సెల్యూట్ టూ ట్రాఫిక్ పోలీస్.

సెల్యూట్ టూ ట్రాఫిక్ పోలీస్

వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ ఔదార్యం

 

వరంగల్ తూర్పు, నేటిధాత్రి.

 

 

 

 

వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నగర ప్రజలకు, ప్రయాణికులకు ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించే గ్రీన్ మ్యాట్ షెల్టర్ లు ఏర్పాటు చేశారు. పోచంమైదాన్ బస్ షెల్టర్ కు తాత్కాలిక ఉపశమనం కల్పించిన ట్రాఫిక్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ప్రయాణికులు. పోచంమైదాన్ లో బస్ షెల్టర్ పై కప్పు లేక గత రెండు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఇదే విషయంలో ఎన్ని సార్లు వార్తలు రాసిన పట్టించుకొని రాజకీయ నాయకులు. మహిళా ప్రయాణికులు పోచంమైదాన్ బస్ సెంటర్లో నిలబడే అవకాశం కల్పించిన వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ కు సెల్యూట్ అంటున్న నగర ప్రజలు.

CI Ramakrishna Audaryam

 

 

ఎండ తీవ్రతకు వాహనదారులు, ప్రయాణికులకు, పాదచారులకు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ తెలిపారు. వరంగల్ నగరంలో పలుచోట్ల ప్రయాణించే వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు, బస్టాండ్ల వద్ద నిలబడి ఉన్నప్పుడు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గ్రామాల వారీగా కులగణన లెక్కలు ప్రకటించాలి.

గ్రామాల వారీగా కులగణన లెక్కలు ప్రకటించాలి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి.

అచ్చునూరి కిషన్ ముదిరాజ్
మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు.

 

హన్మకొండ:నేటిధాత్రి

 

 

ములుగు జిల్లా కేంద్రంలో మెపా జిల్లా కార్యాలయంలో అచ్చునూరి కిషన్ ముదిరాజ్ అధ్వర్యంలో ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మెపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ విచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టో లో ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలిని, మేమెంతో మాకు అంతా వాటా అన్ని రంగాల్లో కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్, బండి రాజు ముదిరాజ్ సంయుక్తంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య వచ్చినప్పటి నుంచి అగ్ర వర్ణాల చేతి’లో, వారి మోసపూరిత మాటలకు బీసీ’లు అన్ని రంగాల్లో అణిచివేతకు, అవమానాలకు, అభివృద్ధి’కి, వెనుకబాటు గురి అవుతునే ఉన్నారు. కానీ వారి బతుకుల్లో ఎక్కడ మార్పు కనబడడం లేదు.

కావున ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన లెక్కలను గ్రామాల వారీగా ప్రకటించి, కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ ఇవ్వాలని, లేనియెడల ప్రతి జనరల్ స్థానాల్లో బీసీలు అత్యధిక స్థానాల్లో పోటో చేసి బీసీల సత్తా ఏంటో నిరూపిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెపా ములుగు జిల్లా గౌరవ అధ్యక్షుడు బండి రాజు ముదిరాజ్, మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ ముదిరాజ్, మహబూబాబాబ్ జిల్లా అధ్యక్షుడు దుండి అశోక్ ముదిరాజ్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పోలుదాసరి రాము ముదిరాజ్, వెంకటాపూర్ మండల అధ్యక్షుడు మేకల రమేష్ ముదిరాజ్, చోప్పరి రాజేందర్ ముదిరాజ్, మల్లేబోయిన వెంకటేష్ ముదిరాజ్, మల్లికార్జున్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

జహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ పట్టణంలో శనివారం మెథడిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చర్చి వద్ద ప్రత్యేక ప్రార్ధన నిర్వహించి, ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ రైల్వే గేట్ వరకు, అక్కడి నుండి పస్తపూర్ కూడలి వరకు, తిరిగి మెథడిస్ట్ చర్చ్ గార్డెన్ నగర్ వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మతపెద్దలు, భక్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

– రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యే…

కొల్చారం, (మెదక్ )నేటిధాత్రి :-

 

మండలపరిధిలోనిచిన్నఘణపూర్
గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నాగయ్యతో కలిసి ప్రారంభించారు. ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి, ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి, దళారుల చేతిలో రైతులు మోసపోవద్దని అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేయాలని పిఎసిసిఎస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూరెగారి నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పాశం శ్రీనివాస్ రెడ్డి, బాగారెడ్డి, రాజా గౌడ్, రవితేజ రెడ్డి, ముత్యంగారి సంతోష్ కుమార్, సందీప్, లక్ష్మీనారాయణ గౌడ్, మురళి గౌడ్, మంగలి శంకర్, సీఈఓ కృష్ణ, రైతులు, పిఎసిఎస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్.

నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో పదార్థాల గుర్తింపు.

వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్

నర్సంపేట ఏసీబీ కార్యాలయం ప్రదర్శన,నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ తో ఆర్టీసీ డిపోలో తనిఖీలు.

నర్సంపేట నేటిధాత్రి:

 

 

స్పెషల్ ట్రెయిన్డ్ నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో మత్తు పదార్థాల రవాణా అరికట్టేందుకు గుర్తింపు చేయవచ్చునని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు.

 

Dog Squad.

ఈరోజు వరంగల్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ నర్సంపేట ఎసిపి కార్యాలయం సందర్శించి డివిజన్ పోలీసు అధికారులకు శాంతి భద్రతల దృష్ట్యా తగు సూచనలు చేశారు.ఆనంతరం నర్సంపేట బస్ డిపో ఆవరణలో ఏమైనా మత్తు పదార్థాల రవాణా జరుగుతుందా అని అనుమానంతో స్పెషల్ ట్రెయిన్డ్ నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ మాట్లాడుతూ గంజాయి, తదితర మత్తు పదార్థాల రవాణా అరికట్టేందుకు అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నివారించేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసిపి కిరణ్ కుమార్, టౌన్ సీఐ రమణమూర్తి,ఎస్ఐలు రవి కుమార్ ,అరుణ్,డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

తూకంలో ఎలాంటి అవకతవకలు జరగదు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి;

 

 

శాయంపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండలంలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారుల సహాయంతో ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు మాట్లాడుతూ రైతులు పొలాల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో ప్రభుత్వం సూచించే సూచన లు క్రమం తప్పకుండా పాటిం చి కొనుగోలు కేంద్రం నిర్వా హకులకు సహకరించాలని తేమశాతం లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి ప్యాడి క్లీనర్ ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచలని రైతులకు దాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం తమ డబ్బులను ఖాతాలోకి వేస్తుందని అదేవిధంగా సన్నధాన్యానికి కింటాకు 500 రూపాయల బోనస్ ను కూడా ప్రభుత్వం అందిస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వానకాలం పంట కన్నా యా సంగి పంటలో వరిసాగు పెరి గిందని వరి ధాన్యం కొనుగో లలొ ఎలాంటి అవకతవకలు జరిగిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.వరి బస్తాలు కాంట వేయడంలో 40 కిలోల 650 అంతకంటే ఎక్కువ జోకకూ డదని హెచ్చరించారు.

 

MLA

ఈ కార్యక్రమం లో మండల తాసిల్దార్ సత్యనారా యణ, ఎంపీడీవో ఫణి చంద్ర ,వ్యవ సాయఅధికారి గంగా జము నా, అధికారులు, మండల అధ్యక్షుడు దూదిపాల బు చ్చిరెడ్డి, బాసని చంద్రప్రకాష్, దుబాసి కృష్ణమూర్తి, బాసని శాంత- రవి, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, అబ్బు ప్రకాష్ రెడ్డి, చక్రపాణి, చిరంజీవి, భాస్కర్ , అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమా నులు, ప్రజలు,, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో నారగాని మాధవి-శ్రీధర్ గౌడ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు చి. ల. సౌ. అమూల్య -చి.శ్రీకాంత్ గౌడ్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన గణపురం మండల బిఆర్ఎస్ నాయకులు
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రా రెడ్డి, యాత్ నాయకులు గాజర్ల చింటూ గౌడ్, మార్క సాయి గౌడ్,బబ్లుగౌడ్, హఫీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు

గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసిన.

గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

రాజ్యాంగ విరుద్ధమైన వి,డి, సి లను నిషేధించాలి.

మంగపేట నేటిధాత్రి

 

 

 

 

కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు
నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ గ్రామంలో గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసి, శ్రీరామనవమి నాడు గుడిలోకి వచ్చిన మహిళలను గెంటివేసి అవమానపరిచి,ఉపాధి కల్పించే ఈత చెట్లను తగులబెట్టిన వి డి సి సభ్యులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కల్లు గీత కార్మిక సంఘము మంగపేట మండల కమిటీ డిమాండ్ చేశారు. మంగపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మండల కమిటీ ఆధ్వర్యంలో తాళ్లరాంపూర్లో జరిగిన వి డి సి పెద్దలను తక్షణమే అరెస్ట్ చేయాలనీ కల్లు గీత కార్మికుల తో నిరసన చేయడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ లో రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసిన వి డి సి కమిటీల అరాచకాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని,తాళ్ల రాంపూర్ లో తాళ్లు ఎక్కతు న్నందుకు వి డి సి కి డబ్బులు ఇవ్వలేదనే కక్షతో కల్లు గీత వృత్తినే నమ్ముకునీ జీవనం కొనసాగీస్తున్న గీత కార్మికులను తాళ్లు ఎక్కద్దని కల్లు ఎవరు తాగద్దని చాటింపు వేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు,పైగా ఈనెల 6న శ్రీరామనవమి పండుగ సందర్బంగా గౌడ మహిళలు గుడికి వస్తే మీరు గుడికి రావద్దు అని బయటకు పంపి బహిష్కరణ చేసిన వి డి సి కమిటీపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.నిజామాబాద్ జిల్లాలో వివిధ వృత్తులు చేస్తున్న
కుర్మ,యాదవులు,ముదిరాజ్, బెస్త,వడ్డెర,నాయి బ్రాహ్మణ, నేత,మరియు దళితులు తదితరచేతి వృత్తిదారులను సాంఘిక బహిష్కరణ చేస్తున్న వి డి సి లను శాశ్వతంగా లేకుండా నిషేధించాలని కమిటీ పెద్దలు అన్నారు..

Temple

 

 

 

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు లోడే శ్రీనివాస్ గౌడు, మండల గౌడ సంఘము అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడు గాజుల ఈశ్వర్ గౌడు, గాజుల వెంకటేశ్వర్లు గౌడ్, గంట చిట్టిబాబు గౌడ్, బూర శ్రీనివాస్ గౌడ్, కమలాపూర్ గ్రామం గౌడ సంఘం నుండి పానుగంటి వెంకటేశ్వర్లు గౌడ్, బోనగాని యాదగిరి గౌడ్, జాడి శేఖర్ గౌడ్, బూర సాంబయ్య గౌడ్, పంజాల సత్యం గౌడ్, పందాల హరిబాబు గౌడ్, ఓరగంటి రాంబాబు గౌడ్, బూర నరేష్ గౌడ్, గుండెబోయిన శీను గౌడ్,శేఖర్ గౌడ్ కోరుకొప్పుల రాము గౌడ్, కోరుకొప్పుల సత్యం గౌడ్, కుప్పల పున్నం రావు గౌడ్, చిన్న చంద్రం గౌడ్, పెద్ద చంద్రన్న గౌడ్,ఉడుగుల సాంబయ్య గౌడ్ వీరితో పాటు మిగతా గ్రామాల నుండి 40 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.

భీమారం లో ఉచిత నేత్ర వైద్య శిభిరము.

భీమారం లో ఉచిత నేత్ర వైద్య శిభిరము

30 మంది రేకుర్తి ఆసుపత్రి కి తరలింపు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

డాక్టర్ భాస్కర్ మాదేకర్ ఉదార నేత్ర వైద్యశాల రేకుర్తి, కరీంనగర్ వారి సౌజన్యంతో, వైస్ చైర్మన్ లయన్ చిదురా సురేష్ సహకారంతో, మంచిర్యాల జిల్లా భీమారం జడ్పి ఉన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ మంచిర్యాల,లయన్స్ క్లబ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ,లయన్స్ క్లబ్ విజన్ కేర్ ల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిభిరము నిర్వహించారు. వైద్య శిభిరానికి 70 మంది విచ్చేసి బి పి,షుగర్,కంటి పరీక్షల అనంతరం 30 మంది కంటి ఆపరేషన్ కోసం అర్హత సాధించినట్లు,వారిని ఉచిత కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి ఆసుపత్రి కి పంపించామని రేకుర్తి ప్రతినిధి ప్రభాకర్ మరియు లయన్ డాక్టర్ కె. సుగుణాకర్ రెడ్డి తెలిపారు.ఐ పెషేంట్ లకు వారి వెంట వెళ్లే వారికి ఉచిత బస్సు ప్రయాణం,ఉచిత భోజన వసతి ఉంటుందని తెలుపుతూ,కంటి ఆపరేషన్ తరువాత ఆదివారం భీమారం కు తిరిగి వస్తారని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఛైర్పర్సన్ ఫర్ ఐ క్యాంప్స్ లయన్ మోదుంపురం వెంకటేశ్వర్,మంచిర్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ పుల్లూరి బాలమోహన్,కోశాధికారి లయన్ కొల్ల వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి విజన్ కేర్ అధ్యక్షులు లయన్ సయ్యద్ ఇలియాస్ వారి సిబ్బంది,భీమారం మాజీ సర్పంచ్ చేకుర్తి సత్యనారాయణ రెడ్డి,భగద్గీత అధ్యయన మండలి సభ్యుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్ రూములు కేటాయించే.!

డబుల్ బెడ్ రూములు కేటాయించే వరకు పోరాడుతాం…

“వరంగల్ తూర్పు జర్నలిస్టుల” రిలే నిరహార దీక్షలు – “5వ రోజు”

“ఓ జర్నలిస్ట్ యూనియన్” నాయకుల కుట్రలు? దీక్షలకు వెళ్లకుండా వారి సభ్యులకు హుకుం జారీ?

మేలుకోండి తూర్పు జర్నలిస్టు మిత్రులారా, కుట్రపూరిత మాటలను నమ్మి మోసపోకండి

డబుల్ బెడ్రూమ్స్ సాధనే మా లక్ష్యం, కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా ఈ ఉద్యమం ఆగదు

“ఐదవ రోజు” రిలే నిరహార దీక్షలు. వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల మద్దతు.

జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ లు కేటాయించండి మంత్రి కొండా సురేఖకు, “తూర్పు జర్నలిస్టుల” విజ్ఞప్తి.

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

 

వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను త్వరగా కేటాయించాలని వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం ఐదవ రోజు జర్నలిస్టుల రిలే నిరహార దీక్షలకు సంఘీభావం తెలిపిన తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షుడు ఆకారపు మోహన్, వరంగల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు భరత్, నవ తెలంగాణ వికలాంగుల సంఘం అధ్యక్షుడు మహమ్మద్ అజీమ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యారా ప్రశాంత్, ప్రజానాట్యమండలి వరంగల్ జిల్లా కార్యదర్శి వలదాసు దుర్గయ్య, తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు. అంబేద్కర్ జయంతి 14 ఏప్రియల్ సోమవారం రోజున మొదలైన నిరహార దీక్షలు, ఐదవ రోజుకి చేరుకున్నాయి.

double bedrooms

పాలకులు, అధికారులు స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని దీక్షలో పాల్గొన్న జర్నలిస్టులు తెలిపారు.

కొన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు, తమ సభ్యులను నిరహారదీక్షల వద్దకు వెళ్లకుండా, అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే కొందరు సభ్యులు యూనియన్లకు అతీతంగా వచ్చి, నిరహార దీక్షలో పాల్గొన్నారు. జర్నలిస్టులకు న్యాయబద్ధంగా రావాల్సిన డబల్ బెడ్ రూమ్ ల కొరకు, నిరాహార దీక్షలు చేపట్టిన తోటి జర్నలిస్టు మిత్రులతో కలిసి స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. ఇది మింగుడు పడని ఓ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కొందరు కుట్రలకు తెరలేపారని సమాచారం.

double bedrooms

 

“ఓ జర్నలిస్ట్ యూనియన్” నాయకుల కుట్రలు?

వరంగల్ జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం తమకోసం నిర్మించిన ఇళ్లను అప్పగించాలనే డిమాండ్ తో జర్నలిస్ట్ లు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదు రోజులకు చేరిన, అధికారుల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల్లో ఎలాంటి చలనంలేదు. దీనంతటికి కారణం జర్నలిస్ట్ యూనియన్ ల నాయకుల కుట్రలే కారణమంటూ దీక్షలో పాల్గొన్న జర్నలిస్ట్ లు మండిపడుతున్నారు. ఓవైపు వరంగల్ తూర్పులొ జర్నలిస్ట్ లు దీక్షలు కొనసాగుతుంటే, వారికి మద్దతు ఇవ్వాల్సిన జర్నలిస్ట్ నాయకులు కొందరు, ఓ మాజీ ఎమ్మెల్సీతో కొంత మంది సమావేశం కావటం తీవ్ర దుమారమే లేపింది. నిజానికి అక్కడ సమావేశంలో పాల్గొన్న జర్నలిస్ట్ లంతా ముందుగా దీక్షా శిబిరాని సందర్శించి సంఘీభావం తెలిపి, వాస్తవ పరిస్థితులపై చర్చించాల్సి వుండే, అదికూడా సదరు నాయకుడు చర్చలకు ఆహ్వానం పంపితేనే. కాని ఎలాంటి పిలుపు రాకపోయినా మనవాళ్ళు కొంత మంది జర్నలిస్ట్ లతో వెళ్లి, అయనతొ సమావేశం కావటం ఓరకంగా తొందరపడ్డట్టు అయింది. మరోరకంగా మనకు మనం విలువలను దిగజార్చుకున్నంత పనైందన్న చర్చ జరుగుతుంది.

double bedrooms

అంతే కాదు అక్కడ పాల్గొన్న చోట మోట నాయకులు కనీసం దీక్ష శిబిరం వైపు కూడ చూడకపోవటం అనేక అనుమానాలకు తావిచ్చినట్టు అయింది. ఇంతకీ మాజీ ఎమ్మెల్సీతొ సమావేశం అయినా జర్నలిస్ట్ లు రాజకీయ నాయకుల పక్షమా? లేక జర్నలిస్ట్ ల పక్షమో కూడ తెలియని అయోమయంలొ స్థితిలొ జర్నలిస్ట్ లు కొట్టు మిట్టడుతున్నారు. దీక్ష శిబిరం వద్దకు రాకుండ ఎమ్మెల్యే భర్తతొ సమావేశం అయి ఏంసాధించారో కూడ కనీసం తెలుపలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి నేతలు ఉండబట్టే జర్నలిస్ట్ లపై పరోక్షంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

 

రాజకీయ నాయకులు సైతం, జర్నలిస్టులను విభజించి పాలించే చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వున్నాయి. వరంగల్ జిల్లాలొ వరంగల్ తూర్పు జర్నలిస్ట్ లు ఇళ్ళ కోసం చేపట్టిన దీక్షలకు పొరుగు జిల్లా (కరీంనగర్) నుండి అక్కడి నాయకులు విచ్చేసి, దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారని, మరి మన జిల్లా నాయకులు మాత్రం, మనకు మద్దతు తెలుపడానికి కూడా రాలేదని, రాజకీయ నాయకుల చుట్టు తిరుగటం కోసం కాళ్ళు స్పందించాయని అన్నారు. ఇంత దౌర్బాగ్యమా అంటూ ప్రశ్నిస్తున్నారు దీక్షలో పాల్గొన్న జర్నలిస్టులు. స్వంత ప్రయోజనాల కోసం యూనియన్ ల పేరు చెప్పుకుని రాజకీయ నాయకుల నుండి, పరోక్షంగా లబ్ది పొందెందుకే ఈ ఎత్తుగడలా కనిపిస్తున్నది తప్ప, జర్నలిస్ట్ ల గూడు కోసం కాదన్నది స్పష్టమౌతున్నదని తూర్పు జర్నలిస్ట్ లు కొందరు మండిపడుతున్నారు.

రెండో విడత దళిత బంధు.!

రెండో విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలి

మొగులపల్లి ఎస్సీ మండల యువజన నాయకుడు
శనిగరపు శ్రీనివాస్
 మొగుళ్ళపల్లి నేటి ధాత:

 

 

 

గత ప్రభుత్వం మంజూరు చేసిన రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు తక్షణమే నిధులను విడుదల చేయాలని యువజన నాయకుడు శనిగరపు శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి ఇంతవరకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత బందు అనే పథకాన్ని ప్రవేశపెట్టి చాలామంది దళితుల జీవితాలలో వెలుగును నింపాయి అలాగే రెండవ విడతలో లబ్ధిదారుల యూనిట్ల ఎంపిక చేసే బాధ్యత గ్రామపంచాయతీలో కార్యదర్శులకు ఉన్నత అధికారులకు ఇవ్వడం జరిగిందన్నారు.

వారు కూడా సంబంధించిన సర్టిఫికెట్లతో పాటు యూనిట్ల ఎంపికను పూర్తి చేసి అకౌంట్లు కూడా తీయడం జరిగింది అప్పటి ప్రభుత్వం నిధులను విడుదల చేసి కలెక్టర్ అకౌంట్లో జమ చేయడం జరిగిందని,ప్రభుత్వం మారడం వలన నిధుల విడుదలను జాప్యం జరుగుతుంది నిధులను విడుదల చేయాలని గత 14 నెలల నుంచి రకరకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మా నిధులను మాకు ఇవ్వాలని అడిగిన ప్రతిసారి మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయడం తప్ప ఈ ప్రభుత్వం చేసేది ఏమీ లేదని ఇప్పటినుండి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని దళిత బంధు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెబుదామని అన్నారు.ఈ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే పేరుతో దళిత బంద్ అనే పథకాన్ని తొక్కి పెట్టాలని చూస్తుందని ఇది ముమ్మాటికీ దళితులను మభ్య పెట్టాలని ప్రభుత్వం చేస్తున్న కుట్రని రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు దళితుల ఐక్యతను మీరు చూస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

చెల్పూర్ సెక్టర్ లో పోషణ పక్వాడ్.

చెల్పూర్ సెక్టర్ లో పోషణ పక్వాడ్

సూపర్వైజర్ అప్సర సుల్తానా

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం చెల్పూర్ సెక్టర్ సూపర్వైజర్ అప్సర సుల్తానా ఆధ్వర్యంలో గాంధీ నగర్ గ్రామం లో పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు ఆకుకూరలు పండ్లు పోషక విలువలను పెంపొందించుకోవడం కోసం అంగన్వాడిలో ఇచ్చేటువంటి పాలు గుడ్లు కూరగాయల తోటి అన్నము ప్రతిరోజు అంగన్వాడికి వచ్చి గర్భిణీలు బాలింతలు పిల్లలు తినాలని సూపర్వైజర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ ఆర్ కోమల దేవి కె కోమల ఏ కోమల సుజాత సునీత లలిత లత సుభద్ర జ్యోతి రమాదేవి సుమలత సుసాన్ శోభ సునీత రామ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.

మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన భోగి పుష్ప ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. కాగా చంద్రయ్యపల్లి మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ముందుగా కుటుంబ సభ్యులు కుమారులు వంశి,రాకేష్,అత్త లచ్చమ్మ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అలాగే అదే గ్రామానికి చెందిన తూముల సాంబయ్య,తూముల రాజు,చీర్లంచ వీరాచారి,,వరంగంటి కోమల్ రెడ్డి, పోలోజు పద్మ భూశబోయిన తిరుపతి 1500 నగదును అందించారు.ఈ కార్యక్రమంలో ఏడెల్లి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల దీక్షలకు “కుమ్మర సంఘం” మద్దతు

జర్నలిస్టుల దీక్షలకు “కుమ్మర సంఘం” మద్దతు

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

 

తూర్పు జర్నలిస్టులకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూములు ఇవ్వకపోవడంతో “ఐదవ రోజుకు” చేరుకున్న దీక్షలు. వారికి సంఘీభావంగా వెళ్ళి దీక్ష శిబిరం వద్ద మద్దతు తెలిపిన తెలంగాణ రాష్ట్ర “కుమ్మర సంఘం” అధ్యక్షుడు ఆకారపు మోహన్. ఈ సందర్భంగా ఆకారపు మోహన్ మాట్లాడుతూ తూర్పు జర్నలిస్టుల కొరకు నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లులను త్వరగా వాటికి కేటాయించాలని కోరుతూ, తెలంగాణ కుమ్మర సంఘం తూర్పు జర్నలిస్టులకు మద్దతు ప్రకటిస్తు, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ స్పందించి వీరికి డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రజితోత్సవ సభను విజయవంతం చేయండి

రజితోత్సవ సభను విజయవంతం చేయండి

జైపూర్,నేటి ధాత్రి :

లక్షలాదిగా తరలి వచ్చి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు కోరారు.స్థానిక నియోజకవర్గం కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామంలో బీఆర్ఎస్ చలో వరంగల్ బహిరంగ సభ వాల్ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు.చలో ఎల్కతుర్తి,వరంగల్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లలలో భాగంగా వివిధ కార్యక్రమాలు నియోజవర్గ పరిధిలో చేపడుతున్నమన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు,మాజీ ప్రభుత్వ విప్,బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 27 న వరంగల్ లో జరిగే బహిరంగ సభకు లక్షలాదిగా జనం తరలి రావాలన్నారు.పార్టీ ఏర్పడి విజయవంతంగా రెండు దశాబ్దాల నర పూర్తయిన సందర్భంగా 25 సంవత్సరాల గులాబీ పండుగ వేడుకల్లో ప్రతి ఒక్కరూ తరలి రావాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లుకు దండై కదులుదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా బాపు నాయక్,రాజ్ కుమార్ యాదవ్,దుర్గం రాజేందర్,దుర్గం సంపత్,సప్ప భాస్కర్,జిమిడి సాగర్,దుర్గం రోహిత్,జిమిడి చంద్రయ్య,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ ఏడాదిన్నర పాలనలో..పుష్ప, హైడ్రా, మూసీ.!

రేవంత్ ఏడాదిన్నర పాలనలో..పుష్ప, హైడ్రా, మూసీ తప్ప ఏం లేదు

-బిజెపి మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల హామీలంటూ అర చేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని మరిచిపోయిందని బిజెపి మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనలో పుష్ప, హైడ్రా, మూసీ, హెచ్ సీ యూ మీద పడ్డారే తప్పితే ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అసమర్థ, అవినీతి, అసత్య ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణ లేని జీరో పరిపాలన సాగుతోందని..ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, విద్యా భరోసా కార్డు, చేయూత, ఆరోగ్యశ్రీ, లక్ష రూపాయలు, తులం బంగారం..ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ విస్మరించారని విమర్శించారు. రాను రాను సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతుందని, రేవంత్ రెడ్డి ని కేసీఆర్ జైలులో వేస్తే..రేవంత్ కనీసం ఆ ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు.

నగరంలో తిరుగులేని శక్తిగా సిపిఐ ఎదగాలి.

నగరంలో తిరుగులేని శక్తిగా సిపిఐ ఎదగాలి
మున్సిపల్ లో ఎర్రజెండా ఎగరడం కోసం కృషి చేయాలి
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

సిపిఐ కరీంనగర్ నగర 11వ మహాసభకు న్యాలపట్ల రాజు, బీర్ల పద్మ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. నగరంలో సిపిఐ పార్టీ ఎదుగుదల కోసం ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సిపిఐ కరీంనగర్ నగర 11వ మహాసభ సందర్భంగా సిపిఐ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆవిష్కరించారు. నగర కార్యదర్శి రిపోర్ట్ ను నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన మహా సభలో ప్రారంభ ఉపన్యాసంచేసిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎర్రజెండా అంటే దోపిడీదారులకు పేదలను అణిచివేసేవారికి గుండెల్లో రైళ్లు పరిగెడతాయని పేర్కొన్నారు. సిపిఐ పార్టీ మార్క్సిజమ్ లెనిజం పునాదులపై ఆవిర్భవించిందని సమాజంలో అంతరాలు లేని సమాజ స్థాపన కోసం నిర్విరామ పోరాటం చేసి ఉందని భూమిలేని నిరుపేదలకు భూమి కావాలని ఇండ్ల స్థలాల కోసం, రేషన్ కార్డుల కోసం అనేక పోరాటాలు చేసిన ఘన చరిత్ర సిపిఐకి ఉందన్నారు. కరీంనగర్ నగరంలో అనేక భూ పోరాటాలు చేసి వేలాది మందికి ఇండ్లు ఇప్పిచ్చిన చరిత్ర సిపిఐదని చింతకుంట, రేకుర్తి, బద్దిపల్లి గ్రామాల్లో ఎంతోమంది నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడంలో సిపిఐ క్రియాశీలకపాత్ర వహించిందని నాటి పోరాట పటిమను పునికి పుచ్చుకొని రానున్న కాలంలో పేదలకు ఇండ్లు దక్కేంతవరకు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ నగరంలో ప్రభుత్వ భూములన్నీ కొందరు రాజకీయ నేతలు, కార్పొరేటర్ల కను సన్నుల్లో ఉన్నాయని వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బయటికి తీసి పేదలకు పంచేందుకు సిపిఐ కార్యకర్తలు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. కరీంనగర్ నగరంలో జరిగిన స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి రాజ్యమేలిందని అవినీతిపై పాలక ప్రభుత్వాలు నోరు మెదకపోవడం సిగ్గుచేటు అన్నారు. తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్ లలో కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని పాలకవర్గం పూర్తిగా దోపిడీ చేసిందని దీనిపై కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. అన్ని డివిజన్లలో పార్టీ ప్రజాసంఘాల విస్తరణకై ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలన్నారు. కూడు, గూడు, నిడ, వైద్యం, విద్య అందరికీ అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదాయం అంబానీ లాంటి కార్పోరేట్ సంస్థలకు లక్షల కోట్లు దోచిపెడుతుందని ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ మోడీ ప్రభుత్వం అరాచక వ్యవస్థ నడిపిస్తుందని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026లో నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పడం చూస్తుంటే ప్రజాస్వామ్యంపై వారికి ఏవిధమైన నమ్మకాలు ఉన్నాయో అర్థం అవుతుందని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు సమర శంఖం పూరించాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ సిపిఐ పార్టీ దేశంలో పుట్టి వంద సంవత్సరాలు అడిగి పెట్టిందని వంద సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఈదేశంలో ఒక సిపిఐ మాత్రమేనని ఆయన తెలిపారు. దేశంలో పదకోండు సంవత్సరాలుగా మోడీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కుల, మత వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని దేశంలో అనేక మంది నాయకుల రక్త తర్పణంతో చట్టాలు తీసుకువస్తే వాటిని మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని ఆయన ఆరోపించారు. రాబోయే కాలంలో పేద ప్రజలకు అండగా సిపిఐ కార్యకర్తలు నిలవాలని రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసిందని అన్ని వ్యవస్థలు అవినీతి దోపిడీ పెరిగి పోయిందని అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ ను ప్రజలు ఎన్నుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చిందని వెంటనే వాటిని అమలు పరిచేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు పరచకుంటే రానున్న కాలంలో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. నగరంలో అసైన్డ్, పరంపోగు, శిఖం భూములు కొంతమంది రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నాయని వీటిని ప్రభుత్వం వెంటనే స్వాధీన పరుచుకోవాలని ఆయన కోరారు. ఈసమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లమ్మ, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, పంజాల శ్రీనివాస్, నలువాల సదానందం, సాయవేణి రాయమల్లు, శారద, బోనగిరి మహేందర్ నగర కార్యవర్గ సభ్యులు గామినేని సత్యం, కొట్టే అంజలి, ఎలిశెట్టి భారతి, కళ్యాణపు రేఖ, సత్యనారాయణ చారి, సాంబరాజు, తంగేళ సంపత్, నగునూరి రమేష్, ఓరుసు కొమురయ్య, భూక్య లక్ష్మి, సాధవేని బాలయ్య, కాళిదాస్, ఎర్రం యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ రాజశేఖర్ కు డాక్టరేట్.!

కానిస్టేబుల్ రాజశేఖర్ కు డాక్టరేట్

యువ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలకు దక్కిన అరుదైన గౌరవం

ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ-న్యూ ఢిల్లీ, ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్ అమెరికా వారి ద్వారా డాక్టరేట్ ప్రదానం

వేములవాడ నేటిధాత్రి

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కి చెందిన కానిస్టేబుల్ రాజశేఖర్ యువతకి స్ఫూర్తి గా నిలుస్తూ యువతను పోలీస్, దేశ భద్రత దళాలోకి వెళ్లే విధంగా ఉచిత శిక్షణ ఇస్తూ యువత ను సమాజ సేవలో భాగస్వామ్యం చేస్తున్నందుకు ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ-న్యూ ఢిల్లీ, ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్ అమెరికా వారు గౌరవ డాక్టరేట్ ని అందించి అభినందించారు.పోలీస్ ఉద్యోగ బాధ్యత లు నిర్వహిస్తూ దొరికిన కొద్ది సమయాన్ని యువత కోసం వినియోగిస్తూ వేములవాడ పట్టణ కేంద్రం గా గత 8 సంవత్సరాలనుండి యువతీ, యువకుల కు పోలీస్, ఆర్మీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబందించిన ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ ని ఇస్తూ యువత ని వివిధ సేవా కార్యక్రమాలలో వాలంటీర్లు గా సేవలు అందించే విధంగా వారిని ప్రోత్సహిస్తూ, రక్త దానం వైపు యువత కి అవగాహన కల్పిస్తూ, రక్త దాన శిబిరాలు నిర్వహిస్తూ రక్త కొరత లేని సమాజం కోసం కృషి చేస్తూ, ఇప్పటి వరకు 35 సార్లు రక్త దానం చేసి యువత కు మార్గదర్శి గా నిలుస్తూ మరియు ఇప్పటి వరకు 50 మంది యువతని ప్రభుత్వ ఉద్యోగాలు పొందే విధంగా శిక్షణ ఇవ్వటం, కరోనా సమయం లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందులో యువత ని భాగస్వామ్యం చేస్తూ యువత కి ఆదర్శం గా నిలిచిన కానిస్టేబుల్ రాజశేఖర్ కు హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ లో ప్రతిష్టాత్మక డాక్టరేట్ ని అందించారు.

ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ తాను చేస్తున్న సేవ ని గుర్తించి డాక్టరేట్ ని అందించిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారికి చైర్మన్ డా.ఆకుల రమేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు, యువత కి తన వంతుగా సేవ చేస్తూ వారిని సమాజ సేవ లో భాగస్వామ్యం చేస్తూ భవిష్యత్తు లో యువత కూడా సమాజ సేవ చేసే విధంగా వారిని తీర్చి దిద్దుతూ, చెడు వ్యాసనాలకు గురి కాకుండా మంచి మార్గం లో నడిపిస్తూ వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తూ సమాజం లో తన వంతు బాధ్యత ని నిర్వహించడం తనకి తృప్తి ని ఇస్తుంది అని తెలిపారు.తనకి సహకారం అందిస్తున్న పోలీస్ ఉన్నత అధికారులకు, యువ ఫౌండేషన్ అభ్యర్థులకు మరియు శ్రేయోభిలాషులకు ఈ డాక్టరేట్ ని అంకితం ఇవ్వటం జరుగుతుంది అని తెలిపారు.

భక్తులకు ఇబ్బందులు కల్గకుండా .!

భక్తులకు ఇబ్బందులు కల్గకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు

దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్

శృంగేరి పీఠం అనుమతులు తీసుకుని జూన్ నుంచి ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభిస్తాం

వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని పత్రిక సమావేశం నిర్వహించిన దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ

వేములవాడ నేటిధాత్రి

 

భక్తులకు ఇబ్బందులు కల్గకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు.గురువారం వేములవాడ లో పర్యటించిన దేవాదయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా, ఈఓ వినోద్ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం పాత్రికేయులతో దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ దేవాలయ ఆలయ అభివృద్ధి కోసం 38 కోట్ల ప్రకటించారని అన్నారు. ఆగమ శాస్త్రం, వాస్తు అంశాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆలయం పునః నిర్మాణం చేపట్టాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తిర్ణం అభివృద్ధి కోసం ప్రభుత్వం 76 కోట్ల , అన్నదాన సూత్రానికి 35 కోట్ల మంజూరు చేసిందని అన్నారు. వేములవాడ దేవాలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరగాలని లక్ష్యంతో రోడ్డు వెడల్పు పనులకు 47 కోట్ల నిధులు మంజూరు చేసిందని అన్నారు.

అన్నదానం సత్రం నిర్మాణ పనులకు టెండర్ పూర్తి చేసామని అన్నారు. శృంగేరి పీఠాధిపతుల అనుమతి, ఆశీర్వాదం తీసుకొని ఆలయ అభివృద్ధి పనులు చేపడ్తున్నామని అన్నారు. రాబోయే నెలలో రొడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా స్వామివారికి జరిగే పూజలు ఎక్కడ ఆటంకం కలగదని, ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు, భక్తులకు స్వామి దర్శనం వేగంగా కల్పించేందుకు మెరుగైన వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

శృంగేరి పీఠం అనుమతులు తీసుకున్న తర్వాత ఆలయ అభివృద్ధి పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలలో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

రాజన్న భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు…

ఈ సందర్భంగా భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనం కల్పించే స్థలాలను పరిశీలించారు. ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం, అభిషేకం మండపం, కోడె కట్టుట, క్యూ లైన్ తదితరు ఆర్జిత సేవల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ సత్యనారాయణ, ఈఓ వినోద్, ఈఈ రాజేశ్, డీఈ రఘు నందన్, ఆర్అండ్ బీ సీఈ బిల్డింగ్స్ రాజేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బీ సీఈ ఎలక్ట్రికల్ లింగారెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ బీ లక్ష్మణ్, జిల్లా ఈఈ వెంకట రమణయ్య, ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ, శరత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

మదీనా మస్జిద్ అధ్యక్షునిగా ముజాహిద్ ఖాన్.

మదీనా మస్జిద్ అధ్యక్షునిగా ముజాహిద్ ఖాన్.

మహదేవపూర్-నేటిధాత్రి:

 

 

మండల కేంద్రంలోని మదీనా మస్జిద్ కార్య నిర్వహణ కమిటీ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రోజు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా ఎండి ముజాహిద్ ఖాన్, తోపాటు ఉపాధ్యక్షులు, ఎండి షఫీ ఖాన్, షంషీర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ, సంయుక్త కార్యదర్శి, మొహమ్మద్ అహ్మద్ బీసీ ఎలక్ట్రిషన్, కోశ అధికారిగా అస్రార్ ఖురేషి, కార్యవర్గ సభ్యులుగా, షేక్ నసీం, మొహమ్మద్ అలిమ్, మహమ్మద్ అల్తాఫ్, మొహమ్మద్ యాకూబ్, మహమ్మద్ అలీమ్ లను సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ కమిటీ మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ముఖ్య సలహాదారులుగా, అన్సార్ ఖురైషి, మొహమ్మద్ కరీం ఖాన్, ఎండి మసూద్ అలీ. లను ఎన్నుకోవడం. ఈ సందర్భంగా అధ్యక్షులు ముజాహిద్ ఖాన్ మాట్లాడుతూ మస్జిద్ సేవకు ఎన్నుకోవడం అల్లాహ్ ఇచ్చిన వరమని, కార్యవర్గం అంతా మస్జిద్ తో పాటు ముస్లింల ఉన్నతి సమస్యల పరిష్కారం కొరకు తమ వంతు సహాయ శక్తుల ప్రయత్నిస్తామని, ముస్లిం సోదరులందరికీ కమిటీ తరపున అధ్యక్షులు ముజాహిద్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version