కార్మికులు 9 వతేది సమ్మెకు దూరంగా ఉండాలి.
జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
జులై 09 న తలపెట్టిన ఒక్కరోజు సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని, భూపాలపల్లి సింగరేణి ఏరియా జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలియజేశారు భూపాలపల్లి ఏరియా లోని కేటీకే 5 ఇన్ లైన్ గని ఆవరణలో జరిగిన సమావేశంలో జిఎం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కొన్ని కార్మిక సంఘాలు వివిధ డిమాండ్లతో జూలై 9 వ తేదీన ఒక్క రోజు సమ్మె పిలుపు ఇవ్వడం జరిగిందని, కానీ ఈ సమ్మెలో ఉన్నఅత్యధిక డిమాండ్లు సింగరేణి యాజమాన్యం తీర్చగలిగేవి కావని ఆయన తెలియజేశారు. సింగరేణి సంస్థ పరిధిలోని సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని అటువంటప్పుడు సింగరేణి కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన అవసరం లేదని ఆయన అన్నారు. ఫ్రీ ఏసీ గాని, కారుణ్య నియామకాలు గాని కార్పొరేటు వైద్యం గానీ చర్చల ద్వారా సాధించాము. వివిధ కారణాల వల్ల ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిలో మట్టి తొలగింపులో కొంత వెనుకబడి ఉన్నామని ఆయన తెలిపారు. జూలై రాబోయే ఆగస్టు నెలలో వర్షాల ప్రభావం వల్ల ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతుందనే విషయం కార్మికులకు తెలిసిందేనని లక్ష్యసాధనకు ప్రతిరోజు సాధించే ఉత్పత్తి ఎంతో తోడ్పాటును అందిస్తుందని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగడానికి నిర్దేశించిన ఉత్పత్తి సాధిస్తూ కంపెనీకి సహకరించాలని అవసరం ఉందన్నారు. కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తే ఒక్క కోటి ఎనభై నాలుగు లక్షల రుపాయలు భూపాలపల్లి ఉద్యోగులు జీతం రూపంలో నష్ట పోతారని,భూపాలపల్లి ఏరియాకి 5,90,54,120( ఐదు కోట్ల తొంబై లక్షల యబై నాలుగు వేల నూట ఇరవై రూపాయల) ఉత్పత్తికి నష్టం వస్తుందని ఆయన తెలిపారు. అందువలన తలపెట్టిన ఒక్కరోజు సమ్మెను సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి కేటీకే 5 లైన్ గని మేనేజర్ అనుగ్రహ్ నారాయణ్, సేఫ్టీ ఆఫీసర్ ఆర్.చంద్రశేకర్, వెల్ఫేర్ ఆఫీసర్ సందీప్ కుమార్, ఇతర గని అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు