రాజకీయాల్లో పద్మశాలీలు ముందుండాలి
అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బాపు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండల కేంద్రంలో అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బాపు ఆధ్వర్యంలో శనివారం మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బాపు మాట్లాడుతూ పద్మశాలీలు చరిత్రకంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించారన్నారు. వృత్తిపరంగా,విద్యారంగంలో, వ్యాపారాలలో స్ఫూర్తిదాయకంగా ఎదిగున్నారు.కానీ రాజకీయ ప్రతినిధులు లోపించడం వల్ల సమాజ మొత్తానికి అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇకనైనా చైతన్యంతో ముందుకు వచ్చి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలి వర్గానికి చెందిన యువత సామాజికంగా విశ్వసయనీయత కలిగిన నాయకులు జెడ్పిటిసి, ఎంపీటీసీ,సర్పంచ్,వార్డ్ మెంబర్ పదవుల కోసం పోటీచేసి గెలిచి ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పద్మశాలి కులస్తుల సమావేశంలో మండల నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మండల సంఘం అధ్యక్షుడిగా వేముల మల్లేష్,ప్రధాన కార్యదర్శిగా దుస్సా భూమన్న అవినాష్, ఉపాధ్యక్షుడిగా కొత్తపల్లి తిరుపతి,ప్రచార కార్యదర్శి, కార్యవర్గ సభ్యులుగా పలు గ్రామాల ప్రతినిధులను ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా నూతన కమిటీని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శివ్వారం సర్పంచ్ ఆవిడపు గణేష్, జైపూర్ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు కర్ణ భూమన్న,సభ్యులు మల్లేష్, డాక్టర్ శంకర్,ఇప్పపల్లి రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.