ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకో వాలి…

ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకో వాలి

సర్పంచ్ ఎడ్ల స్వరూప సుధాకర్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం హుస్సేన్ పల్లి గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ ఎడ్లస్వరూ ప- సుధాకర్ పరిశీలించారు. పనుల నాణ్యత, కార్మికుల హాజరు, పని నిర్వహణపై ఆ రా తీశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కార్మికులు సమ యానికి హాజరై, అప్పగించిన పనులను పూర్తిగా నిర్వహిం చాలని సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం వేళల్లోనే పనులు ముగించుకోవాలని సూచిం చారు. అదేవిధంగా, ప్రతి కార్మి కుడి హాజరు సక్రమంగా నమో దు చేయాలని, పనుల్లో ఎలాం టి నిర్లక్ష్యం ఉండకూడదని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వంఅంది స్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మణ్ రావు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, మేటు వేణు పాల్గొ న్నారు.

వైకుంఠధామాలు అభివృద్ధి జరిగేనా!

వైకుంఠధామాలు అభివృద్ధి జరిగేనా!

ఆఖరి మజిలీకీ ప్రభుత్వం చిన్నచూపు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో వైకుంఠధామాల పట్ల ప్రభు త్వం చిన్నచూపు చూస్తుంది. పలు గ్రామాల్లో దహన సం స్కారాలకు ప్రజలు ఇబ్బందు లను తొలగించేందుకు గత ప్రభుత్వం ప్రతి గ్రామపంచా యతీకి వైకుంఠధామాలను నిర్మించింది. వాటిని వినియో గానికి తీసుకురావడంలోనే జాప్యం జరిగింది . కనీస వస తులు లేక దహనసంస్కారా ల్లో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
అరకొర వసతులతో వైకుంఠధామాలు ఉఉన్నాయి పలు గ్రామాల్లో వైకుంఠ ధామానికి రోడ్డులేక, నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది పంచాయతీ రాజ్ విద్యుత్ శాఖ సమన్వయం లోపం కారణంగా విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది దీంతో అంతక్రి యల నిర్వహణకు చీకటి పడితే అదేవిధంగా ఊరికి దూరంగా ఉండడంతో దారి వెంబడి విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు ఊరికి దూరం ఊరికి సమీపంలో ఖాళీ స్థలంలో చెరువులు కుంటలు ఉన్న సమీపంలో అంత్యక్రియలకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి సౌకర్యాలు మెరుగుపరిచి వైకుంఠధామాలకు అందు బాటులోకి తీసుకురా వాలని ప్రజలు కోరుతున్నారు

వైకుంఠధామల్లో అన్ని సమస్యలే!

పలు గ్రామాల్లో స్మశాన వాటికల్లో కనీస వసతులు లేక దహన సంస్కారాలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతు న్నారు మండలంలో నిర్మించిన స్మశాన వాటికలు విద్యుత్ నీటి మౌలిక వసతులు లేని కారణంగా ప్రజలకు తీవ ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి వైకుంఠధామాలకు అన్ని వసతులు ఏర్పాటు చేయా లని ప్రజలు కోరుతున్నారు

నూతన సర్పంచ్ లకు సవాళ్లు…

నూతన సర్పంచ్ లకు సవాళ్లు

పల్లెల్లో అనేక సమస్యలు

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో జిల్లాలోని కొత్తగా ఎన్నికైన సర్పంచులు నిధులు కొరత పెండింగ్ బిల్లులు చెల్లింపులు పరిపాలనప రమైన సవాళ్లు గ్రామ విద్యుత్తు సదుపాయం, పారిశుద్ధం, నీటి సమస్య పరిష్కారం వంటి ప్రధాన సవాలను ఎదుర్కొంటున్నారు రెండేళ్ల కాంగ్రెస్ పాలలో ప్రత్యేక అధికారుల పాలన తర్వాత వచ్చిన ఈ పాలక వర్గాలకు నిధుల సమీకరణ పంచాయతీలో నెలకొన్న సమస్యల నూతన సర్పంచులకు సవాళ్లు విసురుతున్నాయి గ్రామ అభివృద్ధి దేంగా ఎన్నికైన ఆ ప్రజాప్రతినిధులు సమస్యలు దర్శనమిస్తున్నాయి ఇటు కేంద్రం నుంచి అటు రాష్ట్రం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో అయోమయ పరిస్థితిలో నెలకొన్నది ఇప్పటికే అనేక వీధుల్లో వెలుగని వీధిలైట్లు వెక్కిరిస్తు న్నాయి. వీధిలైట్లును రిపేర్ చేయాలని ముందుకు రావా లంటే ఆర్థిక సమస్య ఉంటుం ది. రెండేళ్ల ప్రత్యేక అధికారుల పాలన తర్వాత వచ్చిన ఈ పాలకవర్గాలకు నిధుల సమీకరణ అతిపెద్ద సవాలు.

పల్లెల్లో అనేక సమస్యలు

శాయంపేట మండలంలోని అనేక గ్రామాల్లో సమస్యల వలయంలో కొట్టుమిట్టా డుతున్నాయి పల్లెల్లో నెలకొన్న సమస్యలు కొత్త పాలకవర్గం స్వాగతం పలుకుతున్నాయి రెండేళ్లుగా ప్రత్యేక అధికారి పాలల్లో ఉన్న గ్రామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి వచ్చే నిధుల కోసం ఎదురుచూ స్తున్నారు దీంతో పంచాయ తీల్లో సమస్యలు పరిష్కరిం చకపోవడం వల్ల కొత్త సర్పం చులు వాటిని ఎలా పరిష్కరిం చాలని సర్వత్ర ప్రజల్లో చర్చ సాగుతుంది.

మురికి కాలువలు శుభ్రం చేయిస్తున్న సర్పంచ్

చింతల ఉమా- రవిపాల్

ఇటీవల గెలుపొందిన సర్పం చులకు మండల గ్రామాల్లో నెలకొన్న సమస్యలు సవా లుగా మారాయి. మురికి కాల్వలో చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల దోమల వ్యాప్తి చెంది గ్రామ ప్రజలు ఇబ్బంది పడడం వల్ల ప్రజల ఆరోగ్యం పరిశుభ్రత కోసం గెలుపొందిన సర్పంచ్ చొరవ తీసుకొని పేరుకుపోయిన చెత్తాచెదారం మట్టిని తొల గింపచేస్తున్నారు మండల కేంద్రంలోని తొమ్మిదవ వార్డు మురికి కాలువలు శుభ్రం చేయించి గ్రామ వీధుల్లో మురికి నీరు నిల్వ, ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం మట్టిని కార్మికు లతో శుభ్రం చేయించారు సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో వీధి దీపాలు, తాగు నీటి సరఫరా మురికి నీరు కాలువలు శుభ్రం చేయించడం ప్రజల ఇబ్బంది కాకుండా చూడడం గ్రామపం చాయతీ పాలకుల బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్ర మంలో చింతల ఉమా రవి పాల్, గ్రామపంచాయతీ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

మా భూములు యధావి ధిగా చేసి ఇప్పించండి…

మా భూములు యధావి ధిగా చేసి ఇప్పించండి

లీజు డబ్బులు రాక ఆందోళనలో రైతులు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం తాహ రాపూర్ గ్రామానికి చెందిన భూమి 112 సర్వే నెంబర్ లోని భూములను తమకు ఇప్పించాలని బాధితులు శుక్రవారం విలేకరుల సమా వేశంలో కొమ్ముల మల్ల య్య,రేణిగుంట్లసదయ్య మాట్లాడుతూ తహరాపూర్ గ్రామ శివారులో 2015- 2016 రోడ్డు విస్తరణ మం జూరు పనుల కోసం గుడేపాడ్ నుండి చెల్పూర్ వరకు రోడ్డు విస్తరణ సందర్భంగా కాటం రవీందర్ తన తండ్రి అయిన తిరుపతిరెడ్డి క్రషర్ వేసి తన వ్యవసాయ భూమిని బలవం తంగా లీజుకు తీసుకోవడమే కాకుండా నివసించడానికి గుడిసెలు వేసుకుంటామని చెప్పడంతో తన వ్యవసాయ భూమికి వెళ్లకుండా ఇంటి వద్ద ఉండి రైతులకు ఎలాంటి విషయం తెలువకుండా తమ వ్యవసాయ భూములోని మొరం రోడ్డువిస్తరణ పను లకు వినియోగించడం జరిగింది. మొరం తీయడం గమనించిన రైతులు వెంటనే అడగడంతో నీ భూములు మీకు యధావిధిగా చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు ఎలాంటి హాని కలిగించమని హామీ ఇవ్వడం జరిగింది ఒక ఎకరానికి 60 వేల చొప్పున రెండు సంవత్సరాలు చెల్లించ డం జరిగింది. ఇప్పుడు డబ్బు లు ఇవ్వకుండా పది సంవత్స రం కాలయాపన చేయడం జరిగింది. రవీందర్ రెడ్డిని తీసుకుని రా! మీకు డబ్బులు ఇస్తాం.

లీజు డబ్బులు ఒకరికి ఏడు సంవత్సరాలు, మరికొం తమంది రైతులకు 8 సంవ త్సరాలు లీజు డబ్బులు చెల్లించాలి. ఎకరానికి 60 వేల చొప్పున రెండు సంవత్సరాల పాటు చెల్లించడం జరిగింది. మా అగ్రిమెంట్ ప్రకారము మా భూమిని చదును చేసి ఇస్తే మేము వ్యవసాయం చేసుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా వ్యవసాయ భూమిని ఇస్తే వ్యవసాయం చేసి జీవనం గడుపుకుం టామని దుఃఖంతో ఆవేదన వ్యక్తం చేశారు.

భూమిని పరిశీలించిన ఎమ్మార్వో

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని తారాపూర్ గ్రామ శివారులో 112 వ సర్వే నెంబర్ను స్థానిక ఎమ్మార్వో తనిఖీ చేశారు హద్దులు దాని విస్తీర్ణం ఏ విధంగా ఉందో తనిఖీ చేయడం జరిగింది. రైతులకు ఎలాంటి హాని కలిగించకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version