగినా, పాకిస్తాన్‌తో నాలుగు యుద్ధా లు జరిగినా భారత్‌ ఎప్పుడూ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దుచేయలేదు. సంయమనంతోదాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. నేటికి సహనం చచ్చిపోయిన భారత్‌ ఈ ఒప్పందాన్ని ‘సస్పెండ్‌’ చేసింది. గతంలో ఈ ఒప్పందం కారణంగా కిషన్‌గంగ వంటి ప్రాజెక్టుల్లో ఎప్పటికప్పుడు పూడికను తొలగించి నీటితో నింపడానికి వీలయ్యేది కాదు. ముఖ్యంగా దిగువ ప్రాంతంలోని పాక్‌ రైతుల ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని, నీటి విడుదల కొనసాగేది. ఇప్పుడు ఈ ఒప్పందం రద్దు తో ఈ అడ్డంకి తొలగింది. అంతకుముందు మాదిరిగా సింధూ, జీలం, చీనాబ్‌ నదుల వరదల కు సంబంధించి పాకిస్తాన్‌తో సమాచారాన్ని పంచుకునేది. ఇప్పుడు ఇది నిలిచిపోయింది. పాకి స్తాన్‌ ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్న కారణంగా ముందుకు సాగని కిషన్‌గంగ, బాగ్లిహార్‌, రాటిల్‌వంటి ప్రాజెక్టుల పనులు మరింత ఊపందుకుంటాయి. ఒప్పందం కారణంగా ముఖ్యంగా జీలం,చీనాబ్‌ నదీ ప్రాజెక్టుల్లో ఒక పరిమితికి మించి నీటి నిల్వ సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడా సమస్యతీరిపోయింది. అయితే ఒప్పందాన్ని ‘సస్పెండ్‌’ చేయడం వల్ల ఒప్పందాన్ని పూర్తిగా రద్దుచేసినట్టుకాదు. కాకపోతే ఈ చర్య వల్ల పాకిస్తాన్‌పై మనదేశం ఒత్తిడి తీవ్రతను బాగా పెంచగలుగుతుంది. జమ్ము`కశ్మీర్‌ పశ్చిమ ప్రాంతంలో నత్తనడకన నడుస్తున్న అనేక ప్రాజెక్టులను మరింత వేగంగా భారత్‌ పూర్తిచేయగలుగుతుంది. అయితే ఇవన్నీ జరగడానికి చాలా సమయం పట్టవచ్చు. మొత్తంమీద చెప్పాలంటే అసిం మునీర్‌, తాత్కాలిక ప్రయోజనం కోసం చేపట్టిన రెచ్చగొట్టే చర్య ఇప్పుడు పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రాంతం మొత్తం నీటి ఎద్దడితో ఎండిపోయే పరిస్థితికి దారితీ సింది. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడంటే ఇదే మరి!

పీఓజేకేలో కొనసాగుతున్న ‘ఉగ్ర’ క్యాంపులు

నిఘావర్గాల సమాచారం ప్రకారం 150`200 మంది సుశిక్షితులైన ఉగ్రవాదులు, పాక్‌ సైన్యం సహాయంతో జమ్ము`కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా వున్నారు. నియంత్రణ రేఖకు సమీపంలోని పీఓజేకేలో 42 ఉగ్ర క్యాంపులు చురుగ్గా వున్నట్లు భారత నిఘావర్గాలు అంచనా వేస్తున్నా యి. కశ్మీర్‌లోయలో 70మంది, జమ్ము, రాజోరీ, పూంచ్‌ ప్రాంతాల్లో 60`65మంది ఉగ్రవాదు లు చురుగ్గా వున్నట్టు, వీరిలో 115మంది పాక్‌ జాతీయులన్న అనుమానాలున్నాయి. ఇప్పటికే జమ్మూకు చెందిన ఐదు జిల్లాలు, కశ్మీర్‌లోని బారాముల్లా, బండిపుర, కుప్వారా, కుల్గామ్‌ జిల్లాల్లో పనిచేస్తున్న విదేశీ ఉగ్రవాదుల్లో చాలామందిని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ముఖ్యంగా బారాముల్లా జిల్లాలో నిర్వహించిన 9 ఆపరేషన్లలో 14మంది విదేశీ ఉగ్రవాదులను భద్రతా దళాలుహతమార్చాయి. ఇదిలావుండగా ఏప్రిల్‌ 24 ఉదయం నుంచి ఉధంపూర్‌ జిల్లాలోని బసంత్‌గఢ్‌ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ మొదలైనట్టు వార్తలు వస్తున్నా యి. భారత సైన్యానికి చెందిన రోమియో ఫోర్స్‌, జమ్ము కశ్మీర్‌ పోలీసు దళానికి చెందిన స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఫోర్స్‌లు గత పదిరోజులుగా లాసానా అటవీ ప్రాంతంలో తీవ్రంగా గాలింపు చర్య లు కొనసాగిస్తున్నాయి. ఏప్రిల్‌ 14న ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతాదళాపై కాల్పులు జరపడంతో అప్పటినుంచి ఈ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. దట్టమైన అటవీ ప్రాంతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం ఈ ఆపరేష్లన్లకు ప్రధాన అడ్డంకిగా మారింది.ఇదిలావుండగా పహల్గామ్‌ సంఘటన తర్వాత బారాముల్లా జిల్లాలో ఏప్రిల్‌ 23న మనదేశంలోకిప్రవేశిస్తున్న ఉగ్రవాదుల్లో ఇద్దరిని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ప్రస్తుతం పహల్గామ్‌ ప్రాంతంలో శ్మశాన ప్రశాంతి కనిపిస్తోంది. బాధితులకు సంఫీుభావంగా ఈ ప్రాంతంలోని వ్యాపారులు, పౌరసంఘాలు ఒకరోజు బంద్‌ పాటించాయి. బారాముల్లా, పూంచ్‌, శ్రీనగర్‌ మరియు ఖాడ్‌ గ్రామంలో ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. 

 ఉగ్రవాదులకు ఆత్యాధునిక పరికరాలు

దేశంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులు గతంలో మాదిరిగా కాకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానా న్ని వాడుతుండటం గమనార్హం. నలుగురైదుగురు ఒక గ్రూపుగా ఏర్పడి అంచెలంచెలుగా మనదేశంలోకి ప్రవేశించడం ఒక వ్యూహం. వీరు స్థానిక జనాభాతో చాలా కాలం కలివిడిగా వుండటంతో భద్రతా దళాలకు వీరిని కనిపెట్టడం కష్టంగా మారింది. ఆధునిక రైఫిల్స్‌, నైట్‌ విజన్‌ గాగుల్స్‌, అత్యాధునిక టెలికాం పరికరాలు వీరు వాడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాక్‌ సై న్యం వద్ద మాత్రమే వుండే ఇటువంటి చైనా తయారీ పరికరాలను ఉగ్రవాదులకు అందజేస్తుండ టం తాజా పరిణామం. 

రైల్వేల ముందుజాగ్రత్త చర్యలు

పహల్గామ్‌ సంఘటన తర్వాత భారతీయ రైల్వే అధికార్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇటీవల ప్రారంభించిన ఉధంపూర్‌ాశ్రీనగర్‌ాబారాముల్లా మధ్య 272 కిలోమీటర్ల రైల్వే మార్గంపై భ ద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో రెండు సెగ్మెంట్లుగా రైళ్లు నడుస్తున్నాయి. మొదటిది సంగల్డన్‌ నుంచి బారాముల్లా (184కి.మి) ఒక సెక్షన్‌ కాగా, ఉధం పూర్‌ాకాట్రా (25కి.మి.) మరో సెక్షన్‌. ఈ రెండు లైన్లను అనుసంధానించడం ద్వారా రైళ్లను నడుపుతున్నారు. కాట్రాసంగల్డన్‌ మధ్య 63 కిలోమీటర్ల రైలు మార్గానికి ప్రారంభోత్సవం జరగా ల్సివుంది. ఏప్రిల్‌19న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఈ రైలు మార్గాన్ని కూడా ప్రధాని నరేం ద్రమోదీ ప్రారంభించాల్సి వుంది. వాతావరణం బాగాలేకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడిరది. కాట్రాబనీహాల్‌ సెక్షన్‌లోని 111 కిలోమీటర్ల ప్రాంతం అత్యంత కీలకమైంది. ప్రపంచంలో ఎత్తయిన చీనాబ్‌ వంతెన, దేశంలోనే అత్యంత పొడవైన (12.7 కి.మి.) సొరంగం ఈ సెక్షన్‌ లోనే వున్నాయి. 

ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరిక

పహల్గామ్‌ సంఘటనకు కారకులైనవారు, అందుకు కుట్రలు పన్నివారిని అంచనాలకు అతీతం గా శిక్షించి తీరతామని ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్‌ 24న బిహార్‌లోని మధుబనిలో జరిగిన ఒకసమావేశంలో హెచ్చరించారు. మానవత్వ సమర్థకులు మాతోనే వున్నారు, దేశం యావత్తూ ఒక్క తాటిపై నిలిచింది. శిక్ష పడకుండా ఉగ్రవాదులు తప్పించుకోలేరు. 140కోట్ల మంది ప్రజల ఆత్మ విశ్వాసమే ఉగ్రవాద వెన్నెముకను విరిచేస్తుందని అన్నారు. ప్రధాని హెచ్చరికతో ప్రభుత్వం మరో కఠినచర్యకు ఉపక్రమించనున్నదనేది స్పష్టమైంది.

కేసీఆర్‌ అంటేనే ప్రభంజనం.. బీఆర్‌ఎస్‌ అంటేనే తెలంగాణ ఆత్మ గౌరవం

 

కేసీఆర్‌ సభ అంటేనే ప్రజలు పట్టే బ్రహ్మరథం!

-బీఆర్‌ఎస్‌ రజతోత్సవం… తెలంగాణ ప్రజల వేడుక వైభవం!

-బీఆర్‌ఎస్‌ రజతోత్సవం.. తెలంగాణ అంతటా పండగ వాతావరణం

ప్రతి ఒక్కరూ మా ఇంటి పండుగ అని వరంగల్‌ బయలుదేరుతున్నారంటున్న బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో రజతోత్సవ సభ ఏర్పాట్లు, నిర్వహణపై ముచ్చటించిన విశేషాలు.

`బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ విజయవంతం చేసేందుకు ప్రజలు కదులుతున్నారు

`కేసీఆర్‌ ను చూడాలని తెలంగాణ సమాజం ఎదురుచూస్తోంది

`కేసీఆర్‌ చెప్పే మాటలు వినాలని ప్రపంచం మొత్తం చూస్తోంది

`బీఆర్‌ఎస్‌ ను తెలంగాణ సమాజం మొత్తం ఆశీర్వదిస్తోంది

`తెలంగాణ కోసం కేసీఆర్‌ పడిన శ్రమకు నిదర్శనం రాష్ట్ర ఆవిర్భావం

`నిన్నటితరం గోసలు..నేటి తరం ఆశలు తీర్చిన పుణ్య పాలకుడు కేసీఆర్‌

`గుప్తుల కాలం పుస్తకాలలో చదువుకున్నాం

`ఆ స్వర్ణ యుగం కేసీఆర్‌ పాలనలో కళ్లారా చూశాం

`అరవై ఏళ్ల గోసను పదేళ్లలో తీర్చిన కేసీఆర్‌ అందించిన సంక్షేమం అందుకున్నాం

`కుటిల రాజకీయ కాంగ్రెస్‌ మోసం ఏడాదిగా అనుభవిస్తున్నాం

`ప్రజల మేలు కోరలేని కాంగ్రెస్‌ వల్ల నష్టపోతున్నాం

`తెలంగాణను తెర్లు చేస్తున్న కాంగ్రెస్‌ మీద మర్లపడదాం

`మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవం నిలుపుకుందాం

`కేసీఆర్‌ పాలన మళ్ల తెచ్చుకొని సుభిక్షమైన తెలంగాణ చూద్దాం

`కేసీఆర్‌ పాలనలో మళ్ల ప్రతి రోజు పండగ రైతుల కళ్లలో చూద్దాం

`బీఆర్‌ఎస్‌ రజతోత్సవానికి దండుగా కదులుదాం

`కేసీఆర్‌ నాయకత్వానికి మనమందరం సంఫీుభావం తెలుపుదాం

`మరోసారి తెలంగాణ ప్రగతికి పునరంకితమౌదాం

`జై కేసీఆర్‌, జై జై కేసీఆర్‌ అని జేజేలు పలుకుదాం

`రండి..కదలి రండి..లక్షలాదిగా వచ్చి వరంగల్‌ సభను విజయవంతం చేద్దాం

`మనమంతా తెలంగాణ కోసం కేసిఆర్‌ వెనకే వున్నామని నిరూపిద్దాం

`కాంగ్రెస్‌ గుండెల్లో నిద్రపోదాం..

`ఇక కాంగ్రెస్‌ కు నిద్రలేని రాత్రులు చూపిద్దాం

`బీఆర్‌ఎస్‌ బలమేమిటో రజతోత్సవ సభతో నిరూపిద్దాం

`ప్రజలారా…తరలిరండి…జై తెలంగాణ అని జై కొట్టండి

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ అంటేనే ప్రజలకు కష్టాలు. కాంగ్రెస్‌ వస్తేనే ప్రజలు కన్నీళ్లు. కాంగ్రెస్‌ వచ్చిందంటేనే తెలంగాణకు కరవు. కాంగ్రెస్‌ అంటేనే తెలంగాణ తెర్లు. ఇది మరోసారి రుజువైంది. తెలంగాణ మళ్లోసారి తెర్లవుతోంది. పది సంవత్సరాలు కేసిఆర్‌ పాలనలో పచ్చగా వున్న తెలంగాణ మళ్లీ ఎండుతోంది. పండుటాకులా రాలిపోతోంది. రైతులు గోస పడుతున్నారు. సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమం ఆగిపోయింది. అభివృద్ది కుంటుపడిపోయింది. ప్రగతి ఆనవాలు లేకుండాపోయింది. మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న సమస్యలు చుట్టుముట్టాయి. పాలన చేతగాని, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన లేని కాంగ్రెస్‌ వల్ల తెలంగాణ ఎడారిగా ఏడాదిలోనే మారిపోయింది. సరిగ్గా ఏడాదిన్నర క్రితం వరకు తెలంగాణలో ఎటు చూసినా నీళ్లు. పచ్చనిపొలాలు. పాడిపంటలు సమృద్ది. రైతుల సంతోషాలు. కనిపించేవి. కాని కాంగ్రెస్‌ ప్రజలను మోసి అధికారంలోకి వచ్చిన మళ్లీ ప్రజలకు నీళ్లివ్వాల్సిన సమయంలో కన్నీళ్లు పెట్టుకునేలాచేస్తోంది. ప్రజలను ఆగమాగం చేస్తోంది. అందుకే తెలంగాణ ప్రజలు మా నాయకుడు కేసిఆర్‌ కావాలి. మా కేసిఆర్‌ మళ్లా రావాలి. మా కేసిఆర్‌ పాలన మేం చూడాలని కోరుకుంటున్నారు. ఏమరపాటుతో చేసిన చిన్న అలక్ష్యం..నిర్లక్ష్యం రూపంలో వేదించుకుతింటోంది. జనాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పీడిరచుకుతింటోంది. అందుకే ప్రజలంతా రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్‌ఎస్‌ నూరు స్ధానాలన గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా వున్నారు. ఎందుకంటే కేసిఆర్‌ అంటేనే ఓ ప్రభంజనం. ఓ మలయమారుతం. ఆయన పాలనా కాలమంతా ప్రజలు చల్లగా వున్నారు. తెలంగాణ సుభిక్షంగా వుంది. కష్టాలు, కన్నీళ్లు దరి చేరకుండా కేసిఆర్‌ ప్రజలను కళ్లలో పెట్టుకొని చూసుకున్నాడు. తెలంగాణకు పదేళ్ల కాలంలోనే వందేళ్ల సంక్షేమాభివృద్ది అందించారు. ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకున్నాడు. తెలంగాణను పదేళ్లలో ఊహించనంత గొప్పగా తీర్చిదిద్దారు. అలా కళకళలాడుతున్న తెలంగాణపై కాంగ్రెస్‌ నాయకులు నిప్పులు పోసుకున్నారు. ఇలాగే కేసిఆర్‌ పాలన సాగితే మరో వందేళ్లయినా గెలవడం కష్టమనుకొని, లేనిపోని అబద్దాలు ప్రచారం చేశారు. మోసపు హమీలతో అదికారంలోకి వచ్చారు. ప్రజలను నిలువునా ముంచుతున్నారు. ఈ బాధలు భరించలేక ప్రజలు కేసిఆర్‌ ఓదార్పు కోసం చూస్తున్నారు. కేసిఆర్‌ ఇచ్చే ధైర్యం కోసం చూస్తున్నారు. కేసిఆర్‌ చెప్పే నాలుగుమాటలు వేదమంత్రాలుగా పనిచేస్తాయి. భవిష్యత్తు మీద భరోసా కల్గుతుందన్ననమ్మకంతో ప్రజలు వరంగల్‌ సభకు తండోప తండాలుగా వచ్చేందుకు కదులుతున్నారు. చీమల దండు భయలుదేరినట్లు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది అటు ఆదిలాబాద్‌ నుంచి మొదలు, ఇటు ఖమ్మం, నల్లగొండ, మహాబూబ్‌ నగర్‌లనుంచి బండెనుకు బండి కట్టుకొని బయలుదేరారు. కేసిఆర్‌ సభ అంటేనే ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పడానికి ఎడ్ల బండ్ల మీద భయలుదేరిన రైతులే సాక్ష్యం. బిఆర్‌ఎస్‌ పార్టీ పుట్టి 25 వసంతాలు పూర్తవుతున్నాయి. ఈ ఇవరై ఐదుసంవత్సరాలలో పద్నాలుగు సంవత్సరాలు తెలంగణ ఉద్యమాన్ని భుజనా మోసింది. తెలంగాణ తెచ్చేదాకా, కేంద్రం ఇచ్చేదాకా కొట్లాడిరది. తెగించి పోరాటం చేసి, తెలంగాణ సాదించింది. తెలంగాణ కోసం ఉద్యమ రాజకీయ పోరాటంతో తెలంగాణ సాధించిన కేసిఆర్‌ పాలన పదేళ్లు సాగింది. మొత్తంగా ఇప్పుడు బిఆర్‌ఎస్‌ పార్టీ తన రజతోత్సవ వేడుకను వరంగల్‌ వేదికగా జరుపుకుంటోంది. బిఆర్‌ఎస్‌ రజతోత్సవం అంటేనే తెలంగాణ ప్రజలవేడుక వైభోగంగా కళ్లనిండా కనిపిస్తోంది. బిఆర్‌ఎస్‌ రజతోత్సవ వేళ తెలంగాణ అంతటా పండుగ వాతావరణం, బిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల కోలాహలమే కనువిందు చేస్తోంది. ప్రతి పల్లె, పట్నం అన్న తేడా లేకుండా, ఉద్యమ కాలంలో సభలకు వచ్చినట్లే ఇంటికొకరు వచ్చేందుకు సిద్దమౌతున్నారు. లక్షల్లో వరంగల్‌ వైపు అడుగులేస్తున్నారంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ , నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న ఆవిర్భావ సభ ముచ్చట్లు ఆయన మాటల్లోనే…

చాల కాలం తర్వాత కేసిఆర్‌ను కళ్లారా చూసుకోవాలని తెలంగాణ ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఉద్యమకాలంలో కూడా కేసిఆర్‌ చెప్పే మాటల కోసం తెలంగాణ ప్రజలే కాదు, ఆంద్రాకు చెందిన వాళ్లు, ప్రపంచమంతా ఎదురుచూసేది. తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత కూడా ఆయన మాటలు వినేందుకు ప్రపంచమంతాఎదురుచూస్తోంది. కేసిఆర్‌ అనే నాయకుడు కారణజన్ముడు. అందుకే కొన్ని కోట్ల మంది ప్రజలకు ఆరాధ్యుడయ్యారు. తెలంగాణ ప్రజల చేత కొలువబడుతున్నారు. తెలంగాణ సాధన అంటే ఆషామాషీగా జరిగిన వ్యవహారం కాదు. తెలంగాణ ఎవరో ఇచ్చిందికాదు. పద్నాలుగేళ్లపాటు, కేసిఆర్‌ అలుపెరగని పోరాటం చేయడం వల్ల వచ్చింది. తెలంగాణ సమాజమంతా కేసిఆర్‌తో నడవడం వల్ల వచ్చింది. నాలాంటి కొన్ని లక్షల మంది కార్యకర్తలు కేసిఆర్‌తో కలిసి కొట్లాడితే వచ్చింది. పద్నాలుగేళ్ల నిరంతర పోరాటం వల్ల తెలంగాణ వచ్చింది. తెలంగాణ కోసం కేసిఆర్‌ పడని కష్టం అంతా ఇంతాకాదు. ఎదుర్కొన్న సమస్యలు కూడా చిన్నవి కాదు. ఎన్నో బెదిరింపులు, ఎన్నో అదిరింపులు…ఎన్నో వేధింపుల మధ్య అదరకబెదరక కేసిఆర్‌ తెచ్చిందే తెలంగాణ. అందుకే కేసిఆర్‌ యుగపురుషుడయ్యారు. తెలంగాణ కోసమే పుట్టిన కారణజన్ముడని ప్రజలు కొనియాడుతున్నారు. తెచ్చిన తెలంగాణను పదేళ్లలో అన్ని రంగాలలో అభివృ ద్ది చేశారు. ఎవరూ ఊహించని విజయాలు తెలంగాణకు అందించారు. బంగారు తెలంగాణ ఆవిష్కరించారు. అసలు తెలంగాణ వస్తుందనే ఎవరూ అనుకోలేదు. కాని తెలంగాణ ప్రజల కల నెరవేర్చాలని కేసిఆర్‌ కంకణం కట్టుకొని, ఎత్తిన పడికిలి దించకుండా పద్నాలుగేళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశారు. ఆత్మ త్యాగానికి కూడా సిద్దమయ్యారు. బతికినా, చచ్చినా తెలంగాణ రాష్ట్రంలోనే అని తెగించి కొట్లాడిని ఏకైక నాయకుడు కేసిఆర్‌ అందుకే తెలంగాణ వచ్చింది. ఆయన పాలనలోనే సుబిక్షమైంది. అందరూ చిన్న తనంలో గుప్తుల కాలం స్వర్ణయుగమని చదువుకున్నాం. కాని అది ఎలా వుంటుందో కూడా అప్పుడు అర్ధం తెలియదు. కాని కేసిఆర్‌ పాలనలా వుంటుందని తెలిసింది. గుప్తుల పాలనకు మించిన స్వర్ణయుగాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరి కళ్ల్లలో ఆనందం నింపారు. రైతులను రాజులను చేశారు. రైతు కష్టం తీర్చారు. తెలంగాణ లో సాగు అంటే భయపడి పారిపోయిన రైతులను మళ్లీ సాగులోకి రప్పించారు. వ్యవసాయం దండుగ కాదు..పండగ చేసి చూపించారు. తెలంగాణ భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన వారికి పుట్లకొద్ది పంటలు పండిరచి చూపించిన నాయకుడు , పాలకుడు కేసిఆర్‌. తెలంగాణలో సాగుకు నీరివ్వడం ఎవరి తరం కాదు. అని ఉమ్మడి పాలకులు తేల్చి చెప్పి, తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ సాగుభూములను పడావు పెట్టారు. రైతును బికారిని చేశారు. రైతులును కూలీలుగా మార్చారు. వలవలు పోయేలా పొగ పెట్టారు. తెలంగాణ పల్లెలన్నీంటినీ ఉమ్మడి పాలకులు చిద్రం చేశారు. ప్రజలు చిత్రవధ అనుభవించారు. సరిగ్గా అదే పని మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌ అదే విధానాన్ని అనుసరిస్తోంది. తెలంగాణ ప్రాజెక్టుల్లో నీళ్లులేకుండా చేశారు. తెలంగాణకు కల్పతరువు లాంట కాళేశ్వరాన్ని ఎండబెట్టారు. ఏదో సాకు చెప్పి ఏడాది కాలంగా చుక్క నీరు నిలవకుండా కుట్ర చేశారు. తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం కాంగ్రెస్‌ సర్కారు చేస్తోంది. గెలిపించిన పాపానికి తెలంంగాణ ప్రజలకే చుక్క నీరందరకుండా చేస్తోంది. రైతుల కళ్లలో మళ్లీ నీరు చూస్తున్నారు. పొలాల్లోపారాల్సిన నీరు రైతుల కళ్లలో చూస్తూ పాశవికానందాన్ని కాంగ్రెస్‌ పాలకులు పొందుతున్నారు. తెలంగాణను తెర్లుచేస్తున్న కాంగ్రెస్‌ మీద మర్లవడదాం…మళ్ల మన కేసిఆర్‌ పాలన తెచ్చుకుందాం..సుభిక్షమైన తెలంగాణ మళ్ల మన కళ్లారా చూసుకుందాం..బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు దండుగా తరలిరండి..

ఇంటర్మీడియట్ ఫలితాలలో.!

ఇంటర్మీడియట్ ఫలితాలలో మెరిసిన కక్కిరాలపెల్లి విద్యార్థిని లయశ్రీ
ఇంటర్మీడియట్ ఎం. ఎల్ టి గ్రూపులో స్టేట్ మొదటి ర్యాంక్
ఆరూరి లయశ్రీ రాయపర్తి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని
ఆరూరి లయశ్రీకి గ్రామస్తులు బి. ఆర్. ఎస్ నాయకుల అభినందన

నేటిధాత్రి ఐనవోలు :-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో అయినవోలు మండలం కక్కిరాల పల్లి గ్రామానికి చెందిన ఆరూరి లయశ్రీ ఇంటర్మీడియట్ ఎంఎల్టి గ్రూప్ లో స్టేట్ లో మొదటి ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన ఆరూరి సుమలత ప్రభాకర్ దంపతులకు కుమార్తె లయశ్రీ రాయపర్తి లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతూ ఈ ఘనత సాధించడం విశేషం.ఈ సందర్భంగా కక్కిరాలపెళ్లి గ్రామ బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు లయశ్రీ ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ కంజర్ల రమేష్ మాట్లాడుతూ కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని రాష్ట్రంలోని అత్యుత్తమ ర్యాంకు సాధించడం మన గ్రామానికి గర్వకారణం అన్నారు. చదువులోనే కాకుండా లయశ్రీ సాఫ్ట్ బాల్ కాంపిటీషన్లో నేషనల్ లో సిల్వర్ మెడల్ సాధించడం కూడా విశేషం. ఇలాంటి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లయశ్రీ గ్రామంలోని యువత కే కాకుండా మండలంలోని యువత కూడా ఆదర్శంగా నిలిచిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ బొల్లం ప్రకాష్ మాజీ వార్డు సభ్యులు మంద రజిత కాటబోయిన కుమార్ స్వామి టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నాయకులు యాదగిరి ఏలియా నిమ్మాని వెంకటేశ్వరరావు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్ట్ ల.!

వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్ట్ ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకై జర్నలిస్టులు చేపట్టిన నిరహార దీక్షకి,

“నేటిధాత్రి”

దినపత్రిక ఎండీ కట్ట రాఘవేంద్రరావు,

డైరెక్టర్ కట్టా శివ సుబ్రమణ్యం లు హాజరై సంఘీభావం తెలిపారు..

భూభారతి చట్టంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం.!

భూభారతి చట్టంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం

రైతుల భూములకు రక్షణ కవచంలా భూభారతి
* మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రైతులకు విశ్వాసం కల్పించే విధంగా, వారి భూములకు రక్షణ కవచంలా ఉండేలా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మొగుళ్ళపల్లి, మండలంలోఏర్పాటు చేసిన భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇతర అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు, అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూ భారతిని తీసుకు వచ్చిందన్నారు. అంతకుముందు భూ భారతి చట్టం యొక్క అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణి వల్ల పట్టా జారీలో ఏదేని పొరపాటు జరిగితే అప్పీలు చేయడానికి ఆవకాశం లేదని, రైతులు సివిల్ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేదని దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని చెప్పిన ప్రకారం సీనియర్ అధికారులతో అన్ని రాష్ట్రాల్లో విచారణ చేసి సులువైన పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు.

 

MLA

భూములు కొన్నా, అమ్మినా లైసెన్స్డ్ సర్వే యర్ ద్వారా హద్దులతో మ్యాపు తయారు చేసి పట్టాదారు పాసుపుస్తకాల్లో నమోదు చేస్తారని తద్వారా భూమి గుర్తింపుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. తహసీల్దార్ ద్వారా ఏదేని పొరపాటు జరిగితే ఆర్డిఓ, ఆర్డిఓ నుండి కలెక్టర్, కలెక్టర్ నుండి భూ ట్రిబ్యునల్ నకు వెళ్ళడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఉచిత న్యాయ సహాయ సేవలు అందించడానికి అవకాశం కల్పించారని అన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన రికార్డుల నవీకరణలను చేయడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ఆధార్ ఎలా ఉందో అలానే భూములకు భూదార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. గ్రామ పహణి కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ధరణి వచ్చిన తరువాత పహణిలో నమోదులు జరగలేదని తెలిపారు. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి, గత 12 ఏండ్లుగా అనుభవంలో ఉంటూ 12-10-2020 నుండి 10-11-2020 మధ్య కాలంలో క్రమబద్దీకరణ కోసం సన్న చిన్నకారు రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డిఓ విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ప్రకారం భూ హక్కులు జారీ చేస్తారని అన్నారు.

అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం.!

గ్రామ పంచాయితీల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం = ఎంపీడీవో ఇందిరమ్మ.

ఆర్ సి పురం లో ఘనంగా జాతీయ. పంచాయతీరాజ్ దినోత్సవం

పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించిన నేతలు.

రామచంద్రపురం(
నేటి ధాత్రి) ఏప్రిల్ 24:

 

 

దేశానికి పట్టుకొమ్మలైన గ్రామ పంచాయతీల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీడీవో ఇందిరమ్మ అన్నారు, గురువారం మండలంలోని చుట్టుగుంట రామాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కె సుబ్రహ్మణ్యం రెడ్డి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి పి చంద్రశేఖర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభింపజేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. సర్పంచ్ కే సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీల సర్వతోముఖాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరి సహకారం అందించాలని కోరారు. టిడిపి సీనియర్ నాయకుడు‌ కొట్టే నరసింహారెడ్డి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అభివృద్ధి కుంటి బడిందన్నారు.. కూటమి ప్రభుత్వ హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్ లో
జమ చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ లు గ్రామీణాభివృద్ధి కోసం సీసీ రోడ్లు, మురికినీటి కాలువల నిర్మాణం, తాగునీటి పథకాలు, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. పంచాయతీ కార్యదర్శి పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సి రామాపురం గ్రామపంచాయతీని సమస్యల రహిత పంచాయితీగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.ఇంటి పన్ను,తాగునీటి కనెక్షన్ పన్నులను సకాలంలో చెల్లించి పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ప్రజలను కోరారు. పంచాయతీలోని గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత, ఈ వేస్ట్ సేకరణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను, సిబ్బందిని, స్థానిక టిడిపి నాయకులు కె. గిరిధర్ రెడ్డి, ముద్దు కృష్ణారెడ్డి, ముని రామిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి,రంజిత్ కుమార్ రెడ్డిలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు, వీఆర్ ఓ
ఝాన్సీ,డిజిటల్ అసిస్టెంట్ భరత్ కుమార్ రెడ్డి,బిల్ కలెక్టర్ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు…

భూభారతి రైతులకు మేలు చేస్తుంది.!

‘భూభారతి రైతులకు మేలు చేస్తుంది’

దేవరకద్ర /నేటి ధాత్రి:

ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

మదనాపురం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని వీవర్స్ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, తనదనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర :

అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర :

కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి కి నిరసనగా న్యాయవాదుల ర్యాలీకి మద్దతు.

కేంద్ర ప్రభుత్వం , సైన్యం తీసుకునే ఏ నిర్ణయానికైనా మనం అండగా ఉందాం.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

అఖండ భారతదేశాన్ని విచ్చిన్నం చేయడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో న్యాయవాదులు చేపట్టిన ర్యాలీ కి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి సోదర భావంతో జీవిస్తున్నామని, పాకిస్థాన్ ఉగ్రవాదులు, భారతదేశంలో కులమతాల మధ్యన చిచ్చు పెట్టి దేశంలో అల్లర్లు సృష్టించేందుకు పన్నాగం పన్నారన్నారు. భారత ప్రభుత్వం, దేశ సైనికులు ఏ నిర్ణయం తీసుకున్నా దేశం మొత్తం రాజకీయాలకు అతీతంగా, పార్టీ భావ జాలాలకు అతీతంగా ఏకతాటి మీద ఉండి, అండగా ఉండాల్సిన సమయం అని ఆయన చెప్పారు. ఇప్పుడిప్పుడే కాశ్మీర్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూ కళకళలాడుతూ.. ఉందని, టూరిస్టులు పెరగడంతో కాశ్మీర్ ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, అక్కడ వారి జీవన ప్రమాణాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని, పాఠశాలలు కూడా అభివృద్ధి చేసుకుంటూ కులమతాలకు అతీతంగా వారు సంతోషంగా మంచి జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాక్ ఉగ్రవాదులు పన్నాగం పన్నారని ఆయన అన్నారు. ఈ దేశం నాది, ఈ దేశం మనది అనే భావన మనకందరికి ఉండాలని, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టి.పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్.పి వెంకటేష్, గుండా మనోహర్, వీరబ్రహ్మచారి, రమాకాంత్ గౌడ్, మురళి కృష్ణ, లక్ష్మయ్య, కృష్ణయ్య, అనంతచారి, శ్రీపాదరావు, విక్రం గౌడ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము.

జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము…_

— మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు పత్తి కుమార్

కాప్రా నేటిధాత్రి 24

 

 

జమ్మూ కాశ్మిర్ లోని అనంత నాగ్ జిల్లా పెహల్గామ్ లో నిన్న జరిగిన ఉగ్ర దాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు పత్తి కుమార్ అన్నారు.
జమ్మూ కాశ్మీర్ అందమైన పర్యాటక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరం, ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వo పూర్తి బాధ్యత వహించాలని దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాము..
గాయపడిన కుటుంబాలకు మెరుగైన చికిత్స అందించి వారి కుటుంబాలకు ధైర్యాన్ని చేకూర్చాలి అదేవిధంగా ఉగ్రదాడి బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకొని వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉన్నది దాడికి బాధ్యులైన వారిని వెంటనే పట్టుకొని ఉరిశిక్ష అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సమయంలొ దేశప్రజలు అందరు ఒక్కటై బాధితకుటుంబలకు అండగా నిలబడాలని కోరుతున్నాము.

నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి.

నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి

ఎస్పీ రావుల గిరీదర్

వనపర్తి నేటిదాత్రి :

 

పదోన్నతి పొందిన ఖిలాఘనపూర్ ఏ ఎస్సై ఎం సుధాకర్ ఎస్సైగా. వనపర్తి రూరల్ కానిస్టేబుల్ రాజగౌడ్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన వారు గురువారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావు ల గీరీదర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశరు ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ అదనపు ఎస్పీ.మహేశ్వరరావు
పదోన్నతి పొందిన ఎస్సై పోలీస్ సిబ్బంది ఉన్నారు

చలో వరంగల్ గోడ పత్రిక ఆవిష్కరణ.

చలో వరంగల్ గోడ పత్రిక ఆవిష్కరణ.

వరంగల్ కేసీఆర్ సభను విజయవంతం చేయండి.గీత

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

వరంగల్లో జరిగే మహాసభకు మండల ప్రజలందరూ కదం తొక్కాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిన ఫలాలు రాష్ట్ర అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితుల పై వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడం కొరకు తెలంగాణ జాతిపిత కెసిఆర్ సారధ్యంలో నిర్వహించబడునున్న మహాసభకు తరలిరావాలని, మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, గీతా బాయ్ అన్నారు. ఈరోజు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి చలో వరంగల్ గూడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. అలాగే గూడ పత్రికను పలుచోట్ల గోడలకు అంటించిన అనంతరం, గీతా బాయ్ మండల ప్రజలు పెద్ద సంఖ్యలో సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా విభాగం నాయకురాళ్లు, టిఆర్ఎస్ యువజన విభాగం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో.!

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

జహీరాబాద్: నేటి ధాత్రి:

 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి
కొన్నింటి.నర్సింలు డిమాండ్ చేశారు. గురువారం జహీరాబాద్ ఆర్డీఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో వికలాంగులతో ప్రత్యేకంగా శ్రమ శక్తి సంఘాలు ఏర్పాటు చేసి జాబ్ కార్డ్స్ ఇచ్చి 150 రోజులు పని కల్పించాలని అన్నారు. .రాజీవ్ యువ వికాసం పథకంలో వికలాంగులకు 5 శాతం ఎస్సి ఎస్టీ బీసీ, మైనారిటీ కార్పొరేషన్లలో కేటాయించాలని కోరుతున్నాము.2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నాము అన్నారు.మండలంలో వికలాంగులను కించపరుస్తూ మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జహీరాబాద్ మండల అధ్యక్షుడు ఎం రాజ్ కుమార్
అల్గోల్ మచ్చేందర్ బిస్మిల్లా శోభమ్మ వాజిద్ తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలో వీ ఐ పీ బ్రేక్ దర్శనం.!

తిరుమలలో వీ ఐ పీ బ్రేక్ దర్శనం టీటీడీ బోర్డుమెంబర్ కు కృతజ్ఞతలు

వనపర్తి నేటిదాత్రి :

 

 

వనపర్తి పట్టణానికి చెందిన జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ న్యాయవాది దార వెంకటేష్ శ్రీకృష్ణ ప్రింటర్స్ యజమాని ఎం వెంకటరమణ లగిశెట్టి శ్రీకాంత్ బసవరాజ్ రాకేష్ తిరుమలలో శ్రీవారిని గురువారం ఉదయం దర్శనము చేసుకున్నారు వీ ఐ పీ బ్రేక్ దర్శనం కల్పించినందుకు టీ టీ డీ బోర్డు మెంబర్ తెలుగుదేశం నన్నారి నర్సిరెడ్డికి టీ టీ డీ అధికారులకు వారు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

మా ఊరి కథలలో అచ్చ సుదర్శన్ జీవిత కథ.

మా ఊరి కథలలో అచ్చ సుదర్శన్ జీవిత కథ

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న అచ్చ సుదర్శన్ జీవిత చరిత్ర భవాని సాహితీ వేదిక కరీంనగర్ వారి ఆధ్వర్యంలో గుండ మీది కృష్ణమోహన్ అనే కవి మా ఊరి కథలు(స్ఫూర్తి మంతుల చరిత్రలు) అను పుస్తకాన్ని రాయడం జరిగింది.ఈ పుస్తకాన్ని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది.అట్టి పుస్తకంలో అచ్చ సుదర్శన్ జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని కవి రాయడం జరిగింది.తాను బీదరికం నుంచి నుంచి ఎదిగి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడుగా చేరుకున్న కథను ఇతర ఉపాధ్యాయులకు,యువకులకు స్ఫూర్తిగా ఉందని,చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించాడని కవి గుండ మీది కృష్ణమోహన్ అన్నారు.అందుకే స్ఫూర్తి మంతుల చరిత్ర లో అచ్చ సుదర్శన్ కు స్థానం దక్కిందని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version