భగవద్గీత 700శ్లోకాలను కంఠస్థం చేసినమహిళలకు సత్కారం.

భగవద్గీత 700శ్లోకాలను కంఠస్థం చేసినమహిళలకు సత్కారం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ భగవద్గీత 700శ్లోకాలను కంఠస్థం చేసిన మహిళలకు సిరిసిల్ల గీతా ప్రచార సేవ సమితి ఘన సత్కారం గీతాశ్రమంలో ఉదయం 11 గంటలకు కోడo నారాయణ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య కార్య నిర్వహణలో జరిగిన సమావేశంలో గణపతి సచ్చిదానంద ఆశ్రమం మైసూర్ లో నిర్వహించిన 700 శ్లోకాల కంఠస్థం చేసిన నార్ల సంతోషి, కటకం లక్ష్మి, కటకం విజయ ,జి సంగీత, జి ప్రశస్తి, మహిళలకు బంగారు పతకం శాలువాతో సత్కారం పొందిన సిరిసిల్ల జిల్లా వాసులలో ముగ్గురు సిరిసిల్ల లోకల్ వారైతే ,ఆవునూరు వారు ఇద్దరూ ఒకే ఇంటి కుటుంబానికి చెందిన వారై తల్లి, కూతురు ఈ అవార్డులు పొందడం విశేషం. మహిళలకు.డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ విశేషంగా భగవద్గీత అంటే అర్థం పరమార్థం తెలిసిన ఈ ఐదుగురిని సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి ఘనంగా గీత ఆశ్రమంలో ఉదయం సన్మానించింది వీరికి శాలువా గ్రంథాలతో ఘనంగా నారాయణ నందగిరి స్వాముల చేతుల మీదుగా సన్మానించింది. భవిష్యత్తులో భావితరానికి భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేయించాల్సిందిగా గీత ప్రచార సేవా సమితి కోరింది. ఈ కార్యక్రమంలో గీత గజ్జెల్లి రామచంద్రం, మెరుగు మల్లేశం, కమలాకర్, మోర దామోదర్, కొక్కుల రాజేశం, గడ్డం కౌసల్య, అనసూయ, పత్తిపాక హరికిషన్ మొదలైన వారు సుమారు వందమంది దాకా పాల్గొన్నారు.

కరోనా రక్కసి.. గుబులు రేపుతోన్న కొత్త వేరియంట్..

కరోనా రక్కసి.. గుబులు రేపుతోన్న కొత్త వేరియంట్.. ఈ ప్రాంతాలకు అస్సలు వెళ్లకండి

 

నేటిదాత్రి :

 

 

 

 

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు,మరణాలు పెరుగుతున్నాయి.

దక్షిణాసియాలో దేశాలు చైనా, సింగపూర్, థాయ్ లాండ్ తర్వాత భారత్‌లో కోవిడ్ వ్యాప్తి పెరుగుతుంది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటి 4026 కి చేరింది..

గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు.

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు,మరణాలు పెరుగుతున్నాయి.

దక్షిణాసియాలో దేశాలు చైనా, సింగపూర్, థాయ్ లాండ్ తర్వాత భారత్‌లో కోవిడ్ వ్యాప్తి పెరుగుతుంది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటి 4026 కి చేరింది..

గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు.

మహారాష్ట్రలో రెండు కేరళ,తమిళనాడు,పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో మరణం నమోదు అయ్యింది..

యాక్టివ్ కేసుల్లో సగానికిపైగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ ,పశ్చిమ బెంగాల్ ,కర్ణాటకలోనే ఉన్నాయి ..

కేరళలో అత్యధికంగా 1416 యాక్టివ్ కేసులున్నాయి,మహారాష్ట్రలో 494, ఢిల్లీలో 393 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 37 మంది మృతి చెందారు.

కేరళలో తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతు 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు..

మహారాష్ట్రలో 70, 73 ఏళ్ల మహిళలు మృతి చెందారు..

తమిళనాడులో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న 69 ఏళ్ల మహిళ మృతి చెందారు.

పశ్చిమ బెంగాల్‌లో తీవ్రమైన కరోనరీ సిండ్రోమ్, సెప్టిక్ షాక్, తీవ్రమైన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళ మృతి చెందింది.

దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో 28,తెలంగాణలో 4 యాక్టివ్ కేసులున్నాయి..

ఒడిశాలో 15 యాక్టివ్ కేసులు,కర్ణాటకలో 311 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

2020-21-22 తరువాత కోవిడ్ కేసుల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది..

వైరస్ వేరియంట్లలో వస్తున్న మార్పులు ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణంగా గుర్తించారు వైద్య అధికారులు..

COVID 19 వేరియంట్ ఓమిక్రాన్ NB.1.8.1, భారతదేశం అంతటా కేసుల పెరుగుదలకు కారణం.

ఇది అంటువ్యాధి, పరివర్తన చెందే వ్యాప్తి చెందే లక్షణం కలిగింది..అందుకే ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది

కోవిడ్ లక్షణాలు..

 

జ్వరం, దగ్గు,జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులు, అలసట ముక్కు కారటం వంటివి తాజాగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ వేరియంట్ లక్షణాలుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)వెల్లడించింది… ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు బూస్టర్ డోస్ తీసుకున్న వారికి సైతం మారుతున్న వేరియంట్ల రీత్యా కోవిడ్ సోకే అవకాశం ఉంది… సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం , పరిశుభ్రత పాటించడం కోవిడ్ దరిచేరకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యలుగా కొనసాగుతున్నాయి..

దేశంలో కేసుల పెరుగుదల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ఆసుపత్రులకు,ప్రజలకు సూచనలు జారీ చేశాయి..

 

పడకల లభ్యత, ఆక్సిజన్ సిలిండర్లు పునరుద్ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలతో ఆసుపత్రులు హై అలర్ట్‌లో ఉంచాయి.

అనేక ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డులను సైతం ఏర్పాటు చేస్తున్నాయి..

ప్రస్తుత కోవిడ్ కేసుల పెరుగుదలతో భయపడవద్దని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు తెలియజేసింది.

13 బంతుల్లో మదగజంలా మీదదిపోయాడు..
పాములను పట్టి అడవిలో వదులుదామకున్నాడు..
కట్ చేస్తే..
పైకి చూసి మందు సిట్టింగ్ అనుకునేరు..
అసలు విషయం తెలిస్తే కోవిడ్ కేసుల పెరుగుదల..
కేంద్రానికి నోటీసులు..

 

దేశంలో కోవిడ్-19 మహమ్మారి ఇంకా ముగియలేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

కోవిడ్ శాంపిల్స్ సేకరణ, సేకరణ కేంద్రాలు,శాంపిల్స్ రవాణాకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది..

జనవరి 27, 2023న డివిజన్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులపై ప్రభుత్వం చర్య తీసుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ డాక్టర్ రోహిత్ జైన్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు..

కోవిడ్ శాంపిల్స్ సేకరణ విధానాలు, సేకరణ కేంద్రాల పనితీరు నమూనాల రవాణాకు కనీస ప్రమాణాలను ఏర్పాటు చేయడంపై ఇప్పటివరకు ఎటువంటి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయలేదని జైన్ పేర్కొన్నారు.

దీంతో కోవిడ్ పరీక్షల విధానంపై ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ (CGSC) మోనికా అరోరాను ఆదేశించింది.

తదుపరి విచారణ జూలై 18న కొనసాగనుంది.

రాజనగరం విలీన గ్రామాన్ని మున్సిపల్ అధికారులు.

రాజనగరం విలీన గ్రామాన్ని మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు

ఐక్యవేదిక అధ్యర్య ములో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం

వనపర్తి నేటిదాత్రి:

వనపర్తి మున్సిపాలిటీ కి విలీన గ్రామన్ని రాజనగరం అమ్మ చెరువు కట్టను అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పరిశీలించారు
గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన చెరువుల పునరుద్దీకరణ పనులు ఇంకా పూర్తి కాలేదని, కట్ట పైనుండి వెళ్లే దారిలో బ్రిడ్జి కావాల్సి ఉందని దాని వల్ల ప్రజలకు ఇబ్బందిగా ఉందని, దానిని వెంటనే పూర్తి చేయాలని, కట్ట పై వెలిసిన టవర్ లైట్లు రావడం లేదని వనపర్తి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని మున్సిపల్ ఇంజనీర్ అధికారులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ చెప్పారు చెరువు కట్టపై శానిటేషన్ పనులు చేయడం లేదని, తుమ్మ చెట్లు పెరిగి నాయని రాత్రిపూట వెళ్లే వాహనాల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార ని సతీష్ తెలిపారు విష సర్పాలు తిరుగుతున్న సమయంలో రాత్రి పుట వాహనాల ప్రజలు కట్ట పై ప్రయాణిస్తుంటారని రోడ్డు ప్రమాదం ఏర్పడుతుందని సతీష్ తెలిపారు. 12వ వార్డు రాజనగరాన్ని వనపర్తి మున్సిపాలిటీ పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదని కమిషనర్ కు కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని, విలీన గ్రామాలైన మర్రికుంట శ్రీనివాసపురం, నాగవరం రాజనగరం, జంగమయ్య పల్లి వార్డులను అభివృద్ధి చేయాలని జిల్లా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కలెక్టర్ ను ఒక ప్రకటనలో కోరారు
జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ వెంట తో పట్టణ అధ్యక్షుడు రామస్వామి, వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్,కురుమూర్తి,శివకుమార్, గుంట్ల వెంకటేష్, రాజు,కృష్ణయ్య, శ్రీనివాసులు రాజనగరం గ్రామ ప్రజలు ఉన్నారు

బ్లాక్‌-7 బాధ్యత తప్పించుకోలేరు.

బ్లాక్‌-7 బాధ్యత తప్పించుకోలేరు.

 

మేడిగడ్డ బ్యారేజ్ నేటి ధాత్రి:

 

 

 

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌-7లో సమస్యకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది.

  • తొలగించినా, సురక్షితం చేయాలన్నా మీ పనే
  • సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళిక అందించాలి
  • ఇతర బ్లాక్‌లపై ప్రభావం పడకుండా చూడాలి
  • 3 బ్యారేజీల్లో ఒకేరకమైన నిర్మాణ లోపాలు
  • ఎన్‌డీఎ్‌సఏ నివేదిక స్పష్టంగా చెప్పింది
  • ఎల్‌ అండ్‌ టీ సంస్థకు ప్రభుత్వం స్పష్టీకరణ

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌-7లో సమస్యకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి ఎన్‌డీఎ్‌సఏ అత్యున్నత చట్టబద్ధమైన సంస్థ అని, దాని నివేదికకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపింది. నివేదికలోని కొన్ని ఎంచుకున్న వ్యాఖ్యలను అంగీకరించి, కొన్నింటిని తిరస్కరించడం కుదరదని, నివేదికను మొత్తంగా చూడాలని మేడిగడ్డ నిర్మాణ సంస్థ అయిన ఎల్‌ అండ్‌ టీకి స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ ఆ సంస్థకు ఘాటైన లేఖను రాసింది. కాళేశ్వరం ప్రాజె క్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్మాణ లోపాలు కూడా కారణమని, ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయనందువల్లే బ్యారేజీ కుంగిందని, ఇష్టారాజ్యంగా నిర్మాణం జరిగిందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) తేల్చిందని ప్రస్తావించింది. మేడిగడ్డలోని బ్లాక్‌-7లో రాఫ్ట్‌, పిల్లర్లతో పలుచోట్ల పగుళ్లు వచ్చాయని నివేదికలోని పదహారవ అంశంలో పేర్కొన్నారని గుర్తు చేసింది.

బ్లాక్‌-7ను తొలగించడం లేదా సురక్షితంగా ఉంచడం నిర్మాణ సంస్థ బాధ్యతేనని, ఇతర బ్లాకులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవడం కూడా దాని పనేనని ప్రస్తావించింది. మేడిగడ్డ సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళికను ఎల్‌ అండ్‌ టీ అందించాలని తేల్చిచెప్పింది. ఎన్‌డీఎ్‌సఏ నివేదికలో కొన్ని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, వాటిని అంగీకరించేది లేదని ఇటీవల ఎల్‌ అండ్‌ టీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పందించింది. సుందిళ్ల, అన్నారంలో తలెత్తిన సమస్యలకు కారణమైన నిర్మాణ లోపాలు, నాణ్యత లోపాలు మేడిగడ్డలో పరిస్థితికి కూడా కారణమై ఉండవచ్చని ఎన్‌డీఎ్‌సఏ చెబితే దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం మాని, నివేదికనే తప్పుపట్టే దిశగా ఎల్‌ అండ్‌ టీ ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాణ సంస్థకు, నీటిపారుదల శాఖకు మధ్య జరిగిన ఒప్పందంలోని 8, 16, 30, 32.2, 32.3, 34, 35.1, 38 అంశాల ప్రకారం ఎల్‌ అండ్‌ టీ నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మేడిగడ్డ నిర్మాణ పటిష్టత, దానిపై ఆధారపడిన ప్రజల జీవనాధారం నేపథ్యంలో మళ్లీ వైఫల్యాలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. మేడిగడ్డలో నిర్మాణ లోపాలే కాకుండా ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ లోపాలు, డిజైన్‌కు తగ్గట్లుగా నిర్మా ణం జరుగక పోవడం వంటి సమస్యలను ఎన్‌డీఎ్‌సఏ గుర్తించిందని ప్రస్తావించింది. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) నిపుణులు కూడా ఈ నివేదికను సమీక్షించింది, బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేసిందని గుర్తు చేసింది.

 

లేఖలోని ముఖ్యాంశాలు

  • బ్యారేజీ దిగువ/ఎగువ భాగంలో సీకెంట్‌ పైల్స్‌ దెబ్బతినడానికి, కటా్‌ఫల అసలు పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేక పోవడానికి గ్రౌటింగ్‌ చేయడమే కారణం.
  • ఏడో బ్లాక్‌లోని 17, 20, 21 పిల్లర్ల కటా్‌ఫలలో రంధ్రాలు కనిపించాయి. పిల్లర్ల కింది నుంచి ఇసుక జారడంతో పిల్లర్లు కుంగాయి.
  • ఏవిధంగా నిర్మాణంజరిగింది.? వినియోగించిన సామగ్రి పరీక్షలకు సంబంధించిన ఏ పత్రాలు మీ వద్ద లేవు.
  • నిర్మాణానికి ఏయే సామగ్రి వినియోగించారు? అధికారుల ఆమోదం ఉందా? అంటే ఆధారాలు లేవు.
  • సిమెంట్‌, కాంక్రీట్‌లో నీళ్లు కలిపినప్పుడు ఎంత వేడి వస్తుంది, ఆ వేడిని చల్లబరచడానికి ఎంత సమయం పడుతుందనే పత్రాలు నిర్మాణ సంస్థ వద్ద లేవు. ఆ పత్రాలు నీటిపారుదల శాఖ క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు కూడా ఇవ్వలేదు.

ఈ వార్తలు కూడా చదవండి

బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..

చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌-7లో సమస్యకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది

  • తొలగించినా, సురక్షితం చేయాలన్నా మీ పనే
  • సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళిక అందించాలి
  • ఇతర బ్లాక్‌లపై ప్రభావం పడకుండా చూడాలి
  • 3 బ్యారేజీల్లో ఒకేరకమైన నిర్మాణ లోపాలు
  • ఎన్‌డీఎ్‌సఏ నివేదిక స్పష్టంగా చెప్పింది
  • ఎల్‌ అండ్‌ టీ సంస్థకు ప్రభుత్వం స్పష్టీకరణ

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌-7లో సమస్యకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి ఎన్‌డీఎ్‌సఏ అత్యున్నత చట్టబద్ధమైన సంస్థ అని, దాని నివేదికకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపింది. నివేదికలోని కొన్ని ఎంచుకున్న వ్యాఖ్యలను అంగీకరించి, కొన్నింటిని తిరస్కరించడం కుదరదని, నివేదికను మొత్తంగా చూడాలని మేడిగడ్డ నిర్మాణ సంస్థ అయిన ఎల్‌ అండ్‌ టీకి స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ ఆ సంస్థకు ఘాటైన లేఖను రాసింది. కాళేశ్వరం ప్రాజె క్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్మాణ లోపాలు కూడా కారణమని, ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయనందువల్లే బ్యారేజీ కుంగిందని, ఇష్టారాజ్యంగా నిర్మాణం జరిగిందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) తేల్చిందని ప్రస్తావించింది. మేడిగడ్డలోని బ్లాక్‌-7లో రాఫ్ట్‌, పిల్లర్లతో పలుచోట్ల పగుళ్లు వచ్చాయని నివేదికలోని పదహారవ అంశంలో పేర్కొన్నారని గుర్తు చేసింది.

బ్లాక్‌-7ను తొలగించడం లేదా సురక్షితంగా ఉంచడం నిర్మాణ సంస్థ బాధ్యతేనని, ఇతర బ్లాకులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవడం కూడా దాని పనేనని ప్రస్తావించింది. మేడిగడ్డ సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళికను ఎల్‌ అండ్‌ టీ అందించాలని తేల్చిచెప్పింది. ఎన్‌డీఎ్‌సఏ నివేదికలో కొన్ని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, వాటిని అంగీకరించేది లేదని ఇటీవల ఎల్‌ అండ్‌ టీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పందించింది. సుందిళ్ల, అన్నారంలో తలెత్తిన సమస్యలకు కారణమైన నిర్మాణ లోపాలు, నాణ్యత లోపాలు మేడిగడ్డలో పరిస్థితికి కూడా కారణమై ఉండవచ్చని ఎన్‌డీఎ్‌సఏ చెబితే దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం మాని, నివేదికనే తప్పుపట్టే దిశగా ఎల్‌ అండ్‌ టీ ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాణ సంస్థకు, నీటిపారుదల శాఖకు మధ్య జరిగిన ఒప్పందంలోని 8, 16, 30, 32.2, 32.3, 34, 35.1, 38 అంశాల ప్రకారం ఎల్‌ అండ్‌ టీ నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మేడిగడ్డ నిర్మాణ పటిష్టత, దానిపై ఆధారపడిన ప్రజల జీవనాధారం నేపథ్యంలో మళ్లీ వైఫల్యాలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. మేడిగడ్డలో నిర్మాణ లోపాలే కాకుండా ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ లోపాలు, డిజైన్‌కు తగ్గట్లుగా నిర్మా ణం జరుగక పోవడం వంటి సమస్యలను ఎన్‌డీఎ్‌సఏ గుర్తించిందని ప్రస్తావించింది. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) నిపుణులు కూడా ఈ నివేదికను సమీక్షించింది, బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేసిందని గుర్తు చేసింది.

లేఖలోని ముఖ్యాంశాలు

  • బ్యారేజీ దిగువ/ఎగువ భాగంలో సీకెంట్‌ పైల్స్‌ దెబ్బతినడానికి, కటా్‌ఫల అసలు పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేక పోవడానికి గ్రౌటింగ్‌ చేయడమే కారణం.
  • ఏడో బ్లాక్‌లోని 17, 20, 21 పిల్లర్ల కటా్‌ఫలలో రంధ్రాలు కనిపించాయి. పిల్లర్ల కింది నుంచి ఇసుక జారడంతో పిల్లర్లు కుంగాయి.
  • ఏవిధంగా నిర్మాణంజరిగింది.? వినియోగించిన సామగ్రి పరీక్షలకు సంబంధించిన ఏ పత్రాలు మీ వద్ద లేవు.
  • నిర్మాణానికి ఏయే సామగ్రి వినియోగించారు? అధికారుల ఆమోదం ఉందా? అంటే ఆధారాలు లేవు.
  • సిమెంట్‌, కాంక్రీట్‌లో నీళ్లు కలిపినప్పుడు ఎంత వేడి వస్తుంది, ఆ వేడిని చల్లబరచడానికి ఎంత సమయం పడుతుందనే పత్రాలు నిర్మాణ సంస్థ వద్ద లేవు. ఆ పత్రాలు నీటిపారుదల శాఖ క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు కూడా ఇవ్వలేదు.

ఘనంగా మాజీ మంత్రి హరీశ్​రావు​ జన్మదిన వేడుకలు.

ఘనంగా మాజీ మంత్రి హరీశ్​రావు​ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మాజీ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ట్రబుల్ షూటర్ హరీశ్‌ రావు పుట్టినరోజు సందర్భంగా ఝరాసంగం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం తమ మండల బృందంతో నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన పది కాలాల పాటు ప్రజా సేవలో కొనసాగాలని, శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భ‌గ‌వంతుడు ఆయ‌న‌కు శక్తిని ప్ర‌సాదించాలని కోరుకున్నారు.

ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాల‌ని, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మాజీ మంత్రి ఆకాంక్షించారు.

కేక్ కట్ చేసి ఒకరినొకరు కేక్ తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Former Minister Harish Rao’s

 

 

అలాగే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో మండల మైనారిటీ యువనాయకులు షేక్ సోహైల్ మరియు పరమేశ్వర్ పాటిల్ శివశంకర్ పాటిల్ ఆధ్వర్యంలో పండ్లను అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ పాటేల్ ఫారూఖ్ పటేల్ ప్రభు పటేల్.

గోపాల కృష్ణ పాటిల్.బస్వరాజ్ పాటిల్ శివశంకర్ పాటిల్ భాయ్ వెంకటరెడ్డి నాగేశ్సజ్జన్.

నాభి పటేల్ లాలప్ప గొల్ల నర్సిములు ఆంజనేయులు నర్సిములు మాణిక్యదవ్ కిషన్ రాథోడ్ సీను తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శిలుగా పాలకుర్తి తిరుపతి,సంగ పురుషోత్తంలను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను మాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్
జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

వంటగది గ్యాస్ సిలిండర్‌కు ఎరుపు రంగు ఎందుకు ఉంటుంది.!

Gas Cylinder: వంటగది గ్యాస్ సిలిండర్‌కు ఎరుపు రంగు ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం ఇదే?

 

నేటిధాత్రి

 

 

 

Gas Cylinder Red Color: ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే వంటగదిలో ఉపయోగించే సిలిండర్ పెట్రోలియం వాయువు (LPG)తో నిండి ఉంటుంది. LPG కాకుండా , వివిధ రంగుల సిలిండర్లలో నిండిన అనేక ఇతర వాయువులు ఉన్నాయి. ఇంట్లో ఉంచే LPG సిలిండర్..

Gas Cylinder Red Color: ప్రతి ఇంటి వంటగదిలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ గురించి చాలా రహస్యాలు ఉన్నాయి. మీకు వీటన్నింటి గురించి బహుశా తెలియకపోవచ్చు. ఈ అనేక ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏమిటంటే గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది? సాధారణంగా ఎరుపు రంగు అనేది ప్రమాదానికి చిహ్నంగా భావిస్తారు. ఏదైనా ప్రమాదం సమయంలో దానిని ఆపేందుకు ఎరుపు రంగులు ఉపయోగిస్తారు.

ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే వంటగదిలో ఉపయోగించే సిలిండర్ పెట్రోలియం వాయువు (LPG)తో నిండి ఉంటుంది. LPG కాకుండా , వివిధ రంగుల సిలిండర్లలో నిండిన అనేక ఇతర వాయువులు ఉన్నాయి. ఇంట్లో ఉంచే LPG సిలిండర్ ఎల్లప్పుడూ ఎరుపు రంగులో ఉండటానికి కారణం తెలుసుకుందాం.

మనందరికీ తెలిసినట్లుగా, ఎరుపు రంగు ప్రమాదానికి సంకేతంగా పరిగణిస్తారు. అందుకే సిలిండర్‌లో కూడా ప్రమాదం ఉంది కాబట్టి సిలిండర్‌కు ఎరుపు రంగు వేస్తారు. దాని లోపల నింపే ఎల్‌పీజీ గ్యాస్ మండేది. దానిని సరిగ్గా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించవచ్చు. ప్రజలను అప్రమత్తం చేయడానికి మాత్రమే గ్యాస్ సిలిండర్లకు ఎరుపు రంగు వేస్తారు. ఇది కాకుండా, గ్యాస్ సిలిండర్ LPG తో నిండి ఉంటుంది. అందుకే ప్రజలు దానిని సులభంగా గుర్తించగలిగేలా దానికి ఎరుపు రంగు వేస్తారు.

ఇది కూడా చదవండి: Indian Currency: 500 రూపాయల నోట్లు కూడా రద్దు అవుతాయా..? ఇవే 3 పెద్ద కారణాలు

ఎన్ని రకాల వాయువులు ఉన్నాయి?

ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) కాకుండా, అనేక ఇతర రకాల వాయువులను ఉపయోగిస్తారు. దీనితో పాటు సంపీడన సహజ వాయువు ( CNG ), పైపుల ద్వారా నడిచే సహజ వాయువు ( PNG ), ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, హీలియం వాయువులు కూడా ఉన్నాయి. అన్ని వాయువులకు వాటి స్వంత ఉపయోగాలు ఉన్నాయి. అవి సరిగ్గా, జాగ్రత్తగా ఉపయోగించినట్లయితే ప్రజల జీవితాలను సౌకర్యవంతంగా చేస్తాయి.

ఏ గ్యాస్‌కి ఏ రంగు సిలిండర్?

  • ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ తెల్లగా పెయింట్ చేసి ఉంటుంది. మీరు ఆసుపత్రులలో ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లను చూడవచ్చు.
  • నైట్రోజన్ వాయువు సిలిండర్ నల్లగా పెయింట్ వేసి ఉంటుంది. ఈ వాయువును టైర్లలో గాలి నింపడానికి ఉపయోగిస్తారు. మీరు ఈ సిలిండర్‌ను పెట్రోల్ పంపులు, టైర్ ఫిల్లింగ్ దుకాణాలు లేదా పంక్చర్ మరమ్మతు దుకాణాలలో పొందుతారు.
  • హీలియం వాయువు సిలిండర్ గోధుమ రంగులో పెయింట్ వేసి ఉంటుంది. ఈ వాయువును బెలూన్లలో గాలిని నింపడానికి ఉపయోగిస్తారు. దీని కారణంగా బెలూన్లు ఆకాశం వైపు వెళ్తాయి.
  • మీరు తరచుగా ‘లాఫింగ్ గ్యాస్’ గురించి విని ఉండవచ్చు. ఈ వాయువు సిలిండర్ నీలం రంగులో పెయింట్ వేసి ఉంటుంది. దానిలో నైట్రస్ ఆక్సైడ్ వాయువు నిండి ఉంటుంది.
  • కార్బన్ డయాక్సైడ్ వాయువు కోసం సిలిండర్లు బూడిద రంగులో పెయింట్ వేసి ఉంటుంది. వ్యాపారాలు, కర్మాగారాలు, పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి: Vehicle Number Plate: నంబర్ ప్లేట్ల రంగుల రహస్యం.. తెలుపు, పసుపు, ఆకుపచ్చ నంబర్ల అర్థం ఏంటో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని.

బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని.

జహీరాబాద్ నేటి ధాత్రి:

బక్రీద్ పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని డి. ఎస్.పి సైదా అన్నారు. జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో సోమవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగను సోదర భావంతో కులమతాలకు అతీతంగా జరుపుకోవాలనరు సమావేశంలో హిందూ,ముస్లిం మతాలకు చెందిన మత పెద్దలు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా,విషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు కుల,మతాలకు అతీతంగా పండగలను జరుపుకోవాలని చెప్పారు.సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా, విషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు.

బంగారం ధర రూ.12,000 తగ్గుతుందా!

Gold Price: బంగారం ధర రూ.12,000 తగ్గుతుందా? కారణం ఏంటో తెలుసా..?

 

నేటి ధాత్రి:

 

 

 

 

Gold Price: కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ సురేష్ కేడియా మాట్లాడుతూ..

ప్రస్తుతం బంగారం ధర కొంతవరకు పెరుగుతున్నప్పటికీ, రాబోయే కాలంలో బంగారం ధర తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

ఏప్రిల్- మే నెలల్లో బంగారం ధర 10 శాతం మెరుగుదల కనిపించింది..

 

గత కొన్ని నెలలుగా బంగారం ధర చాలా హెచ్చుతగ్గులకు లోనవుతోంది.

కొన్ని రోజుల క్రితం బంగారం ధర లక్ష రూపాయలు దాటింది.

ఆ తర్వాత ధరలో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 97,000 రూపాయలుగా ఉంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో బంగారం ధర దాదాపు 12,000 రూపాయల వరకు తగ్గవచ్చు.

బంగారం ధర 10 గ్రాములకు 80,000 నుండి 85,000 రూపాయల మధ్య ఉండవచ్చని చెబుతున్నారు.

కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ సురేష్ కేడియా మాట్లాడుతూ..

ప్రస్తుతం బంగారం ధర కొంతవరకు పెరుగుతున్నప్పటికీ, రాబోయే కాలంలో బంగారం ధర తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

ఏప్రిల్-మే నెలల్లో బంగారం ధర 10 శాతం మెరుగుదల కనిపించింది.

కానీ రాబోయే కాలంలో ప్రస్తుత రేటు వద్ద రూ. 12,000 తగ్గుదల కనిపించవచ్చు.

బంగారం రూ. 80,000, రూ. 85,000 మధ్య ఉండవచ్చు. పాకిస్తాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ తర్వాత బంగారం ధరలు తగ్గాయి.

బంగారం ధర 10 గ్రాములకు రూ. 2,000 తగ్గింది..

ఇప్పుడు రాబోయే కాలంలో బంగారం మరింత చౌకగా మారవచ్చు.

దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి.

దీనివల్ల బంగారం ధర తగ్గుతుంది

కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..ఇక మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలు రద్దు!
మహిళలకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!
సమయం లేదు మిత్రమా..! జూన్‌ 14 వరకే అవకాశం.. ఆ తర్వాత..

1. బంగారం ధరలు పెరిగినప్పుడు, మార్కెట్లో లాభాలు వస్తుంటాయి. గోల్డ్ ఇటిఎఫ్‌లు పెరిగాయి. దీనివల్ల లాభాలు ఆర్జించడానికి బంగారాన్ని అమ్మే అవకాశం ఉంటుంది. ఇది బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతుంది.

2. ప్రపంచ సంఘటనలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ప్రపంచ స్థాయిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పుడల్లా బంగారం ధర పెరుగుతుంది. కానీ ప్రస్తుతం అమెరికా సుంకాలపై తన వైఖరిని మృదువుగా చేసింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. దీని వలన బంగారం ధర తగ్గుదల ఉండవచ్చు.

3.బంగారం ధరలో ఆర్‌బిఐ ద్రవ్య విధానం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జూన్ 6న ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించే అవకాశం ఉంది. ఈ పరిస్థితి బంగారం ధరపై ప్రభావం చూపవచ్చు. ధరలో తగ్గుదల ఉండవచ్చు.

4. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడ్‌పై నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. ఫెడ్ రేట్లను తగ్గిస్తే బంగారానికి మద్దతు లభిస్తుంది. కానీ ప్రస్తుతం ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదు. వడ్డీ రేట్లలో కోత ఉంటే బంగారం ధర తగ్గవచ్చు.

ఇది కూడా చదవండి: Minimum Balance: ఈ బ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలు రద్దు!

ఇది కూడా చదవండి: Aadhar Card: సమయం లేదు మిత్రమా..! జూన్‌ 14 వరకే అవకాశం.. ఆ తర్వాత..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి తిరుపతి.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి తిరుపతి

సహకరించిన అందరికి ధన్యవాదాలు -పాలకుర్తి తిరుపతి

 

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శి గా పాలకుర్తి తిరుపతి ని ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా తిరుపతి మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను నాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్
జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

నాలుగు రోజుల తరువాత మిగిలిపోయిన రోడ్ల కటింగ్ ప్రారంభo.

వనపర్తి లో రోడ్ల విస్తరణలో చేపట్టుటకు ఇండ్లు షాపులో యజమానులతో సలహాలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే తూడి

నాలుగు రోజుల తరువాత మిగిలిపోయిన రోడ్ల కటింగ్ ప్రారంభo

వనపర్తి నేటిధాత్రి:

గత ప్రభుత్వం లో వనపర్తి లో రోడ్ల విస్తరణ లో ఆస్తులు నష్టపోయిన వారికి న్యాయం జరగలేదని వనపర్తి పట్టణంలో మార్నింగ్ వాకింగ్ లో ఎమ్మెల్యే మెగా రెడ్డి పాన్గల్ ల్ రోడ్ లో ఇండ్లు షాపులు వ్యాపార సంస్థల నష్టపోయే ప్రజలను స్వయంగా కలిసి వారి అభిప్రాయాలను సూచనలను తీసుకున్నారు ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి అభిప్రాయము మేరకు రోడ్ల విస్తరణ చేపడతామని ఎమ్మెల్యే మెగా రెడ్డి చెప్పారు .గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు పెద్దమనుషులు పానగల్ రోడ్డు గాంధీ చౌక్ హై స్కూల్ రోడ్డు లో ఆస్తులు నష్టపోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ లు కేటాయింపు లో మూడో ఫ్లోర్ రెండో ఫ్లోర్ కేటాయించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ప్రజలు తమతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మెగా రెడ్డి చెప్పారు వనపర్తి లో రోడ్ల విస్తరణకు ప్రజలు సు ముఖంగా ఉన్నారని కొందరు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని మరికొందరు డబుల్ బెడ్ రూమ్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కేటాయించాలని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారని ప్రజా అదృష్టమేరకే రోడ్ల విస్తరణ చేపడతామని రోడ్ల కాటింగ్ నాలుగైదు రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పారు . వనపర్తి లో దాదాపు 1,20,000 జనాభా ఉన్నదని ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రోడ్ల కటింగ్ చేపడతామని చెప్పారు ఎమ్మెల్యే మెగా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు . రాజావారి పాలిటెక్నిక్ కళ శాల కర్నూల్ రోడ్ కొత్తకొత్త కోట రాజవారి పాలిటెక్నిక్ నుండి వివేకానంద రోడ్ రోడ్ల విస్తరణలో నష్టపోయే ప్రజలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారు ఒకే కుటుంబంలో ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉన్నవారికి గత ప్రభుత్వం లో ఓకే డబుల్ బెడ్ రూము కేటాయించారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేశారని ఎమ్మెల్యే చెప్పారు విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు చీర్లసత్యం సాగర్ నందిమల్ల శ్యామ్ కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు

ఇలాంటి సర్కస్ లు వద్దు… మానుకోండి.

ఇలాంటి సర్కస్ లు వద్దు… మానుకోండి:

నేటి ధాత్రి:

 

 

 

  • విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటుడు ధనుష్
  • వ్యతిరేక ప్రచారాలు చేసుకోండి ఏమీ కాదన్న ధనుష్
  • అభిమానులు ఎప్పుడూ తనవెంటే ఉన్నారన్న ధనుష్
  • ఈ నెల 20న విడుదల కానున్న కుబేర

ఇలాంటి సర్కస్‌లు వద్దు.. మానుకోండి అంటూ విమర్శకులకు నటుడు ధనుష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ధనుష్, నాగార్జున కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ కుబేర ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక కథానాయికగా నటించారు.

తాజాగా ఈ మూవీ ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుష్ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా ప్రసంగించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

‘నేనెప్పుడూ నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. నాపై, నా మూవీలపై ఎంత వ్యతిరేక ప్రచారం చేస్తారో చేసుకోండి. నా మూవీల విడుదలకు ముందు నెలకు రెండు సార్లు ఏదో ఒక విషయంలో కుట్రలు చేస్తూనే ఉంటారు. అయినా మీరేమి చెయ్యలేరు. ఎందుకంటే నా అభిమానులు ఎప్పుడూ నాతోనే ఉన్నారు. ఇలాంటి సర్కస్‌లు మానుకోండి. ఇక్కడ ఉన్నవారంతా నా అభిమానులు మాత్రమే కాదు.. వీరంతా 23 సంవత్సరాలుగా నా వెంటే ఉంటున్నారు. మీరెంత వ్యతిరేక ప్రచారం చేసినా వీరంతా ఎప్పటికీ నాతోనే ఉంటారు’ అని ధనుష్ కుండబద్దలు కొట్టారు. 

జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్ వామ్మో.

జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్ వామ్మో జూన్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

పాఠశాలలు మొదలవుతుంది అంటే తల్లిదండ్రులకు టెన్షన్ మొదలయ్యే సందర్భాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పులు చేయడానికి కూడా వెనకాడరు. అందుకే జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్ మొదలవుతుంది. ఒకటో తారీఖు అంటే ప్రతినెలా సామాన్య కుటుంబాలకు ఇబ్బందిగానే ఉంటున్నా జూన్ మాసంలో మాత్రం ఇంకాస్తా భయాన్ని కలిగిస్తుంది. ఇంటి బడ్జెట్కు తల్లిదండ్రుల కసరత్తు మొదలైంది. జూన్ మాసం వస్తుందంటేనే తల్లిదండ్రులు హడలిపోతారు. ప్రతి కుటుంబంపై జూన్ మాసంలో రూ. 50 వేల నుంచి రూ లక్ష వరకు బడి ఖర్చులు ఉంటాయి. మరో 15 రోజులు మాత్రమే పాఠశాలలకు సెలవులు మిగిలి ఉన్నాయి. పాఠశాలలు తెరుచుకోవడానికి ముందే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాంలు, షూస్ సహా కొనుగోలు చేయడంతో పాటు ఫీజుల మోతను ఎదుర్కోవడానికి తల్లిదండ్రుల్లో దడ మొదలైంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను తలకిందులు చేస్తుంది. కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు కూడా భారీగా పెంచారు. 

జూన్ మాసంలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందటేనే ప్రతి ఇంటిలో ఎల్ కేజీ నుంచి పదో తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్కు టర్మ్ ఫీజులు, రవాణా, ఇతర ఖర్చులు కలిపితే రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు అవుతుంది. కార్పొరేట్ స్థాయికి వెళ్తే రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి కార్పొరేట్ పాఠశాలలు కూడా రావడంతో పిల్లల చదువుల కోసం మధ్య తరగతి కుటుంభాలు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్ చదువాలంటే కూడా కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మినహాయించిన కళాశాలల ఫీజులు లక్షల్లోనే ఉ న్నాయి. మరోవైపు హాస్టల్ ఫీజులు అదనపు భారం ఉంటాయి. ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ ఫీజులు వేలల్లో ఉ న్నాయి. దీనికి తోడు ఈవెంట్స్ పేరుతో అదనపు వసూళ్లు కూడా ఉన్నాయి. పుస్తకాలతో పాటు బ్యాగ్లు టిఫిన్ బాక్సుల రేట్లు కూడా మండిపోతున్నాయి. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు బస్సు, యూనిఫాం, బెల్ట్, బ్యాడ్జి, టై, ఐడీ కార్డు, డైరీ, పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ఫీజులు.. ఇలా అన్నింటికి వేలల్లోనే ఖర్చు చేయాల్సి ఉ ంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు ఇస్తుండగా, మిగతా నోటు బుక్కులు, ఇతర వాటికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా గారి ఎంపిక.

రాష్ట్రస్థాయి ప్రదర్శనకు రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా గారి ఎంపిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాదులోని రాష్ట్రస్థాయి విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధిలో వివిధ అభ్యసన పద్ధతులపై బెస్ట్ ప్రాక్టీస్ నిర్వహించే ఉత్తమ ప్రదర్శనకు న్యాల్ కల్ మండల రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా ఎంపికైనట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలు తెలిపారు.
వీరి ఎంపిక ఇంటర్వ్యూల ద్వారా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర పర్సన్ గా ఉన్న కమిటీ జిల్లా నుండి నలుగురు ఉపాధ్యాయులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసింది, అందులో ఒకరు సఫియా సుల్తానా ఇలా ఎంపికైన ఉపాధ్యాయులు జూన్ 4వ తేదీన ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి జూబ్లీహిల్స్ హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యాధికారులు మరియు మల్టీజ్జోన్ కి సంబంధించిన అన్ని జిల్లాల ఎంఈఓ మీటింగ్లో వీళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న న్యాల్ కల్ మండల విద్యాధికారి మారుతి రాథోడ్ అదేవిధంగా మండల ఉపాధ్యాయులు సఫియా సుల్తాన్ గారికి అభినందించారు.

ఇందిరమ్మ ఇండ్లను శంకుస్థాపన చేసిన న్యాల్కల్ ఎంపిఓ D. సౌజన్య గారు.

ఇందిరమ్మ ఇండ్లను శంకుస్థాపన చేసిన న్యాల్కల్ ఎంపిఓ D. సౌజన్య గారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలం అత్నూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మొగ్గు వేసి ప్రారంభం చేసిన ఎంపిఓ సౌజన్య రావు గారు, హౌసింగ్ DE అంజయ్య గారు,న్యాల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు B. శ్రీనివాస్ రెడ్డి , సంగారెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి K. భాస్కర్ రెడ్డి, జహీరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, న్యాల్కల్ పాక్స్ చైర్మన్ సిద్ది లింగా స్వామి, మండల మాజీ ఉప అధ్యక్షుడు మొహమ్మద్ గౌసోద్దీన్, జిల్లా మైనారిటీ నాయకులు మొహమ్మద్ రఫియోద్దీన్, మాజీ ఎంపీటీసీ శాంత్ కుమార్ పటేల్, AE శివానంద, పంచాయతీ కార్యదర్శి N. సరేన్ రాజ్, అత్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఫీక్ పటేల్, మాజీ ఉప సర్పంచ్ నిలయా గౌడ్, నయీమొద్దీన్, ముస్తఫా, లాలూ పటేల్, ఖాయమొద్దీన్, పాషా భాయ్, యాదుల్ భాయ్, మిస్లోడ్డిన్, మౌల పటేల్, అఫ్జల్ భాయ్, మచ్కురి శంకర్, మచ్కురి మాణిక్, సురేష్ , బసవరాజు, సమీర్, నాసర్ , అక్బర్, సయ్యోజి గౌడ్, అజర్, జలీల్ మియా, మహిళలు కమలమ్మ , శేషమ్మ, జ్యోతి , గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

ఘనంగా సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన.

ఘనంగా సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు…

నేటి ధాత్రి – బయ్యారం :-

 

 

బయ్యారం సొసైటీ చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలను యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా జరిపినారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తమ్మిశెట్టి వెంకటపతి మాట్లాడుతూ, ఎల్లప్పుడూ మండల అభివృద్ధి గురించి ఆలోచించించే మూల మధుకర్ రెడ్డి భవిష్యత్ లో మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.బయ్యారం ఏజెన్సీ అభివృద్ధి కై పాటుపడుతున్న ప్రజా నాయకుడని కొనియాడారు.అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు,నిరంజన్, రాకేష కార్తీక్,జాన్,ప్రసన్నకుమార్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవవేడుకల సందర్భంగా.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవవేడుకల సందర్భంగా జెండాఆవిష్కరించిన ఎస్పీ

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయఆవరణలో ఎస్పీ రావుల గీరీదర్ పోలీసు సిబ్బంది తో కలిసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ 2014, జూన్ 2న అధికారికంగా ఏర్పడిందన తెలంగాణ రాష్ట్రం పదకొండు సంవత్సరాలు పూర్తిచేసుకుందన్నారు ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా . తెలంగాణ రాష్ట్రము సాధించు కున్నామని అన్నారు
అనంతరం పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ మిఠాయిలు పంచారు జిల్లా ప్రజలకు పోలీసు సిబ్బంది కి శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డీఎస్పీ ఉమామహేశ్వరరావు, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునందన , నరేష్ స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, వనపర్తి సీఐ కృష్ణ కొత్తకోట సీఐ రాంబాబు ఆత్మకూరు సీఐ, శివకుమార్ సిసిఎస్ సీఐ, రవిపాల్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయం

సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి సంక్షేమంలో దేశానికే ఆదర్శం మన ప్రజా ప్రభుత్వం.

అభివృద్ధి సంక్షేమంలో దేశానికే ఆదర్శం మన ప్రజా ప్రభుత్వం

 

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శం మన ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకోవాలని రాష్ట్ర అవతరణ దినోత్సవ ముఖ్య అతిథి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి ముఖ్య అతిథి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య పాల్గొన్నారు.

ముందుగా జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం పెట్టి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం భూపాలపల్లి కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ముఖ్య అతిథి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్య అతిథి మాట్లాడుతూ..

శుభకార్యం తలపెట్టేటప్పుడు దేవుడిని తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకోవడం మన ధర్మం అన్నారు.

అది వారి త్యాగానికి మనం ఇచ్చే గొప్ప గౌరవమన్నారు.

జై తెలంగాణ.. ఇది నినాదం కాదు..

యావత్తు తెలంగాణ ప్రజల శ్వాస అంతేకాదు..

అస్తిత్వం, ఆరాటం, పోరాటం, ఆత్మగౌరవం, చైతన్యం, భావోద్వేగం అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన త్యాగధనులకు వేల వేల వందనాలు..

అరవై ఏండ్ల తెలంగాణ అస్తిత్వ ఉద్యమాల్లో వారి పోరాటం, అమరం, అజరామరం..

వారి త్యాగం, వారి త్యాగ స్ఫూర్తి నిరూపమానం అన్నారు.

జీవితాన్ని త్యాగం చేయడమంటే మాటలు కాదు.

అయినా ఏండ్ల తెలంగాణ కలను నిజం చేయడం కోసం వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారు.

నావల్లనైనా తెలంగాణ రాష్ట్రం రావాలి అని విద్యార్థి శ్రీకాంతాచారి, పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్, యాదిరెడ్డిలాంటి వందలమంది ప్రాణాలర్పించారన్నారు.

తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకుంది కేవలం 459 మందే అని గత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

కానీ, ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమంలో 1200 మందికి పైగా ఉద్యమకారులు ప్రాణాలర్పించారన్నారు.

బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందన్నారు.

తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో వారి ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, వారు కలలు కన్న తెలంగాణ పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు.

వందలాది అమరుల త్యాగఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.

వారి స్ఫూర్తి నిత్యం మదిలో మెదిలేలా అమరవీరుల త్యాగం భవిష్యత్‌ తరాలకు తెలిపేలా మనందరం సమిష్టి గా కృషి చేయాలన్నారు.

అనంతరం రాష్ట్ర సాధన కోసం అసలు బాసిన అమరుల కుటుంబ సభ్యులను అతిథిచే శాలువాలు కప్పించి సత్కరించారు.

రైతులకు మేలు రకం వరి విత్తనాలను పంపిణీ చేశారు.

ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను, అక్కడున్న వారిని ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

భూపాలపల్లి లోని కేజీబీవీ, బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్, సెయింట్ పీటర్స్ హై స్కూల్, సన్ వ్యాలీ హై స్కూల్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ సంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన తెలంగాణ ఉద్యమ గీతాలు సైతం ఆహుతులను ఆకట్టుకున్నాయి.

అనంతరం అతిధుల చేతుల మీదుగా చిన్నారులకు జ్ఞాపికలను అందజేసి అభినందించారు.

అనంతరం కలెక్టరేట్ ఐడీవోసీ లో ఏర్పాటు చేసిన హై టీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆంజనేయుని విగ్రహ పున ప్రతిష్ట.

ఆంజనేయుని విగ్రహ పున ప్రతిష్ట

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి:

టేకుమట్ల మండలం అంకుషాపురం సోమనపల్లి గ్రామ శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొని శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు పొందడం జరిగింది ఈ సమయంలో ఆలయ కమిటీ సభ్యులు ఏనుగుల రాకేష్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంలో ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ హనుమంతుడు హిందూ సంస్కృతిలో అత్యంత దేవుళ్ళు ఒకరు. అపారమైన బలం, అచంచలమైన భక్తి మరియు అపరిమిత జ్ఞానానికి ప్రసిద్ధి చెందిన హనుమాన్ జీ హిందూ పురాణాలలో ఆధ్యాత్మిక అభ్యాసాలలో ముఖ్యమైన పాత్ర పోషించాడని అన్నారు. ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభయాంజనేయుని శుభ ఆశీస్సులు కలిగి సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ సందర్భంగా ఈ గొప్ప ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలోనికి ఆహ్వానం పలికినందుకు కమిటీ సభ్యులందరికీ ఉమ్మడి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలపడం
జరిగింది ఈ కార్యక్రమంలో సోమనపల్లి మాజీ సర్పంచ్ ఉద్దమారి మహేష్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, పిఎసిఎస్ డైరెక్టర్ మారం లింగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నందికొండ రామ్ రెడ్డి, తోట వినయ్ సాగర్, పోతనవేన ఐలయ్య, దేవేందర్ పటేల్ వీసం బారత్ రెడ్డి, పిన్నింటి మణిదీప్ రావు, పెంట రమేష్, పెద్దోజు రమణాచారి మంద అశోక్, చిక్కుల రవి, మేకల శ్రీకాంత్, గిర వేణ కిరణ్, గిరవేణ భాస్కర్ అంతనగిరి దేవేందర్, మేకల అనిల్ ఉమ్మడి గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది దేశానికి స్వాతంత్రం.!

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నే.

ఆవిర్భావ వేడుకలో జెండా ఆవిష్కరించిన గూట్ల తిరుపతి

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం* ఘనంగా నిర్వwహించుకోవడం జరిగినది.

మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి* జాతీయ జెండా ఎగురవేసి అనంతరం మాట్లాడుతూ..

ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ

ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి యువకులు 1200 మంది చనిపోయిన దాన్ని చూసి సోనియా గాంధీ మనసు చలించిపోయి

తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదని నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును పెట్టి ఆమోదింపచేసి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తల్లి సోనియా గాంధీ ఆమెకు మనం ఎంతో రుణపడి ఉన్నాం.

అలాగే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందియాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ ప్రజాపాలనను అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకపోయిన ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఎన్నో మన్ననలు పొందుతున్నారు.

గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ ,ఎస్టీ బీసీల అందర్నీ ఎలాంటి సంక్షేమ పథకాల అందించక అనేక ఇబ్బందులకు గురిచేస్తూ తమ స్వలాభం కోసం కమిషన్ల కోసం రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కేసీఆర్ పాలనను అంతం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అదే తీరుగా ప్రజాసంక్షేమ పథకాల అమలు అందరికీ అందిస్తున్నారు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,కామిడి రత్నాకర్ రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.*

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version