నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండలంలో సిర్సవాడ గ్రామంలో తాడిచెట్టు పైనుండి కిందపడి గీత కార్మికుడు మల్లేష్ (40) మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం తాటి కల్లు దింపడానికి పైకి వెళ్లి కళ్ళు దింపే ప్రయత్నంలో.. మొకు తాడు తెగి.. భూమిపైకి జారిపడి అక్కడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతిడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చెరువులలో పూడికతీత పనులు చేపట్టాలి దళిత గిరిజన మత్స్య సహకార సొసైటీలు ఏర్పరచాలి
తాళిపేరు డ్యామ్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తాలిపేరు డ్యాం అభివృద్ధికి నిధులు కేటాయించాలి సీనియర్ జర్నలిస్ట్ నరసింహ
టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ ప్రత్యేక చొరవ చూపాలి
నేటిధాత్రి చర్ల :
చర్ల మండల కేంద్రంలోని 60 చెరువులను మినీ తాలిపేరు డామ్ గా తీర్చిదిద్దాలి గేట్లను అమర్చాలి చేపల సాగుకు మరియు వ్యవసాయ రైతుల అవసరాలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ అన్నారు అదేవిధంగా దళిత గిరిజన మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేసి చేప పిల్లలను పంపిణీ చేసి ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలి బయట ప్రాంతం నుండి వచ్చే చేపల వ్యాపారస్తులను అడ్డుకోవాలని స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలి భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మరియు ఐటీడీఏ పీవో రాహుల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు తాలుపెరు డ్యామ్ ను మరియు చెరువులను సందర్శించాలి సమగ్ర ప్రణాళికతో చర్ల మండల కేంద్రంలో సాగునీటి కాలువలు లిఫ్ట్ ఇరిగేషన్ కొరకు ఈ ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి చర్ల మండల ప్రజల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని స్థానిక దళిత గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజల ఆకాంక్ష అన్నారు అదేవిధంగా తాలిపేరు డ్యామ్ ను పూర్తిస్థాయిలో బాగుచేయాలని హైడ్రాలిక్ గేట్లను అమర్చాలని తాళి పేరు లోపల భాగంలో సిల్ట్ ను పూర్తిగా తొలగించి నీటి నిలువ సామర్థ్యం పెంపొందించి చేపల సాగుకు అనుకూలంగా మరియు రైతులకు సాగునీటిని అందించే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మండలంలోని ప్రతి చెరువుకు నీటిని పంపిణీ చేయాలి ని ఎండాకాలంలో కూడా పూర్తిస్థాయి నీటిమట్టం ఉండేలా చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి కాలువల ద్వారా నీటిని పంపిణీ చేయాలి చెరువులను సుందరీకరంగా తీర్చిదిద్దాలని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ అన్నారు
హీరోయిన్ రష్మిక మంచి జోరు మీదున్నారు. తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సరసన నటించిన ‘సికిందర్’ చిత్రం….
హీరోయిన్ రష్మిక మంచి జోరు మీదున్నారు. తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సరసన నటించిన ‘సికిందర్’ చిత్రం ఇటీవల ఫ్లాప్ అయినా ఆ ప్రభావం ఆమె మీద లేదనే చెప్పాలి. హిందీలో ఆమెకు ఆఫర్లు వస్తునే ఉన్నాయి. ఇంతవరకూ రష్మిక ఐదు హిందీ చిత్రాల్లో నటించారు. వాటిల్లో ‘యానిమల్’, ‘చావా’ చిత్రాలు పెద్ద హిట్ . మిగిలిన మూడు సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. తాజాగా ఇప్పుడు మరో హిందీ సినిమాకు రష్మిక కమిట్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2012లో వచ్చిన ‘కాక్‌టైల్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘కాక్‌టైల్ 2’ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన రష్మిక నటించనున్నారు. క్రితీ సనన్ మరో కీలక పాత్ర పోషించనున్నారు. యూర్‌పలో సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అలాగే మనదేశంలో కూడా విభిన్న ప్రాంతాల్లో షూటింగ్ చేస్తారట. వచ్చే ఏడాది ‘కాక్‌టైల్ 2’ చిత్రం విడుదలవుతుంది.
ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వచ్చిన.. అదిరిపోయే హిందీ యాక్షన్ థ్రిల్లర్
ఏప్రిల్‌లో థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించిన హిందీ చిత్రం జాట్ ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వచ్చేసింది.
ఏప్రిల్‌లో థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించిన హిందీ చిత్రం జాట్ (Jaat ). తెలుగు అగ్ర దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలీవుడ్ ఆరంగేట్రం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా మరో స్టార్ రణదీప్ హుడా (Randeep Hooda) ప్రతినాయకుడిగా నటించారు. రెజీనా (Regina Cassandra), సయామి ఖేర్ (Saiyami Kher), వినీత్ ఉమార్ సింగ్ (Vineet Kumar Singh), జగపతి బాబు, రమ్మకృష్ణ, బిగ్‌బాస్ దివి ఇతర పాత్రల్లో నటించారు. అయితే ఇప్పుడీ సినిమా ముందుగా అనుకున్న టైం కన్నా ఓ రోజు ముందుగాను ఈ రోజు గురువారం (జూన్ 6) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. రణతుంగ , అతని సోదరుడు శ్రీలంక నుంచి భారీ నిధిని దోచుకుని పారిపోయి ఇండియాకు వచ్చేస్తారు. ఆపై ఏపీలోని మోటుపల్లిని స్థావరంగా చేసుకుని దాని పరిసర గ్రామాలను తమ ఆదీనంలో ఉంచుకుని నియంతలా వ్యవరిహిస్తుంటాడు. అయితే ఓ రోజు హీరో బ్రిగేడియర్ బల్బీర్ ప్రతాప్ సింగ్ వెళ్తున్న రైలు ఆ ఊరి సమీపంలో ఆగిపోతుంది. దీంతో దగ్గర్లో ఉన్న హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేస్తుండగా లోకల్ రౌడీలు హోటల్ పై దౌర్జన్యం చేస్తూ హీరోను డిస్ట్రబ్ చేస్తారు. దీంతో కోపొద్రిక్తుడైన బ్రిగేడియర్ వారి పని పడతాడు. ఆపై అనుకోకుండా ఒకరి తర్వాత మరొక గ్యాంగ్ ఎంట్రీ ఇవ్వడం వారందరిని చితక్కొట్టుకుంటూ చివరకు ప్రదాన విలన్ రణతుంగ వరకు వెళతాడు. అదే సమయంలో ఆ ఊరి అకృత్యాల గురించి హీరోకు తెలియడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఇంతకు ఆ ఊర్లో ఉన్న సమస్య ఏంటి, హీరో ఆ క్రూరమైన విలన్లను ఒంటరిగా ఎలా ఎదిరించాడనేదే ఈ మూవీ.
ఇప్పటికే తెలుగులో వందల సంఖ్యలో వచ్చిన సినిమాల తరహాలోనే ఈ సినిమా సాగుతుంది. అయితే స్క్రీన్ ప్లే , ఎలివేషన్లు, ట్రీల్‌మెంట్ అంతా ఓ రేంజ్‌లో ఉంటూ సూపర్ హై ఇస్తుంది. మనం పాత కథే చూస్తున్నాం అని తెలిసినా సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. పైగా ఇది హిందీ సినిమా అయినప్పటికీ పూర్తిగా తెలుగు ప్రాంతం నేపథ్యంలో, ఇక్కడి నటులే కనిపిస్తూ మనం ఓ బాలీవుడ్ సినిమా చూస్తున్నామనే ఫీల్ కూడా రాదు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix ) ఓటీటీలో హిందీ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా స్ట్రెయిట్ సినిమాలానే ఉంది. థియేటర్లలో చూడని వారు, యాక్షన్ చిత్రాలు ఇష్టపడే వారు ఈ మూవీని మిస్ చేయవద్దు. ముఖ్యంగా హీరో, విలన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్.
పర్యావరణంతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని, పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్.దిలీప్ కుమార్ నాయక్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలుష్య కారకాలైన పరిశ్రమల వ్యర్థాలు, ట్రాన్స్పోర్టేషన్ అడవుల నరికివేతపై ద్రుష్టి సారించాలి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి సాలిడ్ వేస్ట్ మానేజ్మెంట్ సరిగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రావణ్ రావు స్పెషల్ పి.పి విష్ణువర్ధన్ రావు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందారపు శివకుమార్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ కంప అక్షయ జి. ప్రియాంక న్యాయవాదులు మంగళపల్లి రాజ్ కుమార్ సంగేమ్ రవీందర్ రజినీకాంత్ భూపాలపల్లి ఎస్సై రమేష్ కోర్టు సిబ్బంది, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ,సిపిఎం జిల్లా కార్యదర్శిలు కొరిమి రాజ్ కుమార్, బందు సాయిలు
వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ధర్నా, నిరసన
భూపాలపల్లి నేటిధాత్రి :
దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, బందు సాయిలు డిమాండ్ చేశారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆపరేష న్ కగార్ ను నిలిపివేయాలని కోరుతూ సిపిఐ, సిపిఎం లిబరేషన్ పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాదులతో చర్చలు జరిపిన ప్రభుత్వం అసమానతల కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులను అతి కిరాతకంగా ఎన్కౌంటర్ లో చంపడం దుర్మార్గం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని మావోయిస్టుల తో శాంతి చర్చలు జరిపి జనజీవన స్రవంతిలో కలిసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే అందుకే మావోయిస్టులను అంతం చేయాలని చూస్తుందని అన్నారు. 2026 లో ఆపరేషన్ కాగర్ పేరుతో మావోయిస్టు లను అంతం చేయాలనే దురుద్దేశంతో బిజెపి ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన చర్యకు పాల్పడుతుందని ఆరోపించారు. మావోయిస్టులు ఈ దేశ పౌరులేనని భారత రాజ్యాంగంలో జీవించే హక్కు ప్రతి మనిషికి కల్పించిందని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మనిషిని మనిషి చంపుకోవడం ఏంటని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో వామపక్ష నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, క్యాతరాజు సతీష్,వెలిశెట్టి రాజయ్య కన్నూరి దానియల్ నేరెళ్ల జోసెఫ్ మాతంగి రామచందర్,శేఖర్, పొన్నగంటి లావణ్య,గోమాత,శ్రావణి,స్వరూప ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
#మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో క్రయ విక్రయాలు.
#నిషేధిత విత్తనాలపై పర్యవేక్షణ లేని వ్యవసాయ అధికారుల పనితీరు.
నల్లబెల్లి నేటి ధాత్రి:
మారుమూల పల్లెల్లో రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తుంటారు అమాయక రైతుల అవసరాలను ఆసరా చేసుకొని కొంతమంది దళారులు నిషేధిత విత్తనాలను రైతులకు విక్రయించి కోట్లకు పడగలెత్తుతున్నారు. మండలంలోని పలు గ్రామాలలో దళారులు గ్రామాలలోని కొంతమందిని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని నిషేధిత బీటీ 3 పత్తి విత్తనాలు క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. నిషేధిత విత్తనాలపై సంబంధిత వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతోనే దళారులు ఇష్ట రీతిన నిషేధిత విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల జేబులకు చిల్లు పెడుతున్నారని పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నిషేధిత బీ టీ 3 విత్తనాలు వేయడం వల్ల రైతులు అనారోగ్యానికి గురై ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేసినప్పటికీ వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన చేయకపోవడంలో విఫలమైనరని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళారులు మారుమూల గ్రామాలలో విత్తనాలను డంపింగ్ చేసి ఏజెంట్ల ద్వారా రైతులకు ఒక్కొక్క ప్యాకెట్ ధర 1500 చొప్పున విక్రయిస్తూ ఎకరాకు 2 ప్యాకెట్లకు గాని 3000 రూపాయలు వసూలు చేస్తున్నారని విశ్వనీయ సమాచారం. అలాగే విడి విత్తనాలను కేజీకి 3500 ల చొప్పున రైతులకు విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు.
#కూలీల కలుపు ఖర్చు మిగులుతుందని.
cotton
బీటీ 3 పత్తి విత్తనాలతో ఆరోగ్యానికి హానికరం, భూమిలో భూసారం క్షీణించి పోతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీటీ-3 విత్తనాల అమ్మకాలు నిషేధించింది. కానీ బీటీ-3 విత్తనాలు మొలకెత్తిన తర్వాత కలుపు నివారణకై గడ్డి మందు పిచికారి చేసిన కూడా పంటకు ఎలాంటి నష్టం జరగదని దళారులు చెప్పడంతో రైతులు ఆ విత్తనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. తద్వారా కూలీల ఖర్చు తగ్గుతుందని పంట దిగుబడిలో ఎలాంటి తేడా ఉండదని రైతులకు దళారులు నచ్చజెప్పడంతో మండలంలో అధిక మొత్తంలో బిటి-3 విత్తనాలు రైతులు విక్రయిస్తున్నారు. బీటీ -2 విత్తనాలపై గడ్డి మందు (గ్లైబో సెట్) పిచికార్ చేస్తే పత్తి పంట ఎండిపోయే పరిస్థితి ఉంటుందని రైతులకు దళారులు అవగాహన చేస్తూ నిషేధిత విత్తనాల వైపు రైతులను మళ్లిస్తూ అదేవిధంగా నిషేధిత గడ్డి మందు (గ్లైబోసేట్) ల సైతం గ్రామాలలో డంపు చేసి రైతులకు విక్రయిస్తూ దళారులు లక్షల సైతం దండుకుంటున్నారు.
#తనిఖీలు చేపట్టని వ్యవసాయ అధికారులు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ మండలంలో బీటీ-3 విత్తనాలు విక్రయాలు జరుగుతున్న విషయం జోరుగా ప్రచారం జరుగుతున్న సంబంధిత వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల పలు విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ అధికారులు గ్రామాలలో తనిఖీలు చేపట్టి బీటీ-3 విత్తనాల విక్రయాలను అడ్డుకట్ట వేసి నిషేధిత విత్తనాల వల్ల జరిగే అనర్థాలను రైతులకు అవగాహన కల్పించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సినిమాల కోసం కోట్లల్లో పారితోషికాలు తీసుకుంటుంటారు స్టార్ హీరోలు. Some heroes liked the story and made films without taking any remuneration.. but suffered losses after the film was released.
సినిమా టికెట్లు
అదే బాటలో సిద్ధు జొన్నలగడ్డ
సినిమాల కోసం కోట్లల్లో పారితోషికాలు తీసుకుంటుంటారు స్టార్ హీరోలు. కథ నచ్చి, పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసిన హీరోలు కొందరైతే.. చిత్రం విడుదలయ్యాక నష్టాలొస్తే తాము తీసుకున్న రెమ్యునరేషన్‌ను వెనక్కి ఇచ్చిన వారు మరికొందరు. అయితే చిత్రసీమలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ, సినిమా విడుదలకు ముందే తన పారితోషికాన్ని నిర్మాతకు తిరిగిచ్చేశారు ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్‌కల్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఏ.ఎమ్.రత్నమ్ నిర్మాత. క్రిష్ దర్శకత్వంలో 2020లో మొదలైన ఈ చిత్రం పలు కారణాలతో సుదీర్ఘ కాలం పాటు సెట్స్‌లోనే ఉండిపోయింది. ఎట్టకేలకు చిత్రీకరణ పూర్తిచేసుకుని ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాకు తాను అడ్వాన్స్‌గా తీసుకున్న పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారు. ఇంతకాలం ఈ సినిమా సెట్స్ పైనే ఉన్నందుకు నిర్మాతపై పడ్డ అదనపు భారాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిర్మాతల గురించి ఆలోచించే నటుల్లో ముందు వరుసలో ఉంటారని నిరూపించుకున్నారు. మరో కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ కూడా తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు. ఆయన కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘జాక్’ ఏప్రిల్ 10న విడుదలైంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంలో విఫలమైంది. దీంతో పారితోషికంగా తాను తీసుకున్న మొత్తంలో సగం(రూ. నాలుగు కోట్లు) తిరిగిచ్చేసి తన సహృదయాన్ని చాటుకున్నారు.
Pawan kalyan
షూటింగ్‌కు సిద్ధం
పవన్‌కల్యాణ్ మరోసారి పోలీస్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. హరీశ్ శంకర్ దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా షూటింగ్ ఈ నెల రెండో వారం నుంచి మొదలవుతోందని మంగళవారం తిరుమలలో వెల్లడించారు ఆయన. త్వరలోనే పవన్‌కల్యాణ్ కూడా సెట్స్‌లోకి అడుగుపెడతారని తెలిపారు.
కల్వకుర్తి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.
కల్వకుర్తి/నేటి దాత్రి:
కల్వకుర్తి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో గురువారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. భగత్ సింగ్ తండాలో 15 లక్షల వ్యయంతో మురుగు కాలువ, కేశవ నగర్ లో 25 లక్షలతో సైడ్ డ్రైనేజీ, రాఘవేంద్ర కాలనీలో రూ. 22 లక్షలతో సీసీ రోడ్ పనులు,బాల్ రాం నగర్ లో సీసీ రోడ్, 8వ వార్డు సుభాష్ నగర్ లో రూ. 25 లక్షలతో సీసీ రోడ్, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రూ. 10 లక్షలు, ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయం వద్ద వన మహోత్సవం సందర్బంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద కల్వకుర్తి మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో చేతివృత్తుల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీమ్ముల శ్రీకాంత్ రెడ్డి,కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ల సంజీవ్ కుమార్ యాదవ్, కల్వకుర్తి మున్సిపల్ కమీషనర్ మహ్మద్ షేక్, వాస శేఖర్, మాజీ కౌన్సిలర్ లు, పార్టీ నాయకులు, కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదం’ 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్…
అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదం’ 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్. ‘‘వేదం’కు 15 ఏళ్లు. నా కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రమిది. ఇతర సినిమాలతో పోలిస్తే నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. దర్శకుడు క్రిష్‌కు రుణపడి ఉంటాను. ఎంతో నిజాయితీగా సినిమా తీశారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, అనుష్క వంటి సహనటులతో ప్రయాణించడం ఓ గొప్ప జ్ఞాపకం. ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు శోభు, ప్రసాద్ దేవినేనిలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.
ముందు అనుకున్న సినిమా వేరు
ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఓ సందర్భంలో పంచుకున్నారు క్రిష్. ‘‘గమ్యం’ తరువాత ఓ పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రానికి ప్లాన్ చేశాను. అయితే ఆ సమయంలో అమరావతికి వెళ్లినప్పుడు జరిగిన ఓ సంఘటన ‘వేదం’ కథ సిద్ధం చేసేలా చేసింది. ఓ చిన్న పిల్లాడు వృద్ధుడిని వేలు పట్టుకుని లాక్కెళ్తున్న దృశ్యం నన్ను కదిలించింది. ‘ఒక చిన్న పిల్లాడు వెట్టిచాకిరీ చేస్తాడు. వాడిని విడిపించుకోవడానికి వాళ్లమ్మ కిడ్నీలు అమ్ముతుంది’ ఇలాంటి ఓ లైన్‌తో మొదలైంది ‘వేదం’ కథ. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క భాగం కావడంతో ఈ సినిమా పెద్ద సినిమాలా మారింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అనుష్క వెనక్కి తిరిగి కొంటెగా చూస్తున్న పోస్టర్‌ను పెద్ద హోర్డింగ్‌గా చేసి పంజాగుట్ట సర్కిల్‌లో పెట్టారు. ఆ సమయంలో 40కి పైగా ప్రమాదాలు జరిగాయి. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆ తర్వాత పోస్టర్‌ను తొలగించారు. అంతలా అనుష్క ఆకట్టుకున్నారు’’ అని అన్నారు దర్శకుడు క్రిష్.
కంగువా, రెట్రో వంటి సినిమాల తర్వాత తమిళ స్టార్ సూర్య నటిస్తోన్న 46వ చిత్రం ఇటీవల వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
కంగువా, రెట్రో వంటి సినిమాల తర్వాత తమిళ స్టార్ సూర్య (Suriya) నటిస్తోన్న 46వ చిత్రం ఇటీవల వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మమితా బైజు (Mamitha Baiju) కథానాయికగా నటిస్తోండగా చాలా గ్యాప్ తర్వాత రవీనా టాండన్ (Raveena Tandon) తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండగా రాధిక కీలక పాత్రల్లో నటిస్తుంది. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ (Sitara entertainments) నిర్మిస్తోంది. జీవీ ప్రకాశ్ (G.V.Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. అయితే ఆ మధ్య పూజా కార్యక్రమాలతో సినిమా ఆరంభించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆప్డేట్ ఇచ్చారు.
Suriya46
అయితే.. హీరో సూర్యతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri), నిర్మాత నాగవంశీ (Naga Vamsi) లు గురువారం తమిళనాడులోని పళణి మురుగన్ సుబ్రమణ్య స్వామి (Palani Murugan Temple) ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూన్ 9 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు మాస్ మహా రాజా రవితేజ
Raviteja
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు మాస్ మహా రాజా రవితేజ (Ravi Teja). గత సంవత్సరం మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) చిత్రంలో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పర్చిన ఆయన త్వరలో ప్రస్తుతం మాస్ (Mass Jathara) జాతర సినిమాతో అరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా ఆగష్టులో థియేటర్లకు రానుంది. ఈ చిత్రం తర్వాత ఇప్పటికే చేతిలో మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ నటించబోయే మరో కొత్త సినిమా RT76 నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. గురువారం ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.
గతంలో రామ్‌తో నేను శైలజా, ఉన్నది ఒక్కటే జిందగీ వంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ చిత్రాలను రూపొందించిన కిషోర్ తిరుమల (KishoreTirumala) ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా SLV సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గురువారం ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఆ పోస్టర్‌లో బిజినెస్ క్లాస్ విమానంలో రవితేజ (Ravi Teja) దర్జాగా కూర్చోని ఎదుట సీటుపై కాలు వేసి కూర్చోని ఉన్న లుక్ అదిరిపోయేలా ఉంది.
కాగా ఈ సినిమాకు అనార్కలి (Anarkali) అనే టైటిల్ పరిశీలనలో ఉండగా నాగార్జున నా సామిరంగా మూవీ ఫేమ్ కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ (Ashika Ranganath) సింగిల్ బ్యూటీ కేతిక శర్మ కథానాయికలు. గురువారం షూటింగ్ ప్రారంభించిన మేకర్స్ 2026 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా అదే సంక్రాంతికి చిరంజీవి అనీల్ రావిపూడి చిత్రం విజయ్ జన నాయగన్, నవీన్ పొలిశెట్టి అనగనగా ఓ రాజు, యష్ టాక్సిక్ సినిమాల విడుదల కానుండడం గమనార్హం. దీంతో ఇప్పుడు సంక్రాంతి సినిమాల విషయంలో అప్పుడే చర్చ మొదలైంది.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలోని బోడ నరేష్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఆవాసం కల్పించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లతోపాటు ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ.. అన్ని వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ.. ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరిగేలా చూడటం తన ప్రాధాన్య లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో.. మెకానిక్ బాబా, ఎమ్మెల్యే సహోదరులు వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీమండలఅధ్యక్షులు జగన్, ఆమనగల్లు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కేశవులు, శివలింగం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్, కృష్ణా నాయక్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అప్పం శ్రీను, ఎంగలి ప్రసాద్, ఖాదర్, మాజీ వార్డు సభ్యులు సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
జీర్ణపల్లి గ్రామంలో నూతన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రేమ, కరుణ, సాటి మనిషికి సాయం ఇదే సర్వమత సారమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, వెంకట్ రెడ్డి, మాజి ఎంపీటీసీ ప్రవళిక, యువ నాయకులు మిథున్ రాజ్, మాజి సర్పంచ్ లు ప్రభు పటేల్, బస్వరాజ్, నాయకులు సంజీవ్ కిష్టయ్య బోరేగాం రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
మొగుడంపల్లి గ్రామంలోని కాలుని లో నూతన సీసీ రోడ్డు పనులు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గారి కోటా లో ఎం ఆర్ జి ఎస్ రోడ్డు పనులను ప్రారంభించిన మొగుడంపల్లి మండల అధ్యక్షులు బి.రాములు ఇటీ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ అంజయ్య జట్టప్ప అనంతరం అంజయ్య తెలంగాణ ప్రభు నాగేష్ యాదవ్ అల్లావుద్దీన్ బిఆర్ఎస్ నాయకులు వెంకటేష్ కృపాకర్ తదితరులు ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రేవూరిని కలిసిన మండల ఫర్టిలైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ
పరకాల నేటిధాత్రి :
మండల ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ అధ్యక్షులు వెంకన్న ను మరియు ప్రధాన కార్యదర్శి నవత బ్రదర్స్ శివాజీని,కోశాధికారి మల్లికార్జున,ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ లను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి విత్తనాలు లో,ఎరువులు,పురుగు మందులు వ్యాపారులు నాణ్యమైన విత్తనాలు ఎరువులను రైతులకు అందించే విధంగా నాణ్యత ప్రమాణాలతో తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని స్థానిక ఎమ్మెల్యేగా నా సహాయ సహకారాలు మీకు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా విధులు నిర్వహించాలి.
సిరిసిల్ల జిల్లా చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్
సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా అరికట్టడానికి జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది నిర్వహించే వాహనాల ఎంట్రీ రికార్డ్ లను పరిశీలించి,చెక్ పోస్ట్ లో గల సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగినది. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ సందర్బంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందిగా చర్యలు తీసుకోవడం జరిగిందని, గోవుల అక్రమ రవాణా గోవధ నివారించేందుకు జిల్లా సరిహద్దుల జిల్లెళ్ల, పెద్దమ్మ, మానాల క్రాస్ రాడ్ వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,తనిఖీల్లో సరైన పత్రాలు ఉన్న రైతులకు సంబంధించిన లేదా వ్యవసాయనికి సంబంధించిన పశువుల రవాణాకు ఆటంకం కలిగించకుండా సిబ్బంది విధులు నిర్వహిచాలని తెలియజేశారు. చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇతర డిపార్ట్మెంట్ సిబ్బంది మరియు జిల్లా పోలీస్ యంత్రాంగామంతా సమన్వయముతో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.జిల్లా ఎస్పీ వెంట ఎస్.ఐ శంకర్ నాయక్ , పోలీస్ సిబ్బంది ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ప్రతిరోజు ఓ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒకటవ తరగతిలో 11247 మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
మధుయాష్కీ గౌడ్ నివాసంలో కాంగ్రెస్ పెద్దల కీలక భేటి.
పార్లమెంటులో కాంగ్రెస్ ఆనాటి ఎంపిల పోరాటం నేపథ్యంగా డాక్యుమెంటరీ.
ఎంపిగా వున్న సమయంలో ఎమ్మెల్సీ విజయశాంతి పోరాటం కూడా డాక్యుమెంటరీలో పొందుపర్చడం జరుగుతుంది.
తెలంగాణ ఉద్యమ పోరాట చరిత్రపై డాక్యుమెంటరీ రూపొంచనున్నట్లు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ప్రకటించారు. ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల జానారెడ్డి , మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , కే కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్సీ విజయశాంతితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎన్ని పోరాటాలు జరిగినా పార్లమెంట్ లో బిల్లు పాస్ కావడం ఎంతో కీలకపరిణామమని అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. ఆ ఆర్టికల్ ను రూపొందించిందే కాంగ్రెస్ పార్టీ అని మధు యాష్కీ పేర్కొన్నారు. మధుయాష్కీ నివాసంలో జరిగిన సమావేశంలో నాయకులకు డాక్యుమెంటరీ వివరాలు తెలియజేశారు. ఈ డాక్యుమెంటరీలో కాంగ్రెస్ నాయకులు, ఎంపీలుగా ఆ సమయంలో తాము చేసిన పోరాటాన్ని తెలంగాణ సమాజానికి గుర్తు చేసేలా డాక్యుమెంటరీ వుంటుందని యాష్కీ గౌడ్ చెప్పారు. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు ఎంపిగా వున్న ప్రస్తుత ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన పోరాటం కూడా డాక్యుమెంటరీలో పొందుపర్చడం జరుగుతుందన్నారు. కేసిఆర్ కన్నా పార్లమెంటులో ఎక్కువగా విజయశాంతి పోరాటం చేసిందని మధుయాష్కీ గుర్తు చేశారు.
మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే మాణిక్ రావు కేక్ కట్ చేసిన అనంతరం గులాబీ శ్రేణులతో శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెన్నంటి నడిచిన నిజమైన గులాబీ సైనికుడు హరీష్ అని అన్నారు.పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న గొప్ప నాయకుడు హరీష్ రావు గారని కొనియాడారు. భారత రాష్ట్ర సమితి పార్టీ పార్టీ వెన్నెముక, కష్టకాలంలో నిలుస్తూ.. ప్రజల తరపున పోరాడుతున్న యోధుడు హరీష్ రావుగారని అన్నారు. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, 10 ఏండ్ల ప్రభుత్వ పాలనలో నీటి పారుదల, ఆర్థిక మంత్రిగా వారు రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారు. చరిత్రలో నిలిచిపోయే కాళేశ్వర ప్రాజెక్టు సాకారంలో కేసీఆర్ గారితో పాటు హరీష్ గారు శ్రమ, కృషి మరువలేనిదని అన్నారు. హరీష్ రావు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో , సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, ముఖ్యమంత్రిగా తిరిగి కేసీఆర్ గారిని చేయడంలో హరీష్ రావు గారి నాయకత్వాన్ని తెలంగాణ కోరుకుంటోందని అన్నారు.కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ ,యువ నాయకులు మిథున్ రాజ్ ,చిన్న రెడ్డి,వెంకట్, నర్సింహ రెడ్డి,ఇబ్రహీం,దేవదాస్,గణేష్,సురేష్ ,నరేష్ రెడ్డి,జాకీర్,అశోక్ రెడ్డి,ఇమ్రాన్ ,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.