విభిన్నమైన కథలతో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన సొంత బేనర్ భీమవరం టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న కొత్త…
విభిన్నమైన కథలతో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన సొంత బేనర్ భీమవరం టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న కొత్త చిత్రాల విశేషాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ‘మా బేనర్‌పై విభిన్నమైన కథాంశాలతో పలు చిత్రాలను రూపొందిస్తున్నాం. సస్పెన్స్ థ్రిల్లర్, అవుట్ అండ్ అవుట్ కామెడీ, లవ్ స్టోరీ… ఇలా ప్రేక్షకులను మెప్పించే విభిన్న కథాంశాలతో మొత్తం పదిహేను వరకూ స్ర్కిప్టులు సిద్ధం చేశాం. ఈ చిత్రాలను ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒకేసారి సెట్స్‌పైకి తీసుకువెళతాము. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని రామసత్యనారాయణ తెలిపారు.
గుడ్ న్యూస్.. మళ్లీ లక్ష రూపాయల దిగువకు వచ్చిన పసిడి
బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు మళ్లీ లక్ష రూపాయల నుంచి దిగువకు వచ్చాయి. పెట్టుబడి అవకాశాలతోపాటు గోల్డ్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం నేటి ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
బంగారం, వెండి ప్రియులకు శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పసిడి ధరలు మళ్లీ లక్షలోపునకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో జులై 27, 2025న ఉదయం 6:20 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.540 తగ్గి రూ.99,930కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,600కు చేరింది. అలాగే వెండి ధరలు కూడా కిలోకు రూ.1900 తగ్గుముఖం పట్టాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు
హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములకు) రూ.99,930, 22 క్యారెట్ల గోల్డ్ రూ.91,600, వెండి (కిలోకు) రూ.1,26,000.
ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,080, 22 క్యారెట్ల బంగారం రూ.91,750, వెండి రూ.1,16,000.
ముంబై: 24 క్యారెట్ల బంగారం రూ.99,930, 22 క్యారెట్ల బంగారం రూ.91,600, వెండి రూ.1,16,000.
చెన్నై: 24 క్యారెట్ల బంగారం రూ.99,930, 22 క్యారెట్ల బంగారం రూ.91,600, వెండి రూ.1,26,000.
బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం రూ.99,930, 22 క్యారెట్ల బంగారం రూ.91,600, వెండి రూ.1,16,000.
ఈ ధరలు స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్‌పై ఆధారపడి నగరాల మధ్య స్వల్ప వ్యత్యాసాలను చూపిస్తాయి.
ధరల తగ్గుదలకు కారణాలు
గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. అమెరికన్ డాలర్ బలపడటం వల్ల బంగారం ధరలు తగ్గాయి. ఎందుకంటే బంగారం ధరలు సాధారణంగా డాలర్‌తో విలోమానుపాతంలో ఉంటాయి. డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం కొనుగోళ్లు తగ్గాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్, ఇతర సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు బంగారం ధరలపై ప్రభావం చూపాయి. అధిక వడ్డీ రేట్లు బంగారం వంటి దిగుబడి లేని ఆస్తుల ఆకర్షణను తగ్గిస్తాయి. ఫలితంగా డిమాండ్ తగ్గుతుంది. ఇటీవలి వాణిజ్య ఒప్పందాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఈ ధోరణికి దోహదపడ్డాయి.
వెండి డిమాండ్ తగ్గుదల
వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్ తగ్గడం వల్ల ప్రభావితమయ్యాయి. వెండి ఎక్కువగా పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి గ్లోబల్ ఉత్పాదన క్షీణించడం దీని ధరలు తగ్గుముఖం పట్టాయని నిపుణులు చెబుతున్నారు.
`సినిమా సన్నివేశాలలో దొర్లిన తప్పులను గుర్తు చేస్తున్నారు.
`పవన్ ఇమేజ్ కాపాడుకోవాల్సిన అవసరం వుంది?
`మంత్రి నాదెండ్ల మనోహర్ ఆడియో లీక్!
`సినిమా నిలబెట్టాలని జనసైనికులకు సూచన.
`ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా వారం పాటు ఆడేలా చొరవ తీసుకోవాలి.
`కనీసం అన్నం తినడానికి కూడా సమయం లేకుండా పవన్ కష్టపడుతున్నారు.
`సినిమాలు చేసి పార్టీని నిలబెట్టారు.
`ఇప్పుడు సినిమాను నిలబెట్టే బాధ్యత మనం తీసుకోవాలి.
హైదరాబాద్,నేటిధాత్రి:
సినిమా ప్రేక్షలకు నచ్చే విధంగా వుంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరూ ఆపలేరు ..ఎవరు అడ్డుకున్నా సినిమా ఆగదు. చిన్న చిన్న సినిమాలు బాగుంటే తర్వాత రోజుల్లో బ్లాక్ బస్టర్లు అవుతున్న రోజులు. సినిమా కాస్త బాగుందంటే చాలు జనాలు విపరీతంగా ఎగబడుతున్నారు. వారంలో రోజుల్లో సినిమాలు కోట్లు కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. అలాంటిది పవన్ కళ్యాన్ సినిమా ఎందుకు డిజాస్టర్‌గా మారుతోంది. గతంలో కూడా పవన్ సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్లేమీ కాదు. కాని ఆయన క్రేజ్‌తో బాగానే సినిమాలు ఆడేవి. అయితే ఆయనను సినీ హారో కాన్న, పవన్ వ్యక్తిత్వం గురించి సినిమాకు చెందిన వాళ్లు గొప్పగా చెప్పేవారు. అది జనాల్లోకి బాగా చేరింది. అప్పటి నుంచి పవన్ అంటే ప్రజలకు ఒక రకమైన అభిమానం పెరిగింది. ప్యాన్ ఫాలోయింగ్ కూడా వ విపరీతంగా పెరిగింది. పైగా సినిమాలో ఆయన హవభావాలు కూడా జనానికి బాగా నచ్చేవి. పవన్ తెరమీద చేసే కొన్ని సిన్ని వేషాలు ప్రజలకు చాలా దగ్గరగా వుండేవి. అవే ఆయనను పవర్‌స్టార్‌ను చేశాయి. గత వకీల్ సాబ్ వరకు కూడా ఆయన సినిమాలు మినిమమ్ గ్యారెంటే అనేవారు. కాని ఉన్న ఫలంగా హరిహర వీర మల్లు సినిమాను కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదన్న వార్తలతోనే అసలు నిజం బైటపడిపోయింది. ఆ సినిమా ఆడడం కష్టమని తేలిపోయింది. అయినా కావాలనే కొందరు పని గట్టుకొని హరిహర వీరమల్లు మీద విష ప్రచారం చేస్తున్నారని కూడా అనుకున్నారు. కాని సినిమా విడుదలైన తర్వాత అదంతా నిజమే అంటున్నారు. కాకపోతే ఈశ్వరుడు నోరుంది కదా? అని ఏది పడితే అది వాగొద్దు! అని స్వయంగా పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్. అదెందుకో అటు తిరిగి, ఇటు తిరిగి ఆయన నిజ జీవితంలో ఆపాదించబడుతుందేమో? అని ఆయన ఊహించి వుండకపోవచ్చు. కాని ఇప్పుడు అదే నిజమౌతోంది. ఈ మధ్య మనల్నెవడురా? ఆపేది అని ఓ మాటన్నారు. అది ఏ సందర్భంలో అన్నారో గాని, ఇప్పుడు సినిమా కష్టాలను స్వయంగా చూస్తున్నారు. పవన్ కళ్యాన్ సినీ కేరిర్‌లో డిజాస్టర్లు లేక కాదు. గతంలో అనేకం వున్నాయి. ఆయన సినిమాల్లో హిట్లకన్నా, ప్లాఫులే ఎక్కువగా వున్నాయి. కాని అప్పటి పరిస్దితి వేరు. ఇప్పటి పరిస్దితి వేరు. అప్పుడు కేవలం ఆయన ఒక సినిమా హీరో మాత్రమే. ఇప్పుడు రాజకీయ నాయకుడు. నాయకుడిగా ఆయన గత పన్నెండేళ్లుగా ప్రజల్లో వుంటున్నారు. కాని ఇప్పుడు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి రాజకీయాల్లో సాగినా ప్రభుత్వంలో చేరలేదు. ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేసినా గెలవలేదు. అయినా అభిమానుల్లో ఆయన క్రేజ్ తగ్గలేదు. ఎప్పుడైతే ఆయన డిప్యూటీ సిఎం. అయ్యారో అప్పటి నుంచి ఆయనపై వున్న క్రేజ్ తగ్గుతూ వస్తోందని చెప్పడంలో సందేహం లేదు. పైగా సినిమా నిర్మాణానికి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడిలో వున్నారు. సినిమాకు సమయం కేటాయించే అవకాశం దక్కలేదు. ఈ మధ్యలో మహారాష్ట్ర, డిల్లీ, హర్యానా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొంటూ వచ్చారు. అలా రాజకీయాలు, ఇటు పాలనకు సమయం కేటాయిస్తూ, సినిమాకు సమయం సరిపోలేదు. ఇక సినిమా ఏదో రకంగా చుట్టేయాలనుకున్నట్లున్నారు. పూర్తి చేశారు. నిజానికి ఈ సినిమా ఆది నుంచి పురిటి నొప్పులే భరిస్తూ వస్తోంది. కాకపోతే ఆఖరుకు ఆపరేషన్ సక్సెస్ అయ్యిందికాని పేషెండ్ డెడ్ అన్నది రుజువైంది. సినిమా విడులైతే సరిపోదు. సినిమా కూడా ప్రేక్షకులను ఒప్పించాలి. మెప్పించాలి. అంతే కాని రెండున్న గంటలు ప్రేక్షకులను రంజింప జేయకుండా కూర్చోబెడతా అనుకుంటే కుదరదు. హరిహర వీరమల్లు అనే సినిమా ఫిక్షన్ అన్నారు. అంటే కల్పిత కథ అని చెప్పుకొచ్చారు. ఈ మధ్య కూడా అదే ప్రచారం సాగించారు. కాని సినిమాలో పాత్రలు, సన్నివేశాల వల్ల అది ఫిక్షన్ కాదని తేలిపోయింది. ఇందులో కూడా రాజకీయం వుందన్న సంగతి అర్దమైంది. ప్రజలు రెండు గంటలపాటు వినోదం కోసం వస్తే, ఏదో చూపిస్తే చూస్తారా? అందులోనూ సినీ నిర్మాణలోపాలు కళ్లముందు కదలాడుతుంటే అసలే భరించరు. ఇక్కడా అదే జరిగింది. ఓవైపు చారిత్రక సినిమాలో చరిత్ర సత్యాలు చెబితే ఎవరు చూస్తారు. ఎక్కడి హరిహర మల్లుడు. ఎక్కడి గోల్కొంగ నవాబులు.ఎక్కడి డిల్లీ సుల్తానులు. 13శతాబ్ధానికి చెందిన హరి హర వీరమల్లు, 16 శతాబ్ధంలో కనిపించడమేమిటి? అయినా నిర్మాణ పరంగా మాయ చేసినా ప్రజలకు నచ్చేదేమో? కాని ఎక్కడా పవన్ కల్యాన్ సినిమాలాగా లేదని అభిమానులు కూడా బాధ పడుతున్నారు. అమ్మాయిని గుర్రం మీద కూర్చోబెట్టే స్టామినా వున్న హరో చిన్న తువ్వాలు తాకితే కింద పడే సన్నివేశాన్ని అభిమానులు జీర్ణించుకుంటారా? అయినా అభిమానులకే నచ్చని సినిమాను ఎంత ప్రమోషన్ వృదా అని తెలిసినా పాపం కష్టపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమాను నిలబెట్టడం కోసం ఆపసోపాలు పవన్ కల్యాన్ ఆపసోపాలు పడుతున్నాడు. ప్రమోషన్‌లో మునిగి తేలుతున్నారు. గతంలో పవన్ కల్యాణ్ తన సినిమాలకు ప్రమోషన్ చేసిన సందర్బాలు చాలా తక్కువ. కాని ఈ సినిమాకు పడుతున్న కష్టాలు మరే సినిమాకు పడలేదు. అయితే ఓ వైపు తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదంటూనే తన ప్రస్టేషన్‌ను పదే పదే చూపిస్తున్నారు. సినిమా పోయిందని బాధ పడాల్సిన అవసరం లేదంటూనే ఉప ముఖ్యమంత్రి స్ధానంలో వుండి జన సైనికులను రెచ్చగొడుతున్నారు. ఇది కూడా వాంచనీయంకాదు. ఇదిలా వుంటే ఆ పార్టీకి చెందిన మరో మంత్రి ఆడియో ఒకటి బైటకు వచ్చింది. జన సైనికులను ఆయన దిశానిర్ధేశం చేస్తున్న ఆడియో వైరల్ అవుతుంది. అయితే అది ఆ నాయకుడిదో కాదో తెలియదు. కాని ఆయనదే అంటూ మాత్రం పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రితోపాటు ఎమ్మెల్యేలు కూడా సినిమా ప్రమోషన్ సాగిస్తున్నారు. జన సైనికులకు సినిమా నిలబెట్టాలని కోరుతున్నారు. ఎట్టి పరిసి ్ధతుల్లో సినిమా కనీసం వారం రోజుల పాటు ఆడేలా చూడాలని సూచిస్తున్నారు. పవన్ కల్యాణ్‌మీద ఆ మంత్రి విపరీతమైన సానుభూతి చూపిస్తున్నారు. పవన్ కల్యాణ్ కనీసం అన్నం తినడానికి కూడా సమయం సరిపోవడం లేదని జన సైనికులకు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ సిని మాలు చేసి పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు సినిమా పోతే పార్టీ నడిపేందుకు కష్టమౌతుందన్నట్లు జన సైనికులకు వివరిస్తున్నారు. ఇప్పుడు సినిమాను నిలబెట్టే బాధ్యత జన సైనికులు తీసుకోవాలని కోరుతున్నారు. అందుకు గ్రామ స్ధాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్దాయి నాయకులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఇంత చేసినా సినిమాను ఎంత కాలం ముందుకు తీసుకెళ్లగలరు. అంటే అభిమానులు, జనసైనికులు తమ సొంత డబ్బులు పెట్టుకొని సినిమాను నడిపిస్తే, ఎంత కాలం నడుస్తుంది. ఏ సినిమా అయినా సరే, ఎంత పెద్ద హీరో అయినా సరే బాగుంటేనే సినిమా చూస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా విజయవంతమౌతుంది. లేకుంటే డిజాస్టర్‌గానే మిగిలిపోతుంది. పైగా ఈ సినిమాకు తెలుగుదేశం శ్రేణులుకూడా పెద్దగా ఆదరిస్తున్నట్లు లేదు. బిజేపి పార్టీ శ్రేణులు నచ్చినట్లులేరు. ఆ మూడు పార్టీల నాయకులు ముందుకొస్తే తప్ప కనీసం ఒక వారం ఆడే పరిసి ్దతి కనిపించడంలేదు. అయినా సినిమా బాగా లేదన్న టాక్ విపరీతంగా ప్రచారం జరిగింది. మంచిగా వున్న సినిమా బాగాలేదని ఎవరు ప్రచారం చేసినా, మౌత్ టాక్‌తో సూపర్ డూపర్ హిట్లు అయిన సినిమాలు అనేకం వున్నాయి. బలగం లాంటి సినిమా తెలంగాణలో ఎలా ఆడిరదో చూశాం. ఏపిలో బలగాన్ని ఆదరించకపోయినా సరే బ్లాక్ బస్టర్ అయ్యింది. కావాలనే బలగం సినిమాను ఏపిలో చెప్పకపోయినా బాయ్ కాట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమాను చూడడానికి కూడా అక్కడి జనం ఇష్టపడలేదు. కాని సినిమా ఎంతో విజయవంతమైంది. అలాగే పవన్ కళ్యాన్ సినిమా బాగుంటే ఏపిలో నడిచినా సరిపోయేది. కాని అంతో ఇంతో నడుస్తోందంటే నైజాం పుణ్యమే. ఏపిలో కూడా సినిమాను ఆదరిస్తే సినిమా ఎక్కడికో వెళ్లిపోయేది. కాని సినిమాపై ఇంకా పవన్ ఎంత ఆశలు పెట్టుకున్నా ముందుకు తీసుకుపోవడం అసాధ్యం.
`రెండేళ్ళుగా గ్రామ పాలన లేకపోవడంతో స్థంభించిన ప్రగతి.
`కేంద్ర నిధులు ఆగిపోయాయి.
`రాష్ట్ర నిధులకు మోక్షం లేకుండా పోయింది.
`పారిశుధ్యం పడకేసింది.
`పల్లె ప్రగతి కుంటుపడిరది.
`వెంటనే ఎన్నికలు నిర్వహించాలి.
`పల్లకు పాలనలో ప్రధమ ప్రాధాన్యత కల్పించాలి.
`గ్రామ పంచాయతీకి రాజ్యాంగంలో గొప్ప స్థానమున్నది.
`సర్పంచ్ గ్రామ ప్రధమ పౌరుడు.
`ప్రధాని, ముఖ్యమంత్రి వచ్చినా సభలకు సర్పంచ్ కు అధ్యక్ష బాధ్యతలు.
`కేంద్రం నుంచి వచ్చే నిధులలో 85 శాతం గ్రామానికే కేటాయించాలి.
`పంచాయతి రాజ్ వ్యవస్థలో జిల్లా పరిషత్, గ్రామ సచివాలయాదే కీలక పాత్ర.
`జిల్లా పరిషత్ చైర్మన్ పదవి క్యాబినెట్ మంత్రి స్థాయి.
`కేంద్ర ప్రభుత్వం కన్నా రాజ్యాంగ పరంగా జిల్లా పరిషత్ సుప్రీం.
`అంత గొప్పది మన పంచాయతీ రాజ్ వ్యవస్థ.
హైదరాబాద్,నేటిధాత్రి: రాజులు కాలంలో మనదేశంలో స్ధానిక పాలన వుండేది. కాని అది కొంత మంది చేతుల్లో నిక్షిప్తమై వుండేది. రాజులు నియమించుకున్న వారి చేతుల్లో స్దానిక పాలన సాగుతుండేది. అది కూడా పన్నులు వసూలు చేయడానికి మాత్రమే ఆ యంత్రాంగం పనిచేసేది. తర్వాత బ్రిటీష్ కాలంలో ఆ పాలనకు స్వస్తి పలికారు. బ్రిటీష్ పాలకులు స్ధానిక స్వపరిపాలన తెచ్చారు. గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ తన కాలంలో ఈ స్దానిక స్వపరిపాలన తెచ్చారు. ఆ సమయంలో జిల్లాలు, బ్లాక్‌లు ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1959లో 1919,1935 చట్టాలకు అనుగుణంగా స్ధానిక సంస్ధలు ఏర్పాటు చేశారు. మూడంచెల వ్యవస్ద తెచ్చారు. గ్రామ పరిపాలనను చేర్చారు. ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని గ్రామపంచాయితీ వ్యవస్ధ కూడా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పల్లెల్లో కూడా ఎన్నికలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను ఎన్నుకుంటూ వస్తున్నారు. గ్రామ సర్పంచ్‌కు రాజ్యాంగంలో ఎంతో గొప్ప నిర్వచనం వుంది. అదికారం కూడా వుంది. గ్రామ సర్పంచ్ మీద అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. కాని సర్పంచ్ తప్పు చేశాడనుకున్నప్పుడు మాత్రమే కలెక్టర్ తొలిగిస్తారు. దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి వచ్చినా సర్పంచ్‌కు ప్రోటో కాల్ వుంటుంది. ఎందుకంటే సర్పంచ్ గ్రామ ప్రధమ పౌరుడు. రాజ్యాంగబద్దంగా ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడే ఏకైక నాయకుడు. మన దేశంలో నేరుగా ప్రజల నుంచి ఇప్పుడు ఎన్నుకోబడే ఏకైన ప్రజా ప్రతినిధి సర్పంచ్. గతంలో మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్‌లు, మేయర్లు కూడా నేరుగా ప్రజల నుంచి ఎన్నుకోబడేవారు. కాని ఆ స్దానాలలో మార్పులు తెచ్చారు. కాని సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం నేరుగా ఎన్నుకునే విధానం మార్చలేదు. గత రెండేళ్లుగా తెలంగాణలోని పల్లెలో పాలన స్ధంబించి పోయింది.. కేంద్రం నుంచి నిదులు రావడం లేదు. పల్లె పాలన పడకేసింది. పంచాయితీ రాజ్ వ్యవస్ధ చట్టం ప్రకారం ప్రజా ప్రతినిధులు వుంటేనే కేంద్రం నుంచి నిధులు అందుతాయి. రెండేళ్లుగా నిధులు లేక పల్లెలు కునారిల్లుతున్నాయి. పంచాయితీ రాజ్ చట్టంలో కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో సింహ భాగం పల్లెలకే కేటాయించాయి. కేంద్రం నుంచి జిల్లాలకు నేరుగా నిధులు అందుతాయి. కాని జిల్లా పరిషత్ ఆ నిధులలో కేవలం 5శాతం మాత్రమే వినియోగించుకోవాలి. మండలాలకు 10శాతం నిధులు పంపకాలు చేయాలి. గ్రామ పంచాయితీలకు 80శాతం నిధులు ఇవ్వాలి. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా గ్రామ పంచాయితీకే చెందాలి. మన దేశంలో స్ధానిక సంస్ధలకు ఎంతో గొప్ప గౌరవం వుంది. అంత కన్నా విలువ వుంది. కొన్ని సందర్భాలలో పార్లమెంటు కన్నా, జిల్లా పరిషత్ స్టాండిరగ్ కమిటీలకు ఎక్కువ ప్రాధాన్యత వుందంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ పల్లెలు పాలన కోసం ఎదరు చూస్తున్నాయి. పల్లె పాలన పూర్తయి రెండేళ్ల కాలానికి వస్తోంది. పల్లెతోపాటు, మిగతా పంచాయితీ రాజ్‌పాలన పూర్తయింది. మండల, జల్లా స్దాయి ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. మన దేశంలో పల్లెలే పట్టుగొమ్మలు. మన దేశంలో సుమారు 70శాతం జనాభా పల్లెల్లోనే వుంటుంది. ఐదు లక్షల గ్రామాలతో కూడిన అతి పెద్ద దేశం మనది.అలాంటి మన దేశంలో స్దానిక పాలనపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వుంటాయి. స్దానిక సంస్ధల గడువు ముగిసినా, ప్రత్యేక అదికారుల చేత పాలన సాగిస్తుంటారు. ఎన్నికల నిర్వహణ గాలికి వదిలేస్తుంటారు. ప్రజలు ఎన్నికలెప్పుడు అని అడిగినా పట్టించుకోరు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యంగా తెలుగుదేశం ప్రబుత్వ హయాంలో ఎన్నికలు సమాయానికి నిర్వహించలేదు. నోడల్ అధికారులతో స్దానిక పాలన కొన్నేళ్లపాటు సాగించారు. ఇందుకు రాజకీయ పరమైన కారణాలు వుంటుంటాయి. ఎన్నికలు నిర్వహిస్త తమ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయా? రావా? అన్న మీమాంసలో అధికార పార్టీలు ఆలస్యం చేస్తుంటాయి. స్దానిక సంస్ధల ఎన్నికల్లో తాము స్వీప్ చేస్తామన్న మన్మకం వచ్చినప్పుడు చేయడం అలవాటు చేసుకున్నారు. ఇది ఇప్పుడు తెలంగానలో కనిపిస్తోంది. కాకపోతే తెలంగాణ స్ధానిక సంస్ధల ఎన్నికల ఆలస్యానికి బిసి రిజర్వేషన్ల అంశం అడ్డుగా మారుతోంది. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో 42 రెండు రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని శఫధం చేశారు. అందుకు అడ్డంకులుంటాయని తెలుసు. వాటిని అదిగమిస్తామన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీకి వుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం గత ఎన్నికల్లో గెలిచేందుకే ఈ అస్త్రాన్ని వినియోగించుకున్నదని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా, రాజ్యాంగ సవరణ జరగకుండా 42 శాతం రిజర్వేషన్ సాధ్యం కాదు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు కూడా అప్పుడు ప్రచారం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అలవి కాని హమీని ఇస్తోందని చెప్పలేదు. ఆ సమయంలో బిఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మేలా లేరన్న వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మేం సాదించి చూపిస్తామని మరింత గట్టిగా చెప్పుకునే అవకాశం వుంటుంది. కేంద్రంలో వచ్చేది మేమే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం వుంది. కేంద్రంలో కూడా మేమే వస్తామని మరింత చెప్పుకునే అవకాశం కాంగ్రెస్‌కు కల్పించినట్లౌతుందని బిఆర్‌ఎస్, బిజేపిలు సైలెంటుగా వున్నాయి. అదే కాంగ్రెస్‌కు వరమైంది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 42 శాతం రిజర్వేషన్ ఎలా అన్నదానిపై తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి, కేంద్రానికి పంపడం జరిగింది. అది అయ్యేది కాదని కాంగ్రెస్‌కు కూడా తెలిసిపోయింది. స్దానిక సంస్ధలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించాలని కొంత మంది కోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర హైకోర్టు డెడ్ లైన్ విధించింది. సెప్టెంబర్ 31 లోగా స్ధానిక సంస్ధల ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్‌కు ఈ తీర్పు సంకటకంగా మారింది. ప్రజల నుంచి బిసి రిజర్వేషన్లు స్దానిక సంస్ధల ఎన్నికల్లో అమలు చేయాలని మరింత ఒత్తిడి వస్తోంది. బిసిల నుంచి కూడా పెద్దఎత్తున ఉద్యమాలు కూడా సాగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌కు వెనకడుగు వేసే పరిస్దితి కనిపించడం లేదు. వాయిదాకు కూడా వీలు లేదు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే పరిస్దితుల్లో లేదు. రిజర్వేషన్లును పార్టీ పరంగా అమలు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఈ విషయాన్ని ఎన్నికల ముందే చెబితే బాగుండేది. కాని అప్పుడు చెబితే ప్రజలు నమ్మేవారు కాదు. ఇప్పుడు నమ్మించడానికి అవకాశం లేకుండాపోయింది. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. అది కూడా చట్ట సమ్మతం కాదన్నది అందరికీ తెలుసు. ఏదో రకంగా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఎదురుచూస్తున్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అదికారంలోకి వచ్చింది. అదృష్టం కొద్ది స్ధానిక సంస్దల పాలన అప్పటికే పూర్తయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్దానిక సంస్ధల ఎన్నికలు నిర్వహిస్తారన్న ఆలోచనలతో పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. కాని ప్రభుత్వం వాయిదా వేసుకుంటూ పోయింది. ఇప్పఇకైనా సమయం ఆసన్నమైందనుకుంటే, ఆర్డినెన్స్ జారీ చేసినా జరుగుతాయన్న నమ్మకం లేకుండా పోతోంది. నిజం చెప్పాలంటే తెలంగాణలో 15వేల మంది సర్పంచ్‌లు, 6వేల మంది ఎంపిటిసిలు, 500 మంది జడ్పీటీసిలుండేవారు. అందులో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చేవి. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే స్దానిక సంస్ధల ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు జరిగేది. స్దానిక పాలన కూడా మొత్తం కాంగ్రెస్ చేతుల్లోకే వచ్చేది. కాని ఆలస్యం చేశారు. అయితే ఆ సమయంలో బిజేపి కూడా 8 పార్లమెంటు స్దానాలు గెల్చుకొని వుంది. అదే సమయంలో స్ధానిక సంస్దల ఎన్నికలు నిర్వహిస్తే, బిజేపి పుంజుకునే అవకాశం వుండేది. అందుకే కొంత కాలం ఆగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు మొదటికే మోసం వస్తుందేమో అన్న అనుమానం పార్టీలో వ్యక్తమౌతోంది. కాకపోతే ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించాలని పార్టీ శ్రేణుల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు మొదలౌతున్నాయి. ఇక ఈ సమస్య ఇలా వుంటే గతంలో సర్పంచ్‌లుగా పనిచేసిన వాళ్లకు బకాయిలు పెండిరగ్‌లో వున్నాయి. ఎన్నికల ముందు వారికి బకాయిలు అందలేదు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం విచ్చి రెండేళ్లు గడుస్తున్నా నిధులు రావడం లేదు. 14వ ఆర్దిక సంఘం నిధులు విడుదలైతే తప్ప బకాయిలు అందవు. అవి అందాలంటే పంచాయితీ ఎ న్నికలు నిర్వహించాలి. ఏం జరగుతుందో చూడాలి.
సంగారెడ్డి: జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలోని క్యాంటీన్ ముందు చెత్తడబ్బాలో శిశువు మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం పుట్టిన మగ శిశువును శుక్రవారం రాత్రి ఇద్దరు మహిళలు చెత్త డబ్బాలో పడేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. శిశువు చనిపోయిన తర్వాత పడేశారా లేక బ్రతికుండగానే వదిలించుకున్నారా అనే కోణంలో జహీరాబాద్ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జహీరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న అట్టడుగు వర్గాలైన వికలాంగులకు అనేక రకాల పింఛన్దారులకు మేనిఫెస్టో ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రకారం వికలాంగులకు పెన్షన్ 6000 లకు ఇతర ఆసరా పెన్షన్లు 4000 రూపాయలకు తీరువ వైకల్యం వికలాంగులకు 15000 వెంటనే తీర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకొని తిరుగుతుందని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉద్దేశంతో జూలై, ఈ నెల,28 సంగారెడ్డి లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ, మందకృష్ణ మాదిగ,అధ్యర్యంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని సన్నహాక సభ లో పాల్గొని విజయవంతం చేయాలని వికలాంగుల సంఘం సీనియర్ నాయకులుహైమద్, తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయి కోటి నర్సిములు పిలుపునిచ్చారు.
మృతిరాలి కుటుంబమును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల మాజీ వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు సతీమణి కృష్ణవేణి తల్లి మంతెన వెంకట లక్ష్మీ ఇటీవల మరణించగా హుస్నాబాద్ లోని వారి నివాసంలో వెంకటలక్ష్మీ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించినారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోతి పెద్ది కిషన్ రెడ్డి పి ఏ సి ఎస్ మాజీ చైర్మన్ గుజ్జుల రాజి రెడ్డి బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు
గిరిజన యూనివర్సిటీ భూములను ఇతర వ్యాపార సముదాయాలకు కేటాయిస్తే ఊరుకునేది లేదు
అలాంటి ప్రయత్నాలను విరమించుకోవాలి
అవసరమైతే న్యాయ పోరాటాలకు సిద్ధమవుతాం
ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
ములుగు టౌన్: గిరిజన విశ్వవిద్యాలయానికి సేకరించిన భూములను విశ్వవిద్యాలయానికి మాత్రమే ఉపయోగించుకోవాలని ఇతర వ్యాపార సముదాయాలకు కేటాయిస్తే ఊరుకునేది లేదని అలాంటి ప్రయత్నాలను విరమించుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీకి సంబంధించిన భూములలో పెట్రోల్ బంకు లాంటి వ్యాపార సముదాయాలు నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం సేకరించిన భూముల విషయంలో చాలామంది దళిత, గిరిజన నిరుపేదలు కూడా తమకున్న భూములను ఇచ్చి ప్రభుత్వానికి సహకరించారని ఆయన అన్నారు. తమ ప్రాంతంలో ఒక గొప్ప విశ్వవిద్యాలయం ఏర్పాటు కావడం కోసం ములుగు జిల్లాలోని ప్రతి ఒక్కరూ గర్వంగా భావించారని, ఎంతోమంది నిరుపేదలకు ఉపాధి లభిస్తుందనే ఆశలు జిల్లా ప్రజల్లో ప్రబలంగా ఉన్నాయని ఆయన అన్నారు. యూనివర్సిటీ కోసం సేకరించిన భూములను విశ్వవిద్యాలయం కోసం కాకుండా ఇతర వ్యాపార సముదాయాలైన పెట్రోల్ బంకులు లాంటి నిర్మాణ ప్రయత్నాలను విరమించుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. విశ్వవిద్యాలయం పూర్తిస్థాయి రూపాంతరం చెందిన తర్వాత మిగులు భూములను ప్రభుత్వం అక్కడ పరిస్థితులు బట్టి ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. ఆలు లేదు చూలు లేదు అన్నట్లు పూర్తి నిర్మాణాలు కాకముందే వ్యాపార సముదాయాలకు కేటాయించడానికి ప్రయత్నాలు చేయడం సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. ఈ విషయంలో న్యాయపోరాటం కోసం అవసరం అయితే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది స్వార్థం కోసం విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూములను ఎవరికి అప్పచెప్పవద్దని ఆయన అధికారులను వేడుకున్నారు. గిరిజన విశ్వవిద్యాలయ పనులు ఎంతవరకు జరిగాయో వాటికి సంబంధించిన శ్వేత పత్రం విడుదల చేయాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సంబంధించిన అధికారులను కోరారు. ఈ విషయంలో గౌరవ ములుగు జిల్లా కలెక్టర్, యూనివర్సిటీ వీసీ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ సి ములుగు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో కార్గిల్ దివాస్ విజయోత్సవ సభను ఘనంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కార్గిల్లో వీరమరణం పొందిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ మధ్య మే 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగిందనీ ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు,కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం అని,యుద్ధ ప్రారంభదశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యిందనీ, నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుందనీ,అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగిందనీ,ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ అని, ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయనీ అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది అని అన్నారు.దివాస్ ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటారనీ, 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారతదేశం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకుంటారనీ,ఈ సందర్భంగా,భారత సైనికుల ధైర్యసాహసాలను, త్యాగాలను స్మరించుకుంటారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకవత్ దేవా,కంచ రాజు కుమార్ అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ నందిపాటి సంధ్య,నిడిగొండ అక్షయ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి
బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా శనివారం పట్టణంతోపాటు మండలంలోని చర్లపాలెం, గోపాలగిరి, గుర్తురు, చింతలపల్లి, కొమ్మనపల్లి తండ గ్రామాలలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలను ఎల్లవేళలా అన్ని విధాలుగా కాపాడుకుంటామని,పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను అన్ని విధాలుగా అండగా నిలుస్తానని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అన్ని స్థానాలలో గెలిపించి సత్తా చాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, పెదగాని సోమయ్య, డాక్టర్ పోనుగోటి సోమేశ్వరరావు, మంగళపల్లి రామచంద్రయ్య,జినుగా సురేందర్ రెడ్డి, జక్కుల రామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దేవేందర్ రెడ్డి,కందాడి అచ్చిరెడ్డి,పెరటి యాకూబ్ రెడ్డి,కాందాడి అశోక్ రెడ్డి,కంచర్ల వెంకటాచారి, ధరావత్ సోమన్న, పంజా కల్పన,మోత్కూరి రవీంద్ర చారి, బాలకృష్ణ,రాజేష్ యాదవ్, మహేష్ యాదవ్,పాడ్యా రమేష్ నాయక్,వల్లపు మల్లయ్య, ధర్మారపు మహేందర్, యనమల శ్రీనివాస్,అలువాల సోమయ్య, వెలుగు మహేశ్వరి,తోట అశోక్,మనోహర్, వెంకన్న, ఉపేంద్ర,గిరిధర్, పరశురాములు,బుచ్చి రాములు,మురళి తదితరులు పాల్గొన్నారు.
దేశ రక్షణ కోసం పాటుపడే సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని సంక్షేమ బాలికల గురుకులం ప్రిన్సిపాల్ విజయరత్నమాల తెలిపారు.
కార్గిల్ విజయ దివస్ ను పురస్కరించుకొని మేరా యువభారత్, నవయుగ విజన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం డివిజన్ కేంద్రంలోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అమర సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు.
నవయుగ విజన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బానోతు వీరన్న నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ….
1999 లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు శత్రుదేశంపై అసమాన పరాక్రమం ప్రదర్శించారని కొనియాడారు. శత్రు సైనికులను మట్టుబెట్టి ఆపరేషన్ విజయ్ ను విజయవంతం చేశారన్నారు. ఎందరో సైనికుల త్యాగాల ఫలితంగా భారత్ సురక్షితంగా ఉందని, వారి త్యాగాలను ఏటాస్మరించుకోవాలన్నారు. యువత, విద్యార్థులు దేశభక్తుని పెంపొందించుకోవాలని, సైన్యంలో చేరి సేవలు అందించేందుకు ముందు వరసలో నిలవాలని కోరారు.
సైనికుల త్యాగాలకు ప్రతిబింబం కార్గిల్ దివస్ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో డి.సి.పి. ఎ.భాస్కర్, మంచిర్యాల ఎ.సి.పి. ప్రకాష్ లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్గిల్ దివస్ కార్యక్రమాన్ని కార్మికుల త్యాగాలకు ప్రతిబింబమని, భావితరాలకు తెలిసే విధంగా జరుపుకుంటున్నామని తెలిపారు.1999 లో నావీ, ఎయిర్ ఫోర్స్,ఆర్మీ సమిష్టిగా పోరాడి మన దేశ సరిహద్దులను కాపాడారని,ఆ సమయంలో పోరాడి అమరులైన సైనికుల త్యాగాలను స్మరించుకోవాలని తెలిపారు.భారత దేశాన్ని సరిహద్దులలో సైనికులు 365 రోజులు 24 గంటలు ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నారని,దేశ ప్రజల రక్షణ కోసం అందరినీ వదిలి దేశ సేవలో ఉన్నారని తెలిపారు.నిరంతరం విధులు నిర్వహిస్తున్న సైనికులకు గౌరవంగా కార్గిల్ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని తెలిపారు.మాజీ సైనికులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,పోలీస్ అధికారులు,ఎన్.సి.సి. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జైపూర్ మండల కేంద్రంలో అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బాపు ఆధ్వర్యంలో శనివారం మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బాపు మాట్లాడుతూ పద్మశాలీలు చరిత్రకంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించారన్నారు. వృత్తిపరంగా,విద్యారంగంలో, వ్యాపారాలలో స్ఫూర్తిదాయకంగా ఎదిగున్నారు.కానీ రాజకీయ ప్రతినిధులు లోపించడం వల్ల సమాజ మొత్తానికి అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇకనైనా చైతన్యంతో ముందుకు వచ్చి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలి వర్గానికి చెందిన యువత సామాజికంగా విశ్వసయనీయత కలిగిన నాయకులు జెడ్పిటిసి, ఎంపీటీసీ,సర్పంచ్,వార్డ్ మెంబర్ పదవుల కోసం పోటీచేసి గెలిచి ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పద్మశాలి కులస్తుల సమావేశంలో మండల నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మండల సంఘం అధ్యక్షుడిగా వేముల మల్లేష్,ప్రధాన కార్యదర్శిగా దుస్సా భూమన్న అవినాష్, ఉపాధ్యక్షుడిగా కొత్తపల్లి తిరుపతి,ప్రచార కార్యదర్శి, కార్యవర్గ సభ్యులుగా పలు గ్రామాల ప్రతినిధులను ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా నూతన కమిటీని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శివ్వారం సర్పంచ్ ఆవిడపు గణేష్, జైపూర్ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు కర్ణ భూమన్న,సభ్యులు మల్లేష్, డాక్టర్ శంకర్,ఇప్పపల్లి రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ పెట్టుబడి దారి అనుకూల పాలకుల దోపిడీ విధానాలకు వర్గ సామాజిక ఐక్య పోరాటాలే ప్రత్యామ్నాయన్ని చూపిస్తాయని ఆ దిశలో వామపక్ష కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆ దిశలో ప్రజా ఉద్యమాల నిర్మించాలని ఎం సి పి ఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపునిచ్చారు.భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ నగర ప్లీనరీ సమావేశం కామ్రేడ్ ఎగ్గేని మల్లిఖార్జున్, ఐతం నాగేష్, మలోత్ ప్రత్యూష అధ్యక్ష వర్గంగా కరిమాబాద్ మున్నూరుకాపు సంఘం భవన్ లో జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న గాదగోని రవి మాట్లాడుతూ కేంద్రంలోని మతోన్మాద బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి తమ ఇష్టానుసారంగా పాలను కొనసాగిస్తూ ప్రజల ఆశలను అడియాశలు చేస్తున్నారని ఈ క్రమంలో పేద మధ్యతరగతి ప్రజలపై నిత్యవసర వస్తువుల ధరల భారం విపరీతంగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందన్నారు. ప్రజల మధ్యన ఐక్యత లేకుండా కుల మత ప్రాంత విభేదాలతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోడీ పాలన కొనసాగుతున్నదని నిర్బంధాలను ప్రయోగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వినాశనకర విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి సామాజిక వర్గ పోరాటాలను ఐక్యంగా నడిపించాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు ఆ దిశలో ఎంసిపిఐ(యు) కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో అనేక సమస్యలు తిష్ట వేశాయని గత ప్రస్తుత పాలకులు హామీలకే పరిమితం అవుతూ జిల్లా అభివృద్ధిని విస్మరించారని విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్న పట్టించుకోకుండా పేదలు తలదాచుకోవడానికి గుడిసెలు వేసుకుంటే మాత్రం నానా బీభత్సం చేస్తూ నిర్బంధం ప్రయోగిస్తున్నారని రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ ను తీర్చి దిద్దుతామని గొప్పలు చెప్పి ఆచరణలో ప్రచార అర్పటం తప్ప చేసింది శూన్యమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా పోరాటాలే ప్రజా సమస్యల పరిష్కారానికి వరంగల్ జిల్లా అభివృద్ధికి తోడ్పాటును ఇస్తాయని అన్నారు. అనంతరం పార్టీ నగర నిర్మాణం ప్రజా పోరాటాలపై కామ్రేడ్ సుంచు జగదీశ్వర్ రిపోర్టు ప్రవేశపెట్టగా ప్రతినిధులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు నర్ర ప్రతాప్, మంద రవి, కన్నం వెంకన్న, వంగల రాగసుధ, మాలోత్ సాగర్, ముక్కేర రామస్వామి, పరిమళ గోవర్ధన్ రాజు, మాలోతూ ప్రత్యూష, తాటికాయల రత్నం, మాలి ప్రభాకర్, మహమ్మద్ ఇస్మాయిల్, నరసయ్య, దాసు రవి, రాజేందర్, యాదగిరి,మాధవి,స్వప్న లతోపాటు నగరంలోని ప్రతినిధులు పాల్గొన్నారు.
హుజరాబాద్ ఏసీబీ వాసంశెట్టి మాధవి భర్త జిదుల మహేష్ కుమార్ ఆకస్మికoగా గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరం కరీంనగర్ వారి నివాసంలో మహేష్ కుమార్ చిత్రపటానికి పువ్వుల మాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవునూరి శ్రీనివాస్,దీటి సుధాకర్ రావు, దాసరపు చందు, కురుమిండ్ల సుకేష్ పాల్గొన్నారు.
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు రూ.5 లక్షలు
వచ్చేనెల 15లోగా ఇండ్ల కేటాయింపు పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్
వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ ,వరంగల్ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్,నేటిధాత్రి:
ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్ధలాలు లేని అర్హత కలిగిన లబ్దిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వచ్చే నెల 15వ తేదీలోగా కేటాయించాలని, ఇందుకు అర్హులైన లబ్దిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.అంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వమే లబ్దిదారులకు 5 లక్షల రూపాయిలు ఆర్ధిక సహాయాన్ని అందిస్తుందని ప్రకటించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నారనేది ముఖ్యం కాదని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడమే ప్రధానమన్నారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నాకూడా వాటిని పరిశీలించాలని కలెక్టర్లకు సూచించారు.ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇసుక, చెల్లింపులు, లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శ్రావణ మాసం మొదలైన నేపధ్యంలో త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు కూడా ఉంటాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాలు, సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్యాలయంలో త్వరలో ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేస్తామని తెలపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల ప్రకారం శాసనసభ్యులను భాగస్వామ్యం చేసి ప్రతి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించారు.వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శనివారం వరంగల్ నగర అభివృద్ధిపై పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ,ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి వరంగల్ విమానాశ్రయం,మెగా టెక్స్‌టైల్ పార్క్, భద్రకాళి దేవస్థానం,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,ఔటర్‌రింగ్ రోడ్డు, రైల్వే తదితర అంశాలపై మంత్రి పొంగులేటి సమీక్షించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్ని సంకల్పంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరాభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు. వరంగల్ అభివృద్దికి చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన డి.పి.ఆర్. టెండర్, పనులు ప్రారంభించడానికి, పూర్తి చేయడానికి ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకొని పనిచేయాలని మంత్రి సూచించారు.
Indiramma housing issues
వరంగల్ ప్రాంత చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్ పోర్ట్ కల త్వరలో సాకారం కానుందని అయితే ఎయిర్ పోర్ట్‌కు అవసరమైన భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని రెండు రోజుల క్రితం 205 కోట్ల రూపాయిలను విడుదల చేయడం జరిగిందని ఈ భూ సేకరణకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామన్నారు.కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు సంబంధించి అక్కడ రాజీవ్ గాంధీ టౌన్ షిప్‌లో ఆర్ & ఆర్ ప్యాకేజీ కింద 1398 మంది లబ్దిదారులను గుర్తించి 863 ప్లాట్‌లు కేటాయించడం జరిగిందని తెలపారు. ఈ కాలనీకి సంబంధించి సెప్టెంబర్ నెలాఖరు నాటికి మౌలికసదుపాయాల కల్పన పూర్తికావాలని ఆదేశించారు. అలాగే వెటర్నరీ హాస్పిటల్, ప్రాధమిక పాఠశాల, గ్రామ పంచాయితీ కార్యాలయ భవనం నిర్మించాలని, మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో స్ధానిక యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
రూ. 4170 కోట్లతో 2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని వరంగల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నామని పనులను వీలైనంత త్వరగా ప్రారంభించడానికి వీలుగా పనులను విభజించుకొని దశల వారీగా చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.భద్రకాళి ఆలయ మాడవీధులతోపాటు కల్యాణ మండపం, పూజారి నివాసం,విద్యుత్ అలంకరణలను వచ్చే దసరా నాటికి అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్రణాళికను రూపొందించుకొని పనిచేయాలని ఆదేశించారు. అమ్మవారి ఆలయ అభివృద్ది పనుల పర్యవేక్షణకు తానే స్వయంగా వస్తానని చెప్పారు. రోప్‌వే, గ్లాస్‌బ్రిడ్జి తో సహా అన్ని పనులు వచ్చే డిసెంబర్ కల్లా పూర్తిచేయాలన్నారు. భద్రకాళి చెరువు ప్రాంతంలో ఇంతవరకు 3.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించామని, 2.06 కోట్ల రూపాయిల మట్టిని విక్రయించామని అధికారులు తెలిపారు. ఈ వర్షాకాలం పూర్తయిన వెంటనే ఈ చెరువు మట్టిని తరలించాలని మంత్రి సూచించారు. ఆలయంలో యంత్రాల సాయంతో భోజన తయారీ కార్యక్రమాన్ని చేపడతామని దీనికి తగ్గట్టుగా నిర్మాణాలు చేయాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవసరమైన భూమిని గుర్తించాలని సంబంధిత అధికారులకు సూచించారు.హాస్టల్ లో విధ్యార్ధులకు, హాస్పిటల్ లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా చూడడానికి మండలానికి సంబంధించిన ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయిక్, శాసన సభ్యులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.నాగరాజు,గండ్ర సత్యనారాయణ, నాయని రాజేందర్ రెడ్డి,శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,బస్వరాజు సారయ్య,అంజిరెడ్డి,బండ ప్రకాష్, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో పాటు వివిధ శాఖలకు సంబంధించిన రాష్ట్ర స్ధాయి ఉన్నతాధికారులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కలెక్టర్లు డాక్టర్ సత్య శారద,స్నేహ శబరీష్,ఎస్పీలు, తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో అనగా 26 7 2025 రోజున జమ్మికుంట నుండి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు టిజి 02 జెడ్ 0026 చిట్యాల మండలం లోని కొత్తపేట బస్టాండు వద్ద ఆగి నలుగురు ప్యాసింజర్లను ఎక్కించుకొని అప్పుడే కదులుతున్న సమయంలో గోపాల్పూర్ క్రాస్ నుండి ఒక షిఫ్ట్ కారు ఏపీ 36 ఎక్స్ 9797 అది వేగంగా అజాగ్రత్తగా వచ్చి ప్రభుత్వ బస్సు యొక్క కుడివైపున బలంగా ఢీకొనడంతో బస్సులో ఉన్న ఒక వ్యక్తి మోకాలికి గాయం అయిందని కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా గాయాలు అయినాయి అని అట్టిబస్ డ్రైవర్ (హుజురాబాద్ బస్ డిపో లో ఆర్టీసీ డ్రైవర్) గా పని చేస్తున్న గోలి జనార్ధన్ సన్నాఫ్ పోశెట్టి అను వ్యక్తి దరఖాస్తు ఇచ్చి అజాగ్రత్తగా వచ్చి ప్రభుత్వ బస్సును ఢీకొట్టడంతో బస్సు యొక్క బంపర్ హెడ్లైట్ బాడీ డ్యామేజ్ అయిందని కావున అందుకు కారకులైన కారు డ్రైవర్ (గట్టు రఘు నైన్ పాక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు) పై తగు చట్టారిత చర్యలు తీసుకోవాలని కోరగా చిట్యాల ఎస్ఐ జి శ్రవణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
42 శాతం బీసీ బిల్లును బిజెపి ఆమోదించి ముస్లింలకు న్యాయం చేయాలి.
చిట్యాల, నేటిధాత్రి ;
చిట్యాల మండల మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అన్ని రంగాలలో రాజకీయ ప్రాతినిధ్యం కొరకుకులగనన చేపట్టి 42%బీసీ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి బిల్లును పంపించడం జరిగినది ముఖ్యంగా ఇందులో ముస్లిం బీసీలకు స్థానం కల్పించడం జరిగినది ఈ బిల్లును రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు అమలు కాకుండా అడ్డుపడుతున్నారు కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో బీసీ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు అలాగే మధ్యప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు ఇంకా దేశంలోని మరికొన్ని రాష్ట్రాలలో బీసీ ముస్లింలకు రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా అక్కడి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయివాస్తవంగా స్వాతంత్రానికి పూర్వం 1852లో అంటర్ కమిషన్ బ్రిటిష్ కాలంలోనేముస్లింలలో ఉన్న బీసీ లకు చట్టబద్ధత చేసింది ముఖ్యంగా ముస్లిం లో ఉన్న బీసీ ఎ బి సి గ్రూప్ లకు చెందిన కులాలైన ఫకీరు మెహతారు దూదేకుల ఖురేషి గారెడి చాకలి మంగలి అత్తరు సాహెబులు పాములు పట్టేవారు 14 కులాలకు చెందిన బీసీ ముస్లింలు దాదాపుగా 37 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విషయము సమాజంలో ఉన్న హిందూ సోదరులకు తెలుసు కావున 42% బిసి బిల్లుకు అడ్డుపడకూడదని మన తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి నాయకులను ముస్లిం బీసీ ఏ బి సి గ్రూపులకు చెందిన కులస్తుల తరపున రాష్ట్ర బిజెపి పెద్దలను కోరుచున్నాము అని మహమ్మద్ రాజ్ మహమ్మద్ విలేకరుల సమావేశంలో తెలియపరిచారు.
దేశ,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, తప్పనిసరి అవకాశం ఉన్నకాడ రిజర్వెన్లలోపోటీ చేయడానికి అవకాశం కల్పించాలని వికలాంగుల సంఘం నాయకుడు పుల్ల మల్లయ్య* కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులను కోరారు శమనవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో మల్లయ్య మాట్లాడుతూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు అన్ని రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తూన్నాయని అన్నారు . ఈ ప్రభుత్వాలు కొత్త పించలు సంక్షేమ పథకాలు, , అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు , భూమి కొనుగోలు పథకాలు వికలాంగులకు రావలసిన అనేక పథకాలలో అన్యాయం జరుగుతుందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బంధులను, అవస్తలను ప్రభుత్వాలు గుర్తించి 5% శాతం రిజర్వేషన్లు కల్పించారని ,త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ 5 శాతం రిజర్వేషన్లు సంబంధించిన కేంద్ర , రాష్ట్ర జిల్లా ఎన్నికల అధికారులు అమలు చేసి వికలాంగుందరికి అవకాశం కల్పించాలని కోరారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.