శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతర మహోత్సవ.

నేటి ధాత్రి కథలాపూర్

 

 

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట్ గ్రామంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు గా బావించే స్వయంభూ గా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో కనుల పండగ కొనసాగింది.

స్వామివారి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులు కావడం జరిగింది.

రెచ్చిపోయి వసూళ్లు.!

రెచ్చిపోయి వసూళ్లు.

పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.

ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.

మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి లో ఇదే తంతు.

అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.

దర్జాగా వసూళ్ల సాక్షాలు అయిన టీఎస్ఎండిసి నిశ్శబ్దం, అమ్ముడుపోయిందని ప్రజలకు అర్థం.

మహాదేవపూర్ నేటి ధాత్రి:

ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, టీజీఎండిసి శాఖ కాసులకు కక్కుర్తి పడడం, కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు చేసుకొని అక్రమ వసూళ్లకు సహకరించడం యదేచ్చగా కండ్ల ముందు అక్రమ వసూళ్ల దందాను టీజీఎండిసి సిబ్బంది తోపాటు కాంట్రాక్టర్ సిబ్బంది వసూళ్ల పరంపరను కొనసాగిస్తున్నప్పటికీ టీజీఎండిసి ఉన్నత అధికారులు మరోవైపు ప్రభుత్వం అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం తో మండలంలోని ఇసుక రీచులు అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రెచ్చిపోయి కొనసాగించడం జరుగుతుంది. మరోవైపు పక్క జిల్లాలకు సంబంధించిన ఇసుక రీచుల కాంట్రాక్టర్లు హద్దులు దాటి గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాన్ని చేసి ఇసుకను రవాణా కొనసాగిస్తుంటే ప్రభుత్వం టీజీఎండిసి అధికారులు చర్యలకు ససేమీరా అనడం తో కాంట్రాక్టర్లు ఇసుక రీచుల్లో అక్రమాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. అక్రమాలపై టీజీఎండిసి చర్యలు తీసుకోకపోవడం, ఇసుక రిచుల్లో అక్రమాల వ్యవహారం అదునపు వసూళ్లు తీసుకుంటున్న టీజీఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ సూపర్వైజర్ లా ఫోటోలు వీడియోల సాక్షాలు వచ్చినా కూడా ఇప్పటివరకు ఒక్క క్వారీపై కూడా చర్యలు తీసుకోలేదంటే టీజీఎండిసి కిందిస్థాయి నుండి పై స్థాయి అధికారి వరకు కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయారని స్పష్టంగా కనబడుతుంది.

పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.

సోమవారం రోజు పలుగుల తొమ్మిది ఇసుక క్వారీలో కాంట్రాక్టర్ సిబ్బంది లారీ డ్రైవర్ నుండి 1100 రూపాయలు సీరియల్ పేరుతో వసూలుచేస్తూ. తరువాత లోడింగ్ కొరకు సీరియల్ నంబర్ చిట్టిని అందించాడు. ఈ క్వారీలో గత నెల రోజులు నుండి పెద్ద మొత్తంలో అన్ని క్వారీల కంటే ఎక్కువగా వసూళ్ల పరంపర కొనసాగుతుందని, దానికి సంబంధించిన సాక్షాలు గత నెలలో 1200 తీసుకున్న పలుకుల 9 ప్రస్తుతం 1100 వందలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు లోడింగ్ వద్ద 200. వందల రూపాయలు గత నెలలో 1400 వసూలు చేయడం జరిగింది. ప్రస్తుతం 1300 పాసింగ్ పై అదనపు ఇసుకను తీసుకోవడం జరుగుతుంది. పలుగుల తొమ్మిది గత నెల ప్రతిరోజు 119 నుండి 148 వరకు లారీల్లో ఇసుక నింపి రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ మార్చ్ నెలలో నాలుగవ తేదీన ప్రారంభమై మొదట్లో ఆవరేజ్ 60 నుండి మొదలుకొని నేటి వరకు ప్రతిరోజు 100కు పైచిలుకు లారీల ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మూడు నెలల్లో సుమారు ఈ క్వారీ 60 రోజుల్లో 6000 లారీల ఇసుక రవాణా చేయడం జరిగింది. లారీకి 14 నుండి 1100 అక్రమ వసూళ్ల విషయానికొస్తే 65 నుండి 85 లక్షల రూపాల అక్రమ వసూళ్లను సొమ్ము చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లకు తెరలేపిన పలుగుల తొమ్మిది పై, టి జి ఎం డి సి కనీసం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు, మరి కొన్ని రోజుల్లో అక్రమ వసూళ్లతో తమ క్వాంటిటీని సమాప్తం చేసుకునే వరకు టీజీఎండిసి అధికారులు చూస్తూనే ఉంటారు.

collect

 

ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.

మండలంలో ఇసుక క్వారీల అక్రమాల వ్యవహారం, సాక్షాలు వసూళ్ల పర్వం, నిబంధనలు దాటి తవ్వకాలు, యదేచ్ఛగా కొనసాగుతుంటే టి జి ఎం డి సి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, టీజీఎండిసి అధికారుల పుణ్యం కాంట్రాక్టర్లు రెచ్చిపోయి, తమకు అడ్డు ఎవరు అని అక్రమ వసూళ్ల వ్యవహారాలను తమ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మండలంలో నిర్వహించబడే ఇసుక రిచుల్లో పలుగుల తొమ్మిది మహదేవపూర్, పుసుక్ పల్లి 1, పలుగుల 8, ఈ రిచుల్లో పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్ల వ్యవహారాలను దర్జాగా కొనసాగించడం జరుగుతుంది. అంతేకాకుండా పక్క జిల్లా ఇసుక క్వారీలు కూడా గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాలు చేసి, కుంట్లం గోదావరి వద్ద అక్రమ తవ్వకాలు జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడుతు యదేచ్చగా అక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. కొత్తగా ఇసుక పాలసీ అమలులో ఉన్న క్రమంలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం టీజీఎండిసి పై చర్యలు తీసుకోవాల్సి ఉండగా నిశ్శబ్దాన్ని పాటించడం, అనేక అనుమానాలకు దారితీస్తుంది.

collect

మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి, లో ఇదే తంతు.

మహదేపూర్ పుసుపుపల్లి1, పేరుతో నిర్వహించబడే ఇసుక క్వారీ లోను కూడా అక్రమ వసూళ్లకు హద్దు లేకుండా పోయింది.

ఇక్కడ టీజీఎండిసి సిబ్బంది 900 రూపాయలు, సీరియల్ పేరుతో వసూలు చేయడం, లోడింగ్ వద్ద 200, కాంటా వద్ద అదనపు ఇసుకకు 300 నుండి 500, యథేచ్ఛగా కొనసాగడం జరుగుతుంది.

ఈ ఇసుక క్వారీ మార్చ్ నెల ఆరవ తేదీన ,ప్రారంభించడం జరిగింది, కానీ కొద్ది రోజులు నామమాత్రంగా లారీలో ఇసుక నింపిన ఈ క్వారీ ఏప్రిల్ నెలలో, అక్రమ వసూళ్ల పరంపరను ప్రారంభించడంతో 60 నుండి మొదలుకొని 175 యావరేజ్ గా ప్రతిరోజు లారీల్లో ఇసుకను రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ ఇప్పటివరకు అక్రమ వసూళ్ల తో 45 లక్షల నుండి 60 లక్షల వరకు సొమ్ము చేసుకోవడం జరిగింది.

ప్రస్తుతం పలుకుల 8 ఇసుక క్వారీ స్థానికులకు భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడంతో లోడింగ్ నిలిచివేయడం జరిగింది, పలుకుల సిక్స్, పుసుక్ పల్లి ఒకటి, టీజీఎండిసి అధికారుల పుణ్యమని అక్రమ వసూళ్లు పెద్ద మొత్తంలో జరుపుకొని లక్షల రూపాయల సొమ్ము చేసుకుని ఇసుక క్వాంటిటీని సమాప్తం చేసుకోవడం జరిగింది.

అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.

అక్రమ వసూళ్ల వ్యవహారం మండలంలోని ఇసుక క్వారీలకు ఒక వరంగా అందించింది టీజీఎండిసి, అదుపు ఇసుక రవాణా నిలిపివేయడం, నూతన ఇసుక పాలసీ విధానం అమలు చేయడం జరుగుతుంది అని చెప్పిన ప్రభుత్వం, టీజీఎండిసి అధికారులకు ఇచ్చిన” డేడ్” లైన్ అధికారులు లెక్కచేయకుండా ప్రభుత్వ డెడ్ లైన్ ను
తీసిపారేశారు, గత వారం రోజుల క్రింద ఓ అధికారి” హోటల్లో మకాం వేసి, కాంట్రాక్టర్ అందరికీ తమ వద్దకు పిలుచుకొని, సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది.

ఆ అధికారి విధులు కూడా హోటల్లోనే పూర్తి చేసుకున్నాడు.

ఇలా అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే, అక్రమ వసూళ్ల పరంపర జోరుగా కొనసాగకుంటే, కాంట్రాక్టర్లు ఎందుకు ఊరుకుంటారు.

అధికారుల హోటల్లో సిట్టింగ్ పరంపర, గత కొన్ని రోజులుగానే కొనసాగుతుందని చెప్తున్నారు, అందుకే ఏమో ఇసుక క్వారీల ప్రారంభం నుండి, అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం గా కనబడుతోంది.

దర్జాగా వసూళ్ల సాక్షాలు అక్రమ ఇసుక తవ్వకాలు మైనింగ్ నిబంధనలకు తూట్లు పొడుస్తుంటే, టీజీఎండిసి అధికారులు చర్యలకు బదులు హోటల్లో” సిట్టింగ్ తో సెట్టింగ్” చేసుకోవడానికి, ప్రజలు గమనించి వాస్తవమే అక్రమాలకు చర్యలు కాదు, సిట్టింగ్లతో సక్సెస్ అయింది, ఇంకేముంది టిజీఎండిసి కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయిందని అక్రమ వసూళ్ల సాక్షాలు చెబుతున్నాయి అని చెప్పుకొస్తున్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ టీజీఎండిసి అధికారులపై చర్యలకు ఆదేశించి, ఇసుక రీచుల్లో అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పాక్ కు సరైన గుణపాఠం జై హింద్ షేక్ రబ్బానీ.

పాక్ కు సరైన గుణపాఠం.. జై హింద్: షేక్ రబ్బానీ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

‘ఆపరేషన్ సింధూర్’పై ఝరాసంగం ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బానీ హర్షం వ్యక్తం చేశారు. ‘పాకిస్థాన్లోని టెర్రరిస్ట్ స్థావరాలపై భారత్ నిర్వహించిన దాడులను ఆహ్వానిస్తున్నాం. మరో పహల్గామ్ ఘటన జరగకుండా పాక్కు ఇలాగే సరైన గుణపాఠం చెప్పాలి. పాక్ టెర్రర్ స్థావరాలు అన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేయాలి. జై హింద్’ అని పోస్ట్ చేశారు. భారత్ నిర్వహించిన మెరుపు దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మన రక్షణ దళాలు జరిపిన లక్షిత దాడులను నేను స్వాగతిస్తున్నాను. పాకిస్తాన్ లోతైన రాజ్యానికి ఒక గుణపాఠం నేర్పించాలి, పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలి. జై హింద్!

దేశ రక్షణలో సైనికులది వెలకట్టలేని పాత్ర.

దేశ రక్షణలో సైనికులది వెలకట్టలేని పాత్ర

భారత సాయుధ దళాల పనితీరును చూస్తుంటే గర్వంగా ఉంది

-పహల్గాం ఉగ్రదాడితో దేశం మొత్తం కన్నీళ్లు కార్చింది

-నేడు సాయుధ దళాల పోరాటపటిమను చూస్తూ దేశం మొత్తం గర్విస్తుంది

-సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

 

 

ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై జరుపుతున్న దాడులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడితో అమాయక దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఆ బాధతో దేశ మొత్తం కన్నీరు పెట్టిందని గుర్తుచేశారు. ఆ దాడికి ప్రతీకారంగా దేశ సాయుధ దళాలు ఉగ్రవాదుల స్థావరాల నిర్మూలనకు ఆపరేషన్ సింధూర్ పేరుతో తమదైన శైలిలో దాడులకు పాల్పడడాన్ని చూసి దేశ ప్రజలు సంతోషిస్తున్నారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు దేశ రక్షణలో సైనికుల పాత్ర వెలకట్టలేనిదని, సాయుధ దళాల పోరాటపటిమ దేశ ప్రజలకు గర్వకారణమన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన దాడులతో ఉగ్రవాదం పూర్తిస్థాయిలో కనుమరుగు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కులగణన దేశ చరిత్రలో మైలురాయి.!

కులగణన దేశ చరిత్రలో మైలురాయి

-ఉనికి కోసమే ప్రతిపక్షాల రాజకీయ నాటకాలు

-విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేత చేవ్వ శేషగిరి యాదవ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టడం దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని బిజెపి నేత చేవ్వ శేషగిరి యాదవ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1931లో చివరిసారి బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేపట్టిందని, 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణనపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ సిఫారసు చేసిన బీసీ కమిషన్ ను కాంగ్రెస్ పార్లమెంట్ లో చర్చకు తీసుకురాకుండా తిరస్కరించిన చరిత్ర మర్చిపోవద్దన్నారు. నెహ్రూ నుండి ఇందిరా, రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ నాయకులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించారు. కులగణన విషయంలో తెలంగాణ మోడల్ రాహుల్ గాంధీ అని రేవంత్ రెడ్డి మాట్లాడడం మొసలి కన్నీరేనన్నారు. తెలంగాణలో 12 శాతం ముస్లింలు ఉండగా..10 శాతం ఓబీసీలుగా చూపించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ మాదిరిగా కాకుండా..పాలనలో అనుభవం కలిగిన గొప్ప నాయకుడిగా ప్రధాని మోడీ పారదర్శకంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆపరేషన్ సిందూర్ సమీక్ష సమావేశం లో సీఎం.

ఆపరేషన్ సిందూర్ సమీక్ష సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి గారు…

దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలి.

ఈ సమయంలో రాజకీయాలు, పార్టీ లకు తావు లేదు..

 

నేటి ధాత్రి

 

 

 

అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు .

ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలి..

మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి..

విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి..

ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అసవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు..

 

CM Revanth Reddy

 

 

24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలి..

పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి..

కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవాలి..

శాంతి భద్రతల కు భంగం కలుగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలి..

బ్లడ్ బ్యాంకు ల్లో రక్తనిలువలు సిద్దం చేసుకోవాలి…

అత్యవసర మెడిసిన్ సిద్దం చేసుకోవాలి..

ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ ల అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి…

 

CM Revanth Reddy

 

రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలి..

ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలి..

సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలి.

ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలి…

ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉంది..

 

CM Revanth Reddy

 

ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి..

రాజధాని లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల ను కమాండ్ కంట్రోల్ రూం కి అనుసంధానం చేయాలి…

అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలి..

హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భధ్రతను పెంచాలి..

ఐటీ సంస్థల దగ్గర భధ్రతను పెంచాలి…

హైదరాబాద్ నగరం లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి…

CM Revanth Reddy

 

అవసరమైతే పీస్ కమిటీ లతో మాట్లాడాలి…

హిస్టరీ షీటర్ లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలి…

భువన్ రిభుకు వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్.!

భువన్ రిభుకు వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ హానర్ అవార్డు.

రామాయంపేట నేటి ధాత్రి:

ప్రపంచ న్యాయ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు భువన్ రిభు.

వరల్డ్ లా కాంగ్రెస్ లో వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ హానర్ అవార్డును మన భారత సుప్రీంకోర్టు న్యాయవాది భువన్ రిభు అందుకోవటము మన దేశానికి ఒక గొప్ప ప్రతిభ గా చెప్పుకోవాలి, ఈ విజయం 262 జాతీయ స్వచ్ఛంద సంస్థలు తరపున, బాలల హక్కుల కన్వీనర్ భువన్ రిభు అందుకున్నారు.

Association

భువన్ రిభు దేశంలోని బాలల హక్కుల కోసం 416 జిల్లాల్లో పనిచేస్తున్న 262 ఎన్జీవోలను
ఒకే గొడుగు కింద తీసుకువచ్చి, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా భువన్ రీభుకు బుధవారం విజన్ సంస్థ డైరెక్టర్ వంగరీ కైలాస్, జిల్లా కోఆర్డినేటర్ రాజు, సిబ్బంది ప్రత్యేక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు.

ఫరీద్ నగర్ బాలాజీ నగర్ ప్రజలు నీటి సౌకర్యం.!

ఫరీద్ నగర్ బాలాజీ నగర్ ప్రజలు నీటి సౌకర్యం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనిషి జీవితంలో నీరు ఒక భాగం. నీరు లేకపోతే జీవ రాశుల మనుగడ కష్టం. ఆహారం లేకున్నా కొన్ని రోజుల పాటు జీవించగలం కానీ నీరు లేకపోతే ఒక్క రోజూ జీవించలేం. అటువంటి అత్యవసరమైన నీరు దొరకక ఐదు ఆరు రోజుల నుండి ఓ జహీరాబాద్ లోని ఫరీద్ నగర్ బాలాజీ నగర్ ప్రజలు అల్లాడుతోంది. 12వ వార్డు వీధిలో ఒకే ఒక బోరు ఉంది ఆ బోరు గ్యాప్ ఇవ్వడం వల్ల బ్యాంకులో నీరు ఎక్కడం లేదు అయితే మంజీరా నీరు ఎనిమిది రోజుల నుండి రావడం లేదు ఆర్ డబ్ల్యు ఎస్ మరియు ఎం సి జెడ్ అధికారులు చూసి చూడలేనట్టు వ్యవహరిస్తున్నారు తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు ఆందోళన చేశారు.మంచినీటి సమస్యతో అల్లాడుతున్నామని మహిళలు తెలిపారు. కనీసం తాగడానికి మంచి నీరు లేక నోరుఎండిపోతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారన్నారు. ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగిన తప్ప ఇప్పటివరకు మంచినీరు మా ప్రాంతానికి ఇవ్వలేదని మండుతున్న ఎండల్లో పిల్లా పాపలతో అల్లాడిపోతున్నామన్నారు. తక్షణం జిల్లా కలెక్టర్‌ స్పందించి మాకు మంచి నీటి సౌకర్యం కల్పించి మా దాహార్తిని తీర్చాలని మహిళలు ఆందోళన చేపట్టారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో కలెక్టరేట్‌ ని కలిసి తమ సమస్యలను చెప్తామని మహిళలు హెచ్చరించారు
పై అధికారులు వెంటనే స్పందించి ప్రజలను నీటి సౌకర్యం కల్పించాలని కోరుచున్నారు.

Nani’s HIT 3 Achieves Breakeven In 6 Days.

Nani’s HIT 3 Achieves Breakeven In 6 Days

 

 NETIDHATRI NEWS:

 

 

Natural Star Nani’s HIT: The 3rd Case, directed by Sailesh Kolanu, has emerged as a clear box office winner, achieving break-even status across all territories within just six days of its release.

In an industry climate where many films are struggling to find footing, this achievement stands out as a major success.

The film has already crossed the coveted 100 crore milestone globally and also surpassed the $2 million mark in North America.

With momentum on its side, HIT: The 3rd Case is well on track to become one of the highest-grossing Telugu films of 2025.

Nani’s HIT 3

 

 

 

Its success further reinforces Nani’s reputation as one of Telugu cinema’s most bankable stars. Known for his script sense and consistent box office pull, Nani continues to deliver crowd-pleasing content that resonates across demographics.

In today’s challenging market, where theatrical footfall is unpredictable and only a few films are managing to turn a profit, HIT: The 3rd Case reaching profitability within a week is a rare and commendable accomplishment.

వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకునే

వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకునే వరకు నిరసన కొనసాగుతుంది.

◆ జహీరాబాద్‌లో మహిళా మహాసభ – మౌలానా గియాస్ రషాది ప్రకటన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అన్ని ఆలోచనా విధానాలు, లౌకిక సమాజం మరియు దళిత సోదరులు ముస్లిం పర్సనల్ లా బోర్డుతో ఉన్నారు మరియు ఈ నల్ల చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదు. ఘోరీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన మహిళల కోసం జరిగిన సాధారణ సమావేశానికి హాజరైన పెద్ద సంఖ్యలో మహిళలను ఉద్దేశించి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యురాలు మౌలానా గియాస్ అహ్మద్ రషాది ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంతకుముందు, ప్రత్యేక అతిథి న్యాయవాది జలీసా డాక్టర్ నసీరా ఖానుమ్, డాక్టర్ ఖదీరా కూడా వక్ఫ్ సవరణ చట్టం వక్ఫ్‌కు ముప్పు అని, దానిలోని వివిధ సవరణలు వక్ఫ్ రక్షణకు చాలా హానికరమని, మహిళలు ఈ బిల్లులో పాల్గొనాలని, దానికి వ్యతిరేకంగా ఉండాలని అభ్యర్థించారు. ఉమ్-ఉర్-రెహ్మాన్ సమావేశం యొక్క ఉద్దేశ్యాన్ని వివరించారు. బుష్రా అఫ్రోజ్ మాట్లాడుతూ, ఇస్లామిక్ దానధర్మాల చరిత్రను వివరించగా, మరియం జమీలా దానధర్మాల షరియా స్థితిపై మాట్లాడారుఖా. ఫరానుమ్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మీ, మౌలానా అతిక్ అహ్మద్ ఖాస్మీ ముఫ్తీ నజీర్ అహ్మద్ హస్సామీ, ముఫ్తీ ఒబైద్  ఉర్ రెహ్మాన్ ఖాస్మీ, నజీముద్దీన్ ఘోరి, అమీర్ మామి, మహమ్మద్ మజీద్ మహమ్మద్ వసీం, హఫీజ్ అక్బర్ సమావేశాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ముస్లిం యాక్షన్‌ కమిటీ అధ్యక్షుడు మహ్మద్‌ యూసుఫ్‌, మహ్మద్‌ ఫరూఖ్‌ అలీ, ఎంబీజీ అధ్యక్షుడు ముహమ్మద్‌ అయూబ్‌, ముస్లిం యాక్షన్‌ కమిటీ అధ్యక్షుడు మహ్మద్‌ మోతాజుద్దీన్‌ మహమ్మద్‌, ఖ్వాజా నిజాముద్దీన్‌ మహమ్మద్‌ నసీరుద్దీన్‌, ఖాజీ సయ్యద్‌ మోయిజ్‌, మౌలానా అబ్దుల్‌ మతీన్‌, మౌలానా నా ఈసా మహమ్మద్‌ జమీర్‌ మెహబూబ్‌ గోరీ, గోరీక్‌ గోరీ, గోరేబ్‌ తదితరులు పాల్గొన్నారు.

పంజాబ్‌ , హర్యానాల మధ్య నీటి రగడ

ఉద్రిక్తతల నడుమ సరిహద్దు రాష్ట్రాల్లో నీటి జగడం సమంజసం కాదు

సింధూనది జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో మళ్లీ రగిలిన నీటివివాదం

ఆప్‌ ప్రభుత్వం వైఖరితో కేంద్రానికి ఇరకాటం

దేశ సమస్యను పట్టించుకోని పంజాబ్‌

పాక్‌కు ప్రయోజనం కలిగించే రీతిలో పంజాబ్‌ వైఖరి

ఆప్‌ ప్రభుత్వానికే కాంగ్రెస్‌ మద్దతు

ఎవరి కారణాలు వారికున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వివాదం నిర్హేతుకం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

హర్యానాకు 4500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని భాక్రా బీయాస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ (బీబీఎంబీ)ని శుక్రవారం ఆదేశించింది. మే 3వ తేదీనుంచి ఎనిమిది రోజుల వరకు ఈ నీటిని విడుదల చేయాలని స్పష్టం చేసింది. శుక్రవారం పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థా న్‌ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానంతరం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మో హన్‌ ఈమేరకు ఆదేశించారు. ఈ నాలుగు రాష్ట్రాలు బీబీఎంబీలో సభ్యులుగా వున్నాయి. 

బీబీఎంబీ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నియంత్రణలో వుంది. బీబీఎంబీకి చెందిన కమిటీలో హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, చండీగఢ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు సభ్యులుగా వుంటారు. కేంద్రం ఆదేశాల మేరకు నీటివిడుదలకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వీరు సిద్ధం చేసి అమలు చేస్తారు. 

సమస్య ప్రారంభం

తమరాష్ట్రానికి అదనపు జలాలు విడుదల చేయాలని ఏప్రిల్‌ 28న హర్యానా ముఖ్యమంత్రి నా యబ్‌ సింగ్‌ సైనీ కోరారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టునుంచి హర్యానా 4వేల క్యూసెక్కుల నీటిని పొందుతోంది. కాగా ఆయన డిమాండ్‌ మేరకు రాష్ట్రానికి భాక్రా డ్యాం నుంచి 8500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. పంజాబ్‌లో అధికారంలో వున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు, మే 1వ తేదీన భాక్రాకు దిగువన 13 కి లోమీటర్ల దూరంలో వున్న నంగల్‌ డ్యామ్‌ వద్దకు డీఐజీ స్థాయి పోలీసు అధికార్లను పంపి అక్కడినుంచి నీటి విడుదలను అడ్డుకుంది. విచిత్రమేమంటే బీబీఎంబీ బోర్డులో సభ్యురాలిగా వున్న రాజస్తాన్‌ నిపుణులు హర్యానాకు 8500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసేందుకు మద్దతు పలు కగా, హిమాచల్‌ ప్రదేశ్‌ నిపుణులు మాత్రం మౌనంగా వుండిపోయారు. ఒక్క పంజాబ్‌ ప్రతిధు లు మాత్రమే నీటి విడుదల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. హర్యానాకు అదనపు జలాల కేటాయింపును అడ్డుకొని తీరతామని పంజాబ్‌కు చెందిన ప్రధాన రాజకీయ పార్టీలు స్పష్టం చేయడం గ మనార్హం. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ నేతృత్వంలో ఏడు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చండీగఢ్‌లో మే 1న సమావేశమై, హార్యానాకు చుక్క అదనపు నీటిని తరలించినా అడ్డుకొని తీరతామని శపథం చేయడంతో సమస్య జఠిలమైంది. ఇది కేవలం తమ నీటిని దోపిడీ చేయడమేనని పంజాబ్‌ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, హర్యానా ముఖ్యమం త్రి నాయబ్‌ సింగ్‌ సైనీ ఈ విషయంలో సంయమనం పాటించాలంటూ హితవు పలికారు.

బీబీఎంబీ నిర్వహణ

భాక్రా మరియు పొంగ్‌ డ్యామ్‌ల నుంచి నీటి నిర్వహణ బాధ్యతను భాక్రా బీయాస్‌ మేనేజ్‌మెంట్‌బోర్డ్‌ (బీబీఎంబీ) చూస్తుంటుంది. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌లు ఈ రెండు డ్యామ్‌లనుంచి ఏటా తమ నీటి అవసరాలను తీర్చుకుంటుంటాయి. బీబీఎంబీ ఈ రాష్ట్రాలకు మే 21 నుంచి మరసటి ఏడాది మే 20 వరకు ఏ రాష్ట్రానికి ఎంత వాటా నీటిని కేటాయించాలో నిర్ణయించి ఆమేరకు అమలు చేస్తుంటుంది. కాగా హర్యానా ముఖ్యమంత్రి కోర్కె మేరకు 8500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని బీబీఎంబీ నిర్ణయించడంతో వివాదం చెలరేగింది. ఈ నిర్ణయాన్ని కమిటీ లోని పంజాబ్‌ ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే హర్యానా తనకు రావలసిన నీటిని వాడుకుందని, అటువంటప్పుడు అదనపు నీటిని కేటాయించడం అన్యాయమని వారు వా దించారు. ఈ నేపథ్యంలోనే పంచాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ‘కేంద్రం, హర్యానా ప్రభు త్వాలు కుమ్మక్కయ్యాయని, బీజేపీ ఎన్నడూ పంజాబీలది కాదు’ అంటూ ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం, హర్యానా ముఖ్యమంత్రి సైనీ, కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లు కుట్రపూరితంగా ఈవిధంగా చేస్తున్నారంటూ పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఆరోపించారు. ఇప్పటికే తనకు కేటాయించిన దాంట్లో హర్యానా 103శాతం నీటిని, రాజస్థాన్‌ 110% నీటిని వాడుకున్నాయి. అదే పంజాబ్‌ ఇప్పటివరకు కేవలం తన వాటా నీటిలో 89% నీటిని మాత్రమే వాడుకుందని పంజాబ్‌ ఆర్థిక శాఖ మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ ఛీమా పేర్కొన్నారు. 

ఆయన అందించిన వివరాల ప్రకారం పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాలకు వరుసగా 5.512 మిలియన్‌ యాకర్‌ ఫీట్‌ (ఎంఏఎఫ్‌), 2.987 ఎంఏఎఫ్‌, 3.398 ఎంఏఎఫ్‌ నీటిని కేటా యించగా, ఇప్పటివరకు హర్యానా 3.091 ఎంఏఎఫ్‌, రాజస్థాన్‌ 3.738 ఎంఏఎఫ్‌ మరియు పంజాబ్‌ 4.925 ఎంఏఎఫ్‌ నీటిని వాడుకున్నాయి. ప్రస్తుతం భాక్రా డ్యామ్‌లో 1557.10 అడుగులు (పూర్తి సామర్థ్యం 1680 అడుగులు), పోంగ్‌ డ్యామ్‌లో 1293.73 అడుగులు (పూర్తి సామర్థ్యం 1390 అడుగులు), రంజిత్‌ సాగర్‌ డ్యామ్‌లో 1642 అడుగులు (పూర్తి సామర్థ్యం 1732 అడుగులు) నీటి నిల్వ వుంది. అంటే ఇప్పటికే ఈ డ్యామ్‌ల్లో నీటినిల్వ తక్కువగా వున్న నేప థ్యంలో హర్యానాకు అదనపు నీరు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని సైనీ ప్రశ్నిస్తున్నారు. హర్యానా తనకు కేటాయించిన నీటిని మే 21 వరకు ఉపయోగించుకోవచ్చు. గడువు తేదీకి చాలా కాలం ముందుగానే తన వాటా నీటిని పూర్తిగా వాడుకున్నదంటే, ఆ రాష్ట్రం నీటిని దుబారా చేసేస్థాయి ఏవిధంగా వున్నదో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. తాగుకు కేటాయించిన నీటిని వ్యవసాయానికి, పరిశ్రమలకు సరఫరా చేయడమే ప్రస్తుత దుస్థితికి కారణమని ఆయన ఆరోపించారు. 

దీనిపై హర్యానా ముఖ్యమంత్రి సైనీ తీవ్రంగా స్పదించారు. ‘పంజాబ్‌ అంటే గురువుల ప్రదేశం. మేం గురువులనుంచి ఎంతో నేర్చుకున్నాం. పంజాబ్‌ అంటే మా సోదర రాష్ట్రం, అక్కడి ప్రజలు నీటికి కటకటపడుతుంటే మా వాటా నీటిని అందిస్తాం. అదీ మా సంస్కృతి. అంతేకాని నీటి పే రుతో తుచ్ఛ రాజకీయాలు చేయడం సమంజసం కాదు’ అంటూ పంజాబ్‌ రాజకీయ నేతలపై విరుచుకుపడ్డారు. అంతేకాదు తమకు తాగునీరు సరఫరా చేయాలని పంజాబ్‌ ప్రభుత్వాన్ని ఆయనకోరారు. ఆవిధంగా చేయకపోతే అదనపు నీరు వృధాగా పాకిస్తాన్‌లోకి పోతుందని గుర్తుచేశారు.పహల్గామ్‌ దాడులకు నిరసనగా పాకిస్తాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో సైనీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడిరది. జూన్‌ నెలాఖరు లోగా భక్రా డ్యాంను ఖాళీ చేస్తే, రుతుపవన వర్షాలతో మళ్లీ డ్యాం నిండుతుంది. లేదంటే అదనపు నీరు హరి కా పట్టణ్‌ ద్వారా పాకిస్తాన్‌లోకి వెళుతుందన్నారు. ఇది పంజాబ్‌కు లేదా మనదేశానికి ఎంతమాత్రం ప్ర యోజనకరం కాదని గుర్తుచేశారు.

ఇదిలావుండగా హర్యానాకు అదనపు నీటిని ఇవ్వొద్దన్న పంజాబ్‌ ప్రభుత్వ డిమాండ్‌ను కాంగ్రెస్‌ సమర్థించడమే కాదు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి తన మద్దతు తెలిపింది. ఇదిలావుండగా రెండు రాష్ట్రాలమధ్య సట్లెజ్‌`యమున లింక్‌ కాల్వ సమస్య కూడా రావణకాష్టంలా రగులుతోంది. ఇప్పుడు హర్యానాకు అదనపు నీటి వివాదంతో ఇదికూడా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సట్లెజాయమున లింక్‌ కెనాల్‌ (ఎస్‌వైఎల్‌) వివాదం

నిజానికి ఈ వివాదం ఇప్పటిది కాదు 1960లో భారత్‌`పాకిస్తాన్‌ల మధ్య సింధూనదీ జలాల ఒప్పందం కుదిరినప్పుడు, రావీ, బీయాస్‌, సట్లెజ నదుల నీటిని స్వేచ్ఛగా మనదేశం వినియోగించుకునేందుకు వీలైంది. ఒకరకంగా చెప్పాలంటే కర్ణాటక`తమిళనాడు మధ్య కావేరీ జలాల పంపిణీ వివాదం లాంటిదే ఇది కూడా. 1966లో పంజాబ్‌ నుంచి హర్యానా విడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ నదులనుంచి హర్యానాకు కూడా న్యాయబద్ధంగా నీటి వాటాను కేటాయించాల్సి వచ్చింది. ఇందులో భాగంగా రూపొందించిందే సట్లెజ్‌`యమున లింక్‌ కెనాల్‌ (ఎస్‌వైఎల్‌) పథ కం. అయితే విభజన చట్టాల ప్రకారం తమ రాష్ట్రంలోని నీటిని పంపిణీ చేయాల్సిన అవసరంలేదంటూ పంజాబ్‌ ఈ ఒప్పందాన్ని తిరస్కరించింది. తర్వాతికాలంలో సామరస్య వాతావరణం నెలకొన్ని నేపథ్యంలతో1981లో రెండు రాష్ట్రాలు ఎస్‌వైఎల్‌జలాలను పంచుకోవాలని ఒక అంగీకారానికి వచ్చాయి. దీంతో పంజాబ్‌లోని కాపూరీ గ్రామంలో ఈ కాల్వ తవ్వకాన్ని ప్రారంభించారు.ఈ కాల్వ మొత్తం పొడవు 214 కి లోమీటర్లు. ఇందులో 122 కిలోమీటర్లు పంజాబ్‌లో, 92 కిలోమీటర్లు హర్యానాలో కాల్వ కొనసాగుతుంది. అ యితే హర్యానా తనకు కేటాయించిన ప్రాజె క్టు పనులను పూర్తిచేయగా, పంజాబ్‌ మాత్రం 1982 నుంచి ఇప్పటివరకు దీన్ని పూర్తిచేయలేదు. కాగా ఈ కాల్వ విషయంలో పంజాబ్‌లో తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు చోటుచేసుకొని చివరకు దేశ భద్రతకు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దీంతో1985 లో అప్పటి ప్రధానిరాజీవ్‌గాంధీ, అకాళీదళ్‌ అధినేత సంత్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీని నిర్ణయించేందుకు ఒక కొత్త ట్రై బ్యునల్‌ ఏర్పాటుకుఈ ఒప్పందం వీలు కల్పించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బాలకృష్ణ ఎరాడీ నేతృత్వం లో ట్రిబ్యునల్‌ ఏర్పాటైంది. 1987లో ఈ ట్రైబ్యునల్‌ తన నివేదికను సమర్పించింది. ఈ నదీ జలాల్లో పంజాబ్‌కు 5ఎంఏఎఫ్‌, హర్యానాకు 3.83 ఎంఏఎఫ్‌నీటిని పంపిణీ చేయాలని ట్రైబ్యునల్‌ సిఫారసు చేసింది. అయితే ఈ ప్రాజెక్టు ఎంతకూ ముందుకు పోకపోవడంతో హర్యానా 1996లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కాల్వ పనులను పూర్తిచేయాలని 2002లో సుప్రీంకోర్టు పంజాబ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించగా, 2004లో ఈ ఒప్పందాన్నే రద్దు చేస్తూ పంజాబ్‌ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీని చట్టబద్ధతపై విచారించిన సుప్రీంకోర్టు, పంజాబ్‌ ప్రభుత్వం ముందుగా తాను అంగీకరించిన ఒప్పందం నుంచి పంజాబ్‌ పక్కకు తప్పు కోవడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పింది. అంతేకాదు కేంద్రం మధ్యవర్తిత్వంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపి ఎస్‌వైఎల్‌పై ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్దేశించింది. అయితే పంజాబ్‌ మాత్రం తమ నదీజలాలను పంచుకోవడానికి ఇష్టపడటంలేదు. ఇప్పటికే రాష్ట్రంలో భూగర్భ జలాలను విపరీ తంగా వినియోగిస్తున్న నేపథ్యంలో 2029 తర్వాత క్షామ పరిస్థితులు నెలకొంటాయని పంజాబ్‌ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా గతంలో మాదిరి కాకుండా తగ్గిపోతుండటం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోం ది. ఇప్పటికే రాష్ట్రంలోని 79శాతం భూభాగంలోని నీటిని విపరీతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో నీటిని పంచుకునే అవకాశం లేదని పంజాబ్‌ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. అయితే హర్యానా మా త్రం తమకు రావలసిన న్యాయమైన వాటా నీటిని కూడా పంజాబ్‌ విని యోగిస్తున్నదని ఆరోపిస్తోంది. తమ రాష్ట్రంలో భూగర్భ జలాలు 1700 అడుగుల కిందికి పడిపోయిన నేపథ్యంలో, దక్షిణ ప్రాంతంలో తాగునీటికే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని హర్యానా పేర్కొంటున్నది. ఈ నేప థ్యంలో ట్రైబ్యునల్‌ తమ వాటాగా పేర్కొన్న నీటిని అందించాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఈవి ధంగా రెండు రాష్ట్రాల మధ్య ఎస్‌వైఎల్‌ ఒక రావణకాష్టంగా మారింది.

కోర్టు ఆదేశంతో రగడ మొదలు

అసలు పంజాబ్‌లో ఎస్‌వైఎల్‌కు సంబంధించి భూసేకరణ, సర్వే ఎంతవవరకు వచ్చాయో తెలుసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గత అక్టోబర్‌ 4న అదేశించింది. కోర్టు ఆదేశించిన మరునాడే, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఒక ప్రకటన చేస్తూ ‘హర్యానాతో నీటి పంపకం ఒప్పందం తమకు లేనందువల్ల ఈ కాల్వ నిర్మాణం చేపట్టే ప్రసక్తే లేదు’ అని కుండబద్దలు కొట్టారు. అప్పటి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అసలు సమస్యపై ఆయనకు అవగాహన లేదంటూ దెప్పి పొడిచా రు. ఈ విషయంలో హర్యానా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం వున్నదన్నారు. అయితే పంజాబ్‌లోని పార్టీల వైఖరి మాత్రం కాల్వ నిర్మాణానికి వ్యతిరేకంగానే వుంది. కాల్వ నిర్మాణం ద్వారా హర్యానాతో నీటిని పంచుకోవడమంటే పంజాబ్‌ రైతులను ఆత్మహత్యలకు పురికొల్పడమేనని కాంగ్రెస్‌, శిరోమణి అకాళీదళ్‌ వంటి విపక్ష పార్టీలు పేర్కొంటున్నాయి. ఏతావాతా చెప్పాలంటే సరిహద్దు రాష్ట్రాల్లో ఈవిధంగా నీటి జగడాలు కొనసాగడం వర్తమాన ఉద్రిక్త పరిస్థితుల్లో ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. సింధూ జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో ఈ నదీ జలాలకు చెందిన చుక్క నీరు కూడా పాకిస్తాన్‌లోకి వెళ్లకూడదనేది కేంద్రం ఉద్దేశం కాగా, పట్టువిడుపులు ప్రదర్శించకుండా పంజాబ్‌లోని ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం వ్యవహరించడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే హర్యానాకు నదీ జలాల విడుదలకు కేంద్రం ఆదే శించాల్సి వచ్చిందనుకోవచ్చు.

‘‘భూమి పుత్రుడి’’ పట్టుదల ‘‘భూ భారతి’’!..రైతుల కలలు నిజం చేసిన ‘‘పొంగులేటి’’.

`ధరణి దారిద్య్రం పారదోలారు.

`భూ భారతి ఒక నూతన విప్లవం.

`రైతుల కళ్లలో నిండుతున్న సంతోషం.

`రైతులకు భోరోసా నింపుతున్న గొప్ప నూతన ఆవిష్కారం.

`ఆరేళ్ల రైతు గోసకు చరమగీతం.

`భూ భారతి తెచ్చి రైతులకు సంజీవని చేశారు.

`ధరణిలో ఎదురైన 15 సమస్యలకు భూ భారతిలో పరిష్కారం చూపారు.

`ఆరేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న అవస్థలను తొలగిస్తున్నారు.

`ఆన్‌ లైన్‌ మోసాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.

`ప్రతి తహసీల్దారు కార్యాలయంలో నలుగురు ప్రత్యేక సిబ్బందితో జాప్యం లేకుండా చూస్తున్నారు.

`కాలయాపన లేని శీఘ్రతర పరిష్కారం కనుగొన్నారు.

`వేలాది మంది రైతుల సమస్యలు తీర్చుతున్నారు.

`పచ్చని పల్లెలో పెట్టిన ధరణి చిచ్చును ఆర్పుతున్నారు.

`రైతుల మధ్య ధరణి పెంచిన వైషమ్యాలను చెక్‌ పెడుతున్నారు.

`భూ భారతి తెచ్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారు.

`మళ్ళీ పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నారు.

`రైతుల మధ్య వైషమ్యాలు లేకుండా ఆగోగ్యకరమైన సుహృద్భావం ఏర్పరుస్తున్నారు.

`పరిష్కారం కావని తెల్లబోయిన రైతుల సమస్యలు చిటికెలో నెరవేర్చుతున్నారు.

`పైలెట్‌ ప్రాజెక్టులోనే అద్భుతమైన ఫలితాలు చూస్తున్నారు.

`రాష్ట్ర వ్యాప్త అమలుతో రైతులు వేడుకలు చేసుకోనున్నారు.

`ధరణి దుర్మార్గం నుంచి బైడపడి ఊపిరిపీల్చుకుంటున్నారు.

`జీవితకాలం శిక్షలా మారిన ధరణి దరిద్రం పోయినందుకు సంబరపడుతున్నారు.

`దటీజ్‌ ‘‘పొంగులేటి’’ అని రైతులు కొనియాడుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 పట్టుదలకు మారు పేరు రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అది రాజకీయంగానైనా, పాలనా పరంగానైనా తన చిత్త శుద్ది ఎంత గొప్పదో అనేక సార్లు నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తర్వాత రాష్ట్రంలో ఎక్కువగా కష్టపడుతున్నమంత్రి ఎవరు అనే ప్రశ్నకు ఒకటే సమాధానం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఆయన వున్నంత ఆక్టివ్‌గా మరే మంత్రి కూడా లేరన్న వార్తలున్నాయి. రాజకీయంగా ఆయన ఎప్పుడూ ఎంత ఆక్టివ్‌గా వుంటారో..మంత్రిగా పాలనా పరంగా కూడా అంతకు మించి దూకుడుగా వుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రభుత్వం తన పని తీరును ప్రజలు హర్షించేలా చూసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేరు తెస్తున్నారు. ముఖ్యంగా ధరణి విషయంలో ఆయన చూపిన శ్రద్ద అంతా ఇంతా కాదు. అంతే కాదు ఇంత తొందరగా భూభారతి అమలులోకి వచ్చిందటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చూపిన చొరవ హర్షనీయమనే చెప్పాలి. అటు అధికారులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, భూభారతి డెవలప్‌ మెంటుపై చర్చలు పెట్టారు. సమీక్షలు చేపట్టారు. దానిపై విసృతమైన చర్చ జరిగేలా చూశారు. అందరి సూచనలు, సలహాలు తీసుకున్నారు. రైతుల సమస్యలపై అధ్యయనం చేయించారు. అందిరకీ ఆమోదయోగ్యమైన కార్యక్రమంగా భూ భారతి రూపు దిద్దేలా చేశారు. భూ పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. రాజకీయంగా కూడా అంతే ..ఆయన తలపెట్టిన ఏ కార్యక్రమమైనా సరే దిగ్విజయంకోసం పని చేసే విధానం అందిరకీ నచ్చేలా వుంటుంది. తన ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి తన దారిలో అడ్డంకులు ఎదుర్కొన్నారు. తన దారికి అడ్డు పడిన పుల్లలను పూచిక పుల్లలుగా తొక్కుకుంటూ పైకొచ్చారు. నాయకుడికి ధైర్యం కూడా ఎంతో ముఖ్యమనేది శ్రీనివాస్‌రెడ్డి నిరూపించారు. తొలుత ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎదురులేని నాయకుడిగా వచ్చారు. కాని కొందరి మాటలు నమ్మి తన అడుగులకు ఆయన ముందర కాళ్లకు బంధం వేసుకున్నారు. అది తొందరగానే గ్రహించారు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదు. వ్యక్తిగత ప్రతిష్టతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజా సేవలో ఎవరూ చేయలేనంత సేవ చేసి ప్రజల మన్నననలు పొందారు. నాయకుడికన్నా, ముందుకు ప్రజా సేవకుడిగా ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు. ఆయనను రాజకీయంగా ఆదరించారు. రాజకీయాల్లోకి వస్తూ వస్తూనే ఆయనతోపాటు ఎంతో మందిని నాయకులను చేశారు. ఎంతో మంది నాయకులకు రాజకీయ జీవితం ఇచ్చారు. తనతో పాటు సమానమైన హోదా కల్గిన ప్రజా ప్రతినిధులుగా తయారు చేశారు. అలాంటి నాయకుడికి కూడా అడ్డంకులు ఏర్పరిచారు. నమ్మిన వాళ్లే ఆయనను వెన్ను పోటు పొడిచారు. అయినా ఆయన కుంగిపోలేదు. లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు. ప్రజా సేవలో ఆయన మడమ తిప్పలేదు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన వెనుదిగిరి చూడలేదు. అందుకే ఆయన రాజకీయాలను శాసించే స్ధాయికి ఎదిగారు. తన సొంత జిల్లాలో రాజకీయాలను తన కనుసైగలతో శాసించే స్ధాయికి ఎదిగారు. అదీ ఒక నిబద్దత వున్న నాయకుడి అంకితభావం అని నిరూపించారు. ఖమ్మం అంటే పొంగులేటి అంటే ఖమ్మం అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలకు పెద్దదిక్కుగా మారారు. ఉమ్మడి ఖమ్మం ప్రజలకు పెద్దన్నగా సేవలు చేస్తున్నారు. అందుకే ఆయన ఖమ్మం జిల్లా ప్రజలకు ఏది చెబితే అది, ఎంతచెబితే అంత అన్నట్లు రాజకీయాలను శాసించగలుగుతున్నారు. గతంలో ఎంత పెద్ద నాయకుడు కూడా చేయలేని సాహసాలు చేశారు. రాజకీయంగా సవాళ్లు విసిరారు. ఎదరులేదనుకున్న బిఆర్‌ఎస్‌ను మట్టికరిపించారు. తాను చేసిన శపధాన్ని నిలబెట్టుకున్నారు. అలా శపథం చేసి నిలబెట్టుకున్న నాయకులు చరిత్రలో ఒక్క పొంగులేటి తప్ప మరే నాయకుడు లేదు. విజయం సాధించిన నాయకుడు శ్రీనివాస్‌ రెడ్డికి తప్ప మరెవరికీ సాధ్యం కాలేదు. అలాంటి నాయకుడు పాలనలో భాగస్వామి అయితే ఎలా వుంటుందో కూడా చూపిస్తున్నారు. తన శాఖకు వన్నె తెస్తున్నారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తేవడం వల్ల కొన్ని లక్షల మంది రైతులు ఆగమయ్యారు. తాతల తరాల నుంచి లేని ఇబ్బందులు గత ప్రభుత్వం ధరణి తెచ్చి రైతుల నెత్తిన పిడుగులు వేశారు. నిజాం కాలం తర్వాత అత్యుత్తమైన భూ విధానం తీసుకొస్తామని చెప్పి, చిల్లం చిల్లంచేశారు. ప్రశాంతంగా వున్న పల్లెల్లో లేని పోని సమస్య సృష్టించారు. ఎవరి భూములు ఎటు వెళ్లాయో తెలియకుండాపోయాయి. రైతుల మధ్య కలతలు చెలరేగాయి. భూ వివాదాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఎంతో మంది అన్నదమ్ముల మధ్య కొట్లాటలు తెచ్చాయి. కుటుంబాలలో పగలు రగించాయి. అయినా అంతా బాగుందంటూ గత ప్రభుత్వ మసి బూసి మారేడు కాయ చేయడానికే ప్రయత్నం చేసింది. దాంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. రైతులు తమ భూములను తామవే అని చెప్పుకోవడానికి కూడా ఆరేళ్లపాటు నరకం చూశారు. లక్షలు ఖర్చు చేసుకున్నారు. అప్పుల పాలై ఆగమాయ్యారు. తమ భూములు తమకు కాకుండా చేసిన గత ప్రభుత్వాన్ని దింపేశారు. ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు హమీ ఇచ్చినట్లే కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్కువ సమయంలోనే భూ భారతిని తెచ్చింది. భూ భారతి కోసం మంత్రి పొంగులేటి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ప్రజలకు వీలైనంత తొందరగా మేలైన పనులు చేయాలని, వారికి ఊరట కల్గించాలని, భరోసా కల్పించాలని మంత్రి పొంగులేటి దగ్గరుండి భూ భారతి రూపకల్పన చేయించారు. రైతుల కళ్లలో ఆనందం నింపారు. ఆరేళ్లపాటు పడరాని పాట్లు పడిన రైతులు ఇప్పుడు భూ భారతి వల్ల ఎంతో మేలు పొందుతున్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా చిటికెలో పరిష్కారమయ్యేలా పోర్టర్‌ రూపొందించారు. రైతులకు కొత్త లోకాన్ని ఆవిష్కరించారు. తమ భూములపై రైతులకు కొండంత ధైర్యం భూ భారతితో నింపారు. అందుకు ప్రజలు కూడా మంత్రి పొంగులేటి కృషిని ప్రశంసిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలలో ప్రముఖంగా ఆన్‌లైన్‌ పట్టాలున్నా రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వలేదు. దాంతో ఎంతో మంది రైతుల పాసు పుస్తకాల కోసం నిత్యం తహసిల్ధార్‌, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ఇక భూదాన్‌, వక్ఫ్‌, దేవాదాయ భూములంటూ పట్టా లాండ్స్‌ను కూడా పివోబిలో నమోదు చేయడం వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. ధరణిలో రైతుల పేరిట వుండాల్సిన భూముల కంటే తక్కువ విస్తీర్ణం చూపించిన సందర్బాలు అనేకం వున్నాయి. వీటిపై ఎన్ని పిర్యాధులు వచ్చినా అప్పటి పాలకులు స్పందించలేదు. సర్వేనెంబర్లు మిస్‌ చేశారు. సాదాబైనామాలు కూడా రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి పదేళ్లు కాలయాపన చేశారు. ఆ భూములకు కూడా లేని పోని సమస్యలు సృష్టించారు. ఇలా ధరణిపోర్టలో 15 రకాల సమస్యలు సృష్టించినట్లు గుర్తించారు. ఇక రైతులు అందరూ ఆన్‌లైన్‌లో ధరకాస్తు చేసుకోవాలనడం సాద్యం కాని పని. రైతులు ఎలాంటి కాగితం మీద పిర్యాదు ఇచ్చినా తీసుకునేలా భూ భారతికి వెసులుబాటు కల్పించారు. ప్రతి తహసిల్ధార్‌ కార్యాలయంలో కనీసం నలుగురు సపోర్టింగ్‌ టీమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా రైతులు పడరాన్ని పాట్లు పడుతున్నారు. వాటి నుంచి సత్వర విముక్తి కావాలని ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో ఆలోచిస్తోంది. అంతే కాకుండా భూ భారతిలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామాల్లోనే సదస్సులు ఏర్పాటు చేసి, రైతుల నుంచి పిర్యాధులు స్వీకరించాలి. అప్పుడు పొరపాట్లు జరగడానికి ఒక్క శాతం కూడా ఆస్కారం వుండదు. ప్రజలందరి ముందు రైతులు తప్పుడు పిర్యాధులు చేసుకునేందుకు కూడా వీలుండదు. ఎందుకంటే గ్రామాలల్లో ఏ రైతు భూమి ఏమిటన్నది దాదాపు అందరికీ అవగాహన వుంటుంది. ఒక వేళ ఎవరైనా తప్పుడు పిర్యాదులు చేయాలని చూసినా వెంటనే తెలిసిపోతుంది. పైగా రైతులకు సులభమైన రీతిలో అర్ధమయ్యేలా ఫార్మేట్‌ రూపొందించారు. ఇలా రైతులకు అన్ని రకాలుగా వెసులుబాటు కల్పించేలా చట్టం రూపకల్పన జరిగింది. రైతులకు ఎంతో మేలు చేసేలా రూపకల్పన జరిగింది. లేని పోని గొప్పలకు పోయి, గత ప్రభుత్వం తెచ్చిన ధరణి మూలంగా ఎంతో మందిరైతులు మానసిక వేధనకు గురయ్యారు. తట్టుకోలేని ఎంతోమంది చనిపోయారు. ఎన్నో రైతు కుటుంబాలు సమస్యలు ఎదుర్కొన్నాయి. వాటన్నింటికీ ఒక్కటే పరిష్కారం భూ భారతి. రైతుల కలలు నెరవేరుస్తోంది. అది శ్రీనివాస్‌ రెడ్డి నిబద్దతను నిరూపిస్తోంది.

ఎనుమాముల పోలీస్‌ స్టేషన్ ను సందర్శించిన.!

ఎనుమాముల పోలీస్‌ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
ఏనుమాముల, నేటిధాత్రి
https://youtu.be/GCpLX43wfVs?si=qoAdJYysMaLnnAWn
వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ మంగళవారం మామూనూర్ డివిజన్‌ పరిధిలోని ఏనుమాముల  పోలీస్‌ స్టేషన్ను సందర్శించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా  బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఎనుమాముల పోలీస్‌ స్టేషన్ను సందర్శించిన పోలీస్‌ కమిషనర్‌ ముందుగా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు పరిశీలించారు. అనంతరం స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది వివరాలను సిపి సంబంధిత స్టేషన్‌ ఇన్స్‌స్పెక్టర్‌ రాఘవేందర్ ను అడిగి తెలుసుకొవడంతో పాటు, స్టేషన్‌ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి. 
Commissioner
స్టేషన్‌ పరిధిలో ఎన్నిసెక్టార్లు వున్నాయి, సెక్టార్‌వారిగా ఎస్‌.ఐలు నిర్వహిస్తున్న విధులు, వారి పరిధిలోని రౌడీ షీటర్లు, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత సెక్టార్‌ ఎస్‌.ఐని అడిగి తెలిసుకోవడంతో పాటు  స్టేషన్‌వారిగా బ్లూకోల్ట్స్‌ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ అధికారులకు పలుసూచనలు చేస్తూ ప్రతి స్టేషన్‌ అధికారి తప్పనిసరిగా రౌడీ  షీటర్ ఇండ్లను సందర్శించి వారి స్థితిగతులపై ప్రత్యక్షంగా ఆరా తీయాలని, ఆర్థిక సైబర్‌ నేరాలకు సంబంధించి కేవలం కేసు నమోదు చేయడమే తమ బాధ్యతనే కాకుండా సైబర్‌ నేరాలకు సంబంధించి నేరానికి పాల్పడిన నేరస్థుల మూలాల కూడా దర్యాప్తు అధికారులు కనిపెట్టి నిందితులను అరెస్టు చేయాలని.
Commissioner
ట్రైసిటి పరిధిలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి క్రయ విక్రయాలపై స్టేషన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణకై నిరంతరం పనిచేయాలని. నేరాల నియంత్రణకై విజుబుల్‌ పోలీసింగ్‌ అవసరమని, ఇందుకొసం నగరంలో నిరంతం పోలీసులు పెట్రొలింగ్‌ నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ అధికారులకు సూచించారు.
పోలీస్‌ కమిషనర్‌ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామూనూర్ ఏసిపి తిరుపతి ఇన్స్‌స్పెక్టర్ రాఘవేందర్,  స్టేషన్‌ ఎస్‌.ఐ రాజు, పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.

మున్న నూరులో భూ భారతి.!

మున్న నూరులో భూ భారతి రెవెన్యూ సదస్సులో కలెక్టర్

వనపర్తి నేటిధాత్రి :

 

 

ప్రజా పాలన ప్రగతి బాట సందర్భంగా
వనపర్తి జిల్లా మున్ననూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ భూబారతి సదస్సులో జిల్లా ఆదర్శ్ సురబి అధికారులు పాల్గొన్నారు

అటవీ అభివృద్ధి సంస్థ.!

అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

జైపూర్ నేటి ధాత్రి:

జైపూర్ మండలం లోని కాన్కుర్ శివారులో నీలగిరి ప్లాంటేషన్లలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు మంగళవారం మజ్జిగ ను పంపిణీ చేశారు.తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ )దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఇక్కడి నీలగిరి ప్లాంటేషన్ లలో మట్టి తేమ సంరక్షణ పనులు చేస్తున్న కూలీలకు సామజిక సేవ కింద ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమం లో తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్,గ్రామ కార్యదర్శి ఉపేందర్,ఫీల్డ్ సూపర్ వైసర్ లు రాజేష్,శ్రీనివాస్,వాచర్ లు శంకర్,సాయికిరణ్,ఓదెలు, రాకేష్,సిబ్బంది షాహిద్, సంజీవ్ లు పాల్గొన్నారు. ‎

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
-వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి

తొర్రూరు( డివిజన్ )నేటి ధాత్రి

 

 

 

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమానుల తిరుపతిరెడ్డి అన్నారు.

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ
పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు మండలంలోని చర్లపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పైండ్ల సోమయ్య, పైండ్ల మహేందర్ ల పైండ్ల కేశమల్లు అనారోగ్యంతో మృతి చెందగా మంగళవారం బాధిత కుటుంబాన్ని సందర్శించి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రెడ్డిల సహకారంతో బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామన్నారు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు బాధిత కుటుంబాలకు సకాలంలో అందించే విధంగా కృషి చేస్తామన్నారు.
ప్రమర్శించిన వారిలో కాంగ్రెస్ నాయకులు పెదగాని సోమయ్య, అనుమాండ్ల నరేందర్ రెడ్డి,చెవిటి సధాకర్,కొమురయ్య,బిజ్జాల వరప్రసాద్, నాగిరెడ్డి,రవీందర్ రెడ్డి,మహేందర్ రెడ్డి, మహబూబ్ రెడ్డి, వెంకన్న యాదవ్,వాసు రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మహేందర్, శ్రీనివాస్, ప్రవీణ్ రెడ్డి,దర్గయ్య,యాకన్న, చిట్టి మల్ల మహేష్, బుచ్చిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ధర్మారపు నాగయ్య,రామ్ రెడ్డి, సుధాకర్,వెంకన్న, నరసింహ యాకుబ్ రెడ్డి,ఎద్దు మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పరువుతీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ పరువుతీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..

చెప్పుల దొంగగా అభివర్ణించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

*తెలంగాణను దివాలా రాష్ట్రంగా చిత్రీకరించిన రేవంత్ *

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాజ ద్రోహం కేసుపెట్టాలి..

ప్రజలు,ఉద్యోగుల మధ్య విబేధాలు సృష్టిస్తూ సీఎం సలహాలు

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

చెప్పుల దొంగల్లాగా ఢిల్లీలో తనను బ్యాంకర్లు చూస్తున్నారని ఒక ముఖ్యమంత్రి స్వయంగా అభివర్ణించుకోవడం దురదృష్టకరం దేశం ముందు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల పరువుతీస్తున్నారని తెలంగాణ ఉద్యమనేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.ఒక ముఖ్యమంత్రి దేశ రాజదాని డిల్లీలో చెప్పుల దొంగగా కనబడితే స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.గత కెసిఆర్ ప్రభుత్వం, ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే అప్పులు చేయడం జరిగిందని, దేశంలో తెలంగాణ కన్న 28 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు చేశాయి. మిగతా రాష్ట్రాలలో ఈ పరిస్థితి లేనప్పుడు తెలంగాణకే ఈ స్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే అని పేర్కొన్నారు.ఎన్నికల ముందు అధికారం కోసం అడ్డగోలు 420 హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
తను తెలంగాణలో లేనట్టుగా తనకేమి తెలియనట్టుగా కొత్తగా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది. దివాలా చేసింది. ఆనా పైసా రావడం లేదు. అని చెప్పడం అనేది ఇచ్చిన హామీల నుండి తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.సోమవారం ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు విన్నాక ఈ రాష్ట్రంలో ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకచ్చి పనులుచేయలేని పరిస్థితి ఉంది.ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కీలకమైన పథకాల అమలు కూడా కష్టసాధ్యమే అనిపిస్తుందని ఆయన చెప్పారు.
రాబోయే రోజుల్లో ఇతర దేశాలు,రాష్ట్రాల నుండి తెలంగాణలో కంపెనీలలో పెట్టబడులు పెట్టకుండా ఉద్యోగాల కల్పన జరగకుండా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సూచిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు ఎక్కడ నిలదీస్తారో,ఎదురు తిరుగుతారో అనే భయంతో పరిపాలన చేతకాదు. హామీలు అమలు చేయలేము అని మూడున్నర సంవత్సరాల ముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు.ఇందిరమ్మ ఇండ్లు ,యువ వికాసం, మహాలక్ష్మి, రైతు భరోసా,రుణమాఫీ,కళ్యాణ లక్ష్మి తులం బంగారం,పెన్షన్ల పెంపు లాంటి పథకాల అమలుపైన ప్రజలు ఇప్పటికే నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు.
దేశంలోనే అత్యధిక జీడీపీని కలిగి దేశానికి అత్యధికంగా జీఎస్టీ చెల్లించే స్థాయికి ఎదిగిన తెలంగాణను నేడు అప్పులు పుట్టని రాష్ట్రంగా మారిందని చెప్పడం తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమే దివాలా రాష్ట్రంగా చిత్రీకరించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలా కోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.పరిపాలన అనుభవం లేని ముఖ్యమంత్రి,మంత్రులకు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని వీరిపైన రాజద్రోహం కేసుపెట్టాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు ఉద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ సేవలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టారని,మేనిఫెస్టోలో వారికి ఇచ్చిన హామీలను అమలుపట్ల అడగడం నేరమా అని ప్రశ్నిస్తూ ఉద్యోగుల కోసం సంక్షేమ పథకాలు ఆపమంటారా అని చెప్పడం ప్రజలకు ఉద్యోగులకు మధ్య విభేదాలు సృష్టించడమే సీఎం రేవంత్ రెడ్డి పని అని అవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర కీలకమైందని వారి హక్కుల సాధనకు ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ వెంట ఉంటుందని వెంటనే ఉద్యోగులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చాలని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.

హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య గారికి వినతి పత్రం.!

హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య గారికి వినతి పత్రం ఇచ్చిన వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య
వర్దన్నపేట (నేటిదాత్రి ):

 

వ్యవసాయ మార్కెట్ కమిటీ వర్ధన్నపేట పరధిలోని ఐనవోలు మండలములో రైతుల సౌకర్యార్ధము మార్కెట్ సబ్ యార్డు ఏర్పాటు కొరకు 6 ఏకరముల ప్రభుత్వ భూమి కేటాయించగలరని ఈ రోజు వర్ధన్నపేట మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీ నరుకుడు వెంకటయ్య హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య ని కలిసి కోరడం జరిగినది. గతములో ఐనవోలు తహసీల్దార్ గారు 5 ఏకరముల భూమిని గుర్తించడం జరిగినది. కానీ అట్టి భూమి మార్కెట్ సబ్ యార్డుకు కేటాయించబడలేదు. అందుకు గాను ఐనవోల్ గ్రామపంచాయతీ పాలక వర్గం వారు గ్రామ రెవిన్యూ పరిదిలో ఆరు ఏకరముల ప్రభుత్వ భూమినీ గుర్తించి తీర్మానం చేసి అప్పటి కలెక్టర్ కి కూడా దరఖాస్తులు కూడా చేయడం జరిగింది అయితే వర్ధన్నపేట ఎంఎల్ఏ కేఆర్ నాగరాజు కూడా స్థల పరిశిలిన చేసి హన్మకొండ కలెక్టర్ గారికి ఎంఎల్ఏ నాగరాజు ల్యాండ్ ఉంది సంక్షన్ ఇవ్వండి అని రేక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది.కేటాయిస్తే సబ్ యార్డు నిర్మాణం, అందులో గోదాము మరియు కవర్ షెడ్డు నిర్మాణాలు చేపట్టవచ్చునని మరియు ఇట్టి యార్డు ఏర్పాటు చేస్తే ఐనవోలు మండల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది అని కలెక్టర్ గారిని ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య కోరడము జరిగినది.కలెక్టర్ గారిని కలిసిన వారిలో బ్లాక్ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి,వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోషాల వెంకన్న గౌడ్.లు పాల్గొన్నారు.

అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో.!

అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీధి సౌర కాంతి సామాగ్రి పంపిణీ

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం లోని కాన్కుర్ గ్రామంలో తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో మంగళవారం వీధి సౌర కాంతి సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది.అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కార్పొరేట్ సామాజిక భాద్యత (సి. ఎస్. ఆర్ ) కింద ముప్పై ఆరు వేల విలువ చేసే వీధి సౌర కాంతి సామాగ్రి ని డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి చేతుల మీదుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉపేందర్ కు అందజేశారు.ఈ సందర్బంగా శ్రీశ్రావణి మాట్లాడుతూ జైపూర్ మండలంలోని కాన్కుర్, ముదిగుంట అటవీ ప్రాంతాల్లో టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో నీలగిరి ప్లాంటేషన్ లను పెంచుతూ పర్యావరణ పరిరక్షణ తో పాటు స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. గ్రామాలకు తమ వంతు సేవ చేయాలనే ఉద్దేశ్యం తో సి. ఎస్. ఆర్ కింద టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమం లో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్, ఫీల్డ్ సూపర్ వైసర్ లు రాజేష్, శ్రీనివాస్,వాచర్ లు శంకర్,సాయికిరణ్,ఓదెలు, రాకేష్,సిబ్బంది షాహిద్, సంజీవ్ లు పాల్గొన్నారు.

రెచ్చిపోయి వసూళ్లు.

రెచ్చిపోయి వసూళ్లు.

పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.

ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.

మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి లో ఇదే తంతు.

అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.

దర్జాగా వసూళ్ల సాక్షాలు అయిన టీఎస్ఎండిసి నిశ్శబ్దం, అమ్ముడుపోయిందని ప్రజలకు అర్థం.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, టీజీఎండిసి శాఖ కాసులకు కక్కుర్తి పడడం, కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు చేసుకొని అక్రమ వసూళ్లకు సహకరించడం యదేచ్చగా కండ్ల ముందు అక్రమ వసూళ్ల దందాను టీజీఎండిసి సిబ్బంది తోపాటు కాంట్రాక్టర్ సిబ్బంది వసూళ్ల పరంపరను కొనసాగిస్తున్నప్పటికీ టీజీఎండిసి ఉన్నత అధికారులు మరోవైపు ప్రభుత్వం అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం తో మండలంలోని ఇసుక రీచులు అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రెచ్చిపోయి కొనసాగించడం జరుగుతుంది. మరోవైపు పక్క జిల్లాలకు సంబంధించిన ఇసుక రీచుల కాంట్రాక్టర్లు హద్దులు దాటి గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాన్ని చేసి ఇసుకను రవాణా కొనసాగిస్తుంటే ప్రభుత్వం టీజీఎండిసి అధికారులు చర్యలకు ససేమీరా అనడం తో కాంట్రాక్టర్లు ఇసుక రీచుల్లో అక్రమాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. అక్రమాలపై టీజీఎండిసి చర్యలు తీసుకోకపోవడం, ఇసుక రిచుల్లో అక్రమాల వ్యవహారం అదునపు వసూళ్లు తీసుకుంటున్న టీజీఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ సూపర్వైజర్ లా ఫోటోలు వీడియోల సాక్షాలు వచ్చినా కూడా ఇప్పటివరకు ఒక్క క్వారీపై కూడా చర్యలు తీసుకోలేదంటే టీజీఎండిసి కిందిస్థాయి నుండి పై స్థాయి అధికారి వరకు కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయారని స్పష్టంగా కనబడుతుంది.

 

పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.

సోమవారం రోజు పలుగుల తొమ్మిది ఇసుక క్వారీలో కాంట్రాక్టర్ సిబ్బంది లారీ డ్రైవర్ నుండి 1100 రూపాయలు సీరియల్ పేరుతో వసూలుచేస్తూ. తరువాత లోడింగ్ కొరకు సీరియల్ నంబర్ చిట్టిని అందించాడు. ఈ క్వారీలో గత నెల రోజులు నుండి పెద్ద మొత్తంలో అన్ని క్వారీల కంటే ఎక్కువగా వసూళ్ల పరంపర కొనసాగుతుందని, దానికి సంబంధించిన సాక్షాలు గత నెలలో 1200 తీసుకున్న పలుకుల 9 ప్రస్తుతం 1100 వందలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు లోడింగ్ వద్ద 200. వందల రూపాయలు గత నెలలో 1400 వసూలు చేయడం జరిగింది. ప్రస్తుతం 1300 పాసింగ్ పై అదనపు ఇసుకను తీసుకోవడం జరుగుతుంది. పలుగుల తొమ్మిది గత నెల ప్రతిరోజు 119 నుండి 148 వరకు లారీల్లో ఇసుక నింపి రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ మార్చ్ నెలలో నాలుగవ తేదీన ప్రారంభమై మొదట్లో ఆవరేజ్ 60 నుండి మొదలుకొని నేటి వరకు ప్రతిరోజు 100కు పైచిలుకు లారీల ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మూడు నెలల్లో సుమారు ఈ క్వారీ 60 రోజుల్లో 6000 లారీల ఇసుక రవాణా చేయడం జరిగింది. లారీకి 14 నుండి 1100 అక్రమ వసూళ్ల విషయానికొస్తే 65 నుండి 85 లక్షల రూపాల అక్రమ వసూళ్లను సొమ్ము చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లకు తెరలేపిన పలుగుల తొమ్మిది పై, టి జి ఎం డి సి కనీసం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు, మరి కొన్ని రోజుల్లో అక్రమ వసూళ్లతో తమ క్వాంటిటీని సమాప్తం చేసుకునే వరకు టీజీఎండిసి అధికారులు చూస్తూనే ఉంటారు.

 

TSMDC

ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.

మండలంలో ఇసుక క్వారీల అక్రమాల వ్యవహారం, సాక్షాలు వసూళ్ల పర్వం, నిబంధనలు దాటి తవ్వకాలు, యదేచ్ఛగా కొనసాగుతుంటే టి జి ఎం డి సి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, టీజీఎండిసి అధికారుల పుణ్యం కాంట్రాక్టర్లు రెచ్చిపోయి, తమకు అడ్డు ఎవరు అని అక్రమ వసూళ్ల వ్యవహారాలను తమ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మండలంలో నిర్వహించబడే ఇసుక రిచుల్లో పలుగుల తొమ్మిది మహదేవపూర్, పుసుక్ పల్లి 1, పలుగుల 8, ఈ రిచుల్లో పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్ల వ్యవహారాలను దర్జాగా కొనసాగించడం జరుగుతుంది. అంతేకాకుండా పక్క జిల్లా ఇసుక క్వారీలు కూడా గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాలు చేసి, కుంట్లం గోదావరి వద్ద అక్రమ తవ్వకాలు జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడుతు యదేచ్చగా అక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. కొత్తగా ఇసుక పాలసీ అమలులో ఉన్న క్రమంలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం టీజీఎండిసి పై చర్యలు తీసుకోవాల్సి ఉండగా నిశ్శబ్దాన్ని పాటించడం, అనేక అనుమానాలకు దారితీస్తుంది.

 

TSMDC

మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి, లో ఇదే తంతు.

మహదేపూర్ పుసుపుపల్లి1, పేరుతో నిర్వహించబడే ఇసుక క్వారీ లోను కూడా అక్రమ వసూళ్లకు హద్దు లేకుండా పోయింది. ఇక్కడ టీజీఎండిసి సిబ్బంది 900 రూపాయలు, సీరియల్ పేరుతో వసూలు చేయడం, లోడింగ్ వద్ద 200, కాంటా వద్ద అదనపు ఇసుకకు 300 నుండి 500, యథేచ్ఛగా కొనసాగడం జరుగుతుంది. ఈ ఇసుక క్వారీ మార్చ్ నెల ఆరవ తేదీన ,ప్రారంభించడం జరిగింది, కానీ కొద్ది రోజులు నామమాత్రంగా లారీలో ఇసుక నింపిన ఈ క్వారీ ఏప్రిల్ నెలలో, అక్రమ వసూళ్ల పరంపరను ప్రారంభించడంతో 60 నుండి మొదలుకొని 175 యావరేజ్ గా ప్రతిరోజు లారీల్లో ఇసుకను రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ ఇప్పటివరకు అక్రమ వసూళ్ల తో 45 లక్షల నుండి 60 లక్షల వరకు సొమ్ము చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం పలుకుల 8 ఇసుక క్వారీ స్థానికులకు భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడంతో లోడింగ్ నిలిచివేయడం జరిగింది, పలుకుల సిక్స్, పుసుక్ పల్లి ఒకటి, టీజీఎండిసి అధికారుల పుణ్యమని అక్రమ వసూళ్లు పెద్ద మొత్తంలో జరుపుకొని లక్షల రూపాయల సొమ్ము చేసుకుని ఇసుక క్వాంటిటీని సమాప్తం చేసుకోవడం జరిగింది.

 

TSMDC

అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.

అక్రమ వసూళ్ల వ్యవహారం మండలంలోని ఇసుక క్వారీలకు ఒక వరంగా అందించింది టీజీఎండిసి, అదుపు ఇసుక రవాణా నిలిపివేయడం, నూతన ఇసుక పాలసీ విధానం అమలు చేయడం జరుగుతుంది అని చెప్పిన ప్రభుత్వం, టీజీఎండిసి అధికారులకు ఇచ్చిన” డేడ్” లైన్ అధికారులు లెక్కచేయకుండా ప్రభుత్వ డెడ్ లైన్ ను
తీసిపారేశారు, గత వారం రోజుల క్రింద ఓ అధికారి” హోటల్లో మకాం వేసి, కాంట్రాక్టర్ అందరికీ తమ వద్దకు పిలుచుకొని, సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆ అధికారి విధులు కూడా హోటల్లోనే పూర్తి చేసుకున్నాడు. ఇలా అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే, అక్రమ వసూళ్ల పరంపర జోరుగా కొనసాగకుంటే, కాంట్రాక్టర్లు ఎందుకు ఊరుకుంటారు. అధికారుల హోటల్లో సిట్టింగ్ పరంపర, గత కొన్ని రోజులుగానే కొనసాగుతుందని చెప్తున్నారు, అందుకే ఏమో ఇసుక క్వారీల ప్రారంభం నుండి, అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం గా కనబడుతోంది. దర్జాగా వసూళ్ల సాక్షాలు అక్రమ ఇసుక తవ్వకాలు మైనింగ్ నిబంధనలకు తూట్లు పొడుస్తుంటే, టీజీఎండిసి అధికారులు చర్యలకు బదులు హోటల్లో” సిట్టింగ్ తో సెట్టింగ్” చేసుకోవడానికి, ప్రజలు గమనించి వాస్తవమే అక్రమాలకు చర్యలు కాదు, సిట్టింగ్లతో సక్సెస్ అయింది, ఇంకేముంది టిజీఎండిసి కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయిందని అక్రమ వసూళ్ల సాక్షాలు చెబుతున్నాయి అని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ టీజీఎండిసి అధికారులపై చర్యలకు ఆదేశించి, ఇసుక రీచుల్లో అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version