అందుకే ఆ ట్యాగ్‌ తొలగించమన్నా

అందుకే ఆ ట్యాగ్‌ తొలగించమన్నా 

 

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కింగ్‌డమ్‌’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు విజయ్‌ దేవరకొండ. ‘లైగర్‌’ సినిమా సమయంలో ఉపయోగించిన ‘ది’ ట్యాగ్‌, ఆ సందర్భంగా జరిగిన రచ్చపై వివరణ ఇచ్చారు. ‘నాకు ఏదో ఒక ట్యాగ్‌ ఇవ్వాలని దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. అది నాకిష్టం లేదు. ఫ్యాన్స్‌ నాపై చూపించే ప్రేమ, అభిమానాలే నాకు చాలు. వారు నన్ను నా నటనతో గుర్తుంచుకోవాలని కోరుకుంటాను. రౌడీ, సదరన్‌ సెన్సేషన్‌ ట్యాగ్‌లతో ప్రేక్షకులు నన్ను పిలిచినా నేను వాటిని అంగీకరించలేదు. దాంతో ‘లైగర్‌’ సినిమా ప్రచారంలో చిత్రబృందం ‘ది’ అనే ట్యాగ్‌ను జోడించింది. అయితే ఆ ట్యాగ్‌ ఎవరికీ లేకపోవడంతో అంగీకరించాను. కానీ తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. వెంటనే ఆ ట్యాగ్‌ను తొలగించాలని నా టీమ్‌ని ఆదేశించాను’ అని తెలిపారు. ఇక ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో సపోర్ట్‌ లేకపోతే, ఏదైనా స్ర్కిప్ట్‌ మన దగ్గరకు వచ్చినప్పుడు..ఇది బాగోలేదు, ఈ స్ర్కిప్ట్‌ నేను చేయలేను, ఇంకా మెరుగుపర్చాలి అని చెప్పలేం. అదే ఇండస్ట్రీలో సపోర్ట్‌ ఉన్న నా సమకాలీన నటుడికే ఈ అవకాశం వస్తే, వెంటనే ఆ స్ర్కిప్ట్‌ చేయనని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు’ అని విజయ్‌ వ్యాఖ్యానించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version