రోడ్డు అక్రమణాలపై సమగ్ర విచారణ జరపాలి…

రోడ్డు అక్రమణాలపై సమగ్ర విచారణ జరపాలి

అక్రమణలు తొలగించి దోషులు ఎంతటి వారైనా ప్రజా కోర్టులొ శిక్షించాలి- పైడిపల్లి రాజు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ నగరంలో కొందరు ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోడ్లను ప్రభుత్వ ఆస్తులను అక్రమలకు గురిచేసారని వీరిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించి ప్రభుత్వం ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈసందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ నగరాన్ని ప్రజాప్రతినిధులే ప్రభుత్వ ఆస్తులను కబ్జాలు చేస్తూ జైలుకు పోయారని అయినా వీరి వక్రబుద్ధి మారడం లేదని ప్రభుత్వ ఆస్తులను, రోడ్లను కబ్జా చేస్తూ ప్రజాదనాన్ని కొల్లగొట్టుతున్న పట్టించుకునే అధికారులు జిల్లాలో లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. నూతనంగా ఎన్నికైన మేయర్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కబ్జాలకు గురైన స్థలాలను కాపాడాలని రామచంద్రాపూర్ కాలనీ భగత్ నగర్ లో రోడ్లను మూసేసి భవనాలు నిర్మించారంటే ఎంత స్థాయిలో కబ్జాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలని కబ్జాల వైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం చూస్తుంటే వారి అవినీతి ఎంత ఉందో అర్థం చేసుకోవాలన్నారు. గతంలో ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన బండి సంజయ్ కి కబ్జాలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఆక్రమనలకు అవినీతి పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పిన బండి సంజయ్ రామచంద్రాపూర్ కాలనీ, భగత్ నగర్ లో తమ పార్టీ ప్రజా ప్రతినిధులు చేసిన కబ్జాపై మాట్లాడాలన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు వేసి అమ్మిన చరిత్రఉందని, చెరువులు, కుంటలను, పరంపోగు భూములను మాయం చేసిన ప్రజాప్రతినిధులు ఉన్నారని రానున్న కాలంలో వీటన్నింటిని బహిర్గతం చేసి ప్రజా ఆందోళన చేపడుతామని పైడిపల్లి రాజు హెచ్చరించారు.

సిరిసిల్లలో నూతన జిల్లా కోర్టు భవనానికి శంకుస్థాపన…

సిరిసిల్లలో నూతన జిల్లా కోర్టు భవనానికి శంకుస్థాపన

హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఘనంగా ప్రారంభం

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి:)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించనున్న నూతన జిల్లా కోర్టు భవనానికి శంకుస్థాపన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. న్యాయ వ్యవస్థ అభివృద్ధి దిశగా ఇది కీలక అడుగుగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి మరియు జిల్లా కోర్టుపరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాం జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తీక్ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అదేవిధంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు మరియు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులకు అధికారులు, బార్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం భూమి పూజ కార్యక్రమం పాల్గొని,
విద్యార్థిని విద్యార్థులు చేత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరిగినది.

నూతన జిల్లా కోర్టు భవనం నిర్మాణంతో సిరిసిల్ల జిల్లాలో న్యాయ వ్యవస్థ మరింత బలపడటమే కాకుండా ప్రజలకు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన న్యాయ సేవలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.

జంగేడు హెల్త్ సబ్ సెంటర్ ను సందర్శించిన మున్సిపల్ చైర్మన్…

జంగేడు హెల్త్ సబ్ సెంటర్ ను సందర్శించిన మున్సిపల్ చైర్మన్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు జంగేడు ప్రాథమిక హెల్త్ సెంటర్ ను మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారిని 14వ వార్డు కౌన్సిలర్ మాకోటి శ్వేత ప్రభాకర్ చైర్మన్ వైస్ చైర్మన్ ను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి వైద్యులు అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షణలో ఉండాలి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా లింగాల తిరుపతి…

తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా లింగాల తిరుపతి

నడికూడ,నేటిధాత్రి:

 

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన లింగాల తిరుపతిని నియమించినట్లు తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు భాష బోయిన రవీందర్ యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం యొక్క నిబంధనలకు లోబడి సంఘ సభ్యులను విస్తరించుకుంటూ తెలంగాణ ప్రజల,అలాగే ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చుటకు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కొరకు ఆత్మగౌరవం సంక్షేమం కొరకు కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకీ బాధ్యతను అప్పగించిన జిల్లా అధ్యక్షులు రవీందర్ యాదవ్ కు అలాగే నా నియమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు…

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు…

◆-: జహీరాబాద్ మండల్ ఎక్స యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హోలియ దాసరి రాములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్, పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఎక్స్ జహీరాబాద్ మండల్ అధ్యక్షుడు మేకల రాములు ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు 17వ రోజులు పూర్తి అయిన సందర్భంగా జహీరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ముస్లిం యువత ఎక్కువగా ఉపవాసాలు ఉండే అవకాశం ఉందన్నారు. ప్రతి ముస్లిం ఈ పవిత్ర రంజాన్ మాసంలో జకాత్ ఇవ్వటం ఆనవాయితీ అన్నారు. తద్వారా పెద ముస్లింలు కూడా పండుగ సంతోషంగా చేసుకునే అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. జకాత్ ఇవ్వడం ప్రతి ముస్లిం కనీస ధర్మం అన్నారు. జకాత్ స్వీకరించడానికి వచ్చే ముస్లింలను ఆదరించాలని కోరారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు సహాయ సహకారాలు అందించడం ద్వారా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పొంది అల్లాహుతాలు కృపకు పాత్రులవుతారని పిరానీ పీర్ గౌసే ఆజం దస్తగీర్ జెండా ఘనంగా రంజాన్ పండగ వేడుకలు జరుపుకుంటారని యూత్ కాంగ్రెస్ జహీరాబాద్ మండల్ మాజీ అధ్యక్షుడు హోలియా దాసరి రాములు అన్నారు.

మా భూములు యధావి ధిగా చేసి ఇప్పించండి…

మా భూములు యధావి ధిగా చేసి ఇప్పించండి

లీజు డబ్బులు రాక ఆందోళనలో రైతులు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం తాహ రాపూర్ గ్రామానికి చెందిన భూమి 112 సర్వే నెంబర్ లోని భూములను తమకు ఇప్పించాలని బాధితులు శుక్రవారం విలేకరుల సమా వేశంలో కొమ్ముల మల్ల య్య,రేణిగుంట్లసదయ్య మాట్లాడుతూ తహరాపూర్ గ్రామ శివారులో 2015- 2016 రోడ్డు విస్తరణ మం జూరు పనుల కోసం గుడేపాడ్ నుండి చెల్పూర్ వరకు రోడ్డు విస్తరణ సందర్భంగా కాటం రవీందర్ తన తండ్రి అయిన తిరుపతిరెడ్డి క్రషర్ వేసి తన వ్యవసాయ భూమిని బలవం తంగా లీజుకు తీసుకోవడమే కాకుండా నివసించడానికి గుడిసెలు వేసుకుంటామని చెప్పడంతో తన వ్యవసాయ భూమికి వెళ్లకుండా ఇంటి వద్ద ఉండి రైతులకు ఎలాంటి విషయం తెలువకుండా తమ వ్యవసాయ భూములోని మొరం రోడ్డువిస్తరణ పను లకు వినియోగించడం జరిగింది. మొరం తీయడం గమనించిన రైతులు వెంటనే అడగడంతో నీ భూములు మీకు యధావిధిగా చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు ఎలాంటి హాని కలిగించమని హామీ ఇవ్వడం జరిగింది ఒక ఎకరానికి 60 వేల చొప్పున రెండు సంవత్సరాలు చెల్లించ డం జరిగింది. ఇప్పుడు డబ్బు లు ఇవ్వకుండా పది సంవత్స రం కాలయాపన చేయడం జరిగింది. రవీందర్ రెడ్డిని తీసుకుని రా! మీకు డబ్బులు ఇస్తాం.

లీజు డబ్బులు ఒకరికి ఏడు సంవత్సరాలు, మరికొం తమంది రైతులకు 8 సంవ త్సరాలు లీజు డబ్బులు చెల్లించాలి. ఎకరానికి 60 వేల చొప్పున రెండు సంవత్సరాల పాటు చెల్లించడం జరిగింది. మా అగ్రిమెంట్ ప్రకారము మా భూమిని చదును చేసి ఇస్తే మేము వ్యవసాయం చేసుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా వ్యవసాయ భూమిని ఇస్తే వ్యవసాయం చేసి జీవనం గడుపుకుం టామని దుఃఖంతో ఆవేదన వ్యక్తం చేశారు.

భూమిని పరిశీలించిన ఎమ్మార్వో

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని తారాపూర్ గ్రామ శివారులో 112 వ సర్వే నెంబర్ను స్థానిక ఎమ్మార్వో తనిఖీ చేశారు హద్దులు దాని విస్తీర్ణం ఏ విధంగా ఉందో తనిఖీ చేయడం జరిగింది. రైతులకు ఎలాంటి హాని కలిగించకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్’ అవార్డ్…

గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్’ అవార్డ్

 

గద్దర్ సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన సినీ వర్గాల్లో, అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

 గద్దర్ సినీ అవార్డులను(Gaddar Film Awards 2026) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన సినీ వర్గాల్లో, అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. గతేడాది ప్రారంభమైన ఈ పురస్కారాల పరంపర, ఈసారి మరిన్ని ప్రతిష్ఠాత్మక విభాగాలతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్’ అవార్డు ప్రకటించడం విశేషం.

ములుగు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా…

ములుగు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా.

#అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలి.

#ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న….

#రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి :

 

నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీనీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 99 రోజులు నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో శనివారం ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేశామని, పలు అభివృద్ధి పనులకు ఇప్పటికే 15 కోట్ల రూపాయలతో టెండర్లు జరిగాయని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ములుగు మున్సిపాలిటీ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగకల్యాణి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆసియా షాహిన్ రియాజ్ మీర్జా, 5వ వార్డు కౌన్సిలర్ గుగ్గిళ్ళ దివ్య సుజన్, వార్డుల కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మహిళా శక్తి – సమాజ ప్రగతికి బలమైన పునాది…

మహిళా శక్తి – సమాజ ప్రగతికి బలమైన పునాది

ఆత్మవిశ్వాసంతో ముందుకు నేటి మహిళలు.

మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సేవలకు కృతజ్ఞతా వందనం.

వరంగల్, నేటిధాత్రి.

 

ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని గుర్తు చేసే ప్రత్యేక రోజు ఇదే. కుటుంబ నిర్వహణ నుండి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారు.

మహిళల విద్యా హక్కుల కోసం పోరాడిన ప్రముఖ సామాజిక సంస్కర్తల్లో ముందుగా గుర్తుకు వచ్చేది సావిత్రీబాయి పూలే. మహిళలకు విద్య అవసరమని సమాజానికి చాటి చెప్పిన ఆమె సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విశిష్ట పాత్ర పోషించిన కవయిత్రి సరోజినీ నాయుడు మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

దేశ రాజకీయ చరిత్రలో ధైర్యవంతమైన నాయకురాలిగా నిలిచిన మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మహిళలు కూడా అత్యున్నత పదవులను అధిరోహించగలరని నిరూపించారు. అంతరిక్ష రంగంలో భారతదేశ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన కల్పన చావ్లా యువతకు ప్రేరణగా నిలిచారు.

క్రీడా రంగంలో కూడా భారత మహిళలు విశేష విజయాలు సాధిస్తున్నారు. ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు మరియు ప్రపంచ స్థాయి బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ భారత మహిళల ధైర్యం, పట్టుదల ప్రపంచానికి చాటిచెప్పారు.

ఇలాంటి గొప్ప మహిళల స్ఫూర్తితో నేటి మహిళలు కూడా విద్య, స్వావలంబన, ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకొని ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ అభివృద్ధిలో కూడా మహిళలు కీలక పాత్ర పోషించాలని వారు పేర్కొంటున్నారు.

నేటి మహిళలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమ ప్రతిభను నిరూపించుకుంటే సమాజ ప్రగతికి మరింత బలమైన పునాది ఏర్పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధిని సాధించగలదని నిపుణులు పేర్కొంటున్నారు.

విద్య, విజ్ఞానం, రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం వంటి అనేక రంగాల్లో మహిళలు తమ ప్రతిభతో సమాజ ప్రగతికి బలమైన పునాది వేస్తున్నారు. మహిళలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధిని సాధించగలదని నిపుణులు పేర్కొంటున్నారు.

మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పిస్తూ వారి సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే సందేశాన్ని మహిళా దినోత్సవం ఇస్తోంది.

✍️✍️
గంగరాజు కందికొండ
స్టాఫ్ రిపోర్టర్, నేటిధాత్రి, వరంగల్.

జహీరాబాద్: కారు బోల్తా, ఆరుగురికి తీవ్ర గాయాలు…

జహీరాబాద్: కారు బోల్తా, ఆరుగురికి తీవ్ర గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బుచ్చినెల్లి సమీపంలోని 65వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఒక కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది..

కష్టంతో కాదు ఇష్టంతో చదివి ఉన్నత స్థాయి చేరుకోవాలి

కష్టంతో కాదు ఇష్టంతో చదివి ఉన్నత స్థాయి చేరుకోవాలి

◆”-: బిజెపి నాయకుడు పాలింకర్ సంతోష్ 0Lన9

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,నియోజకవర్గం పట్టణంలో గల 24 వ వార్డు బిజెపి నాయకుడు పాలెంకార్ సంతోష్ మాట్లాడుతూ… కష్టంతో కాదు ఇష్టంతో చదివి విద్యార్థుల జీవితంలో ఉన్నత స్థితికి చేరుకో వాలని పేర్కొన్నారు. శుక్రవారం 10వ తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థినులకు కష్టపడి చదివి జీవితంలో ఏదైనా సాధించా లంటే ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. జీవితంలో లక్ష్యం ఏర్పరచుకొని లక్ష్యాన్ని సాధించేలా ముందుకెళ్లాలని ఆయన తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు త్వరలో పరీక్షలు ప్రారంభం కానున్నయని గురువులు బోధించి నటువంటి విద్యను ఒక క్రమపద్ధతిలో నేర్చు కొని పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తంచేశారు. తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా విద్యార్థు లకు సూచించారు. యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి సామాజానకి ఆదర్శంగా నిలవాలని సూచించారు.

కుటుంబాల మధ్య చిచ్చురేపిన ప్రేమపెళ్లి…

కుటుంబాల మధ్య చిచ్చురేపిన ప్రేమపెళ్లి

 

వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఊరినుంచి పరారై.. పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‏లో పెట్టుకున్నారు.

  • పెళ్లికొడుకు బాబాయిపై కత్తులు, కర్రలతో యువతి కుటుంబీకుల దాడి

    కూసుమంచి(ఖమ్మం): వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఊరినుంచి పరారై.. పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‏లో పెట్టుకున్నారు. అంతే..ఆ ఫొటోలు, వారి ప్రేమ, పెళ్లి యువకుడి బాబాయిపై ఏకంగా కత్తులు, కర్రలతో దాడిచేసే స్థాయికి తీసుకెళ్లింది. ఆ ప్రేమజంట వివాహానికి పెళ్లికొడుకుకు వరుసకు బాబాయి, పిన్నయ్యే వడిత్య హేమ్లా, బుజ్జి కారణమన్న అనుమానంతో పెళ్లికూతురు తరపువారు శుక్రవారం ఉదయం 7గంటల స మయంలో హేమ్లా ఇంటికి వచ్చి కత్తులు, కర్రలతో దాడిచేయడంతో కత్తిపోట్లకు గురయ్యాడు.

అతడిని గ్రామస్థులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కూసుమంచి మండలం లోక్యాతండాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. లోక్యాతండాలో ఆ గ్రామ ఆచారం ప్రకారం మూడురోజల పాటు హోళీవేడుకలు జరిగాయి. అందరూ సంబరాల్లో ఉన్నారు. ఈ క్రమంలో తండాకు చెందిన ఓ యువతి, అదేతండాకు చెందిన ఉపేందర్‌ ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇద్దరి కుటుంబసభ్యులు నిరాకరించడంతో ఎలాగైనా పారిపోయి పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలి…

మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలి…

జహీరాబాద్ నతి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మునిసిపాలిటీలోని వార్డులను శానిటైజ్ చేయడానికి కొత్తగా నియమితులైన ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ ఒక దరఖాస్తును సమర్పించారు, ఎందుకంటే కోహీర్ మునిసిపాలిటీలో ప్రజలు టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రభుత్వ అధికారులెవరూ దీనిపై దృష్టి పెట్టడం లేదని, ప్రజల నుండి చెత్తను సేకరించడానికి ఏడుగురు సిబ్బంది సరిపోరని వారు అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయానికి ట్రాక్టర్ల సంఖ్యను పెంచాలని వారు డిమాండ్ చేశారు కొన్ని వార్డులలో మిషన్ భగీరథ నీటి సౌకర్యం లేకపోవడం వల్ల తాము సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్పారు.

ప్రజా పాలనలో భాగంగా స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం…

ప్రజా పాలనలో భాగంగా స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం

చీకటాయపాలెం సర్పంచ్ చిదురాల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శుభ్రత చర్యలు
అంగన్వాడీ కేంద్రాల తనిఖీ..

పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

 

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా చీకటాయపాలెం గ్రామ సర్పంచ్ చిదురాల కృష్ణమూర్తి గ్రామంలోని పాఠశాల పరిసర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలను స్వయంగా పర్యవేక్షిస్తూ శుభ్రపరిచే పనులను దగ్గరుండి చేయించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను కూడా ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న సేవలు, సదుపాయాలపై అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు అందించే ఆహారం, పరిశుభ్రత ప్రమాణాలు సక్రమంగా పాటించాలని సూచించారు.
అలాగే పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల పరిసర ప్రాంతాలను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సర్పంచ్ సూచించారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు కూడా ఈ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.
గ్రామంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యమని సర్పంచ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సీనియారిటీ కంటే సిన్సియారిటీకి గౌరవం..

సీనియారిటీ కంటే సిన్సియారిటీకి గౌరవం..

కమిట్మెంట్‌కు రాజ్యసభ బహుమతి

టికెట్ కోసం ఆరాటపడకుండా పార్టీ కోసం పనిచేసిన వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ అవకాశం

నేటిధాత్రి, వరంగల్.

 

రాజకీయాల్లో స్నేహం, త్యాగం, కమిట్మెంట్‌లకు విలువ ఉండదని సాధారణంగా అనిపించినా సరైన సమయం వచ్చినప్పుడు అవే నాయకుడి మెరిట్స్‌గా మారి పదవులను అందించే ఉదాహరణగా వేం నరేందర్ రెడ్డి నిలిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నిక కావడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నాయకులను పక్కనపెట్టి ఆయనకు అవకాశం ఇవ్వడం కాంగ్రెస్‌లోని ఒక వర్గంలో అసంతృప్తిని రగిలించినా, సీనియారిటీ కంటే సిన్సియారిటీకి ప్రాధాన్యం ఇచ్చి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత రెండు అసెంబ్లీ ఎన్నికలు (2018, 2023) అలాగే 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ టికెట్ కోసం ఆరాటపడకుండా పార్టీ కోసం తెరవెనుక పనిచేసిన వేం నరేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ వచ్చారు. అదే ఓపిక ఇప్పుడు ఆయనకు మెరిట్‌గా మారి రాజ్యసభ స్థానం దక్కేలా చేసింది.

ఉమ్మడి వరంగల్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన వేం నరేందర్ రెడ్డి కుటుంబానికి ప్రాంతంలో రాజకీయంగా మంచి పట్టు ఉంది. రజాకార్ల వ్యతిరేక పోరాటంలో ఆయన కుటుంబం పాల్గొనగా, ఆయన తాత పుల్లారెడ్డి ఆ పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన తండ్రి చెన్నకృష్ణారెడ్డి సర్పంచ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్‌గా పనిచేయగా, సోదరుడు పురుషోత్తం రెడ్డి జడ్పీటీసీగా, వదిన ఉమా సర్పంచ్‌గా పనిచేశారు.

మొదట జనతాపార్టీలో క్రియాశీలకంగా ఉన్న వేం నరేందర్ రెడ్డి తరువాత టీడీపీలో చేరి రాజకీయాల్లో కొనసాగారు. 2001 జిల్లా పరిషత్ ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ లక్ష్యంగా నల్లబెల్లి మండలం నుంచి పోటీ చేసి తెరాస అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

అయితే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా మహబూబాబాద్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్, జనతా పార్టీ అభ్యర్థుల మధ్య ఓట్ల చీలికతో కేవలం మూడు వేల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డికి 50,348 ఓట్లు రాగా, భరత్ చంద్రారెడ్డికి 47,059, రాజవర్ధన్ రెడ్డికి 41,757 ఓట్లు వచ్చాయి.

తర్వాతి రాజకీయ పరిణామాల్లో 2009లో వరంగల్ ఈస్ట్ నుంచి నామినేషన్ వేసినప్పటికీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విత్‌డ్రా చేసుకున్నారు. 2010 ఉపఎన్నికల్లో పోటీ చేసినా గణనీయమైన ఓట్లు రాకపోవడంతో డిపాజిట్ కోల్పోయారు.

2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జరిగిన ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల మధ్య బంధం మరింత బలపడింది. 2017లో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన వేం నరేందర్ రెడ్డి అప్పటి నుంచి పార్టీకి బ్యాక్ ఆఫీస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో పాత, కొత్త నాయకుల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధిష్టానం మాత్రం పార్టీకి ఉపయోగపడే నాయకులకు అవకాశాలు ఇవ్వాలనే విధానాన్ని కొనసాగిస్తోంది. జీవన్ రెడ్డి, కోదండరెడ్డి, మధు యాష్కీ వంటి సీనియర్ నాయకులు పోటీలో ఉన్నప్పటికీ సీఎం కోటాలో వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ దక్కడం ఆయన పార్టీ పట్ల చూపిన కమిట్మెంట్‌కు గుర్తింపుగా భావిస్తున్నారు.

రాజకీయాల్లో ఓపికతో, నిబద్ధతతో పనిచేస్తూ అవకాశాల కోసం వేచిచూసిన నాయకుడికి చివరకు ఫలితం దక్కుతుందనే విషయాన్ని వేం నరేందర్ రెడ్డి రాజకీయ ప్రయాణం మరోసారి రుజువు చేసింది.

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసనం…

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసనం

ముఖ్య అతిథులుగా వార్డు కౌన్సిలర్ వల్లందాస్ ఉమా రవి

కేసముద్రం/ నేటి ధాత్రి

చైతన్య నగర్ లోని అంగన్ వాడీ ( ఏ డబ్ల్యు సి 1 ) కేంద్రాన్ని సందర్శించిన 16వార్డు కౌన్సిలర్ వల్లoదాస్ ఉమా రవి తల్లుల కమిటి లో అక్షరాభ్యాసం మరియు అన్నప్రాసన కార్యక్రమం లో పాల్గొన్నారు సమస్యలను అడిగి తెల్సుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు,అనంతరం నూతన కౌన్సిలర్ వల్లందాస్ ఉమా రవి ని శాలువాతో సన్మానించారు, ఈ కార్యక్రమము లో ఏ ఎం టి కొమ్ము నిర్మల ఎం పి పి ఎస్ హెచ్ ఎం తాళ్లపల్లి రమేష్, ఏ డబ్ల్యు హెచ్ జ్యోతి, ఏ ఎన్ ఎం జయ,ఆశా వర్కర్ తధితరులు పాల్గొన్నారు

కొత్తకాపు ఈశ్వరమ్మ మండపము ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులు…

కొత్తకాపు ఈశ్వరమ్మ మండపము ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులు

◆-: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు విధి ప్రాంతానికి చెందిన కొత్తకాపు కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు శుక్రవారం నూతనంగా నిర్మించిన కొత్తకాపు ఈశ్వరమ్మ మండపాన్ని జహీరాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి గార్లతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.వారికి కొత్తకాపు కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,మాజీ వైస్ యం.పి.పి రాములు,సీనియర్ నాయకులు పట్లోళ్ళ.శ్రీకాంత్ రెడ్డి,సిడిసి డైరెక్టర్ మల్లారెడ్డి,కౌన్సిలర్ అరుణ్ కుమార్,యూత్ కాంగ్రెస్&సీనియర్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి,అశ్విన్ పాటిల్,కిరణ్ కుమార్ గౌడ్,రవి,పవన్ మరియు కొత్తకాపు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

ఇద్దరు వ్యక్తులకు 32 సార్లు పెళ్లి..

ఇద్దరు వ్యక్తులకు 32 సార్లు పెళ్లి..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: సాధారణంగా పెళ్లి అంటే స్త్రీ, పురుషులకు జీవితంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. కానీ సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలో మాత్రం ఒక వింత ఆచారం కొనసాగుతోంది. 1994 నుంచి గత 32 సంవత్సరాలుగా ఎల్లమ్మ నాటకం అనే వీధి నాటకాన్ని ప్రతి సంవత్సరం గ్రామంలో ప్రదర్శిస్తున్నారు. గ్రామ దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నాటకాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. నాటకం ప్రదర్శించే సమయంలో ఎల్లమ్మ – జమదగ్ని పాత్రలను పోషించే ఇద్దరు వ్యక్తులకు శాస్త్రోక్తంగా పెళ్లిని జరిపించడం ఈ నాటకంలోని ప్రత్యేకత. గ్రామానికి చెందిన గొల్ల యాదయ్య, బసయ్య స్వామి ఈ పాత్రలను పోషిస్తూ పెళ్లి కార్యక్రమాన్ని నిజమైన వివాహం మాదిరిగా అన్ని తంతులతో నిర్వహిస్తారు. పెళ్లిలో జరిగే జిలకర బెల్లం, బంగారు తాళి కట్టడం, కాళ్ల మెట్టెలు పెట్టడం, అక్షింతలు, తలంబ్రాలు, అప్పగింతలు, బాజాలు వంటి ప్రతి తంతును పద్ధతి ప్రకారం నిర్వహిస్తూ నాటకాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు ఆశ్చర్యపోతారు. నాటకం ముగిసిన అనంతరం పెళ్లిలో ఉపయోగించిన తాళి, మెట్టెలు వంటి వస్తువులను ఆలయ అభివృద్ధికి వినియోగిస్తారు. నాటక ప్రదర్శనలో ఎల్లమ్మ పాత్ర పోషించిన వ్యక్తి వారం రోజుల పాటు తాళి, కాళ్ల మెట్టెలను అలాగే ధరించి ఉంటాడు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఎల్లమ్మ నాటకానికి గ్రామస్థులలోనూ, భక్తులలోనూ ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ప్రతి సంవత్సరం ఈ నాటకాన్ని వీక్షించేందుకు పరిసర గ్రామాల నుంచి భక్తులు రాత్రి వేళల్లో భారీగా తరలి వస్తున్నారు.

వనపర్తి లో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో జరిగిన రోడ్ల విస్తరణ

వనపర్తి లో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో జరిగిన రోడ్ల విస్తరణ

మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి

వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి జిల్లా కేంద్రంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కర్నూల్ రోడ్డు హైదరాబాదు రోడ్డు మహబూబ్నగర్ రోడ్డు కొల్లాపూర్ రోడ్డులో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆస్తులు కోల్పోయే బాధితులను ఒప్పించి రోడ్ల విస్తరణ ఒప్పించి చేయించారని ప్రజలు తెలిపారు వివేకానంద చౌరస్తా రాజావారి పాలిటెక్నిక్ కళాశాల ముందర అదేవిధంగా కొత్త బస్టాండ్ దగ్గర రోడ్డు చిన్నగా ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు తెలిపారు గతంలో కారు ప్రమాదం లో కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయ ప్రజలు తెలిపారు మున్సిపల్ ఎన్నికల ముందు రోడ్ల విస్తరణ చేయిస్తామని నాయకులు హామీ ఇచ్చారని ప్రజలు తెలిపారు . కర్నూల్ రోడ్డులో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ రోడ్ల విస్తరణ కొరకు తన షాపులను స్వచ్ఛందంగా కూలగొట్టుకున్నామని రమేష్ తెలిపారు ప్రజల ఇబ్బందులు రోడ్డు చిన్నగా ఉండటం వల్ల తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం విస్తరణ కొరకు స్వచ్ఛందంగా కటింగ్ చేయించుకున్నామని చెప్పారు గతంలో మార్నింగ్ వాకింగ్ లో వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి రోడ్ల విస్తరణలో నష్ట పోయే బాధితులతో వివరాలు అడిగి తెలుసుకున్నారని రమేష్ తెలిపారు అప్పట్లో తన షాపులను స్వచ్ఛందంగా తొలగించుకున్నందుకు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి తనకు మరొకరికి సన్మానం చేశారని రమేష్ తెలిపారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మెగా రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వెంటనే రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పాషా ఒక ప్రకటనలో కోరారు

పరిశుభ్రంగా కొమ్మాల జాతర..

పరిశుభ్రంగా కొమ్మాల జాతర..

ఎప్పటికప్పుడు పరిసరాల పరిశుభ్రత..

అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లుతూ..

నిత్యం జాతరలోనే ఉంటూ..శభాష్ శంకర్ రావు సాబ్ అనిపించుకుంటూ..

*రథోత్సవం కోసం ముందస్తు చర్యలు..ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి..

నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జాతర ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి.జాతర ఉత్సవాలు శుక్రవారం నాటికి నాల్గవ రోజుకు చేరుకున్న నేపథ్యంలో జాతర ప్రాంతంలో వచ్చే భక్తులకు ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి శంకర్ రావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చకచక సాగుతున్నాయి.భక్తుల రాకపోకలు అధికంగా ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీ శాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడు తున్నారు.

జాతర ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు పెరగకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు.మంచినీటి ట్యాంకులు, త్రాగునీటి సరఫరా కేంద్రాల వద్ద అపరిశుభ్రత లేకుండా పనులు నిర్వహిస్తున్నారు.చికెన్ సెంటర్స్,మాంసం విక్రయశాలల వద్ద వ్యర్థాల ఎప్పటికప్పుడు తరలిస్తూ ఆయా ప్రాంతాల్లో దుర్వాసన రాకుండా, అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తూ కార్యదర్శి శుభ్రపరిచే పనులు చేపడుతున్నారు.

నిత్యం జాతరలోనే ఉంటూ..పరిశుభ్రమైన వాతావరణంలో జాతర కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్న కార్యదర్శి శభాష్ శంకర్ రావు సాబ్ అనిపించుకుంటూ… ప్రశంశలు పొందుతున్నారు.ఈ నేపద్యంలో దేవాలయం ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి భక్తుల సౌకర్యాలు ఎప్పటికప్పుడుడు పర్యవేక్షణ చేస్తున్నారు.జాతరలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా సంబంధిత పోలీస్ శాఖ అధికారులు సంప్రదిస్తున్నారు.ఐతే జాతరలో ప్రత్యేకంగా నిలిచే శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం తిరిగే కార్యక్రమం ఏర్పాట్ల పట్ల తగిన చర్యలకు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి తెలిపారు.కాగా శనివారం,ఆదివారం రోజుల్లో జాతరకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున జాతర పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించకుండా ముందస్తు జాగ్రత్తలుగా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి శంకర్ రావు తెలిపారు.పలువురు పంచాయతీ కార్యదర్శులు ప్రశాంత్,మహేష్ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నట్లు కార్యదర్శి శంకర్ రావు పేర్కొన్నారు.

error: Content is protected !!
Exit mobile version