సూర్య నాయక్ తండా నుండి పిఆర్ కొప్పుల వరకు బీటీ నిర్మాణం
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సూర్య నాయక్ తండా నుండి పిఆర్ కొప్పుల వరకు బీటీ నిర్మాణ ము అసంపూర్తిగా నిలిచి పోయింది. పనులు పూర్తి చేసే విషయంలో ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ చూపడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు కంకర పోసి వదిలి వేసిన రోడ్డుపై రాకపో కలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు పనులు చేపట్టా లని పలుమార్లు అధికా రులకు చెప్పిన స్పందన లేదు రెండేళ్ల క్రితం సూర్య నాయక్ తండా నుండి కొప్పుల గ్రామా నికి నాలుగు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 262. 50 లక్షల రూపాయలను మంజూరు చేసింది రెండు ఏండ్లు క్రితం రోడ్డు పనులు ప్రారంభించారు సూర్య నాయక్ తండా నుండి కొప్పుల వెళ్లే రోడ్డుపై కంకర పోశారు కాగా మంజూరైన నిధులకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశారు.
BT construction Surya Nayak Thanda.
చాలా కాలంగా సూర్య నాయక్ తండా నుండి కొప్పుల ప్రజలు వాహనదారులు ప్రయాణానికి అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని అసంపూర్తిగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
నూతన ఎస్సై ను మార్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
గుండాల మండల నూతన ఎస్సై సైదా రాహుఫ్ కు సన్మానం చేసిన మండల పిఎస్ఆర్,పివిఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్,ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ముత్తాపురం ఉప సర్పంచ్ మోకాళ్ళ శంకర్, సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య, యువజన నాయకులు ఎస్కె వాజీద్ పాషా, నాయకులు ఎస్కె ఖాసీం, దుర్గం బాలకృష్ణ, సోషల్ మీడియా సభ్యులు మండలోజు కిరణ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీల అమలుకోసం పోరాడాలి-సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్
కరీంనగర్, నేటిధాత్రి:
ఎన్నికల హామీల అమలు కోసం గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం పోరాడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ రామడుగు గ్రామశాఖ మహాసభ జరిగింది. ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సిపిఐ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అందులో భాగంగానే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కేంద్రంలో, రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వారిని హామీలను అమలు పరుచాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పేరుతో అర్హులైన వారికీ ఇండ్లు ఇవ్వకుండా సొంత పార్టీ కార్యకర్తలు రాజకీయం చేస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పేదలకు ఇండ్లు ఇవ్వాలన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిందని, ప్రజల సమస్యలను పట్టించుకొనే నాదుడులేరని వెంటనే స్తానిక ఎన్నికలు పెట్టాలన్నారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆలస్యం అవుతుందని,ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్ష్షన్స్ పెంపు, రైతుల ఋణమాఫీ తదితర హామీలను వెంటనే నేరవేర్చాలని లేకుంటే, ప్రజా ఉద్యమాలు తప్పవని సృజన్ కుమార్ హేచ్చరించారు. ఈసమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి గోడిశాల తిరుపతి గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, మండల నాయకులు కీర్తి కుమార్, దాము భూమయ్య, యోగి బీరయ్య, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.
పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లో ఆరుగురు గంజాయి అమ్మకం దారుల పట్టివేత…
గంజాయి పండించిన, తరలించినా, అమ్మిన సేవించిన వారి పైన కఠిన చర్యలు తప్పవు – డీసీపీ కరుణాకర్
ఓదెల (పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి :
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో విలేఖరుల సమావేశంలో డిసీపీ పి కరుణాకర్ కేసు వివరాలను వెల్లడించారు. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు గా అమ్ముచున్న గంజాయి ముఠాను పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ మరియు సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు.. పోత్కపల్లి రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుచున్న వ్యక్తులను పట్టుకొని ని విచారించగా గంజాయి అమ్మడానికి వచ్చినట్టు తెలియ చేయగా నిందితుల వద్ద ఉన్న గంజాయిని చూపించగా అది 9.664 కిలోల ఎండు గంజాయి గా ఉంది, అట్టి గంజాయిని మరియు ఒక మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు డిసిపి పి. కరుణాకర్ అన్నారు ఈ సందర్భంగా పట్టుబడిన కిరణ్ వివరాలు:-ఎ 1. గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం. ఎ 2. జాడి ప్రకాష్ గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం. ఎ) 3. గుజ్జుల సాయి తేజ, గ్రామం. ద్వారకా నగర్, గోదావరిఖని. ఎ 4. కొమురవెల్లి పవన్, గ్రామం. రామగుండం. ఎ 5. ఇందిబెల్లి సందీప్ గ్రామం. అంతార్గాం. ఎ 6. లింగన్నపేట విష్ణువర్ధన్ గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం. మరియు పరారీలో ఉన్న నిందితులు ఎ 7. ఖేల కుమార్, గ్రామం. ఉరుమనూర్, కలిమేల, ఒడిస్స రాష్ట్రము. స్వాధీనం చేసుకున్న గంజాయి దాదాపు 9.664 కిలోల పట్టుకున్న గంజాయి విలువ రు. 4,80,000/- ఒక మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పట్టుకున్న గంజాయిని డిప్యూటీ తాసిల్దార్ బాలసాని శ్రీనివాస్. రెవిన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ జూనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ ఫోటోగ్రాఫర్ ఇరుకుల వీరేశం ఏఎస్ఐ రత్నాకర్ హెచ్ సి జి కిషన్ పిసి రాజేందర్ సతీష్ ల సమక్షంలో పంచనామ నియమించారని అన్నారు యువకులు ఈజీ మనీ కోసం అమాయకుల ప్రాణాలతో చెలగాటం వాడుతున్నారని గంజాయి మహమ్మారి బారినపడి ఎంతో విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మత్తు కు అలవాటు పడి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వ్యక్తులు 4698 ఎక్కడ కనబడ్డ విక్రయించిన పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు అదేవిధంగా ఆర్థిక నేరాలకు చేస్తున్న పలువురిని చకచక్యంగా పట్టుకున్నందుకు ఎస్సై దీకొండ రమేష్ మరియు పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ వారికి రివార్డు అందజేశారు ఈ కార్యక్రమంలో డిసిపి పి కరుణాకర్ ఏసిపి గజ్జి కృష్ణ యాదవ్ సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఎస్సై దీకొండ రమేష్ ఏఎస్ఐ రత్నాకర్ జి కిషన్ పిసి రాజేందర్ సతీష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
మారుపాక అనిల్ కుమార్ డి.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
వరంగల్ నేటిధాత్రి.
ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నరమేధాన్ని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు శివనగర్, తమ్మెర భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతు, నక్సలిజాన్ని అంతం చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం, పేదరికాన్ని ఎందుకు అంతం చేయలేకపోతుంది అని ప్రశ్నించారు. మావోయిస్టులతో బేషరతుగా చర్చలు జరిపి, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. 2025లో ఇప్పటివరకు మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీలు కలిపి సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయారు అని, దేశ చట్టాలు, సాయుధ ఘర్షణలకు సంబంధించిన నియమాలను పక్కన పెట్టి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మావోయిస్టులను భౌతికంగా నిర్మూలించేందుకు సాయుధ బలగాలను వినియోగిస్తోంది అని అన్నారు. కర్రెగుట్ట కొండలను పారా మిలిటరీ బలగాలతో చుట్టివేయటం, ఆదివాసీల హక్కులను పూర్తిగా పట్టించుకోకపోవటం అభీష్టకరమైంది కాదన్నారు.
శాంతి చర్చల ప్రతిపాదనపై కేంద్రం నిర్లక్ష్యం.
సి.పి.ఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తమ శాంతియుత చర్చల సన్నద్ధతను ఇప్పటికే ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇకపోతే, మావోయిస్టులు ఒకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజాస్వామిక శక్తులు ఐక్యం కావాలి అని, మావోయిస్టుల ప్రతిపాదనకు బదులుగా ప్రభుత్వం షరతులు విధించడం శాంతి లక్ష్యాలకే వ్యతిరేకమని అన్నారు. ప్రజాస్వామిక పద్ధతుల్లోనే శాంతిని సాధించాలి. అందుకే అన్ని ప్రజాస్వామిక సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి తక్షణ కాల్పుల విరమణ, బేషరతు చర్చల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. భౌతిక నిర్మూలన కాదు, రాజ్యాంగబద్ధ పరిష్కారం కావాలి అని డి హెచ్ పి ఎస్ స్పష్టం చేస్తోంది అని అన్నారు.
మంగపేట మండలం రాజుపేట గ్రామంలో గల జామియా మజీద్ యిమామియా లో ఈరోజు శుక్రవారం నమాజ్ అనంతరం జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు అందరు కలిసి ముక్తకంఠంతో పెహల్గామ్ దాడిని ఖండించారు. గ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించి ఫ్లకార్టులతో నిరసనను తెలియజేసినారు అనంతరం ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన ఎండి ఇషాక్ మాట్లాడుతూ అమాయక ప్రజలైన పర్యటకుల ను అతి కిరాతకంగా కాల్చి చంపడం దారుణమని ఇటువంటి చర్య చేసిన వ్యక్తులు ఎటువంటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని ముస్లిం మతస్తులు ఎవరు ఎదుటి వ్యక్తిని చంపడానికి కానీ గాయపరచడానికి కానీ ఒప్పుకోరు అటువంటి హత్యలు చేసిన వారు ముస్లిం మతస్తులు కారు వారు కాఫిర్లు భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలందరూ కులమతాలకి అనుకూలంగా అన్నదమ్ముల సేవా భావంతో కలిసి మెలిసి జీవనం సాగిస్తున్నాం ఇటువంటి చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా వారికి కఠిన చర్య తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఇకపై ఇటువంటి చర్యలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి కులమత బేధాలు లేకుండా ప్రజలందరినీ క్షేమంగా చూసుకోవాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఇస్మాయిల్ జి క్రియా, దావూద్ కౌషల్ జాంగిర్ హుస్సేన్ అక్బర్ రఫీ, ముస్లిం పెద్దలు పిల్లలు అందరూ హాజరైనారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,సిద్దిపేట శాసన సభ్యులు టి హరీష్ రావు మేమాసం 4 వతారీకు ఆదివారం ఉదయం జహిరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించతలపెట్టిన దుర్గా భవాని ఆలయజాతర కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు నిర్వాహకులు శనివారం మధ్యాహ్నం విడుదల చేసిన పత్రికా ప్రకటన లో తెలిపారు.
నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు న్యాల్కల్, డప్పు ర్ మీదుగా జహీరారాబాద్ వరకు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ బస్సును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 10 సంవత్సరాలకు పైగా నిలిచిపోయిన ఈ రూట్ లో బస్సులు ఏర్పాటు చేయడంపై ఆయా గ్రామాల ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనగణన, కులగణన చేపడతామని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని, కులగణనతో దేశంలోని అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కేంద్రం నిర్ణయానికి ప్రజలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఈ విజయం తమదే అంటూ గొప్పులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.60 యేండ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కులగణన ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణన, జనగణనలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉండే భారతీయులందరూ భాగస్వాములు కావాలని సందీప్ పేర్కొన్నారు.
విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో రెండవ దశ ఒలంపియాడ్ ఫౌండేషన్ పరీక్ష విజేతలకు కలెక్టర్ పమేలా సత్పతి బహుమతులు అందజేశారు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల సంయుక్తంగా నిర్వహించిన ఒలంపియాడ్ పరీక్షలకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి ఎనబై మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఫలితాలను పెంపోందించెందుకు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాంటి అవకాశాలను విద్యార్థులకు అందేలా ప్రోత్సహించాలని, ఈకార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వసతులు కల్పిస్తూ, ప్రోత్సాహన్ని అందిస్తున్న ఆల్పోర్స్ విద్య సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డిని కలెక్టర్ అభినందించారు. ప్రస్తుతం యాభై ఏడు మంది నుండి మూడవ బ్యాచ్ డెబ్బై ఐదు మందిగా తిరిగివచ్చి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను కోరారు. ఈకార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, రామడుగు తాహశీల్దార్ రాజేశ్వరి, విఎన్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
◆ సందర్భంగా పాత్రికేయ సోదర సోదరీమణులందరికీ శుభాభినందనలు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పాత్రికేయ
జహీరాబాద్ నేటి ధాత్రి:
‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ సందర్భంగా జహీరాబాద్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పాత్రికేయ సోదర, సోదరీమణులందరికీ శుభాభినందనలు తెలియజేశారు. “పత్రికా స్వేచ్చ ప్రజాస్వామ్యానికి ఒక మూలస్తంభం. సత్యాన్ని వెలికి తీసే కర్తవ్య నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పాత్రికేయులు చూపే నిబద్ధత, ధైర్యం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. సమాజంలో వారి సేవ అమూల్యం” అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం.. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించటం మీడియా కర్తవ్యం.. నిష్పక్షపాతంగా వృత్తి నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులకు వందనం..ఒక సందేశంలో పేర్కొన్నారు.
పహల్గామ్ దాడికి నిరసనగా రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతం..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతంగా కొసాగింది. ఈ బందులో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని తమ దుకాణాలను మూసివేసి సంఘీభావం ప్రకటించారు. అమాయకులైన పర్యాటకులను ముష్కరులు లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడడం హేయనీయమైన చర్య అని అందుకే స్వచ్ఛందంగా బందు పాటిస్తున్నామని పలువురు వ్యాపారస్తులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఘనంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు వేడుకలు
మంగపేట నేటి ధాత్రి
మంగపేట మండలంలో శ్రీ కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో శివాలయం లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కస్తూరిబాయి వృద్ధాశ్రయంలో కేక్ కట్ చేసి పండ్లు స్వీట్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ,జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, తాటి కృష్ణ, పి ఎ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్ ,మండల సీనియర్ నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య,వాలీబాబా, తడూరి రఘు ,మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందం, మేడారం మాజీ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్, పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడిశా నాగరమేష్, పి ఎ సి ఎస్ డైరెక్టర్ సిద్ధంశెట్టి లక్ష్మణ్ రావు ,జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి, మండల నాయకురాలు పార్వతి, అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు సోషల్ మీడియా వారియర్స్, వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ,
నర్సంపేట పట్టణ నూతన సీఐగా పదవి బాధ్యతలను చేపట్టిన లేతాకుల రఘుపతి రెడ్డిని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ పలువురు నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.అనంతరం పుష్పగుచ్చం అందించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మసూద్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు మెరుగు సాంబయ్య, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ అయూబ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షులు దూదేల సాంబయ్య, వేముల సారంగం, నర్సంపేట పట్టణ ఓబీసీ ఉపాధ్యక్షులు ఓర్సు సాంబయ్య, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నాంపల్లి వెంకటేశ్వర్లు,నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, 13వ వార్డు ఇంచార్జ్ శ్రీరామోజ్ మురళీ, మాజీ వార్డు సభ్యులు గాజుల రమేష్, గండి గిరి, నాగుర్లపల్లి మాజీ సర్పంచ్ రాజహంస, 1వ వార్డు అధ్యక్షులు లాక్కార్స్ రమేష్, 5వ వార్డు అధ్యక్షులు పున్నం నరసింహారెడ్డి, 8వ వార్డు అధ్యక్షులు గిరగని రమేష్, 20వ వార్డు అధ్యక్షులు రామగొని శ్రీనివాస్, 23వ వార్డు అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, 5వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు అశోక్, ఎరుకల రమేష్, హిందు రాజు, దేశి సాయి పటేల్, తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణంలోని ఐఎన్టియుసి కార్యాలయంలో ఐఎన్టియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంఘం సభ్యులు జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. కనీస వేతనాల బోర్డు చైర్మన్, ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించినట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజావత్ రాంబాబు, ఐఎన్టియుసి సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంఘ బుచ్చయ్య, ఏరియా సెక్రెటరీ బత్తుల వేణు, సిహెచ్పి ఫిట్ సెక్రటరీ రాములు, సివిల్ ఫిట్ సెక్రటరీ గుర్రం శ్రీనివాస్, కాసర్ల ప్రకాష్ ఐ ఎన్ టి యు సి నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీఎమ్మెల్యేరావులదంపతులకు వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆ ర్ సి
వనపర్తి నేటిదాత్రి :
మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి వరలక్ష్మి వివాహ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాదులో రాష్ట్ర రాజకీయ మాజీ కార్యదర్శి శ్రీశైలంమల్లికార్జున నిత్య అన్నదాన సత్రం డైరెక్టర్ కలకొండ రమేష్ చంద్ర ఆధ్వర్యంలోగుర్రం జగదీశ్వరయ్య మల్లికార్జున్ లోటస్ సెలూన్ రామకృష్ణ కలిసిపూలబోకె ఇచ్చి శాలువతో రావులను ఘనంగా సన్మానించారు ఈసందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు
ఝరాసంగం మండల తహసిల్దార్ కార్యాలయంలో నయబ్ తహసిల్దార్ బదిలీ అయి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు మాత్రం పాతదాన్నే కొనసాగిస్తోన్నారు. ఈ బోర్డులో సమాచారాన్ని అం దించే అధికారుల పేర్లు లేకపోవడంతో ప్రజలు సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలనే అయోమయంలో ఉన్నారు. ఇందులో సీనియర్ సహాయకులు ఎవరన్నది ఇప్పటి వరకు బోర్డులోను, కార్యాలయంలోను లేకపోవడం గమనార్హం. కొత్త అధికారుల వివరాలతో బోర్డును నవీకరిం చకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, వెంటనే బోర్డు మార్చాలని వివిధ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా మే 6వ తేదీ మంగళవారం జహీరాబాద్‌లో జరిగే మహిళల నిరసన సమావేశంలో పాల్గొనమని విజ్ఞప్తి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రారంభించిన దేశవ్యాప్త నిరసన ఉద్యమం “సేవ్ ఎండోమెంట్, సేవ్ కాన్స్టిట్యూషన్”లో భాగంగా, “సేవ్ ఎండోమెంట్, సేవ్ కాన్స్టిట్యూషన్” అనే పేరుతో మహిళల చారిత్రాత్మక కేంద్ర సర్వసభ్య నిరసన సమావేశం 2025 మే 6 మంగళవారం ఉదయం 10:01 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు స్థానిక ప్రచారకర్త హజ్రత్ మౌలానా అతిక్ అహ్మద్ కాస్మి అధ్యక్షతన జరుగుతుందని ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మి కానో మరియు ఎండోమెంట్స్ ప్రొటెక్షన్ క్యాంపెయిన్ జహీరాబాద్ తెలియజేశారు. ఈ సమావేశానికి హజ్రత్ మౌలానా ఘియాస్ అహ్మద్ రషాది, కన్వేజ్, వక్ఫ్ బచా క్యాంపెయిన్, తెలంగాణ, శ్రీమతి న్యాయవాది జలీసా యాస్మిన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మహిళా విభాగం ఇంచార్జి, వీరితో పాటు జామియా గుల్షాన్ గర్ల్ టీచర్స్ డిపార్ట్‌మెంట్ హెడ్, జామియా గుల్షన్ హనీస్ ఖైరీ- జమాతే ఇస్లామీ మహిళా విభాగం అధిపతి బుష్రా అఫ్రోజ్, సున్నీ దావత్-ఏ-ఇస్లామీ మహిళా విభాగం ఇన్‌చార్జి జహీర్ అబా, మౌలానా అబ్దుల్ ముజీబ్ ఖాస్మీ – ముఫ్తీ నజీర్ అహ్మద్ హస్సామీ, మిస్టర్ ముహమ్మద్ నజీముద్దీన్ ఘోరీ, స్థానిక జమాత్ ఘోరీ ఈ సమావేశానికి సయ్యద్ జియావుద్దీన్ మౌలానా మసూమ్ ఆలం కూడా హాజరుకానున్నారు. జహీరాబాద్ నగరం మరియు హదీసు పరిసర ప్రాంతాల మహిళలు మరియు బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ జాతీయ ఐక్యత మరియు ఇస్లామిక్ మద్దతును ప్రదర్శించాలని జమియత్ ఉలేమా, జమాతే-ఇ-ఇస్లామి, సఫా బైతుల్ మల్, సున్నీ దావత్-ఇ-ఇస్లామి, జమియత్ అహ్లే యాత్ ముస్లిం యాక్షన్ కమిటీ మరియు అన్ని ఇతర సంస్థల నాయకులు విజ్ఞప్తి చేశారు.
రద్దు చేసుకున్నవారిలో ముంబై, పూణె, బెంగళూరు, పశ్చిమ బెంగాల్ పర్యాటకులు
స్థానికుల్లో ఉగ్రవాదులపట్ల ఆగ్రహావేశాలు
జీవనోపాధిని దెబ్బకొట్టారన్న బాధ
ఇప్పుడిప్పుడే మళ్లీ వస్తున్న పర్యాటకులు
పరిస్థితి చక్కబడితే మళ్లీ పర్యాటకుల సందడి
హైదరాబాద్,నేటిధాత్రి:
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26మంది అమాయక పర్యాటకును ఉగ్రమూకలు పొట్టనపెట్టుకున్న సంఘటన జరిగి పదిరోజులు కావస్తోంది. ఇప్పటికీ పహల్గామ్ ప్రాంతం ఈ షాక్‌నుంచి తేరుకోలేదు. అయితే ఇప్పుడిప్పుడే పర్యాటకులు వస్తుండటంతో స్థానికుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. పదిరోజులవరకు పోటెత్తిన పర్యాటకులతో కళకళలాడిన పహల్గామ్ ప్రాంతం ఉగ్రసంఘటనతో ఒక్కసారిగా వెలవెలపోయింది. అప్పటివరకు పర్యాటకుల వల్ల వస్తున్న ఆదాయంతో ఎంతో సంతోషంగా వున్న స్థానికుల్లో జీవనాధారం కోల్పోవడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. శీతాకాలం వారికి ఎటువంటి ఆదాయం వుండదు. ఈ ఎండాకాలంలోనే సంపాదించుకునే ఆదాయమే కశ్మీరీలకు ఏడాది పొడవునా కడుపునా జీవనం గడవడానికి ఆధారం. అటువంటిది ఒక్కసారిగాఆదాయం కోల్పోవడంతో వారిలో తీవ్రమైన నిరాశ ఆవహించిందన్న మాట వాస్తవం. ఎందుకంటే కశ్మీర్ సందర్శించే ఒక పర్యాటకుడు రోజుకు సగటున రూ.10వేలు ఖర్చు చేస్తాడు. పర్యాట కుల సంఖ్యను బట్టి ఈ ఆదాయాన్ని లెక్కిస్తే, ఈ రంగం ఎంత చక్కటి జీవనోపాధిని కలిగిస్తున్నదీ అర్థమవుతుంది. ఎంతోకష్టపడి నిర్మించుకున్న ఆకాశహార్మ్యాన్ని ఒక్క అగ్గిపుల్లతో భస్మీపటలం చేయొచ్చు. ప్రస్తుతం పహల్గామ్ సంఘటన ద్వారా ఉగ్రవాదులు చేసిన పని ఇదే. పర్యాటక ‘హార్మ్యాన్ని’ కుప్పకూల్చడానికి యత్నించారు.
పర్యాటకానికి తాత్కాలిక బ్రేక్
1988ా89 ప్రాంతంనుంచి అశాంతి, హింసాకాండ మధ్య నలిగిపోయిన కాశ్మీరంలో, 370 అధికరణం రద్దు తర్వాత ప్రగతి ఉషోదయ కాంతులు ప్రారంభమయ్యాయి. మాల్స్, సినిమా ధియేటర్లు తెరుచుకున్నాయి, హోటళ్లు, రిసార్టులు పర్యాటకులతో కళకళలాడాయి. స్థానిక కశ్మీరీలు తమ జీవనోపాధికి సంపాదించుకునే అవకాశాలు మళ్లీ మామూలు స్థితికి చేరుకోవడంతో వారి లో సుఖ సంతోషాలు మళ్లీ ప్రారంభయ్యాయి. గత ఆరేళ్లుగా ఎటువంటి ఉగ్రసంఘటన లేకపోవడంతో కశ్మీర్ వేగంగా మామూలు స్థితికి చేరుకుంది. సరిగ్గా ఇదేసమయంలో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గామ్‌లో పర్యాటకులను పొట్టనపెట్టుకోవడంతో ఇన్నేళ్లుగా క్రమంగా నెలకొంటూ వచ్చిన మామూలు స్థితికి బ్రేక్ పడిరది. ఒక్కసారిగా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పర్యాటకులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. తమ జీవితాలు మళ్లీ కొడిగట్టిపోతాయన్న భయం స్థానికుల్లో వ్యక్తమైంది. నిర్మానుష్యంగా వున్న ఈ ప్రాంతం మాదిరిగానే, కళతప్పిన కళ్లతో మళ్లీ స్థానికుల్లో దీనావస్థ మొదలైంది. జీవనోపాధి కోల్పోయిన స్థానికుల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ సంఘటన నేపథ్యంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
కట్టిపడేస్తున్న కశ్మీర్
కానీ భూతల స్వర్గమైన కశ్మీర్ పర్యాటకులను తన అందచందాలతో కట్టిపడేస్తూ పదేపదే వచ్చేలాఆహ్వానిస్తూనే వుంటుంది. ఇప్పుడు సరిగ్గా జరుగుతున్నదిదే. ఉగ్ర సంఘటన తర్వాత నిస్తేజంగా మిగిలిన పహల్గామ్ ప్రాంతంలో మళ్లీ పర్యాటకుల రాక మొదలైంది. నిజానికి ఉగ్రసంఘటన జరిగిన పహల్గామ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోని బైసరాన్ పర్వతాగ్రంపై వున్న పచ్చిక మైదానాల ప్రదేశాన్ని ‘స్విడ్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొంటారు. ప్రభుత్వం కూడా భద్రతా కార ణాల రీత్యా మొత్తం 87 పర్యాటక ప్రదేశాల్లో 48 వరకు ప్రభుత్వం మూసివేసింది. దూష్‌పత్రి, కోకెరాంగ్, దుక్సుమ్, సింథన్ టాప్, అచ్ఛాబల్, బంగస్ వ్యాలీ, మార్గాన్ టాప్, తోసా మైదాన్ వంటి పర్యాటక ప్రదేశాలు మూసివేసిన వాటిల్లో వున్నాయి.బుద్గాం లోని దూధ్‌పత్రి, అనంతనాగ్‌లోని వెరినాగ్ వంటి సుందర ప్రదేశాల్లోకి కూడా ప్రస్తుతం పర్యాటకులను అనుమతించరు. వీటి మూసివేతను అధికారికంగా ప్రకటించకపోయినా, వీటి ఎంట్రీ ప్రదేశాలు తాళాలు వేసి వుంటున్నాయి. గుల్‌మార్గ్, సోన్‌మార్గ్, మొఘల్ గార్డెన్స్, దాల్ లేక్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాం తాలు ఇంకా తెరిచే వున్నాయని చెబుతున్నప్పటికీ మొఘల్ గార్డెన్స్‌లోకి ప్రవేశించే గేట్లు తెరుచుకోవడంలేదు.
ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఏళ్లు…
పాక్ ప్రేరిత ఉగ్రవాదంతో సతమతమైన ఈ ప్రాంతం, తిరిగి ఇప్పటి స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఏళ్లు పట్టిందనేది నిజం. గత ఏడాది కశ్మీర్‌ను సందర్శించిన వారి సంఖ్య 20మిలియన్లను దాటడం, ఇక్కడ పర్యాటకం ఏ స్థాయిలో ఊపందుకున్నదీ వెల్లడిస్తున్నది. అయితే ఉగ్రసంఘటనతర్వాత పూణె, ముంబయి, బెంగళూరు మరియు పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పెద్దసంఖ్యలో తమ బుకింగ్‌లను రద్దు చేసుకున్నారనేది టూర్ ఆపరేటర్లు చెబుతున్న మాట. 80 నుంచి 90శాతం బుకింగ్స్ రద్దయ్యాయని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. అయితే అడ్వాన్స్ మొత్తాలను చెల్లించిన పర్యాటకులు మాత్రం తమ పర్యాటక ప్రణాళికను యధాతథంగా కొనసాగిస్తున్నారని వారు చెబుతున్నారు. ఇదిలావుండగా ఈ సంఘటన నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం మరింత ఆలస్యం కాక తప్పదు. ఈ ప్రాంతంలోకి ఇప్పుడిప్పుడే వస్తున్న పెట్టు బడులపై కూడా ప్రభావం పడే అవకాశముంది. ఇప్పటికే వున్న వ్యాపారాలు బిక్కుబిక్కు మంటూ కొనసాగించక తప్పని పరిస్థితి! ఇదిలావుండగా జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఏప్రిల్ 28న అసెంబ్లీలో చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ, మరణించిన 26మంది పేర్లు చదివి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరిని క్షమించమని అడగడానికి కూడా మాటలు రావడంలేదన్నారు.
ఒక్క దాడితో మొత్తం తల్లక్రిందులు
నిజానికి 2025లో కశ్మీర్ జీఎస్‌డీపీ 7.06%గా వుండగలదని అంచనా. ఇది దేశ జీడీపీ కంటే ఎక్కువ! 2019 నుంచి 2025 వరకు రాష్ట్ర సమ్మిళిత వార్షిక ప్రగతి (సీఏజీఆర్) 4.89%గా న మోదైంది. ఫలితంగా 2025 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,703గా న మోదైంది. ఉగ్ర సంఘటనలు కూడా 2018లో 223 జరగ్గా 2023నాటికి 46కు పడిపోయాయి. సోపోర్ మండి వార్షిక టర్నోవర్ 2024లో రూ.7వేల కోట్లకు చేరుకుంది. కుప్వారా, బండిపుర, బారాముల్లా, బుద్గాం ప్రాంతాల ప్రజల జీవనోపాధిని ఈ మండి సుస్థిరం చేసింది. అదేవిధం గా 2020లో 34 లక్షలమంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శిస్తే, 2024 నాటికి వీరి సంఖ్య 2.36కోట్లకు చేరుకోవడం విశేషం. ఈ నాలుగేళ్ల కాలంలో పర్యాటకుల సంఖ్య ఇంత విపరీతంగా పెరగడం రాష్ట్ర ఆర్థిక పుష్టికి దోహదం చేసింది. ప్రస్తుతం కశ్మీర్‌లో పర్యాటక రంగంపై ఆధారపడి 1500 హౌజ్ బోట్లు, మూడువేలకు పైగా హోటల్ రూమ్‌లు, టాక్సీ ఆపరేటర్లు, టూర్ గైడ్‌లు, చేనేత వస్తువుల అమ్మకందార్లు, చిన్న గుర్రాలు (పోనీ)ల నిర్వాహకులు ఆధారపడి బతుకు తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రకటన, తర్వాత నాలుగు రోజులకు జరిగిన ఉగ్రదాడి ఈ మొత్తం కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవనోపాధులను అంధకారంలోకి నెట్టేసిందన డం అతిశయోక్తి కాదు.
ఆత్మవిశ్వాసంతో పర్యాటకులు
వాస్తవానికి 1989 నుంచి పతాకస్థాయికి చేరిన ఉగ్రవాదం నేపథ్యంలో భద్రతా దళాలపైనే, ముష్కరులు దాడులు చేస్తూ వచ్చారు. కానీ ఈసారి సాధారణ పర్యాటకులను పొట్టనపెట్టుకోవడంతో, సర్వేసర్వత్రా వారిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పహల్గామ్ వంటి ప్రాంతాలు రాష్ట్రానికి పర్యాటకపరంగా అత్యధికంగా ఆదాయాన్ని సమకూరుస్తాయి. సంఘటన తర్వాత ప ర్యాటకుల సంఖ్య పడిపోతే, స్థానికుల జీవనోపాధి మాత్రమే కాదు, రాష్ట్ర ఆదాయం కూడా భారీగా పడిపోతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. శాల్వలు అమ్ముకునేవారు, డ్రైవర్లు, రి సార్టుల్లో పనిచేసే వర్కర్లు మొదలైనవారిలో ప్రస్తుతం అయోమయం నెలకొంది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ వస్తున్న యాత్రికులతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దాడి తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అతుల్ కులకర్ణి వున్నారు. వియత్నాం కు చెందిన పర్యాటకులు కూడా పహల్గామ్‌లో సందడి చేశారు. తాము తొలిసారి కశ్మీర్‌ను సందర్శిస్తున్నామని, ఇక్కడి అందాలు తమను మంత్రముగ్ధులను చేస్తున్నాయని, తాము ఇక్కడి సౌం దర్యాన్ని ఆస్వాదిస్తున్నామని చెప్పడం విశేషం. భదేర్వాప్‌ా ప్రాంతాన్ని నేపాలీ సందర్శకుడు సందడి చేశాడు. ఇక్కడి పచ్చికమైదానంలో తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించాడు. అంతేకా దు ఇక్కడికి వస్తున్న పర్యాటకులు కశ్మీర్‌లో పర్యటించాలన్న తమ నిర్ణయంలో ఎటువంటి మా ర్పు లేదని దృఢ నిశ్చయంతో చెబుతుండటం విశేషం. ఏదో ఒక్క సంఘటన జరిగిందని పర్యాటకులు తమ బుకింగ్స్‌ను రద్దు చేసుకో వద్దని, కశ్మీర్ ఎల్లప్పుడూ తన స్వచ్ఛమైన సౌందర్యంతో పర్యాటకులకు ఆహ్వానం పలుకుతూనే వుంటుందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్న మాట!
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సన్న బియ్యం సరఫరా, మిల్లర్ల సమస్యలపై ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ కమీషనర్ ‘‘దేవేంద్ర సింగ్ చౌహాన్’’ ఇచ్చిన సమాధానాలు… `సన్న బియ్యం సరఫరా తెలంగాణ ప్రజల కళ్లలో నిండిన ఆనందం.
`సన్న బియ్యం అందించడం విప్లవాత్మక నిర్ణయం.
`రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల నుంచి ప్రశంసలు.
`నేను కమీషనర్‌గా వున్న సమయంలో ప్రారంభం గొప్ప అనుభూతి.
`నా ఉద్యోగ నిర్వహణలో ఇదొక ఛాలెంజ్.
`సన్న బియ్యం సరఫరా సాధ్యమే అని నిరూపించాం.
`పాలకుల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
`సన్న బియ్యం సరఫరాలో మిల్లర్ల పాత్ర కీలకం.
`మిల్లర్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు వుంటాయి.
`ఏ మిల్లరైనా సరే నేరుగా వచ్చి వారి సమస్యలు చెప్పుకోవచ్చు.
`మిల్లర్ల వ్యవస్థ ఎంత బాగుంటే సన్న బియ్యం సరఫరా అంత బాగుంటుంది.
`సన్న బియ్యం సరఫరాపై ‘‘ఐఎస్‌ఓ’’ సర్టిఫికేట్ కూడా అందించింది.
`‘‘ఫైవ్ స్టార్’’ రేటింగ్‌తో సన్న బియ్యం సరఫరా సక్సెస్ అయ్యింది.
`ప్రజలు ఎంతో సంతోషంగా వున్నారు.
`ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి సన్న బియ్యం సరఫరా మీద వివరాలు తెలుసుకుంటున్నారు.
`తాజాగా జార్ఖండ్ నుంచి మంత్రితో పాటు, అధికారులు వచ్చారు.
`వారికి పరవ్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
`ఇప్పటికే ఐదు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
`వారి రాష్ట్రాలలో అమలు కోసం అవసరమైన సలహాలు తీసుకున్నారు.
`‘‘నలభై ఏళ్ల’’ క్రితం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం.
`ఇప్పుడు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేయడమంటే గొప్ప కార్యక్రమం.
`ఆహార భద్రతలో తెలంగాణ నెంబర్ వన్.
హైదరాబాద్,నేటిధాత్రి
కట్టా రాఘవేంద్రరావు: సార్..నమస్తే..
దేవేంద్రసింగ్ చౌహాన్: నమేస్తే…
కట్టా: ఎలా వున్నారు?
చౌహాన్: బాగున్నాను..మీరు.
కట్టా: హపీ సార్…సన్నబియ్యం ఒక సంచలనం అంటున్నారు. ప్రజల్లో ఎలాంటి ప్రభావం కనిపిస్తోంది?
చౌహాన్: నిజం చెప్పాలంటే ఇది ఒక అర్భుతమైన ఫీలింగ్ అని చెప్పాలి. పేద వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కంటే గొప్ప పథకం ఏముంటుంది. ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వాల లక్ష్యం. అందులోనూ కూడు, గూడు, గుడ్డ కూడా సమకూర్చే పథకాల అమలు చేసిన ప్రభుత్వాలు ప్రజల హృదయాలలో నిలిచిపోతాయి. నిజానికి ప్రజలను ఆకలి బాధలు పడకుండా ప్రభుత్వాలు చూడడం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాకపోకపోయినా, సన్న బియ్యం పధకం కొత్తగా వుంది. ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు. ప్రభుత్వాలు ప్రజల ఆకలి తీర్చడంమొదలు పెట్టి కొన్ని దశాబ్దాలౌతోంది. కాని ఇంత విసృత స్ధాయిలో ప్రజలకు ఆహారభద్రత కల్పించడం అన్నది కొంత కాలం నుంచి మాత్రమే వస్తోంది. ముఖ్యంగా 1985 నుంచి ఈ పధకం గొప్పగా అమలు జరుగుతోంది. అప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం అన్నది ఇప్పటికీ అమలు జరుగుతుండడం మంచి పరిణామం. అయితే రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం అమలు మొదలై ఇప్పటికీ 40 సంవత్సరాలు గుడుస్తోంది. అప్పుడు మార్కెట్‌లో బియ్యం రేటు కూడా నాకు తెలిసి రూ.4 వరకు వుండొచ్చు. అప్పట్లో సన్న బియ్యం కూడా అదే ధరలో వుండొచ్చు. తర్వాత ప్రజలకు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం సాద్యం కావడంలేదని కిలో బియ్యం రూ.5కు పెంచిన ప్రభుత్వంకూడా వుంది. కాని 1985లో ఎన్టీఆర్ సమయంలో రెండు రూపాయలకు కిలో బియ్యం అమలు జరిగిన తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం 1.90పైసలకు కిలో బియ్యం అందించింది. తర్వాత చంద్రబాబు నాయకుడు ప్రభుత్వం దాని ధర పెంచింది. 2004 ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి కిలో రెండు రూపాయలకు మళ్లీ ఆ పదకం అమలు చేశారు. అయితే అప్పటికి మార్కెట్‌లో బియ్యం పది రూపాయలకు పైనే వుంది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి దానిని రూపాయికి చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బియ్యం సరఫరాచేస్తున్నప్పటికీ సన్నబియ్యం సరఫరా అన్నది ఒక విప్లవాత్మకమైనది. గతంలో ప్రభుత్వాలు హమీలు ఇచ్చాయి. కాని అమలు చేయలేదు. ఇప్పుడు మార్కెట్‌లో సన్న బియ్యం దరలు రూ.50 వరకు పలుకుతున్నాయి. అలాంటి సమయంలో ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం అన్నది గొప్ప విషయం. ఎవరైనా ప్రశంసించాల్సిందే. అంతే కాకుండా అది నేను కమీషనర్‌గా వున్న సమయంలో అమలు కావడం కూడా నా అదృష్టం. మొన్నటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యం విషయంలో అనేక రకాల వార్తలు వుండేవి. ఆ బియ్యం ప్రజలు అమ్ముకొని, సన్న బియ్యం కొనుగోలు చేసుకునేవారు అనే వార్తలున్నాయి. కాని ఇప్పుడు ఆ బియ్యం స్ధానంలో సన్న బియ్యం ఇవ్వడం వల్ల, పేద ప్రజలపై కొంత భారం తగ్గింది. అందరూ సన్న బియ్యం తినే సమాజ నిర్మాణం జరిగిందంటే మామూలు విషయం కాదు. సామాన్యులకు సన్న బియ్యం తినాలన్న ఆశ తీర్చిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. బియ్యం తీసుకెళ్లిన వారు ఎంతో సంతోషంగా తింటున్నారు. గతంలో బియ్యం అమ్ముకొని మరిన్ని రూపాయలు కలుపుకొని సన్న బియ్యం కొంత మంది తెచ్చుకునేవారు. కాని ఇప్పుడే పేద, మద్య తరగతి, ఉన్నత వర్గం అన్న తేడా లేదు. తెలంగాణలో అందరూ సన్న బియ్యం తింటున్నారంటే గొప్ప విషయం.
చౌహాన్: ఇక ఆ సందర్భం మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే సన్న బియ్యం ఇస్తున్నామా? లేదా? అన్నదే కాదు ఎంత క్యాలిటీ బియ్యం ఇస్తున్నామన్నది కూడా గుర్తించారు. మార్కెట్‌లో లభించే బియ్యం కన్నా, అదనంగా పోషకాలు వుండే బియ్యం కూడా కలిపి, ప్రజలకు ఆహార భద్రతే కాదు, ఆరోగ్య భద్రత కూడా చేకూర్చేలా బియ్యం సరఫరా జరుగుతోంది. అందుకే అంతర్జాతీయ స్దాయిలో తెలంగాణలో సన్న బియ్యం పధకం పేరుగాంచింది. ఐఎస్‌ఓ సర్టిఫికెట్ పౌరసరసరఫరాల శాఖకు అందించింది. అది ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రజలు ఎంతో సంబురంగా సన్న బియ్యం తింటున్నారు. వాళ్లంతా ఆరోగ్యంగా, ఆనందంగా వుండాలని కోరుకుంటున్నాను.
కట్టా: ఈ పథకం అమలుపై ఇతర రాష్ట్రాలలో ఏదైనా ప్రభావం వుందా?
చౌహాన్: తెలంగాణలో సన్న బియ్యం పధకం అమలు అన్నది ఒక సంచనలంగా మారింది. అన్ని రాష్ట్రాలలో ఈ డిమాండ్ ఊపందుకున్నది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల నుంచి వారి ప్రభుత్వ ప్రతినిధులు తెలంగాణకు వస్తున్నారు. ఇంకా అనేక రాష్ట్రాల నుంచి వస్తామని ఫోన్లు చేస్తున్నారు. సమయం కావాలని కోరుతున్నారు. తాజాగా రaార్ఖండ్ రాష్ట్ర మంత్రితోపాటు, ప్రతినిధి బృందం రావడం జరిగింది. ఎలా సాద్యమౌతుందన్న దానిపై వారికి పూర్తి వివరాలు అందించడం కూడా జరిగింది. అందుకు అవసరమైన డెమోతోపాటు, పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్లంతా ఆశ్యర్యపోయారు. తప్పకుండా తమ రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే సన్న బియ్యం అమలు చేయడం అన్నది నిజంగా సాహసోపేతమైన నిర్ణయం. అందుకు ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ది, అంకితభావం వుంటే తప్ప జరగదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రికగా సన్న బియ్యం పధకం అందరూ చెప్పుకుంటున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్నబియ్యం పదకం అమలు కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆ బాద్యతలు నిర్వర్తిన్న నాకు కూడా ఎంతో సంతోషంగా వుంది.
కట్టా: మీకు మరో ప్రశ్న. సన్న బియ్యం పదకం అమలులో కీలకమైన రైస్ మిల్లర్లు వారి సమస్యలున్నాయంటున్నారు?
చౌహాన్: నిజమే… సన్నబియ్యం పదకం అమలులో కీలకమైన పాత్ర పోషిస్తున్నది రైస్‌మిల్లర్లే. వారు బాగుంటేనే ఈ పదకం అమలు ఇంకా గొప్పగా సాగుతుంది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.
కట్టా: మిల్లర్లు మీ దగ్గరకు రాలేకపోతున్నారట? వారి సమస్యలు చెప్పుకుంటారట?
చౌహన్: తప్పకుండా…రాష్ట్రంలోని ఏ మిల్లరైనా సరే నా వద్దకు రావొచ్చు. వారి సమస్యలు చెప్పుకోవచ్చు. అందుకు నేను ఎప్పుడూ సిద్దంగా వుంటాను. ఎలాంటి అపోహలు వద్దు. ఇంత పెద్ద సన్నబియ్యం కార్యక్రమం విజయవంతంగా అమలు జరగాలంటే ప్రతి మిల్లర్ కూడా ఎంతో ముఖ్యమే. అందులో చిన్నా పెద్దా అనే తేడాలేదు. మీ దృష్టికి వచ్చిన సమస్యలు కూడా మాకు చెప్పొచ్చు. మీ వద్దకు వచ్చి, సమస్యలు చెప్పిన మిల్లర్‌ను నా వద్దకు పంపించండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పాయింట్ మెంటు ఇస్తాను. వారి సమయం కేటాయించడంలో ఎలాంటి జాప్యం వుండదు. తెలంగాణ ఆహార భద్రతలో నెంబర్ వన్‌గా వుందంటే అందులో మిల్లర్ల పాత్ర కూడా వుంది. అలాంటి మిల్లర్లను నిర్లక్ష్యం చేయడం అనే సమస్యే ఉత్పన్నం కాదు. మిల్లర్లు ఒక్కరొస్తారా? లేక కొంతమంది కలిసి వస్తారా? అన్నది వారి ఇష్టం. నేను ఎప్పుడైనా వారికి అందుబాటులో వుంటాను.
కట్టా రాఘవేంద్రరావు: ధన్యవాదాలు సార్. మళ్లీ కలుద్దాం.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.