గణపురం పీఏసీఎస్ కార్యాలయంలో మొక్కలు నాటిన
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురంమండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) కార్యాలయ ఆవరణలో చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, మొక్కలను నాటి, నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… విరివిరిగా మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందన్నారు. అంతేకాకుండా, విరివిగా వర్షాలు పడి పంటలు కూడా పుష్కలంగా పండుతాయన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం అనంతరంగణపురం మండల కేంద్రంలోని స్వర్ణ భారతి మండల సమాఖ్య వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూసీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతారని తమ ప్రభుత్వం నమ్ముతోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదేవిధంగా, రాష్ట్రంలో కోటి మంది మహిళలనుకోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు.ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామని గుర్తుచేశారు. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి స్టాల్స్ ఏర్పాటు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.