ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా తగు చర్యలు…

ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా తగు చర్యలు…

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత – శ్రీనివాస్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మున్సిపాలిటీలోని ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని క్యాతనపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత- శ్రీనివాస్ అన్నారు.మున్సిపాలిటీలో 10 వ వార్డ్ కౌన్సిలర్ వీణంక శ్రీనివాస్, 21 వ వార్డ్ కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత లతో కలిసి 22 వ వార్డులో సైతం డ్రైనేజీ వ్యవస్థల శుభ్రపరిచే కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత మాట్లాడారు. వార్డుల్లోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాలువలు, డ్రైనేజీలు శుభ్రపరుస్తున్నామని, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ హాజరయ్యారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన వాతావరణము కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజల ఆరోగ్యమే మొదటి ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమాలలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ప్రజా పాలనలో భాగంగా స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం…

ప్రజా పాలనలో భాగంగా స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం

చీకటాయపాలెం సర్పంచ్ చిదురాల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శుభ్రత చర్యలు
అంగన్వాడీ కేంద్రాల తనిఖీ..

పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

 

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా చీకటాయపాలెం గ్రామ సర్పంచ్ చిదురాల కృష్ణమూర్తి గ్రామంలోని పాఠశాల పరిసర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలను స్వయంగా పర్యవేక్షిస్తూ శుభ్రపరిచే పనులను దగ్గరుండి చేయించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను కూడా ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న సేవలు, సదుపాయాలపై అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు అందించే ఆహారం, పరిశుభ్రత ప్రమాణాలు సక్రమంగా పాటించాలని సూచించారు.
అలాగే పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల పరిసర ప్రాంతాలను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సర్పంచ్ సూచించారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు కూడా ఈ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.
గ్రామంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యమని సర్పంచ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version