పహెల్గమ్ ఉగ్రదాడిని ఖండించండి.

పహెల్గమ్ ఉగ్రదాడిని ఖండించండి

మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

నర్సంపేట నేటిధాత్రి:

 

 

 

 

జమ్మూ కాశ్మీర్ లోని పల్గామ పర్యటక ప్రాంతంలో ఉగ్ర మూకలు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ బిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో మౌనం పాటించారు.

ఘటనను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ వైఫల్యంతో ఈ ఘటన జరిగిందని నిగ్గు వర్గాలు హెచ్చరించిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఉండటంవల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.

దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని మృతి చెందిన కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి అంతమొందిస్తామని బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చెప్పుతూ రాజకీయ లబ్ధికే వాడుకుంటుంది తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదని గతంలో జరిగిన పుల్వామా దాడి నుండి నేటి వరకు దేశంలో అనేక చోట్ల ఇలాంటి మారణ హోమాలు జరగటమే నిదర్శనమని అన్నారు.

దేశ భద్రత కోసం ఉగ్రవాదం అంతం అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్న బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనే యువరాజు, సీనియర్ నాయకులు రామారావు, మాజీ కౌన్సిలర్లు బండి రమేష్, మండల శ్రీనివాస్, శివరాత్రి స్వామి వాసం సాంబయ్య దేవూజు సదానందం, పెండెం వెంకటేశ్వర్లు, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు పుల్లూరి స్వామి, వార్డు అధ్యక్షులు బీరం నాగిరెడ్డి, సంపంగి సాలయ్య, పెరమండ్ల రవి, రావుల సతీష్, రాయరాకుల సారంగం, రచ్చ రఘు, కుంకీసా కుమార్ రుద్రారపు పైడయ్య, గుండెబోయిన కోటి, పోతరాజు బాబు గౌడ సంఘం అధ్యక్షుడు గిరిగాని సాంబయ్య నాయకులు పైసా ప్రవీణ్, తోట సదానందం గోనెల కర్ణాకర్, మద్దెల సాంబయ్య భోలే పాషా రాపోలు రాములు రాపోలు శీను, రాపోలు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

రజోత్సవ సభను విజయ చేయాలి వంతం

రజోత్సవ సభను విజయవంతం చేయాలి ….

జహీరాబాద్  నేతి ధాత్రి:

బిఆర్ఎస్ నిర్వహించే ఓరుగల్లు రజతొత్సవ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ నాయకుడు షేక్ సోహెల్ అన్నారు ఝరాసంగం మండలంలోని ప్రతి గ్రామం నుండి నాయకులు గాని కార్యకర్తలుగాని అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభను తరలి వెళ్లి విజయవంతం చేయాలని అన్నారు బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కోసం యువత మరియు రైతన్నలు ప్రతి ఒకరు గులాబీ సైనికులు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు గారి నేతృతంలో ఝరాసంగం మండలం నుండి పెద్ద ఎత్తున సభకు తరాలి రావాలన్నారు. స్వరాష్ట్రం కోసం పుట్టిన జెండా గులాబీ జెండా మన జెండా మన కెసిఆర్ మన రాష్ట్రం అన్నారు జై తెలంగాణ జై జై తెలంగాణ..

రామకృష్ణాపూర్ కు బస్సు సౌకర్యం కల్పించండి..

రామకృష్ణాపూర్ కు బస్సు సౌకర్యం కల్పించండి..

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

క్యాతనపల్లి రైల్వే గేట్ సమీపంలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మించిన నేపథ్యంలో రవాణా మెరుగుపడిందని, ప్రజల రాకపోకలకు అనువుగా ఉన్న నేపథ్యంలో బస్సు సర్వీసు నడిపించేలా చొరవ తీసుకోవాలని మంచిర్యాల ఆర్టీసీ డిపో అడిషనల్ క్లర్క్ ఎం ఎం రావు, స్టేషన్ మేనేజర్ గోలీ శంకర్ లకు టిపిసిసి జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథరెడ్డి తో కలిసి బస్సు సౌకర్యం కల్పించండి అని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు వినతి పత్రం అందించారు. మంచిర్యాల నుండి రామకృష్ణాపూర్, ఆర్కే వన్ వరకు బస్సు లు నడిపించాలని కోరామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపు రాజం, పలిగిరి కనకరాజు, రాం సాయి, భాస్కర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి.

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి…

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

రామకృష్ణాపూర్, నేటిదాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సీపీఐ పార్టీ క్యాతనపల్లి మున్సిపాలిటీ పట్టణ సమితి ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు.ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు,పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని,ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినదని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ఆరోపించారు.కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, నక్క వెంకటస్వామి, కాదండీ సాంబయ్య, పార్టీ ప్రజా సంఘాల నాయకులు, మామిడి గోపి, ఎగుడ మొండి,సిర్ల ముకుందరేడ్డి, కస్తూరి మల్లారెడ్డి,గంగాదరి మల్లయ్య,బోయపోతుల కొమురయ్య,మోతుకుల రాజు, అన్నం శ్రీనివాస్, మా దాస్ శంకర్,గొడిసెల గురువయ్య, శ్రీకాంత్ ,చిరంజీవి,తదితరులు పాల్గొన్నారు.

కెనరా బ్యాంకు మేనేజర్ సైదులు.

కెనరా బ్యాంకు మేనేజర్ సైదులు బదిలీ కావడంతో సన్మానించిన రుద్రప్ప పటేల్

జహీరాబాద్. నీటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కెనరా బ్యాంకు మేనేజర్ సైదులు ఉద్యోగరీత్యా బదిలీ కావడంతో ముఖ్యఅతిథిగా హాజరయ్యా స్థానిక కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ నాయకులు రుద్రప్ప పటేల్, శాలువా పూలమాలలతో సన్మానించి తమ మండలానికి సేవలందించిన జ్ఞాపకాలుగా మారుతాయని వీడుకోలు పలికారు
ఈ కార్యక్రమంలో ఫిల్డ్ ఆఫీసర్ నిలేశ్ విఠల్ ,సిద్ధార్థ
అభిలాష్ రెడ్డి ,ల్యకత్ ,బసంతి పటేల్ ,సుధాకర్ రెడ్డి, లక్ష్మణ్,భాస్కర్ రెడ్డి, మజార్ అహ్మద్,శివమణి పటేల్, జగదీష్, నారాయణ,నగేష్ తదితరులు పాల్గొన్నారు

రజతోత్సవం.. గులాబీ జయ కేతనం!

`తెలంగాణ జన జాతర…బీఆర్‌ఎస్‌ 25 ఏళ్ల వేడుక

`ఉద్యమ ప్రస్థానంలో ఉరకలెత్తిన తెలంగాణ పార్టీ

`ముక్కోటి తెలంగాణ చేత జై తెలంగాణ అని జై కొట్టించిన పార్టీ

`ప్రజలంతా గుండెల్లో పెట్టుకున్న జెండా గులాబీ జెండా

`తెలంగాణ అంతా గులాబీ మయం

రజతోత్సవ సభకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పరచి, సభ జరగకుండా అడ్డంకులు సృష్టించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన కుట్రలను తిప్పి కొట్టి, బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభ గురించి తరతరాలు చెప్పుకునేలా నిర్వహిస్తామంటున్న ‘‘బీఆర్‌ఎస్‌’’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ‘‘ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు’’, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో జనజాతర గురించి పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే..

`వరంగల్‌ నిండా బీఆర్‌ఎస్‌ జన సందోహం

`ఎటు చూసినా గులాబీ రెపరెపలే

`ఎక్కడ విన్నా గులాబీ పాటలే

`తెలంగాణ అంతటా రజతోత్సవ చర్చలే

`గులాబీ దండు కదులుతోంది…వడి వడిగా వరంగల్‌ చేరుతోంది

`గులాబీ సైనికుల తెలంగాణ కవాతు కోసం కళకళలాడుతోంది

`జనం గుండెలు నిండుగా గులాబీ వనం విరబూస్తోంది

`ఎప్పుడెప్పుడు గులాబీ జాతర అని ఎదురుచూస్తోంది

`లక్షలాది మంది వరంగల్‌ సభకు వస్తున్నారు

`కేసీఆర్‌ అంటేనే తెలంగాణ జీవం

`కేసీఆర్‌ మాటలే తెలంగాణకు వేదం

`ఆవిరైపోతున్న నీళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి

`తెలంగాణను ఎడారిగా మార్చిన కాంగ్రెస్‌ పై నీళ్లే కన్నెర్ర చేస్తున్నాయి

`అడుగంటుతున్న భూ గర్భజలాలు ఆక్రోషిస్తున్నాయి

`ఎడారిగా మారిన బీళ్లు కాంగ్రెస్‌ను నోళ్లు తెరిచి తిడుతున్నాయి

`నమ్మినందుకు తెలంగాణ తల్లికి చుక్క నీరందక వాగులు, వంకలు శాపాలు పెడుతున్నాయి

`మళ్ళీ కేసిఆర్‌ పాలన వస్తే గాని మాగాణ కళకళలాడతాయని గుర్తు చేస్తున్నాయి

`కేసిఆర్‌ పాలనే తెలంగాణకు స్వర్ణయుగం

`మళ్ళీ కేసిఆర్‌ పాలన కోసం ఎదురుచూస్తోంది తెలంగాణ జనం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రామ దండు గురించి రామాయణంలో చదవాం..పెద్దలు చెప్పగా విన్నాం..ఇప్పుడు కేసిఆర్‌ దండు కళ్లారా చూడండి. గులాబీ దండు గురించి రేపటి తరానికి చెప్పండి. భవిష్యత్తులో రామ దండు గురించేకాదు, గులాబీ దండు గురించి కూడా చెప్పుకుంటారు. వరంగల్‌లో జరిగే బిఆర్‌ఎస్‌ వజ్రోత్సవ సభను చూస్తే కాంగ్రెస్‌ పార్టీకి, బిజేపికి ముచ్చెటమటలు పట్టాలి. ఉక్కపోతలు పోయాయి. కంటిమీద కునుకు కూడా లేకుండా చేయాలి. అదే మా లక్ష్యం. అదే బిఆర్‌ఎస్‌ పార్టీ సభతో మా రజతోత్సవం. మళ్లీ తెలంగాణలో గులాబీ జయకేతనం కోసం తొలి అడుగుకు శ్రీకారం. బిఆర్‌ఎస్‌ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భం. బిఆర్‌ఎస్‌ రజతోత్సవం అంటే పార్టీ పండుగ మాత్రమే కాదు. తెలంగాణ జన జాతర. ఉద్యమ కాలంలో ఎలా అయితే ప్రజలు బిఆర్‌ఎస్‌కు సభలకు బ్రహ్మరధం పట్టేవారో..ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల్లో, బిఆర్‌ఎస్‌ అభిమానుల్లో అదే జోష్‌ కనిపిస్తోంది. అదే ఊపుతో తెలంగాణ మొత్తం వరంగల్‌ వైపు కదులుతోంది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగం ఎడ్ల బండ్ల నిండా గులాబీ జెండాలు ఎగరేసుకుంటూ, రెపరెపలాడుతున్న జెండాలతో కొన్ని వేల బండ్లు వరంగల్‌ వైపు జతన్నాధ రధచక్రాలు కదులుతున్నట్లు దూసుకువస్తున్నాయి. తెలంగాణ చైతన్యాన్ని మేలు కొలుపేలా కేసిఆర్‌ రధ చక్రాలుగా రైతులు పరుగులందుకుంటూ వస్తున్నారు. కేసిఆర్‌కు జేజేలు కొట్టుకుంటూ వస్తున్నారు. ఇదీ బిఆర్‌ఎస్‌ అంటే. అదే కేసిఆర్‌ తెలంగాణ ప్రజల్లో చైతన్యమంటే..అదే తెలంగాణ ప్రజలకు కేసిఆర్‌ అందించిన చైతన్యమంటే అంటున్న ఉద్యమ కారుడు, సీనియర్‌ బిఆర్‌ఎస్‌ నాయకుడు, బిఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నేటి దాత్రి ఎటిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పిన రజత్సోవసభ విశేషాలు ఆయన మాటల్లోనే.
..ఉద్యమ కాలంలో ఉరకల్తెని పార్టీ బిఆర్‌ఎస్‌. ఇప్పటికీ బిఆర్‌ఎస్‌ అంటే తెలంగాణలో ప్రజలకు ఒక ఆర్తి. కేసిఆర్‌ అంటేనే ఒక నమ్మకం. ఒక వ ఇశ్వాసం. ప్రజల మేలు కోరే ఏకైక నాయకుడుగా గుర్తింపు వుంది. అయినా తెలంగాణ రాజకీయాల్లో కేసిఆర్‌ను మించిన నాయకుడు లేడు. తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ సాదన కోసం బిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన నాయకుడు కేసిఆర్‌. తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ వస్తుందో..రాదో తెలియని సమయంలో పిడికిలెత్తి జై తెలంగాణ అని గర్జించిన నాయకుడు కేసిఆర్‌. బిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినా జై తెలంగాణ అంటూ ఎవరు వస్తారో..రారో తెలియని అమోమయ పరిసి ్దతుల్లో బిఆర్‌ఎస్‌ జెండా ఎగరేసిన నాయకుడు కేసిఆర్‌. తర్వాత కొన్ని లక్షల మంది కేసిఆర్‌ను తయారు చేసి, మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల చేత జై తెలంగాణ అని నినదింపజేసిన నాయకుడు కేసిఆర్‌. ఎంత కొట్లాడినా తెలంగాణ రాకపోతే విఫలనాయకుడిగా మిగలడం కన్నా, తెలంగాణ తెచ్చిన నాయకుడుగానే చరిత్రలో నిలవాలన్న సంకల్పంతో అడుగులేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. తన చావుతోనైనా తెలంగాణ వస్తుందంటే చావు నోట్లో తలపెట్టేందుకు కూడా ఏ మాత్రం ఆలోచించని గొప్ప నాయకుడు కేసిఆర్‌. కేసిఆర్‌ చచ్చుడో..తెలంగాణ వచ్చుడో అని కఠినమైన నిర్ణయం తీసుకొని ఆమరణ దీక్ష చేపట్టిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ సమాజమంతా వద్దని వారించినా, తెలంగాణ తేకపోతే నా ఉద్యమం వృధా..నేను తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోలేని నాయకుడుగా బతకలేనని నిర్ణయం తీసుకున్న నాయకుడు కేసిఆర్‌. బహుషా ప్రపంచ చరిత్రలోనే కేసిఆర్‌ లాంటి ఉద్యమ కారుడు మరొకరు లేకపోవచ్చు. ఉద్యమాలు చేసిన వాళ్లు ఎందురో వున్నారు. కాని ఫలితం ఆశించకుండా ఉద్యమాలు చేసిన వాళ్లున్నారు. కాని ఫలితమే తెలంగాణ అంతిమ లక్ష్యం కావాలని కొట్లాడిని ఏకైక నాయకుడు కేసిఆర్‌. అందుకే తెలంగాణ సాధించగలిగారు. అంతటి బలమైన సంకల్పాన్ని పూనారు. అంతిమంగా తెలంగాణ సాధించి తెలంగాణ ప్రజల చేతుల్లో పెట్టారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రెపరెపలాడిరచారు. ఇలాంటి నాయకుడు నిన్నటి తెలంగాణ చరిత్రలో ఎవరూ లేరు. భవిష్యతు తెలంగాణకు అవసరం లేదు. ఎందుకంటే బంగారం లాంటి తెలంగాణను తయారు చేసి కేసిఆర్‌ ఎప్పుడో పెట్టారు. తెలంగాణ తేవడమే కాదు, తెచ్చినతెలంగాణను బంగారు తెలంగాణ చేసిన నాయకుడు కూడా కేసిఆర్‌. ఇలా రెండు రకాల విజయాలను తెలంగాణకు అందించిన గొప్ప పాలకుడు కేసిఆర్‌. ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంలోనే కేసిఆర్‌ లాంటి నాయకుడు మరొకరు వుండరు. అందుకే తెలంగాణ అంటేనే కేసిఆర్‌..కేసిఆర్‌ అంటేనే తెలంగాణ..అలా అందమైన, అధ్భుతమైన, పాడి పంటలతో అలరాలుతూ, రైతులు రాజులుగా వర్ధిల్లుతున్న తెలంగాణను ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆగం చేస్తోంది. కేసిఆర్‌ పదేళ్ల పాలనలో రైతులంతా సుఖ సంతోషాలతో వున్నారు. మూడేళ్లలోనే కాళేశ్వరం నిర్మాణం చేసి, తెలంగాణలో ప్రతి మూలన చివరి ఆయ కట్టు వరకు సాగు నీరిచ్చిన అపర భగీరధడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చిన ఆరు నెలల్లోనే మిషన్‌ కాకతీయ తెచ్చి, తెలంగాణలోని చెరువులన్నీటింటికీ పూర్వ వైభవం తెచ్చారు. చెరువులు బాగు చేయించారు. పూర్వం చెరువు ఎలా వుండేదో అలా తీర్చిదిద్దారు. రైతులే స్వయంగా పాలు పంచుకొని, బండ్లల్లో, ట్రాక్టర్లలో చెరువు మట్టి తీసుకెళ్లి, పొలాల్లో చల్లుకున్నారు. నిండిన చెరువు నుంచి ఊటలు మళ్లి, బావులు నిండడంతో సాగును పండుగ చేసుకున్నారు. ఇరవై నాలుగు గంటల కరంటు ఇచ్చి రైతు కష్టం తీర్చాడు. అర్ధరాత్రి, అపరాత్రి ఇచ్చిన కరంటు మూలంగా ఏ ఒక్క రైతు చనిపోకుండా చూసుకున్నారు. ఇరవైనాలుగు గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించడంతో రైతు తన వెసులుబాటును చూసుకొని, అవసరమైన మేరకు పొలానికి నీరు పెట్టుకున్నారు. పదేళ్లు బంగారు పంటలు పండిరచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వస్తూ వస్తూనే రైతుకు కష్టం తెచ్చింది. రైతుల కళ్లలో కన్నీరు నింపింది. కాంగ్రెస్‌ కృత్రిమకరువును తెచ్చి రైతను అరిగోస పెడుతోంది. భూగర్భంలో చుక్క నీరు లేకుండా చేయడంతో ఆవిరైతున్న నీళ్లు రైతుకు అందక కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చిన కాంగ్రెస్‌ ప్రభత్వంపై ఆవిరైతున్న నీళ్లే కన్నెర్ర చేస్తున్నాయి. తెలంగాణలో అడుగుంటున్న భూగర్భజలాలు కాంగ్రెస్‌ పాలకుల మీద ఆక్రోషం వెల్లగక్కుతున్నాయి. ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌..ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ తెలంగాణ ప్రజలను వేడుకుంటే కనికరించి, గెలిపించినందుకు తెలంగాణ తల్లి ఒడిలో చుక్క నీరులేకుండా చేస్తున్నారు. మళ్లీ ఒట్టిపోతున్న వాగులు, వంకలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి శాపాలు పెడుతున్నాయి. ఎడారిగా మారిన పొలాల బీళ్లు నోరు తెరిచి, కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్వాకాన్ని చూసి నోళ్లు తెరిచి తిడుతున్నాయి. అందుకే కళ్లు మండుతున్న రైతు బిఆర్‌ఎస్‌ రజతోత్సవసభలో ప్రభుత్వంపై సభ స్పూర్తి, సాక్షిగా, మళ్లీ కేసిఆర్‌ పాలన కోసం కంకణం కట్టుకున్నామని చెప్పేందుకు తరలివస్తున్నారు. జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ దండు కట్టి వస్తున్నారు. అలా వస్తున్న రైతులను చూస్తే జనం గుండెల నిండా గులాభీ వనం విరబూసినట్లు కనిపిస్తోంది. కనువిందు చేస్తోంది. బిఆర్‌ఎస్‌ శ్రేణులో సంబురం నింపుతోంది. ఎప్పుడెప్పుడు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అని ఎదరుచూసి, అందరూ బయలుదేరుతున్నారు. ఇప్పటికే దూరపు జిల్లాల నుంచి లక్షల మంది రైతులు మూడు రోజుల ముందే భయలుదేరి వస్తున్నారు. మిగతా రైతులు బయలుదేరుతున్నారు. లక్షలాది మంది ప్రజలు వరంగల్‌ నగరానికి చేరుకుంటున్నారు. ఎందుకంటే కేసిఆర్‌ అంటేనే తెలంగాణ జీవం. కేసిఆర్‌ మాటలే తెలంగాణకు వేదం. రజతోత్సవ సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని చూశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ఆ కుట్రలన్నీంటినీ తిప్పి కొట్టి సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. బిఆర్‌ఎస్‌ పార్టీ రజత్సోవం అంటే తరతరాలు గర్వంగా చెప్పుకునేలా నిర్వహిస్తాం.. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్‌ నాయకత్వానా గులాబీజెండాను ఎగరేస్తాం..బిఆర్‌ఎస్‌కు ఎదురులేదు..కేసిఆర్‌ నాయకత్వానికి తిరుగులేదని ఎలుగెత్తి చాటుతాం…కేసిఆర్‌ కీర్తి ప్రపంచం చెప్పుకునేలా నడుచుకుంటాం.

ఏజెన్సీ ప్రాంతంలో1/70 చట్టానికి అనుగుణంగానే.

ఏజెన్సీ ప్రాంతంలో1/70 చట్టానికి అనుగుణంగానే భూభారతిని చట్టాన్ని అమలు చేయాలి

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశం కొత్తగూడ మండల కేంద్రంలో జరిగింది.

ఈ సమావేశంలో కొత్తగూడ మండల నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎంపిక చేయడమైనది.

ఆగబోయిన ప్రశాంత్ అధ్యక్షులు, దనసరి నారాయణ ప్రధాన కార్యదర్శి, కంగల సురేందర్, సుంచ బాలరాజు ఉపాధ్యక్షులు కార్యదర్శిలు మోకాళ్ళ చంద్రబాబు దనసరి రాజేష్ (చిన్న), దనసరి రాజబాబు, చింత రాజు కమిటీ సభ్యులు గా ఎన్నుకోవడం జరిగింది అనంతరం ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులకు ఇప్పటివరకు అడవి హక్కు పత్రాలు ప్రభుత్వం మంజూరు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు.

హక్కు పత్రాలు మంజూరు కానటువంటి వారికి ప్రభుత్వం తక్షణమే అడవి హక్కు పత్రాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు కోరినారు.

హక్కు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ బ్యాంకుల ద్వారా పెట్టుబడులకు రుణాలు తీసుకోలేని పరిస్థితి దాపురించింది దీంతో నిరుపేద ఆదివాసి రైతులు వడ్డీ వ్యాపారస్తులు ఆశ్రయించి వారి దగ్గర విత్తనాలు ఎరువులు అధిక వడ్డీలకు ఇస్తూ రైతుల్ని దోపిడీ చేయడమే కాకుండా వారు పండించిన పంటని అలా సులాలకు కొన్న వడ్డీ వ్యాపారులు వారు లాభపడుతూ నిరుపేద ఆదివాసి రైతుల జీవితాలను అప్పుల ఊబిలోకి నేడుతున్నారు ఏజెన్సీ ప్రాంతంలోని దళారులు కోట్లకు పరిగెడుతున్నారు నిరుపేద ఆదివాసి రైతులు సేట్ల దగ్గర అప్పు కోసం వరుస కడుతున్నారు ఏజెన్సీ ప్రాంతంలో ఇంత జరుగుతున్నా కూడా వ్యవసాయ శాఖ అధికారులు కళ్ళు మూసుకొని దళారులను ప్రోత్సహిస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆదివాసీల భూములు మొత్తం కూడా వడ్డీ వ్యాపారులు సేట్లకి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి దాపురిస్తుందని వారు ఆవేదన చెందినారు.

అతికరేట్లకు విత్తనాలు సప్లై చేస్తున్న సేట్లను అధిక వడ్డీకి డబ్బులు ఇస్తున్న వడ్డీ వ్యాపారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.

ఏజెన్సీ ప్రాంతంలో భూభారతి అవగాహన సదస్సులో గిరిజనేతరుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూముల పైన విచారణ చేపట్టాలని ఆ భూములు 1/70 చట్టం అమల్లో రాకముందు నుండి వారి ఆధ్వర్యంలో ఉన్నాయా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం

ఈ అవగాహన సదస్సులో ఏజెన్సీ ప్రాంతంలోని భూములపై కూడా అవగాహన కల్పించాలని అంతేకాకుండా భూభారతి ముసుగులో 1970 సంవత్సరం తర్వాత ఏజెన్సీ ప్రాంతాలకు వలస వచ్చిన గిరిజనేతరాలకు హక్కులు కల్పిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

 

అదేవిధంగా ఈనెల 27న గంగారం మండలం కమిటీ ఎన్నుకోవడం జరుగుతుందని ఆదివాసి యువకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాటి ప్రవీణ్ మహాబూబాబాద్ డివిజన్ అధ్యక్షులు ఆదివాసి సంక్షేమ పరిషత్ ధనసరి రమేష్ దనసరీ వినోద్ గట్టి కార్తీక్ చింత సాంబయ్య అలెం సారంగపాణి తదితరులు పాల్గొన్నారు…

కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం.!

కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం. రజతోత్సవసభ తో

భారత రాజకీయాల్లో రజితోత్సవ సభ చారిత్రాత్మకం

గండ్ర యువసేన జిల్లా నాయకులు

గడ్డం రాజు.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మండలకేంద్రంలో గండ్ర యువసేన జిల్లా నాయకులు గడ్డం రాజు మొగుళ్ళపల్లిలొ జరిగిన పాత్రికేయుల సమావేశంలొ రజతోత్సవ సన్నాహక సమావేశంను ఉద్దేశించి రాష్ట్రంలో ఉనికిని కోల్పోవడం ఖాయమని అన్నారు. ఆయన మట్కాడుత
ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు సమాయత్తం చేయడం కొరకు పర్యటన చేస్తున్నానాని రజతోత్సవ సభకు ప్రజలు నాయకులు కార్యకర్తలు వస్తున్నారని భారత రాజకీయ చరిత్రలో ఈ సభ చారిత్రాత్మక అవుతుంది అన్నారు.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని గడ్డం రాజు ఆవేదన వ్యక్తంచేశారు ప్రజాసంక్షేమం గాలికి వదిలేసి ప్రజలను గోసా పడుతున్నారని స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు మొగుళ్ళపల్లి మండలం నుంచి అధిక సంఖ్యలో విజయోత్స సభకు పాల్గొనాలని గడ్డం రాజు పిలుపునిచ్చారు.

డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలి.

డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలి:
ఎంటమాలజి :ఏ ఈ వనజ

మల్కాజిగిరి నేటిధాత్రి

 

 

 

మలేరియా దినోత్సవం సందర్భంగా మల్కాజ్ గిరి సర్కిల్ ఎంటమాలజీ విభాగం సర్కిల్ ఏఈ వనజ ఆధ్వర్యంలో సఫిల్ గూడ నుంచి ఆనంద్ బాగ్ చౌరస్తా వరకుర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ..

Surroundings Clean

 

దోమల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలని సూచించారు. అనంతరం ప్రజలకు డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు గురు భూషణ్, నాగేందర్ , షోకత్ , రామచందర్, ఎండి అబ్దుల్ , సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ZPHS కారుకొండ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ZPHS కారుకొండ.

హన్వాడ:- నేటి దాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట్ మండలం కారుకొండ గ్రామంలోని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2014-2015 బ్యాచ్.ఏప్రిల్ 20-2025 న.తమ 10 సంవత్సరాల వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమ తీపి జ్ఞాపకాలను పంచు కున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ ఉపాధ్యాయులని గుర్తుచేసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు.

ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం.

ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం

బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి

పరకాల నేటిధాత్రి

ఊరు వాడా ఉప్పెనలా కదులుదాం ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం అని పరకాల పట్టణ బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి పిలుపునిచ్చారు.27న వరంగల్ ఎల్కతుర్తిలో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబి సైనికులు కదిలి రావాలని కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కనీ విని ఎరుగని రీతిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పరకాలను అభివృద్ధి చేశారని తెలిపారు. అలాంటి అభివృద్ధి ప్రదాత ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ రజతోత్సవ సభను ఈ నెల 27న నిర్వహిస్తున్నారని ఆ సభకు ప్రతి ఒక్కరు వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

ఉగ్రవాదులను తుది ముట్టించాలి.

ఉగ్రవాదులను తుది ముట్టించాలి

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పహల్గామ్ లో జరిగిన దాడి దురదృష్టకరమని అమాయకులైన 26 మందిని బలిగొన్న ఉన్మాదులను తుది ముట్టించాలని సిరిసిల్ల మజీద్ కమిటీ నాయకులు కేంద్ర ప్రభుత్వన్ని కోరారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ నాయకులు మాట్లాడుతూ భారత దేశంలో అన్నదమ్ములల కలిసి మెలిసి ఉన్న హిందూ ముస్లింలలో వైశాల్యాలు సృష్టించి లేనిపోని అపోహలు కల్పించి దేశంలో కునుకు లేకుండా ఉగ్రదాడులు చేస్తున్నారని అన్నారు. పహల్గామ్ లో అమాయకులైన 26 మందిని బలిగొన్నారని అమాయకులైన వారి ప్రాణాలను బలిగొన్న ఉన్మాదులను తుది ముట్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీద్, రఫీ ఉద్దీన్, షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

కరీంనగర్, నేటిధాత్రి:

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినదని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆరోపించారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమ్మ సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, పిట్టల సమ్మయ్య, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బ్రామండ్లపెల్లి యుగేందర్, బోనగిరి మహేందర్, నలువాల సదానందం, సాయవేణి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు తప్పని ఇబ్బం దులు

ప్రజలకు తప్పని ఇబ్బం దులు

కొత్త రోడ్డును సకాలంలో వెయ్యండి

నేటిధాత్రి:

 

కొప్పుల గ్రామం నుండి గంగిరేణిగూడెం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర కంకర పోసి అలాగే వదిలేయ డంతో నడవాలంటే ప్రయాణం ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు.

People have problems.

రాత్రి సమయంలో అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు గుండా ప్రయాణించాలంటే నరకం చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని వెంటనే రోడ్డుపన్నులు పూర్తిచేసే దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

రజతోత్సవసభకు మనమంతా ఒక్కటై కదం.!

రజతోత్సవసభకు మనమంతా ఒక్కటై కదం తొక్కి కదులుదాం

మాజీ ఆలయ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు

పరకాల నేటిధాత్రి

 

 

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈనెల ఏప్రిల్ 27 వరంగల్ లో ఎల్కతుర్తి లో ఏర్పాటు చేసిన రజితోత్సవ సభ కు తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలంతా ఒక్కటై కదం తొక్కుతూ కదిలి రావాలని పరకాల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలంతా భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హాజరై
బి ఆర్ ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని పరకాల శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు కోరారు.ఈ సందర్భంగా గందెవెంకటేశ్వర్లు మాట్లాడుతూ టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలను ఆగమయ్యే రోజులు వచ్చాయని కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారు.ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతాంగం ఆగమైందని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలంతా మేల్కొని కాంగ్రెస్ పాలన నుండి విముక్తి పొందాలంటే బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించుకొని కెసిఆర్ ని ముఖ్యమంత్రి ని చెయ్యాలి. భారత రాష్ట్ర సమితి బి ఆర్ ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పురస్కరించుకున్నందున ఈనెల 27న జరిగే జరగబోయే టిఆర్ఎస్ రజితోత్సవ సభకు పరకాల నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల నుండి గ్రామాల నుండి గులాబీ దండై ప్రజలంతా తరలిరావాలని బి ఆర్ ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈనెల 27న జరిగే బిఆర్ఎస్ సభకు చీమల దండువలే

ఈనెల 27న జరిగే బిఆర్ఎస్ సభకు చీమల దండువలే తరలి వెళ్దాం-భూక్య తిరుపతి నాయక్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామశాఖ అధ్యక్షులు పైడిపాల సతీష్ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి హాజరైన కొత్తపెళ్లి మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్ మాట్లాడుతూ ప్రపంచంలోనే కనీవిని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి పన్నెండు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని ఈసభ చరిత్రలో నిలిచిపోతుందని ఈసభకు చింతకుంట గ్రామం నుండి చీమల దండులా తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యమే కేసీఆర్‌. ఆయన నాయకత్వమే శ్రీరామరక్ష. ఇది ప్రజల్లో ఉన్న భావన. తెలంగాణ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చాలనేది కేసీఆర్‌ సంకల్పం. ఈదిశగా వరంగల్‌ సభా వేదిక నుంచి ప్రజలకు విశ్వాసం కల్పిస్తారు కెసిఆర్. ఇరవై ఐదువ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న గులాబీ జెండా మరో యాభై ఏళ్ల పాటు కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది. వచ్చే రెండు, మూడు దశాబ్దాల పాటు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయి. మన గళం, బలం, దళం, గులాబీ దండు. ఈదండులో చింతకుంట గ్రామం నుండి చీమల దండులా కదలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో యువజన విభాగం మండల అధ్యక్షులు గుర్రాల జయప్రకాశ్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, మైనార్టీ విభాగo అధ్యక్షులు సయ్యద్ చాంద్ పాషా, బిఆర్ఎస్ నాయకులు కర్ణకంటి స్వప్న, గుబిరె సుజాత, వరలక్ష్మి, బిఆర్ఎస్ నాయకులు చిట్టిపల్లి నరేందర్, బెజ్జంకి సంపత్, భానతూ శ్రీకాంత్, మహేష్ గౌడ్, కమల్ గౌడ్, మణిదీప్, మల్లేశం, రవి, భాస్కర్ నాయక్, అమృత్, శంకర్, శశిధర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

రైతులు పండించిన ప్రతి చివరి గింజల వరకు.!

రైతులు పండించిన ప్రతి చివరి గింజల వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కానీ జిల్లాలో కానీ ఆరుగాసాల కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు చేస్తుందని దయచేసి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం మే మాసంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని గత ప్రభుత్వ పాలకులు ఏం చేశారు ప్రజలందరికీ తెలుసునని ఇప్పుడు కూడా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తద్వారా కొద్దిగా గన్నిసంచులు లారీల కొరత ఉన్నది వాస్తవమే అని రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి సెంటర్ ద్వారా విక్రయించాలని అలాగే రైతులకు బ్యాంకు అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని విషయం పై అధికారులదృష్టికి వచ్చిన పై అధికారులు తగు చర్యలు తీసుకుంటారని అలాగే రేపు జరగబోయే రైతు అవగాహన సదస్సు పై ప్రభుత్వ వీప్ఆది శ్రీనివాస్. సిరిసిల్లనియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులు రైతులతో అవగాహన సదస్సు నిర్వహించి రైతుల అమూల్యమైన సలహాలు తీసుకుంటారని దీనిపై భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలియజేస్తూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు మీ మండలంలో పనిచేసే ఒక అధికారి పని ఒత్తిడి భారమో. మీ నాయకులు చేస్తున్న ఒత్తిడి వల్ల కానీ సమస్యలు వస్తున్నాయని దృష్టికి వచ్చిందని దీనిపై వివరణ . కోరగా జరిగిన మాట వాస్తవమే కానీ. అసలు ఏం జరిగింది అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరక లేక ఆమె వ్యక్తిగత అవసరాల గురించా తెలియదు కానీ దీనిపై సంబంధిత అధికారులు తగు విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని దీనిపై మండల కాంగ్రెస్ పార్టీ లో పనిచేసే నాయకులు కార్యకర్తలు ఉన్నారని ఆరోపిస్తుండడం కరెక్టే కానీ దీనిపై విచారణకు సిద్ధమై. అధికార పార్టీ నాయకులైన కార్యకర్తలైన ఏ నాయకులైన చట్టానికి చుట్టం కాదని దీనిపై తగు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో యూత్ నియోజకవర్గ ఇన్చార్జి. చుక్క శేఖర్. మునిగల రాజు. సత్తు శ్రీనివాస్ రెడ్డి. పొన్నాల లక్ష్మణ్. గుగ్గిళ్ళ భరత్ గౌడ్. భాస్కర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కంకర పరిచారు.. రోడ్డు మరిచారు.

కంకర పరిచారు.. రోడ్డు మరిచారు

రోడ్డు వెయ్యండి బాబు… ప్రజలకు తప్పని ఇబ్బందు లు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొప్పుల గ్రామం నుండి గంగిరేణిగూ డానికి రైతులు పంట పొలా లకు గంగిరేణి గూడెం గ్రామం వరకు నూతన బిటి రోడ్డు మంజూరు చేశారు సదరు గుత్తేదారు రోడ్డును తవ్వి కంకర పోసి వదిలేశారు. సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడంతో రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నట్లు స్థానికులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు రాకపోకలకు వేరే మార్గం లేక తీవ ఇబ్బందులు ఎదుర్కొ న్నట్లు ఆగ్రహం చేస్తున్నారు. నెలలు గడుస్తున్న రోడ్డును తీసి కంకర పోసి వదిలిపెట్టారు దీన్ని ఎవరు పట్టించుకోక పోవడం వల్ల రాకపోకలను ఇబ్బందులు గురవుతున్నారు అధికారులు కానీ, ప్రజాప్రతిని ధులు గాని స్పందించి సకాలం లో రోడ్డు పూర్తయ్యాలో చూడా లని ప్రజలు కోరుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్డు సరిగ్గా కని పించక స్లిప్పు అయి చాలా మంది ప్రమాదాలు గురవుతు న్నారు రోడ్డు అసంపూర్తిగా ఉండడంతో పాటు కంకర రాళ్ల వల్ల ఇప్పటికి చాలామంది గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోటగుళ్ల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి.

కోటగుళ్ల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి

రాబోయే రోజుల్లో ఆలయం మరింత అభివృద్ధి

దేవదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ నందనం కవిత

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో కోటగుళ్ల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దేవదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ నందనం కవిత అన్నారు. గురువారం ఆమె సిబ్బందితో కలిసి కోట గుళ్ళ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ విషయమై కోటగుళ్లు పరిరక్షణ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 43 సెక్షన్ కింద కోట గుళ్ళు దేవాలయం పేరున రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. దీంతో ఆలయం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. ఆలయ
నిర్వహణ పూర్తిగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని ఇందులో తమకు ఎలాంటి ప్రమేయం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడిఎన్ అర్చక సంఘం రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కార్యదర్శి కర్నే సాంబయ్య, డిడిఎన్ అర్చక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహదేవ్,జిల్లా కోశాధికారి సాంబశివుడు, అర్చకులు గురు మూర్తి, చంద్రశేఖర్, రాజు, కోటగుళ్లు పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు, మామిండ్ల మల్లికార్జున గౌడ్, సభ్యులు నాగపురి శ్రీనివాస్ గౌడ్, రౌతు కిషోర్, గొర్రె ఎల్లయ్య యాదవ్ చిలువేరు ఉదయాకర్, కొయ్యల గౌతమ్ గౌడ్, సామర్ల నాగరాజు, కొయ్యల రమేష్, , తోట నవీన్, బాలాజీ నవీన్, పెద్ది ప్రశాంత్,ఆరెల్లి ఓంకార్, శంకర్ అంజి, పుప్పాల దీపక్, ఆనంద వర్ధన్, నల్లగొండ రాజు , గణేష్ ,వంశీ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

#ఆర్టీసీ సంస్థ మనందరిదీ దానిని కాపాడుకునే బాధ్యత ప్రయాణికులదే.

# నర్సంపేట డిఎం ప్రసన్న లక్ష్మి

నల్లబెల్లి , నేటి ధాత్రి:

 

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజిఎస్ ఆర్టిసి ) ఆర్టీసీ బస్సు లో ప్రయాణం అన్ని రకాల భద్రతతో పాటు సురక్షితమని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి పేర్కొన్నరు
శుక్రవారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు పరిసరాలను ఆమె పరిశీలించారు. బస్టాండ్ లో గల సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఇటీవల డైల్ యువర్ డిఎం కార్యక్రమా ద్వారా ప్రయాణికుల సూచనలను సలహాలను స్వీకరించి వారి కోరిక మేరకు అదనపు బస్సు ట్రిప్పులను ఆయా ప్రాంతాలకు ప్రయాణికుల సౌకర్యార్థం నిమిత్తం పెంచడం జరిగిందన్నారు.
ఆర్టీసీ మన సంస్థ దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ప్రైవేట్ వాహనాల ప్రయాణం వద్దు మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం ముద్దు అని ప్రయాణికులకు తెలియజేశారు.
సమయపాల పాటించి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు
ఈ కార్యక్రమంలో సిబ్బంది ప్రయాణికులు. స్థానికులు. తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version