బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు 261.

బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు 261. పైసల. కూలి ఏప్రిల్ నెల నుండి చెల్లించాలి

కార్మికుల వద్ద నుండి ప్రతి నెల
2000 బీడీల వేతనం దోపిడి చేస్తున్న యజమాన్యంపై కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బి.వై నగర్ అమృత లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు అధ్యక్షులు ముశం రమేష్
మాట్లాడుతూ బీడీ కార్మికులకు ప్యాకర్ నెలసరి ఉద్యోగులందరికీ కరువు భత్యం డి.ఏ అన్ని కలుపుకొని. 1000 బీడీలకు పది రూపాయల 40 పైసలు పెరగడం జరిగింది ప్రస్తుతం ఉన్న కూలి పెరిగిన కూలి కలుపుకుంటే 1000 బీడీలకు మొత్తం కూలి 261. 40 రూపాయల పైసలు. కార్మికులకు. నాలుగో నెల నుండి బీడీ యజమాన్యం చెల్లించాలని అన్నారు ప్యాకర్ కు రోజుకు పది రూపాయలు 40 పైసలు పెంచడం జరిగింది
బీడీ కార్మికుల నుండి యజమాన్యం పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతుందని కార్మికుల. వద్దనుండి నెలకు ఎన్ని బీడీలు చేసినా కూడా 2000 బీడీల వేతనం కట్ చేసుకుని ఇస్తున్నారు 2000 బీడీల వేతనం అంటే 552 కూలి కార్మికులు కోల్పోతున్నారు. ఈ లెక్కన కార్మికుల వద్ద నుండి బీడీ ఏమో అని కొన్ని కోట్ల రూపాయల శ్రమను దోచుకుంటున్నది దానికి తోడు గంపకట్ట పేరుతోటి అదేవిధంగా అనేక రకాల పేర్లు చెప్పుకుంటూ కార్మికుల వద్ద నుండి నెలకు 40.50 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది కార్మికులకు పని చేస్తే 3000 వరకు వేతనం వస్తే అందులోకి అన్ని కటింగ్లు పోను 1500 కూడా కార్మికుల చేతిలోకి రావడం లేదు ఈ రకంగా బీడీ కార్మికులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు.బీడీ పరిశ్రమలపై లేబర్ అధికారుల తనిఖీలు లేకపోవడంతో బీడీ యజమానుల ఇష్టారాజ్యంగా మారింది కంపెనీల .బీడీలనే నగదు బీడీల పేరుతో కార్మికులతో చేయించుకుని ఒక వెయ్యికి 50 రూపాయల కూలీ తక్కువ చెల్లిస్తున్నారు
దాంతో పాటు పి.ఎఫ్ ఎగ్గొడుతున్నారు.
నగదు బీడీలు చేయిస్తున్న వారిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటే ఎల్లారెడ్డి,బీడీ నాయకులు సూరం పద్మ, జిందం కమలాకర్ పాల్గొన్నారు

లక్ష రూపాయల చెక్కు అందించిన.!

లక్ష రూపాయల చెక్కు అందించిన సామాజిక కార్యకర్త ఇమ్రాన్ మోహియోద్దీన్

జహీరాబాద్. నేటి ధాత్రి:

మజ్లిస్ మాజీ స్పీకర్ మరియు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు దివంగత శ్రీ సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ జ్ఞాపకార్థం, ప్రముఖ సామాజిక కార్యకర్త ఇమ్రాన్ మొహియుద్దీన్, సామాజిక కార్యకర్త మొహమ్మద్ సమీర్ అబ్దుల్ లతీఫ్ కలిసి కోహిర్ మండల్ మద్రి గ్రామానికి చెందిన 6 రోజుల కుమార్తెకు చికిత్స పొందుతూ మరణించిన మృతురాలి భర్త మంగళై నవీన్ కుమార్ కు లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందించారు. ఈ సందర్భంగా,ఏఐఎంఐఎం ప్రధాన కార్యదర్శి జహీరాబాద్ టౌన్ ముహమ్మద్ రఫీ ముహమ్మద్ వాజిద్, ఏఐఎంఐఎం గ్రామ పంచాయతీ అధ్యక్షుడు దగ్వాల్, షేక్ ఇలియాస్ జాయింట్ సెక్రటరీ జహీరాబాద్, ముహమ్మద్ యూనస్ రజా ఏఐఎంఐఎం అధ్యక్షుడు కృష్ణపూర్, ఇమ్రాన్ అబ్దుల్ గఫర్, అజీమ్ పటేల్, మల్లేష్ ముహమ్మద్ అన్వర్ మరియు మాద్రి గ్రామ పంచాయతీ నివాసితులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version