అంతర్ముఖ, ఆనంద, ఆరోగ్య యోగ శిబిరం…

అంతర్ముఖ, ఆనంద, ఆరోగ్య యోగ శిబిరం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ లో ఈ నెల 8వ తేదీ న అంతర్ముఖ, ఆనంద, ఆరోగ్య యోగ శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు చిర్ర యాకాంతం గౌడ్, చింతనూరి సతీష్ లు తెలిపారు.

ఈ యోగ శిబిరం శ్రీ సత్యసాయి ధ్యానమండలి, విజయవాడ ఆధ్వర్యంలో, పూజ్యశ్రీ బిక్షమయ్య గురూజీ మార్గదర్శకత్వంలో జరిగే ఈ శిబిరంలో యోగాభ్యాసం ద్వారా శారీరక-మానసిక ఆరోగ్యం మెరుగుపర్చుకోవడం, అంతర్ముఖ ఆనందాన్ని పొందడం, జీవితాన్ని సానుకూల దృక్పథంతో సాగించడం వంటి అంశాలపై సాధన మరియు ఉపన్యాసాలు నిర్వహిస్తారు.

ఈ యోగ శిబిరంలో పాల్గొనే వారికి జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని వారు పేర్కొన్నారు.

ఈ శిబిరంలో పాల్గొనదలచిన వారు ముందుగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఆసక్తి గల భక్తులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

జమ్మికుంట మార్కెట్లో రోజురోజుకు తగ్గుతున్న పత్తి ధరల.

జమ్మికుంట మార్కెట్లో రోజురోజుకు తగ్గుతున్న పత్తి ధరల.

జమ్మికుంట ( నేటి ధాత్రి )

 

జమ్మికుంటలో పత్తి ధరలు కొన్ని రోజులుగా స్థిరంగా తగ్గుతూ వస్తున్నాయి. వారం ఆరంభంలో ఆశాజనకంగా కనిపించిన ధరలు, వారాంతానికి వచ్చేసరికి గణనీయంగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం క్వింటాకు రూ.7,600, బుధవారం రూ.7,550, గురువారం రూ.7,500, శుక్రవారం రూ.7,450 పలికింది. కేవలం 5 రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.150 వరకు ధర తగ్గడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు.

ప్రధాన మంత్రి ప్రజలు చూస్తున్నారు..

ప్రధాన మంత్రి ప్రజలు చూస్తున్నారు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

హోతి బి గ్రామంలో మహిళా కాంగ్రెస్ గ్రామ అధ్యక్షురాలు స్వప్న అధ్వర్యంలో జరిగిన “ద. పి.యం. ఇస్ కాంప్రమైజ్డ్”అనే కరిక్రమానికీ జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అస్మా హాజరయ్యారు.అస్మా మాట్లాడుతూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఎప్స్టీన్ ఫైల్‌లో కనిపించడమే కాకుండా, ఎప్స్టీన్ లాంటి సీరియల్ రేపిస్ట్ మరియు పెడోఫైల్‌తో తనకు సంబంధం ఉందని అతనే అంగీకరించాడు.ఎప్స్టీన్ ఫైల్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, కానీ భారతదేశంలో అలాంటి వారిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు?
ప్రభుత్వం చర్య తీసుకోవడానికి నిరాకరించినప్పుడు, ప్రధానమంత్రి రాజీ పడ్డారా అని ప్రజలు ప్రశ్నిస్తారు? కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.దాచడానికి ఏమీ లేకపోతే, ఈరోజే దర్యాప్తుకు ఆదేశించండి. మహిళల గౌరవం కేవలం నినాదం కాదని నిరూపించండి. వందలాది మంది తల్లులు, సోదరీమణులు మరియు కుమార్తెలు కోపంతో సంతకం చేసి, సమాధానాలు కోరుతున్నారు.మేము మౌనంగా ఉండము. మేము వెనక్కి తగ్గము. న్యాయం రాజీనామాను కోరుతుంది. జవాబుదారీతనం ధైర్యాన్ని కోరుతుంది.ఈ కారిక్రామంలో మాజీ జెడ్‌.పి.టి.సి మాణిక్యమ్మ అనిత, బుజ్జమ్మ, సుజాత, చంద్రకళ, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

అయినవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య శిబిరం

అయినవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య శిబిరం
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కే. ఆర్ నాగరాజు

నేటి ధాత్రి అయినవోలు:-

 

 

 

అయినవోలు గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. ప్రజా పాలన ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా ఏవైనా అవసరాలు ఉంటే వాటిని కూడా ప్రభుత్వం ద్వారా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జవహర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ జన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి, మాజీ ఎంపిటిసి బొల్లపెల్లి మధు, అయినవోలు గ్రామ ఉపసర్పంచ్ బరిగల భాస్కర్, వార్డ్ సభ్యులు రాజేందర్, నల్లబెట్టి రాజు, అయినవోలు మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కొత్తూరు కుమార్ స్వామి, రాంనగర్ రాజేష్ రెడ్డి, అయినవోలు మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ కొండేటి దిలీప్, అయినవోలు గ్రామ యూత్ ప్రెసిడెంట్ తాటికాయల ప్రశాంత్, కోట నర్సయ్య, అయినవోలు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోల్లపల్లి పరమేష్ గౌడ్, బోల్లపల్లి శ్రీను గౌడ్, బోల్లపల్లి రఘు, సంపత్, చింత ఏలీయా తదితరులు పాల్గొన్నారు.

విహా గౌడ్ ను జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్.

విహా గౌడ్ ను జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మొగుడంపల్లి ఎస్ వి కే గార్డెన్ లో సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ గౌడ్ గారి కూతురి మెదటి జన్మదిన శుభకార్యానికి హాజరై నా తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వీహ గౌడ్ ను అక్షింతలు వేసి ఆశీర్వదించి భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గోవర్ధన్ రెడ్డి బిజీ సందీప్ బాల్ రెడ్డి మొహమ్మద్ మోయిన్ నవీద్ సోహెల్ తదితరులున్నారు,

ఉత్తమ ఫలితాలు సాధించాలి.

ఉత్తమ ఫలితాలు సాధించాలి.

#పరీక్ష సామాగ్రి పంపిణీ చేసిన బట్టు సాంబయ్య.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

ఈనెల 14వ తేదీన జరగబోయే పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాల విద్యార్థినిలకు పరీక్ష కు సంబంధించిన ప్యాడు, పెన్నులను ఉచితంగా దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్య సాధన ఏర్పాటు చేసుకొని ఆ దిశగా కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి ఉద్యోగాలు సంపాదించే వరకు విశ్రమించకూడదు .అలాగే పదవ తరగతి పరీక్షలో ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థులకు 5116, ద్వితీయ ర్యాంకుకు3116 రూపాయల బహుమతిగా అందజేయడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులందరూ పరీక్షలు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి సునీత, ఎమ్మార్పీఎస్ నాయకుడు పనికిరత్నం, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

నెక్కొండ రైతు వేదికలో రైతులకు యంత్ర పరికరాల పంపిణీ…

నెక్కొండ రైతు వేదికలో రైతులకు యంత్ర పరికరాల పంపిణీ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నర్సంపేట నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం నెక్కొండ మండలంలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ గ్రామ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ , కలిసి రైతులకు రోటవేటర్లు, స్ప్రేయర్లు, వరిగడ్డి కట్టే యంత్రాలు, 11 చాళ్ల నాగళ్ళు తదితరంగా మొత్తం 86 వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్ర పరికరాల సబ్సిడీ పథకాన్ని పునరుద్ధరించిందన్నారు. ఈరోజు రూ.16.5 లక్షల విలువైన యంత్ర పరికరాలను 86 మంది రైతులకు అందించామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను నర్సంపేట నియోజకవర్గ రైతులకు రూ.95 లక్షల విలువైన సబ్సిడీ యంత్ర పరికరాలను ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మార్గదర్శకత్వంలో రైతులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామని చెప్పారు.
అనంతరం “ఆత్మ” పథకం కింద రైతులకు వ్యవసాయంలో నైపుణ్యత పెంపు, సాంకేతిక పద్ధతులపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ జిల్లా “ఆత్మ” ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయనిర్మల మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి, విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా అధిక లాభాలు పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు దామోదర్ రెడ్డి, నెక్కొండ మండల వ్యవసాయ అధికారురి నాగరాజు తో పాటు నర్సంపేట మండల వ్యవసాయ అధికారి, ఏ ఈ ఓ లు అరుణ్, వసంత, ఆత్మ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

పట్టణ అభివృద్ధికి సహకరించాలి-తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్

పట్టణ అభివృద్ధికి సహకరించాలి-తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

తొర్రూరు పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని తోరూర్ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మునిసిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందులచే ప్రతిజ్ఞ చేయించి, 10వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడానికి శ్రీకారం చుట్టిందని, దీనిలో భాగంగా మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు సమన్వయంతో పట్టణ అభివృద్ధికి పాటుపడాలన్నారు.
అన్ని వార్డులలో పనులు జరిగే విధంగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, యువకులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సోమ రజని రాజశేఖర్, కౌన్సిలర్లు తూర్పాటి రవి, మాడుగుల భవానిలత, అల్లం శ్యామల, కిన్నెర కవిత, ముద్దసాని సురేష్, ధరావత్ పద్మ,చకిలేల అలివేణి, జాటోత్ భద్రు నాయక్, మున్సిపల్ సిబ్బంది,మెప్మా, ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.

ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి…

ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం గట్లకానీపర్తి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తు న్నారు తేదీ 08 03 2026 ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం నిర్వహిం చబడును. మెడికల్ హెల్త్ క్యాంప్ ద్వారా అందిస్తున్న ఉచిత వైద్య సేవలకు గట్ల కనపర్తి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన నర్సింహులపల్లి ప్రోచా రo,మాందారిపేట సూరంపేట మరియు పులుకుర్తి తదితల గ్రామాలకు చెందిన మహిళలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు

శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్ దంపతులు…

శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్ దంపతులు

భూపాలపల్లి నేటిధాత్రి

శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి ఆలయ ప్రాంగణంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
అనంతరం జగిత్యాల జిల్లా కొండగట్టు లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు

విద్యార్థి స్వయం పాలన: పాఠశాలలో ఒక వినూత్న కార్యక్రమం..

విద్యార్థి స్వయం పాలన: పాఠశాలలో ఒక వినూత్న కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం శంషల్లాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో, విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు అధికారుల పాత్రలను పోషించడం ద్వారా పాఠశాల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు.ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారి ఉపాధ్యాయులు కవిత నందినిల పర్యవేక్షణలో విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు ఆసక్తికరంగా పాఠాలు బోధించారు.విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశం…

ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం .చీరవంచ గ్రామంలో. నూతన గృహప్రవేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా. నాయకులు ప్రజా ప్రతినిధులు కలిసి ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహ ప్రవేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. గూడు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని. ప్రతి ఒక్క అర్హుల అందరికీ.విడుతల.వారీగా ఇందిర .ఇoడ్లుమంజూరు కానున్నట్లు. తెలియజేస్తూ.నిరుపేదల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం హర్నశలు.కృషి చేస్తుందని. రాష్ట్రంలో ప్రతి పేదోడి ఆత్మగౌరవ ప్రత్యేక ఇందిరమ్మ ఇండ్లు .అని. ప్రజా ప్రభుత్వ పరిపాలనలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో. ఉంచుతున్నారని. అందులో.భాగంగా .రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి. పేదోడి సొంతింటి కల నెరవేర్చతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఇందులో భాగంగా ఈరోజు తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ.గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకున్న. లబ్ధిదారులు. వారు నూతన గృహప్రవేశం.చేసినారనిఈo దుకు గానులబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు. ఈ సందర్భంగా మాచిరకాల.కల .నెరవేర్చిన వారందరికీ లబ్ధిదారులు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో .సర్పంచ్ రేణుక రాజు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ. హౌసింగ్ ఏఈ. హమీద్. ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. జలగంప్రవీణ్.పాక్స్. డైరెక్టర్ కొండయ్య. జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి. జలంధర్ రెడ్డి. సుద్దాల శ్రీనివాస్.నలువలరాజిరెడ్డి. తదితరులు పాల్గొన్నారు

ఉపసర్పంచుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఎన్నిక.

ఉపసర్పంచుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఎన్నిక.

చిట్యాల నేటిదాత్రి :

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో భూపాలపల్లి జిల్లా ఉప సర్పంచ్ ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉప సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొట్ల కార్తీక్ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ దేశ అభివృద్ధి కి గ్రామాలే పట్టుకొమ్మలు కాబట్టి గ్రామ అభివృద్ధి లో ఉప సర్పంచ్ లు ముందంజలో ఉండాలని ఈ సందర్బంగా కార్తీక్ కోరారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచ్ లు ప్రత్యేక చొరవ చూపించాలని కార్తీక్ అన్నారు, అనంతరం ఉప సర్పంచ్ ల సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ని కార్తీక్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర వెంకటేష్ గౌడ్ ను ఉప సర్పంచ్ ల సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది అని తెలిపారు , అనంతరం వారు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన ఉప సర్పంచ్ ల అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు,ఈ
కార్యక్రమంలో వివిధ గ్రామాల ఉపసర్పంచ్ పాల్గొన్నారు.

సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత పునర్ధరణ కార్యక్రమం…

సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత పునర్ధరణ కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిపిఐ ముఖ్య సమావేశం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా. కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు ఈసందర్భంగా ఖమ్మం లో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలక్యాడర్ను పెంచుకుంటూ పోరాటాలు కొన.సాగించిందని. అలాగే ఈ క్రమంలో .100 .సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో అనేక త్యాగాలు చేసిందని అన్యాన్యమైనపోరాటాలు చేసిందని. ఈ సందర్భంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తంగళ్ళపల్లి మండలం .లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన .సింగిరెడ్డి భూపతిరెడ్డి. నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడి మందాపూర్. గుట్టల్లో.నైజం పోలీసులచే.బూటకం ఎన్కౌంటర్లో అమరుడు.య్యారని. ముఖ్యంగా ఉపాధి హామీ చట్టం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ఉపాధి హామీ కార్మికుల అనేక అడ్డంకులు సృష్టిస్తూ అనేక సమస్యలను సృష్టిస్తూ ముఖ్యంగా .ముఖ కలకలు.వినిపించాలని ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టాలు కార్మికులను ఉపాధి హామీ పథకాన్ని దూరం చేసే పద్ధతి కొనసాగుతుందని. ఈ.జీ.ఏ.పథకాన్ని తీసేసి జి.రాo.జి. చట్టాన్ని తీయడానికి తీవ్రంగా.వ్యతిరేకిస్తున్నాం అని ఈ చట్టం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు 90% నిదులు .కేటాయించగా. ఇప్పుడు కేంద్రం 60 శాతం గాను రాష్ట్రాల 40% గానూ రాష్ట్రాల మీద భారం పడుతుందని ఇది .జిరాంజీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని.జిరాంజీ పథకంలో యంత్రాల వాడకాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం మనీ. ఈజీఎస్ పథకంలో 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ. నెలల తరబడి పని చేసే కార్మికులకు డబ్బులు ఇవ్వకపోవడం మూలంగా. ఈజీఎస్ అని అంటేనే కార్మికులకు.విసుక్కునే పరిస్థితి వస్తుందని. కార్మికుల ఉపాధి హామీ పథకంలో పని కావాలంటే స్థానిక ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకుంటేనే పని దొరికేది పని హక్కుగా కొనసాగింది. బిజెపి ప్రభుత్వం పని హక్కును రద్దుచేసి కేవలం పథకంగా అమలు చేసే పద్ధతిని బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిందని తక్షణమే ఈజీఎస్ కొనసాగించాలని చట్టాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా. ప్రతి సంవత్సరం సిపిఐ పార్టీ సభ్యత్వ పునర్ధరణ కార్యక్రమం జరుగుతుందని అందులో భాగంగానే ఈరోజు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిపిఐ ముఖ్య సమావేశo. సిపిఐ మండల కార్యదర్శి సోమ నాగరాజు. ఆధ్వర్యంలో నిర్వహిస్తూ సిపిఐ పార్టీ సభ్యత పునర్ధరణ కార్యక్రమం లో. భాగంగా మండల శాఖ సిపిఐ సభ్యత పునర్ధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో. సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వ్యవసాయ కళాశాలలో పుట్టగొడుగుల పెంపకం పై ప్రత్యేక శిక్షణ….

వ్యవసాయ కళాశాలలో పుట్టగొడుగుల పెంపకం పై ప్రత్యేక శిక్షణ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల .గ్రామ శివారులోని. బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్ డి.ఎన్. కే.బి. సునీత దేవి మాట్లాడుతూ. పుట్టగొడుగుల పెంపకం ద్వారా యువతకు మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తుందని. రైతులకు వ్యవసాయంతో పాటు పుట్టగొడుగుల పెంపకంపై దాని ద్వారా అదనపు ఆదాయం అర్జించ.వచ్చునని తెలుపుతూ. అలాగే డాక్టర్ డి అశ్విని అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ పాథాలజీ మాట్లాడుతూ. పుట్టగొడుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ పాదాలజీ పుట్టగొడుగుల పెంపకం వల్ల వచ్చే లాభాల మరియు అవకాశాల గురించి మాట్లాడుతూ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఇట్టి శిక్షణ కార్యక్రమాన్ని డా.డి.అశ్విని. చాలా చక్కగా నిర్వహిస్తూ. ఇట్టి కార్యక్రమం పై అవగాహన నిర్వహిస్తూ వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దానిని ఇట్టి కార్యక్రమంలో వివరించడం జరిగింది ఇట్టి శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులందరూ పాల్గొన్నారు

ప్రజా సమస్యలే ద్యేయంగా పనిచేస్తాం…

ప్రజా సమస్యలే ద్యేయంగా పనిచేస్తాం

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం

వార్డు కౌన్సిలరుతో కలిసి వార్డులో పర్యటించిన

చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గల ప్రజా సమస్యలే ద్యేయంగా పనిచేస్తామని మున్సిపాలిటి చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 2వ వార్డులోస్థానిక కౌన్సిలర్ కాంపెల్లి వీణ-విజేందర్ రెడ్డితో కలిసి శుక్రవారం నర్సంపేట మున్సిపాలిటి ఛైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా పర్యటించారు.అనంతరం ఛైర్ పర్సన్ మాట్లాడుతూ నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉదయం వార్డులో పర్యటిస్తున్నప్పుడు తమ దృష్టికి ప్రతి సమస్యను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో వార్డులను సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.అదే విధంగా 2వ వార్డులో వాటర్ సమస్యను గుర్తించడం జరిగిందని పాడైపోయిన బోర్లు అలాగే బావులు రిపేర్ చేయించి నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టామని త్వరలోనే బావులు బోర్ల ద్వారా నీటిని అందిస్తామని పేర్కొన్నారు.

వార్డులో అవసరమైన సీసీ రోడ్డు, సైడు కాలువల నిర్మాణ పనులు చేపట్టి, నీటి సమస్య, పారిశుద్ధ పనులపై ప్రత్యేకమైన దృష్టి పెడతామని వార్డును అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్, సానిటేషన్ ఎస్సై శ్యామ్, 3వ వార్డు కౌన్సిలర్ ముత్తినేని వెంకన్న, 4వ వార్డు కౌన్సిలరు బీరం భరత్ రెడ్డి, వాటర్ సప్లై ఇంచార్జ్ కాట శ్రీనివాస్, వార్డు ఆఫీసర్ యుగంధర్, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల నవీన్, చిదురాల రాంరెడ్డి, దూపటి కుమార్, కేశపాక సాంబయ్య, ఎండీ రజాక్, రహీం, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు…

మున్సిపల్ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

అభివృద్దే ద్యేయంగా పనిచేసే నాయకుడు పావుశెట్టి సునీల్

18వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పసుల శ్రీనివాస్

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పావుశెట్టి సునీల్ కుమార్‌ను శుక్రవారం పలువురు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.ఈ సందర్భంగా 18వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు పసుల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒంటేరు రమేష్ చైర్మన్‌ను కలసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్బంగా పసుల శ్రీనివాస్ మాట్లాడుతూ పావుశెట్టి సునీల్ కుమార్ మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం పరకాల పట్టణ అభివృద్ధికి మంచి సూచిక అని నాయకులు పేర్కొన్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేలా ఆయన పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.పట్టణ అభివృద్ధి కోసం చైర్మన్ పావుశెట్టి సునీల్ సమర్థంగా పనిచేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.

400 కేజీల గుడుంబా బెల్లం పటిక పట్టివేత…

400 కేజీల గుడుంబా బెల్లం పటిక పట్టివేత

బెల్లం,పటిక,కారు స్వాధీనం..నిందితుడి అరెస్ట్

నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు

నర్సంపేట ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

నిషేధిత అక్రమ గుడుంబా తయారి కోసం రవాణా చేస్తున్న 100 కిలోల బెల్లం 300 కిలోల పటిక, ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఏ నరేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు,జిల్లా ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు నర్సంపేట పరిధిలో నాటుసారా నియంత్రణ కొరకు ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.ఈ సందర్భంగా నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట ప్రధాన రహదారిపై విస్తృత తనిఖీలను చేపట్టగా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన బానోతు రాజన్న @ టీక్య అనే వ్యక్తి కారును అనుమానంతో తనిఖీలు చేయగా కారులో బెల్లం,పట్టిక,నాటుసారా లభ్యమైంది.కాగా అతని వద్ద నుండి 300 కేజీల పట్టిక ,100 కేజీల బెల్లం, ఐదు లీటర్ల నాటుసారా, టాటా విస్టా కారు, ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగిందన్నారు. నిందితుడు పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం సిఐ నరేష్ రెడ్డి మాట్లాడుతూ నిషేధిత నాటుసార తయారుచేసిన విక్రయించిన చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ రూల్స్ ప్రకారం గుడుంబా తయారు చేసిన,విక్రయించిన ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ పథకాలు రద్దు చేయాల్సి ఉంటుందని సిఐ సూచించారు.ఈ తనిఖీలలో నర్సంపేట ఎక్సైజ్ ఎస్సై శార్వాణి, సిబ్బంది పాల్గొన్నారు.

బస్సులు ఆగడం లేదని గ్రామస్థుల ధర్నా…

బస్సులు ఆగడం లేదని గ్రామస్థుల ధర్నా

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్ (బి) గ్రామస్థులు, విద్యార్థులు ఆర్టీసీ బస్సులు తమ గ్రామంలో ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. జహీరాబాద్ డిపోకు చెందిన బస్సులు రాయికోడ్, వట్పల్లి వైపు వెళ్తున్నప్పటికీ గ్రామంలో ఆగకపోవడంతో గ్రామస్థులు, విద్యార్థులు కలిసి సుమారు అరగంట పాటు బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. డిపో అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిపో అధికారులను కోరారు.

గ్రామ అభివృద్ధిలో ఉప సర్పంచ్ లు ముందంజలో ఉండాలి..

గ్రామ అభివృద్ధిలో ఉప సర్పంచ్ లు ముందంజలో ఉండాలి

బొట్ల కార్తీక్ (ఉప సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు)

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో భూపాలపల్లి జిల్లా ఉప సర్పంచ్ ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉప సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొట్ల కార్తీక్ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ దేశ అభివృద్ధి కి గ్రామాలే పట్టుకొమ్మలు కాబట్టి గ్రామ అభివృద్ధి లో ఉప సర్పంచ్ లు ముందంజలో ఉండాలని ఈ సందర్బంగా కార్తీక్ కోరారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచ్ లు ప్రత్యేక చొరవ చూపించాలని కార్తీక్ అన్నారు అనంతరం ఉప సర్పంచ్ ల సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ని కార్తీక్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా గౌరవ అధ్యక్షులు ఒద్ది చంద్రయ్య (మహాదేవ్పూర్)
జిల్లా అధ్యక్షులు — గట్టు ప్రదీప్ గౌడ్ (గోరి కొత్తపల్లి)
జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు — బొబ్బిలి రాజు (కొయ్యుర్)
జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెల శంకర్ (రేగొండ)
జిల్లా ఉపాధ్యక్షులు
చమ్మాల సుధీర్ కుమార్ (మహాదేవ్ పూర్)
మొగిలి శంకర్ (ఘనపూర్ ములుగు)
జిల్లా కోశాధికారి — ఆలం స్వర్ణలత (మహాముత్తారం)
జిల్లా సహాయ కార్యదర్శి బుర్ర వెంకటేష్ గౌడ్ (చిట్యాల)
జిల్లా అధికారప్రతినిధి కొండగొర్ల బాణయ్య (కాటారం) ఎన్నికైనారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు ఉపసర్పంచ్ పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version