పాపం.. పవన్‌!

`సినిమా నిలబెట్టుకోవడానికి అష్ట కష్టాలు!

`ఎవర్రా మనల్ని ఆపేది అన్నాడు?

`సినిమా నిలబెట్టుకోవడం కోసం ఆపసోపాలు పడుతున్నారు.

`సినిమా ఫిక్షన్‌ అని చెప్పుకొచ్చారు!

`చరిత్ర సత్యాలను ఈ తరానికి తెలియాలంటున్నారు.

`కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

`సినిమా సన్నివేశాలలో దొర్లిన తప్పులను గుర్తు చేస్తున్నారు.

`పవన్‌ ఇమేజ్‌ కాపాడుకోవాల్సిన అవసరం వుంది?

`మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆడియో లీక్‌!

`సినిమా నిలబెట్టాలని జనసైనికులకు సూచన.

`ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా వారం పాటు ఆడేలా చొరవ తీసుకోవాలి.

`కనీసం అన్నం తినడానికి కూడా సమయం లేకుండా పవన్‌ కష్టపడుతున్నారు.

`సినిమాలు చేసి పార్టీని నిలబెట్టారు.

`ఇప్పుడు సినిమాను నిలబెట్టే బాధ్యత మనం తీసుకోవాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

     సినిమా ప్రేక్షలకు నచ్చే విధంగా వుంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరూ ఆపలేరు ..ఎవరు అడ్డుకున్నా సినిమా ఆగదు. చిన్న చిన్న సినిమాలు బాగుంటే తర్వాత రోజుల్లో బ్లాక్‌ బస్టర్లు అవుతున్న రోజులు. సినిమా కాస్త బాగుందంటే చాలు జనాలు విపరీతంగా ఎగబడుతున్నారు. వారంలో రోజుల్లో సినిమాలు కోట్లు కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. అలాంటిది పవన్‌ కళ్యాన్‌ సినిమా ఎందుకు డిజాస్టర్‌గా మారుతోంది. గతంలో కూడా పవన్‌ సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్లేమీ కాదు. కాని ఆయన క్రేజ్‌తో బాగానే సినిమాలు ఆడేవి. అయితే ఆయనను సినీ హారో కాన్న, పవన్‌ వ్యక్తిత్వం గురించి సినిమాకు చెందిన వాళ్లు గొప్పగా చెప్పేవారు. అది జనాల్లోకి బాగా చేరింది. అప్పటి నుంచి పవన్‌ అంటే ప్రజలకు ఒక రకమైన అభిమానం పెరిగింది. ప్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా వ విపరీతంగా పెరిగింది. పైగా సినిమాలో ఆయన హవభావాలు కూడా జనానికి బాగా నచ్చేవి. పవన్‌ తెరమీద చేసే కొన్ని సిన్ని వేషాలు ప్రజలకు చాలా దగ్గరగా వుండేవి. అవే ఆయనను పవర్‌స్టార్‌ను చేశాయి. గత వకీల్‌ సాబ్‌ వరకు కూడా ఆయన సినిమాలు మినిమమ్‌ గ్యారెంటే అనేవారు. కాని ఉన్న ఫలంగా హరిహర వీర మల్లు సినిమాను కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదన్న వార్తలతోనే అసలు నిజం బైటపడిపోయింది. ఆ సినిమా ఆడడం కష్టమని తేలిపోయింది. అయినా కావాలనే కొందరు పని గట్టుకొని హరిహర వీరమల్లు మీద విష ప్రచారం చేస్తున్నారని కూడా అనుకున్నారు. కాని సినిమా విడుదలైన తర్వాత అదంతా నిజమే అంటున్నారు. కాకపోతే ఈశ్వరుడు నోరుంది కదా? అని ఏది పడితే అది వాగొద్దు! అని స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్‌. అదెందుకో అటు తిరిగి, ఇటు తిరిగి ఆయన నిజ జీవితంలో ఆపాదించబడుతుందేమో? అని ఆయన ఊహించి వుండకపోవచ్చు. కాని ఇప్పుడు అదే నిజమౌతోంది. ఈ మధ్య మనల్నెవడురా? ఆపేది అని ఓ మాటన్నారు. అది ఏ సందర్భంలో అన్నారో గాని, ఇప్పుడు సినిమా కష్టాలను స్వయంగా చూస్తున్నారు. పవన్‌ కళ్యాన్‌ సినీ కేరిర్‌లో డిజాస్టర్లు లేక కాదు. గతంలో అనేకం వున్నాయి. ఆయన సినిమాల్లో హిట్లకన్నా, ప్లాఫులే ఎక్కువగా వున్నాయి. కాని అప్పటి పరిస్దితి వేరు. ఇప్పటి పరిస్దితి వేరు. అప్పుడు కేవలం ఆయన ఒక సినిమా హీరో మాత్రమే. ఇప్పుడు రాజకీయ నాయకుడు. నాయకుడిగా ఆయన గత పన్నెండేళ్లుగా ప్రజల్లో వుంటున్నారు. కాని ఇప్పుడు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి రాజకీయాల్లో సాగినా ప్రభుత్వంలో చేరలేదు. ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేసినా గెలవలేదు. అయినా అభిమానుల్లో ఆయన క్రేజ్‌ తగ్గలేదు. ఎప్పుడైతే ఆయన డిప్యూటీ సిఎం. అయ్యారో అప్పటి నుంచి ఆయనపై వున్న క్రేజ్‌ తగ్గుతూ వస్తోందని చెప్పడంలో సందేహం లేదు. పైగా సినిమా నిర్మాణానికి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడిలో వున్నారు. సినిమాకు సమయం కేటాయించే అవకాశం దక్కలేదు. ఈ మధ్యలో మహారాష్ట్ర, డిల్లీ, హర్యానా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొంటూ వచ్చారు. అలా రాజకీయాలు, ఇటు పాలనకు సమయం కేటాయిస్తూ, సినిమాకు సమయం సరిపోలేదు. ఇక సినిమా ఏదో రకంగా చుట్టేయాలనుకున్నట్లున్నారు. పూర్తి చేశారు. నిజానికి ఈ సినిమా ఆది నుంచి పురిటి నొప్పులే భరిస్తూ వస్తోంది. కాకపోతే ఆఖరుకు ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యిందికాని పేషెండ్‌ డెడ్‌ అన్నది రుజువైంది. సినిమా విడులైతే సరిపోదు. సినిమా కూడా ప్రేక్షకులను ఒప్పించాలి. మెప్పించాలి. అంతే కాని రెండున్న గంటలు ప్రేక్షకులను రంజింప జేయకుండా కూర్చోబెడతా అనుకుంటే కుదరదు. హరిహర వీరమల్లు అనే సినిమా ఫిక్షన్‌ అన్నారు. అంటే కల్పిత కథ అని చెప్పుకొచ్చారు. ఈ మధ్య కూడా అదే ప్రచారం సాగించారు. కాని సినిమాలో పాత్రలు, సన్నివేశాల వల్ల అది ఫిక్షన్‌ కాదని తేలిపోయింది. ఇందులో కూడా రాజకీయం వుందన్న సంగతి అర్దమైంది. ప్రజలు రెండు గంటలపాటు వినోదం కోసం వస్తే, ఏదో చూపిస్తే చూస్తారా? అందులోనూ సినీ నిర్మాణలోపాలు కళ్లముందు కదలాడుతుంటే అసలే భరించరు. ఇక్కడా అదే జరిగింది. ఓవైపు చారిత్రక సినిమాలో చరిత్ర సత్యాలు చెబితే ఎవరు చూస్తారు. ఎక్కడి హరిహర మల్లుడు. ఎక్కడి గోల్కొంగ నవాబులు.ఎక్కడి డిల్లీ సుల్తానులు. 13శతాబ్ధానికి చెందిన హరి హర వీరమల్లు, 16 శతాబ్ధంలో కనిపించడమేమిటి? అయినా నిర్మాణ పరంగా మాయ చేసినా ప్రజలకు నచ్చేదేమో? కాని ఎక్కడా పవన్‌ కల్యాన్‌ సినిమాలాగా లేదని అభిమానులు కూడా బాధ పడుతున్నారు. అమ్మాయిని గుర్రం మీద కూర్చోబెట్టే స్టామినా వున్న హరో చిన్న తువ్వాలు తాకితే కింద పడే సన్నివేశాన్ని అభిమానులు జీర్ణించుకుంటారా? అయినా అభిమానులకే నచ్చని సినిమాను ఎంత ప్రమోషన్‌ వృదా అని తెలిసినా పాపం కష్టపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమాను నిలబెట్టడం కోసం ఆపసోపాలు పవన్‌ కల్యాన్‌ ఆపసోపాలు పడుతున్నాడు. ప్రమోషన్‌లో మునిగి తేలుతున్నారు. గతంలో పవన్‌ కల్యాణ్‌ తన సినిమాలకు ప్రమోషన్‌ చేసిన సందర్బాలు చాలా తక్కువ. కాని ఈ సినిమాకు పడుతున్న కష్టాలు మరే సినిమాకు పడలేదు. అయితే ఓ వైపు తనకు ఎలాంటి ప్రాబ్లమ్‌ లేదంటూనే తన ప్రస్టేషన్‌ను పదే పదే చూపిస్తున్నారు. సినిమా పోయిందని బాధ పడాల్సిన అవసరం లేదంటూనే ఉప ముఖ్యమంత్రి స్ధానంలో వుండి జన సైనికులను రెచ్చగొడుతున్నారు. ఇది కూడా వాంచనీయంకాదు. ఇదిలా వుంటే ఆ పార్టీకి చెందిన మరో మంత్రి ఆడియో ఒకటి బైటకు వచ్చింది. జన సైనికులను ఆయన దిశానిర్ధేశం చేస్తున్న ఆడియో వైరల్‌ అవుతుంది. అయితే అది ఆ నాయకుడిదో కాదో తెలియదు. కాని ఆయనదే అంటూ మాత్రం పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రితోపాటు ఎమ్మెల్యేలు కూడా సినిమా ప్రమోషన్‌ సాగిస్తున్నారు. జన సైనికులకు సినిమా నిలబెట్టాలని కోరుతున్నారు. ఎట్టి పరిసి ్ధతుల్లో సినిమా కనీసం వారం రోజుల పాటు ఆడేలా చూడాలని సూచిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌మీద ఆ మంత్రి విపరీతమైన సానుభూతి చూపిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ కనీసం అన్నం తినడానికి కూడా సమయం సరిపోవడం లేదని జన సైనికులకు చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ సిని మాలు చేసి పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు సినిమా పోతే పార్టీ నడిపేందుకు కష్టమౌతుందన్నట్లు జన సైనికులకు వివరిస్తున్నారు. ఇప్పుడు సినిమాను నిలబెట్టే బాధ్యత జన సైనికులు తీసుకోవాలని కోరుతున్నారు. అందుకు గ్రామ స్ధాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్దాయి నాయకులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఇంత చేసినా సినిమాను ఎంత కాలం ముందుకు తీసుకెళ్లగలరు. అంటే అభిమానులు, జనసైనికులు తమ సొంత డబ్బులు పెట్టుకొని సినిమాను నడిపిస్తే, ఎంత కాలం నడుస్తుంది. ఏ సినిమా అయినా సరే, ఎంత పెద్ద హీరో అయినా సరే బాగుంటేనే సినిమా చూస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా విజయవంతమౌతుంది. లేకుంటే డిజాస్టర్‌గానే మిగిలిపోతుంది. పైగా ఈ సినిమాకు తెలుగుదేశం శ్రేణులుకూడా పెద్దగా ఆదరిస్తున్నట్లు లేదు. బిజేపి పార్టీ శ్రేణులు నచ్చినట్లులేరు. ఆ మూడు పార్టీల నాయకులు ముందుకొస్తే తప్ప కనీసం ఒక వారం ఆడే పరిసి ్దతి కనిపించడంలేదు. అయినా సినిమా బాగా లేదన్న టాక్‌ విపరీతంగా ప్రచారం జరిగింది. మంచిగా వున్న సినిమా బాగాలేదని ఎవరు ప్రచారం చేసినా, మౌత్‌ టాక్‌తో సూపర్‌ డూపర్‌ హిట్లు అయిన సినిమాలు అనేకం వున్నాయి. బలగం లాంటి సినిమా తెలంగాణలో ఎలా ఆడిరదో చూశాం. ఏపిలో బలగాన్ని ఆదరించకపోయినా సరే బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. కావాలనే బలగం సినిమాను ఏపిలో చెప్పకపోయినా బాయ్‌ కాట్‌ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమాను చూడడానికి కూడా అక్కడి జనం ఇష్టపడలేదు. కాని సినిమా ఎంతో విజయవంతమైంది. అలాగే పవన్‌ కళ్యాన్‌ సినిమా బాగుంటే ఏపిలో నడిచినా సరిపోయేది. కాని అంతో ఇంతో నడుస్తోందంటే నైజాం పుణ్యమే. ఏపిలో కూడా సినిమాను ఆదరిస్తే సినిమా ఎక్కడికో వెళ్లిపోయేది. కాని సినిమాపై ఇంకా పవన్‌ ఎంత ఆశలు పెట్టుకున్నా ముందుకు తీసుకుపోవడం అసాధ్యం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version