బదిలీపై వెళ్తున్నా పోలీస్ లకు ఘనంగా సన్మానం.

బదిలీపై వెళ్తున్నా పోలీస్ లకు ఘనంగా సన్మానం.

ఆమనగల్ / నేటిధాత్రి:

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా ఆమనగల్లు మండలం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, బాల్ రెడ్డి సార్ ఉద్యోగ బదిలీ అవుతున్న సందర్భంగా పోలీస్ స్టేషన్ కి ఉత్తమ సేవలందించినందుకు చిరు సత్కారం చేసి వారిని అభినందించారు.వారికి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమనగల్ మండలం ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్ మల్లేష్,ఆమనగల్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ఎర్రవోలు శ్రీనివాస్,
వెంకటేష్, జగన్,నాగిల్ల, బిజెపి సీనియర్ నాయకులు సీతారాం నాయక్,బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

నాన్నకు ప్రేమతో చిరు సత్కారం.

నాన్నకు ప్రేమతో చిరు సత్కారం

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

shine junior college

 

పితృదినోత్సవ సందర్భంగా భవానీ సాహితీ వేదిక కరీంనగర్ డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన నాన్నకు ప్రేమతో కవితాసంపుటి పుస్తకపరిచయ సభ కరీంనగర్ లో వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో జరిగినది. ఈ సందర్భంగా తెలుగు కవి, సాహితీ విమర్శకుడు
డాక్టర్ మోత్కుల నారాయణ గౌడ్ నాన్నపై కవితను చదివి సభికులను ఆహ్లాదపరిచారు. ఈ సందర్భంగా వారి నాన్నగారైన మోతుకుల పోచయ్య గౌడ్ ని సాహితీ వేదిక నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఇది పితృ దినోత్సవ0 సందర్భంగా కొడుకు తండ్రికి చేసిన సన్మానంగా ఆ సభలో ఉన్న తెలుగు సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ ,దాస్యం సేనానధిపతి, ముఖ్య అతిథి ఎన్. వి రఘువీర్ ప్రతాప్, విశిష్ట అతిథి బుస్స శ్రీనివాస్, సమీక్షకులు కథకులు కూర చిదంబరం, విశ్రాంత ఉపాధ్యాయ సంఘ నాయకులు నరహరి లక్ష్మారెడ్డి, టి. కిషన్ తదితర సాహితీవేత్తలు పాల్గొని సభను విజయవంతం చేశారు.

డాక్టర్ భూoరెడ్డి పార్టీవదేహానికి నివాళులర్పించిన.

డాక్టర్ భూoరెడ్డి పార్టీవదేహానికి నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

ఉత్తర తెలంగాణ జిల్లాల పేదలకు వైద్యసేవలందించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూoరెడ్డి మరణం బాధాకరమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.

మంగళవారం కరీంనగర్ లోని భూంరెడ్డి పార్థివ దేహానికి చాడ వెంకటరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.

భూంరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

డాక్టర్ భూంరెడ్డి వరంగల్ జిల్లాలో పుట్టి వైద్య విద్యనభ్యసించి కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ లో సర్జన్ గా వైద్య సేవలు అందించడానికి వచ్చి ఇక్కడే స్థిరపడి ఎంతోమంది పేదలకు వైద్య సేవలు అందించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, వైద్య వృత్తిలోకి వచ్చే ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడని, వైద్య పరంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలలో పాలుపంచుకొని వైద్య వృత్తిపై, రోగులకు సేవలందించే విధానంపై అందరికీ వివరించేవాడని, వృతి పరంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారని, ఐఎంఏను బలోపేతం చేసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పనిచేశారని,ఆయన ఎనబై ఏళ్ల వయస్సు దాటేంత వరకు కూడా వైద్య సేవలందించిన గొప్ప వైద్యులు భూoరెడ్డి అని అలాంటి డాక్టర్ మృతి చెందడం బాధాకరమని వెంకటరెడ్డి అన్నారు. మృతదేహానికి నివాళ్లర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బ్రామాండ్లపెల్లి యుగేందర్, బూడిద సదాశివ, నాయకులు చెంచల మురళి, తదితరులున్నారు.

నూతన తహసీల్దార్ కు సన్మానం.

నూతన తహసీల్దార్ కు సన్మానం.

పలు సమస్యలు తాసిల్దార్ దృష్టికి తీసుకువచ్చిన జర్నలిస్టులు.

జర్నలిస్టులపై ఫారెస్ట్ దౌర్జన్యం, వెంటనే చర్యలు తీసుకొని జర్నలిస్టుల భూమిని అప్పగించాలని వినతి.

సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన నూతన తహసీల్దార్, రామ్.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

 

మహాదేవపూర్ నూతన తాసిల్దారుగా వై రామారావు బాధ్యతలను స్వీకరించడం తో స్థానిక పాత్రికేయులు తాసిల్దార్ కు సన్మానించడం జరిగింది. శుక్రవారం రోజున మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో వై రామారావు ఖమ్మం జిల్లా మదికొండ మండల తాసిల్దారుగా విధులు నిర్వహిస్తూ బదిలీపై మహాదేవపూర్ తాసిల్దార్ గా వై రామారావు బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ కు, శుభాకాంక్షలు తెలుపుతూ స్థానిక పాత్రికేయులు శాలువతో సన్మానించడం జరిగింది. అనంతరం పాత్రికేయులు నూతన తహసిల్దార్ కు మండలంలోని పలు ప్రధాన సమస్యలలో ఒకటైన భూ సమస్యల పరిష్కారం, రేషన్ కార్డ్, విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభానికి ముందు అందించేలా చూడాలని, మండలంలో పలు భూ సమస్యలపై దృష్టి సాధించి బాధితులకు న్యాయం చేసేలా అధికారులు సిబ్బందికి ఆదేశించాలని కోరడం జరిగింది. అలాగే జర్నలిస్టులకు కేటాయించిన భూమిని ఫారెస్ట్ అధికారులు కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సర్వే పేరుతో కాలయాపన చేసి జర్నలిస్టులకు గూడు కట్టుకోకుండా చేస్తున్నారని, తక్షణమే జర్నలిస్టులకు కేటాయించిన భూమిని జర్నలిస్టులకు అందించేలా చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన నూతన తహసిల్దార్ మండలంలోని సమస్యలపై పరిష్కారం కొరకు సాధ్యమైనంత త్వరలో విచారణ చేసి ప్రజలకు అలాగే పాత్రికేయులకు భూ సమస్య ను పరిష్కా రిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. తహసిల్దార్ కు కలిసిన వారిలో సీనియర్ పాత్రికేయులు, టీ న్యూస్ రిపోర్టర్ సయ్యద్ జమీల్,మిన్నుభాయ్, రిపోర్టర్ లు ఉన్నారు.

తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్ ఘన నివాళి.

తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్ ఘన నివాళి

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద, తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మరియు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప తిరుపతిరెడ్డి,తదితరులు నివాళులు అర్పించారు.

మునీర్ అన్నకు నివాళులు అర్పించిన బెల్లంపల్లి.

మునీర్ అన్నకు నివాళులు అర్పించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు.

బెల్లంపల్లి నేటిధాత్రి:

బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సదానందం ఆద్వర్యంలో కలం యోధుడు ఉద్యమనేత సీనియర్ పాత్రికేయులు దివంగత జర్నలిస్టు మునీర్ అన్నకు బెల్లంపల్లి పాత్రికేయుల నివాళులు అర్పించారు. సోమవారం రోజు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన చిత్ర
పటాన్ని ఏర్పాటుచేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సజ్ను ఫఫీ మాట్లాడుతూ మునీర్ భాయ్ పత్రికా రంగానికి విశేష సేవలు అందించడం తోపాటు కార్మిక వర్గానికి చేసిన సేవ లను గుర్తు చేసుకున్నారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి సదానందం మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వరకు మడమతిప్పని పోరాటాలు చేసిన మహనీయుడని, పత్రికా రంగంలో సీనియర్ పాత్రికేయుడుగా రాణిస్తూ విశ్లేషణాత్మకమైన కథనాలతో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విశేష కృషిని చేయడం జరిగిందని, నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ పత్రికల్లో
బాధ్యతలు స్వీకరించి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలిని ప్రదర్శించి ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా నిలిచిన మునీర్ భాయ్ సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటని ప్రెస్ క్లబ్ కార్యవర్గం కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్ర
మంలో బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ టేకుల బస్తి ఉపాధ్యక్షుడు ఇరుకుల్ల రమేష్,
ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ పాండే,కోశాధికారి కత్తుల నవీన్,కార్య
వర్గ సభ్యులు టి.శ్రావణ్, కె.రమేష్ ,
కె.సాగర్, ఉపాధ్యక్షుడు దండబోయిన భాస్కర్, ప్రధాన కార్యదర్శి సుభాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే జయ రాములు కు ఐక్యవేదిక నివాళులు.

వనపర్తి మాజీ ఎమ్మెల్యే జయ రాములు కు ఐక్యవేదిక నివాళులు

వనపర్తి: నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన దివంగత వనపర్తి
మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయరాములు అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ కృషి తో జయరాములు కుటుంబ సభ్యులు.ప్రజా సంఘాల నేతలు, బీసీ సంఘాలు ఘనంగా నివాళులు అర్పించారు. వర్థంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో, జయరాములు ప్రజాప్రయోజన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు భావోద్వేగంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జయరాములు గారి కుటుంబ సభ్యులతో పాటు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కళాకారుడు రాజారాం ప్రకాష్ బృందం, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, టి జి ఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పా
షా, శంకర్ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, టిడిపి జిల్లా నాయకులు కొత్త గొల్ల శంకర్, జిల్లా నాయకులు బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, నాగరాజు, రామస్వామి, శ్రీను, విజేత రాములు, పెద్దమందడి అధ్యక్షుడు నక్క కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, శ్రీశైలం, శ్రీరంగాపురం మేకల అశోక్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కురుమూర్తి,నాగరాజు, సాయి యాదవ్, మురళీకృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ స్మృతిసభ ద్వారా జయరాములు గారి ప్రజా సేవలు మరింత ముందుకు పోవాలని, ఈ తరం నాయకులకు ఆయన జీవితం స్ఫూర్తిగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు.

నర్సింహారామయ్య ప్రతివాదేహానికి నివాళులు అర్పించిన.

నర్సింహారామయ్య ప్రతివాదేహానికి నివాళులు అర్పించిన మడికొండ బ్రదర్స్

పరకాల నేటిధాత్రి

 

 

పరకాల మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డులో మొలుగురి నర్సింహా రామయ్య అకాలమరణం చెందగా వారి పార్దివదేహాన్ని సందర్శించి, పూలమాలలువేసి,నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ బ్రదర్స్.ఈ కార్యక్రమంలో బొచ్చు భాస్కర్,బొచ్చు బాబు,ఎండీ.నయీమ్ పాషా,కందుకూరి సాగర్,బొచ్చు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా నివాళులర్పించిన.

రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

◆ డా౹౹ఏ.చంద్రశేఖర్,మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని భారత మాజీ ప్రధాని, యువ భారత్ శిల్పి శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్దంతిని పురస్కరించుకుని, కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.,ఈ సందర్భంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.రాజీవ్ గాంధీ భారతదేశానికి నూతన దిశను చూపిన మహానాయకుడు. 21వ శతాబ్దం భారతానికి తగిన సాంకేతికత,ఐటీ విప్లవం, యువతలో నూతన ఆశలు నూరిపోసిన వ్యక్తి. గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం రంగాల్లో ఆయన దూరదృష్టితో అమలు చేసిన పథకాలు ఇవాళా కూడా దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి..
ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ , గ్రామ పంచాయతీ వ్యవస్థను బలపరిచారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆయన కలలను సాకారం చేయడంలో ముందుండి నడుస్తోంది అని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు రాజీవ్ గాంధీ గారి జీవితం, స్వప్నాలు, దేశాభివృద్ధికి చేసిన సేవలపై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ , శ్రీనివాస్ రెడ్డి , రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ, సామెల్ గారు,కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ తిరుపతి రెడ్డి,మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అశోక్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు హుగెల్లి రాములు , శుక్లవర్ధన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్ , జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, ఉదయ్ శంకర్ పాటిల్ మరియు ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్.

పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ (టిఎస్ఎస్ సిసిడిసి)మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జి.శ్రీనివాస్ న్యాయవాది తండ్రి జి.అడివప్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ (టిఎస్ఎస్ సిసి డిసి) మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు. ఈ రోజు వారి ఇంటికి వెళ్లి పార్టీవ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు,నివాళులర్పించిన వారిలో చెంగల్ జైపాల్,దిలీప్,ఉన్నారు.

పత్రికా వేలేఖరి తల్లీ పార్థివదేహానికి చిలువేరు సమ్మి గౌడ్.

పత్రికా వేలేఖరి తల్లీ పార్థివదేహానికి చిలువేరు సమ్మి గౌడ్ నివాళులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కూన శ్రీను, సతీష్ ల మాతృమూర్తి సరోజన మరణించగా వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఘన నివాళులర్పించారు.సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి వారిని ఓదార్చి మనో ధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో కొండేటి కళాధర్,ఎసల్ల సత్యనారాయణ, మోరపాక జగన్, చంద్రగిరి వంశీకృష్ణ, గాజుల రవి, కమటం స్వామి కొంతం రవి తదితరులు ఉన్నారు.

హిందూ జాగృతి లింగంపల్లి ఆధ్వర్యంలో.!

హిందూ జాగృతి లింగంపల్లి ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు ఘన నివాళి…

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

కాశ్మీర్ పహాల్గాం లోని ఉగ్రవాదుల దాడిలో అమరులైన పర్యాటకులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ.. హిందూ జాగృతి లింగంపల్లి ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు ఘన నివాళులు అర్పించారు. గోపినగర్ హనుమాన్ దేవాలయం నుండి.. చందానగర్ శ్రీదేవి థియేటర్ వద్ద నుండి.. పీజేఆర్ స్టేడియం నుండి వేరువేరుగా ప్రారంభమైన మూడు శాంతి ర్యాలీలు బిహెచ్ఇఎల్ చౌరస్తా వరకు చేరుకున్నాయి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హిందువులు అక్కడ కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించి పహల్గాం మృతులకు నివాళులు అర్పించారు. ఈ ర్యాలీలో సంఘ్ పరివార్ కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు, పతంజలి యోగ సమితి సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని ఉగ్రవాదుల దుశ్చర్యపై మండిపడ్డారు.

Pahalgam

పాకిస్తాన్ ద్వంద్వ నీతి పై ద్వజమెత్తారు. హిందువా కాదా అని తెల్చుకొని మరి కాల్చి చంపడం అమానుషమని అన్నారు. హిందూ దేశంలో హిందువులకే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న పశ్చిమ బెంగాల్లో హిందువులను తమ స్వస్థలాల నుండి తరిమి కొట్టారని.. ఈరోజు కాశ్మీర్ లోని పహాల్గంలో ఏకంగా పేర్లు అడిగి, కల్మా చదివించి, దుస్తులు విప్పదీసి మరి హిందువులపై దాడి చేయడాన్ని ప్రపంచం మొత్తం చూసిందని వాపోయారు. సమాజంలోని ప్రతి వర్గం వారు ఈ దుశ్చర్యను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పాకిస్తాన్ కు తగిన గుణపాఠం నేర్పించాలని మళ్లీ భారత్ వైపు కన్నెత్తి చూడకుండా వెన్నులో వణుకు పుట్టించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

అంబేద్కర్ గారికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ.

జహీరాబాద్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జహీరాబాద్ పట్టణంలో డా౹౹బాబా సాహెబ్ అంబెద్కర్ జయంతి ఉత్సవ కమిటీ వారు నిర్వహించిన డా౹౹బాబా సాహెబ్ అంబెద్కర్ జయంతి ఉత్సవ సభకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈసందర్భగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ..ఆర్థికవేత్త రాజా నీతిజ్ఞుడు భారత రాజ్యాంగ రూపకర్త మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి జహీరాబాద్ పట్టణంలో పూలమాలవేసి నివాళులర్పించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.యావత్ భారత్ మొత్తం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని ఈ సందర్భంగా కోరుకున్నారు.ఈకార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్.కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,మాజీ జెడ్పీటీసీలు రాందాస్,నరేష్,మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి,మాజీ కౌన్సిలర్లుశేఖర్,తాహేరా బేగం,మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాల్కల్ మండల అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ గౌడ్,మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ అక్బర్,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్,మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు జావిద్,హర్షద్ పటేల్,అశ్విన్ పాటిల్,తాహేర్ పాటిల్,కె.జగదీశ్వర్ రెడ్డి,రాజు నాయక్,సునీల్,నర్సింహా యాదవ్,అక్షయ్ జాడే,రాజు,జహీర్ అరబ్బీ,ప్రమోద్, జగదీష్,మోహిన్,నిజాం మరియు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు,మాజీ సర్పంచ్ లు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళి.

జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళి

పరకాల నేటిధాత్రి

మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా బిఆర్ఎస్ పట్టణ సీనియర్ నాయకులు శనిగరపు నవీన్, గొర్రె రాజు,పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి దుప్పటి సుజయ్ రణదేవ్,సీనియర్ నాయకులు మార్క రఘుపతి,మొలుగూరి శ్రీనివాస్,మక్సుద్,పెర్వల రమేష్ పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ

ఆధునిక యుగంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన సామాజిక విప్లవ యోధుడు,సత్య శోధక సమాజ్ వ్యవస్థాపకుడు,ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే సామాజిక భావనను పెంపొందించిన దార్శనికుడు అని అన్నారు.జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు.

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ ఘన నివాళి.

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ ఘన నివాళి
సిరిసిల్ల, ఏప్రిల్ -11(నేటి ధాత్రి):

 

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, డీపీఆర్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమకారుడికి నివాళిర్పించిన పెద్ది.

తెలంగాణ ఉద్యమకారుడికి నివాళిర్పించిన పెద్ది

కొత్తగూడ, నేటిధాత్రి:

 

తెలంగాణ ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తొట్టి సత్యంగారి కుటుంబాన్ని పరామర్శించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కొత్తగూడ మండలం పొగల్లపల్లి గ్రామ బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు తొట్టి సత్యం ఈరోజు అనారోగ్యంతో మృతి చెందగా వారి భౌతిక ఖా యాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు తొట్టి సత్యం తెలంగాణ ఉద్యమాకారుడుగా రాష్ట్ర సాధనలో మరియు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు ఈరోజు వారి మృతి పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని అన్నారు
ఆయన వెంట లో మండల పార్టీ అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు, మల్లయ్య మాజీ సర్పంచ్, భానోత్ వీరన్న, అజ్మీర రవి, మాజీ పడాల నాగేశ్వరరావు, ఎంపిటిసిలు బంగారు నారాయణ, ననుబోతుల స్వప్న లింగన్నయాదవ్,దానం నారాయణ, గుల్లపల్లి శీను , మండల్ నాయకులు కొనకంచి నాగమల్లేశ్వరరావు, నామోజు కనకాచారి, కావట్టి సతీష్ మల్లేష్ యాదవ్, కొలిపాక సదానందం, కత్తుల కుమారస్వామి, సంఘీ కుమారస్వామి ,భూక్య సంతోష్, నామోజు కనకాచారి గుంటుక యాకయ్య పల్లె శివ భైరబోయిన చిరంజీవి బోయిని భద్రయ్య ఆగబోయిన రాజయ్య మల్లేష్ యాదవ్ బండి లింగయ్య భైరబోయిన బుచ్చి రాములు బత్తుల ఉత్తరయ్య , పోతుగంటి రామాచారి, వేణు వంక కొమ్మలు, బోళ్ల యాకయ్యతో ,పాటు మండల నాయకులు పాల్గొన్నారు…

వైద్య సిబ్బందికి ఘన సన్మానం.

వైద్య సిబ్బందికి ఘన సన్మానం

రామడుగు, నేటిధాత్రి:

 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం భారత రాష్ట్ర సమితి యూత్ రామడుగు మండల ఉపాధ్యక్షులు బుదారపు కార్తీక్ ఆధ్వర్యంలో గోపాలరావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య రంగ నిపుణులకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈసందర్భంగా బుదారపు కార్తీక్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వ్యాయామ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుద్ధత పాటించాలని డాక్టర్ల సూచనలేని అనవసరమైన మందులను ఎట్టి పరిస్థితుల్లో వాడ రాదని తమ ఆరోగ్యాల పట్ల ఎవరికి వారు శ్రద్ధ వహించాలని కోరారు. ఈసందర్భంగా ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న వైద్య సిబ్బందిని సన్మానిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారి వెంకట గ్రీష్మన్య, వెంకటేశ్వర్లు, కొలిపాక కమలాకర్, స్వామి, పురాణం రమేష్, తిరుపతి, నరేందర్, శ్రీధర్, కొమురయ్య, శివశంకర్, నాగరాజు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

డా; బాబా జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించిన.!

డా; బాబా జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

డా; బాబా జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు. 

MLA.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల నేత, దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, దేశ మాజీ ఉప ప్రధాని ‘బాబూజీ’ అని అన్నారు.ఎమ్మెల్యే గారితో పాటుగా న్యాల్కల్ మండల జెడ్పీటీసీ స్వప్న భాస్కర్,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిమ్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహిద్దీన్,మాజి మొగుడంపల్లి మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు సురేష్,మాజి సర్పంచ్ లు విజయ్ , జగ్దిష్,దేవదాస్,యువ నాయకులు మిథున్ రాజ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,గణేష్, చంద్రయ్య,వినోద్,ప్రభాకర్,దీపక్,శంత్ కుమార్,నగేష్,ప్రవీణ్ మెస్సీ,తదితరులు పాల్గొన్నారు.

ఉమామహేశ్వర స్వామిఉత్సవ నూతన కమిటీ ఎన్నిక. 

ఉమామహేశ్వర స్వామిఉత్సవ నూతన కమిటీ ఎన్నిక. 

అధ్యక్షులుగా పేర్వాల రత్నాకర్ రావు

నడికూడ,నేటిధాత్రి మండలంలోని కౌకొండ గ్రామ

శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థాన ఉత్సవ నూతనకమిటీని శనివారం రోజున ఎన్నుకున్నారు.కమిటీ అధ్యక్షులుగా పేర్వాల రత్నాకర్ రావు, ఉపాధ్యక్షులుగా దౌల్తాబాజి రాజేశ్,ఇల్లందుల నాగరాజు, ప్రధానకార్యదర్శిగా
గురిజాల తిరుపతి, సహాయకార్యదర్శిగా
గోల్కొండ రాకేష్,కోశాధికారి
రుషాగాని శ్యామారావు, గౌరవసలహాదారులుగా లింగాల తిరుపతి,
దౌల్తాబాజి చందర్ రావ్, గుబిరె సుధాకర్ రావు, దంచనాల కర్నాకర్,దౌల్తాబాజి రాజేందర్,ప్రచార కార్యదర్శులుగా
సోషల్ మీడియా
పేర్వాల ప్రవీణ్
పేర్వాల హరీష్ రావు,కమిటీ సభ్యులుగా ముక్కెర చిరంజీవి,పేర్వాల బాలకిషన్, పేర్వాల రామారావు, దౌల్తాబాజి వినయ్ కుమార్,మేకల శ్రీకాంత్,గైకోటి అన్వేష్,గురిజాల రామ్ నిఖిల్,
మోర్తాల కార్తీక్ (మున్నా), అల్లే తరుణ్,గోల్కొండ నిఖిల్,గోల్కొండ నాగచైతన్య
లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఓదేలు మృతదేహానికి నివాళులర్పించిన రంజిత్ రెడ్డి.

ఓదేలు మృతదేహానికి నివాళులర్పించిన రంజిత్ రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు గాండ్ల ఓదెలు గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతిచెందగా విషయం తెలుసుకున్న నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ఓదేలు మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల ప్రసాద్, గుండ్రపల్లి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శివకుమార్, కాంగ్రెస్ మండల నాయకులు రావుల మైపాల్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, కనపర్తి రమేష్, ఇటికల సంజీవయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version