దివంగత వైయస్సార్ సేవలు ఎనలేనివి..
ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు
నర్సంపేట,నేటిధాత్రి:
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన సేవలు తినలేనివని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.దుగ్గొండి మండలంలోని గిర్నిబావి కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైయస్అర్ ముఖ్యమంత్రిగా విద్యా, వైద్యం, ఉపాధి ఉచితంగా పేదలకు అందించారన్నారు.ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేద ప్రజలను ఆదుకున్న ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు, మాజీ ఎంపీపీలు చుక్క రమేష్, బూర్గు రవీందర్, మండల నాయకులు కామ శోభన్, జంగిలి నగేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు కొలిపాక బిక్షపతి చెన్నారపు రాజు కామిశెట్టి రమేష్ మండల యూత్ నాయకులు కొలుగూరి సుమంత్ నాయకులు
పాల్గొన్నారు.