సమాజ అభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్ర.!

సమాజ అభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్ర -మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల

రామడుగు నేటిధాత్రి:

సమాజాభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్రాని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్ అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల చేత జెండా ఎగర వేయించారు. అనంతరం కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా చెర్మెన్ మాట్లాడుతూ కార్మికుల శ్రమకు గౌరవం కల్పించడమే మే డే ఉద్దేశమని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం మార్కెట్ కమిటీ ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ పిండి సత్యం రెడ్డి, డైరెక్టర్లు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మే డే సంబరాల్లో కార్మికులు.

మే డే సంబరాల్లో కార్మికులు

ఘనంగా పలు సంఘాలు మే డే ను నిర్వహించుట

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సంఘటిత అసంఘటిత కార్మికుల అందరూ మే డేను జరుపుకు న్నారు.వివిధ రంగాలకు చెందిన కార్మికులతో వివిధ యూనియన్ల ఆధ్వ ర్యంలో గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జెండాలను ఎగురవేసి, ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపు కున్నారు చేనేత సహకార సంఘంలోని కార్మికులు, ఎంసిపిఐ యూనియన్ల కార్మి కులు, గ్రామపంచాయతీ కార్మికులు, పలు సంఘాల కార్మికులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికులు తన చెమటను చుక్కలను రక్త మాంసాలను కలిగించి పనిచేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగ కార్మిక దినోత్సవం మేడే కార్మికుల ఐక్యత పోరాటాలను నిదర్శనంగా నిలుస్తూ మేడేను అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ శాయంపేట గ్రామ అధ్యక్షుడు నాలికే రాజమౌళి, సూర్య ప్రకాష్, సునీల్ ,అనిల్ కొమురయ్య, చింతల భాస్కర్ ఉస్మాన్ ,నాగలగాని వీరన్న, గాదే కుమారస్వామి రమేష్ వంగరి సాంబయ్య, అన్ని యూనియన్ సంఘాల కార్మికులు, హమాలి కార్మి కులు, గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్: పోరాట ఫలితంగానే.!

జహీరాబాద్: పోరాట ఫలితంగానే అంగన్వాడీల వేతనాల పెంపు.

జహీరాబాద్ నేటి ధాత్రి

పోరాట ఫలితంగానే అంగన్వాడీల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి బుధవారం ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీల సమస్యలపై మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. భవిష్యత్తులను ఇదే స్ఫూర్తితో పోరాటం కొనసాగిద్దామని పేర్కొన్నారు.

గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసిన.

గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

రాజ్యాంగ విరుద్ధమైన వి,డి, సి లను నిషేధించాలి.

మంగపేట నేటిధాత్రి

 

 

 

 

కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు
నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ గ్రామంలో గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసి, శ్రీరామనవమి నాడు గుడిలోకి వచ్చిన మహిళలను గెంటివేసి అవమానపరిచి,ఉపాధి కల్పించే ఈత చెట్లను తగులబెట్టిన వి డి సి సభ్యులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కల్లు గీత కార్మిక సంఘము మంగపేట మండల కమిటీ డిమాండ్ చేశారు. మంగపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మండల కమిటీ ఆధ్వర్యంలో తాళ్లరాంపూర్లో జరిగిన వి డి సి పెద్దలను తక్షణమే అరెస్ట్ చేయాలనీ కల్లు గీత కార్మికుల తో నిరసన చేయడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ లో రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసిన వి డి సి కమిటీల అరాచకాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని,తాళ్ల రాంపూర్ లో తాళ్లు ఎక్కతు న్నందుకు వి డి సి కి డబ్బులు ఇవ్వలేదనే కక్షతో కల్లు గీత వృత్తినే నమ్ముకునీ జీవనం కొనసాగీస్తున్న గీత కార్మికులను తాళ్లు ఎక్కద్దని కల్లు ఎవరు తాగద్దని చాటింపు వేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు,పైగా ఈనెల 6న శ్రీరామనవమి పండుగ సందర్బంగా గౌడ మహిళలు గుడికి వస్తే మీరు గుడికి రావద్దు అని బయటకు పంపి బహిష్కరణ చేసిన వి డి సి కమిటీపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.నిజామాబాద్ జిల్లాలో వివిధ వృత్తులు చేస్తున్న
కుర్మ,యాదవులు,ముదిరాజ్, బెస్త,వడ్డెర,నాయి బ్రాహ్మణ, నేత,మరియు దళితులు తదితరచేతి వృత్తిదారులను సాంఘిక బహిష్కరణ చేస్తున్న వి డి సి లను శాశ్వతంగా లేకుండా నిషేధించాలని కమిటీ పెద్దలు అన్నారు..

Temple

 

 

 

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు లోడే శ్రీనివాస్ గౌడు, మండల గౌడ సంఘము అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడు గాజుల ఈశ్వర్ గౌడు, గాజుల వెంకటేశ్వర్లు గౌడ్, గంట చిట్టిబాబు గౌడ్, బూర శ్రీనివాస్ గౌడ్, కమలాపూర్ గ్రామం గౌడ సంఘం నుండి పానుగంటి వెంకటేశ్వర్లు గౌడ్, బోనగాని యాదగిరి గౌడ్, జాడి శేఖర్ గౌడ్, బూర సాంబయ్య గౌడ్, పంజాల సత్యం గౌడ్, పందాల హరిబాబు గౌడ్, ఓరగంటి రాంబాబు గౌడ్, బూర నరేష్ గౌడ్, గుండెబోయిన శీను గౌడ్,శేఖర్ గౌడ్ కోరుకొప్పుల రాము గౌడ్, కోరుకొప్పుల సత్యం గౌడ్, కుప్పల పున్నం రావు గౌడ్, చిన్న చంద్రం గౌడ్, పెద్ద చంద్రన్న గౌడ్,ఉడుగుల సాంబయ్య గౌడ్ వీరితో పాటు మిగతా గ్రామాల నుండి 40 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.

నీళ్ల కోసం రోడ్డెక్కిన కార్మికుల కుటుంబాలు.

నీళ్ల కోసం రోడ్డెక్కిన కార్మికుల కుటుంబాలు

రోడ్డు దిగ్బంధం,రోడ్డుపై బైఠాయించి ధర్నా

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్ లో గత కొన్ని రోజుల నుండి నీటి సమస్యతో కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యను పట్టించుకోకపోవడం వల్ల బుధవారం గోలేటి నాలుగు స్తంభాల చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.మూడు రోజులలో నీటి సమస్య పరిష్కారం చేయకపోతే జిఎం కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్మిక కుటుంబాలు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్ఓటు జిఎం రాయమల్లు,సివిల్ డివై జిఎం భాష సింగరేణి అధికారులు రెండు రోజులలో నీటి సమస్య పరిష్కరిస్తామని కార్మిక కుటుంబాలకు హామీ ఇచ్చారు.

కోరుట్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం.

మెట్ పల్లి ఏప్రిల్ 10 నేటి ధాత్రి

మెట్ పల్లి లో బీఆర్ఎస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం వెల్లుల్ల రోడ్డు ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మార్క్ ఫండ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ముఖ్య కార్తి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
మల్లాపూర్ మండల్ ముత్యంపేట ఆటో యూనియన్ వారు బీఆర్ఎస్ పార్టీ రజోత్సవం వరంగల్ లో జరిగే చలో వరంగల్ కార్యక్రమానికి పార్టీ నిధులు కింద 5000 రూపాయలు జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కి అందజేశారు.
ఈ సమావేశంలో ముఖ్య కార్యకర్తలు వారి సలహాలు సూచనలు మాట్లాడిన
అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కార్యకర్తలు పార్టీ బలోపేత నికి కృషి చేయాలని కెసిఆర్ అడుగుజాడల్లో నడిచి పూర్వ వైభవం పార్టీకి తేవాలని నియోజకవర్గంలో మన పార్టీకి బెంచి పట్టు ఉందని దానికి ప్రతి కార్యకర్త వచ్చే సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ రజతోత్సవాలు పురస్కరించుకొని చలో వరంగల్ సభను ఘన జరుపుకుందామని దానికి ప్రతి బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు మన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలను కలిసి మనం చేసిన అభివృద్ధి పనులు గురించి తెలిపి వరంగల్ సభకు తీసుకురావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ , మాజీ జడ్పిటిసిలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుకు సమ్మె.

మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుకు సమ్మె

మున్సిపల్ కమిషనర్ హామీతో విరమించిన కార్మికులు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు కోసం అనేక పోరాటాలు చేసిన ఫలితంగా గత ప్రభుత్వం 2021 జూన్ నెలలో 11వ పి.ఆర్.సి కింద మున్సిపల్ మున్సిపల్ కార్మికుల వేతనాలను 12,000 నుండి 15600 కు నెలకు 3600 పెంచడం జరిగినది. కానీ 2022 ఫిబ్రవరి నెల నుండి కార్మికులకు పెరిగిన వేతనాలు ఇవ్వడం జరిగినది. ఎనిమిది నెలల పి.ఆర్.సి బకాయిలు రావాల్సి ఉంటే మధ్యలో చాలాసార్లు అడిగితే ఒక్కొక్క నెల చొప్పున కేవలo మూడు నెలల పి.ఆర్.సి పెండింగ్ వేతనాలు మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఇప్పటికీ ఐదు నెలల పెండింగ్ పి.ఆర్.సి వేతనాలు రావాలి మొత్తం 250 మంది కార్మికులకు ఒక్కో నెలకు 3600 చొప్పున ఒకరికి 18,000 చొప్పున మొత్తం 45 లక్షల రూపాయలు కార్మికులకు రావాలి. మున్సిపల్ కార్మికులు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదు అని తెలిపారు.అంతేకాకుండా గత నెలలో ఫిబ్రవరి, మార్చి నెలల రావాల్సిన వేతనాలు కూడా ఇంకా కార్మికులకు ఇవ్వలేదు అని తెలిపారు.కార్మికులకు సంబంధించి పి.ఎఫ్ , ఈ.ఎస్.ఐ మరియు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం పాలకవర్గ గడువు ముగిసింది జిల్లా కలెక్టర్ ఇన్చార్జిగా ఉన్నారు పై సమస్యలు పరిష్కరించాలని మార్చి 4వ తేదీన కమిషనర్ గారికి , 15 రోజుల క్రితం కలెక్టర్ కి కూడా లెటర్లు ఇవ్వడం జరిగినది. ఏప్రిల్ 10 లోపు సమస్యలు పరిష్కరించాలని లేకుంటే పనులుస్పందన లేకపోవడంతో ఈరోజు ఉదయం 5 గంటలకు పనులకు వెళ్లకుండా మున్సిపల్ ముందు బెటాయించిన కార్మికులు ఉదయం 6 గంటల వరకు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య వచ్చి చర్చలు జరిపి అన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నాలుగు రోజుల్లో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు కమిషనర్ హామీలు మేరకు ఉదయం 8 గంటలకు విధులలో చేరిన సిరిసిల్ల మున్సిపల్ కార్మికులు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ తెలిపారు.

కాషాయ సైనికులే పార్టీకి కీలకం..కార్యకర్తలే వెన్నెముక

కాషాయ సైనికులే పార్టీకి కీలకం..కార్యకర్తలే వెన్నెముక

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రాంచంద్రాడ్డిరె
-బిజెపి భూపాలపల్లి నియోజకవర్గం కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

భారతీయ జనతా పార్టీ విజయాల్లో పార్టీకి కాషాయ సైనికులే కీలకం..కార్యకర్తలే వెన్నెముక అని, వారి శక్తి, ఉత్సాహం ప్రేరణాదాయకమని, కొన్ని సంవత్సరాలుగా పార్టీ బలోపేతం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారి సేవలు మరువలేనివని భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని అమ్మ గార్డెన్ లో భాజపా 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బిజెపి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి చదువు రామచంద్ర రెడ్డి&మోరే రవీందర్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలోని ప్రజలంతా బిజెపి సుపరిపాలనను చూస్తున్నారని, ఇటీవల పార్టీ సాధించిన అనేక చారిత్రాత్మక విజయాల్లో ఇది ప్రతిబింబిస్తోందన్నారు. బిజెపి 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ పురోగతికి “వికసిత్ భారత్” స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమాజ సర్వతోముఖాభివృద్ధి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం సేవ చేస్తుందన్నారు. 1980లో స్థాపించిన భారతీయ జనతా పార్టీ 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రెండు లోక్ సభ స్థానాలను మాత్రమే గెలుచుకొని ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్ పేయ్, ఎల్ కె అద్వానీ నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదిగి..1990లో మిత్రపక్షాలతో కలిసి బిజెపి అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. అనంతరం 2014 నుంచి ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిందన్నారు. దేశ ప్రజల రక్షణే లక్ష్యంగా..ప్రజల అభివృద్దే ధ్యేయంగా..వారికి సుపరిపాలనను అందిస్తున్న..నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా..తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్ధుడై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించేలా కష్టపడాలన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ..ప్రజా సమస్యలపై పోరాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు కుమ్మరి సారయ్య జమలాపురం సాంబశివరావు దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్యాల రాజు పార్లమెంట్ ఫుల్ టైమర్ మంద రాజేష్ మండల ప్రధాన కార్యదర్శి బండారి శ్రీనివాస్ అరికాంతపు కృష్ణారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ పెళ్లి మల్లారెడ్డి మండల ఉపాధ్యక్షులు బలుగూరి కిషన్ రావు రాస బిక్షపతి జిల్లా నాయకులు అనుముల శ్రీనివాస్ పులి వెంకట్ రెడ్డి మునిగంటి మల్లారెడ్డి వైనాల ప్రియాంక శివకుమార్ Stomach రాజేశ్వరరావు బల్గూరి తిరుపతిరావు వంగ రవి పొన్నాల మల్లారెడ్డి జమలాపురం రాజు యారా జయపాల్ రెడ్డి పెళ్లి మల్లారెడ్డి మండల నాయకులు రేపాల శ్రీనివాస్ బండారి తిరుపతి చిలకమర్రి రాజేంద్రప్రసాద్ బోయిని తిరుపతి కక్కర్ల వీరన్న పొడిసెట్టి రవి దేశిని భూమయ్య తదితరులు పాల్గొన్నారు

హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికుల డిమాండ్.

ట్రేడ్ యూనియన్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనను కేంద్రం మానుకోవాలి

హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికుల డిమాండ్

జైపూర్,నేటి ధాత్రి:

 

పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రం ప్రభుత్వం హరిస్తుందని హెచ్ఎంఎస్ కార్మిక నేతలు ఆరోపించారు.ట్రేడ్ యూనియన్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సోమవారం హెచ్ఎంఎస్ కార్మిక నేతలు హెచ్చరింఛచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చేనెల 20న దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడు లుగా కుదించిందన్నారు.గత మార్చి నెల 18 నాడు ఢిల్లీలో హెచ్ఎంఎస్ యూనియన్ తో సహా అన్ని జాతీయ కార్మిక సంఘాలు,అసంఘటిత కార్మిక సంఘాలు ఉమ్మడిగా దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలలో సమ్మె చేయుటకు నిర్ణయించారని పేర్కొన్నారు.దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా కార్మికులంతా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేశారు.సింగరేణిలో సమ్మె విజయవంతం చేయడానికి అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా పనిచేసి, సమ్మెను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమై కార్మిక చట్టాలను కాపాడుకోవాలని కోరారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టడం మానుకోవాలని కార్మిక సంఘాల పక్షాన డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ యూనియన్ కార్మిక నేతలు పాల్గొన్నారు.

చేనేత కార్మికుల ఐదవ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె.

సిరిసిల్ల చేనేత కార్మికుల ఐదవ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె

డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టిన కార్మికులు

ఏప్రిల్ – 7 సోమవారం రోజున 24 గంటల నిరాహార దీక్ష చేపడతాం

CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జోళి శాఖ ప్రభుత్వ ఆర్డర్ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు వార్పిన్ , వైపని కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించి ఇతర సమస్యలు పరిష్కరించాలని పలు డిమాండ్లతో చేపట్టిన సమ్మె ఈరోజు 5 వ రోజు కు చేరుకుంది ఈరోజు సమ్మెలో భాగంగా బి.వై నగర్ లోని సమ్మె శిబిరం నుండి కార్మికులు గోపాల్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , జిల్లా అధ్యక్షులు కోడం రమణ గార్లు మాట్లాడుతూ గత ఐదు రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్న కూడా ప్రభుత్వం , అధికారులు స్పందించకపోవడం అన్యాయమని అన్నారు.

సమ్మె డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 7 సోమవారం రోజున 24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్..

Musham Ramesh’s

కూరపాటి రమేష్ గారు ముఖ్యఅతిథిగా హాజరుతున్నారని ఇట్టి కార్యక్రమంలో పవర్లూమ్ కార్మికులు , వార్పిన్ , వైపని కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కార్మికుల సమ్మెకు మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు నక్క దేవదాస్ , వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం , వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరి కుంట కిషన్ నాయకులు ఉడుత రవి , ఒగ్గు గణేష్ , ఎలిగేటి శ్రీనివాస్ , సబ్బని చంద్రకాంత్ , భాస శ్రీధర్ , వేణు , తిరుపతి , రాజు , రాము , వెంకటేశ్వర్లు , సదానందం పెద్ద ఎత్తున పవర్లూమ్ , వార్పిన్ , వైపని యూనియన్ల నాయకులు , కార్మికులు పాల్గొన్నారు

లైసెన్సులను రెన్యువల్స్ చేయించిన.!

దాడ్వాయి హమాలి కార్మికుల లైసెన్సులను రెన్యువల్స్ చేయించిన
* జమ్మికుంట వ్యవసాయమార్కెట్ చై _ర్ పర్సన్

* జమ్మికుంట:నేటిధాత్రి

* ఈరోజు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం ఆధ్వర్యంలో మార్కెట్లో పనిచేయుచున్న హమాలీ, దాడ్వయి, కార్మికులకు రెన్యువల్స్ లైసెన్సును జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి మల్లేశం ద్వితీయ శ్రేణి కార్యదర్శి శ్రీ ఎం రాజు ఆ ఆడ్తి దారుల మరియు హమాలీ సంఘం సభ్యులు దాడ్వయి సంఘం సభ్యులు మరియు అడ్తిదారుల మరియు హమాలీ సంఘం దాడ్వయి సంఘం అధ్యక్షులు ఎర్రవెల్లి రాజేశ్వరరావు మరియు_ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ బావిలో పడి ఇద్దరు వలస కార్మికులు మృతి.

వ్యవసాయ బావిలో పడి ఇద్దరు వలస కార్మికులు మృతి.

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పైడిగుమ్మల్లో విషాద ఘటన చోటుచేసుకున్నది. ఈ నెల 10న అదృశ్యమైన ఇద్దరు వలస కార్మికులు, వ్యవసాయ బావిలో విగతజీవులుగా కనిపించరు. మృతులు బైద్యనాథ్ భట్ (UP), హరిసింగ్(ఒడిశా)గా పోలీసులు గుర్తించారు. పైడిగుమ్మల్లో వెంచర్ పనులకు వచ్చిన ఇద్దరు కార్మికులు ప్రమాదం బారిన పడ్డట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి వ్యవసాయ బావిలో నుంచి కార్మికుల మృతదేహాలు గుర్తించి, వెలికితీశారు.

కార్మికుల హక్కులను కొల్లగొడుతున్న కార్పోరేట్ శక్తులు.

కార్మికుల హక్కులను కొల్లగొడుతున్న కార్పోరేట్ శక్తులు

మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక వర్గం సిద్ధం కావాలి

ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు

శ్రీరాంపూర్,(మంచిర్యాల(నేటి ధాత్రి:

 

దేశ వ్యాప్తంగా కార్మిక వర్గానికి హక్కులను లేకుండా కార్పొరేట్ శక్తులు కొల్లగొడుతున్నాయని,కార్మిక చట్టాల సవరణలో భాగంగా బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ వారికి వత్తాసు పలుకుతూ కార్మిక లోకానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు అన్నారు.గురువారం శ్రీరాంపూర్ లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా సివిల్ సప్లై, హమాలి యూనియన్ల సమావేశం లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా విభజించడానికి వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏప్రిల్ 1 నుండి వాటి అమలును నిరసిస్తూ వెంటనే ఆపాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో మే 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు,ఉపాధ్యక్షులు మిట్టపల్లి పౌలు,సివిల్ సప్లై హమాలీ కార్మికులు పానుగంటి సత్యనారాయణ,తిప్పని సత్తయ్య,పోరాండ్ల సంపత్,నరేష్,రాజన్న, మామిడి చంద్రయ్య  పాల్గొన్నారు.

స్విమ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలి.

*స్విమ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలి.
వివక్ష వీడాలి:

*టీటీడీ పరిపాలన భవనం ముందు స్విమ్స్ కార్మికుల భారీ ధర్నాలో కందారపు మురళి డిమాండ్..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:

 

 

స్విమ్స్ కార్మికుల కు వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కారం చేయాలని బుధవారం ఉదయం స్విమ్స్ ఆసుపత్రి నుండి కార్మికులు ప్రదర్శనగా టీటీడీ పరిపాలన భవనం వద్దకు చేరుకుని అక్కడ మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు.

ధర్నా అనంతరం టీటీడీ జేఈవో వీర బ్రహ్మం కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా ధర్నా ను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ స్విమ్స్ ఆస్పత్రి ఏర్పడినప్పటి నుండి నేటి వరకు పనిచేస్తున్న కార్మికుల కు వేతనాలు పెంచటం లేదని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా, కార్మికుల జీవితాలు వారి తలరాతలు మాత్రం మారడం లేదని అన్నారు.

గతంలో స్విమ్స్ ఏర్పడినప్పుడు ఉద్యోగాల్లో వార్డు బాయులుగా చేరిన వీరిని శానిటేషన్ కార్మికులుగా పేరు మార్చడం వల్ల వీరికి శాపంగా మారిందని అధికారులు చేసిన తప్పులకు కార్మికులు బలవుతున్నారని అన్నారు.

పని భారం నుండి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని కార్మికులతో అన్ని పనులు చేయించడo, ఊడవటం మొదలు ఆపరేషన్ థియేటర్ ల్లో అన్ని పనులు వరకు వీరి దగ్గరే చేయిస్తూ తీవ్ర పనిభారం మోపుతున్నారని నిర్దిష్టమైన పనిని కేటాయించడం లేదని వీరికి నిర్దిష్టమైన పనిని కేటాయించాలని డిమాండ్ చేశారు.

గతంలో మూడుసార్లు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు నిర్వహించినాస్వయంగా డైరెక్టర్ చర్చల్లో పాల్గొని సమస్యలపై హామీ ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, టీటీడీ స్విమ్స్ సమన్వయంతో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు.

సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం,సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కే వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ స్విమ్స్ గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు టీటీడీలోకి విలీనం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని, వేతనాలు పెరుగుతాయని కార్మికులందరూ ఆశపడ్డారని దానికి భిన్నంగా ప్రభుత్వం నుండి టీటీడీలోకి విలీనం చేసిన తరువాత పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా వీరి పరిస్థితి అయిందని అన్నారు.

టీటీడీ స్విమ్స్ పై స్విమ్స్ టీటీడీ పై ఒకరి ఒకరు దాట వేసుకుంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని పరిష్కారం చేయడం లేదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక శాఖకు, టీటీడీ ఈవో కు లేఖలు పంపినా పరిష్కారం కాలేదని టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, ఎప్పటికైనా టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పట్ల సానుకూలంగా వ్యవహరించి పరిష్కారం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు.

సానుకూలంగా స్పందించిన జేఈవో వెంటనే ఈ సమస్యల పట్ల చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిమ్స్ కార్మికుల యూనియన్ కార్యదర్శి రవి అధ్యక్షులు సూరి కోశాధికారి మారి ముత్తు నాయకులు గోపి వేలు వెంకటేష్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..

హమాలీ కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి..

హమాలీ కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి

నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కు వినతిపత్రం.

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లో పనిచేయుచున్న హమాలీ కార్మికులకు వెంటనే సభ్యత్వం ఇచ్చి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఏఐఎఫ్టియు (న్యూ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోడెం మల్లేశం గౌడ్ కోరారు. ఈ మేరకు అఖిలభారత కార్మిక సంఘాల సమైక్య (న్యూ) అనుబంధ వ్యవసాయ మార్కెట్ హమాలి కార్మిక సంఘం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయూ (న్యూ) రాష్ట్ర అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు గత కొన్ని సంవత్సరాల క్రితం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వం మరియు గుర్తింపు కార్డులు ఇచ్చారని ఆనాటి నుండి నేటి వరకు రెన్యువల్ చేస్తున్నారే తప్ప నూతన సభ్యత్వం గుర్తింపు కార్డులు ఇవ్వడంలేదని ఆరొపంచారు.వివిధ ముఠాలలో పనిచేయుచున్న హమాలీ కార్మికులు 60 యేండ్లు పైబడినవారు హమాలీ పనులు చేయలేక పనిని మానుకోవటం, కొంతమంది కార్మికులు అనారోగ్యములతో మరణించటం,కొంతమంది పనుల నుండి వెళ్లిపోవడం జరుగుచున్నది వారి స్థానంలో వచ్చిన కార్మికులకు ప్రభుత్వం నుండి రావలసిన బట్టలు, తదితర రాయితీలు పొంద లేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా మార్కెట్ చైర్మన్, మార్కెట్ కమిటీ కార్యదర్శి స్పందించి
నూతన సభ్యత్వం ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందజేయాలని మల్లేష్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షులు మంద మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు జనార్ధన్, కోశాధికారి బొల్లెన రమేష్, సంఘం నాయకులు ఇప్ప బాబు, ఎద్దు రాములు, రమేషు, రవీందర్, కుమారస్వామి, రాజు, వెంకన్న, సతీష్, వీరన్న, రాజాలు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న.!

సిరిసిల్ల జిల్లాలోని బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

సిరిసిల్ల పట్టణంలో ని మున్నూరు కాపు భవన్ లో
భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కార్యకర్తల సమ్మేళనం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో

Bandi Sanjay

సిరిసిల్ల జిల్లా బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగినది. అనంతరం నూతనంగా సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడిగ నియమింపబడ్డ రెడ్డబోయిన గోపికి సత్కరించి శుభాకాంక్షలు తెలుపుతూ… రాబోయేవి ఎన్నికలే,స్థానిక ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మనదని,బీజేపీ స్ట్రాటజీ ఎట్లుంటదో మీకు తెలుసునని, సెస్, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో ఎట్లా ఫైట్ చేసినమో మీకు తెలుసు,సెస్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే,భయపెట్టి బెదిరించి బీఆర్ఎస్ గెలిచినట్లు అరాచకాలు చేసిన దుర్మార్గమైన చరిత్ర బీఆర్ఎస్ దే అని,ఎవరెన్ని చేసినా ప్రజలు బీజేపీవైపే ఉన్నారని,ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు బీజేపీదే అని బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగినది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా బిజెపి ప్రధాన అధ్యక్షులు బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీ రెడ్డబోయిన గోపి మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ రాంప్రసాద్, పార్లమెంటు కో- కన్వీనర్ శ్రీ ఆడెపు రవీందర్, మరియు జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరి భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, మరియు రాజాసింగ్ మరియు సిరిసిల్ల బీజేవైఎం టౌన్ అధ్యక్షుడు వంగ అనిల్, మరియు సిరిసిల్ల ఓ బి సి టౌన్ అధ్యక్షుడు శ్రీ అంకారపు రాజు, సిరిసిల్ల ఎస్టి టౌన్ అధ్యక్షుడు మొగిలి రాజు మరియు సిరిసిల్ల టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీ వైశాలి మరియు బిజెపి సీనియర్ నాయకులు యువకులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పట్టించుకోని.!

పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పట్టించుకోని సీనియర్ నాయకులు నాయకులు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

న్యాల్కల్, మీడియా తో సీనియర్ నాయకుడు హత్నూర్ యునూస్ గత 10 సంవత్సరాలు పార్టీ కోసం అధికారం లేనపుడు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు లేదు నూతన వారికి విలువ ఇస్తూ పాత వారికి విస్మరిస్తూ ఏదైనా మీటింగ్ ఉన్న ,ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్న,వచ్చే నిధుల పట్ల గ్రామాల అభివృద్ది కొరకు చర్చినట్లు సొంతం నిర్ణయాలు తీసుకుంటున్నారు మండలంలో జరిగే ఎ కార్యక్రమాలకు సీనియర్ పదేళ్లు అధికారం లేకున్నా సొంత ఖర్చులతో జనంలో ఉంటూ ప్రజా సమస్యలు పైన పార్టీ కోసం పని చేస్తూ ఉన్న ఈ రోజు అధికారంలో రాగానే పాత వారికి విస్మరిస్తూ కొత్త వారి పట్ల విలువ చూపుతూ సీనియర్ నాయకులకు దూరం పెట్టడం వల్ల ఇబ్బంది ఔతుంది ప్రజా సేవ లో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చాలా కష్ట పడ్డారు ప్రలకు ప్రభుత్వ పథకాల లబ్ది కొరకు లేదా వారి సంబంధిత సహాయం కొరకు మాలాంటి వారికి చెప్పుతున్నారు ప్రజల అవసరం కోసం మేము ఎవరి దగ్గర వెళ్ళలే ఎవరూ విలువ ఇవ్వనపుడు పనులు చేయనపుడు పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు లేకపోవడం చాలా బాధాకరం దిని పట్ల నియోజవర్గ ఇన్చార్జి ,జిల్ల ఇన్చార్జి , ఎం పి గారు దృష్టి సారించాలి ప్రతి గ్రామంలో 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్ట పడిన వారికి విలువ ఇవ్వండి సమాచారం ఇవ్వండి. అని ప్రశ్నించారు.

సిరిసిల్ల బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్న.!

సిరిసిల్ల బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

సిరిసిల్లబిజెపి బిజెపి కార్యకర్తల్లో జోష్

సిరిసిల్ల టౌన్:( నేటిదాత్రి )

సిరిసిల్ల కి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ * తేదీ:16-03-2025 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా * విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా నేడు సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు శ్రీ నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీ రెడ్డబోయిన గోపి మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ రాంప్రసాద్, పార్లమెంటు కో- కన్వీనర్ శ్రీ ఆడెపు రవీందర్, మరియు జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరి భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, మరియు రాజాసింగ్ మరియు సిరిసిల్ల బీజేవైఎం టౌన్ అధ్యక్షుడు వంగ అనిల్, మరియు సిరిసిల్ల ఓ బి సి టౌన్ అధ్యక్షుడు శ్రీ అంకారపు రాజు, సిరిసిల్ల ఎస్టి టౌన్ అధ్యక్షుడు మొగిలి రాజు మరియు సిరిసిల్ల టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీ వైశాలి మరియు బిజెపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిన.!

*చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం….
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో 33 కోట్లు రూపాయలు రుణమాఫీ …
* కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సిరిసిల్ల చేనేత కార్మికులు ….

* రాజన్న సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్న చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో జీవో నెంబర్ 56 లో భాగంగా 1-4-2017 నుండి 31-3-2024 తీసుకున్నటువంటి చేనేత రుణమాఫీని మాఫీ చేయడం జరిగినది. తెలంగాణ మొత్తంలో 33 కోట్లు రుణమాఫీ చేయడం జరిగినది అంతేకాకుండా ఒక్కొక్క చేనేత కార్మికుడు తీసుకున్న రుణం వచ్చేసి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం ద్వారా చేనేత కార్మికులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. మన సీఎం రేవంత్ అన్న గారికి, టెక్స్టైల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావు అన్నగారికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శీనన్న గారికి, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ గారైన కేకే మహేందర్ అన్నగారికి రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ తరపున కామూరి వనిత, నలినీకాంత్ మరియు చేనేత మహిళా కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు.

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని.

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సరైన భద్రత కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు,
గ్రామపంచాయతీలో పని చేసే కార్మికులకు సరియైన భద్రత కల్పించాలని పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఎంపీడీవో కు వినతి పత్రం అందించారు, ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్యాల నరసయ్య, మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెబాట పట్టిన సమయంలో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమయంలో గ్రామపంచాయతీ కార్మికుల వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వారికి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు, దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అలాగే ఈ గ్రామపంచాయతీ కార్మికులలో చదువుకున్న కార్యదర్శి సహాయకులుగా నియమించాలని, ప్రభుత్వం ఎప్పుడూ చెప్తుంది, వీఆర్ఏలను మళ్లీ తీసుకు వస్తామని కాబట్టి గ్రామపంచాయతీ కార్మికులు ఎవరైనా చదువుకున్న వారిని గుర్తించి వారికి వీఆర్ఏ పోస్టులు ఇవ్వాలని అన్నారు, అలాగే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలుపెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని అన్నారు, వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడాలని వారు అన్నారు,ఈ నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షులు మామిడి నరేష్,
వాసంకిరణ్ కుమార్,కొమ్ము చరణ్, లక్కీ బాబు , రాములు
మల్యాల లచ్చయ్య,
వజ్రవ్వ ,గంగజల, లక్ష్మి,లచ్చవ్వ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version