యాసంగి పంటలకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి రూరల్ మండలం పంబాపూర్ గ్రామంలోని భీమ్ ఘనపూర్ చెరువు నీటిని యాసంగి పంటల సాగు కొరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చెరువులో పూలు చల్లి, గేట్ వాల్వ్ తిప్పి నీటిని దిగువ గ్రామాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులకు సాగునీరు అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. చిట్టచివరి ఎకరా వరకు సాగు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సాగునీటి విడుదలతో దిగువ గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
