శీనన్న పట్టుదల..తీరుతున్న పేదింటి కల.

-తెలంగాణలో ఊరూర ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు.

-తెలంగాణ ప్రజల్లో విరబూసిన సంతోషాలు.

 

-సొంతింటి కల నెరవేతుండడంతో పల్లెల్లో ఆనందాలు.

-పదేళ్ల ఎదురుచూపులకు ప్రజా ప్రభుత్వంలో మోక్షం.

-నెరవేరుతున్న మంత్రి శీనన్న ఆశయం.

-అర్హులైన పేదలందరికీ తొలి విడతలో అందుతున్న ఇండ్లు.

-ఈ ఏడాది లక్షకు పైగా ఇందిరమ్మ ఇండ్లు.

-నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు.

-ఏటా 22 వేల కోట్ల ఖర్చుతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు.

-పల్లె పల్లెలో పండుగ వాతావరణం.

-ఇంటి ముగ్గులతో సుందరశోభితం.

-ఇళ్లంటేనే ఇందిరమ్మ రాజ్యం.

-పేదింటి కల నెరవేర్చేదే ప్రజా ప్రభుత్వం.

-ఎన్నికల ముందు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు.

-తొలి ఏడాది లక్ష ఇండ్లకు శ్రీకారం.

-పేదలందరికీ ఇండ్లు కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యం.

-పదేళ్ల ముందు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ.

-తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇండ్లు ఇస్తున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే.

-సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శీనన్నకు ప్రజల ధన్యవాదాలు.

-కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటలుగా మారుతున్న పల్లెలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 పెళ్లి చేసి చూడు..ఇల్లు కట్టి చూడు అని పెద్దలన్నారు. ఆ రెండు ఎంతో కష్టతరమైనవి. ఖర్చుతో కూడుకున్నవి. అందుకే ఈ మాట పెద్దలు చెప్పారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే జీవితాంతం కష్టపడిన సొమ్మును పొదుపు చేసి చేయాలి. అలాగే ఇల్లు కట్టుకోవాన్నా సరే అప్పు చేసినా జీవితాంతం తీర్చాలి. ఈ మాట పాత రోజుల్లోనే అంత గంభీరమైంది అంటే..ఇప్పుడు ఎంత కష్టతరమైందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్దితుల్లో సామాన్యులు ఓ యాభై గజాల స్ధలం కొనుగోలు చేసుకునే పరిస్తితి లేదు. ఓ వంద గజాలు కొనుక్కొవాలంటే లక్షాదికారులకు సాధ్యం. అలాగే తాతల తరం నుంచి ఇంత స్ధలం వున్నా, ఇప్పుడున్న పరిస్టితుల్లో ఇల్లు కట్టుకోవడం సామాన్యులకు అసలే సాద్యం కాదు. ఓ స్ధాయిలో బతికే వారికి కూడా ఇల్లు కట్టుకోవాలంటే ముందూ వెనుక ఆలోచిస్తున్న రోజులు. ప్రభుత్వం ఆదుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఆ పేదల ఎదరుచూపులు ప్రజా ప్రభుత్వం తెలుసుకున్నది. ఎన్నికల ముందు అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హమీ ఇచ్చింది. పేదల్లో ఆశలు చిగురించాయి. పదేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలకు బిఆర్‌ఎస్‌ పాలకులు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కాని పదేళ్లు ఇస్తామని పదేపదే ప్రచారం చేసుకున్నారు. ప్రజలు కూడా వినీ వినీ విసిగిపోయారు. ఏ ఎన్నికలు వచ్చినా బిఆర్‌ఎస్‌ పార్టీ ఒకటే జపం చేసింది. అది సార్వత్రిక ఎన్నికలైనా, పంచాయితీ రాజ్‌ ఎన్నికలైనా, మున్సిపల్‌ ఎన్నికలనై ఒకటే మాట చెప్పింది. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు సర్వ రోగ నివారణి అన్నట్లు ప్రచారం చేసుకున్నది. రెండుసార్లు గెలిచింది. మొదట తెలంగాణ వ్యాప్తంగా రెండు పడకల గదులు ఇండ్లుతో కొత్త తెలంగాణ ఆవిష్కారమౌతుందన్నారు. ప్రతి ఊరులో ప్రభుత్వ స్ధలంలో మరో కొత్త ప్రపంచం సృష్టిస్తామని చెప్పారు. ప్రతి ఊరులో ఇప్పుడున్న ఇందిరమ్మ కాలనీలకు దీటుగా డబుల్‌ బెడ్‌ రూంల కాలనీలు తెస్తామన్నారు. కాని ఏమైంది. అంతా ఉట్టిదే అయ్యింది. మొదట్లో బిఆర్‌ఎస్‌ చెప్పిన మాట తర్వాత లేకుండాపోయింది. ఏ ఒక్క మాట కూడా కార్యరూపం దాల్చలేదు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలుత కాలనీలు అన్నారు. తర్వాత అప్పార్టుమెంట్లు అన్నారు. అదీ బిఆర్‌ఎస్‌ పాలకులకు చేత కాలేదు. చేతులెత్తేశారు. ఆఖరుగా మరోసారి స్థలం వుంటే చాలు రూ.5 లక్షలు ఇస్తామని మరోసారి మోసం చేయాలని చూశారు. కాని తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్‌ వైఖరిని గమనించారు. ఇప్పటికే రెండు సార్లు మోసపోయాం. ఇంకా మోసపోవద్దని, మోసం చేసిన బిఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పాలని చూశారు. అదును చూసి గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పారు. 2014 ఎన్నికల్లో కేసిఆర్‌ చెప్పిన మాటలను ప్రజలు నమ్మారు. ఇందిరమ్మ ఇండ్లను ఎగతాళి చేశాడు. అగ్గిపెట్టె ఇండ్లన్నాడు. గొర్రెలన్నాడు, బర్రెలన్నాడు. మేకపిల్లను ఏడ కట్టేస్తారన్నాడు. అల్లుడొస్తే ఎక్కడుంటాడన్నారు. మాయ మాటలెన్నొ చెప్పాడు. ఆఖరుకు ఇండ్లు కట్టిచ్చుడు తన వల్ల కాదని చేతులెత్తేశాడు. కాని కాంగ్రెస్‌ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు సాధ్యం కావో చూపిస్తామన్నారు. ఎలా సాధ్యం చేస్తామో చేసి చూపిస్తామన్నారు. అన్నట్లుగానే ఇందిరమ్మ ఇండ్ల వేడుక మొదలు పెట్టారు. తెలంగాణ అంతటా పండుగ వాతావరణం తెచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పట్టుదల సామాన్యమైనది కాదు. ఎట్టిపరిస్తితుల్లోనైనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసి తీరాలని సంకల్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీని ఎలాగైనా నెరవేర్చాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. తొలి ఏడాది ప్రభుత్వం కుదురుకోవడానికి కొద్ది సమయం పట్టింది. అందులోనూ పార్లమెంటు ఎన్నికలు రావడంతో మరో ఆరు నెలలు వెనక్కి వెళ్లింది. అంతే తప్ప ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే వుంది. ఎన్ని రకాల అడ్డంకులు ఎదురైనా సరే ఈసారి ఎలాగైనా సరే ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెట్టాలనుకున్నారు. ఈ బడ్జెట్‌లో రూ.22వేల కోట్లు కేటాయించారు. ఊరూర ప్రజా సభలు ఏర్పాటు చేశారు. ధరుఖాస్తులుస్వీకరించారు. మళ్లీ గ్రామ సభల్లోనే లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికచేశారు. పేదలందరినీ గుర్తించారు. తొలి విడద జాబితా విడుదల చేశారు. పల్లెకే పండుగను తెచ్చారు. ఆషాడంలో ఎప్పుడైనా బోనాల పండుగలు జరుపుకోవడం చూశాం. కాని ఈసారి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్ల ముగ్గుల జాతర చూస్తున్నాం. ఊరంత పండుగ వాతావరణం గమనిస్తున్నాం. ప్రజల్లో విరబూనిన ఆనందాలు చూస్తున్నాం. పదేళ్ల తర్వాత నెరవేరుతున్న సొంతింటి కల నెరవేరుతున్న లబ్ధిదారులు మోముల్లో సంతోషం, బందువుల సందోహం చూస్తున్నాం. ఇక పల్లెల్లో మొదలైన ఈ సంబురం ఇక ఆగేది కాదు. ప్రతి ఏటా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పెద్దఎత్తున జరగనున్నది. తొలిఏడాది తెలంగాణ వ్యాప్తంగా లక్షకు పైగా ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. పైలెట్‌ ప్రాజెక్టు కింది ఇప్పటికే అనేక మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే పూర్తయ్యాయి. గృహ ప్రవేశాలకు సిద్దమయ్యాయి. అక్కడి నుంచి ఇప్పుడు ఏక కాలంలో తెలంగాణలోని 13వేల గ్రామాల్లో ఏకబిగిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం జరుగుతోంది. ఈ ఏడాది లక్షతో మొదలై వచ్చే మూడేళ్లలో మరో 3లక్షల ఇండ్లు నిర్మాణం చేయనున్నారు. మొత్తం వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయనున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్షకోట్లకు పైగా వెచ్చించాల్సి వుంటుంది. అయినా పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం వెనుకాడకుండా ఇచ్చిన హమీమేరకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపడుతోంది. తొలి విడతలో ఎంపికైన లబ్ధిదారులకు ముందుగా రూ.లక్ష అందజేశారు. ముగ్గులు పోసుకునేందుకు ముందే సొమ్ము అప్పగించారు. అంటే ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ది వుంటే తప్ప ఇలాంటి గొప్పకార్యక్రమం మొదలు కాదు. ఇళ్లంటేనే ఇందిరమ్మ రాజ్యమని మరోసారి కాంగ్రెస్‌ పార్టీ, ప్రజా ప్రభుత్వం నిరూపిస్తోంది. గతంలోనూ కాంగ్రెస్‌పార్టీయే ఇందిరమ్మ ఇండ్లు నిర్మానం చేసి ఇచ్చింది. ఆ ఘనత కూడా కాంగ్రెస్‌ పార్టీకే దక్కింది. దేశంలో తొలిసారి పేదలకు ఇండ్ల నిర్మాణం ప్రధాని ఇందిరాగాంధీ హాయంలో మొదలైంది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరిగింది. అయితే ఇందిరాగాంధీ కాలంలో ఎస్సీ, ఎస్టీలకు దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున ఇండ్ల నిర్మాణం జరిగింది. అంతే కాకుండా ఆ సమయంలోనే దేశంలో దళితులకు వ్యవసాయ భూములు అందించడం జరిగింది. ఆ భూముల సాగు కోసం కూడా పెద్ద పెద్ద బావులను కూడా ఉచితంగా ప్రభుత్వాలే తవ్వి ఇచ్చారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపారు. దళితులు కూడా వ్యవసాయం చేసేందుకు మార్గం వేశారు. దేశంలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ భూములు, ఇందిరమ్మ ఇండ్లు అప్పటినుంచే ఇవ్వడం మొదలు పెట్టారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇండ్లను నిరంతర కార్యక్రమంగా ఒక యజ్ఞంలా పూర్తి చేస్తూ వస్తున్నారు. పూర్తయిన వాటికి వచ్చే నెలలో గృహ ప్రవేశాలు చేస్తారు. ఇప్పుడు మొదలౌతున్నవి దసరా వరకు పూర్తి చేసి తెలంగాణ దసర పండుగను ఇందిరమ్మ ఇండ్ల పండుగగా నిర్వహించాని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజంగా జరిగితే తెలంగాణలో ఏక కాలం లక్ష ఇండ్లకు ఒకేసారి గృహ ప్రవేశాలు జరిపి రికార్డు సృష్టించినట్లై అవుతుంది. ఆ క్రెడిట్‌ అంతా అటు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఎక్కువ దక్కుతుంది. ఆయా కాలనీలు కళకళలాడినంత కాలం చరిత్రలో రేవంత్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేరు చరిత్రలో చిరస్దాయిగా నిలిచిపోతుందని చెప్పడంలో సందేహంలేదు. ఇలా ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. గత ఏడాది కాలంలో ఆయన మంత్రిగా ఇతర శాఖల పనుల బిజి ఎంత వున్నప్పటికీ నిరంతరం ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిని తెలుసుకుంటూ వుండడం, పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చేపట్టేందుకు అదికారులను పరుగులు పెట్టించారు. తన ఆశయసాధనకోసం అహర్నిషలుకృషి చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల సారధిగా కీర్తిని పొందనున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version