మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన సీపీఐ

మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

 

ఇటీవల జరిగిన సిపిఐ కరీంనగర్ జిల్లా మహాసభలో నూతనంగా సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్ ను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పరిచయం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను పంజాల శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. పంజాల శ్రీనివాస్ విద్యార్థి దశ నుండే చురుకైన వాడని, విద్యార్థి, యువజన రంగాలలో పనిచేసి, పార్టీలో జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగాడని ప్రజా సమస్యల పై అధికారులు కలిసినప్పుడు స్పందించాలని కలెక్టర్ ను వెంకటరెడ్డి కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఒక ప్రకటనలో శ్రీనివాస్ తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చుడాలి

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి : ఏఐఎస్ఎఫ్

ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్

కరీంనగర్, నేటిధాత్రి:

 

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈవో) మొండయ్యకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరించిందని రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు కొమ్ము కాస్తుందని తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువు అందని ద్రాక్షలా మారుతుందని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు వూర్తిస్థాయిలో అందివ్వాలని పాఠశాలలో సబ్జెక్టు వైస్ గా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు మరియు స్కావెంజర్ పోస్టులు, ప్రతి పాఠశాలకు గ్రంథాలయం, డిజిటల్ క్లాసులకు అవసరమయ్యే ఎక్విప్మెంట్స్ మరియు ఎన్విరాల్న్మెంట్, ఎక్విప్మెంట్స్ పెంచుకునేందుకు ప్రతి పాఠశాలకు జిల్లా వ్యాప్తంగా సరిపడ గ్రాండ్స్ విడుదల చేయాలని అన్నారు.
జిల్లావ్యాప్తంగా కొన్ని పాఠశాలలో కనీసం టాయిలెట్స్, పాఠశాల
కాంపౌండ్ వాల్, కరెంటు, వాటర్ సదుపాయం కల్పించాలని అదేవిధంగా కాలిగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని, ఈఅంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకాన్ని కల్పించేలా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని రమేష్ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర్ నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, మచ్చ పవణ్, సాయి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

యువజన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లిసత్యం జన్మదిన వేడుకలు

యువజన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం జన్మదిన సందర్భంగా రామడుగు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనుపురం పరుశురాం గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలోని ప్రశాంతి భవన్ లో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవాజి హరీష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాపురాజు, నేరేళ్ల మల్లేశం, చొప్పదండి అనిల్, మధు, సంతోష్ , అజయ్, మహేష్, సాయి, సాగర్, ఎండి. ముషూ, తదితరులు పాల్గొన్నారు.

శ్రీవాసవి వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారికి అలంకరణ

వనపర్తి లో శ్రీవాసవి వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారికి మామిడి పండ్లతో అలంకరణ

వనపర్తి నేటిధాత్రి :

 

వాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారికిమామిడి పండ్లతో నేడు అలంకరణ ఉంటుందని పట్టణ ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు బచ్చురాం యూవజన సంగం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ ప్రచారకార్యదర్శి కల్వ భూపేష్ కుమార్ శెట్టి ఒక ప్రకటన లో తెలిపారు భక్తులు అమ్మవారికి తే చ్చే మామిడి పండ్లు మధ్యాహ్నం 12 గంటల లోపు అమ్మవారి గుడి లో ఇవ్వాలని వారు కోరారు.
శుక్రవారం సాయంత్రం మామిడిపళ్ళతో అలంకరణ అంతతరం అర్చన
7 గంటలకు కుంకుమార్చన
మంగళహారతి తీర్థ ప్రసాదలు అల్పాహారం ఉంటుందని వారు తెలిపారు
ఈ పూజలకు భక్తలు అధిక సంఖ్యలో పాల్గొని వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు

విధి కుక్కలకు వింత రోగాలు…

విధి కుక్కలకు వింత రోగాలు…

వ్యాధుల బారిన పడుతున్న విధి కుక్కలు…

వింత వ్యాధులతో గ్రామాల్లో సంచరిస్తున్న వైనం…

చర్మ వ్యాధుల బారిన పడుతున్న విధి కుక్కలు, ప్రజలకు సోకుతుందేమోననే ఆందోళలో ప్రజలు…

నేటిధాత్రి – గార్ల :

 

మహబూబాబాద్ జిల్లా, గార్ల, బయ్యారం మండలాల్లోని చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నకిష్టపురం, దేశ్య తండ, మంగలి తండ, ఎస్టి కాలనీ, సర్వన్ తండ గ్రామాలతో పాటు, బయ్యారం మండలం కొత్తపేట గ్రామాల్లో విధి కుక్కలకు ఫంగస్ వచ్చి,వింత రోగాలు,చర్మ వ్యాధులతో యదేచ్చగా తిరుగుతున్నాయి. వింత రోగాలతో కుక్కల ఒంటి పై బొచ్చు ఊడిపోయి చర్మ వ్యాధులతో, నోట్లో నుండి నురగలు తీస్తూ సంచరిస్తుంటే, ఇది గమనించిన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.చర్మం తోలు ఊడిపోయి బక్క చిక్కి, నిరసించి, గ్రామాల్లో దర్శనమివ్వడంతో విధి కుక్కలకు ఏదో వైరస్ సోకిందని, ఇది ఏ మహమ్మారో నని,ఇది ప్రజలకు సోకుతుందేమోనని, భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలావుంటే త్వరలోనే పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలకు వెళ్లే పిల్లలపై రెచ్చిపోతు, వెంబడించి గాయపరిచే ప్రమాదం పొంచి ఉంది.ఇంత జరుగుతున్న ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం.తక్షణమే ఉన్నత అధికారులు చొరవ తీసుకోని వింత వ్యాధులతో బాధపడుతున్న వీధి కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని,విధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ప్రజలు,ప్రజా సంఘాలు కోరుతున్నారు.

ఆకలి బాధను నిర్మూలించడం మా లక్ష్యం

ఆకలి బాధను నిర్మూలించడం మా లక్ష్యం.

మందమర్రి నేటి ధాత్రి :

 

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ
గొల్లెం మల్లేష్ నూతన గృహప్రవేశం ఫంక్షన్లో లో మిగిలిన
ఆహారాన్ని పడేయద్దని ముఖ్య ఉద్దేశంతో.
ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ కి సమాచారం ఇవ్వడం జరిగింది….

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ స్పందించి ఆ మిగిలిన ఆహారాన్ని మందమర్రి బస్టాండ్ దగ్గర నివసిస్తున్న పేదవారికి మరియు మందమర్రి రైల్వే స్టేషన్ ఏరియా లో ఆ ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం అధ్యక్షుడు నది పాట రాజ్ కుమార్ మాట్లాడుతూ.
అలాగే ఏక్కడ ఏ ఆహార పదార్థాలు మిగిలిన మాకు సమాచారం ఇస్తే మేమే వచ్చి తీసుకుపోయి పేదలకు పంచుతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చరణ్, జవీద్ ,దిలీప్ తదితరులు పాల్గొన్నారు..

మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా

మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన తల్లి లక్ష్మమ్మ తండ్రి నరసింహ పెద్ద కుమారుడు చరణ్ (23) గత నెల కింద తల్లి మృతి చెందగా.. తండి కూడా చనిపోవడం జరిగినది. కల్వకుర్తికి మోటార్ సైకిల్ ప్రయాణిస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ బైకు పైకి దూసుకెళ్లడం జరిగినది. బుధవారం సుమారుగా 12 గంటల ప్రాంతంలో కొండారెడ్డిపల్లి గేటు సమీపంలో ఢీకొట్టడం ద్వారా అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టి 24 గంటలు గడిచిన మృతుడి కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదని గ్రామస్తులు మహబూబ్ నగర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మృతుడికి ఒక తమ్ముడు ఉన్నాడు.

పుణ్యక్షేత్రాలు విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు

పుణ్యక్షేత్రాలు విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు

ఇందు డిపో మేనేజర్ భూపాలపల్లి

భూపాలపల్లి నేటిధాత్రి

 

పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఆర్‌టిసి టూర్ ప్యాకేజీలను ప్రజలు వినియోగించుకోవాలని భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు ఒక ప్రకటనలో తెలిపారు భూపాలపల్లి ఆర్టీసి డిపో మేనేజర్ ఇందు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఒక్క రోజులో భూపాలపల్లి నుండి కొమురవెల్లి, కొండ పోచమ్మ వేములవాడ, కొండా గట్టు, ధర్మపురి సందర్మించి రాత్రి భూపాలపల్లికి బస్సు చేరుకుంటుందని. ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు :-680/-
ఒక్క రోజులో భూపాలపల్లి నుండి భద్రచలం, పర్ణశాల , మల్లూరు దేవాలయాలను సందర్మించి రాత్రి భూపాలపల్లికి ఎక్స్ప్రెస్ బస్సు చేరుకుంటుందని. ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు:- 700
ఒక్క రోజులో భూపాలపల్లి నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సందర్మించి రాత్రి భూపాలపల్లికి ఎక్స్ప్రెస్ బస్సు చేరుకుంటుదని . ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు:-770/-
రెండు రోజులలో భూపాలపల్లి నుండి బీజపల్లి ఆంజనేయ స్వామి ఆలయం ఆలంపూర్ జోగులాలు దేవాలయాలను సందర్శించి మరుసటి రోజు రాత్రి భూపాలపల్లికి సూపర్ లగ్జరీ చేరుకుంటుదని ఒక్కొక్కరికి రానూ -పోనూ చార్జీలు:- 1700/-
రెండు రోజులలో భూపాలపల్లి నుండి విజయవాడ కనక -దుర్గా అమ్మవారి దేవాలయం, అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి సందర్శించుకొని మరుసటి రోజ రాత్రి భూపాలపల్లి కి సూపర్ లగ్జరీ చేరుకుంటుదని ఒక్కొక్కరికి రానూ…పోనూ చార్జీలు :-2150/-
ఇలా ఐదు రూట్లలో పుణ్యక్షేత్రాలు బస్సులు నడపాలని నిర్ణయించాముని, ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు.
పూర్తి సమాచారం కోసం :- 9959226707, 9701967519, 9849425319, 9908336391

జోరుగా సాగుతున్న ఫైనాన్స్ అక్రమ దందా…

జోరుగా సాగుతున్న ఫైనాన్స్ అక్రమ దందా…

నేటి ధాత్రి -మహబూబాబాద్, గార్ల:-

 

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పేదప్రజల
అవసరాలను ఆసరాగా చేసుకొని డైలీ ఫైనాన్స్, చిట్టీలు అంటూ జోరుగా దందా కొనసాగిస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఇదంతా బహిరంగగానే జరుపుతూ అధికవడ్డీ వసూలు చేస్తూ అమాయకులను రోడ్డున పడేస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం మండలాలతో పాటు పలు గిరిజన గ్రామాల్లో సైతం అక్రమ దందాలు కొనసాగిస్తున్నారు. ఈ దందాలో కూరుకుపోయేది మధ్యతరగతి, చిరు వ్యాపారులు, గిరిజనులనే టార్గెట్ చేస్తూ డైలీ, వారం అంటూ అధిక వడ్డీకి డబ్బులు ఇస్తూ వసూలు చేయడమే కాకుండా అధిక వడ్డీని వసూలు చేస్తున్నారు కొందరు. అమాయకపు ప్రజలు తమ వ్యాపారాల కోసం ఫైనాన్స్ లో నుండి అప్పులు తీసుకొని చిక్కుల్లో పడుతూ సతమతమవుతున్నారు.

finance

డైలీ, వారం ఫైనాన్స్ ల పేరిట ఐదు నుంచి పదిశాతం వడ్డీని వసూలు చేస్తూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ వ్యాపారాలు కొనసాగుతున్నప్పటికీ అక్రమ డైలీ ఫైనాన్స్, చిట్టీ వ్యాపారుల పై అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరువ్యాపారంలో అమాయకులను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ లు నడిపేవారి ఆగడాలను తట్టుకోలేక చిరువ్యాపారులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు కూడా నెలకొంది. లోకల్ ఫైనాన్సులే కాకుండా గుంటూరు, విజయవాడ నుండి వచ్చి గార్ల, బయ్యారం మండలాల్లోనీ గిరిజన ప్రాంతాల్లో కొందరు అక్రమ వ్యాపారులు వడ్డీ దుకాణాలు తెరిచి బహిరంగంగానే వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న ఘటనలు కోకోల్లలుగా ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత బహిరంగంగా అధిక వడ్డీతో డైలీ ఫైనాన్స్,చిట్టివ్యాపారాలు నడుపుతూ అమాయకులను దోచుకుంటున్న వారిపై సంబంధించిన అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ప్లాస్టిక్ వాడకం తగ్గించుకొని పర్యావరణాన్ని కాపాడుకుందాం

ప్లాస్టిక్ వాడకం తగ్గించుకొని పర్యావరణాన్ని కాపాడుకుందాం

వరంగల్ డిఆర్ డిఓ కౌసల్యాదేవి

#నెక్కొండ, నేటి దాత్రి:

 

జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ డిఆర్డిఓ కౌసల్య దేవి దీక్షకుంట గ్రామంలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా డిఆర్డిఓ కౌసల్య దేవి మాట్లాడుతూ ప్రజలందరూ సింగిల్ యూజ్ గా ప్లాస్టిక్ను వాడం ద్వారా పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని ప్లాస్టిక్ వలన కాలుష్యం పేరుకుపోయి పర్యావరణాన్ని తీవ్రంగా నష్టం చేస్తుందని ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని పర్యావరణాన్ని కాపాడుకోవాలని దిక్షకుంట్ల గ్రామంలోని మహిళా సంఘాల సభ్యుల ద్వారా ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి రెండు చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఏపీ ఎం శ్రీనివాస్, ఏపీఓ జాకబ్, దీక్షకుంట గ్రామపంచాయతీ సెక్రటరీ భాను ప్రసాద్, మహిళా సంఘాల వివో అధ్యక్షులు లత, మధులత, చంద్రకళ, వివో ఏ ఏకాంబరం, మహిళా సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

బ్లాక్ మార్కెట్ లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలి…

బ్లాక్ మార్కెట్ లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలి…

కల్తీ విత్తనాలను అరికట్టాలి…

నాణ్యమైన విత్తనాలు పురుగు మందులను సరఫరా చేయాలి…

అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలి…

కల్తీ విత్తనాల బెడద రైతుల జీవనోపాధి పై తీవ్ర ప్రభావం చూపుతుంది…

రైతుల వ్యవసాయ సాగుకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి…

నేటి ధాత్రి -మహబూబాబాద్ 

 

కల్తీ విత్తనాలను అరికట్టాలని, బ్లాక్ మార్కెట్లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ, గుగులోత్ సక్రు, నందగిరి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు,ఎరువులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో గురువారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్లాక్ మార్కెట్ లో విత్తనాలను కొనుగోలు చేసిన రైతన్న ఆరుగాలం కష్టించి పంట సాగు చేస్తున్నప్పటికీ సరైన దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాల బెడద వ్యవసాయ ఉత్పత్తిని దెబ్బతీయటమే కాకుండా,అంతకుమించి రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. పంటల సాగులో మేలైన విత్తనాల ఎంపిక ఎంతో కీలకమని సరైన అవగాహన లేకపోవడంతో రైతన్నలు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి సరైన దిగుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Seeds

నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం రైతు సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాబన్న, గౌని భద్రయ్య,వీరభద్రం, మాన్య తదితరులు పాల్గొన్నారు.

సివికే రావు 97వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న పిసిసి మేంబర్

సివికే రావు 97వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న పిసిసి మేంబర్ నల్లపు దుర్గాప్రసాద్

నేటిధాత్రి చర్ల :

 

ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కళాతపస్వి సంఘసంస్కర్త సివికే రావు 97వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ప్రముఖులు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చర్ల మండలం నాయకులు ఆవుల విజయ భాస్కర్ రెడ్డి సీనియర్ నాయకులు చిమల్లమరి మురళి కడియం సర్వేశ్వరరావు దొంతుకుర్తి రామారావు ఆవుల శివ విజయ నాయుడు గూడపాటి రంజిత్ తదితరులు పాల్గొని సివికేరావు కు శ్రద్ధాంజలి ఘటించారు

సీఎం సహాయ నిది పేదలకు వరం

సీఎం సహాయ నిది పేదలకు వరం

కొత్తగూడ,నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దొరవారి వేంపల్లి గ్రామానికి చెందిన ఈక సారక్క గారు మరియు ఎర్రవరం గ్రామనికి చెందిన ధనసరి యకబాబు ఇరువురు ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రి లో చేరి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణభీవృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు
డా”ధనసరి అనసూయ సీతక్క
గారి కి విన్నవించగా.. తక్షణమే సీఎం సహాయ నీది నుంచి చెక్కులను ఇప్పించటం జరిగిందని అట్టి యొక్క చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో గురువారం రోజు కొత్తగూడ మండల కేంద్రం లో బాధితులకు అందించటం జరిగింది..ఈ కార్యక్రమం లో వజ్జ సురేందర్,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బిట్ల శ్రీను, సోలం వెంకన్న, సిరిగిరి సురేష్, యాదగిరి కిరణ్, సునీల్, శ్రవణ్ ధనసరి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు,,,

ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నింటిని నేరవేరుస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకెళ్తుందని మొగుడంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మక్సుధ్ హైమద్ అన్నారు.గురువారం మండలంలోని పలు వార్డులో స్థానిక నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇంటికి ముగ్గుపోసి,ప్రొసిడింగ్‌లు అందజేశారు.ప్రతి ఒక్కరికి ఇంటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ పథకం లక్ష్యం.అందుకోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి మారుతి, హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ నిహారిక రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొంగల్ కిష్టన్న,ఆలూరు కిష్టన్న,విష్ణు,రాజు, ఖాన్ సాబ్, లాలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా కోర్ట్ ఆవరణలో పర్యావరణ దినోత్సవం

ఉమ్మడి జిల్లా కోర్ట్ ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం:-

హాజరైన ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

గురువారం రోజున “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సైకిల్ ర్యాలీ ని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు మరియు న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్స్ బి.వి.నిర్మలా గీతాంబ, ఎ.పట్టాభి రామారావు జెండా ఊపి ప్రారంబించారు.

అనంతరం ప్రధాన న్యాయమూర్తులు, అదనపు జిల్లా న్యాయమూర్తులు నారాయణ బాబు, బి.అపర్ణాదేవి, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు యం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే మరియు ఇతర న్యాయమూర్తులు, వరంగల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీప్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు సైక్లిస్ట్ తేజా రెడ్డి, కె.యం.సి.ఏ.జె.టీం (వావ్ వరంగల్) జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు.

 

Environment

ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “పర్యావరణమును పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఆరోగ్యకరమైన మరియు పచ్చని వాతావరణం మన భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. మొక్కలను కాపాడుకోవడంతో పాటు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకున్నప్పుడు పర్యావరణ కాలుష్యాన్ని కొంతైనా నిర్మూలించుకోగలము. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు అందరం కలిసి నడువాలని కోరారు. అలాగే, పర్యావరణ ప్రాముఖ్యత గురించి, ప్రజలకు అవగాహన పెంచాలని ప్రధాన న్యాయమూర్తులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా పాల్గొన్న, సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

మొదటి వార్షికోత్సవ సభ

మొదటి వార్షికోత్సవ సభ

మందమర్రి నేటి ధాత్రి :

 

మందమర్రి మార్కెట్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి మొదటి వార్షికోత్సవ పాలన విజయోత్సవాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం బి1 లో కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్,సేవాదళ్ నాయకుల ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి విజయోత్సవాలు చేసుకోవడం జరిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి మందమర్రి పట్టణ కాంగ్రెస్ నాయకులు మంద తిరుమల్ రెడ్డి పైడిమల్ల నర్సింగ్ మాట్లాడుతూ కాకా మనవడు,వివేక్ వెంకట్ స్వామి గారి తనయుడు అయినటువంటి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు పాలన సంవత్సరం గడిచిన సందర్భంగా మందమర్రిలో కేకులు కట్ చేయడం జరిగింది. గెలిచాక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పెద్ద కొడుకు లాగా ఉంటానని మాట ఇచ్చి నిలుపుకున్నాడు.లక్ష 35 వేల మెజార్టీతో అతి చిన్న వయసులో విజయం దక్కించుకున్న నాయకుడు గడ్డం వంశి గారు అని సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పదివేల పెన్షన్ ఇవ్వాలని పోరాడి 144 కోట్ల పెన్షన్ ఫండ్ మంజూరు అయ్యేలా చేసిన ఘనత మరియు సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని,ఎల్లంపల్లి ముప్పు గ్రామం బాధితులకు పరిహారం ముఖ్యంగా కోల్ బెల్ట్ ఏరియాలో కరోనా కాలంలో నిలిపివేసిన అజిని ఎక్స్ప్రెస్ పున ప్రారంభం,పెద్దపల్లిలో తిరుపతి ఎక్స్ప్రెస్ ను హాల్టింగు రామగుండంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కృషి పెద్దపల్లి నియోజకవర్గం లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు మరియు ఎన్టిపిసి పవర్ ప్లాంట్ విస్తరణకు కృషి,అలాగే బడుగు బలహీన వర్గాలకు త్రాగునీరు అందించేలా బోర్వెల్ లాంటి వివిధ అభివృద్ధి పనులు విజయవంతంగా చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నామని ముత్తయ్య, వనం నర్సన్న,ఎర్ర రాజు,ఇషాక్, బండి శంకర్,లక్ష్మణ్,వెంకన్న, రాచర్ల గణేష్,సట్ల సంతోష్,విజయ్,సతీష్,వేణు,శ్రీనివాస్,అంజయ్య,రామకృష్ణ,
యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్,జావిద్ ఖాన్,మూడారపు శేఖర్, సురేందర్(సేవాదళ్), చోటు,మహేష్,సూరజ్,రాజు అజయ్,బాచి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

పర్యావరణ పరిరక్షణతోనే మానవమనుగడ సాధ్యం

పర్యావరణ పరిరక్షణతోనే మానవమనుగడ సాధ్యం –

ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు..

*ప్లాస్టిక్ భూతం నుండి పంచ భూతాలను కాపాడుకుందాం..

*చైర్మన్ సుగుణమ్మ..

*మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం –

కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) జూన్ 05: 

 

పర్యావరణ పరిరక్షణ తోనే భవిష్యత్తులో మానవ మనుగడ సాధ్యమవుతుందని, ఇందుకోసం మొక్కలు పెంచాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సీతమ్మ రోడ్డు నందు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, కమిషనర్ ఎన్.మౌర్య, అర్బన్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ విజయకుమార్, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సదా శివం, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ, కార్పొరేటర్ దూదికుమారిలు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన తిరుపతిలో పర్యావరణ పరిరక్షణ కొరకు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. 5090 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. నాటిన మొక్కలను యువకులు, మహిళలు దగ్గరుండి కాపాడుకోవాలనీ అన్నారు. బీట్ ప్లాస్టిక్ పొల్యూష‌న్ థీమ్ తో ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవాణ్ని నిర్వ‌హించుకుంటున్నామ‌ని, ఒక‌సారి వాడి ప‌డేసే ఫ్లాస్టిక్ కు ప్ర‌జ‌లు దూరంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. ప్లాస్టిక్ పొల్యూష‌న్ త‌గ్గింపులో భాగంగా ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ఒక‌సారి వాడి ప‌డేసే ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించార‌ని ఆయ‌న తెలిపారు. ప్లాస్టిక్ విన‌యోగంతో ప్ర‌జ‌ల ఆరోగ్యంతో పాటు జంతువుల ఆరోగ్యం దెబ్బ‌తింటోంద‌ని ఆయ‌న చెప్పారు. కాబ‌ట్టి ప్ర‌జ‌లు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు హరితాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నారని మనందరం వారికి సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్లాస్టిక్ రహిత నగరాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.ఈ సంవత్సరం థీమ్ ను అందరూ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని అన్నారు. పంచ భూతాలను కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ నివారణకు అందరూ కంకనబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.
నగరపాలక సంస్థ కమిషనర్, తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకై నగరపాలక సంస్థ పరిధిలో 5090 మొక్కలు, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో 15 వేలు మొక్కలు నాటుతున్నామని అన్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని ప్లాస్టిక్ ఫ్రీ సిటీ గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మొక్కలు నాటిన తరువాత వాటిని సంరక్షించాలని అన్నారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా వినియోగించే వాటి పట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అందరి సహకారంతో ప్లాస్టిక్ ను పూర్తి స్థాయిలో నిషేదించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు, ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి,డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఏసిపి బాలాజి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

పేదోడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం

పేదోడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం

తోపనపల్లిలో ఇంటి నిర్మాణ భూమి పూజ చేసిన రంజిత్ రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులలో భాగంగా తోపనపల్లి గ్రామంలో ఇంటి నిర్మాణపు భూమి పూజ కార్యక్రమంలో నర్సంపేట టి పి సి సి సభ్యుడు సొంటి రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి సంత ఇంటి నెరవేరుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేదవాడి కళ్ళల్లో ఆనందం చూస్తే ఎంతో ఆనందంగా ఉందని తోపన పల్లి గ్రామంలో లబ్ధిదారులు సంతోషంతో ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారని నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్,నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కుసుమ చెన్నకేశవులు, సాయి కృష్ణ, మహిపాల్ రెడ్డి, కొత్తపల్లి రత్నం, బర్రె సూరయ్య, చంద్రహాసన్, రమేష్, చాగంటి నారాయణ, కక్కర్ల రాజు, ఇంద్రసేనారెడ్డి, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత .

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత గ్రామ కార్యదర్శి కృష్ణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కార్యదర్శి కృష్ణ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోహిర్ మండల బేడంపేట గ్రామ యుపిఎస్ పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం గురువారము నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శి పర్యావరణం కలుషితం కాకుండా ప్రకృతిని పెంచాలని మరియు గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలని వివరించడం జరిగింది ప్రకృతి బాగుంటేనే ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని వారు ప్లాస్టిక్ వ్యర్థాలను నదుల్లో పడేయొద్దని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

గీత కార్మికుడు మృతి.

గీత కార్మికుడు మృతి.

నాగర్ కర్నూల్/ నేటిదాత్రి :

 

నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండలంలో సిర్సవాడ గ్రామంలో తాడిచెట్టు పైనుండి కిందపడి గీత కార్మికుడు మల్లేష్ (40) మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం తాటి కల్లు దింపడానికి పైకి వెళ్లి కళ్ళు దింపే ప్రయత్నంలో.. మొకు తాడు తెగి.. భూమిపైకి జారిపడి అక్కడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతిడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version