పేట టీయస్ అధ్యక్షుడిగా గుర్రం సత్తిరెడ్డి
ప్రతినిధి, నేటిధాత్రి :
అధ్యక్షుడిగా గుర్రం సత్తిరెడ్డి
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా తుంకుంట జడ్పిహెచ్ఎస్ ఫిజికల్ డైరెక్టర్ గుర్రం సత్తిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పిహెచ్ఎస్ మల్కాజ్ గిరి (బాలుర) పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాఘవరెడ్డి, ఎన్నికల పరిశీలకులుగా నల్లగొండ జిల్లా అధ్యక్షులు చంద్రయ్య, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రవి వ్యవహారిచారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా గుర్రం సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జడ్పీహెచ్ఎస్ ఆర్ పి కాలనీ ఫిజికల్ డైరెక్టర్ యాదయ్య, కోశాధికారిగా జడ్పిహెచ్ఎస్ కౌకూర్ ఫిజికల్ డైరెక్టర్ పారిజాత ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గుర్రం సత్తిరెడ్డి మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై నిరంతరం కృషి చేస్తానని, సంఘం అభివృద్ధికై పాటుపడుతూ ఎల్లవేళలా సభ్యులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షుడు వినోద్ కుమార్, గెజిటెడ్ హెడ్మాస్టర్ ప్రభాకర్, జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
