జిల్లా కలెక్టర్ ను కలిసిన కౌన్సిలర్ రమాదేవి సదానందం…

జిల్లా కలెక్టర్ ను కలిసిన కౌన్సిలర్ రమాదేవి సదానందం

రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకై వినతి పత్రం

భూపాలపల్లి నేటిధాత్రి

 

మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు గణేష్ చౌక్ ప్రాంత పుసర్వైభవం కోసం ప్రభుత్వ కార్యాలయాలు మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయాలని
22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి సదానందం గౌడ్ అన్నారు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22వ వార్డులోని “గణేష్ చౌక్ ప్రాంతం” ఒకప్పుడు జిల్లాలోనే అత్యంత కీలకమైన అభివృద్ధి చెందిన. కేంద్రంగా ఉండేది. “గతంలో ఈ గణేష్ చౌక ప్రాంతంలో బస్టాండ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారసంత, పోలీస్ స్టేషన్ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) వంటి ముఖ్యమైన సంస్థలు ఉండటం వల్ల నిత్యం ప్రజల రాకపోకలతో ఎంతో సందడిగా ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో ఈ గణేష్ చౌక్ ఏరియా పూర్తిగా వెనుకబడిపోయింది.

కావున, వ్యాపార వర్గాల ఉపాధి కోసం సామాన్య ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలి

పాత గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించి, కార్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేయాలి.

వారసంత చిన్న వ్యాపారుల జీవనోపాధి కోసం ప్రజల అవసరాల కోసం గతంలో ఉన్న వారసంతను” గణేష్ చౌక్ ప్రాంతంలోనే తక్షణమే పునరుద్ధరించాలి.

బస్టాండ్ / బస్ స్టాప్ రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి గణేష్ చౌక్ మెయిన్ రోడ్ ప్రాంతంలో బస్సులు ఆగేలా ఒక అధికారిక “బస్టాండ్” లేదా బస్ స్టాప్ను ఏర్పాటు చేయాలి.
గణేష్ చౌక్ అభివృద్ధి కోసం ఆటోనగర్ ఏర్పాటు చేయాలి అని వారు అన్నారు

జంగేడు హెల్త్ సబ్ సెంటర్ ను సందర్శించిన మున్సిపల్ చైర్మన్…

జంగేడు హెల్త్ సబ్ సెంటర్ ను సందర్శించిన మున్సిపల్ చైర్మన్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు జంగేడు ప్రాథమిక హెల్త్ సెంటర్ ను మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారిని 14వ వార్డు కౌన్సిలర్ మాకోటి శ్వేత ప్రభాకర్ చైర్మన్ వైస్ చైర్మన్ ను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి వైద్యులు అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షణలో ఉండాలి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version