దళితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని.

దళితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని
ఆగిన దళిత బంధు ఇవ్వాలని
…,. జిల్లా కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి….

జమ్మికుంట :నేటిధాత్రి

 

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో జరుగుతున్న అక్రమాలు గురించి, హుజురాబాద్ నియోజకవర్గంలో నిలిపి వేయబడిన రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, స్పోర్ట్స్ గ్రౌడ్ పనులు వెంటనే ప్రారంభించాలి అని, దళితుల అందరికి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని కరీంనగర్ జిల్లాలో నిలిపివేయబడిన అభివృద్ది పనులను వెంటనే పూర్తి చేయాలని మరియు కరీంనగర్ జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన

MLA Padi Kaushik Reddy

ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ గారు, సుంకే రవిశంకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు గారు, జిల్లా అధ్యక్షులు GV రామాక్రిష్ణా రావు గారు. మరియు మాజీ మున్సిపల్ చెర్మన్ లు కౌన్సెలర్స్ మాజీ ఎంపీపీ లు మాజీ జడ్పీటీసీలు పాల్గొన్నారు

అవినీతిని బట్టబయలు చేసిన మంత్రి కొండా సురేఖ.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మంత్రుల అవినీతిని బట్టబయలు చేసిన మంత్రి కొండా సురేఖ

-మంత్రి వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించి..సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు

-బీసీ మహిళా మంత్రిపై జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్న బీసీ సమాజం

-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు చేసిన అవినీతి చిట్టాను విప్పిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీలోని అగ్రకులస్తులు తప్పుగా వక్రీకరించి సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని, అట్టి కుట్రలను చూస్తూ బీసీ సమాజం ఊరుకోబోదని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఘాటుగా హెచ్చరించారు. శనివారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. కమిషన్లకు కక్కుర్తి పడి..ప్రతి పనిలో వాటాలు తీసుకుని..ధనిక తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి వేశారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగాలన్నా, ఫైల్ కదలాలన్నా మంత్రులకు కమిషన్లు ఇస్తేనే పనులు జరిగేవని కాలేశ్వరం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లాంటి పథకాలలో భారీ అవినీతి జరిగిందని మంత్రి కొండా సురేఖ ఆరోపిస్తే.ఆ ఆరోపణలపై సమాజానికి స్పష్టతనివ్వాల్సిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు..వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలోని కొందరు అగ్రవర్ణ కులస్తులు మంత్రి కొండా సురేఖ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని, బీసీ మంత్రిగా..ఓరుగల్లు ప్రజల ముద్దుబిడ్డగా.పేద ప్రజల గుండెచప్పుడుగా..నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యి..వారి హృదయాల్లో కొలువుదీరి.ప్రజా నాయకురాలిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గంలో చోటు సంపాదించుకొని.మిగతా మంత్రులను కలుపుకొని..సమిష్టి నిర్ణయాలతో ప్రజా పాలనను ముందుకు తీసుకెళుతున్న తరుణంలో.బీసీ మంత్రి అయినా కొండా సురేఖ ఎదుగుదలను ఓర్వలేక.ఆమెను టార్గెట్ చేసి.కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రివర్గం మధ్య చిచ్చుపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీలోని అగ్ర కులస్తులు కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ.ప్రజా కోర్టులో బీఆర్ఎస్ పార్టీ అగ్రకులస్తుల వైఖరిని ఎండగడతామని మహేందర్ గౌడ్ హెచ్చరించారు.

డీఎస్పీ కార్యాలయం రెన్యు వేషన్ ఎస్పీ కలెక్టర్.

డీఎస్పీ కార్యాలయం రెన్యు వేషన్ ఎస్పీ కలెక్టర్ తో కలసి ప్రారంభించిన ఎమ్మెల్యే

 

వనపర్తి నేటిధాత్రి :

 

శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర పాత భవనానికి రెన్యువేషన్ చేసిన సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయానికి కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో శాంతి భద్రతలు బాగుండాలంటే పోలీస్ శాఖకు మౌలిక సదుపాయాలు ఉండాలని అందుకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీస్ విషయంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వనపర్తి జిల్లాను అగ్రస్థానంలో ఉంచాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని అన్నారు.

ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో డీఎస్పీ కార్యాలయాన్ని రెనోవేషన్ చేయించి పునఃప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు.

భవనం రెనోవేషన్ కు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.

వనపర్తి పట్టణానికి, మండలాలకు పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు తన స్వంత నిధుల నుండి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

జిల్లాలో కొత్తగా మూడు మండలాల్లో కొత్త తహసిల్దార్ కార్యాలయాలు ఒక్కోటి రూ 32 లక్షల వ్యయంతో నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, సంబంధిత మండలాల్లో స్టేషన్ హౌస్ ఆఫీస్ లు సైతం కొత్త భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా పట్టణంలో ఒక సర్కిల్ కార్యాలయం, మరో ఎస్. హెచ్. ఒ మంజూరు కు సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం పట్టణంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని, జిల్లా ఎస్పీ, డీఎస్పీ చొరవ చూపడం వల్ల నిధులు మంజూరు చేయడంతో రెనోవేషన్ అనంతరం నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ప్రభుత్వం నుండి అద్దె చెల్లించే బాధ కూడా తప్పిందని అన్నారు.

అదేవిధంగా పోలీస్ శాఖకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందు కు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ జిల్లా యంత్రాంగం, రాజకీయ నాయకులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ప్రజలకు శాంతి భద్రతల విషయంలో రాజీలేని కృషి చేస్తున్నామని అన్నారు.ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి వనపర్తి జిల్లాకు మంచిపేరు తెస్తామని అన్నారు
పోలీస్ శాఖకు అండగా నిలుస్తున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.

అంతకు ముందు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి డీఎస్పీ వెంకటేశ్వర రావును గౌరవ ప్రదంగా తన కుర్చీలో కూర్చోబెట్టారు డీఎస్పీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.

డీఎస్పీ వెంకటేశ్వర రావు, మార్కెట్ యార్డు చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎస్ ఎల్ ఏన్ మిడిదొడ్డి రమేష్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ టి శంకర్ ప్రసాద్ తహసీల్దార్ రమేష్ రెడ్డి, సి. ఐ లు, ఎస్సై లు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రైతులు ఫార్మర్ రిజిస్ట్రి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రైతులు ఫార్మర్ రిజిస్ట్రి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

పరకాల క్లస్టర్ ఏఈఓ ఎం.శైలజ

పరకాల నేటిధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పరకాల క్లస్టర్ పరిధిలోని పరకాల,మాదారం,మల్లక్కపేట గ్రామలకు చెందిన పట్టా బుక్కు ఉన్న ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పరకాల క్లస్టర్ వ్యవసాయ విస్తరాణాధికారి(ఏఇవో) ఎం.శైలజ తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే పథకాలు, సబ్సిడీలు,బీమా వంటివి ఈ గుర్తింపు కార్డు ద్వారా సులభంగా అందుతాయని,ఆకస్మికంగా వచ్చే ప్రకృతి విపత్తులు,ఇతర అత్యవసర పరిస్థితులలో సహాయం పొందడానికి ఇది ఉపయోగపడుతుందని,ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయ పథకాలకు ఈ గుర్తింపు కార్డు ఆధారంగా రైతులకు సాయం అందజేస్తారని అన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వైస్ చైర్మన్.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వైస్ చైర్మన్.

నాగర్ కర్నూల్ నేటి దాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా ఆమనగల్ మార్కెట్ శనివారం నాడు కమిటీ వైస్ ఛైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి ఆకస్మిక పర్యటన సందర్భంగా ఆమనగల్ PACS ఆధ్వర్యం లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ధాన్యం సేకరణ వివరాలను సంబధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డు లో నిర్మినా దశలో ఆగిపోయిన పనులను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని పరిశీలించారు.కూరగాయల మార్కెట్ .మాటెన్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సమస్యను MLA గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చెయ్యడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ప్రజలకు కూడా అన్ని సదుపాయాలు ఒకే దగ్గర ఉంటాయని వైస్ చైర్మన్ వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ తాళ్ల రవీందర్ ,నరేష్ నాయక్ , సంపత్ కుమార్ ఉన్నారు.

నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపిన దేశిని కోటి బృందం.

నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపిన దేశిని కోటి బృందం

జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట పట్టణ సిఐ గా బాధ్యతలు తీసుకున్న రామకృష్ణ సిఐని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన దేశిని స్వప్న కోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ తాజా మాజీ కౌన్సిలర్లు బొంగోని వీరన్న, మారెపల్లి బిక్షపతి, దేశిని రాధా సదానందం ఎలగందుల స్వరూప శ్రీహరి, పిట్టల శ్వేతా రమేష్, పొన్నగంటి సారంగం, కుదాడి రాజయ్య, బుల్లి పూలమ్మ మొగిలి,దిడ్డి రామ్మోహన్,రావికంటి రాజు,తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపి నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి వైస్ చైర్మన్.

వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి వైస్ చైర్మన్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి వైస్ చైర్మన్ నే రెళ్ళ నరసింగంగౌడ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని సందర్శించి. వాటిని పరిశీలించారు. నిన్నటి రోజున అకాల వర్షాల కారణంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిన కారణంగా ధాన్యాన్ని. ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకనైనా రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యాన్ని ప్రభుత్వానికి. అందజేసి ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధరకు విక్ర ఇంచాలని. దళారులను నమ్మి రైతులు నష్టపోవద్దని. ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పొన్నాల . పరశురాం. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి. జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. మండల ప్రధాన కార్యదర్శి. రాజశేఖర్. కొత్త రవి గౌడ్. కిషన్. రమేష్. తదితరులు పాల్గొన్నారు

రామనామ స్మరణంతో నగర సంకీర్తన.

రామనామ స్మరణంతో నగర సంకీర్తన.

చిట్యాల నేటి ధాత్రి :

చిట్యాల మండల కేంద్రం లో వెంకట్రావుపల్లి సి గ్రామం లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం లో హనుమాన్ మాలదారులు శనివారం గ్రామం లో నగర సంకీర్తన కార్యక్రమం* ని అంగరంగ వైభవం గా నిర్వహించారు. ఈ సందర్బంగా హనుమాన్ స్వాములు గ్రామం లోని అన్ని పురావిధుల గుండా హనుమాన్ వేశాధారణలో రామనామా స్మరణ చేస్తు డీజే చప్పుళ్లతో అంజన్న స్వామి ల గంతులు వేస్తూ హంగామా చేశారు. అదే విధంగా రామ నమా స్మరణ తో జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం లో దేవస్థానం గురుస్వాములు ఈగ కోటి, బ్రాహ్మం, మాసు రమేష్, చారి, అంకం రమేష్, కొక్కుల కరుణాకర్, చిలుకల సదానందం,జంగపల్లి సతీష్,అంకం సదానందం,కన్నె స్వాములు సతీష్, ప్రవీణ్, నాగరాజు, నగేష్, సురేష్, బిట్టు దేవస్థాన హనుమాన్ స్వాములు,తదితరులు పాల్గొన్నారు.

కక్ష్యలు..దుర్మార్గాలు.. దౌర్జన్యాలు చేయం.

‘కక్ష్యలు..దుర్మార్గాలు.. దౌర్జన్యాలు చేయం’

షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”

ఎమ్మెల్యే శంకర్ పై పూల వర్షం కురిపించిన గ్రామస్తులు.

37 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు – శంకుస్థాపన కార్యక్రమాలు

షాద్ నగర్/నేటి ధాత్రి

 

 

ఉమ్మడి మహబూబ్ నగర్.. ప్రస్తుత రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఇలాంటి రాజకీయాలు, కక్షలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేయమని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుందని వారి యోగక్షేమాలు చూస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో మంజూరైన 37 ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే శంకర్ తదితర శ్రేణులకు భారీ స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే శంకర్ ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో ఉన్నంత సేపు ఆయనపై అభిమానులు పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా అట్టహాసంగా గ్రామస్తులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ళకు ముగ్గులు పోసి పునాదులు తీశారు.

MLA Shankar.

శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ఇలాంటి కక్షలు దుర్మార్గాలు దౌర్జన్యాలకు పాల్పడనని ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తానని గత పాలకులు గ్రామంలో ఏమేం చేశారు ఎన్ని దౌర్జన్యాలు చేశారు అందరికీ తెలుసని వారి పేర్లు తీయదలుచుకోలేదని మీడియా ముఖంగా శంకర్ అన్నారు. ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చుతానని భరోసా ఇచ్చారు. గ్రామానికి చెందిన వై యాదయ్య యాదవ్ ఇంకా పలువురు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులకు ఎల్లవేళలా అండగా నిలుస్తారని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం జరుగుతుందో గ్రామాల్లో నిరూపిస్తున్నామని శంకర్ అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పేదలకు ఇండ్లు సమకూరలేదని కాలయాపన చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు తప్ప సక్రమంగా పాలించలేదని ధ్వజమెత్తారు. నేడు గ్రామాలు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయని ఉచిత బస్సు సిలిండర్ కరెంటు తోపాటు సన్నబియ్యాన్ని ప్రజలకు ఇచ్చి ప్రభుత్వం ఎంతో మేలు  చేసిందన్నారు.

సీఎంఆర్ చెక్కు అందజేత.

సీఎంఆర్ చెక్కు అందజేత..

రామాయంపేట మే 17 నేటి ధాత్రి (మెదక్):

రామయంపేట: కాట్రియాల గ్రామానికి చెందిన గొల్ల అంజయ్య కు వచ్చిన సిఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అంజయ్యకు అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది నిరుపేదలకు ఒక వరం అని, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని వారు అన్నాను.పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు అందిస్తు నిరుపేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారికి కాట్రియాల గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు లబ్ధిదారుడు అంజయ్య కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమ్మరి రమేష్ చారి మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,నాయకులు చింతం సత్యం,కొప్పుల హనుమండ్లు,కుమార్,లింగం,బాలయ్య,కట్ట రాజు తదితరులు పాల్గొన్నారు

కొనుగోలు వేగవంతం చేయాలి రెవెన్యూ ఇన్స్పెక్టర్.

కొనుగోలు 
వేగవంతం చేయాలి
• రెవెన్యూ ఇన్స్పెక్టర్
ప్రీతి

నిజాంపేట నేటి ధాత్రి:

అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు వేగవంతం చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్, నంద గోకుల్, చల్మెడ గ్రామాల్లో సొసైటీ, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించడం జరిగిందన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలన్నారు. టార్పోలిన్లు అందుబాటులో ఉంచుకొని రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు బురాని మంగ, బురాని వాణి, రైతులు అదే స్వామి, ఊడేపు రాజయ్య, కూడవెల్లి చంద్రం తదితరులు ఉన్నారు.

శ్రీసోమేశ్వర ఆలయానికి రెండు వెండి కలశములు.

శ్రీసోమేశ్వర ఆలయానికి రెండు వెండి కలశములు సమర్పించిన భక్తుడు

 

పాలకుర్తి నేటిధాత్రి:

 

శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి రెండు వెండి కలశములు (చెంబులు) భక్తుడు శుక్రవారం సమర్పించినట్లు ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి పూజా కార్యక్రమాల్లో వినియోగించడానికి వరంగల్ కు చెందిన భక్తుడు అనంతుల రవికుమార్-స్వప్న కుటుంబ సభ్యులు రూ 1,35,000 విలువైన సోమేశ్వర స్వామికి 511గ్రాముల 500మిల్లి గ్రాముల వెండి కలశం, లక్ష్మీ నరసింహ స్వామికి 523 కేజీల 981 గ్రాముల మిశ్రమ వెండి తో తయారు 511.035 మిల్లి గ్రాముల వెండి కలశం ఆలయానికి అందజేసినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

గోపన్ పల్లి చెరువుకు చుక్క నీరు ఇవ్వలేదు.

‘గోపన్ పల్లి చెరువుకు చుక్క నీరు ఇవ్వలేదు’

దేవరకద్ర నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోపన్ పల్లి గ్రామ రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి రైతులకు శనివారం జీనుగ విత్తనాలు, సబ్సిడీ స్ప్లింక్లర్ పైపులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి.. గోపన్ పల్లి సమీపం మీదుగా వెళుతున్న.

Gopanpalli pond

గోపన్ పల్లి చెరువుకు చుక్క నీరు ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పైపులను, విత్తనాలను ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అనేక సబ్సిడీ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు అందజేశామన్నారు. తమది రైతుల ప్రభుత్వమన్నారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సింధూర్ ఆపరేషన్ లో పాల్గొన్న.!

సింధూర్ ఆపరేషన్ లో పాల్గొన్న ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం

ఇబ్రహీంపట్నం నేటిధాత్రి:

సింధూర్ ఆపరేషన్ దేశానికి అత్యంత కీలకమైన ఆర్మీ మిషన్ ఈ కీలక క్రమంలో భాగస్వామిగా ఉన్న మండలంలోని కోజన్ కొత్తూరు గ్రామవాసి జవాన్ ఇటీవలే సెలవులపై వచ్చిన సందర్భంగా అతడికి డబ్బా గ్రామానికి చెందిన యువకులు సన్మానం చేశారు దేశ రక్షణలో ముందు వరసలో ఉన్న జవాన్ తోట రమేష్ జూనియర్ కమిషనర్ ఆఫీసర్ సింధూర్ ఆపరేషన్ లో తన ప్రాణాలు ప్రాణంగా పెట్టి విధిని నిర్వహించాడు మట్టికి సేవ చేసిన బిడ్డను మెచ్చుకొని సన్మానించారు జవాన్ తల్లి భాగ్యలక్ష్మికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్. లింగంపల్లి గంగాధర్. గొర్రె రాజేశ్వర్. చీకట్ల వేణు. బైన మహేష్ పాల్గొన్నారు

టీజీ ఎఫ్ డీసీ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్ గా సాయికిరణ్.

టీజీ ఎఫ్ డీసీ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్ గా సాయికిరణ్

జైపూర్ నేటి ధాత్రి:

తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ), మంచిర్యాల రేంజ్ లోని జైపూర్ సిరీస్ లో పనిచేస్తున్న ఎ.సాయికిరణ్ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్ గా ఎంపికయ్యారు.టీజీ ఎఫ్ డీసీ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో డివిజన్ ల వారీగా ప్రకటించిన జాబితాలో ఇక్కడి కాగజ్ నగర్ డివిజన్ లోని మంచిర్యాల రేంజ్ నుంచి సాయికిరణ్ ఎంపికయ్యారు. గత 10 సంవత్సరాలుగా ప్లాంటేషన్ లను రక్షిస్తూ మంచి పనితీరు ప్రదర్శిస్తున్నందుకు గాను ఈ అవార్డు ప్రకటించారు.ఈ సందర్బంగా శుక్రవారం రాత్రి డివిజన్ కేంద్రమైన కాగజ్ నగర్ లో జరిగిన కార్యక్రమం లో డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి చేతుల మీదుగా సాయికిరణ్ ప్రశంసా పత్రం తో పాటు 5000 రూపాయల నగదు బహుమతి అందుకున్నారు.ఈ సందర్బంగా టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ తో పాటు రేంజ్ సిబ్బంది సాయికిరణ్ ను అభిందించారు.

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర.

*ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి భూమి పూజ
నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు*

◆ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,

◆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

బర్దిపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు.దామోదర రాజనర్సింహ గారి కృషితో మంజూరైన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి శుక్రవారం దత్తగిరి మహారాజ్ గారితో కలిసి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు.ముందుగా బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో వేద పండితులు పూర్ణకుంభంతో వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Medical Health Centre

ఈకార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు పాటిల్,సిడిసి చైర్మన్ ముబీన్, జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,మాజీ సోసైటి చైర్మన్,మల్లికార్జున్ రెడ్డి,మల్లన్న పాటిల్,మొగడం పల్లీ మాజీ యం.పి.పి.గుండారెడ్డి,నర్సింహారెడ్డియూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,అశ్విన్ పాటిల్,శ్రీకాంత్ రెడ్డి,హర్షవర్ధన్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి,అక్షయ్ జాడే,సిడిసి డైరెక్టర్ మల్లారెడ్డి,గ్రామ మాజీ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి,హర్షద్ పటేల్,నర్సింహా యాదవ్,అక్బర్,జుబేర్,ఇమామ్ పటేల్ మరియు వైద్య సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కప్పాడ్ రాయికోడ్ మధ్య అనుసంధానమైన రోడ్డుపై కప్పాడ్ గ్రామ శివారులో సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు ప్రక్కనున్న ద్విచక్ర వాహనాన్ని ఏరేటిగా కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు గాయపడినటువంటి వ్యక్తులు రేగోడు మండలం జగిర్యాల్ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా.!

వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా మే 24న జహీరాబాద్‌లో నిరసన కార్యక్రమం జరగనుంది.

◆ – ఈ చారిత్రాత్మక నిరసన సమావేశానికి మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహమానీ అధ్యక్షత వహిస్తారు,మౌలానా అబూ తాలిబ్ రెహమానీ మరియు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు.

జహీరాబాద్ నేటి ధాత్ర:

జహీరాబాద్. వక్ఫ్ బచావో దస్తూర్ బచావో ప్రచారం కన్వీనర్ ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖైమి, వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉద్యమం సమాచారం ప్రకారం, వక్ఫ్ బచావో దస్తూర్ బచావో ప్రచారంలో భాగంగా, తహాఫుజ్ దస్తూర్ మరియు అవుకాఫ్ సమావేశం అనే ఆల్ పార్టీ గ్రాండ్ చారిత్రాత్మక నిరసన సమావేశం సంగారెడ్డి జిల్లా స్థాయిలో మే 24, 2025 శనివారం, అస్ర్ ప్రార్థనల తర్వాత రాత్రి 10 గంటల వరకు ఈద్గా మైదాన్ జహీరాబాద్‌లో ఈద్గా మైదాన్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఫకీహ్ అస్ర్ హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ అధ్యక్షతన జరుగుతుంది, దీనిలో ప్రత్యేక అతిథులుగా ఖతీబ్ షోలా బయాన్ హజ్రత్ మౌలానా అబూ తాలిబ్ రెహ్మానీ, హజ్రత్ మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్, అమీర్ జామియా నిజామియా, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, సభ్యుడు పార్లమెంట్ హైదరాబాద్, మిస్టర్ అక్బర్ నిజామీ, హజ్రత్ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్, జమియత్ ఉలేమా తెలంగాణ అధ్యక్షుడు, హజ్రత్ మౌలానా హుసాముద్దీన్ జాఫర్ పాషా.హజ్రత్ మౌలానా గియాస్ అహ్మద్ రషాది సాహిబ్ హజ్రత్ మౌలానా షఫీక్ ఆలం జామి జమియత్ అహ్లే హదీస్ తెలంగాణ ప్రతినిధి ఖలీద్ ముబాషిర్-ఉల్-జాఫర్ అమీర్ జమాత్-ఇ-ఇస్లామి తెలంగాణ జియావుద్దీన్ నాయర్ అధ్యక్షుడు తమీర్-ఎ-మిల్లత్ శ్రీ అబ్దుల్ అజీజ్ MPI సయ్యద్ మతీనుద్దీన్: ఖాద్రీ సయ్యద్ మసూద్ హుస్సేన్ ముజ్తహిద్ అధ్యక్షుడు అంజుమాన్ మహద్వియ్య ముహమ్మద్ అలీ షబ్బీర్ సలహాదారుడు తెలంగాణ సురేష్ కుమార్ షస్కర్ పార్లమెంటు సభ్యుడు జహీరాబాద్ కె. మాణిక్ రావు అసెంబ్లీ సభ్యుడు జహీరాబాద్ నియోజకవర్గం డాక్టర్ చంద్రశేఖర్ ఇన్-చార్జ్ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం తన్వీర్ మాజీ చైర్మన్ తంగానా అజ్మతుల్లా హుస్సేని వక్ఫ్ బోర్డు చైర్మన్ తెలంగాణ అఫ్జల్ హుస్సేన్ ఖుస్రో పాషా చైర్మన్ హజ్ కమిటీ తెలంగాణ అతి ముఖ్యమైన ప్రసంగాలు చేస్తారు. అదనంగా, ఇతర మతాల నాయకులు ప్రసంగాలు ఇస్తారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మౌలానా అతీక్ అహ్మద్ ఖాస్మీ, మౌలానా అబ్దుల్ ముజీబ్ ఖాస్మీ, ముఫ్తీ నజీర్ అహ్మద్ హుసామీ, నజీముద్దీన్ ఘోరీ, అయూబ్, జమాతే ఇస్లామీ, అతిక్ హక్కానీ, అహ్లే హదీత్, అహ్లే హదీథ్, మిస్టర్, యూసుఫ్, ఆప్షన్ కమిటీ సభ్యుడు. బాష్మ్, దావత్ తబ్లీగ్ – హఫీజ్ అక్బర్, అబ్దుల్ ఖదీర్, జమియాత్ ఉలేమా, మిస్టర్ మౌల్వీ ఖాజీ జియావుద్దీన్, మిస్టర్ ఫర్హాన్ ఖాద్రీ, అహ్లే సున్నత్ వాల్ జమాత్, అబ్దుల్ మజీద్, సఫా బైతుల్ మాల్,జమీల్ అర్షద్
కాంగ్రెస్ పార్టీ, మొహియుద్దీన్ షేక్ ఫరీద్ టిఆర్ఎస్ పార్టీ. అథర్ సాహిబ్ అజ్మత్ సాహిబ్ వైస్ చైర్మన్ ఎంఐఎం ముఫ్తీ అబ్దుల్ బాసిత్ సాహిబ్ కోహీర్ మండల్, అబ్దుల్ మజీద్ సాహిబ్ హుజ్రా సంగం మండల్, బషీర్ అహ్మద్ సాహిబ్ హఫీజ్ ఖలీల్ మక్దం పాలి మండల్, ముఫ్తీ జమీర్ నియా లకల్ మండల్ మాట్లాడుతూ, ఈ సమస్య యొక్క ప్రాముఖ్యత మరియు పరిస్థితి యొక్క సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, మతం లేదా మతంతో సంబంధం లేకుండా ఇస్లాం సోదరులందరూ నిర్ణీత సమయంలో నిరసన సమావేశంలో పాల్గొని, తమ జాతీయ ఐక్యత మరియు మతపరమైన మద్దతును ప్రదర్శించి, ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా తమ నిరసనను నమోదు చేసుకోవాలని అన్నారు.

ఫోక్సో చట్టంపై అవగాహన ఉండాలి అదనపు ఎస్పీ.

ఫోక్సో చట్టంపై అవగాహన ఉండాలి: అదనపు ఎస్పీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

అంగన్వాడీ టీచర్లకు ఫోక్సో చట్టంపై అవగాహన ఉండాలని సంజీవరావు అన్నారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో భరోసా కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలకు బాలికలపై లైంగిక దాడులు జరిగితే ఫోక్సో కేసుగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, హనుమంతు, డిసిపివో రత్నం పాల్గొన్నారు

రాచన్న స్వామి ఆలయంలో.!

రాచన్న స్వామి ఆలయంలో సీనీయర్ సివిల్ జడ్జి ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేటరాచన్న స్వామి ఆలయంలో జహీరాబాద్ సినియర్ సివిల్ జడ్జి కవిత దేవి శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేదాశీర్వాదం చేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version