పాత బస్తీలోని సూరం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. అందుకనే ఈ కాలేజీని కూల్చివేయడానికి ఆలోచిస్తున్నామని ఏపీ రంగానాథ్ స్పష్టత ఇచ్చారు.
పాతబస్తీలోని సూరం చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఫాతిమా కాలేజీని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్మించారు. అయితే ఈ కాలేజీని ఎందుకు కూల్చడం లేదని ప్రతిపక్షాలు హైడ్రా అధికారులని ప్రశ్నిస్తున్నారు. సామాన్యులకు ఒక న్యాయం, ఒవైసీకి ఒక న్యాయమా అంటూ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఫాతిమా కాలేజీ గురించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగానాథ్ (AV Ranganath) స్పందించారు. ఈ కాలేజీని ఎందుకు కూల్చి వేయడం లేదనే దానిపై క్లారిటీ ఇచ్చారు ఏవీ రంగానాథ్.
ఒవైసీ కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదని ఇప్పుడు అందరూ తమని అడుగుతున్నారని ఏవీ రంగానాథ్ అన్నారు. ఈ కాలేజీ ఎఫ్‌టీఎల్‌లో నిర్మించినందున గత ఏడాది సెప్టెంబర్‌లో తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పామని గుర్తుచేశారు. కానీ పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ కాలేజీలో 10,000 మందికి పైగా బాలికల నుంచి యువతుల వరకు విద్యను అభ్యసిస్తున్నారని గుర్తుచేశారు. పేద ముస్లిం మహిళలను వెనుక బాటుతనం నుంచి ఒవైసీ కాలేజీ విముక్తి కల్పిస్తోందని అన్నారు. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కావడంతోనే దానిపై చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు ఏవీ రంగానాథ్.
ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశామని ఏవీ రంగానాథ్ తేల్చిచెప్పారు. 25 ఎకరాల సరస్సును ఫ్లాట్‌గా మార్చిన ఒవైసీ కుటుంబానికి చెందిన సన్నిహితుడు కట్టడాలను కూడా కూల్చివేశామని గుర్తుచేశారు. మజ్లిస్ నాయకుల నుంచి దాదాపు రూ. 1,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నామని వెల్లడించారు. చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. సామాజిక కారణాలతోనే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేశామని అన్నారు . సామాజిక స్పృహతో ఈ కాలేజీ నడుస్తోందని.. అందుకే కూల్చివేయడానికి కాస్త ఆలోచిస్తున్నామని ఏపీ రంగనాథ్ పేర్కొన్నారు
స్టేషన్ మొత్తం కనిపించేలా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సర్టిఫై చేస్తూ ఎస్‌డీపీవోలు(డీఎస్పీలు) ఇచ్చిన నివేదికలపై హైకోర్టు ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది.
స్టేషన్ మొత్తం కనిపించేలా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సర్టిఫై చేస్తూ ఎస్‌డీపీవోలు(డీఎస్పీలు) ఇచ్చిన నివేదికలపై హైకోర్టు ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఎస్‌డీపీవోలందరూ ఒకే ఫార్మాట్‌లో నివేదికలు ఎలా సమర్పించారని ప్రశ్నించింది. కొన్ని జిల్లాల నివేదికలపై సంబంధిత జిల్లాల నోడల్ అధికారుల సంతకాలు లేవని, వారి బదులు ఇతర అధికారులు సంతకాలు చేశారని తెలిపింది. మంగళవారం ఓ హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా విజయవాడ మూడవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నివేదికను ధర్మాసనం ప్రస్తావించింది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఒక సీసీ కెమెరా మాత్రమే ఉన్నట్లు మేజిస్ట్రేట్ నివేదికలో పేర్కొన్నారని గుర్తుచేసింది. అయితే, స్టేషన్‌ను వ్యక్తిగతంగా తనిఖీ చేసి ఠాణా మొత్తం కవర్ అయ్యేలా సీసీకెమెరాలు ఏర్పాటు చేసినట్లు విజయవాడ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సర్టిఫై చేస్తూ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారని తెలిపింది. పరస్పర భిన్న నివేదికల నేపథ్యంలో ఎస్‌డీపీవోలు సమర్పించిన నివేదికల వాస్తవికతను తేల్చేందుకు అడ్వొకేట్ కమిటీని ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది.
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పోలీసుస్టేషన్లలో పర్యటించి రాణాలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? స్టేషన్ మొత్తం కనిపించేలా ఏర్పాటు చేశారా?లేదా? తదితర అంశాలపై కమిటీ నుంచి నివేదిక కోరతామని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్ని స్టేషన్లలో సీసీకెమెరాలు ఏర్పాటు చేయలేదో వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ)ని ఆదేశిస్తూ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ జగడం సుమతితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2019లో న్యాయవాది తాండవ యేగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ఆ మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2019 జూలై 15న ఆదేశాలిచ్చింది. ఏళ్లు గడుస్తున్నా ఉత్తర్వులు అమలుకాకపోవడంతో యోగేష్ 2022లో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పల్నాడుజిల్లా, మాచవరం పోలీసులు తన సోదరుడు గోపిరాజును అక్రమంగా నిర్బంధించారంటూ కటారు నాగరాజు గతేడాది నవంబరులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు రాగా న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ… సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సీసీకెమెరాల ఏర్పాటు జరగలేదన్నారు. రాష్ట్రంలో 1392 పోలీసుస్టేషన్లు ఉండగా, 1001 పోలీసుస్టేషన్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) టి.విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ… సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లాక్‌పలు ఉన్న అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం).. మార్కెట్లోకి సరికొత్త ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ రెవ్‌ఎక్స్ సిరీస్ కారును విడుదల చేసింది. మొత్తం…
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం).. మార్కెట్లోకి సరికొత్త ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ రెవ్‌ఎక్స్ సిరీస్ కారును విడుదల చేసింది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనున్న ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.8.94 లక్షలు (ఎక్స్‌షోరూమ్). రెవ్‌ఎక్స్ సిరీ్‌సతో ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ పోర్టుఫోలియో మరింత బలోపేతమవుతుందని కంపెనీ పేర్కొంది. 1.2 లీటర్ ఎంస్టాలియన్ టీసీఎంపీఎ్‌ఫఐ ఇంజన్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, హిల్ హోల్డ్ కంట్రోల్, 4 డిస్క్ బ్రేక్స్‌తో ఈ కారును తీసుకువచ్చింది.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఏఎంపీఎల్)కు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి మరో భారీ ఆర్డర్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి…
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఏఎంపీఎల్)కు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి మరో భారీ ఆర్డర్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్డర్ విలువ రూ.1,800 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని కంపెనీ డైరెక్టర్ అతిమ్ కాబ్రా సూచనప్రాయంగా వెల్లడించారు. ఆత్మ నిర్బర్ భారత్‌లో భాగంగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన 230 సుఖోయ్-30 యుద్ధ విమానాల ఆధునీకరణతో పాటు పెద్దఎత్తున క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ (క్యూఆర్‌ఎ్‌సఏఎం) అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన కీలక ఎలకా్ట్రనిక్ ఉపకరణాల సరఫరా కాంట్రాక్టు తమకు దక్కే అవకాశం ఉందని కాబ్రా తెలిపారు. కాగా కంపెనీ ఇప్పటికే విరూపాక్ష రాడార్ కార్యక్రమంలో కీలకంగా ఉంది.
8 గంటల కన్నా ఎక్కువగా కూర్చొని పనిచేస్తున్నారా? జాగ్రత్త..
చాలా మంది ఆఫీసులో గంటల తరబడి కుర్చీలపై కూర్చుని స్క్రీన్‌ను చూస్తూ ఉంటారు. అయితే, ఇలా ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల మన ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నేటి డిజిటల్ ప్రపంచంలో చాలా మంది ఉద్యోగులు రోజంతా కూర్చొని పనిచేస్తున్నారు. అయితే, అదే పనిగా ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తే ప్రాణాలకే పెను ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు కూడా రోజంతా కూర్చుని పనిచేసే వారే అయితే మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. లేదంటే అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అయితే, 8 గంటల కన్నా ఎక్కువగా కూర్చొని పనిచేస్తే ఏ వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె జబ్బులు
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. అదే పనిగా కూర్చోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కేలరీలు బర్న్ కావు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. ఊబకాయం క్రమంగా మధుమేహం, గుండె జబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును పెంచుతుంది. వెన్నునొప్పి, కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఇది దీర్ఘకాలిక నొప్పికి దారితీస్తుంది.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ పెరుగుతుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎండార్ఫిన్ హార్మోన్ల స్రావం తగ్గుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీనితో పాటు, నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. అలసట, చిరాకును పెంచుతుంది.
ఈ ప్రమాదం ఎందుకు పెరుగుతోంది?
కంప్యూటర్లు, మొబైల్స్, టీవీ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల శారీరక కార్యకలాపాలు తగ్గాయి. వర్షాకాలం వంటి సీజన్లలో బయటకు వెళ్లడం మరింత తగ్గుతుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. అయితే, ఈ జీవనశైలి క్రమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మానసిక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.
ఏం చేయాలి?
ప్రతి 30-40 నిమిషాలకు లేచి 2-3 నిమిషాలు నడవండి. ప్రతిరోజూ 30 నిమిషాలు వాకింగ్ చేయండి. మీ వెన్నెముకకు మద్దతు ఇచ్చే కుర్చీలో నిటారుగా కూర్చోండి. తగినంత నీరు తాగండి. ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోండి. ఈ చిన్న మార్పులు మీరు ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి సహాయపడతాయి.
నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,600 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,840 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,130 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
బంగారానికి మహిళలకు కొన్ని వేల ఏళ్ల నుంచి అవినాభావ సంబంధం ఉంది. ఆడవాళ్లు తమ దగ్గర ఎంత బంగారం ఉన్నా.. ఇంకా కావాలంటారే తప్ప వద్దు అనరు. శుభకార్యాల్లో బంగారం విషయాలే ప్రధాన టాపిక్ అవుతాయి. భారతీయ సంస్కృతిలో ఓ భాగం అయిన బంగారం ధరలు పేద, మధ్య తరగతి వాళ్లకు షాక్ ఇస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 99వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్ మహా నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,600 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,840 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,130 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,850 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,610 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,140 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీలో తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసికి టాప్ సీడింగ్ దక్కింది. ఉజ్బెకిస్థాన్‌లో సెప్టెంబరు 3 నుంచి 16 వరకు పోటీలు జరగనున్నాయి. వరల్డ్ చాంపియన్ గుకేష్ దొమ్మరాజు రెండో సీడ్, ప్రజ్ఞానందకు నాలుగో సీడ్ అభించింది. మహిళల విభాగంలో కోనేరు హంపి, డిఫెండింగ్ చాంప్ వైశాలి బరిలో నిలవనున్నారు.
హెచ్చుమీరుతున్న రుణ యాప్‌ల ఆగడాలు.. బలైతున్న జీవితాలు ……!!!!
జహీరాబాద్ నేటి ధాత్రి:
రుణ యాప్‌ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. యాప్ నిర్వహకులు వివరాలు నమోదు చేసుకుని లోన్ తీసుకునే వరకు.. ప్రజలతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. వారి తీరు నమ్మి మోసపు ఊబిలో చిక్కుకున్న బాధితులకు అందులోంచి రావటం కష్టంగా మారుతోంది. లోన్‌గా ఇచ్చిన నగదు కంటే రెట్టింపు సొమ్ము వసూలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
రుణ యాప్‌ల ఆగడాలు
రాష్ట్రంలో పెరిగిపోతున్న రుణ వేధింపులు
డిజిటల్ రుణ యాప్‌ల ఆగడాలు ఇటీవల కాలంలో హెచ్చుమీరుతున్నాయి. అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేని వారిని యాప్ నిర్వాహకులు.. మానసికంగా వేధిస్తున్నారు. రుణాలు తీసుకుని చెల్లించలేని వారు.. రుణ యాప్‌ల బ్లాక్ మెయిలింగ్‌ను భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.
యాప్ డౌన్‌లోడ్ చేసి వివరాలు పొందుపరిస్తే చాలు.. క్షణాల్లో లోన్ ఇస్తామంటూ రుణ యాప్ నిర్వాహకులు మొదట్లో ఆకర్షిస్తున్నారు. వారి మాటలు నమ్మి వివరాలు నమోదు చేసి లోన్ తీసుకున్న తర్వాత.. వారి ఆగడాలను బయట పెడుతున్నారు. ఇచ్చిన డబ్బు కంటే రెట్టింపు వసూలు చేస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డబ్బు కట్టలేని వారిని మానసికంగా వేధిస్తున్నారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల గొల్లపూడికి చెందిన ఓ యువకుడు రుణయాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
“పదో తేదీన మా ఖాతాలో నగదు జమా చేశారు. మళ్లీ 23 వ తేదీన తిరిగి చెల్లించమని ఫోన్ చేశారు. అప్పుడు అడిగిన మొత్తం వారికి తిరిగి చెల్లించాము. మళ్లి రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి ఇంకా కొన్ని డబ్బులు చెల్లించమని ఫోన్ చేశారు. నగదు లేవని చెప్పటంతో అసభ్యకరమైన ఫోటోలు పంపిస్తున్నారు.” -దేవి, బాధితురాలు
ఆన్‌లైన్ రుణాల పేరుతో పేద మధ్య తరగతి ప్రజలకు ఎర వేస్తున్న నిర్వాహకులు వాటిని తిరిగి చెల్లించకపోతే నరకం చూపిస్తున్నారు. కీలక నిందితులు చైనా, మలేషియా దేశాలకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. నాన్ బ్యాంకింగ్ యాప్‌లను వినియోగించేటప్పుడు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపులపై.. 14440 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
“గత నాలుగు సంవత్సరాలు లోన్ యాప్స్ బాధితులు పెరిగిపోతున్నారు. కొత్త కొత్త కంపెనీలు ప్లే స్టోర్‌లో యాప్ తీసుకువచ్చి.. వాటిని ప్రాచూర్యంలోకి తీసుకువచ్చి వల వేస్తున్నాయి. చాలా వరకు సైబర్ మోసాలకు పాల్పడే వారు తప్పుడు బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నారు. వారిని అంత సులభంగా ట్రాక్ చేయటం కష్టంగా ఉంటోంది.”
ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇంకా, ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. అయితే, ఉల్లిపాయలే కాదు.. దాని రసం కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని మీకు తెలుసా? ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉల్లిపాయ రసం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. జుట్టు పెరుగుదల, చర్మ సంరక్షణ, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
చర్మ సంరక్షణ:
ఉల్లిపాయ రసం చర్మం టోన్‌ను మెరుగుపరుస్తుంది. మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
రోగనిరోధక శక్తి:
ఉల్లిపాయ రసం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం.
జుట్టు పెరుగుదల:
ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది చుండ్రును నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు అవసరమైన సల్ఫర్‌ను అందిస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యం:
ఉల్లిపాయ రసం రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు:
ఉల్లిపాయ రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
జీర్ణక్రియ:
ఉల్లిపాయ రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉల్లిపాయ రసం శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కింగ్‌డమ్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు విజయ్ దేవరకొండ. ‘లైగర్’ సినిమా సమయంలో ఉపయోగించిన ‘ది’ ట్యాగ్, ఆ సందర్భంగా జరిగిన రచ్చపై వివరణ ఇచ్చారు. ‘నాకు ఏదో ఒక ట్యాగ్ ఇవ్వాలని దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. అది నాకిష్టం లేదు. ఫ్యాన్స్ నాపై చూపించే ప్రేమ, అభిమానాలే నాకు చాలు. వారు నన్ను నా నటనతో గుర్తుంచుకోవాలని కోరుకుంటాను. రౌడీ, సదరన్ సెన్సేషన్ ట్యాగ్‌లతో ప్రేక్షకులు నన్ను పిలిచినా నేను వాటిని అంగీకరించలేదు. దాంతో ‘లైగర్’ సినిమా ప్రచారంలో చిత్రబృందం ‘ది’ అనే ట్యాగ్‌ను జోడించింది. అయితే ఆ ట్యాగ్ ఎవరికీ లేకపోవడంతో అంగీకరించాను. కానీ తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. వెంటనే ఆ ట్యాగ్‌ను తొలగించాలని నా టీమ్‌ని ఆదేశించాను’ అని తెలిపారు. ఇక ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో సపోర్ట్ లేకపోతే, ఏదైనా స్ర్కిప్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు..ఇది బాగోలేదు, ఈ స్ర్కిప్ట్ నేను చేయలేను, ఇంకా మెరుగుపర్చాలి అని చెప్పలేం. అదే ఇండస్ట్రీలో సపోర్ట్ ఉన్న నా సమకాలీన నటుడికే ఈ అవకాశం వస్తే, వెంటనే ఆ స్ర్కిప్ట్ చేయనని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు’ అని విజయ్ వ్యాఖ్యానించారు.
విశ్వనాయకుడి కూతురు శ్రుతీహాసన్ (Shruti Haasan) అభిమానులకు షాక్ ఇచ్చారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలతోపాటు సినిమాల విశేషాలు ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు శ్రుతి హాసన్ తెలిపారు. సోమవారం ఇన్‌స్టాలో తన పాలోవర్స్‌ను ఉద్దేశించి ఆమె ఓ పోస్ట్ చేశారు. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాననీ, నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాని చెప్పారు.
దీంతో అభిమానులు కాస్త షాక్ అయ్యారు. ఎందుకు ఇలాంటినిర్ణయం అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రుతి హాసన్ రజనీకాంత్ ‘కూలీ’లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రధారులు. అన్నీ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మాదక ద్ర వ్యాల వినియోగం కేసులో గత నెలలో అరెస్టయి జైలులో ఉన్న శ్రీకాంత్, కృష్ణలకు బెయిలు మంజూరైంది
మాదకద్రవ్యాల కేసులో నటులు శ్రీరామ్ శ్రీకాంత్ (Sriram Srikanth), కృష్ణ (krishna)లకు నిబంధనలతో కూడిన బెయిలు మంజూరైంది. మాదక ద్ర వ్యాల వినియోగం కేసులో గత నెలలో అరెస్టయి జైలులో ఉన్న శ్రీకాంత్, కృష్ణ తమకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లు సోమవారం న్యాయమూర్తి నిర్మల్ కుమార్ విచారించారు.
ఈ కేసులో మొదటి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నటుడు శ్రీకాంత్ను అరెస్ట్ చేశారని, అరెస్ట్ చేసిన సమయంలో శ్రీకాంత్ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోలేదని శ్రీకాంత్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కృష్ణకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో మాదకద్రవ్యాలు వినియో గించినట్లు నిరూపణ కాలేదని కృష్ణ తరఫు న్యాయవాది వివరించారు.
అయితే.. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన AIADMK మాజీ నేత నిందితుల వాంగ్మూలం ఆధారంగా శ్రీకాంత్, కృష్ణలను అరెస్ట్ చేసినట్లు, వారికి బెయిలు మంజూరు చేయరాదని పోలీసుల తరపు న్యాయవాది కోరారు. వాదనల అనంతరం శ్రీకాంత్, కృష్ణ బెయిలుపై తీర్పును న్యాయమూర్తి, మంగళవారానికి వాయిదా వేశారు.
దీంతో.. మంగళవారం న్యాయమూర్తి వారికి బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.10 వేల సొంత పూచీకత్తు, అదే మొత్తంలో ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరై సంతకం చేయాలని న్యాయమూర్తి నిబంధనలు విధించారు.
జర్నలిజంలో, సేవా కార్యక్రమంలో ముందు వరసలో “వెంకటస్వామి”.
వైస్ ఛాన్స్లర్ కే.వెంకటేష్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం.
“వెంకటస్వామి” కి అభినందనలు తెలిపిన “వక్కల” శ్రేయోభిలాషులు.
“నేటిధాత్రి”,హనుమకొండ:
హనుమకొండ జిల్లాలోని నారాయణగిరి గ్రామానికి చెందిన వక్కల వెంకటస్వామికి విశిష్ట గౌరవంగా డాక్టరేట్ అవార్డు లభించింది. గత రెండు దశాబ్దాలకు పైగా ప్రజల సమస్యలను సమర్థవంతంగా వెలికి తీసే నిబద్ధతతో జర్నలిస్టుగా, సంపాదకునిగా పనిచేస్తూ సామాజిక హితాన్ని లక్ష్యంగా చేసుకొని సేవలందిస్తున్నారు.
వెంకటస్వామి అనేక సంవత్సరాలుగా తనకు అందిన సమాచారాన్ని, నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ, అవినీతి, అక్రమాలపై స్పష్టమైన వైఖరితో శబ్దం లేని వేదనకు స్వరం లాంటి పాత్ర పోషిస్తున్నారు. ఆయన నిర్వహిస్తున్న పత్రిక, వార్తా వ్యవస్థలు నిస్వార్థంగా ప్రజల తరపున నిలబడి ధైర్యంగా సమస్యలను వెలికి తీయడంలో ముందుండుతున్నాయి.
కేవలం జర్నలిజంతోనే కాక, “నా వివేకం” అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనాధలు, వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు తనవంతుగా సేవలందిస్తూ, తన సామర్థ్యాన్ని మానవత్వ సేవకే అంకితం చేశారు. విద్యా సామగ్రి, దుస్తులు, ఆహార సరఫరా సహా ఇతర అవసరాల విషయాల్లో సహకారం అందిస్తూ నిస్వార్థ సేవా మార్గంలో పయనిస్తున్నారు. యువతలో సామాజిక చైతన్యం కలిగించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. వారి మాటలు, ఆచరణలు ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
ఈ సేవలను గుర్తించి, అమెరికాలోని డెలివేర్ రాష్ట్రానికి చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు వక్కల వెంకటస్వామికి గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. చెన్నైలోని భారతీయ విద్యా భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చిన అతిథుల సమక్షంలో వైస్ ఛాన్సలర్ కే.వెంకటేష్ చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డును అందించారు.
వెంకటస్వామి చేసిన సేవలు గ్రామీణ ప్రాంతాలలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒక పక్షపాత రహిత ప్రజాప్రతినిధిగా, సామాజిక సేవా పథంలో అగ్రగామిగా ఆయన చేసిన కృషికి గౌరవంగా లభించిన ఈ పురస్కారం ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిందని పలువురు అభినందించారు.
-అర్హులైన పేదలందరికీ తొలి విడతలో అందుతున్న ఇండ్లు.
-ఈ ఏడాది లక్షకు పైగా ఇందిరమ్మ ఇండ్లు.
-నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు.
-ఏటా 22 వేల కోట్ల ఖర్చుతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు.
-పల్లె పల్లెలో పండుగ వాతావరణం.
-ఇంటి ముగ్గులతో సుందరశోభితం.
-ఇళ్లంటేనే ఇందిరమ్మ రాజ్యం.
-పేదింటి కల నెరవేర్చేదే ప్రజా ప్రభుత్వం.
-ఎన్నికల ముందు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు.
-తొలి ఏడాది లక్ష ఇండ్లకు శ్రీకారం.
-పేదలందరికీ ఇండ్లు కాంగ్రెస్ పార్టీకే సాధ్యం.
-పదేళ్ల ముందు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ.
-తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇండ్లు ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.
-సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శీనన్నకు ప్రజల ధన్యవాదాలు.
-కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా మారుతున్న పల్లెలు.
హైదరాబాద్,నేటిధాత్రి:
పెళ్లి చేసి చూడు..ఇల్లు కట్టి చూడు అని పెద్దలన్నారు. ఆ రెండు ఎంతో కష్టతరమైనవి. ఖర్చుతో కూడుకున్నవి. అందుకే ఈ మాట పెద్దలు చెప్పారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే జీవితాంతం కష్టపడిన సొమ్మును పొదుపు చేసి చేయాలి. అలాగే ఇల్లు కట్టుకోవాన్నా సరే అప్పు చేసినా జీవితాంతం తీర్చాలి. ఈ మాట పాత రోజుల్లోనే అంత గంభీరమైంది అంటే..ఇప్పుడు ఎంత కష్టతరమైందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్దితుల్లో సామాన్యులు ఓ యాభై గజాల స్ధలం కొనుగోలు చేసుకునే పరిస్తితి లేదు. ఓ వంద గజాలు కొనుక్కొవాలంటే లక్షాదికారులకు సాధ్యం. అలాగే తాతల తరం నుంచి ఇంత స్ధలం వున్నా, ఇప్పుడున్న పరిస్టితుల్లో ఇల్లు కట్టుకోవడం సామాన్యులకు అసలే సాద్యం కాదు. ఓ స్ధాయిలో బతికే వారికి కూడా ఇల్లు కట్టుకోవాలంటే ముందూ వెనుక ఆలోచిస్తున్న రోజులు. ప్రభుత్వం ఆదుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఆ పేదల ఎదరుచూపులు ప్రజా ప్రభుత్వం తెలుసుకున్నది. ఎన్నికల ముందు అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హమీ ఇచ్చింది. పేదల్లో ఆశలు చిగురించాయి. పదేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలకు బిఆర్‌ఎస్ పాలకులు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కాని పదేళ్లు ఇస్తామని పదేపదే ప్రచారం చేసుకున్నారు. ప్రజలు కూడా వినీ వినీ విసిగిపోయారు. ఏ ఎన్నికలు వచ్చినా బిఆర్‌ఎస్ పార్టీ ఒకటే జపం చేసింది. అది సార్వత్రిక ఎన్నికలైనా, పంచాయితీ రాజ్ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలనై ఒకటే మాట చెప్పింది. డబుల్ బెడ్ రూం ఇండ్లు సర్వ రోగ నివారణి అన్నట్లు ప్రచారం చేసుకున్నది. రెండుసార్లు గెలిచింది. మొదట తెలంగాణ వ్యాప్తంగా రెండు పడకల గదులు ఇండ్లుతో కొత్త తెలంగాణ ఆవిష్కారమౌతుందన్నారు. ప్రతి ఊరులో ప్రభుత్వ స్ధలంలో మరో కొత్త ప్రపంచం సృష్టిస్తామని చెప్పారు. ప్రతి ఊరులో ఇప్పుడున్న ఇందిరమ్మ కాలనీలకు దీటుగా డబుల్ బెడ్ రూంల కాలనీలు తెస్తామన్నారు. కాని ఏమైంది. అంతా ఉట్టిదే అయ్యింది. మొదట్లో బిఆర్‌ఎస్ చెప్పిన మాట తర్వాత లేకుండాపోయింది. ఏ ఒక్క మాట కూడా కార్యరూపం దాల్చలేదు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తొలుత కాలనీలు అన్నారు. తర్వాత అప్పార్టుమెంట్లు అన్నారు. అదీ బిఆర్‌ఎస్ పాలకులకు చేత కాలేదు. చేతులెత్తేశారు. ఆఖరుగా మరోసారి స్థలం వుంటే చాలు రూ.5 లక్షలు ఇస్తామని మరోసారి మోసం చేయాలని చూశారు. కాని తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్ వైఖరిని గమనించారు. ఇప్పటికే రెండు సార్లు మోసపోయాం. ఇంకా మోసపోవద్దని, మోసం చేసిన బిఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పాలని చూశారు. అదును చూసి గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పారు. 2014 ఎన్నికల్లో కేసిఆర్ చెప్పిన మాటలను ప్రజలు నమ్మారు. ఇందిరమ్మ ఇండ్లను ఎగతాళి చేశాడు. అగ్గిపెట్టె ఇండ్లన్నాడు. గొర్రెలన్నాడు, బర్రెలన్నాడు. మేకపిల్లను ఏడ కట్టేస్తారన్నాడు. అల్లుడొస్తే ఎక్కడుంటాడన్నారు. మాయ మాటలెన్నొ చెప్పాడు. ఆఖరుకు ఇండ్లు కట్టిచ్చుడు తన వల్ల కాదని చేతులెత్తేశాడు. కాని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు సాధ్యం కావో చూపిస్తామన్నారు. ఎలా సాధ్యం చేస్తామో చేసి చూపిస్తామన్నారు. అన్నట్లుగానే ఇందిరమ్మ ఇండ్ల వేడుక మొదలు పెట్టారు. తెలంగాణ అంతటా పండుగ వాతావరణం తెచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పట్టుదల సామాన్యమైనది కాదు. ఎట్టిపరిస్తితుల్లోనైనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసి తీరాలని సంకల్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీని ఎలాగైనా నెరవేర్చాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. తొలి ఏడాది ప్రభుత్వం కుదురుకోవడానికి కొద్ది సమయం పట్టింది. అందులోనూ పార్లమెంటు ఎన్నికలు రావడంతో మరో ఆరు నెలలు వెనక్కి వెళ్లింది. అంతే తప్ప ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే వుంది. ఎన్ని రకాల అడ్డంకులు ఎదురైనా సరే ఈసారి ఎలాగైనా సరే ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెట్టాలనుకున్నారు. ఈ బడ్జెట్‌లో రూ.22వేల కోట్లు కేటాయించారు. ఊరూర ప్రజా సభలు ఏర్పాటు చేశారు. ధరుఖాస్తులుస్వీకరించారు. మళ్లీ గ్రామ సభల్లోనే లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికచేశారు. పేదలందరినీ గుర్తించారు. తొలి విడద జాబితా విడుదల చేశారు. పల్లెకే పండుగను తెచ్చారు. ఆషాడంలో ఎప్పుడైనా బోనాల పండుగలు జరుపుకోవడం చూశాం. కాని ఈసారి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్ల ముగ్గుల జాతర చూస్తున్నాం. ఊరంత పండుగ వాతావరణం గమనిస్తున్నాం. ప్రజల్లో విరబూనిన ఆనందాలు చూస్తున్నాం. పదేళ్ల తర్వాత నెరవేరుతున్న సొంతింటి కల నెరవేరుతున్న లబ్ధిదారులు మోముల్లో సంతోషం, బందువుల సందోహం చూస్తున్నాం. ఇక పల్లెల్లో మొదలైన ఈ సంబురం ఇక ఆగేది కాదు. ప్రతి ఏటా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పెద్దఎత్తున జరగనున్నది. తొలిఏడాది తెలంగాణ వ్యాప్తంగా లక్షకు పైగా ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింది ఇప్పటికే అనేక మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే పూర్తయ్యాయి. గృహ ప్రవేశాలకు సిద్దమయ్యాయి. అక్కడి నుంచి ఇప్పుడు ఏక కాలంలో తెలంగాణలోని 13వేల గ్రామాల్లో ఏకబిగిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం జరుగుతోంది. ఈ ఏడాది లక్షతో మొదలై వచ్చే మూడేళ్లలో మరో 3లక్షల ఇండ్లు నిర్మాణం చేయనున్నారు. మొత్తం వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయనున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్షకోట్లకు పైగా వెచ్చించాల్సి వుంటుంది. అయినా పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం వెనుకాడకుండా ఇచ్చిన హమీమేరకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపడుతోంది. తొలి విడతలో ఎంపికైన లబ్ధిదారులకు ముందుగా రూ.లక్ష అందజేశారు. ముగ్గులు పోసుకునేందుకు ముందే సొమ్ము అప్పగించారు. అంటే ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ది వుంటే తప్ప ఇలాంటి గొప్పకార్యక్రమం మొదలు కాదు. ఇళ్లంటేనే ఇందిరమ్మ రాజ్యమని మరోసారి కాంగ్రెస్ పార్టీ, ప్రజా ప్రభుత్వం నిరూపిస్తోంది. గతంలోనూ కాంగ్రెస్‌పార్టీయే ఇందిరమ్మ ఇండ్లు నిర్మానం చేసి ఇచ్చింది. ఆ ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది. దేశంలో తొలిసారి పేదలకు ఇండ్ల నిర్మాణం ప్రధాని ఇందిరాగాంధీ హాయంలో మొదలైంది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరిగింది. అయితే ఇందిరాగాంధీ కాలంలో ఎస్సీ, ఎస్టీలకు దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున ఇండ్ల నిర్మాణం జరిగింది. అంతే కాకుండా ఆ సమయంలోనే దేశంలో దళితులకు వ్యవసాయ భూములు అందించడం జరిగింది. ఆ భూముల సాగు కోసం కూడా పెద్ద పెద్ద బావులను కూడా ఉచితంగా ప్రభుత్వాలే తవ్వి ఇచ్చారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపారు. దళితులు కూడా వ్యవసాయం చేసేందుకు మార్గం వేశారు. దేశంలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ భూములు, ఇందిరమ్మ ఇండ్లు అప్పటినుంచే ఇవ్వడం మొదలు పెట్టారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇండ్లను నిరంతర కార్యక్రమంగా ఒక యజ్ఞంలా పూర్తి చేస్తూ వస్తున్నారు. పూర్తయిన వాటికి వచ్చే నెలలో గృహ ప్రవేశాలు చేస్తారు. ఇప్పుడు మొదలౌతున్నవి దసరా వరకు పూర్తి చేసి తెలంగాణ దసర పండుగను ఇందిరమ్మ ఇండ్ల పండుగగా నిర్వహించాని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజంగా జరిగితే తెలంగాణలో ఏక కాలం లక్ష ఇండ్లకు ఒకేసారి గృహ ప్రవేశాలు జరిపి రికార్డు సృష్టించినట్లై అవుతుంది. ఆ క్రెడిట్ అంతా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఎక్కువ దక్కుతుంది. ఆయా కాలనీలు కళకళలాడినంత కాలం చరిత్రలో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు చరిత్రలో చిరస్దాయిగా నిలిచిపోతుందని చెప్పడంలో సందేహంలేదు. ఇలా ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. గత ఏడాది కాలంలో ఆయన మంత్రిగా ఇతర శాఖల పనుల బిజి ఎంత వున్నప్పటికీ నిరంతరం ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిని తెలుసుకుంటూ వుండడం, పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చేపట్టేందుకు అదికారులను పరుగులు పెట్టించారు. తన ఆశయసాధనకోసం అహర్నిషలుకృషి చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల సారధిగా కీర్తిని పొందనున్నారు.
గణపురం మండల కేంద్రంలో శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం ఆషాడ శుక్ల త్రయోదశి. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా మహిళలందరూ ఆషాడ మాసంలో గోరింటాకును పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా భావించి మహిళలు అందరూ కలిసి రామాలయం ఆవరణంలో గోరింటాకు పండగను జరుపుకున్నారు. గోరింటాకు ఆషాడ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి
పూర్వము పార్వతీదేవి ఒకరోజు చేతులకి గోరింటాకు పెట్టుకుంటుండగా గోరింటాకు చెట్టు పార్వతి దేవిని ఈ విధముగా కోరింది ప్రజలందరూ గోరింటాకు చెట్టును గుర్తించాలి అని కోరింది అందుకు పార్వతీదేవి ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవటం వల్ల మహిళలకు సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని పొందవచ్చు అని పార్వతి దేవి చెప్పింది. అందువల్ల మహిళల ందరూ ఆషాడ మాసంలో గోరింటాకు పండగను ఒక సాంప్రదాయంగా భావించి జరుపుకుంటారు మహిళలు మాట్లాడుతూ. గోరింటాకు పండగను ప్రతి సంవత్సరం రామాలయంలో వైభవంగా జరుపుకుంటాము. గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోరింటాకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరానికి చలవ చేస్తాయి ఒత్తిడిని తగ్గిస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అదేవిధంగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీలు సౌభాగ్యంగా భావిస్తారు వివాహమైన స్త్రీలకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అని భావిస్తాము అందుకొరకు ప్రతి ఆషాడ మాసంలో గోరింటాకు పండగను ఎంతో సాంప్రదాయంగా జరుపుకుంటాము. ప్రతి ఆషాడ మాసంలో మహిళలు గోరింటా కు పండగను జరుపుకోవాలని కోరుకుంటున్నాము.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డులోని పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్, గోపాల్ నగర్ లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో సీనియర్ సివిల్ జడ్జ్ కం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు.
గృహహింస మరియు మహిళలు ఎదుర్కొంటున్న అనేక చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు,జూపల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు, శ్రీ.గుర్రం ఆంజనేయులు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్,ఈ.జ్యోతి, అడ్వకేట్లు,గెంట్యాల భూమేష్, తిరుపతి, అనుష, అరుణ, అలేఖ్య మరియు 19వ వార్డు మాజీ కౌన్సిలర్,అన్నారం శ్రీనివాస్, జి.జ్యోతి, డి.అనుష, టి.కావ్య, వి.సునీత మరియు వార్డు మహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు 19వ వార్డు మాజీ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ మరియు మహిళలను జడ్జి రాధిక జైస్వాల్ అభినందించారు.
గణపురం మండల కేంద్రంలో వైఎస్సార్ ప్రజా పాలనకు నిలువెత్తు నిదర్శనమని, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సంక్షేమమే విధానంగా ప్రభుత్వం నడవాలని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు మంగళవారం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ వారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వైయస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు రాష్ట్రాన్ని సంక్షేమ యుగం వైపు తీసుకెళ్లిన మహానేత వైయస్సార్ అని ఎమ్మెల్యే అన్నారు. రైతు బంధువుగా, ప్రజల ఆశయ నాయకుడిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ, వారి అడుగుజాడల్లో రాష్ట్రంలో ప్రజా పాలన సాగిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
గణపురం పీఏసీఎస్ కార్యాలయంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యేభావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) కార్యాలయ ఆవరణలో చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, మొక్కలను నాటి, నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… విరివిరిగా మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందన్నారు. అంతేకాకుండా, విరివిగా వర్షాలు పడి పంటలు కూడా పుష్కలంగా పండుతాయన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.
గణపురంమండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) కార్యాలయ ఆవరణలో చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, మొక్కలను నాటి, నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… విరివిరిగా మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందన్నారు. అంతేకాకుండా, విరివిగా వర్షాలు పడి పంటలు కూడా పుష్కలంగా పండుతాయన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం అనంతరంగణపురం మండల కేంద్రంలోని స్వర్ణ భారతి మండల సమాఖ్య వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూసీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతారని తమ ప్రభుత్వం నమ్ముతోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదేవిధంగా, రాష్ట్రంలో కోటి మంది మహిళలనుకోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు.ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామని గుర్తుచేశారు. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి స్టాల్స్ ఏర్పాటు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
టీవీ9 రిపోర్టర్ గార్దాసు ప్రసాద్ కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 50 వేల,విప్ స్వంతగా 20 ఆర్థిక సహాయం అందజేత
పిల్లల పై చదువులకు, ప్రసాద్ తల్లిదండ్రుల వైద్యానికి భరోసా
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల నియోజకవర్గనికి చెందిన టీవీ9 రిపోర్టర్ గార్దాసు ప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటానని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ప్రసాద్ గుండెపోటుతో ఇటీవల మృతిచెందిగా విషయం తెలుసుకున్న విప్ మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని, విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా 20 వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పిల్లల పై చదువులకు అండగా ఉంటానని తెలిపారు. వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రసాద్ తల్లిదండ్రుల ఆరోగ్య చికిత్సకు ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప రెడ్డి, డి.పి.ఆర్.ఓ. వి.శ్రీధర్, ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన సేవలు తినలేనివని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.దుగ్గొండి మండలంలోని గిర్నిబావి కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైయస్అర్ ముఖ్యమంత్రిగా విద్యా, వైద్యం, ఉపాధి ఉచితంగా పేదలకు అందించారన్నారు.ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేద ప్రజలను ఆదుకున్న ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు, మాజీ ఎంపీపీలు చుక్క రమేష్, బూర్గు రవీందర్, మండల నాయకులు కామ శోభన్, జంగిలి నగేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు కొలిపాక బిక్షపతి చెన్నారపు రాజు కామిశెట్టి రమేష్ మండల యూత్ నాయకులు కొలుగూరి సుమంత్ నాయకులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.