పదవి బాధ్యతలు చేపట్టిన పావుశెట్టి సునీల్…

పదవి బాధ్యతలు చేపట్టిన పావుశెట్టి సునీల్

పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా

మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్

పరకాల,నేటిధాత్రి

పరకాల మున్సిపాలిటీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.చైర్మన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్ శుక్రవారం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు.చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సునీల్ కుమార్‌ను అభినందిస్తూ శాలువా కప్పి సన్మానించారు. అలాగే మున్సిపల్ కౌన్సిలర్‌లను కూడా ఆయన సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా చైర్మన్ పావుశెట్టి సునీల్ మాట్లాడుతూ పట్టణ ప్రజల విశ్వాసంతో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సునీల్ కుమార్ ప్రజల సమస్యల పరిష్కారమే తన మొదటి లక్ష్యమని తెలిపారు.పరకాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి,పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం,రోడ్ల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేస్తానని తెలిపారు.పావుశెట్టి సునీల్ కుమార్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఆయన అనుచరులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.పట్టణ అభివృద్ధి కోసం చైర్మన్ సునీల్ కుమార్ నాయకత్వంలో మున్సిపాలిటీ ముందుకు సాగుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,అధికారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని..

వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని..

#ఎన్జీవోస్ కాలనీ వెంకటేశ్వర స్వామి వారి దక్షిణ గోపుర నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే..

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 59 వ డివిజన్ వికాస్ నగర్ కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర
ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో అభయాంజనేయ స్వామి పునఃప్రతిష్ట మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే నాయిని పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు.
అనంతరం 58వ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దక్షిణ గోపుర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంసందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భూమి పూజలో పాల్గొని నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ఆలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. ఇలాంటి దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ఎప్పటికప్పుడు సహకారం అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు…

పదవ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు
( గిఫ్ట్ ఏ స్మైల్ ) ఆధ్వర్యంలో,పెన్స్,ఎగ్జామ్స్ పాడ్స్ పంపిణి

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పెద్దూరులోని
కస్తూరిబ గురుకుల పాఠశాలలో మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు( గిఫ్ట్ ఏ స్మైల్) ఆధ్వర్యంలో పదో తరగతి రాయబోయి విద్యార్థినీ, విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్ మరియు పెన్స్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ వార్డ్ కౌన్సిలర్ దొంతులేని కళ్యాణి అశోకరావు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థిని విద్యార్థులు విజయవంతంగా పదో తరగతి పరీక్షలు రాసి, అత్యధిక మార్కులు సాధించి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు గౌరవప్రదంగా ఈ విజయాన్ని అందించాలని తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేకాలి,ఎనిమిదో వాడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విడుదల దేవయ్య,మాజీ సర్పంచ్ ఆదేపల్లి దేవ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుండి హనుమకొండ జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు…

నేటి నుండి హనుమకొండ జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు

#డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏ. అప్పయ్య

#99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కార్యక్రమం

#నలుగు దశల్లో వైద్య సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు

#ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

హన్మకొండ, నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు నాలుగు దశల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
మొదటి దశలో స్పెషలిస్ట్ వైద్య సేవలు మొదటి దశలో భాగంగా ఈనెల 6 నుండి 31 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్పెషలిస్ట్ వైద్యులతో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎంజీఎం, ప్రసూతి ఆసుపత్రుల నుండి స్త్రీ వైధ్య, శిశు వైధ్య, జనరల్ ఫిజీషియన్, కంటి మరియు ఎముకల వైద్య నిపుణులు ఈ శిబిరాల్లో అందుబాటులో ఉంటారు.
ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తారు.
పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు
ఆర్.బి.ఎస్.కె బృందాల ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. బాలికల పాఠశాలల్లో స్త్రీ వైద్య నిపుణులతో ప్రత్యేక అవగాహన సదస్సులు, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షణకు తోడ్పడే సిపిఆర్ పై శిక్షణ ఇస్తారని డీఎంహెచ్‌ఓ వివరించారు.
ప్రారంభమైన శిబిరాలు – షెడ్యూల్ వివరాలు
నేడు అయినవోలు పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన మొదటి వైద్య శిబిరాన్ని వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ కె.ఆర్. నాగరాజు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి శిబిరాల షెడ్యూల్ ఇలా ఉంది:
| మార్చి 7 | కడిపికొండ |
| మార్చి 9 | కమలాపూర్ |
| మార్చి 10 | కొండపర్తి |
| మార్చి 11 | ముల్కనూర్ |
| మార్చి 12 | శాయంపేట |
| మార్చి 13 | సిద్దాపూర్ |
| మార్చి 14 | ఉప్పల్ |
| మార్చి 16 | వేలేరు |
| మార్చి 17 | దామెర |
| మార్చి 18 | హసన్పర్తి |
| మార్చి 20 | వంగర |
| మార్చి 23 | రాయపర్తి |
మార్చి 24న బోడగుట్ట, 25న లష్కర్ సింగారం, 26న పెద్దమ్మగడ్డ, 28న పోచమ్మకుంట/శాయంపేట, 30న సోమిడి/వడ్డేపల్లి, 31న తిరిగి పోచమ్మకుంట మరియు వడ్డేపల్లిలో శిబిరాలు జరుగుతాయి.
మహిళా సమాఖ్య సభ్యులకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని, కావున ప్రజలందరూ తమ ఆరోగ్య పరిరక్షణకై ఈ ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని డాక్టర్ అప్పయ్య కోరారు.

మున్సిపల్ ఉద్యోగి సాయిరాం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి…

మున్సిపల్ ఉద్యోగి సాయిరాం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి మున్సిపాలిటీ లో
ధ్యారపోగు సాయరాం సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు ఆయన అనారోగ్యముతో మరణించారని.సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ కౌన్సిలర్ మదన్ కవి జనజ్వాల గంధం నాగరాజు తో కలసి సాయిరాం పార్ధివ దేహానికీ నివాళ్ళు అర్పించామని శంకర్ గౌడ్ తెలిపారు ఈసందర్భంగా ఆయన మాట్లాడాడు మున్సిపల్ ఉద్యోగి సాయిరాం మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుని కుటుంబా న్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోని మృతుడు సాయిరాం కుటుంబంలో మున్సిపాలిటీలో ఉద్యోగం ఇవ్వాలని కొరారు

రైతు రమేష్ రెడ్డి: చియా సీడ్స్ తో కొత్త బాట…

రైతు రమేష్ రెడ్డి: చియా సీడ్స్ తో కొత్త బాట

జహీరాబాద్ నేటి ధాత్రి:

​https://youtu.be/u_lk1C2CxWk?si=CUSTHsUQMADRRuQP

 

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన యువ రైతు రమేష్ రెడ్డి, వ్యవసాయ అధికారి సలహాతో 2.5 ఎకరాల్లో తొలిసారిగా ‘చియా సీడ్స్’ సాగు చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో పండే ఈ పంటను తన ప్రాంతంలో ప్రవేశపెట్టి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని నిరూపిస్తున్నారు. సంప్రదాయ పంటల కంటే వినూత్నమైన ఈ సాగు వైపు యువత రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. రమేష్ రెడ్డి ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు.

DCCB శాఖలో ఏటీఎం సేవలు ప్రారంభం…

DCCB శాఖలో ఏటీఎం సేవలు ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (DCCB) శాఖలో ఏటీఎం సేవలను శుక్రవారం ప్రారంభించారు. దాదాపు రెండేళ్లుగా ఏటీఎం సౌకర్యం లేక ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ ఏర్పాటు జరిగింది. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న ఈ ప్రాంతంలో రైతులు, వ్యాపారులు, ఖాతాదారులకు నగదు ఉపసంహరణ సులభతరం అవుతుంది. ఈ కార్యక్రమంలో సి.ఓ సురేష్, జీఎం శ్రీనివాస్, నోడల్ ఆఫీసర్ వెంకటేశం, బ్రాంచ్ మేనేజర్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

బ‌ర్దీపూర్ ఆశ్రమంలో వైభవంగా దత్తగిరి మహారాజ్ ఆరాధన మహోత్సవాలు…

బ‌ర్దీపూర్ ఆశ్రమంలో వైభవంగా దత్తగిరి మహారాజ్ ఆరాధన మహోత్సవాలు

◆-: ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

◆-: డా౹౹ సిద్ధం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ ఝరాసంగం మండలంలోని సుప్రసిద్ధ బర్దీపూర్ ఆశ్రమం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.శ్రీ దత్తగిరి మహారాజ్ వార్షిక అమర తిథిని పురస్కరించుకుని ఆశ్రమ ప్రాంగణంలో మహా మృత్యుంజయ మంత్ర శత సహస్ర జపయజ్ఞం, దత్తహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.​ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా. సిద్ధం ఉజ్వల్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.బర్దిపూర్ ఆశ్రమ అప్ప వారిని శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఉజ్వల్‌రెడ్డి మాట్లాడుతూ దత్తగిరి మహారాజ్ వంటి మహనీయుల ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని,లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ జపయజ్ఞం అందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటునన్నారు. ఈ కార్యక్రమంలో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి,నర్సింహారెడ్డి,అశ్విన్ పాటిల్,జగదీశ్వర్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ చిన్నారెడ్డి..

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ చిన్నారెడ్డి
వనపర్తి నేటిదాత్రి .

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్ష సమావేశం లో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఎమ్మెల్యేలు తూడి మేగారెడ్డీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి జి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి మున్సిపల్ చైర్మన్ మీడిదొడ్డి మాదవి జిల్లా అధికారులు పాల్గొన్నారు

కోటంచ నరసింహస్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర…

కోటంచ నరసింహస్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

రేగొండ మండలం,కొడవటంచ్చ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అడిషనల్ కలెక్టర్ కుమారుడు అభినవ్ ప్రణవి వివాహ వేడుకలలోమాజీ చీఫ్ విప్ రావుల..

అడిషనల్ కలెక్టర్ కుమారుడు అభినవ్ ప్రణవి వివాహ వేడుకలలోమాజీ చీఫ్ విప్ రావుల
వనపర్తి నేటిదాత్రి .

 

అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ కుమారుడు అభినవ్ వివాహం డాక్టర్ ప్రణవి ఎస్.పి.ఆర్ శ్రీరస్తు కన్విక్షన్ హైదరాబాద్ జెరిగిన వివాహ వేడుకలలో మాజీ చీఫ్ విప్ రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారని జిల్లా బీ ఆర్ ఎస్ మీడియా సెల్ ఇంచార్జి నందిమల్ల అశోక్ ఒక ప్రకటన లో తెలిపారు
వివాహా వేడుకలలో , వనపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ పలస రమేష్ గౌడ్ , మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు, రంగాపురం కృష్ణారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారని అశోక్ తెలిపారు .

మల్లక్కపేటలో మిర్చి దొంగతనం

మల్లక్కపేటలో మిర్చి దొంగతనం

దాదాపు 6బస్తాల వరకు మిర్చిని ఎత్తుకెళ్లిన దొంగలు

తీవ్ర నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు

మిర్చి ఎత్తుకెళ్లడంతో కుటుంబం పై ఆర్థిక ప్రభావం పడుతుంది-రైతు దొమ్మటి బాబు

పరకాల,నేటిధాత్రి

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో మిర్చి దొంగతనం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు దొమ్మటి బాబు పండించిన మిర్చిని గుర్తు తెలియని దొంగలు దోచుకెళ్లిన ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.రైతులు రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటను ఇలా దొంగలు ఎత్తుకెళ్లడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే, మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి బాబు తన వ్యవసాయ భూమిలో పండించిన మిర్చిని కోసి పొలంవద్ద నిల్వ ఉంచాడు.మార్కెట్ కు తరలించేందుకు సిద్ధంచేసుకునే క్రమంలో మిర్చీని బావి వద్దనే ఎందబోసిన క్రమంలో రాత్రికి రాత్రే మాయం కావడంతో రైతు తీవ్రంగా కలత చెందాడు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 6బస్తాల వరకు మిర్చిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.రోజులాగానే తెల్లవారుజామున పొలానికి వెళ్లిన రైతు మిర్చి కుప్ప అనుమానస్పదంగా చిందర మందరగా కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.వెంటనే గ్రామస్థులకు విషయం తెలియజేశాడు.రైతులు తమ పంటలను రాత్రి వేళల్లో కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామంలోని ఇతర రైతులు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి దొంగతనాలు కొనసాగితే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంటలపై ఆధారపడి జీవించే రైతులకు ఇది పెద్ద దెబ్బ అని అభిప్రాయపడుతున్నారు.

దొంగతనానికి గురైన మిర్చి పంట రైతు-దొమ్మటి బాబు

ఈ సందర్భంగా రైతు దొమ్మటి బాబు మాట్లాడుతూ ఎంతో కష్టపడి పండించిన పంటను ఇలా దొంగలు దోచుకెళ్లడం తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.నెలల తరబడి శ్రమించి పండించిన మిర్చిని మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన సమయంలో ఈ దొంగతనం జరగడం చాలా బాధ కలిగించిందని పేర్కొన్నాడు.రాత్రికి రాత్రే దాదాపు పది బస్తాల మిర్చి మాయం కావడంతో తనకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపాడు.మార్కెట్‌లో మిర్చి ధరలు కొంత మెరుగ్గా ఉన్న సమయంలో అమ్మేందుకు సిద్ధం చేసిన పంట ఇలా పోవడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని వాపోయాడు. రైతులు ఎంతో కష్టపడి పండించే పంటలను కాపాడుకునేందుకు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి…

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సి.ఆర్ నగర్ బాంబుల గడ్డ కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.ఈరోజు నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ళ వేగవంతమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ప్రజలకు సమయానుకుల సేవలందించడం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్స్,జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయ లక్ష్మీ మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ మూడో వార్డు కౌన్సిలర్ అరుణ్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

ఉప ప్రధానిగా చంద్రబాబు!?

డిల్లీ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్న వార్తలు.

-లోకేష్‌ను సిఎం. చేయడానికి ఇదే అదును అని అనుకుంటున్న చంద్రబాబు.

 -అదే సమయంలో తాను ఉప ప్రధాని కావాలని అనుకుంటున్నట్లు సమాచారం.

-గతంలోనే రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వదులుకున్న చంద్రబాబు.

-యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకభూమిక ఫోషించిన చంద్రబాబు.

-యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా దేశ రాజకీయాల్లో తొలిసారి చక్రం తిప్పిన చంద్రబాబు.

-అంతకు ముందు నేషనల్ ప్రంట్‌తో దేశ రాజకీయాల్లో కీలకమైన చంద్రబాబు.

-ఆ తర్వాత చంద్రబాబు నేతత్వంలోనే దేశంలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు.

-యునైటెడ్ ఫ్రంట్‌గా ఇద్దరు ప్రధానులను చేసిన చంద్రబాబు.

-ఆ సమయంలోనే చంద్రబాబును ప్రధాని కావాలని పట్టుబట్టిన జాతీయ నాయకులు.

-యునైటెట్ ఫ్రంట్ ద్వారా దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌లను ప్రదానులను చేశారు.

-తర్వాత కాలంలో బిజేపితో జత కట్టి ఎన్డీయే ఏర్పాటులో కీలకభూమిక పోషించిన చంద్రబాబు.

-వాయ్‌పాయ్ ప్రధాని కావడానికి అన్ని పార్టీలను ఏకం చేసిన చంద్రబాబు.

-ఎన్టీయేకు సుధీర్ఘ కాలం పాటు కన్వీనర్‌గా కొనసాగిన చంద్రబాబు.

-తన నాయకత్వంలో నలుగురు ప్రధానులను చేసిన నాయకుడు చంద్రబాబు.

-గతంలో దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌తోపాటు అటల్ బిహరీ వాజ్‌పాయ్ ప్రదానులయ్యారు.

-ప్రస్తుతం చంద్రబాబు మద్దతుతోనే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు.

-ఒకసారి రాష్ట్రపతి నియామకంలోనూ చంద్రబాబు మాటే చెల్లుబాటు అయ్యింది.

-అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడంలో చంద్రబాబు రాజకీయమే గెలిచింది.

-రెండు సార్లు ప్రదాని అవకాశం వచ్చినా రాష్ట్రం కోసం వదులుకున్నారు.

-ఇప్ప్పుడైనా కేంద్రంలో పదవి తీసుకోవాలని అనుకుంటున్నారు.

-రాష్ట్రంలో లోకేష్, కేంద్రంలో చంద్రబాబు వుండాలనుకుంటున్నారు.

హైదరాబాద్, నేటిధాత్రి:

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ ఏపి. సిఎం. చంద్రబాబు నాయకుడిది ప్రత్యేక పాత్ర. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఆ వెంటనే మంత్రి అయ్యారు. తర్వాత కాలంలో ఎన్టీఆర్‌కు అల్లుడయ్యారు. ఎన్టీఆర్ తెలుగుదేశంలో ఆదిలోనే కీలక భూమిక పోషించారు. ఆ పార్టీలో చేరిన వెంటనే పార్టీకి ఏకంగా ప్రదాన కార్యదర్శి పదవి పొందారు. ఇలా అంచెలంచెలుగా అతి తక్కువ సమయంలోనే ఆయన ఉన్నత పదవులు అదిరోహించారు. యూనివర్సిటీ నుంచి నేరుగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన ఆ తరం నాయకుల్లో చంద్రబాబు నాయకుడు ఒకే ఒక్కరు. అలా రాజకీయాల్లో చేరారో లేదో మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ మూడేళ్లకే మంత్రి కూడా అయ్యారు. అలా అప్పటి నుంచి ఓటమి ఎరుగని నాయకుడిగా రాజకీయాల్లో గెలుస్తూ వస్తున్నారు. రాజకీయాలను ఆనాటి నుంచి శాసిస్తూ వస్తున్నారు. తెలుగుదేశంలో చేరిన తర్వాత నాదేండ్ల బాస్కర్‌రావు వల్ల ఏర్పడిన ఉపద్రవాన్ని ఎంతో చాకచక్యంగా ఎదుర్కొని తన రాజకీయ చాణక్యాన్ని ఆనాడే చూపించిన నాయకుడు చంద్రబాబు. అలా ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడంలో చంద్రబాబు పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో లేకుంటే ఆ పార్టీ పరిస్దితి మరోలా వుండేది. ఈపాటికి తెలుగుదేశం పార్టీ ఒకటి వచ్చిపోయింది అని చెప్ప్పుకోవాల్సి వచ్చేది. అలా కాకుండా తొలి రోజుల్లోనే కాపాడిన నాయకుడు చంద్రబాబు. అలా తెలుగుదేశానికి ఊపిరిపోసి, ఎన్టీఆర్‌ను రెండోసారి సిఎం. చేశారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చేసిన కషి అంతా ఇంతా కాదు. ఆనాటి నుంచి పార్టీని కంటికి రెప్పలా కాపాకుడుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి వందేళ్ల చరిత్రకు పునాదులు వేశారు. 1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అది కూడా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా మరో మెట్టు ఎక్కించేందుకేనేమో అనిపించింది. అలా జాతీయ రాజకీయాల్లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఎన్టీఆర్ వున్నప్పటికీ రాజకీయమంతా చూసుకున్నది చంద్రబాబు మాత్రమే. అలా జాతీయ రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా దేశానికి పరిచయమైన నాయకుడు చంద్రబాబు. ఆ సమయంలో ఇద్దరు ప్రధానులను చేయడం జరిగింది. తర్వాత కాలంలో నేషనల్ ఫ్రంట్ శకం ముగిసింది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్మమంత్రి అయిన తర్వాత ఏకంగా ఆయనే యునైటెడ్ ప్రంట్ ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. అయితే అదే సమయంలో జాతీయ నాయకులంతా కలిసి చంద్రబాబు నాయుడినే పిఎం. కావాలని కోరారు. కాని ఆయన సున్నితంగా ఆ సమయంలో తిరస్కరించారు. ఇంకా తాను తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేయాల్సి వుందని చెప్పారు. అలా యునైటెడ్ ఫ్రంట్ తర్వాత కనుమరుగైంది. అయినా చంద్రబాబు ప్రభ మాత్రం తగ్గలేదు. 1999 ఎన్నికల్లో బిజేపితో జతకట్టి ఎన్డీయే కూటమి ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన ఎన్డీయేకు 2019 వరకు చంద్రబాబు కన్వీనర్‌గా వున్నారు. ఆ సమయంలో బిజేపితో విభేదించి పక్కకు జరిగారు. ఇప్ప్పుడు మళ్లీ ఎన్టీయే కూటమిలోనే కాదు కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పాత్రలో వున్నారు. ఇప్ప్పుడు చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి సరైన సమయం అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇలా మంత్రి లోకేష్‌ను ఏపి ముఖ్యమంత్రిని చేయడంతోపాటు, అలా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఏపికి అవసరమైన నిదులను సమకూర్చుకునే అవకాశం వుంటుంది. లోకేష్‌కు చిన్న వయసులోనే జాతీయ రాజకీయాలను పూర్తిగా పరిచయం చేసినట్లౌవుంది. ఇప్పటికే ప్రధాని మోడీ దగ్గర నుంచి జాతీయ నాయకుల చేత శబాష్ అనిపించుకుంటున్న లోకేష్ తండ్రికి తగ్గ తనయుడుగా రాజకీయాలు, పాలనలలో ఆరి తేరేందుకు ఈ సమయం ఎంతో మేలు చేస్తుందని అనుకుంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో చేరడంతోపాటు ఉప ప్రధాని పదవి తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి.

రాష్ట్రంలో అత్యధిక స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

· పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రభుత్వ చర్యలు

· రూఫ్ టాప్ సోలార్ ప్యానళ్లకు ప్రోత్సాహం

· 2030 నాటికి 20వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యం

· గ్రిడ్‌పై భారం పడకుండా సౌర, పవన విద్యుత్‌లపై దష్టి

· వ్యవసాయానికి ఇబ్బంది రాకుండా విద్యుత్ సరఫరాకు చర్యలు

· వచ్చే మే నెల నాటికి విద్యుత్ డిమాండ్ తట్టుకునే రీతిలో సబ్‌స్టేషన్ల ఏర్పాటు

· తగినన్ని పంపిణీ ట్రాన్స్‌ఫార్మను నెలకొల్పనున్న ప్రభుత్వం

ఈనెల 3న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఏడాది మొట్టమొదటిసారి 18139 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. 2025లో నమోదైన అత్యధిక 17162 మెగావాట్లను ఇది అధిగమించింది. కాగా విద్యుత్ అధికార్లు ముందస్తు అంచ నాలు వేసి వుండటం వల్ల అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయగలిగారు. రాబోయేది ఎండాకాలం కనుక విద్యుత్ డిమాండ్ పెరగడం సహజమే కదా, అన్న సందేహం ఉత్పన్నం కావచ్చు. నిజమే కానీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ఆర్థిక ప్రగతికి ఒక చిహ్నంగా భావించాలి. పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయలేకపోతే, పవర్ కట్‌లు తప్పవు. అది పారిశ్రామిక ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం ప డుతుంది. ముఖ్యంగా డిమాండ్ పెరుగుదల తయారీరంగంలో విద్యుత్ వినియోగం పెరగడాన్ని సూచి స్తుంది. తయారీరంగం పనితీరు బాగా వుంటే జీడీపీలో దాని ప్రభావం బలీయం గా వుంటుంది. ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో గహాల్లో విద్యుత్ వినియోగం పెరగడం పెరిగిన ప్రజల జీవన ప్రమాణానికి సూచిక. ఎందుకంటే ఎసీలు, తదితర గహ విద్యుత్ ఉపకరణాల వాడకం పెరగడాన్ని ఇది తెలియజేస్తుంది. ఇక సేవారంగంలో ఐటీ పార్క్‌లు, మాల్స్ వంటివి బాగా విస్తరించడాన్ని కూడా ఈ పెరిగిన డిమాండ్ వెల్లడిస్తుంది. 

డిమాండ్ పెరగడం పైన పేర్కొన్న సానుకూలతలకు చిహ్నమైనప్పటికీ, ఇది గ్రిడ్ సామర్థ్యాన్ని మించినపోయినప్పుడు విద్యుత్ కోతలు విధించక తప్పదు. అంతేకాదు విద్యుత్ సరఫరాకు సంబంధించిన పరికరాలు కూడా దెబ్బతీనే అవకాశాలుంటాయి. ప్రస్తుతం రాష్ట్రం ధర్మల్ విద్యుత్‌పై ఎక్కువగా ఆధారపడుతుండటం వల్ల వాతావరణంలో కలిసే కర్బన ఉద్గారాల పరి మాణం, డిమాండ్ పెరిగే కొద్దీ మరింత పెరుగుతూ పోతుంది. అందువల్ల విద్యుత్ సరఫరాను పర్యావరణహితంగా మార్చాలంటే పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడక తప్ప దు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై దష్టి సారించినప్పటికీ, ఇంకా ఊపందుకోవాలంటే కొంత కాలం పడుతుంది. కాగా ప్రస్తుతం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫ రా చేయడం ప్రభుత్వం ముందున్న తక్షణ సమస్య. గ్రిడ్ సామర్థ్యాన్ని డిమాండ్ మించిపోయి నప్పుడు రాష్ట్రం నేషనల్ ఎక్స్ఛేంజ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఇప్పటి కే అప్పుల భారంతో కునారిల్లుతున్న రాష్ట్రానికి ఇది పెను భారంగా మారవచ్చు. మొత్తంమీద చెప్పాలంటే పెరుగుతున్న డిమాండ్ సానుకూల పరిణామమే అయినప్పటికీ, ఇది విద్యుత్ పంపిణీ సంస్థలపై మరింత వత్తిడి పెంచుతుంది. వచ్చే ఏప్రిల్, మే మాసాల్లో వుండే అత్యధిక డిమాండ్‌ను తట్టుకునేందుకు ఇప్పటినుంచే సంస్థలు ముందస్తు చర్యలు చేపట్టాల్సివుంటుంది.

పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, తగ్గుతున్న శిలాజ ఇంధన వనరుల నేపథ్యంలో అన్ని రా ష్ట్రాల మాదిరిగానే తెలంగాణ కూడా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపైపు దష్టి పెట్టక తప్పదు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలవల్ల, రాష్ట్రం 11399 మె గావాట్ల పునరుత్పాదక ఇంధన వ్యవస్థాపక సామర్థ్యానికి చేరుకుంది. ఇందులో 7889 మెగావాట్లు సౌరవిద్యుత్ కాగా, 2518 మెగావాట్లు జలవిద్యుత్‌నుంచి లభ్యమవుతోంది. 2023`24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సేకరించిన మొత్తం విద్యుత్‌లో 14% ఈ పునరుత్పాదక ఇంధనమే కావడం విశేషం. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో పగటికాలంలో మిగులు సౌరవిద్యుత్‌ను వ్యవసాయానికి తరలించడం ద్వారా గ్రిడ్‌పై భారం పడకుండా జాగ్రత పడుతోంది. విద్యుత్‌ను నిల్వచేసేందుకు ప్రభుత్వం సజనాత్మకంగా 1680 మెగావాట్ల “పంప్‌డ్ హైడ్రో స్టోరేజ్ సిస్టం” (సౌర, పవన విద్యుత్‌లను కూడా కలిపి)ను ఏర్పాటు చేసింది. దీనివల్ల పగటిపూట సౌరవిద్యుత్‌ను నిల్వచేసిన అధిక డిమాండ్ వున్న రాత్రి వేళల్లో దీన్ని వినియోగించడం ద్వారా వినియోగదారులకు ఇబ్బంది కలుగకుండా చూస్తోంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సంతరించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి రాష్ట్రంలో విద్యుత్ పీక్ డిమాండ్ 24215 మెగావాట్లు వుండగలదని అంచనా. 

ప్రభుత్వం 2025లో తీసుకొచ్చిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం 2030 నాటికి మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 50శాతం గ్రీన్ విద్యుత్ వుండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం పెద్ద ఎత్తు న బ్యాటరీ స్టోరేజీ సదుపాయం, వికేంద్రీకత సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టాల్సి వుం టుంది. వీటిని మహిళా స్వయం సంఘాలకు అప్పగించాలన్ని ప్రభుత్వ యోచన. ప్రభుత్వ గ్రీన్ ఎనర్జీ పాలసీకి సానుకూలంగా రూ.29వేల కోట్ల మేర ఈరంగంలో పెట్టుబడులు పెట్టడా నికి వివిధ సంస్థలు ముందుకు రావడం విశేషం. వీటిల్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, 250 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ వున్నాయి. దీర్ఘకాలిక ప్రణాలికలో భాగంగా 2047 నాటికి 90శాతం విద్యుత్ పునరుత్పాదక, స్టోరేజ్ వ్యవస్థలనుంచి పొందాన్నది లక్ష్యం. ముఖ్యంగా ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధనకు ఇది కూడా ఒక దోహదకారిగా వుండగలదు.

సౌర, పవన విద్యుత్‌పై ఆధారపడాలంటే, వీటి స్టోరేజీ వ్యవస్థలను మరింత వేగంగా అభివద్ధి చేయాలి. దీంతోపాటు గ్రిడ్‌ను కూడా ఆధునికీకరించాలి. గాలి, ఎండ తక్కువగా వున్న సమయంలో విద్యుత్ స్టోరేజీకి ఇది చాలా అవసరం. ప్రైవేటు పరిశ్రమల వినియోగదారులు పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌పై ఆధారపడాలంటే, అనుమతుల ప్రక్రియలో విపరీత జా ప్యం వంటి అడ్డంకులు ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ`2025 కింద ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం కీలకాంశం. ఇది గహ యజ మానులు సొంత ఇంటి విద్యుత్ అవసరాలను తీర్చుకొని మిగులు విద్యుత్‌ను, విద్యుత్ సంస్థ లకే అమ్మే అవకాశం కల్పిస్తుంది. దీనిద్వారా గహ వినియోగదారులకు ఆదాయం కూడా లభిస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని గహ యజమానులు తమ పైకప్పులపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం మరింత సరళం చేసింది. గహ వినియోగదార్లు తమకు అనుమతించిన వందశాతం సామర్థ్యంతో కూడిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. 10 కిలోవాట్ అనుమతి వరకు ఏవిధమైన పరిశీలనలు లేకుండానే అనుమతి లభిస్తుంది. అంతకు మించిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి 15రోజుల్లోగా అ నుమతి లభిస్తుంది. 

ఈ ఏడాది వేసవికాలంలో విద్యుత్ డిమాండ్ 19వేల మెగావాట్లను దాటే అవకాశమున్నదని అంచనావేస్తున్నారు. దీన్ని తట్టుకునేందుకు వీలుగా మార్చి నెలాఖరులోగా 26 హై`లోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సబ్`స్టేషన్ల ఏర్పాటుతో పాటు, 1800 పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లను నెలకొ ల్పనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సుస్థిరాభివద్ధితో పాటు దీర్ఘకాల లక్ష్యాలను సాధించే దిశ గా ముందుకెళుతోంది. శంకరపల్లిలో 500 మెగావాట్ల సామర్థ్యమున్న ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ను ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా రాత్రివేళల్లో వుండే అత్యధిక డిమాండ్‌ను తట్టుకు నేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో పరిశ్రమలకు పరిమితితో పనిలేకుం డా క్యాప్టివ్ పవర్ జనరేషన్‌లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులివ్వనున్నారు. దీనివల్ల గ్రిడ్‌పై భారం గణనీయంగా తగ్గనుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్న నేపథ్యంలో పెరిగే గహ వినియోగ డిమాండ్‌ను కూడా ప్రభుత్వం దష్టిలో పెట్టుకుంది. ఈ పథకం కింద ఈ ఏడాది తొలి నాటికి 52.82 లక్షల కుటుంబాలు నమోదయ్యాయి. 200 కంటే ఒక్క యూనిట్ ఎక్కువ వినియోగం జరిగినా పూర్తి బిల్లు చె ల్లించాల్సిందే. అయితే 200 యూనిట్లకంటే తక్కువ వినియోగించే గహాల సంఖ్య క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం.

వైఎస్ కంటే బలంగా రేవంత్!

సీఎం రేవంత్ బలమేమిటో తెలిసింది.

`రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకోగలిగారు.

`ఇది సామాన్యమైన విషయం కాదు.

`గతంలో ఎవరికీ సాధ్యం కాలేదు.

`ఉమ్మడి రాష్ట్రంలో వైస్ కు కూడా ఇంతటి ప్రాధాన్యత దక్కలేదు.

`కేవీపీ కి రాజ్యసభ ఇప్పించడం కోసం ఐదేళ్లు వైస్ ఆగక తప్పలేదు.

`ఐదేళ్ల కాలంలో వైస్ మూడు సార్లు ప్రయత్నం చేసినా అధిష్టానం ఇవ్వలేదు.

`అలాంటిది రేవంత్ కు మాత్రం సాధ్యమైంది.

`12 ఏళ్ల క్రితం వేం నరేందర్ ను ఎమ్మెల్సీ చేయాలనుకున్నాడు.

`అప్పుడు సాధ్యం కాలేదు.

`ఇప్పుడు ఏకంగా రాజ్యసభ కు పంపిస్తున్నాడు.

`వైస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కావడానికి 20 ఏళ్ళు కష్టపడ్డాడు.

`చంద్రబాబు ను ఓడించేందుకు, తాను సీఎం అయ్యేందుకు పాదయాత్ర చేశాడు.

`రేవంత్ రెడ్డి సీఎం అయ్యేందుకు ఎంతో కాలం పట్టలేదు.

`స్నేహితుడిని రాజ్యసభ బరిలో నిలిపేందుకు శ్రమ పడాల్సి రాలేదు.

`బలమైన నాయకుడికి పదవులు దాసోహమంటాయి అనడానికి ఇదే సాక్ష్యం.

`సీఎం రేవంత్ ను అధిష్టానం ఎంత బలంగా నమ్ముతున్నారో అర్ధమైంది.

`ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్ని పటాపంచెలై పోయాయి.

`సీఎం రేవంత్ కు అధిష్టానం వద్ద పలుకుబడి లేదనే వార్తలు తెలిపోయాయి.

`కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా సిఎం రేవంత్ అంటే ఏమిటో తెలిసిపోయింది

`సీఎం. రేవంత్ మీద అధిష్టానానికి వున్న గురి అందరికీ అర్థమైంది.

`అధిష్టానం సీఎం రేవంత్ కు ఎంత విలువ ఇస్తుందో తెలిసినట్లయింది.

హైదరాబాద్, నేటిధాత్రి:

సవాళ్లను స్వీకరించడంలో సిఎం. రేవంత్‌రెడ్డిని మించిన నాయకుడు మరొకరు లేరని మరోసారి రుజువైంది. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఎన్నికయ్యేందుకు అవకాశాలున్నాయి. అందులో రెండు రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం ఇప్ప్పుడున్న పరస్ధితుల్లో కష్టం. కాని రెండో రాజ్యసభ సీటు కూడా కైవసం చేసుకోవడం కోసం సిఎం. రేవంత్ రెడ్డి చూపిన ధైర్యం, చొరవ సామాన్యమైంది కాదు. ఎంతో నమ్మకం, ఆత్మవిశ్వాసం వుంటే కాని అది సాద్యమయ్యేది కాదు. కాని ఎలా అని అందరూ అనుకుంటున్న సమయంలో సిఎం.రేవంత్ రెడ్డి చాణక్యమం మరోసారి తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే సిఎం. రేవంత్‌రెడ్డి మీద బలమైన నమ్మకం వుంది. అందుకే రెండో రాజ్యసభ సీటు తమకు కావాలన్న ఆశ కూడా చాలా మంది నాయకుల్లో వుండేది. అందుకు సీనియర్లు క్యూ కట్టారు. వారిలో మాజీ పిపిసి. అద్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి . హనుమంతరావు ఎన్నోఆశలు పెట్టుకున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కూడా రాజ్యసభకు ఎంపిక చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డికి ఇస్తారని కూడ అనుకున్నారు. మొదటి నుంచి వేం నరేందర్ రెడ్డి పేరు వినిపించలేదు. కాని ఒక్కసారిగా వేం నరేందర్ రెడ్డి పేరును పార్టీ అదిష్టానం ప్రకటించడంతో సిఎం. రేవంత్‌రెడ్డి ఎంత బలమైన నాయకుడు మరోసారి తెలిసిపోయింది. నిన్నటిదాకా అధిష్టానం వద్ద సిఎం. రేవంత్‌కు ఎంట్రీ లేదని కొందరు, సిఎం.ను నమ్మడం లేదని కొందరు ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తూ వచ్చారు. కాని అవన్నీ అబద్దాలని అనేక సార్లు తేలిపోయింది. కాని ఈసారి మాత్రం ఎవరూ ఊహించని విధంగా అదిష్టానం సిఎం. రేవంత్‌రెడ్డికి ఎంత అనుకూలంగా వుందో అందరికీ అర్దమయ్యేలా తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎంతో మంది నాయకులు ఇంతగా అధిష్టానం వద్ద నమ్మకాన్ని సంపాదించకున్న వారు లేరు. ఆఖరుకు వైఎస్. రాజశేఖరెడ్డి కూడా ఇంత బలంగా ఎనాడు కనిపించలేదు. అప్పటి పరిస్దితులకు, ఇప్పటి పరిస్దితులకు పెద్ద తేడా లేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి రావడానికి వైఎస్ ఎంత కష్టపడాల్సి వచ్చింది. తాను సిఎం. కావడానికి కూడా ఇరవై ఏళ్లు పట్టింది. సిఎం. కావడానికి రాజశేఖరరెడ్డి గతంలో ఎన్నడూ ఏ నాయకుడు చేయని విధంగా పాదయాత్ర చేయాల్సి వచ్చింది. అలా పార్టీని మెప్పించి, ఒప్పించి పాదయాత్ర చేసి, ప్రజల నమ్మకాన్ని చూరగొని సిఎం. అయ్యారు. లేకుంటే ఆ సమయంలో కూడా కాంగ్రెస్ గెలిచేది కాదు. రాజశేఖరెడ్డి సిఎం. అయ్యేవారు కాదు. కాని తెలంగాణకు సిఎం. అయ్యేందుకు రేవంత్‌రెడ్డి ఆనాడు వైఎస్ పడిన శ్రమలో పది శాతం కూడా కష్టపడ కుండానే సిఎం. అయ్యారు. అంటే రేవంత్‌రెడ్డి సంకల్పసిద్ది ఎంత బలమైందో అర్దం చేసుకోవచ్చు. సిఎం. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరినప్ప్పుడు ఎలాంటి పరిస్ధితులు వున్నాయో అందరికీ తెలుసు. అడుగడుగునా అవరోధాలు. అవమానాలు. తిరస్కారాలు. పార్టీ సీనియర్ నాయకుల నుంచి ఎదరింపులు. అయినా అన్నీ దిగమింగకుంటూ వచ్చారు. ఆఖరుకు రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడు అయ్యేందుకు, అయిన తర్వాత కూడా అడుగుడుగునా అనేక అవాంతరాలు ఎదుర్కొన్నారు. నిత్య కష్టం ఎల్లదీశాడు. అటు ఇంటి పోరు, ఇటు బైటి పోరు అన్నట్లు నిత్యం సొంత పార్టీలో అనేక మంది టార్గెట్లు చేస్తూ వచ్చేవారు. బైట విషయానికి వస్తే ఆనాటి కేసిర్ సర్కారు రేవంత్‌ను కాలు బైట పెట్టకుండా నిత్యం ఏదో రకంగా అడ్డుకుంటూ వుండేది. అయినా వాటన్నింటికీ తట్టుకుంటూ ముందుకెళ్లారు. పార్టీ కోసం పనిచేశారు. పార్టీని బలోపేతం చేశారు. ఆనాడైనా, ఈనాడైనా ఒంటరి పోరాటమే చేస్తున్నారు. పార్టీని అదికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. వైఎస్‌లాగా సుధీర్ఘ పాదయాత్ర చేయకపోవచ్చు. కాని ఎంతో కొంత పాదయాత్ర కూడా చేశారు. ఆ పాదయాత్రను కూడా అడ్డుకునే ప్రయత్నం సొంత పార్టీలో కూడా చేశారు. ఆ రోజుల్లో రేవంత్ అనుభవించినంత నరకం మరొకరైతే రాజకీయాలు వద్దని వెళ్లిపోయేవారేమో? ఓ వైపు కోవర్టులు, మరో వైపు పార్టీలోనే శత్రువులు, ఆనాటి ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు అన్నీ తట్టుకున్నారు. నిలబడ్డారు. ప్రణాళికలు రచించారు. పార్టీని ఒప్పించారు. ప్రజలను విశ్వాసం పొందారు. ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. ప్రజల నుంచి సానుకూల వాతావరణం సంపాదించుకున్నారు. తెలంగాణలో పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుసకొచ్చారు. ఇది ఎవరు ఔనన్నా, కాదన్నా అంగీకరించాల్సిన సత్యం.ఎందుకంటే ఇటీవల జరిగిన వరుస ఉప ఎన్నికలైనా, పంచాఇయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా సరే సిఎం. రేవంత్ ఒంటి చేత్తో గెలిపించకుంటూ వస్తున్నారు. అధిష్టానం వద్ద రోజురోజుకు నమ్మకం పెంచుకుంటూ పోతున్నారు. ఇకపోతే తాను సిఎం. కావడానికి ఇరవై ఏళ్లు కష్టపడిన, వైఎస్ రాజశేఖరెడ్డి, తన స్నేహితుడైన కేవిపి. రామచంద్రరావును రాజ్యసభకు పంపడానికి కూడా అనేక సార్లు ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ప్రతీసారి చుక్కెదురైంది. ఎప్ప్పుడు అవకాశం వచ్చినా వైఎస్ ఆనాడు కేవిపి. పేరును ప్రతిపాదించడం, అదిష్టానం తిరస్కరించడం జరిగేంది. ఆ సమయంలో దేశంలోనే బలమైన సిఎం. అనే పేరు సంపాదించుకున్న వైఎస్ ర్పుాశేఖరెడ్డి మాటలు కూడా అధిష్టానం వద్ద చాలా కాలం చెల్లుబాటు కాలేదు. ఆయన ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. ఆఖరుకు ఆయన రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత గాని కేవిపి రామచంద్రరావుకు రాజ్యసభ ఇప్పించుకోలేకపోయారు. అలా ఐదేళ్లపాటు అదిష్టానానికి ప్రతిపాదనలు పదే పదే పంపితే అప్ప్పుడు మోక్షం కుదిరింది. ఆ రోజుల్లో కేంద్రంలో వైఎస్. ఎంత చెబితే అంత అనేలా వుండేది రాజకీయం. అయినా రాజశేఖరెడ్డి మాట ఆనాడు చెల్లలేదు. అలా వైఎస్‌తో పోల్చుకుంటే సిఎం. రేవంత్‌రెడ్డి బలం అనేక రెట్లు వుందని చెప్పడంతో సందేహం లేదు. లేకుంటే రెండు రాజ్యసభ సీట్లే వచ్చే చోట ఒకటి తన స్నేహితుడికోసం ఇప్పించుకోగలగడం అంటే సామాన్యమైన విషయం కాదు. వైఎస్ కాలంలో ఒక్క సోనియా గాందీని ఒప్పిస్తే సరిపోయేది. ఇప్ప్పుడు అలాంటి పరిస్ధితి కూడా కాదు. సోనియాగాంధీ, రాహుల్ గాందీ, ప్రియాంకాగాందీ, మల్లికార్జున ఖర్గేతోపాటు పార్టీ ప్రదాన కార్యదర్శి వేణుగోపాల్‌ను కూడా ఒప్పింగలిగితే తప్ప సీటు వచ్చే అవకాశం లేదు. కాని ఇంత మందిని సునాయాసంగా ఒప్పించగలిగిన సిఎం. రేవంత్‌రెడ్డికి అధిష్టానం వద్ద ఎంత వెయిట్ వుందో ఈ ఒక్క సందర్భం చాలు. అసలు రాజ్యసభ సీటు ఇప్పించుకోవడమే ఎంతో పెద్ద టాస్క్. అలాంటిది ఇప్ప్పుడు వేం నేరేందర్‌రెడ్డిని గెలిపించుకోవడం అనేది మరింత పెద్ద టాస్క్. ఆ టాస్క్‌ను ఎలా గట్టెక్కుతారనేది ఇప్ప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఇప్ప్పుడు ఎలా రెండో రాజ్యసభ సీటు గెల్పించుకుంటారనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మరో వైపు బిఆరఎస్ తన వ్యూహం కూడా అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అదే జరిగితే రెండో రాజ్యసభ గెల్చుకోవడం సాద్యం కాని పని. అయినా ఎంతో నమ్మకంతో రేవంత్ రెడ్డి తన స్నేహితుడిని నిలబెట్టారు. ఒక వేళ బిఆరఎస్ విప్ జారీ చేసినా పది మంది ఎమ్మెల్యేలలో కనీసం ఎనమిది మంది ఓట్లు వేస్తారన్న నమ్మకం వుంది. ఆ ఎనమిది మంది పదవులు పోయినా, మళ్లీ గెలిపించుకుంటానన్న నమ్మకం వుంటే తప్ప ధైర్యం చేయలేని పరిస్దితి. అయినా రంగంలోకి దిగారంటే రేవంత్ బారీ వ్యూహమే రచిస్తున్నారని అర్ధమౌతోంది. ఇంకా ఎంత మంది బిఆరఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనేది తేలిపోతుంది. రెండో రాజ్యసభ సీటు కూడా సిఎం. రేవంత్ రెడ్డి గెలిపించుకుంటే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌రెడ్డిని మించిన బలమైన నాయకుడు లేడనే చెప్పాలి. రెండో రాజ్యసభ గెలిపించుకుంటే కాంగ్రెస్‌లో తిరుగుండదు. ఎదురుండదు. ప్రతిపక్ష వ్యూహాలు ఇక భవిష్యత్తులో కూడా చెల్లవు. అంతటి బలమైన నాయకుడుగా రేవంత్ రెడ్డి జాతీయ స్దాయిలోనూ గుర్తింపు పొందుతాడు. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లోనూ కీలకభూమిక పోషిస్తారని చెప్పడంలో అశియోక్తి కూడా వుండదు. చూద్దాం..ఏం జరుగుతుందో!!

మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ సర్పంచ్ కీర్తన ప్రభాకర్…

మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ సర్పంచ్ కీర్తన ప్రభాకర్

◆-: ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం కప్పా డ్ గ్రమంలో ఈరోజు గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కీర్తన ప్రభాకర్ , ఉప సర్పంచ్ బీరదర్ లక్ష్మి సురేష్ భూమి పూజా నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథులుగా హాజరై,న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ .ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “మహిళా సంఘాల సభ్యులు తమ సమావేశాలను మరియు ఇతర కార్యకలాపాలను సొంత భవనంలో నిర్వహించుకోవడం వల్ల వారి ఆర్థిక, సామాజిక సాధికారత మరింత మెరుగుపడుతుంది. గ్రామ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉంది, ఈ భవనం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే, జహీరాబాద్ ఎంపి సురేష్ శెట్కార్ సహకారంతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని, ప్రజలందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కేతకి డైరెక్టర్ మల్లప్ప పాటిల్,మాజీ సర్పంచ్ నందప్ప పటేల్, కాంగ్రెస్ నాయకులు సంగ్రామ్ పటేల్ వేణుగోపాల్, డప్పుర్ సంగమేష్,శ్రీకాంత్ రెడ్డి,మారుతి రావు పాటిల్, రాజు స్వామి సుభాష్ బసవరాజ్ పటేల్ సయ్యద్ షకీల్ నావజ్ రెడ్ది, రాఘవేందర్ గోపాల్, సంఘమేశ్వర్ వార్డు సభ్యులు మొల్ల మౌలానా మంగలి సుధాకర్, మ్యాతరి మహేష్ గ్రామ సంఘం అద్యక్షురాలు బి. అనిత కార్యదర్శి సూకన్య,వి ఓ ఏ ఖాజా, రాజు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

“కోహీర్ వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభం…

“కోహీర్ వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభం”.

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://youtu.be/RsmS54EeUj0?si=L6voCsp5NfB5KdP6

కోహీర్ మున్సిపల్ వార్డుల్లో చైర్మన్ మ్యాతరి అశోక్ ఆధ్వర్యంలో ఎక్కల్ దేవి కుంటలో అభివృద్ధి పనులు గురువారం ప్రారంభమయ్యాయి. రోడ్ల మరమ్మతు పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చైర్మన్ ప్రారంభించారు. త్వరలో మున్సిపల్ కమిషనర్ అధికారిని నియమిస్తామని, గ్రామంలోని పదహారు వార్డుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అన్నన్ జావీద్, పట్టణ అధ్యక్షులు శంషీర్ అలీ, కౌన్సిలర్లు రఫిక్ బాయ్, మహమ్మద్ హైమద్, శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు జగదీశ్, గోపాల్, ఆనంద్, అశోక్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.

“గ్రామ అభివృద్దే మా లక్ష్యం…

“గ్రామ అభివృద్దే మా లక్ష్యం”.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత నాజియా అంజూమ్ షైక్ సోహైల్ విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుమ్మనపల్లి గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే ప్రతి రూపాయితో తుమ్మనపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు.పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామని, త్వరలోనే గ్రామ సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధి కార్యకలాపాలు చేపడతామని ఆయన అన్నారు.
గ్రామంలోని వార్డుల్లో సిసి రోడ్లు, సైడ్ డ్రెయిన్లు ఏర్పాటు చేస్తామని, అలాగే ప్రతి సింగిల్ ఫేజ్ మోటారు వద్ద ఒక మినీ ట్యాంకర్ ఏర్పాటు చేస్తామని, ముందుగా అత్యవసర పనులను పూర్తి చేస్తామని ఆయన అన్నారు.తుమ్మనపల్లి ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని, గ్రామంలో సమస్యలు లేకుండా అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని ఆయన ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామం అభివృద్ధిలో ముందుంటుందని సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ విశ్వాసం వ్యక్తం చేశారు.గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు అభివృద్ధి విషయాలలో తమకు సహకరించాలని ఆయన కోరారు.ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని ఆయన అన్నారు.

రాబోయే సంవత్సరంలో జరగబోయే గోదావరి పుష్కరాల గాట్లను పరిశీలన…

రాబోయే సంవత్సరంలో జరగబోయే గోదావరి పుష్కరాల గాట్లను పరిశీలన

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

మెట్పల్లి డి.ఎస్.పి ఏ రాములు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమటి కొండాపూర్ , ఎర్దండి,మూలరాంపూర్, భర్దిపూర్ , వేములకుర్తి గ్రామాల్లో గల గోదావరి పుష్కర ఘాట్లను సందర్శించడం జరిగినది. డీఎస్పీ తో పాటుగా ఇబ్రహీంపట్నం తహసిల్దార్ వరప్రసాద్ మరియు ఇబ్రహీంపట్నం ఎస్సై జి నవీన్ కుమార్ గోదావరి పుష్కర ఘాట్లను సందర్శిoచ్చినారు.

error: Content is protected !!
Exit mobile version