జాతీయ నులు పురుగుల నిర్మూలన దినము *
మహాదేవపూర్ఆగస్టు12(నేటి ధాత్రి )
కేంద్రం అంబటిపల్లి వైద్యురాలు కళ్యాణి గారి ఆదేశానుసారంగా డాక్టర్ జగదీష్ గారి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినమును పురస్కరించుకొని అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రైవేటు పాఠశాలలు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం, ఆశ్రమ పాఠశాలలో అదేవిధంగా అంగన్వాడి కేంద్రాలలో ఉన్న పిల్లలకు 1 నుండి 19 వయస్సు కలిగిన పిల్లలందరికీ నులిపురుగుల నివారణ కొరకై ఆల్బెండజోల్ మాత్రలు ప్రతి పిల్లవాడికి వేయాలని సంకల్పంతో చేపట్టిన కార్యక్రమంలో డాక్టర్ జగదీష్ ఖన్నా వైద్య ఆరోగ్య సిబ్బందితో సూరారం పాఠశాలలను స్వయంగా పాల్గొని నులిపురుగుల అవగాహన కల్పించారు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత సక్రమంగా లేనట్లయితే ముఖ్యంగా ఒకటి నుండి 19 సంవత్సరాల పిల్లల కడుపులో నులిపురుగులు దారపు పొట్టలో చేరి రక్తహీనతకు గురవుతారు. నులి పురుగులు
కొంకి పురుగులు కొరడ పురుగులు బద్దల పురుగులు బద్దె పురుగులు ఎలుక పురుగులు
దారపు పురుగులు ఇలా అనేక రకాల పురుగులు మీ అశుభ్రత లోపం వలన మీలోకి ప్రవేశించి అనారోగ్యానికి గురిచేస్తాయి కావున వ్యక్తిగత పరిశుభ్రత హ్యాండ్ వాష్ చేతులు కడుక్కునే విధానం బహిర్భూమికి వెళ్లినప్పుడు ఆటలాడినప్పుడు భోజనానికి ముందు తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి ప్రతిపక్షం రోజుల్లో చేతి గోర్లు కత్తిరించుకోవాలి ఉదయం సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పరిసరాల పరిశుభ్రంగా ఉండాలి ఆరు బయట బహిర్భూమికి వెళ్ళకుండా మరుగుదొడ్లను వాడాలని అవగాహన చేపించి ఆల్బెండజోల్ మాత్రలు వేయించడం జరిగినది.
సూరారం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి హెచ్ఈఓ సోనాజి ఏఎన్ఎం కనకదుర్గ ఆశ వర్కర్లు అంగన్వాడి వర్కర్లు తదితరులు పాల్గొన్నారు